breaking news
Big Bash League (BBL)
-
మ్యాక్స్‌వెల్ ఖాతాలో భారీ సిక్సర్ల రికార్డు
ఆసీస్ విధ్వంసకర వీరుడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ భారీ సిక్సర్ల రికార్డు చేరింది. బిగ్ బాష్ లీగ్ 2025-26 ఎడిషన్‌లో భాగంగా సిడ్నీ థండర్‌తో ఇవాళ (డిసెంబర్ 28) జరిగిన మ్యాచ్‌లో 2 సిక్సర్లు బాదిన మ్యాక్సీ.. బీబీఎల్ కెరీర్లో 150 సిక్సర్ల మార్కును దాటాడు. తద్వారా లీగ్ చరిత్రలో 150 సిక్సర్లు పూర్తి చేసుకున్న రెండో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. మ్యాక్సీకి ముందు క్రిస్ లిన్ మాత్రమే 150 సిక్సర్ల మార్కును తాకాడు. లిన్ ఖాతాలో ప్రస్తుతం 220 సిక్సర్లు ఉన్నాయి.బీబీఎల్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల టాప్-5 జాబితాలో లిన్, మ్యాక్సీ తర్వాతి స్థానాల్లో బెన్ మెక్‌డెర్మాట్ (140), ఆరోన్ ఫించ్ (118), మార్కస్ స్టోయినిస్ (111) ఉన్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. సిడ్నీ థండర్‌పై మ్యాక్స్‌వెల్ ప్రాతినిథ్యం వహిస్తున్న మెల్బోర్న్ స్టార్స్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన థండర్.. హరీస్ రౌఫ్ (4-0-29-3), టామ్ కర్రన్ (4-0-22-2), స్టోయినిస్ (3-0-25-2), మిచెల్ స్వెప్సన్ (4-0-18-2), పీటర్ సిడిల్ (4-0-22-1) దెబ్బకు 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి 128 పరుగులకు ఆలౌటైంది. థండర్ ఇన్నింగ్స్‌లో షాదాబ్ ఖాన్ (25) టాప్ స్కోరర్ కాగా.. మాథ్యూ గిల్క్స్ (24), సామ్ బిల్లింగ్స్ (23) మాత్రమే 20కి పైగా స్కోర్లు చేశారు. మిగతా ఆటగాళ్లలో కొన్‌స్టాస్ 11, డేవిడ్ వార్నర్ 10, బాన్‌క్రాఫ్ట్ 10, డేనియల్ సామ్స్ 3, క్రిస్ గ్రీన్ 1, తన్వీర్ సంఘా 1, ర్యాన్ హ్యాడ్లీ 1 పరుగు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని మెల్బోర్న్ ఒకే వికెట్ కోల్పోయి 14 ఓవర్లలోనే ఛేదించింది. జో క్లార్క్ (37 బంతుల్లో 60; 8 ఫోర్లు, సిక్స్) మెరుపు అర్ద సెంచరీతో మెల్బోర్న్ను గెలుపు వాకిటి వరకు తీసుకెళ్లాడు. అనంతరం సామ్ హార్పర్ (29 నాటౌట్), మ్యాక్స్‌వెల్ (39 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేశారు. -
టిమ్ సీఫర్ట్ విధ్వంసకర శతకం
బిగ్‌బాష్ లీగ్ 2025లో మెల్బోర్న్ రెనెగేడ్స్ ఘనంగా బోణీ కొట్టింది. బ్రిస్బేన్ హీట్‌తో ఇవాళ (డిసెంబర్ 15) జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసి.. ఓపెనర్ టిమ్ సీఫర్ట్ విధ్వంసకర శతకంతో (56 బంతుల్లో 102; 9 ఫోర్లు, 6 సిక్సర్లు) విరుచుకుపడటంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది.రెనెగేడ్స్ ఇన్నింగ్స్‌లో ఓలివర్ పీక్ (29 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) కూడా చెలరేగిపోయాడు. మిగతా ఆటగాళ్లలో జోష్ బ్రౌన్ 15, మహ్మద్ రిజ్వాన్ 4, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ 14, హస్సన్ ఖాన్ 5 (నాటౌట్), కెప్టెన్ విల్ సదర్‌ల్యాండ్ 3 (నాటౌట్) పరుగులు చేశారు. బ్రిస్బేన్ బౌలర్లలో జాక్ విల్డర్‌ముత్ 3 వికెట్లు తీయగా.. ప్యాట్రిక్ డాక్లీ, జేవియర్ బార్ట్లెట్ తలో వికెట్ తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో బ్రిస్బేన్ గెలుపు కోసం విఫలయత్నం చేసింది. ఓపెనర్ కొలిన్ మున్రో (32 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), హగ్ వెబ్జెన్ (20 బంతుల్లో 38 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), తొమ్మిదో నంబర్ ఆటగాడు జిమ్మీ పియర్సన్ (22 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లతో పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది. ఈ ముగ్గురు చెలరేగినా బ్రిస్బేన్ లక్ష్యానికి 15 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేయగలిగింది. మిగతా బ్రిస్బేన్ ఆటగాళ్లలో కెప్టెన్ మెక్‌స్వీని 9, మ్యాట్ రెన్షా 18, మ్యాక్స్ బ్రయాంట్ 14, బార్ట్లెట్ 1, లియామ్ హాస్కెట్ 2 (నాటౌట్) పరుగులు చేయగా.. జాక్ విల్డర్‌ముత్, షాహీన్ అఫ్రిది డకౌటయ్యారు. విల్ సదర్‌ల్యాండ్ 3, గురిందర్ సంధు, బెహ్రెన్‌డార్ఫ్ తలో 2 వికెట్లు తీసి బ్రిస్బేన్‌ను దెబ్బకొట్టారు. -
క్యాన్సర్‌ను జయించి మళ్లీ బరిలోకి దిగనున్న ఆసీస్ క్రికెటర్
ఆస్ట్రేలియా క్రికెటర్ నిక్ మాడిన్సన్ (Nic Maddinson) తన జీవితంలో ఎదురైన అతిపెద్ద సవాలును జయించి మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టాడు. మాడిన్సన్‌కు ఈ ఏడాది ప్రారంభంలో టెస్టిక్యులర్ క్యాన్సర్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో అతను తొమ్మిది వారాలు కెమోథెరపీ చేయించుకున్నాడు. ప్రస్తుతం అతను క్యాన్సర్‌ను పూర్తిగా జయించి తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. మాడిన్సన్ త్వరలో ప్రారంభం కానున్న (డిసెంబర్ 14) బిగ్‌బాష్ లీగ్ 2025-26 కోసం సిడ్నీ థండర్‌తో ఒప్పందం చేసుకున్నాడు. క్యాన్సర్‌పై పోరాటంలో భాగంగా మాడిన్సన్ గత సీజన్ (బీబీఎల్ 2024-25) మొత్తాన్ని కోల్పోయాడు. ఇప్పుడు సిడ్నీ థండర్‌తో బీబీఎల్ జర్నీని కొత్తగా ప్రారంభించనున్నాడు. థండర్‌తో ఒప్పందం అనంతరం మాడిన్సన్ మాట్లాడుతూ.. కొన్ని వెనుకడుగులు ఉన్నా కుటుంబం, స్నేహితులు, క్లబ్ ఇచ్చిన మద్దతుతో మళ్లీ ముందుకు వచ్చాను. ఈ సీజన్లో జట్టుకు తనవంతు సాయం చేసి, గత సీజన్ కంటే ఓ మెట్టు పైకి తీసుకెళ్లాలని ఆశిస్తున్నానని అన్నాడు.మాడిన్సన్ థండర్‌తో జతకట్టడంపై ఆ ఫ్రాంచైజీ జనరల్ మేనేజర్ ట్రెంట్ కోపెలాండ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సీజన్లో మాడిన్సన్ తప్పక ప్రభావం చూపుతాడని ఆశాభావంగా ఉన్నాడు. 33 ఏళ్ల మాడిన్సన్ బిగ్‌బాష్ లీగ్‌లో ఇప్పటివరకు మూడు జట్లకు (సిడ్నీ సిక్సర్స్ (7 సీజన్లు), మెల్బోర్న్ స్టార్స్ (3), మెల్బోర్న్ రెనెగేడ్స్ (3)) ప్రాతినిథ్యం వహించాడు. సిడ్నీ థండర్ అతని నాలుగో జట్టు. ఎడమ చేతి వాటం బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన మాడిన్సన్ ఆసీస్ తరఫున 2013-18 మధ్యలో 3 టెస్ట్‌లు, 6 టీ20లు ఆడాడు. మాడిన్సన్ 2014 ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ తరఫున కూడా 3 మ్యాచ్‌లు ఆడాడు. బిగ్‌బాష్ లీగ్ మినహా అతను ఎక్కడా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. -
హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిన ఆస్ట్రేలియా ఫుట్‌బాలర్
మహిళల బిగ్‌బాష్ లీగ్-2025లో సంచలనం నమోదైంది. 16 ఏళ్ల సిడ్నీ సిక్సర్స్ ఆల్‌రౌండర్ కావిమ్ బ్రే (Caoimhe Bray) హ్యాట్రిక్ నమోదు చేసింది. తద్వారా WBBLలో హ్యాట్రిక్ సాధించిన అతి పిన్నవయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. కావిమ్కు ముందు WBBLలో ఆరుగురు (నికోల్ బోల్టన్, గెమ్మ ట్రిస్కారి, అమీ సాటర్త్‌వైట్, డేన్ వాన్ నీకెర్క్, మారిజాన్ కాప్, డార్సీ బ్రౌన్) హ్యాట్రిక్ సాధించారు. సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో కావిమ్ ఈ ఘనత సాధించింది. కావిమ్ హ్యాట్రిక్ సహా నాలుగు వికెట్లతో చెలరేగడంతో థండర్‌పై సిక్సర్స్ 24 పరుగుల తేడాతో గెలుపొందింది.అత్యంత అరుదైన ప్లేయర్‌గా కావిమ్ఇక్కడి వరకు అంతా బాగుంది. క్రికెట్లో చాలామంది బౌలర్లు హ్యాట్రిక్ సాధిస్తుంటారు. అయితే కావిమ్కు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఈ అమ్మాయి క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్‌లో కూడా ప్రావీణ్యం ఉంది. ఆస్ట్రేలియా అండర్-17 ఫుట్‌బాల్ జట్టులో ఆమె గోల్‌కీపర్‌గా రాణిస్తుంది. తద్వారా క్రికెట్‌తో పాటు మరో క్రీడలో సత్తా చాటుతున్న అరుదైన ప్లేయర్ల జాబితాలో చేరింది.కావిమ్ గాయం కారణంగా ఫుట్‌బాల్‌కు స్వల్ప విరామం ప్రకటించి, క్రికెట్‌వైపు మళ్లింది. ఈ క్రమంలో ఆమెకు సిడ్నీ సిక్సర్స్ నుంచి ఆహ్వానం అందింది. ఈ ఫ్రాంచైజీతో కావిమ్ మూడేళ్ల ఒప్పందంలో ఉంది. గత సీజన్లో బీబీఎల్ ఎంట్రీ ఇచ్చిని కావిమ్.. ఇప్పటివరకు 21 మ్యాచ్‌లు ఆడి, హ్యాట్రిక్ సహా 27 వికెట్లు తీసింది. బ్యాటింగ్‌లో 137 పరుగులు చేసింది. ఈ ఎడిషన్ బీబీఎల్‌లో సిడ్నీ సిక్సర్స్ ప్రస్థానం ముగిసిన వెంటనే కావిమ్ మళ్లీ ఫుట్‌బాల్‌లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. ఆసీస్ మహిళ-ఏ లీగ్ టోర్నీలో న్యూకాసిల్ జట్టుకు గోల్‌కీపర్‌గా వ్యవహరించాల్సి ఉంది.ప్రస్తుత ఆసీస్ జట్టులోని ఎల్లిస్ పెర్రీ కూడా ద్వంద క్రీడల్లో సత్తా చాటిన విషయం తెలిసిందే. పెర్రీ 17 ఏళ్లకే ఆస్ట్రేలియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసి, క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్‌లోనూ దేశానికి ప్రాతినిథ్యం వహించింది. 2011 FIFA Women’s World Cupలో పెర్రీ ఆస్ట్రేలియా తరఫున బరిలోకి దిగింది. ICC & FIFA వరల్డ్ కప్‌లలో పాల్గొన్న ఏకైక ఆస్ట్రేలియన్ మహిళగా పెర్రీ చరిత్ర సృష్టించింది. పెర్రీని ఆదర్శంగా తీసుకున్న కావిమ్ కూడా క్రికెట్, ఫుట్‌బాల్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని ఉవ్విళ్లూరుతుంది. చదవండి: పాకిస్తాన్ ట్రై సిరీస్.. శ్రీలంక జట్టులో సరికొత్త స్పిన్ ఆయుధం -
బిగ్‌బాష్ లీగ్ నుంచి అశ్విన్ ఔట్
టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్ (Big Bash League) నుంచి వైదొలిగాడు. మోకాలి గాయం కారణంగా 15వ ఎడిషన్‌కు దూరమయ్యాడు. అశ్విన్ ఇటీవలే బీబీఎల్లోని సిడ్నీ థండర్ (Sydney Thunder) ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందం చారిత్రాత్మకమైంది. బీబీఎల్‌లో ఇప్పటివరకు ఏ భారత క్రికెటర్ ఆడలేదు. అశ్విన్ బీబీఎల్ అరంగేట్రం చేసుంటే చరిత్ర సృష్టించేవాడు. గాయం కారణంగా అశ్విన్ బీబీఎల్ ఎంట్రీ వాయిదా పడింది. ఈ సీజన్ మొత్తానికి అశ్విన్ దూరమైనట్లు సిడ్నీ థండర్ యాజమాన్యం ప్రకటించింది. అశ్విన్ సేవలు కోల్పోవడం దురదృష్టకరమని థండర్ ఫ్రాంచైజీ జనరల్ మేనేజర్ అన్నారు. యాష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. యాష్పై ఈ సీజన్లో తామెన్నో ఆశలు పెట్టుకున్నామని తెలిపాడు. అతడి అరంగేట్రాన్ని గ్రాండ్‌గా ప్లాన్ చేశామని, దురదృష్టవశాత్తు అది వాయిదా పడిందని చెప్పుకొచ్చాడు. మరోవైపు అశ్విన్ కూడా బిగ్‌బాష్ లీగ్‌ను మిస్ అయినందుకు బాధ పడ్డాడు. ఫ్యాన్స్‌ను నిరాశపరిచినందుకు క్షమాపణలు చెప్పాడు. యాష్ ఇటీవల చెన్నైలో జరిగిన ఓ షూటింగ్లో గాయపడ్డాడని తెలుస్తుంది.కాగా, 2025-26 బిగ్‌బాష్ లీగ్ సీజన్ డిసెంబర్ 14 నుంచి ప్రారంభమవుతుంది. అశ్విన్ ప్రాతినిథ్యం వహించాల్సిన సిడ్నీ థండర్ తమ తొలి మ్యాచ్‌ను డిసెంబర్ 16న హోబర్ట్ హరికేన్స్‌తో ఆడాల్సి ఉంది.బీబీఎల్ 2025-26లో సిడ్నీ థండర్ జట్టు.. వెస్ అగర్, టామ్ ఆండ్రూస్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, సామ్ బిల్లింగ్స్, ఓలీ డేవిస్, లోకీ ఫెర్గూసన్, మాథ్యూ గిల్క్స్, క్రిస్ గ్రీన్, ర్యాన్ హాడ్లీ, షాదాబ్ ఖాన్, సామ్ కొన్‌స్టాస్, నాథన్ మెక్ఆండ్రూ, బ్లేక్ నికితారాస్, డేవిడ్, అడియన్ ఓకానర్, డేనియల్ సామ్స్, తన్వీర్ సంఘా, డేవిడ్ వార్నర్చదవండి: IPL 2026: ఆసీస్ దిగ్గజానికి కీలక పదవి -
గ్లెన్ మ్యాక్స్‌వెల్ సంచలన నిర్ణయం
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ చేతి గాయం నుంచి కోలుకుంటున్నాడు. టీమిండియాతో జరగనున్న టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లకు దూరమైన.. ఆఖరి మూడు మ్యాచ్‌లకు అందుబాటులోకి వచ్చేందుకు సన్నద్దమవుతున్నాడు.అయితే గాయంతో జట్టుకు దూరంగా ఉన్న మ్యాక్సీ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 21 నుంచి ప్రారంభం కానున్న స్ప్రింగ్ ఛాలెంజ్ టోర్నమెంట్లో మెల్బోర్న్ స్టార్స్ ఉమెన్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. కోడ్ స్పోర్ట్స్ ప్రకారం.. మాక్స్వెల్ మెల్బోర్న్ స్టార్స్ హెడ్ కోచ్ ఆండీ క్రిస్టీతో కలిసి పనిచేయనున్నాడు. తన అనుభవాన్ని యువ మహిళా క్రికెటర్లకు పంచేందుకు అతడు సిద్దమయ్యాడు. అయితే మెల్బోర్న్ ఫ్రాంచైజీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. డబ్ల్యూబీబీఎల్ 2025-26 సీజన్ సన్నాహకంగా ఈ స్ప్రింగ్ ఛాలెంజ్ టోర్నీని నిర్వహించనున్నారు. ఈ టోర్నీలో మొత్తం బీబీఎల్ జట్లతో పాటు ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ మహిళా క్రికెట్ టీమ్ పాల్గోనుంది. మెల్బోర్న్ స్టార్స్ ఉమెన్ తొలి మ్యాచ్‌లో సిడ్నీ వేదికగా అక్టోబర్ 21న అడిలైడ్ స్ట్రైకర్స్‌తో తలపడనుంది. కాగా బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్ మెన్స్ టీమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు కోచ్‌గా సరికొత్త అవతారంలో మాక్స్వెల్ కన్పించనున్నాడు. వైట్‌బాల్ క్రికెట్లో మాక్సీకి అద్బుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఈ విధ్వంసకర ఆటగాడు బ్యాటింగ్, ఫీల్డింగ్‌కు పెట్టింది పేరు. కాగా ఈ స్ప్రింగ్ ఛాలెంజ్ టోర్నీ అక్టోబర్ 31 వరకు జరగనుంది. ఆ తర్వాత మాక్స్వెల్ ఆసీస్ జట్టుతో కలవనున్నాడు.భారత్‌తో తొలి రెండు టీ20లకు ఆసీస్ జట్టుమిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, టిమ్ డేవిడ్, బెన్ డ్వార్షుయిస్,జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మాథ్యూ కుహ్నెమన్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, మాథ్యూ కుహ్నమెన్ -
బీసీసీఐతో ‘తెగదెంపులు’: ఆ జట్టుకు ఆడబోతున్న అశ్విన్
సిడ్నీ: టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (R Ashwin) తొలిసారి ఆస్ట్రేలియా బిగ్‌బాష్ లీగ్ (BBL)లో ఆడటం దాదాపుగా ఖాయమైంది. అతడిని జట్టులోకి తీసుకునేందుకు నాలుగు జట్లు ఆసక్తి చూపించాయి. అయితే ‘సిడ్నీ థండర్’ టీమ్ అశ్విన్‌ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఫ్రాంచైజీ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది.కాగా అంతర్జాతీయ క్రికెట్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లెవరూ ఇప్పటి వరకు బిగ్‌బాష్ లీగ్‌లో ఆడలేదు. అశ్విన్ బరిలోకి దిగితే అతనే మొదటి క్రికెటర్ అవుతాడు. గత ఏడాది చివర్లో టెస్టులకు గుడ్‌బై చెప్పిన అతడు.. ఇటీవలే ఐపీఎల్‌నుంచి కూడా తప్పుకొన్న విషయం తెలిసిందే. బీసీసీఐతో ‘తెగదెంపులు’ఈ నేపథ్యంలో బీసీసీఐ నిబంధనల ప్రకారం.. బోర్డుతో అన్ని రకాల సంబంధాలు తెంచుకున్న అశ్విన్ ఇకపై ప్రపంచవ్యాప్తంగా ఏ లీగ్‌లోనైనా పాల్గొనవచ్చు. ఈ క్రమంలో అతను ముందు ఐఎల్టి20 టోర్నీ ఆడి ఆపై బీబీఎల్‌కు వెళ్లే అవకాశాలున్నాయి.బీబీఎల్‌లో 2015–16 సీజన్లో ఒకే ఒక సారి చాంపియన్‌షిప్ గెలుచుకున్న సిడ్నీ థండర్... గత ఏడాది రన్నరప్‌గా నిలిచింది. 2025–26 కోసం ప్రకటించిన థండర్ జట్టులో డేవిడ్ వార్నర్, సామ్ కొన్‌స్టాస్, బాన్‌క్రాఫ్ట్, సామ్ బిల్లింగ్స్ తదితరులతో పాటు తన్వీర్ సంఘా, టామ్ ఆండ్రూస్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. -
అశ్విన్‌కు జాక్‌పాట్.. ఎవరికీ దక్కని ధర..!
దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) టీమిండియాకు, ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విదేశీ లీగ్‌ల్లో బిజీ అయ్యేందుకు ప్రణాళికలు సిద్దం చేసుకున్నాడు. ఈ మేరకు గత కొద్ది రోజులుగా భారీ కసరత్తు చేశాడు. అశ్విన్ విదేశీ లీగ్‌ల భవితవ్యంపై తాజాగా ఓ క్లారిటీ వచ్చింది.క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. అశ్విన్ ఈ ఏడాది ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (ILT20), బిగ్‌బాష్ లీగ్‌ల్లో (BBL) పాల్గొంటాడు. తొలుత అశ్విన్ ఈ రెండు లీగ్‌ల్లో ఏదో ఒకదాంట్లో మాత్రమే పాల్గొంటాడని ప్రచారం జరిగింది. ఎందుకుంటే ఈ రెండు లీగ్‌ల షెడ్యూల్స్ క్లాష్ అవుతున్నాయి.ఇంటర్నేషనల్ టీ20 లీగ్ డిసెంబర్ 2 నుంచి వచ్చే ఏడాది జనవరి 4 వరకు జరుగనుండగా.. బిగ్‌బాష్ లీగ్ డిసెంబర్ 14 నుంచి వచ్చే ఏడాది జనవరి 25 వరకు జరుగుతుంది.అయితే ఎలాగైనా రెండు లీగ్‌ల్లో ఆడాలని నిశ్చయించుకున్న అశ్విన్.. తొలుత ILT20 ఆడి, ఆతర్వాత వీలును బట్టి బిగ్‌బాష్ లీగ్‌లో పాల్గొంటాడు. బిగ్‌బాష్ లీగ్‌లో అశ్విన్‌కు విపరీతమైన గిరాకీ ఉంది. అతని కోసం ఏకంగా నాలుగు ఫ్రాంచైజీలు ఎగబడుతున్నాయి.సిడ్నీ సిక్సర్స్, సిడ్నీ థండర్, హోబార్ట్ హరికేన్, అడిలైడ్ స్ట్రైకర్స్ ఫ్రాంచైజీల నుంచి ఇదివరకే ఆఫర్లు వచ్చాయి. వీటిలో ఒకదానిని ఎంపిక చేసుకుంటాడు. బీబీఎల్ ఆఫర్ల తర్వాత అశ్విన్‌కు ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌లోనూ భారీ గిరాకీ ఏర్పడింది. రాబోయే సీజన్‌కు ILT20లో డైరెక్ట్ ఎంట్రీ అవకాశం లేకపోవడంతో, అక్టోబర్ 1న జరిగే వేలంలో పాల్గొనేందుకు అశ్విన్ తన పేరును నమోదు చేసుకున్నాడు.ఈ లీగ్‌లో ఎవరికీ కేటాయించని బేస్ ధరను అశ్విన్‌కు కేటాయించారు. అశ్విన్ కోసం భారత కరెన్సీలో రూ. 1.06 కోట్ల నుంచి వేలం మొదలవుతుంది. ఈ సీజన్లో ఏ ఆటగాడికి ఇంత బేస్ ధర దక్కలేదు. ఈ సీజన్ వేలంలో ఆరంకెల బేస్ ప్రైజ్‌తో పోటీపడనున్న ఏకైక ఆటగాడు అశ్విన్ మాత్రమే.బేస్ ధరనే ఇంత ఉందంటే అశ్విన్‌కు వేలంలో ఊహించని ధర దక్కే ఛాన్స్ ఉంది. ఈ లీగ్ చరిత్రలో అత్యధిక ధర రికార్డు పాకిస్తాన్ ఆటగాడు షాహీన్ అఫ్రిది పేరిట ఉంది. అఫ్రిదిని డెజర్ట్ వైపర్స్ రూ. 3.3 కోట్లకు దక్కించుకుంది. ఈ సీజన్ వేలంలో అశ్విన్ అఫ్రిది రికార్డును బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఐపీఎల్ తర్వాత అత్యధిక వేతనాలు ఇచ్చే లీగ్‌గా ILT20కి పేరుంది.ఇదిలా ఉంటే, అశ్విన్ ILT20, BBL కమిట్మెంట్స్ తర్వాత USAలోని Major League Cricket (MLC), UKలోని The Hundred లీగ్‌ల్లోనూ పాల్గొనే అవకాశం ఉంది. దీనిపై ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. చదవండి: టీమిండియాకు అక్షింతలు -
మరో ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకున్న ఆర్సీబీ హెడ్ కోచ్
మహిళల ఆర్సీబీ హెడ్ కోచ్ లూక్ విలియమ్స్ మహిళల హండ్రెడ్ లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2025 సీజన్ కోసం సథరన్ బ్రేవ్ హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. ప్రస్తుత కోచ్ చార్లోట్ ఎడ్వర్డ్స్ ఇంగ్లండ్ మహిళల జట్టుకు హెడ్ కోచ్‌గా వెళ్లడంతో లూక్ నియామకం జరిగింది.లూక్ హండ్రెడ్ లీగ్ ప్రారంభ ఎడిషన్ నుంచి చార్లోట్ ఎడ్వర్డ్స్‌కు డిప్యూటీగా వ్యవహరించాడు. వీరి ఆధ్వర్యంలో బ్రేవ్ 2021, 2022 ఎడిషన్లలో రన్నరప్‌గా.. 2023 ఎడిషన్‌లో విజేతగా నిలిచింది.లూక్ మహిళల ఐపీఎల్లో స్మృతి మంధన నేతృత్వంలోని ఆర్సీబీకి తొలి టైటిల్‌ను అందించాడు. 2024 ఎడిషన్‌లో లూక్ ఆధ్వర్యంలో ఆర్సీబీ టైటిల్ ఎగరేసుకుపోయింది. లూక్‌కు మహిళల బిగ్‌బాష్ లీగ్‌లోనూ ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. అతని ఆథ్వర్యంలో అడిలైడ్ స్ట్రయికర్స్ వరుసగా 2022, 2023 ఎడిషన్లలో విజేతగా నిలిచింది.బ్రేవ్ ఫ్రాంచైజీ రానున్న సీజన్ కోసం లూక్‌తో పాటు మరో కీలక నియామకం చేపట్టింది. ఆ ఫ్రాంచైజీ తమ బ్యాటింగ్ కోచ్‌గా ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ మార్కస్ ట్రెస్కోధిక్కు నియమించుకుంది. జిమ్మీ కానర్స్ స్థానంలో ట్రెస్కోధిక నియామకం జరిగింది.సథరన్ బ్రేవ్ గత సీజన్లో ఘోర ప్రదర్శన చేసింది. 8 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయం సాధించి పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచింది.2025 మహిళల హండ్రెడ్ లీగ్ కోసం సథరన్ బ్రేవ్ జట్టు.. లారా వోల్వార్డ్, డాని వ్యాట్-హాడ్జ్, మైయా బౌచియర్, లారెన్ బెల్, ఫ్రెయా కెంప్, జార్జియా ఆడమ్స్, టిల్లీ కోర్టీన్-కోల్మన్, రియానా సౌత్‌బై, సోఫీ డెవిన్, క్లోయ్ ట్రయాన్, మాడీ విలియర్స్, జోసీ గ్రోవ్స్, ఫోబ్ గ్రాహం -
చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్‌బాష్ లీగ్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నివేదికల ప్రకారం.. సిడ్నీ సిక్సర్స్ ఫ్రాంచైజీ 2025-26 ఎడిషన్ కోసం బాబర్‌తో 4,20,000 ఆస్ట్రేలియన్ డాలర్లకు ఒప్పందం కుదుర్చుకుంది. పాకిస్తానీ కరెన్సీలో ఇది 7.7 కోట్లు. భారత కరెన్సీలో రూ.2.35 కోట్లు.బాబర్‌తో సిక్సర్స్ డ్రాఫ్ట్ (వేలం) కంటే ముందే ఒప్పందం చేసుకుంది (ప్రీ డ్రాఫ్ట్ సైనింగ్). బీబీఎల్‌లో ఓవర్సీస్ డ్రాఫ్ట్ కంటే ముందే ప్రీ డ్రాఫ్ట్ కింద విదేశీ ఆటగాళ్లతో ఒప్పందం చేసుకోవచ్చు. సిక్సర్స్ బాబర్‌తో పాటు ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో కూడా ఇలాగే ఒప్పందం చేసుకుంది. బీబీఎల్‌లో బాబర్‌కు ఇదే తొలి డీల్. ఈ సీజన్‌తోనే అతను ఆసీస్ దేశవాలీ టీ20 లీగ్‌లో అరంగేట్రం చేస్తాడు. ఈ సీజన్ బీబీఎల్ డ్రాఫ్ట్ జూన్ 19న జరుగనుంది.బీబీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడుబాబర్ బీబీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా పాక్ మీడియా డప్పు కొట్టుకుంటుంది. బీబీఎల్‌లో అత్యధిక ధర పలికే ప్లాటినం కేటగిరీలో ఆటగాళ్లకు 3,40,000 ఆస్ట్రేలియన్ డాలర్లు పారితోషికంగా ఇస్తారు. అయితే బాబర్‌తో సిక్సర్స్ ఇంతకంటే 80,000 డాలర్లు అధికంగా ఒప్పందం చేసుకుంది. బీబీఎల్ చరిత్రలో అత్యధిక ధర పొందిన ఆటగాడిగా డి'ఆర్సీ షార్ట్ పేరిట రికార్డు ఉంది. అతనికి 2023-24 సీజన్లో హోబర్ట్ హరికేన్స్ 2,58,900 ఆస్ట్రేలియన్ డాలర్లు చెల్లించింది.బీబీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన టాప్-5 ఆటగాళ్ల జాబితా:డి'ఆర్సీ షార్ట్ – $2,58,900 (హోబార్ట్ హరికేన్స్)ఆండ్రూ టై – $2,46,800 (పెర్త్ స్కార్చర్స్)మార్కస్ స్టోయినిస్ – $2,27,900 (మెల్బోర్న్ స్టార్స్)క్రిస్ లిన్ – $2,02,000 (బ్రిస్బేన్ హీట్)జో రూట్ – $2,00,000 (సిడ్నీ థండర్)బీబీఎల్‌లో ఆటగాళ్ల జీతాల శ్రేణుల వివరాలు:ప్లాటినం: $3,40,000గోల్డ్: $2,60,000సిల్వర్: $1,75,000కాంస్యం: $1,00,000ఐపీఎల్లో అన్క్యాప్డ్ ప్లేయర్ల కంటే తక్కువేబీబీఎల్లో బాబర్ అత్యధిక ధర పలికిన ఆటగాడే అయినా, ఐపీఎల్లో ఓ అన్క్యాప్డ్ ప్లేయర్‌కు లభించే మొత్తం కంటే తక్కువే తీసుకుంటాడు. భారత కరెన్సీలో బాబర్‌కు 2.35 కోట్లు (బీబీఎల్ పారితోషికం) లభిస్తే.. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు, అన్క్యాప్డ్ ప్లేయర్ ప్రియాంశ్ ఆర్యకు రూ.3.5 కోట్లు లభిస్తుంది.ఇదిలా ఉంటే, ప్రపంచవాప్తంగా ఉండే చాలా క్రికెట్ లీగ్‌ల్లో ఆడే (పీఎస్ఎల్, సీపీఎల్, ఎల్పీఎల్, బీపీఎల్, బీబీఎల్) బాబర్‌కు స్వదేశ టీ20 జట్టులో చోటు కరువైంది. పాకిస్తాన్ టీ20 సెటప్ నుంచి బాబర్‌తో పాటు మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిదిని పక్కన పెట్టారు. -
BBL 2025-26: స్టీవ్ స్మిత్ జట్టులోకి బాబర్ ఆజం..
పాకిస్తాన్ సూపర్ స్టార్ బాబర్ ఆజం తొలిసారి ఆస్ట్రేలియా టీ20 టోర్నీ బిగ్ బాష్ లీగ్ (BBL)లో ఆడేందుకు సిద్దమయ్యాడు. బీబీఎల్ 2025-26 సీజన్ కోసం బాబర్ ఆజంతో సిడ్నీ సిక్సర్స్ ఫ్రాంచైజీ ఒప్పందం కదుర్చుకుంది. ప్రీ డ్రాఫ్ట్ ఒప్పందంలో భాగంగా సిడ్నీ ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది. ఆసీస్ స్టార్ ప్లేయర్ స్టీవ్ స్మిత్‌తో కలిసి బాబర్ సిడ్నీ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశముంది. స్మిత్ గత కొన్ని సీజన్లగా సిక్సర్స్ జట్టుకే ప్రాతనిథ్యం వహిస్తున్నాడు."ప్రపంచంలోని అత్యుత్తమ టీ20 లీగ్‌లలో ఒకటైన బిగ్ బాష్ లీగ్‌లో ఆడే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం కల్పించిన సిడ్నీ సిక్సర్స్ ఫ్రాంచైజీకి ధన్యవాదాలు. జట్టు విజయాల్లో నా వంతు పాత్ర పోషించేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నాను" అని సిడ్నీ సిక్సర్స్ రిలీజ్ చేసిన ప్రకటనలో ఆజం పేర్కొన్నాడు. బీబీబీఎల్ 15వ సీజన్ డ్రాఫ్ట్ జూన్ 19న జరగనుంది. కాగా బాబర్ ఆజం ఇప్పటికే పీఎస్ఎల్తో పాటు సీపీఎల్, ఎల్పీఎల్, బీపీఎల్ వంటి పలు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఆడాడు. అయితే పాకిస్తాన్ టీ20 సెటప్ నుంచి బాబర్ ఆజంతో పాటు మహ్మద్ రిజ్వాన్, షాహీన్ అఫ్రిదిని పక్కన పెట్టాలని పీసీబీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే బాబర్ ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్‌లో ఆడేందుకు ఆసక్తిచూపుతున్నట్లు తెలుస్తోంది.చదవండి: చరిత్ర సృష్టించిన మిచెల్ స్టార్క్.. ప్రపంచ క్రికెట్లో తొలి ప్లేయర్‌గా -
బిగ్‌బాష్ లీగ్ ఫైనల్లో హరికేన్స్
బిగ్‌బాష్ లీగ్ 2025 ఎడిషన్ ఫైనల్లోకి హోబర్ట్ హరికేన్స్ ప్రవేశించింది. నిన్న (జనవరి 21) జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో హరికేన్స్ సిడ్నీ సిక్సర్స్‌పై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఓపెనర్ మిచెల్ ఓవెన్ (15 బంతుల్లో 36; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), మిడిలార్డర్ బ్యాటర్ టిమ్ డేవిడ్ (10 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. కాలెబ్ జువెల్ (41 బంతుల్లో 40; 2 ఫోర్లు), బెన్ మెక్‌డెర్మాట్ (31 బంతుల్లో 42; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. మథ్యూ వేడ్ 7 బంతుల్లో 4, నిఖిల్ చౌదరీ 11 బంతుల్లో 14, క్రిస్ జోర్డన్ 3 బంతుల్లో 2 (నాటౌట్), కెప్టెన్ నాథన్ ఇల్లిస్ 2 బంతుల్లో ఒక్క పరుగు చేశారు. సిక్సర్స్ బౌలర్లలో జాఫర్ చోహాన్, బెన్ డ్వార్షుయిస్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. జాక్ ఎడ్వర్డ్స్, మిచెల్ పెర్రీ చెరో వికెట్ దక్కించుకున్నారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సిక్సర్స్ 20 ఓవర్లు పూర్తయ్యే సరికి 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు మాత్రమే చేయగలిగింది. 5 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన సిక్సర్స్‌ను కర్టిస్ ప్యాటర్సన్ (33 బంతుల్లో 48; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), జోర్డన్ సిల్క్ (44 బంతుల్లో 57; 5 ఫోర్లు), లాచ్లన్ షా (25 బంతుల్లో 33 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) గట్టెక్కించే ప్రయత్నం చేశారు. అయితే హరికేన్స్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో వీరి ప్రయత్నం వృధా అయ్యింది. రిలే మెరిడిత్ 4 ఓవర్లలో 34 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టగా.. కెమరూన్ గానన్ 3 ఓవర్లలో 10 పరుగులకు 2 వికెట్లు తీశాడు. నాథన్ ఇల్లిస్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. సిక్సర్స్ బ్యాటర్లు జోష్ ఫిలిప్ (0), జాక్ ఎడ్వర్డ్ (0), కెప్టెన్ మోసస్ హెన్రిక్స్ (1) దారుణంగా విఫలమయ్యారు. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉండటంతో ఈ మ్యాచ్‌లో ఓడినా సిక్సర్స్‌కు మరో అవకాశం ఉంది. జనవరి 24న జరిగే ఛాలెంజర్‌లో నాకౌట్ విజేతతో తలపడుతుంది. ఇవాళ (జనవరి 22) జరుగబోయే నాకౌట్ మ్యాచ్‌లో సిడ్నీ థండర్, మెల్బోర్న్ స్టార్స్ అమీతుమీ తేల్చుకుంటాయి. ఈ టోర్నీలో మెగా ఫైనల్ జనవరి 27న జరుగనుంది. ఛాలెంజర్ విజేతతో హరికేన్స్ ఫైనల్లో తలపడుతుంది. -
పదకొండేళ్ల తర్వాత తొలి హాఫ్ సెంచరీ.. అదీ 40 బంతుల్లో!
ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్ డేవిడ్ వార్నర్(David Warner) ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్(Big Bash League- బీబీఎల్)తో బిజీగా ఉన్నాడు. ఈ టీ20 లీగ్‌లో సిడ్నీ థండర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న వార్నర్.. అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. ఎట్టకేలకు అర్ధ శతకం సాధించాడు. దాదాపు పదకొండేళ్ల అనంతరం బీబీఎల్‌లో తొలిసారి యాభై పరుగుల మార్కును అందుకున్నాడు.కెప్టెన్‌గా వార్నర్అయితే, విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన పొట్టి ఫార్మాట్లో(T20 Cricket) సుదీర్ఘ విరామం తర్వాత హాఫ్ సెంచరీ బాదిన వార్నర్ భాయ్.. అందుకోసం ఏకంగా 40 బంతులు తీసుకోవడం గమనార్హం. కాగా డిసెంబరు 15 బీబీఎల్ 2024-25 సీజన్ ఆరంభమైంది. ఈ క్రమంల డిసెంబరు 17న వార్నర్ కెప్టెన్సీలో తమ తొలి మ్యాచ్ ఆడిన సిడ్నీ థండర్ రెండు వికెట్ల తేడాతో అడిలైడ్ స్ట్రైకర్స్‌ను ఓడించింది.ఆరంభ మ్యాచ్‌లలో విఫలంనాటి మ్యాచ్‌లో వార్నర్ కేవలం ఏడు పరుగులే చేశాడు. అనంతరం.. సిడ్నీ సిక్సర్స్‌తో తలపడ్డ సిడ్నీ థండర్(Sydney Thunder) ఐదు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ వార్నర్ మరోసారి విఫలమయ్యాడు. కేవలం పదిహేడు పరుగులే చేసి నిష్క్రమించాడు.ఆ తర్వాత మెల్బోర్న్తో స్టార్స్‌తో మ్యాచ్‌లో వార్నర్ 19 పరుగులే చేసినా.. సామ్ బిల్లింగ్స్(72 నాటౌట్) కారణంగా.. సిడ్నీ థండర్ 18 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ క్రమంలో సోమవారం నాటి మ్యాచ్‌లో మెల్బోర్న్ గ్రెనేడ్స్తో మ్యాచ్‌లో మాత్రం వార్నర్ బ్యాట్ ఝులిపించాడు.ఎట్టకేలకు బ్యాట్ ఝులిపించాడుసిడ్నీలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మెల్బోర్న్ తొలుత బౌలింగ్ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ థండర్ ఆదిలోనే కామెరాన్ బాన్‌క్రాఫ్ట్(8) వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్ బ్యాటర్ షెర్ఫానే రూథర్‌ఫర్డ్(11), ఒలివర్ డేవిస్(10), సామ్ బిల్లింగ్స్(10) కూడా విఫలమయ్యారు.ఈ నేపథ్యంలో ఇన్నింగ్స్ గాడిన పెట్టే బాధ్యత తీసుకున్న ఓపెనర్ వార్నర్ నెమ్మదిగా ఆడాడు. వికెట్ పడకుండా జాగ్రత్తపడుతూ.. 40 బంతుల్లో యాభై పరుగులు మార్కుకు చేరుకున్నాడు. ఆ తర్వాత మరో పదిహేడు బంతుల్లోనే 36 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు.మొత్తంగా 57 బంతులు ఎదుర్కొని పది ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో వార్నర్ 86 పరుగులు సాధించాడు. అతడి తోడుగా మాథ్యూ గిల్క్స్(23 నాటౌట్) కూడా రాణించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో సిడ్నీ థండర్ నాలుగు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.2013లో చివరగాకాగా డేవిడ్ వార్నర్ బీబీఎల్‌లో చివరగా 2013లో అర్థ శతకం నమోదు చేశాడు. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన వార్నర్ ప్రస్తుతం ఫ్రాంఛైజీ క్రికెట్లో ఆడుతున్నాడు. అయితే, ఐపీఎల్లో గతంలో మంచి రికార్డులే ఉన్నా మెగా వేలం 2025లో మాత్రం వార్నర్‌పై ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. దీంతో అతడు అమ్ముడుపోకుండా మిగిలిపోయాడు.ఒకవేళ బీబీఎల్‌లో గనుక పరుగుల వరద పారిస్తే.. అతడు ఐపీఎల్లో తిరిగి పునరాగమనం చేసే అవకాశం ఉంటుంది. కాగా తమ ఆటగాళ్లు ఎవరైనా గాయపడిన సందర్భంలో ఫ్రాంఛైజీలు .. వారి స్థానంలో అన్‌సోల్డ్‌గా ఉన్న క్రికెటర్లను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఓపెనర్‌గా ఘనమైన రికార్డు ఉన్న వార్నర్ సేవలను పంజాబ్ కింగ్స్ లేదంటే లక్నో సూపర్ జెయింట్స్ వాడుకునే అవకాశం ఉంది.చదవండి: థర్డ్ అంపైర్ నిర్ణయం ముమ్మాటికీ తప్పే..; బీసీసీఐ ఉపాధ్యక్షుడి స్పందన ఇదేDavid Warner's first BBL half-century since 2013! 👏Things you love to see! #BBL14 pic.twitter.com/Uzjq8jamp3— KFC Big Bash League (@BBL) December 30, 2024 -
ఇదెక్కడి బాదుడురా సామీ.. 10 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 140 పరుగులు
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా అడిలైడ్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (జనవరి 22) జరుగుతున్న నాకౌట్ (ఛాలెంజర్) మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ ఓపెనర్ జోష్ బ్రౌన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 57 బంతుల్లోనే 10 ఫోర్లు, 12 సిక్సర్ల సాయంతో 140 పరుగులు బాదాడు. తొలి బంతి నుంచే శివాలెత్తిన బ్రౌన్.. బిగ్‌బాష్ లీగ్‌లో రెండో వేగవంతమైన సెంచరీని (41 బంతుల్లో) నమోదు చేశాడు. బ్రౌన్ విధ్వంసం ధాటికి ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హిట్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. Josh Brown scored an insane 140 in just 57 balls with 12 sixes for Brisbane Heat in the BBL....!!! 🤯 pic.twitter.com/O2hZWNKyLu — Mufaddal Vohra (@mufaddal_vohra) January 22, 2024 బ్రిస్బేన్ ఇన్నింగ్స్‌లో బ్రౌన్, కెప్టెన్ నాథన్ మెక్ స్వీని (33) మినహా ఒక్కరు కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. చార్లీ వాకిమ్ 7, మ్యాట్ రెన్షా 6, మ్యాక్స్ బ్రయాంట్ 9, పాల్ వాల్టర్ 0, జిమ్మీ పియర్సన్ 4 పరుగులు చేయగా.. మైఖేల్ నెసర్ 6, జేవియర్ బార్ట్లెట్ 1 పరుగుతో అజేయంగా నిలిచారు. అడిలైడ్ స్ట్రయికర్స్ బౌలర్లలో డేవిడ్ పేన్, బాయ్స్, లాయిడ్ పోప్ తలో రెండు వికెట్లు.. థామ్టన్ ఓ వికెట్ పడగొట్టాడు. కాగా, బిగ్‌బాష్ లీగ్ 2023-24 ఎడిషన్ చివరి అంకానికి చేరింది. ఈ మ్యాచ్‌తో ప్రస్తుత ఎడిషన్ రెండో ఫైనలిస్ట్ ఎవరో తేలిపోతారు. బ్రిస్బేన్ హీట్, అడిలైడ్ స్ట్రయికర్స్లో గెలిచిన జట్టు ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్‌తో తలపడేందుకు అర్హత సాధిస్తుంది. సిడ్నీ సిక్సర్స్ క్వాలిఫయర్‌లో విజయం సాధించి, ఫైనల్ బెర్త్ సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. జనవరి 24న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. -
గ్లెన్ మాక్స్వెల్ సంచలన నిర్ణయం?
BBL 2024- Glenn Maxwell: ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్వెల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్థానిక బిగ్ బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు సారథ్యం వహిస్తున్న అతడు కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిశ్చయించుకున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి ఇప్పటికే జట్టు యాజమాన్యానికి తెలియజేసినట్లు ఆసీస్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా జాన్ హేస్టింగ్స్ రిటైర్మెంట్ తర్వాత బీబీఎల్ సీజన్ 8 సందర్భంగా మాక్సీ మెల్బోర్న్ స్టార్స్ నాయకుడిగా పగ్గాలు చేపట్టాడు. తొలి రెండు సీజన్లలో కెప్టెన్‌గా అదరగొట్టిన ఈ స్పిన్ ఆల్‌రౌండర్.. టీమ్‌ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. అయితే, ఆ రెండు పర్యాయాల్లో తొలుత మెల్బోర్న్ రెనెగేడ్స్.. తర్వాత సిడ్నీ సిక్సర్స్ చేతిలో మెల్బోర్న్ స్టార్స్ ఓడిపోయింది. ఆఖరి మెట్టుపై బోల్తా పడి టైటిల్‌ను చేజార్చుకుంది. అనంతర ఎడిషన్లలో నిరాశజనక ప్రదర్శన కనబరిచిన స్టార్స్.. బీబీఎల్ 12 సీజన్లో కెప్టెన్ మాక్స్వెల్ సేవలు కోల్పోయింది. కాలు విరిగిన కారణంగా మాక్సీ గతేడాది సీజన్‌కు దూరం కాగా.. తాజాగా జరుగుతున్న పదమూడో ఎడిషన్‌తో తిరిగి జట్టుతో చేరాడు. ఈ క్రమంలో ఆడిన తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం 243 పరుగులు మాత్రమే చేసి.. ఏడు వికెట్లు తీయగలిగాడు. కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. మాక్సీ సారథ్యంలో తొలి మూడు మ్యాచ్‌లు ఓడి హ్యాట్రిక్ పరాజయాలు నమోదు చేసిన మెల్బోర్న్ స్టార్స్.. తర్వాత కోలుకుంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఫామ్‌లోకి వచ్చింది. కానీ.. ఆ తర్వాత పాత కథే పునరావృతమైంది. మరుసటి మూడు మ్యాచ్‌లలో వరుసగా ఓడి ఫైనల్ చేరే అవకాశాలు చేజార్చుకుంది మెల్బోర్న్ స్టార్స్. తద్వారా పాయింట్ల పట్టికలో ఆరోస్థానానికే పరిమితమైంది. ఈ నేపథ్యంలో తీవ్రంగా నిరాశచెందిన మాక్స్వెల్ కెప్టెన్సీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్సైట్ తన కథనంలో పేర్కొంది. కాగా ఐదేళ్లపాటు మెల్బోర్న్ స్టార్స్ సారథిగా కొనసాగిన గ్లెన్ మాక్స్వెల్.. 35 మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడు. అదే విధంగా అతడి ఖాతాలో 31 ఓటములు కూడా ఉన్నాయి. కాగా మాక్సీ స్టార్స్‌తో కాంట్రాక్ట్ కూడా రద్దు చేసుకోవాలని భావిస్తుండగా.. ఫ్రాంఛైజీ మాత్రం అతడితో మరో రెండేళ్లు బంధం కొనసాగించాలనుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక బీబీఎల్ చరిత్రలో మెల్బోర్న్ స్టార్స్ ఇంత వరకు ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవకపోవడం గమనార్హం. చదవండి: చెలరేగిన హైదరాబాద్ బౌలర్లు, బ్యాటర్లు.. తొలిరోజే 302 రన్స్ ఆధిక్యం! తిలక్ రీ ఎంట్రీతో.. -
ఆసీస్ స్టార్ ప్లేయర్ మార్ష్ సంచలన నిర్ణయం
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు, బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ ఓపెనర్ షాన్ మార్ష్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఫామ్‌లో (బిగ్‌బాష్ లీగ్) ఉండగానే ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మార్ష్ తాజాగా అన్ని రకాల క్రికెట్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. బీబీఎల్‌లో జనవరి 16న సిడ్నీ థండర్స్‌తో జరిగే మ్యాచ్ తనకు చివరిదని స్పష్టం చేశాడు. మంచి ఫామ్‌లో ఉండటంతో పాటు తన చివరి మ్యాచ్‌లో (బిగ్‌బాష్ లీగ్) ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచిన షాన్ ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడంతో అందరూ షాకయ్యారు. మార్ష్.. తన చివరి మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌పై 49 బంతుల్లో 10 బౌండరీల సాయంతో 64 పరుగులతో అజేయంగా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు. మార్ష్ తన రెనెగేడ్స్ సహచరుడు, ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ప్రొఫెషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే తాను కూడా ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. 2008-19 మధ్యలో షాన్ మార్ష్ ఆస్ట్రేలియా తరఫున 38 టెస్ట్‌లు, 73 వన్డేలు, 15 టీ20లు ఆడాడు. ఇందులో అతను 13 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీల సాయంతో 5000 పైచిలుకు పరుగులు చేశాడు. ఐపీఎల్‌లోనూ అదరగొట్టిన మార్ష్ 2008-17 మధ్యలో వివిధ ఫ్రాంచైజీల తరఫున 71 మ్యాచ్‌లు ఆడి సెంచరీ, 20 హాఫ్ సెంచరీల సాయంతో 132 స్ట్రయిక్‌రేట్‌తో 2477 పరుగులు చేశాడు. ఐపీఎల్ ఆరంభ సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన మార్ష్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్).. ఆ సీజన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా (616 పరుగులు) నిలిచాడు. ఆసీస్ దిగ్గజ ఆటగాడు జెఫ్ మార్ష్ పెద్ద కొడుకైన 40 ఏళ్ల షాన్ మార్ష్.. ప్రస్తుత ఆసీస్ స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్‌కు స్వయానా అన్న అవుతాడు. -
హెలికాప్టర్లో నేరుగా గ్రౌండ్లో ల్యాండ్ అయిన వార్నర్..!
బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ప్రైవేట్ హెలికాప్టర్లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ల్యాండ్ అయ్యాడు. సొదరుడి వివాహానికి హాజరైన వార్నర్.. అక్కడి నుంచి నేరుగా తాను ఆడబోయే మ్యాచ్‌కు వేదిక అయిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కు హెలికాప్టర్లో చేరుకున్నాడు. Full journey of David Warner in Helicopter to SCG for Big Bash match. 🔥 - What an entry.....!!!!pic.twitter.com/TwTsQe9954 — Johns. (@CricCrazyJohns) January 12, 2024 సాధారణంగా ఏ క్రికెటర్‌కు కూడా ఇలాంటి అవకాశం లభించదు. వార్నర్ కోసం బిగ్‌బాష్ లీగ్ యాజమాన్యం ప్రత్యేకంగా ఈ ఏర్పాట్లు చేసింది. టెస్ట్, వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాక వార్నర్ ఆడనున్న తొలి మ్యాచ్ కావడంతో అతడి గౌరవార్దం ఈ ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు సిడ్నీ థండర్స్ చీఫ్ ప్రకటించాడు. గత బీబీఎల్ సీజన్ సందర్భంగా వార్నర్ సిడ్నీ థండర్స్‌తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగానే అతను ఇవాళ (జనవరి 12) సిడ్నీ సిక్సర్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో ఆడనున్నాడు. David Warner has arrived at SCG in Helicopter for the Big Bash match. - The entertainer is here....!!!!pic.twitter.com/7knZ9BUX58 — Johns. (@CricCrazyJohns) January 12, 2024 కాగా, వార్నర్ కొద్ది రోజుల కిందట ఇదే సిడ్నీ మైదానంలోనే తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. చివరి టెస్ట్ ప్రారంభానికి ముందు వార్నర్ వన్డేల నుంచి కూడా వైదొలుగుతన్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం వార్నర్ ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు టీ20 ఫార్మాట్లో మాత్రమే అందుబాటులో ఉంటాడు. బిగ్‌బాష్ లీగ్ అనంతరం వార్నర్ యూఏఈలో జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్ ఆడతాడు. ఈ లీగ్ అతను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ఈ ఏడాది జూన్‌లో జరిగే టీ20 వరల్డ్‌కప్ దృష్ట్యా వార్నర్ అంతర్జాతీయ టీ20ల్లో కొనసాగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. త్వరలో విండీస్‌తో జరిగే టీ20 సిరీస్‌కు సైతం అందుబాటులో ఉంటానని వార్నర్ ప్రకటించాడు. వార్నర్ బిగ్‌బాష్ లీగ్‌లో ఇప్పటివరకు కేవలం 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇందులో అతను ఓ సెంచరీ (102) సాయంతో 201 పరుగులు చేశాడు. -
ఏంటి బ్రో ఇది.. నాటౌట్‌కు ఔట్ ఇచ్చేసిన థర్డ్ అంపైర్! వీడియో వైరల్
బిగ్ బాష్ లీగ్ 2023-24లో భాగంగా శనివారం మెల్బోర్న్ వేదికగా సిడ్నీ సిక్సర్స్, మెల్బోర్న్ స్టార్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసింది. క్లియర్‌గా నాటౌట్ అయినప్పటికీ థర్డ్ అంపైర్ పొరపాటున ఔట్‌గా ప్రకటించేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అసలేం జరిగిందంటే? సిడ్నీ ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన ఇమాడ్ వసీం బౌలింగ్‌లో జేమ్స్ విన్స్ స్ట్రైయిట్ డ్రైవ్ షాట్ ఆడాడు. బౌలర్ వసీమ్ బంతి ఆపేందుకు ప్రయత్నించగా అతడి తాకుతూ బంతి నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న స్టంప్స్‌ను పడగొట్టింది. దీంతో బౌలర్‌తో పాటు మెల్బోర్న్ ఫీల్డర్లు రనౌట్‌కు అప్పీల్ చేశారు. ఈ క్రమంలో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫీర్ చేశారు. రిప్లేలో బంతి స్టంప్స్‌ను తాకే సమయానికి బ్యాటర్ క్రీజులోకి వచ్చినట్లు క్లియర్‌గా కన్పించింది. దీంతో థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని వెల్లడించడానికి సిద్దమయ్యాడు. అయితే అనూహ్యంగా బిగ్‌స్క్రీన్‌లో ఔట్ కన్పించింది. దీంతో ఒక్కసారిగా మైదానంలో గందరగోళం నెలకొంది. అయితే థర్డ్ నాటౌట్ బటన్‌కు బదులుగా తప్పుడు బటన్ నొక్కడంతో ఇలా జరిగింది. తన తప్పిదాన్ని గ్రహించిన థర్డ్ అంపైర్ వెంటనే నాటౌట్ బటన్ నొక్కడంతో బ్యాటర్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. 157 పరుగుల లక్ష్యాన్ని సిడ్నీ సిక్సర్స్ 18.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. సిడ్నీ బ్యాటర్లలో జేమ్స్ విన్స్ (79) హాఫ్ సెంచరీతో రాణించాడు. కాగా మొదట బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. He's pressed the wrong button! 🙈@KFCAustralia #BucketMoment #BBL13 pic.twitter.com/yxY1qfijuQ — KFC Big Bash League (@BBL) January 6, 2024 -
ఊచకోత.. 28 బంతుల్లోనే..!
బిగ్‌బాష్ లీగ్ 2023-24లో మరో మెరుపు ఇన్నింగ్స్ నమోదైంది. అడిలైడ్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (జనవరి 3) జరిగిన మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ ఆటగాడు లారీ ఈవాన్స్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 28 బంతులు ఎదుర్కొన్న ఈవాన్స్ 7 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో అజేయమైన 85 పరుగులు చేశాడు. ఈవాన్స్ తన హాఫ్ సెంచరీని కేవలం 18 బంతుల్లోనే పూర్తి చేశాడు. బీబీఎల్‌లో పెర్త్ స్కార్చర్స్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ ఫిఫ్టి కావడం విశేషం. ఈవాన్స్ విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈవాన్స్తో పాటు వైట్‌మ్యాన్ (31), ఆరోన్ హార్డీ (34), జోస్ ఇంగ్లిస్ (26) కూడా ఓ మోస్తరు స్కోర్లు చేశారు. స్ట్రయికర్స్ బౌలర్లలో థార్టన్, ఓవర్టన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన స్ట్రయికర్స్.. కెప్టెన్ మాథ్యూ షార్ట్ (44 బంతుల్లో 74; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) క్రీజ్‌లో ఉన్నంతసేపు లక్ష్యం దిశగా సాగింది. అయితే షార్ట్ ఔటైన అనంతరం స్ట్రయికర్స్ వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో 19.2 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌటై, 42 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. లాన్స్ మోరిస్ (4-0-24-5) ఐదు వికెట్ల ప్రదర్శనతో స్ట్రయికర్స్ పతనాన్ని శాశించాడు. జై రిచర్డ్స్‌సన్ (2/31), ఆండ్రూ టై (2/35), బెహ్రెన్‌డార్ఫ్ (1/24) తలో చేయి వేశారు. స్ట్రయికర్స్ ఇన్నింగ్స్‌లో షార్ట్‌తో పాటు క్రిస్ లిన్ (27), థామస్ కెల్లీ (29), ఆడమ్ హోస్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
కొత్త రకం షాట్‌ను పరిచయం చేసిన మ్యాక్స్‌వెల్
ఆసీస్ విధ్వంసకర వీరుడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ టోర్నీ ఏదైనా తనదైన మార్కు షాట్లతో విరుచుకుపడటం సహజం. తాజాగా బిగ్‌బాష్ లీగ్‌లోనూ అతను అలాంటి ఓ వినూత్న షాట్‌నే ఆడి అందరినీ ఆకట్టుకున్నాడు. స్కూప్ షాట్‌ను రివర్స్‌లో ఉండే ఈ షాట్ ఆడి మ్యాక్సీ బౌండరీ సాధించాడు. ఈ షాట్‌ను చూసి అతని అభిమానులు మ్యాడ్ మ్యాక్సీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. క్రికెట్లో ఇదో కొత్త రకం షాట్ అంటూ కితాబునిస్తున్నారు. ఈ షాట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. లీగ్‌లో భాగంగా మెల్బోర్న్ రెనెగేడ్స్‌తో ఇవాళ (జనవరి 2) జరిగిన మ్యాచ్‌లో మ్యాక్సీ ఈ వెరైటీ షాట్‌ను ఆడాడు. Glenn Maxwell inventing new shots in cricket. - The Mad Maxi. 💪💥pic.twitter.com/lTZcdWCA1n — Johns. (@CricCrazyJohns) January 2, 2024 మ్యాచ్ విషయానికొస్తే.. పలు మార్లు వర్షం అంతరాయం కలిగించడంతో 14 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రెనెగేడ్స్ 7 వికెట్ల నష్టానికి 97 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. ఛేదనలో మ్యాక్స్‌వెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో (15 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో మెల్బోర్న్ స్టార్స్ మరో 11 బంతులు మిగిలుండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాక్స్‌వెల్‌తో పాటు థామస్ రోజర్స్ (46 నాటౌట్) రాణించాడు. స్టార్స్ ఇన్నింగ్స్‌లో డేనియల్ లారెన్స్ (7), వెబ్‌స్టర్ (14) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. రెనెగేడ్స్ బౌలర్లలో టామ్ రోజర్స్, పీటర్ సిడిల్లకు తలో వికెట్ దక్కింది. అంతకుముందు డికాక్ (23), జేక్ ఫ్రేసర్ (14), మెకెంజీ (18), రోజర్స్ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయడంతో రెనెగేడ్స్ అతికష్టం మీద 97 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో రాణించిన మ్యాక్సీ బంతితోనూ (3-0-8-1) సత్తా చాటాడు. స్టార్స్ బౌలర్లలో డేనియల్ లారెన్స్ 2, జోయెల్ పారిస్, ఇమాద్ వసీం, స్టీకిటీ, వెబ్‌స్టర్ తలో వికెట్ దక్కించుకున్నారు. ప్రస్తుత సీజన్లో మ్యాక్స్‌వెల్ నేతృత్వంలోని మెల్బోర్న్ స్టార్స్‌కు ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. -
ఆంక్షల ఫలితం... అఫ్గాన్ స్టార్ క్రికెటర్‌పై వేటు!
జాతీయ జట్టుకు తొలి ప్రాధాన్యత ఇవ్వకుండా ఫ్రాంచైజీ టి20 లీగ్‌లవైపు మొగ్గుచూపుతున్న తమ దేశ క్రికెటర్లు ముజీబ్ ఉర్ రెహ్మన్, నవీన్ ఉల్ హక్, ఫజల్హక్ ఫరూఖీలపై గతవారం అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ఆంక్షలు విధించింది. ఇవి అమల్లోకి రావడంతో ఆ్రస్టేలియాలో ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ టి20 లీగ్‌లో మంగళవారం మెల్బోర్న్ స్టార్స్‌తో మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగెడ్స్ తరఫున ఆడాల్సిన ముజీబ్‌ను ఆ జట్టు తప్పించింది. ఈ సీజన్లో రెనెగెడ్స్ తరఫున ఆడిన ఏకైక మ్యాచ్‌లో ముజీబ్ 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. చదవండి: IND-W vs AUS-W: విజయంతో ప్రారంభించాలని... -
BBL 2023: రాణించిన క్రిస్ జోర్డన్, బెన్ మెక్‌డెర్మాట్
బిగ్‌బాష్ లీగ్ 2023లో భాగంగా ఇవాళ (జనవరి 1) జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్, సిడ్నీ థండర్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్‌పై హరికేన్స్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన థండర్.. క్రిస్ గ్రీన్ (33 నాటౌట్), డేనియల్ సామ్స్ (25), బాన్‌క్రాఫ్ట్ (21), ఒలివర్ డేవిస్ (20) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. హరికేన్స్ బౌలర్లు క్రిస్ జోర్డన్ (2/20), నిఖిల్ చౌదరీ (2/26), పాట్రిక్ డూలీ (2/33), నాథన్ ఇల్లిస్ (1/39) థండర్ పతనాన్ని శాశించారు. అనంతరం ఛేదనకు దిగిన హరికేన్స్.. బెన్ మెక్‌డెర్మాట్ (53 నాటౌట్) అర్ధసెంచరీతో సత్తా చాటడంతో 18.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. కాలెబ్ జువెల్ (31), రైట్ (34) రాణించగా.. ఆఖర్లో ఆండర్సన్ (12 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. థండర్ బౌలర్లలో డేనియల్ సామ్స్, తన్వీర్ సంగా, నాథన్ మెక్‌అండ్రూ తలో వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో హరికేన్స్ రన్‌రేట్‌ను కాస్త మెరుగుపర్చుకుని ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది. ఆరు మ్యాచ్‌ల్లో నాలుగింట ఓడిన థండర్ పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతుంది. -
స్టోయినిస్ ఊచకోత.. న్యూ ఇయర్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పిన మెల్బోర్న్
బిగ్‌బాష్ లీగ్ 2023లో భాగంగా అడిలైడ్ స్ట్రయికర్స్‌తో ఇవాళ (డిసెంబర్ 31) జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ అద్భుత విజయం సాధించింది. ఆస్ట్రేలియా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ మెల్బోర్న్ స్టార్స్ సూపర్ విక్టరీ సాధించారు. స్టోయినిస్ ఊచకోతతో (19 బంతుల్లో 55 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) మెల్బోర్న్ న్యూ ఇయర్‌కు గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పింది. స్టోయినిస్ విధ్వంసం ధాటికి అడిలైడ్ నిర్ధేశించిన 206 పరుగుల భారీ లక్ష్యం చిన్నబోయింది. క్రిస్ లిన్ విధ్వంసం.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్.. క్రిస్ లిన్ (42 బంతుల్లో 83 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్సర్లు), మాథ్యూ షార్ట్ (32 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం సృస్టించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. మెల్బోర్న్ కెప్టెన్ మ్యాక్స్‌వెల్ 2 వికెట్లతో రాణించాడు. Brilliant fireworks in Adelaide during BBL match on New Year's Eve.pic.twitter.com/2khkPbaSoO — Mufaddal Vohra (@mufaddal_vohra) December 31, 2023 పోటాపోటీగా విరుచుకుపడిన లారెన్స్, వెబ్‌స్టర్, స్టోయినిస్.. 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్.. డేనియల్ లారెన్స్ (26 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), వెబ్‌స్టర్ (48 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ (17 బంతుల్లో 28; 5 ఫోర్లు) పోటాపోటీగా రాణించడంతో 19 ఓవర్లలో కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. అడిలైడ్ బౌలర్లలో కెమారూన్ బాయ్స్ (4-0-15-1) ఒక్కడే పొదుపుగా బౌలింగ్ చేసి వికెట్ తీశాడు. -
BBL: ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ! చివరికి ఏమైందంటే?
Big Bash League 2023-24: Sydney Sixers vs Adelaide Strikers: ఒక్క పరుగు.. ఒకే ఒక్క పరుగు తేడాతో గెలిచిన జట్టు పట్టరాని సంతోషంలో మునిగిపోతే.. ఓడిన జట్టుకు అంతకంటే బాధ మరొకటి ఉండదు.. బిగ్ బాష్ లీగ్ జట్లు సిడ్నీ సిక్సర్స్- అడిలైడ్ స్ట్రైకర్స్ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే అనుభవిస్తున్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా నేతృత్వంలో ప్రస్తుతం బీబీఎల్ 2023-24 సీజన్ నడుస్తోంది. డిసెంబరు 7న మొదలైన ఈ టీ20 లీగ్.. జనవరి 24 నాటి ఫైనల్‌తో ముగియనుంది. ఇదిలా ఉంటే.. బీబీఎల్‌లో భాగంగా సిడ్నీ- అడిలైడ్ జట్ల మధ్య శుక్రవారం నాటి మ్యాచ్ ఆఖరి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపింది. సిడ్నీ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అడిలైడ్ స్ట్రైకర్స్ సిడ్నీ సిక్సర్స్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో సిడ్నీ బ్యాటర్ జోర్డాన్ సిల్క్ 45 బంతుల్లో 66 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు మెరుగైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్ ఫిలిప్(16 బంతుల్లో 25 పరుగులు)తో కలిసి జట్టును గట్టెక్కించాడు. వీరిద్దరి ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో అడిలైడ్ స్ట్రైకర్స్ ఆఖరి బంతి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కెప్టెన్ మాథ్యూ షార్ట్ (48 బంతుల్లో 55), జెమ్మీ ఓవర్టన్ (28 బంతుల్లో 31 పరుగులు(నాటౌట్)) ఇన్నింగ్స్ వృథా అయింది. గెలుపొందాలంటే చివరి బాల్‌కు మూడు పరుగులు తీయాల్సి ఉండగా.. ఓవర్టన్ రెండు పరుగులు మాత్రమే తీయగలిగాడు. దీంతో విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది అడిలైడ్ జట్టు. ఇక.. అదే ఒక్క పరుగు తేడాతో గెలుపొందిన సిడ్నీ సిక్సర్స్ సంబరాలు అంబరాన్నంటాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. టీ20 ఫార్మాట్ అంటేనే సంచలనాలకు మారుపేరు అన్న విషయం మరోసారి రుజువైందంటూ నెటిజన్లు ఈ సందర్భంగా కామెంట్లు చేస్తున్నారు. SIXERS WIN BY ONE RUN! A final ball THRILLER at the SCG 🔥 📺 WATCH #BBL13 on Ch. 501 or stream via @kayosports https://t.co/bO5P5ypyKo ✍ BLOG https://t.co/miU8FhOoSJ 📲 MATCH CENTRE https://t.co/Hb1Gh6RhzI pic.twitter.com/qYG0apuOIl — Fox Cricket (@FoxCricket) December 22, 2023 1️⃣ run win are most disheartening for the loosing side and most satisfying for the winning side 😀#ViratKohli #INDvsSA #BBL13 #Sixers#INDvAUS #KLRahul #CricketTwitter pic.twitter.com/KThpQd5noi — Sujeet Suman (@sujeetsuman1991) December 22, 2023 -
IPL 2024: ఆర్సీబీ ఆటగాడికిపై నిషేధం
ఇటీవల జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కొనుగోలు చేసిన ఆటగాడిపై బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) నిర్వహకులు నిషేధం విధించారు. బీబీఎల్ 2023-24లో సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇంగ్లండ్ పేసర్ టామ్ కర్రన్‌ను నాలుగు మ్యాచ్‌ల పాటు నిషేధించారు. బీబీఎల్‌లో భాగంగా డిసెంబర్ 11న హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌ను బెదిరించినందుకు గాను టామ్ కర్రన్‌పై చర్యలకు తీసుకున్నట్లు బీబీఎల్ నిర్వహకులు వెల్లడించారు. హోబర్ట్తో మ్యాచ్‌కు ముందు రిహార్సల్స్ సందర్భంగా కర్రన్ అంపైర్ పట్ల దురుసుగా ప్రవర్తించాడని బీబీఎల్ నిర్వహకులు తెలిపారు. మ్యాచ్‌కు ముందు పిచ్‌పై బౌలింగ్ చేసేందుకు కర్రన్ ప్రయత్నించగా అంపైర్ వారించాడని, అయినా కర్రన్ లెక్క చేయకుండా అంపైర్ వైపు బౌలింగ్ చేయబోయాడని పేర్కొన్నారు. కర్రన్ చర్యను లెవెల్ 3 నేరం కింద పరిగణించి, అతనిపై నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. Tom Curran has been banned for four BBL games after intimidating the umpire during pre-match practice.pic.twitter.com/OwvVYkb7kz — CricTracker (@Cricketracker) December 21, 2023 కాగా, డిసెంబర్ 11న హోబర్ట్తో జరిగిన మ్యాచ్‌లో కర్రన్ అద్భుతంగా బౌలింగ్ చేసి తన జట్టు విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన కర్రన్ కేవలం 19 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే బ్యాటింగ్‌లోనూ ఓ బౌండరీ బాది తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇదిలా ఉంటే, దుబాయ్‌లోని కోకోకోలా ఎరీనా వేదికగా డిసెంబర్ 19న జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో ఆర్సీబీ జట్టు టామ్ కర్రన్‌ను 1.5 కోట్లకు సొంతం చేసుకుంది. 28 ఏళ్ల టామ్ కర్రన్ ఐపీఎల్లో వివిధ జట్ల తరఫున 13 మ్యాచ్‌లు ఆడాడు. గత సీజన్ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న సామ్ కర్రన్‌కు టామ్ అన్న అవుతాడు. టామ్ ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున 2 టెస్ట్‌లు, 29 వన్డేలు, 30 టీ20 ఆడాడు. -
BBL 2023: అటూ ఇటూ కాకుండా..! వైరల్ వీడియో
క్రికెట్లో కాయిన్‌తో టాస్ వేయడం మనందరికీ తెలిసిన విషయమే. అయితే కాయిన్‌తో కాకుండా మరో విధంగానూ టాస్ వేసే పద్దతి ఒకటుందన్న విషయం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్‌బాష్ లీగ్‌లో రొటీన్‌కు భిన్నంగా కాయిన్‌తో కాకుండా బ్యాట్‌తో టాస్ వేస్తారు. 2018 సీజన్ నుంచి బీబీఎల్‌లో ఈ నూతన ఒరవడి అమల్లో ఉంది. Toss happened for the 2nd time in the BBL due to the bat flip. 😂 pic.twitter.com/kcL9wNjAA1 — Mufaddal Vohra (@mufaddal_vohra) December 12, 2023 బీబీఎల్ 2023లో భాగంగా సిడ్నీ థండర్, బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య ఇవాళ (డిసెంబర్ 12) జరుగుతున్న మ్యాచ్‌కు ముందు కూడా కాయిన్‌తో కాకుండా బ్యాట్‌తోనే టాస్ వేశారు. అయితే ఈ సందర్భంగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టాస్ వేసే క్రమంలో ఫలితం ఎటూ తేల్చకుండా బ్యాట్ మధ్యేమార్గం (బ్యాట్ ఫ్లిప్) ఎంచుకుంది. దీంతో నిర్వహకులు టాస్‌ను మరోసారి వేయాల్సి వచ్చింది. బీబీఎల్‌లో బ్యాట్ ఫ్లిప్ కావడం కొత్తేమీ కాదు. గతంలోనూ పలు సందర్భాల్లో ఇలా జరిగింది. ఇదిలా ఉంటే సిడ్నీ థండర్, బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ కూడా టాస్ మాదిరే ఆసక్తికరంగా సాగుతుంది. గెలుపు ఇరు జట్ల మధ్య దోబూచులాడుతుంది. బ్రిస్బేన్ నిర్ధేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో సిడ్నీ ఒకింత తడబాటుకు లోనవుతుంది. కెప్టెన్ క్రిస్ గ్రీన్ (30 నాటౌట్) సిడ్నీను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. 17.4 ఓవర్ల తర్వాత సిడ్నీ స్కోర్ 125/7గా ఉంది. సిడ్నీ గెలుపుకు 14 బంతుల్లో 27 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 3 వికెట్లు మిగిలి ఉన్నాయి. -
ప్రమాదకరంగా మారిన పిచ్.. 6 ఓవర్ల తరువాత మ్యాచ్ రద్దు! వీడియో వైరల్
ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్-2023లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. గిలాంగ్ లోని సైమండ్స్ స్టేడియంలో ఆదివారం మెల్ బోర్న్ రెనిగేడ్స్ - పెర్త్ స్కార్చర్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ను పిచ్ సమస్య కారణంగా రద్దు చేశారు. ఏమి జరిగిందంటే? ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మెల్ బోర్న్ రెనిగేడ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. అయితే ఇన్నింగ్స్ రెండో బంతికే స్టీపెన్ (0)ను టామ్ రోజర్స్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. వెంటనే మరో ఓపెనర్ కూపర్ కొన్నోలీ(6) కూడా పెవిలియన్‌కు చేరాడు. అయితే ఇన్నింగ్స్ ఆరంభం నుంచి బంతి అనూహ్యంగా బౌన్స్ అవుతూ వస్తోంది. ఈ క్రమంలో పెర్త్ స్కాచర్స్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన విల్ సదర్లాండ్ బౌలింగ్‌లో మొదటి మూడు బంతులు మరీ ఎక్కువగా బౌన్స్ అయ్యాయి. బ్యాటర్లతో సహా వికెట్ కీపర్ క్వింటన్ డికాక్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో పెర్త్ స్కార్చర్స్ బ్యాటర్లు పరిస్థితిని అంపైర్లు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అంపైర్లు.. ఇరు జట్ల సారథులతో చర్చించి మ్యాచ్‌ను అర్థాంతరంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు రోజు రాత్రి గిలాంగ్ లో భారీ వర్షం కురిసింది. ఈ క్రమంలో కవర్స్ లీక్ అయ్యి నీరు పిచ్ పై చేరి ఉంటుందని, అందుకే బంతి ఎక్కువగా బౌన్స్ అయిందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. Here's the delivery that prompted the discussions. Quinton de Kock's reaction 🫢 #BBL13 pic.twitter.com/1Tbq5YRjnq — KFC Big Bash League (@BBL) December 10, 2023 -
స్పిన్ మ్యాజిక్ అంటే ఇదేనేమో.. జనాలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి..!
మహిళల బిగ్‌బాష్ లీగ్ 2023 ఎడిషన్‌లో భాగంగా మెల్బోర్న్ స్టార్స్‌తో ఇవాళ (అక్టోబర్ 27) జరుగుతున్న మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ స్పిన్ బౌలర్ చార్లీ నాట్ అద్భుతం చేసింది. ఈ మ్యాచ్‌లో బ్రిస్భేన్ హీట్ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్ స్టార్స్‌కు చార్లీ నాట్ ఫ్యూజులు ఎగిరిపోయేలా చేసింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ బౌల్ చేసిన నాట్ (రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్ బౌలర్).. నాలుగో బంతికి సోఫియా డంక్లీను క్లీన్ బౌల్డ్ చేసి, బ్యాటర్‌తో పాటు ప్రేక్షకులంతా అవాక్కయ్యేలా చేసింది. అక్కడెక్కడో ఆఫ్ వికెట్ అవతల పడ్డ బంతి గింగిరాలు తిరుగుతూ వికెట్లను గిరాటు వేయడంతో (మిడిల్ స్టంప్, లెగ్ స్టంప్‌కు) ఆశ్చర్యపోవడం అందరివంతైంది. బ్యాటర్ అలాగే బంతిని చూస్తూ నిశ్చేష్టురాలిగా మిగిలిపోయింది. బంతి అంతలా మెలికలు తిరుగుతూ మాయ చేయడంతో బౌలర్ ముఖంలోనూ వింతహావభావాలు కనిపించాయి. దీనికి సంబంధించిన వీడియోను చూసిన నెటిజన్లు స్పిన్ మాయ అంటే ఇదేనేమో అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరైతే నాట్ వేసిన బంతిని స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ వేసిన బాల్ ఆఫ్ ద సెంచరీతో పోలుస్తున్నారు. మొత్తానికి స్పిన్ మ్యాజిక్కు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. Spin 🤯pic.twitter.com/AD2DRB3mYM — CricTracker (@Cricketracker) October 27, 2023 కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్భేన్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. బ్రిస్భేన్ ఇన్నింగ్స్‌లో జార్జియా వాల్ (48 నాటౌట్), చార్లీ నాట్ (31) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మెల్బోర్న్ బౌలర్లు సదర్‌ల్యాండ్, క్యాప్సీ తలో 2 వికెట్లు.. కిమ్ గార్త్, ఇల్లింగ్‌వర్త్ చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్.. 12 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే 48 బంతుల్లో మరో 73 పరుగులు చేయాల్సి ఉంది. అలైస్ క్యాప్సీ (44 నాటౌట్) పోరాడుతుంది. బ్రిస్భేన్ బౌలర్లలో చార్లీ నాట్, నికోలా హ్యాంకాక్, జెస్ జోనాస్సెన్, సారా గ్లెన్ తలో వికెట్ పడగొట్టారు. -
Punjab Kings: బెయిర్‌స్టో స్థానాన్ని భర్తీ చేయనున్న ఆసీస్ విధ్వంసకర బ్యాటర్
పంజాబ్ కింగ్స్.. గాయపడిన తమ డాషింగ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో స్థానాన్ని ఆస్ట్రేలియా విధ్వంసకర ప్లేయర్‌తో భర్తీ చేసింది. గత బిగ్‌బాష్ లీగ్ సీజన్లో ప్లేయర్ ఆఫ్ ద సీజన్ అవార్డు గెలుచుకున్న అడిలైడ్ స్ట్రయికర్స్ ఆల్‌రౌండర్ మాథ్యూ షార్ట్‌ను పంజాబ్ కింగ్స్ బెయిర్‌స్టో రీప్లేస్‌మెంట్‌గా ఎంపిక చేసింది. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఇవాళ (మార్చి 25) అధికారికంగా వెల్లడించింది. గోల్ఫ్ ఆడుతూ కిందపడిన బెయిర్‌స్టో.. పాత గాయం తిరగబెట్టడంతో కొద్ది రోజులుగా రిహాబ్‌లో ఉన్నాడు. గాయం ఎంతకీ మానకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పంజాబ్ అతన్ని తప్పించి షార్ట్‌ను ఎంపిక చేసింది. పంజాబ్ కింగ్స్.. 2022 మెగా వేలంలో బెయిర్‌స్టోను రూ. 9.75 భారీ ధర వెచ్చింది సొంతం చేసుకుంది. తనకు చెల్లించిన డబ్బుకు న్యాయం చేస్తూ.. బెయిర్‌స్టో గత సీజన్లో మెరుగ్గా రాణించాడు. Matthew Short 👀pic.twitter.com/Bh7hOtNivO — CricTracker (@Cricketracker) March 25, 2023 2022 ఐపీఎల్లో 11 ఇన్నింగ్స్‌లు ఆడిన బెయిర్‌స్టో 144.57 స్ట్రయిక్ రేట్‌తో 253 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఇక, మాథ్యూ షార్ట్ విషయానికొస్తే.. ఈ అడిలైడ్ బ్యాటర్ గత బీబీఎల్ సీజన్లో 14 ఇన్నింగ్స్‌ల్లో 144 స్ట్రయిక్ రేట్‌తో 458 పరుగులు సాధించాడు. ఇందులో ఓ సెంచరీ, 2 అర్ధసెంచరీలు ఉన్నాయి. 𝐓𝐫𝐢𝐩𝐥𝐞 the swag, 𝐓𝐫𝐢𝐩𝐥𝐞 the Jazba! 🤩 The King of Kings, D𝐇𝐇𝐇awan has arrived! 𝐀𝐫𝐞 𝐲𝐨𝐮 𝐫𝐞𝐚𝐝𝐲 to 𝐛𝐫𝐞𝐚𝐤 𝐢𝐭 𝐝𝐨𝐰𝐧? 👑#JazbaHaiPunjabi #SaddaPunjab #PunjabKings @SDhawan25 pic.twitter.com/A36DgrmhFY — Punjab Kings (@PunjabKingsIPL) March 25, 2023 -
చరిత్ర సృష్టించిన ఆండ్రూ టై .. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా!
టీ20 క్రికెట్లో ఆస్ట్రేలియా పేసర్ ఆండ్రూ టై ప్రపంచ రికార్డు సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 300 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా టై రికార్డులకెక్కాడు. బిగ్‌బాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చెర్స్‌కు ఆడుతున్న టై.. ఫైనల్లో బ్రిస్బేన్ హీట్‌పై జేమ్స్ బేజ్లే ఔట్ చేసి ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇక అరుదైన రికార్డును అతడు కేవలం 211 మ్యాచ్‌ల్లోనే సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు ఆఫ్గానిస్తాన్ స్టార్ పేసర్ రషీద్ ఖాన్ పేరిట ఉండేది. రషీద్ తన టీ20 కెరీర్లో 213 మ్యాచుల్లో 300 వికెట్లు పడగొట్టాడు. తాజామ్యాచ్తో రషీద్ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో మూడో స్థానంలో శ్రీలంక దిగ్గజం లసిత్ మలింగ ఉన్నాడు. మలింగ 222 మ్యాచుల్లో 300 వికెట్లు సాధించాడు. ఐదో సారి ఛాంపియన్స్‌గా పెర్త్ స్కార్చెర్స్ బిగ్‌బాష్ లీగ్-2023 ఛాంపియన్స్‌గా పెర్త్ స్కార్చెర్స్ నిలిచింది. పెర్త్ వేదికగా జరిగిన ఫైనల్లో బ్రిస్బేన్ హీట్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన స్కార్చర్స్.. ఐదో సారి టైటిల్‌ను ఎగిరేసుకుపోయింది. 176 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పెర్త్ స్కార్చర్స్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. పెర్త్ టైటిల్ సాధించడంలో ఆ జట్టు కెప్టెన్ అష్టన్ టర్నర్ కీలక పాత్ర పోషించాడు. 32 బంతులు ఎదుర్కొన్న టర్నర్ 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేశాడు. అదే విధంగా ఆఖరిలో నిక్ హాబ్సన్(7 బంతుల్లో 18 నాటౌట్), కూపర్ కొన్నోలీ(11 బంతుల్లో 25 నాటౌట్) అద్బుత ఇన్నింగ్స్‌లు ఆడారు. No player has reached 300 T20 wickets faster than Andrew Tye 👏 pic.twitter.com/DMEpXNHOQB — 7Cricket (@7Cricket) February 4, 2023 చదవండి: W T20 WC 2023: మహిళల పోరుకు సర్వం సిద్దం.. తొలి మ్యాచ్‌లోనే పాక్‌తో భారత్ ఢీ GAME OVER. WHAT A GAME.@ScorchersBBL are BBL champions!#BBL12 pic.twitter.com/wfcVqfYpZc — 7Cricket (@7Cricket) February 4, 2023 -
టర్నర్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బిగ్‌బాష్ లీగ్ ఛాంపియన్స్‌గా పెర్త్ స్కార్చర్స్
బిగ్‌బాష్ లీగ్-2023 ఛాంపియన్స్‌గా పెర్త్ స్కార్చర్స్ జట్టు నిలిచింది. పెర్త్ వేదికగా జరిగిన ఫైనల్లో బ్రిస్బేన్ హీట్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన స్కార్చర్స్.. ఐదవసారి టైటిల్‌ను సొంతం చేసుకుంది. 176 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పెర్త్ స్కార్చర్స్ 5 వికెట్లు కోల్పోయి చేధించింది. పెర్త్ బ్యాటర్లలో కెప్టెన్ అష్టన్ టర్నర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో 32 బంతులు ఎదుర్కొన్న టర్నర్ 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేశాడు. అదే విధంగా ఆఖరిలో నిక్ హాబ్సన్(7 బంతుల్లో 18 నాటౌట్), కూపర్ కొన్నోలీ(11 బంతుల్లో 25 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడారు. బ్రిస్బేన్ హీట్ బౌలర్లలో జేవియర్ బార్ట్లెట్, మాథ్యూ కుహ్నెమాన్, జాన్సెన్ తలా వికెట్ సాధించారు. రాణించిన బ్రెయింట్, మెక్‌స్వీనీ ఇక తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. బ్రిస్బేన్ బ్యాటర్లలో మెక్‌స్వీనీ(41), బ్రెయింట్(14 బంతుల్లో 31) పరుగులతో రాణించారు. ఇక పెర్త్ బౌలర్లలో బెహ్రెండోర్ఫ్, కెల్లీ రెండు వికెట్లు పడగొట్టగా.. హార్దీ, టై తలా వికెట్ సాధించారు. చదవండి: 'ఉమ్రాన్‌కు అంత సీన్ లేదు.. పాక్‌లో అలాంటోళ్లు చాలా మంది ఉన్నారు’ -
నెసర్ ఆల్‌రౌండ్ షో.. స్టీవ్ స్మిత్ లేని సిక్సర్స్‌ను కొట్టి ఫైనల్‌కు చేరిన హీట్
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన ఛాలెంజర్ గేమ్‌లో బ్రిస్బేన్ హీట్.. సిడ్నీ సిక్సర్స్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి, తుది సమరంలో పెర్త్ క్కార్చర్స్తో ఢీకి సిద్ధమైంది. లోకల్ (ఆసీస్) స్టార్ ఆటగాళ్లంతా ఇండియా టూర్ (4 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్)కు వెళ్లడంతో చప్పగా సాగిన ఇవాల్టి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సిక్సర్స్.. కున్నెమన్ (3/17), స్పెన్సర్ జాన్సన్ (3/28), మైఖేల్ నెసర్ (2/28), మెక్ స్వీనీ (1/21) ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి కేవలం 116 పరుగులు మాత్రమే చేసింది. The winning moment! From the man who stole the show. What a performance by Michael Neser and the @HeatBBL #BBL12 #BBLFinals pic.twitter.com/zWuwlsv8QE — KFC Big Bash League (@BBL) February 2, 2023 డేనియల్ హ్యూస్ (23) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 117 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హీట్‌ను.. నెసర్ (32 బంతుల్లో 48 నాటౌట్; 7 ఫోర్లు) అజేయమైన ఇన్నింగ్స్‌తో విజయతీరాలకు చేర్చాడు. ఆరంభంలో ఈ జట్టు కూడా వడివడిగా వికెట్లు కోల్పోయినా నెసర్ ఒక్కడే నిలబడి, ఒంటిచేత్తో తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. హీట్ టీమ్ 18.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జోష్ బ్రౌన్ (20) ఓ మోస్తరుగా రాణించాడు. సిక్సర్స్ బౌలర్లలో నవీద్ 2, స్టీవ్ ఓకీఫ్, సీన్ అబాట్, డ్వార్షుయిష్ తలో వికెట్ దక్కించుకున్నారు. THE BOYS ARE GOING TO THE SHOW! 🎥 @marnus3cricket (Instagram) #BBL12 #BBLFinals pic.twitter.com/4Q79Fihd8O — KFC Big Bash League (@BBL) February 2, 2023 ఆల్‌రౌండర్ ప్రదర్శనతో చెలరేగిన నెసర్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఫిబ్రవరి 4న జరిగే ఫైనల్లో బ్రిస్బేన్ హీట్ టీమ్.. పెర్త్ స్కార్చర్స్‌తో టైటిల్ కోసం పోరాడుతుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతుంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు ముందు వరకు స్టీవ్ స్మిత్, ఉస్మాన్ ఖ్వాజా, డేవిడ్ వార్నర్, ట్రవిస్ హెడ్ లాంటి విధ్వంసకర వీరుల మెరుపులతో బీబీఎల్ కళకళలాడింది. ప్రస్తుతం ఈ ఆటగాళ్లంతా భారత పర్యటనలో ఉండటంతో లీగ్ కళావిహీనంగా, ఎలాంటి మెరుపులు లేకుండా చప్పగా సాగుతుంది. ఫైనల్ మ్యాచ్ కూడా దాదాపుగా ఇలాగే సాగవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. Ice cool under pressure, Michael Neser's batting tonight was something to behold. @KFCAustralia | #BBL12 | #BBLFinals pic.twitter.com/ZROhw7aWIW — KFC Big Bash League (@BBL) February 2, 2023 -
ఒక్క బంతికే 16 పరుగులు.. ఎంత పని చేశావయ్యా స్టీవ్ స్మిత్
సాధారణంగా ఓ బంతికి 7 పరుగులు (నోబాల్+సిక్స్), మహా అయితే 13 పరుగులు (నోబాల్+సిక్స్+సిక్స్) రావడం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. అయితే ప్రస్తుతం జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో ఓ బంతికి ఏకంగా 16 పరుగులు వచ్చాయి. దీంతో ఇదెలా సాధ్యపడిందని క్రికెట్ ఫ్యాన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు. వివరాల్లోకి వెళితే.. బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో భాగంగా సిడ్నీ సిక్సర్స్‌తో ఇవాళ (జనవరి 23) జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ బౌలర్ జోయల్ పారిస్ ఓ బంతికి 16 పరుగులు సమర్పించుకున్నాడు. సిక్సర్స్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 2వ ఓవర్ వేసిన పారిస్.. తొలి రెండు బంతులను డాట్ బాల్స్ వేశాడు. ఆ తర్వాత బంతిని స్టీవ్ స్మిత్ భారీ సిక్సర్‌గా మలిచాడు. ఈ బంతిని అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. 15 runs off one legal delivery! 😵💫 Steve Smith's cashing in once again in Hobart 🙌#BucketBall #BBL12 pic.twitter.com/G3YiCbTjX7 — KFC Big Bash League (@BBL) January 23, 2023 దీంతో బంతి కౌంట్ కాకుండానే సిక్సర్స్ జాబితాలో 7 పరుగులు చేరాయి. ఆతర్వాతి బంతికి కూడా 5 పరుగులు (వైడ్+ఫోర్) రావడంతో బంతి కౌంట్లోకి రాకుండానే సిక్సర్స్ ఖాతాలో 12 పరుగులు జమయ్యాయి. ఇక పారిస్ నెక్స్ వేసిన లీగల్ బంతిని స్మిత్ బౌండరీకి తరలించడంతో ఒక్క బంతి పూర్తయ్యే సరికి సిక్సర్స్ ఖాతాలో 16 పరుగులు వచ్చి పడ్డాయి. ఈ రేర్ ఫీట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో స్టీవ్ స్మిత్ (33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 66 పరుగులు) మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్.. తమ కోటా ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 156 పరుగులకే పరిమితం కావడంతో 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హరికేన్స్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సిక్సర్స్ బౌలర్లలో జాక్సన్ బర్డ్, సీన్ అబాట్, హేడెన్ కెర్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. నవీద్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. -
స్టీవ్ స్మిత్‌కు ఏమైంది, అస్సలు ఆగట్లేదు.. మరోసారి విధ్వంసం
Steve Smith: బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో ఆసీస్ మాజీ కెప్టెన్, సిడ్నీ సిక్సర్స్ ఓపెనర్ స్టీవ్ వీర విధ్వంసకర ఫామ్ కొనసాగుతోంది. ప్రస్తుత సీజన్లో ఓపెనర్ అవతారమెత్తిన స్మిత్.. వరుస మెరుపు ఇన్నింగ్స్‌లతో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. టెస్ట్ క్రికెటర్‌గా ముద్రపడిన స్టీవ్ ఈ సీజన్లో ప్రత్యర్ధి బౌలర్ల పాలిట సింహస్వప్నంలా మారి, ఊచకోత అన్న పదానికి బెస్ట్ ఎగ్జాంపుల్లా మారాడు. గత నాలుగైదు ఇన్నింగ్స్‌లుగా పట్టపగ్గాలు లేకుండా ఎడాపెడా సెంచరీలు, హాఫ్ సెంచరీలు బాదుతున్న స్మిత్.. ఇవాళ (జనవరి 23) హోబర్ట్ హరికేన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. తానాడిన గత రెండు మ్యాచ్‌ల్లో (అడిలైడ్ స్ట్రయికర్స్పై 56 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 101 పరుగులు, సిడ్నీ థండర్స్‌పై 66 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 125 నాటౌట్) సునామీ శతకాలతో చెలరేగిన స్మిత్.. ఇవాళ మరో మెరుపు హాఫ్ సెంచరీ బాదాడు. 33 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 66 పరుగులు చేసి ప్రత్యర్ధి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. స్మిత్ తన హాఫ్ సెంచరీని కేవలం 22 బంతుల్లో పూర్తి చేశాడు. అతని టీ20 కెరీర్లో ఇదే వేగవంతమై హాఫ్ సెంచరీ కావడం విశేషం. స్మిత్‌తో పాటు హెన్రిక్స్ (23 నాటౌట్), వార్షుయిస్ (30) ఓ మోస్తరుగా రాణించడంతో సిక్సర్స్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హరికేన్స్.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసి, 24 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కాగా, స్టీవ్ స్మిత్ తన సహజ సిద్దమైన ఆటకు భిన్నంగా చెలరేగుతుండటం పట్ల క్రికెట్ సర్కిల్స్‌లో పెద్ద చర్చే జరుగుతోంది. ఇంతకీ స్మిత్‌కు ఏమైంది.. ఒక్కసారిగా గేర్ మార్చేశాడు.. బ్రేకులు వేసే ప్రయత్నాలు చేసినా ఆగట్లేదు అంటూ ఫ్యాన్స్ సోషల్‌మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కెరీర్లో ఎన్నడూ లేనంతంగా స్పీడ్‌ను పెంచిన స్మిత్ నుంచి భవిష్యత్తులో మరిన్ని సునామీ ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చని అతని అభిమానులు చర్చించుకుంటున్నారు. 12 ఏళ్ల బీబీఎల్ కెరీర్లో ఒక్క సెంచరీ కూడా చేయని స్మిత్ కేవలం 5 రోజుల వ్యవధిలో రెండు విధ్వంసకర సెంచరీలు, ఓ మెరుపు హాఫ్ సెంచరీ బాదడంతో ఆసీస్ అభిమానుల ఆనందానికి అవదుల్లేకుండా పోతున్నాయి. అంతర్జాతీయ టీ20ల్లో ఒక్క సెంచరీ కూడా చేయని స్మిత్.. ఐపీఎల్‌లోనూ సెంచరీ చేయడం విశేషం. -
ఫించ్ 'దంచి కొట్టుడు'.. 35 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో..!
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో భాగంగా ఇవాళ (జనవరి 22) పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ విధ్వంసకర ఇన్నింగ్స్ (35 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) ఆడాడు. స్కార్చర్స్ నిర్ధేశించిన 213 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఫించ్ వీరోచితంగా పోరాడినప్పటికీ తన జట్టును మాత్రం గెలిపించలేకపోయాడు. ఫించ్‌కు జతగా షాన్ మార్ష్ (34 బంతుల్లో 54; 7 ఫోర్లు, సిక్స్), విల్ సదర్లాండ్ (18 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్) పోరాడినప్పటికీ మెల్బోర్న్ లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. Run fest at Perth, over 400 plus runs scored. Melbourne Renegades fell 10 runs short, great win for Perth Scorchers as they hold on as table toppers in BBL 12.#BBL12 #CricTracker pic.twitter.com/2ss6uBZcYh — CricTracker (@Cricketracker) January 22, 2023 ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఫించ్ చాలా రోజుల తర్వాత కీలక ఇన్నింగ్స్ ఆడాడు. బంతిని ఇష్టం వచ్చినట్లు బాదుతూ ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా ఆండ్రూ టై వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో 3 సిక్సర్లు, 2 ఫోర్ల సాయంతో 31 పరుగులు పిండుకుని ప్రత్యర్ధిని గడగడలాడించాడు. Aaron Finch smashed 31 runs against Andrew Tye in the 18th over. Sensational stuff!#MelbourneRenegades #AaronFInch #AndrewTye pic.twitter.com/Ks6asNijvM — CricTracker (@Cricketracker) January 22, 2023 అయితే 19వ ఓవర్లో కేవలం 8 పరుగులే రావడంతో మెల్బోర్న్ ఓటమి ఖరారైంది. అయినప్పటికీ ఏమాత్రం తగ్గని ఫించ్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో ఎడాపెడా ఫోర్, సిక్సర్ బాది 18 పరుగులు రాబట్టాడు. అప్పటికే జరగాల్సి నష్టం జరిగిపోయింది. మెల్బోర్న్ ఇన్నింగ్స్ నిర్ణీత ఓవర్లలో 202/5 స్కోర్ వద్ద ఆగిపోయింది. పెర్త్ బౌలర్లలో టర్నర్ 2, డేవిడ్ పెయిన్, ఆండ్రూ టై, ఆరోన్ హర్డీ తలో వికెట్ పడగొట్టారు. .@AaronFinch5 with a huge six🔥pic.twitter.com/HiqnPl1d7u — CricTracker (@Cricketracker) January 22, 2023 తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్.. ఓపెనర్లు స్టీవీ ఎస్కినాజీ (29 బంతుల్లో 54; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), బాన్‌క్రాఫ్ట్ (50 బంతుల్లో 95 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ గెలుపుతో పెర్త్ పాయింట్ల పట్టికతో అగ్రస్థానాన్ని (14 మ్యాచ్‌ల్లో 11 విజయాలతో 22 పాయింట్లు) మరింత పటిష్టం చేసుకుంది. మెల్బోర్న్ 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 7 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకుని నాలుగో స్థానంలో ఉంది. సిడ్నీ సిక్సర్స్ (19 పాయింట్లు), బ్రిస్బేన్ హీట్ (13), సిడ్నీ థండర్ (12), అడిలైడ్ స్ట్రయికర్స్ (10), హోబర్ట్ హరికేన్స్ (10), మెల్బోర్న్ స్టార్స్ (6) వరుసగా 2, 3, 5, 6, 7, 8 స్థానాల్లో ఉన్నాయి. -
ఆఖరి బంతికి సిక్సర్ కావాలి, స్ట్రయిక్‌లో స్టోయినిస్.. ఏం జరిగిందంటే..?
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో మరో రసవత్తర సమరం జరిగింది. గబ్బా వేదికగా బ్రిస్బేన్ హీట్-మెల్బోర్న్ స్టార్స్ మధ్య ఇవాళ (జనవరి 22) జరిగిన మ్యాచ్ ఆఖరి బంతి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగింది. మెల్బోర్న్ గెలవాలంటే ఆఖరి బంతికి సిక్సర్ బాదాల్సి ఉండింది. స్ట్రయిక్‌లో మార్కస్ స్టోయినిస్ ఉన్నాడు. గతంలో చాలా సందర్భాల్లో ఆఖరి బంతికి సిక్సర్ బాది తన జట్టును గెలిపించిన స్టోయినిస్ ఈసారి మాత్రం నిరాశపరిచాడు. స్పెన్సర్ జాన్సన్ వేసిన లో ఫుల్ టాస్ బంతిని స్టోయినిస్ భారీ షాట్‌గా మలిచేందుకు విఫలయత్నం చేశాడు. మెల్బోర్న్ కేవలం ఒక్క పరుగుతో మాత్రమే సరిపెట్టుకుని, 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అంతకుముందు ఓవర్లో (ఇన్నింగ్స్ 19వ ఓవర్) 21 పరుగులు పిండుకున్న స్టోయినిస్ (23 బంతుల్లో 36 నాటౌట్; ఫోర్, 3 సిక్సర్లు), హిల్టన్ కార్ట్‌రైట్ (24 బంతుల్లో 33 నాటౌట్; 5 ఫోర్లు) జోడీ ఆఖరి ఓవర్లో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్.. సామ్ హెయిన్ (41 బంతుల్లో 73 నాటౌట్; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), పియర్సన్ (43 బంతుల్లో 57 నాటౌట్; 5 ఫోర్లు, సిక్స్) మెరుపు హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. మెల్బోర్న్ బౌలర్లలో లూక్ వుడ్ 2 వికెట్లు పడగొట్టగా.. కౌల్టర్ నైల్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. ఛేదనలో మెల్బోర్న్ సైతం అద్భుతంగా పోరాడినప్పటికీ వారికి విజయం దక్కలేదు. జో క్లార్క్ (32 బంతుల్లో 31; 2 ఫోర్లు), థామస్ రోజర్స్ (20 బంతుల్లో 41; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), క్యాంప్‌బెల్ (23 బంతుల్లో 25; 2 ఫోర్లు), స్టోయినిస్ (36 నాటౌట్), హిల్టన్ (33 నాటౌట్) తమ జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. నిర్ణీత ఓవర్లలో మెల్బోర్న్ 3 వికెట్లు కోల్పోయి 184 పరుగులకే పరిమితమైంది. బ్రిస్బేన్ బౌలర్లలో స్వెప్సన్ 2, జేమ్స్ బాజ్లీ ఓ వికెట్ పడగొట్టారు. ఈ గెలుపుతో బ్రిస్బేన్ 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 పరాజయాలతో (ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు) పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి (13 పాయింట్లు) ఎగబాకింది. -
3 రోజుల గ్యాప్‌లో మరో విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన స్టీవ్ స్మిత్
Steve Smith: బిగ్ బాష్ లీగ్ 2022-23 సీజన్లో ఆసీస్ మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నాడు. టెస్ట్ ప్లేయర్‌గా ముద్రపడిన స్మిత్ వరుస సెంచరీలతో విరుచుకుపడుతూ, తన జట్టు (సిడ్నీ సిక్సర్స్) విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. జనవరి 17 అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేసిన స్మిత్.. ఇవాళ (జనవరి 21) సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో ఏకంగా 125 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 19 ఓవర్లలో సిడ్నీ సిక్సర్స్ 2 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేయగా.. స్టీవ్ ఒక్కడే అందులో 80 శాతానికి పైగా పరుగులు సాధించాడు. అతడికి కెప్టెన్ హెన్రిక్స్ (36 బంతుల్లో 45 నాటౌట్; ఫోర్, 2 సిక్సర్లు) మరో ఎండ్‌లో సహకరించాడు. స్మిత్ ఊచకోత ధాటికి థండర్స్ బౌలర్లు విలవిలలాడిపోయారు. గురిందర్ సంధు ఒక్కడే 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 188 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన థండర్స్.. సిక్సర్స్ బౌలర్లు స్టీవ్ ఒకీఫ్ (4/10), సీన్ అబాట్ (3/11), బెన్ వార్షుయిస్ (2/14), టాడ్ మర్ఫీ (1/18) థాటికి 14.4 ఓవర్లలో 62 పరుగులకే చాపచుట్టేసింది. ఫలితంగా సిక్సర్స్ 125 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. థండర్స్ ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ (16), జోయల్ డేవిస్ (10) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. పేస్ బౌలర్లకు స్వర్గధామమైన సిడ్నీ పిచ్‌పై స్టీవ్ స్మిత్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 3 రోజుల గ్యాప్‌లో రెండు సెంచరీలు బాదిన స్మిత్‌ను ఆకాశానికెత్తుతున్నారు. బీబీఎల్‌లో సిక్సర్స్ తరఫున నమోదైన రెండు సెంచరీలు స్మితే చేయడం విశేషం. 12 ఏళ్ల బీబీఎల్ కెరీర్లో ఒక్క సెంచరీ కూడా చేయని స్మిత్ కేవలం 3 రోజుల గ్యాప్‌లో రెండు సెంచరీలు చేయడంతో ఆసీస్ అభిమానులు కొనియాడుతున్నారు. అంతర్జాతీయ టీ20ల్లో ఒక్క సెంచరీ కూడా చేయని స్మిత్.. ఐపీఎల్‌లోనూ సెంచరీ చేయడం విశేషం. -
రిటైర్మెంట్ ప్రకటించిన ఆసీస్ సీనియర్ క్రికెటర్
ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్.. సీనియర్ ఆల్‌రౌండర్ డాన్ క్రిస్టియన్ ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్‌కు ఆడుతున్న డాన్ క్రిస్టియన్.. తనకిదే చివరి టోర్నీ అని ట్విటర్ వేదికగా ప్రకటించాడు. బీబీఎల్ సీజన్ ముగిసిన తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్లు స్పష్టం చేశాడు. ''ఇన్నాళ్లు ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయమని.. అలాగే బీబీఎల్, ఐపీఎల్, కరీబియన్ ప్రీమీయర్ లీగ్, బంగ్లా ప్రీమియర్ లీగ్ లాంటి ప్రైవేటు లీగ్స్‌లోనూ పాల్గొనడం సంతోషాన్ని ఇచ్చిందని'' తెలిపాడు. ఇక డాన్ క్రిస్టియన్ ఆస్ట్రేలియా తరపున 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆసీస్ తరపున పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రమే ఆడిన క్రిస్టియన్ ఓవరాల్‌గా 20 వన్డేలు, 23 టి20 మ్యాచ్‌లు ఆడాడు. లోయర్ ఆర్డర్లో పవర్ఫుల్ హిట్టర్‌గా పేరు పొందిన డాన్ క్రిస్టియన్ మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగలడు. వన్డేల్లో 270 పరుగులతో పాటు 20 వికెట్లు, టి20ల్లో 118 పరుగులతో పాటు 13 వికెట్లు పడగొట్టాడు. 2021 తర్వాత డాన్ క్రిస్టియన్ ఆసీస్ తరపున మరో మ్యాచ్ ఆడలేదు. 2007-08లో ఫస్ట్‌క్లాస్ కెరీర్ ఆరంభించిన డాన్ క్రిస్టియన్ లిస్ట్-ఏ తరపున 124 మ్యాచ్‌లు, 399 టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఇక బిగ్‌బాష్ లీగ్‌లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన డాన్ క్రిస్టియన్ బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ), ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: సైబర్ క్రైమ్ వలలో ఐసీసీ.. 20 కోట్ల నష్టం Some news 😁 pic.twitter.com/5xxxkYNQGt — Dan Christian (@danchristian54) January 20, 2023 -
Steve Smith: అదృష్టం కలిసొచ్చిన వేళ..
ఆస్ట్రేలియా సీనియర్ ఆటగాడు స్టీవ్‌స్మిత్ ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో బిజీగా ఉన్నాడు. సిడ్నీ సిక్సర్స్ తరపున ఆడుతున్న స్మిత్ మంగళవారం అడిలైడ్ స్ట్రైకర్స్‌తో మ్యాచ్‌లో సూపర్ శతకంతో మెరిసిన సంగతి తెలిసిందే. కేవలం 56 బంతుల్లోనే ఐదు ఫోర్లు, ఏడు సిక్సర్ల సహాయంతో 101 పరుగుల సునామీ ఇన్నింగ్స్‌తో విరుచుకుపడ్డాడు. అయితే విధ్వంసకర ఇన్నింగ్స్‌తో మెరిసిన స్మిత్‌కు మ్యాచ్‌లో ఒకచోట అదృష్టం కూడా బాగా కలిసి వచ్చింది. బంతి వికెట్లను తాకినప్పటికి బెయిల్స్ కిందపడక పోవడంతో స్మిత్ ఔట్ నుంచి తప్పించుకున్నాడు. హ్యారీ కాన్వే వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఇది చోటు చేసుకుంది. కాన్వే విడుదల చేసిన బంతి స్మిత్ బ్యాట్ సందులో నుంచి వెళ్లి మిడిల్ వికెట్లకు తాకింది. అయితే బంతి బలంగా తగలకపోవడంతో బెయిల్స్ ఏమాత్రం కదల్లేదు. ఆ తర్వాత బంతిని తీసుకున్న స్మిత్ ఫీల్డర్‌కు అందజేశాడు. ఆ సమయంలో స్మిత్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేశాడు. అలా బతికిపోయిన స్మిత్ ఆ తర్వాత సెంచరీతో విరుచుకుపడ్డాడు. అదృష్టం కలిసిరావడం అంటే ఇదేనేమో అంటూ అభిమానులు కామెంట్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సిడ్నీ సిక్సర్స్ విజయం దిశగా సాగుతుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ స్మిత్ సెంచరీతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. స్మిత్‌తో పాటు కర్టిస్ పాటర్సన్ 43.. చివర్లో జోర్డాన్ సిల్క్ 16 బంతుల్లో 31 పరుగులు చేశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అడిలైడ్ స్ట్రైకర్స్ 8 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసి ఓటమి అంచున నిలిచింది. మాథ్యూ షార్ట్(40), అలెక్స్ కేరీ(54) మినహా మిగతావారు విఫలమయ్యారు. Ball hits stumps... bails stay on? Steve Smith counting his blessings there 😅@KFCAustralia #BucketMoment #BBL12 pic.twitter.com/ksLRyXRrsN — KFC Big Bash League (@BBL) January 17, 2023 చదవండి: స్టీవ్ స్మిత్‌కు పూనకం వచ్చింది.. విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు ఆస్ట్రేలియాకు షాక్.. నంబర్ వన్ స్థానానికి టీమిండియా -
స్టీవ్ స్మిత్‌కు పూనకం వచ్చింది.. విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు
BBL 2022-23: టెస్ట్ ఆటగాడిగా ముద్రపడ్డ ఆస్ట్రేలియా మాజీ సారధి స్టీవ్ స్మిత్.. పొట్టి ఫార్మాట్లోనూ చెలరేగాడు. బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో భాగంగా సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న స్మిత్.. ఇవాళ (జనవరి 17) అడిలైడ్ స్ట్రయికర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విధ్వంకర శతకంతో రెచ్చిపోయాడు. కేవలం 56 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. Steve Smith, what a way to bring up your maiden #BBL ton! 💥#BBL12 | @BKTtires | #GoldenMoment pic.twitter.com/iFOesNfeIJ — cricket.com.au (@cricketcomau) January 17, 2023 ఈ ఇన్నింగ్స్‌లో ఆది నుంచి దూకుడుగా ఆడిన స్మిత్ పూనకం వచ్చినట్లు ఊగిపోయి, తన శైలికి భిన్నంగా ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదాడు. స్మిత్‌కు ఇది బీబీఎల్‌లో మొదటి శతకం కాగా, బీబీఎల్ చరిత్రలో సిడ్నీ సిక్సర్స్‌కు కూడా ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఓవరాల్‌గా బీబీఎల్‌లో ఇది 35వ సెంచరీ కాగా.. ఈ సెంచరీతో బీబీఎల్‌లో పాల్గొనే అన్ని జట్లు సెంచరీలు నమోదు చేసినట్లైంది. ఐపీఎల్‌లోనూ తన పేరిట సెంచరీ నమోదు చేసుకున్న స్మిత్.. స్వదేశంలో జరుగుతున్న బీబీఎల్‌లో ఈ ఫీట్ అందుకునేందుకు 12 ఏళ్లు పట్టింది. Steve Smith hits the 35th men's BBL hundred, but the first ever hundred for Sydney Sixers. Now all teams have at least one individual century in the league.#BBL12 — Kausthub Gudipati (@kaustats) January 17, 2023 కాగా, అడిలైడ్‌తో జరగుతున్న మ్యాచ్‌లో స్మిత్ విధ్వంసకర శతకానికి తోడు కర్టిస్ ప్యాటర్సన్ (33 బంతుల్లో 43; 3 ఫోర్లు, సిక్స్), సిల్క్ (16 బంతుల్లో 31 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) ఓ మోస్తరుగా రాణించడంతో సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది. అడిలైడ్ బౌలర్లలో వెస్ అగర్ 2 వికెట్లు పడగొట్టగా.. షార్ట్, బాయ్స్ తలో వికెట్ దక్కించుకున్నారు. 204 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన అడిలైడ్.. 5 ఓవర్ల తర్వాత వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. కెప్టెన్ ట్రవిస్ హెడ్ (5) ఔట్ కాగా.. అలెక్స్ క్యారీ (7), మాథ్యూ షార్ట్ (25) క్రీజ్‌లో ఉన్నారు. -
నరాలు తెగే ఉత్కంఠ.. ఆఖరి బంతికి ఫోర్ కొట్టి గెలిపించాడు
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో ఇవాళ (జనవరి 16) ఓ రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. మెల్బోర్న్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ ఆఖరి బంతికి విజయం సాధించింది. బ్రిస్బేన్ బ్యాటర్ మ్యాట్ రెన్షా (56 బంతుల్లో 90 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నప్పటికీ, ఆఖరి బంతిని బౌండరీగా తరలించి తన జట్టును గెలిపించాడు. బ్రిస్బేన్ గెలవాలంటే చివరి బంతికి 4 పరుగులు చేయాల్సి ఉండగా, రెన్షా అద్భుతమైన స్కూప్ షాట్ ఆడి తన జట్టుకు అపురూపమైన విజయాన్ని అందించాడు. Matt Renshaw scoops for four to win the game off the last ball 😮 Talk about holding your nerve!#BBL12 pic.twitter.com/l4GamZxqK4 — Wisden (@WisdenCricket) January 16, 2023 ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన బ్రిస్బేన్.. మైఖేల్ నెసర్ (4/25), స్పెన్సర్ జాన్సన్ (1/41), బాజ్లీ (1/35), రెన్షా (1/5) రాణించడంతో మెల్బోర్న్ హీట్‌ను 159 పరుగులకు (7 వికెట్ల నష్టానికి) కట్టడి చేసింది. మెల్బోర్న్ ఇన్నింగ్స్‌లో నిక్ లార్కిన్ (58) అర్ధసెంచరీతో రాణించగా.. థామస్ రోజర్స్ (26), వెబ్‌స్టర్ (36) పర్వాలేదనిపించారు. అనంతరం 160 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బ్రిస్బేన్‌ను రెన్షా ఒంటి చేత్తో గెలిపించాడు. బిస్బేన్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఉస్మాన్ ఖ్వాజా (14), జిమ్మీ పియర్సన్ (22) మాత్రమే రెండంకెల స్కోర్ చేసినప్పటికీ.. రెన్షా ఆఖరి బంతి వరకు పట్టువదలకుండా క్రీజ్‌లో ఉండి తన జట్టును గెలిపించాడు. మెల్బోర్న్ బౌలర్లలో లియామ్ హ్యాచర్, ఆడమ్ జంపా చెరో 2 వికెట్లు పడగొట్టగా.. నాథన్ కౌల్టర్ నైల్, క్లింట్ హింక్లిఫ్ తలో వికెట్ దక్కించుకున్నారు. -
పంజాబ్ కింగ్స్ బౌలర్ హ్యాట్రిక్.. ముంబై ఇండియన్స్ బ్యాటర్ విధ్వంసం
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో భాగంగా సిడ్నీ థండర్స్‌తో ఇవాళ (జనవరి 15) జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ ఆటగాళ్లు నాథన్ ఇల్లీస్ (ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ బౌలర్), టిమ్ డేవిడ్ (ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్) రెచ్చిపోయారు. ఇల్లీస్ హ్యాట్రిక్ వికెట్లతో (4/27) నిప్పులు చెరగగా.. టిమ్ డేవిడ్ (41 బంతుల్లో 76 నాటౌట్; 5 ఫోర్లు, 6 సిక్సర్లు) బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న హోబర్ట్ టీమ్ 5 వికెట్ల తేడాతో సిడ్నీ థండర్స్‌ను మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్.. ఇల్లీస్, ప్యాట్రిక్ డూలీ (3/22), రిలే మెరిడిత్ (2/14), ఫహీమ్ అష్రాఫ్ (1/28) ధాటికి నిర్ణీత ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. చాలాకాలం తర్వాత బీబీఎల్‌లో అడుగుపెట్టిన డేవిడ్ వార్నర్ డకౌట్ కాగా, ఒలివర్ డేవిస్ (45), బెన్ కట్టింగ్ (20), కెప్టెన్ క్రిస్ గ్రీన్ (21) ఓ మోస్తరుగా రాణించారు. సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హోబర్ట్ హరికేన్స్.. టిమ్ డేవిడ్, కెప్టెన్ మాథ్యూ వేడ్ (22 బంతుల్లో 30; 2 ఫోర్లు, సిక్స్) రాణించడంతో 16.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సిడ్నీ బౌలర్లలో డేనియల్ సామ్స్ ఒక్కడే 4 వికెట్లు పడగొట్టి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. కాగా, ఈ మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లతో రెచ్చిపోయిన ఇల్లీస్.. బీబీఎల్‌లో ఈ ఘనత సాధించిన 9వ బౌలర్‌గా, సిడ్నీ తరఫున హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్‌గా, ప్రస్తుత సీజన్లో మైఖేల్ నెసెర్ (బ్రిస్బేన్ హీట్) తర్వాత హ్యాట్రిక్ సాధించిన రెండో బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. 2012-13 సీజన్లో జేవియర్ డోహర్తీ సిడ్నీ తరఫున తొలిసారి హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టగా.. బీబీఎల్‌లో ఇప్పటివరకు ఆండ్రూ టై (రెండు సార్లు), జోష్ లాలర్, రషీద్ ఖాన్, హరీస్ రౌఫ్, జేవియర్ డోహర్తీ, గురిందర్ సంధు, కెమరూన్ బాయ్స్ ఈ ఘనత సాధించిన వారిలో ఉన్నారు. -
రషీద్ ఖాన్ సంచలన నిర్ణయం!
Rashid Khan: తమతో ఆడాల్సిన సిరీస్‌ను బహిష్కరిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయంపై అఫ్గనిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఘాటుగా స్పందించాడు. ఆటలో రాజకీయాలకు తావు లేకుండా వ్యవహరించాలంటూ హితవు పలికాడు. తమ దేశానికి ప్రాతినిథ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తానన్న రషీద్.. ప్రపంచానికి తమ ఉనికిని గర్వంగా చాటగల ఏకైక మార్గం క్రికెట్ అని పేర్కొన్నాడు. కాగా అఫ్గన్‌లో మహిళలు, అమ్మాయిల ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే విధంగా తాలిబన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్న నేపథ్యంలో ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌ను రద్దు చేసుకుంటున్నట్లు గురువారం ప్రకటించింది. యూఏఈ వేదికగా అఫ్గనిస్తాన్‌తో జరగాల్సిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నుంచి వైదొలుగుతున్నట్లు పేర్కొంది. ఆటను రాజకీయాలకు దూరంగా ఉంచండి ఈ విషయంపై స్పందించిన టీ20 కెప్టెన్ రషీద్ ఖాన్.. సీఏ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. అంతేకాదు తాను ఆసీస్ టీ20 టోర్నీ బిగ్‌బాష్ లీగ్ నుంచి తప్పుకొంటాననే సంకేతాలు కూడా ఇచ్చాడు. ఈ మేరకు.. ‘‘మా దేశానికి ఇప్పుడున్న ఏకైక ఆశాకిరణం క్రికెట్! దయచేసి.. ఆటను రాజకీయాలకు దూరంగా ఉంచండి. మార్చిలో మాతో ఆడాల్సిన సిరీస్ నుంచి తప్పుకొంటున్నట్లు ఆస్ట్రేలియా చేసిన ప్రకటన నన్ను నిరాశకు గురిచేసింది. ప్రపంచ వేదికపై నా దేశానికి ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన గౌరవం. కానీ సీఏ నిర్ణయం మా ప్రయాణాన్ని తిరోగమనం దిశగా ప్రేరేపించేలా చేసింది. ఒకవేళ ఆస్ట్రేలియాకు.. అఫ్గనిస్తాన్‌తో ఆడటం అసౌకర్యంగా అనిపిస్తే.. నేను బీబీఎల్ ఆడటం ద్వారా ఎవరినీ ఇబ్బంది పెట్టదలచుకోలేదు. ఆ లీగ్‌లో ఆడాలా లేదా అన్న అంశంపై కాస్త కఠినంగానే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని రషీద్ ఖన్ ట్విటర్లో పేర్కొన్నాడు. కాగా రషీద్ ఖాన్ బిగ్‌బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇక అఫ్గన్ క్రికెట్ బోర్డు సైతం.. ‘‘ఆస్ట్రేలియా బోర్డు తీసుకున్న నిర్ణయం విషాదకరం. మేమిది ఊహించలేదు. కచ్చితంగా ఇది మాపై తీవ్ర ప్రభావం చూపుతుంది’’ అని తమ ప్రకటనలో పేర్కొంది. చదవండి: Delhi vs Andhra: సెంచరీతో చెలరేగిన ధ్రువ్ షోరే... ఢిల్లీ దీటైన జవాబు Cricket! The only hope for the country. Keep politics out of it. @CricketAus @BBL @ACBofficials ♥️ 🇦🇫 ♥️ pic.twitter.com/ZPpvOBetPJ — Rashid Khan (@rashidkhan_19) January 12, 2023 -
ఇదేం బాదుడురా సామీ.. బిగ్‌బాష్ లీగ్‌లో చారిత్రక విజయం
బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) చరిత్రలోనే అత్యంత భారీ లక్ష్య ఛేదన ప్రస్తుత సీజన్లో (2022-23) నమోదైంది. నిన్న (జనవరి 5) అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ నిర్ధేశించిన 230 పరుగుల లక్ష్యాన్ని అడిలైడ్ స్ట్రయికర్స్ మరో 3 బంతులుండగానే ఛేదించి (7 వికెట్ల తేడాతో) చరిత్ర సృష్టించింది. ఇరు జట్ల బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్ విన్యాసాలతో రెచ్చిపోవడంతో 39.3 ఓవర్లలో ఏకంగా 459 పరుగులు నమోదయ్యాయి. THE GREATEST CHASE! Simply incredible from Matt Short who brings up a ton to pull off the biggest chase in BBL history! Jawdropping stuff #BBL12 pic.twitter.com/98VzoYHMXY — KFC Big Bash League (@BBL) January 5, 2023 మాథ్యూ షార్ట్ వీరోచిత శతకంతో (59 బంతుల్లో 100 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అడిలైడ్ స్ట్రయికర్స్‌కు చారిత్రక విజయాన్ని అందించాడు. షార్ట్‌కు క్రిస్ లిన్ (29 బంతుల్లో 64; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), ఆడమ్ హోస్ (22 బంతుల్లో 38; ఫోర్, 4 సిక్సర్లు) సహకరించడంతో కొండంత లక్ష్యం అమాంతం కరిగిపోయింది. హోబర్ట్ బౌలర్లలో ప్యాట్రిక్ డూలే (2/25), టిమ్ డేవిడ్ (1/18)లను మినహాయించి మిగతా బౌలర్లనంతా అడిలైడ్ బ్యాటర్లు ఉతికి ఆరేశారు. You should watch these highlights. #BBL12 https://t.co/3fWaTjiGFa — KFC Big Bash League (@BBL) January 5, 2023 తొలుత బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్.. బెన్ మెక్ డెర్మాట్ (30 బంతుల్లో 57; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), కాలెబ్ జువెల్ (25 బంతుల్లో 54; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), జాక్ క్రాలే (28 బంతుల్లో 54 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (20 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌ల సహకారంతో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. గ్రాండ్‌హోమ్ 2, కాన్వే, షార్ట్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో అడిలైడ్.. 19.3 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, బీబీఎల్ హిస్టరీలో రికార్డు ఛేదనను నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు హోబర్ట్ హరికేన్స్ పేరిట ఉండింది. 2016/17 సీజన్లో మెల్బోర్న్ రెనిగేడ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హరికేన్స్ 223 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
సంచలన క్యాచ్.. బిక్క ముఖం వేసిన బ్యాటర్! ఇంతకీ అది సిక్సరా? అవుటా?
Big Bash League 2022-23- Sensational Catch: బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ క్రికెటర్ మైఖేల్ నీసర్ అందుకున్న క్యాచ్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ‘‘ఇంతకీ అది.. అవుటా? కాదా’’ అన్న అంశంపై చర్చ నడుస్తోంది. కొంతమందేమో ఇదో గొప్ప క్యాచ్ అని నీసర్ను ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాత్రం ఇలా కూడా అవుట్ ఇస్తారా అని అంపైర్ల నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆస్ట్రేలియా బిగ్‌బాష్ టీ20 లీగ్‌లో భాగంగా ఆదివారం సిడ్నీ సిక్సర్స్, బ్రిస్బేన్ హీట్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన హీట్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన సిడ్నీ.. గెలుపు కోసం తీవ్రంగా పోరాడింది. అయితే, 209 పరుగులకు ఆలౌట్ కావడంతో బ్రిస్బేన్ హీట్ 15 రన్స్ తేడాతో విజయం సాధించింది. అయితే, సిడ్నీ ఫ్యాన్స్ మాత్రం తమ జట్టు మిడిలార్డర్ ఆటగాడు జోర్డాన్ సిల్క్ అవుట్ కాకపోయి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. 23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సిల్క్ పెవిలియన్ చేరాడు. హీట్ బౌలర్ స్టీకెటీ బౌలింగ్‌లో మైకేల్ నాసర్ పట్టిన సంచలన క్యాచ్ కారణంగా అవుటయ్యాడు. పందొమ్మిదో ఓవర్ రెండో బంతిని సిల్క్ షాట్ ఆడే క్రమంలో లాంగాఫ్‌లో నీసర్ క్యాచ్ అందుకున్నాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయిన నీసర్ బౌండరీ దాటే సమయంలో బాల్‌ను గాల్లోకి ఎగిరేశాడు. బౌండరీ అవతల బంతి గాల్లో ఉండగా.. తన అడుగులు కిందపడకుండా.. బంతిని ఒడిసిపట్టి.. మళ్లీ ఇవతలకు విసిరేసి.. బౌండరీ దాటి క్యాచ్ పట్టేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొంతమంది దీనిని అవుట్ ఇవ్వడం కరెక్టే అంటూ ఉండగా.. మరికొందరు మాత్రం పాపం సిల్క్ అంటూ జాలిపడుతున్నారు. అది సిక్సరా లేదంటే అవుటా అన్న విషయం తేల్చలేక ఇంకొందరు అయోమయంలో పడిపోయారు. అది సిక్సర్ అయి ఉంటే సిల్క్ తమ జట్టును తప్పక విజయతీరాలకు చేర్చేవాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా నిబంధనల ప్రకారం.. బౌండరీ లైన్ అవతల క్యాచ్ అందుకునే, దానిని విసిరేసే సమయంలో ఫీల్డర్ గ్రౌండ్‌కు టచ్ కాక.. ఇవతల బాల్‌ను అందుకుంటే అది క్యాచే! చదవండి: BCCI: కీలక టోర్నీల్లో వైఫల్యాలు.. భారీ మూల్యం! ఇక ఆటగాళ్లకు కఠిన పరీక్ష.. ఏమిటీ ‘యో–యో’ టెస్టు? WC 2023: సర్వ సన్నద్ధం కోసం... బీసీసీఐ సమావేశం! 20 మందితో ప్రపంచకప్ సైన్యం Michael Neser's juggling act ends Silk's stay! Cue the debate about the Laws of Cricket... #BBL12 pic.twitter.com/5Vco84erpj — cricket.com.au (@cricketcomau) January 1, 2023 -
అందుకే అత్యుత్సాహం పనికి రాదంటారు..
మనకు రానిది ప్రయత్నించి కొన్నిసార్లు చేతులు కాల్చుకున్న సందర్బాలున్నాయి. తాజాగా ఒక అభిమాని క్యాచ్ అందుకోవడం సాధ్యం కాదని తెలిసినా అత్యుత్సాహం ప్రదర్శించి అనవసరంగా ముక్కు పచ్చడి చేసుకున్నాడు. ఇదంతా బిగ్‌బాష్ లీగ్ సీజన్-12లో చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే.. ఇక మంగళవారం బ్రిస్బేన్ హీట్, సిడ్నీ థండర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. సిడ్నీ థండర్స్ ఇన్నింగ్స్ సమయంలో జట్టు ఓపెనర్ మాథ్యూ గిల్క్స్ దూకుడుగా ఆడుతున్నాడు. 56 పరుగుల వద్ద ఉన్నప్పుడు మిచెల్ స్వీప్సన్ బౌలింగ్‌లో లాంగాన్ దిశగా భారీ సిక్సర్ బాదాడు. అయితే బంతి నేరుగా స్టాండ్స్‌వైపు దూసుకొచ్చింది. అయితే స్టాండ్స్‌లో నిలబడిన ఒక అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. తనవైపు వస్తున్న క్యాచ్‌ను అందుకోవాలని ప్రయత్నించాడు. కానీ పాపం క్యాచ్ పట్టడంలో విఫలం కావడంతో బంతి నేరుగా అతన్ని ముక్కు మీద గట్టిగా తాకి పక్కకు పడింది. అయినా కూడా తనకేం కాలేదన్నట్లుగా అంతా ఒకే అని సింబల్ చూపించాడు. అయితే కాసేపటికే సదరు అభిమాని ముక్కు నుంచి రక్తం దారలా కారసాగింది. ఇది గమనించిన బ్యాటర్ మాథ్యూ గిల్క్స్ అతని వైపు చూడగా.. ముక్కుకు కర్చీఫ్ అడ్డుపెట్టుకున్న అభిమాని పర్లేదులే అన్నట్లుగా సైగ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్‌కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. కొలిన్ మున్రో 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. పియర్సన్ 27, గ్జేవియర్ బార్లెట్ 28 నాటౌట్ రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండానే కేవలం 11.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. అలెక్స్ హేల్స్ 59 నాటౌట్, మాథ్యూ గిల్క్స్ 56 నాటౌట్ జట్టును గెలిపించారు. Anyone know this guy who can let us know if his nose is all good?! 🫣@KFC #BucketMoment #BBL12 pic.twitter.com/YVjvgg6a9v — KFC Big Bash League (@BBL) December 27, 2022 చదవండి: Ashwin-Shreyas Iyer: మొన్న గెలిపించారు.. ఇవాళ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపారు దెబ్బ అదుర్స్.. ఒక్క ఇన్నింగ్స్‌తో అన్నింటికి చెక్ -
BBL 2022: రెండున్నరేళ్ల కూతురికి స్ట్రోక్.. వైదొలిగిన స్టార్ క్రికెటర్
Tymal Mills- Big Bash League: ‘‘భారమైన 11 రోజుల తర్వాత క్రిస్మస్ కోసం ఇలా ఇంటికి! ఆస్ట్రేలియా వెళ్లేందుకు మేము ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సమయంలో మా చిన్నారి కూతురికి పక్షవాతం వచ్చింది. తన శరీరంలోని ఎడమభాగం పూర్తిగా అచేతన స్థితిలోకి వెళ్లింది. తను కోలుకోవడానికి ఇంకెంత సమయం పడుతుందోనని ఆందోళనపడ్డాం. అయితే, మా చిన్నారి దేవత.. కఠిన పరిస్థితులను అనతికాలంలోనే అధిగమించి అందరిని ఆశ్చర్యపరిచింది. తనను తీసుకుని ఇంటికి వెళ్తున్నాం. కానీ, డిశ్చార్జ్ కావడానికి ముందు తను ఎంత వేదన అనుభవించిందో మాకు తెలుసు. ఇప్పుడైతే మేము సంతోషంగానే ఉన్నాం. తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’’ అంటూ ఇంగ్లండ్ క్రికెటర్ టైమల్ మిల్స్ భావోద్వేగానికి లోనయ్యాడు. అనారోగ్యం బారిన పడిన తమ కూతురు కోలుకుందనే శుభవార్తను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు. కాగా బిగ్‌బాష్ లీగ్ ఆడేందుకు టైమల్ మిల్స్ ఆస్ట్రేలియాకు వెళ్లాల్సిన సమయంలో అతడి రెండున్నరేళ్ల కూతురికి స్ట్రోక్ వచ్చింది. ఈ విచారకర ఘటన నేపథ్యంలో మిల్స్ తను కుటుంబంతోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఈ ఫాస్ట్‌బౌలర్ బిగ్‌బాష్ లీగ్ నుంచి వైదొలిగాడు. కాగా 30 ఏళ్ల మిల్స్ ఈ సీజన్లో పెర్త్ స్కార్చర్స్‌కు ప్రాతినిథ్యం వహించాల్సి ఉంది. అయితే, దురదృష్టవశాత్తూ జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో డేవిడ్ పైన్ ఈ డిఫెండింగ్ చాంపియన్ తరఫున ఆడనున్నాడు. ఇక మిల్స్ సహా ఫిల్ సాల్ట్, లౌరీ ఎవాన్స్ తదితరులు వివిధ కారణాల దృష్ట్యా జట్టుకు దూరమయ్యాడు. ఇక ఇప్పటి వరకు ఈ సీజన్లో రెండు మ్యాచ్‌లు ఆడిన పెర్త్ ఒక దాంట్లో గెలిచి మరో దాంట్లో ఓడింది. చదవండి: Ind Vs Ban: పట్టుదల, శ్రమ.. అవునా?.. మంచిది! మరి కుల్దీప్ సంగతేంటి?! నెటిజన్ల ఫైర్ BCCI: మా వల్ల కాదు.. తప్పుకొనే యోచనలో టీమిండియా ప్రధాన స్పాన్సర్! కిట్ స్పాన్సర్ కూడా! కారణం? -
హ్యాట్రిక్ వృధా.. అర డజన్ సిక్సర్లు కొట్టి గెలిపించిన రసెల్
బిగ్‌బాష్ లీగ్ 2022-23 సీజన్లో భాగంగా మెల్బోర్న్ రెనగేడ్స్, బ్రిస్బేన్ హీట్ జట్లు ఇవాళ (డిసెంబర్ 21) తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్.. టామ్ రోజర్స్ (4/23), అకీల్ హొసేన్ (3/26) ముజీబ్ ఉర్ రెహ్మాన్ (1/18) ధాటికి నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. బ్రిస్బేన్ ఇన్నింగ్స్‌లో మ్యాట్ రెన్షా (29), సామ్ బిల్లింగ్స్ (25), పీయర్సన్ (45) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. అనంతరం 139 పరుగుల సాధారణ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన మెల్బోర్న్ టీమ్‌ను ఫాస్ట్ బౌలర్ మైఖేల్ నెసర్ హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి (4/32) భయపెట్టాడు. తొలి ఓవర్ తొలి బంతికే వికెట్ పడగొట్టిన నెసర్.. అదే ఓవర్ ఆఖరి బంతికి మరో వికెట్‌ను, ఆతర్వాత మూడో ఓవర్ తొలి రెండు బంతులకు వికెట్లు పడగొట్టి తమ జట్టు విజయానికి గట్టి పునాది వేశాడు. నెసర్ ధాటికి మెల్బోర్న్ 2.2 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయింది. Just admiring this shot 😍 pic.twitter.com/G6ljSi7q2J — Melbourne Renegades (@RenegadesBBL) December 21, 2022 అయితే ఆరో స్థానంలో బరిలోకి దిగిన విండీస్ విధ్వంసకర యోధుడు ఆండ్రీ రసెల్ (42 బంతుల్లో 57; 2 ఫోర్లు, 6 సిక్సర్లు).. ఆరోన్ ఫించ్ (43 బంతుల్లో 31 నాటౌట్; 2 ఫోర్లు, సిక్స్), అకీల్ హొసేన్ (19 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) సహకారంతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. అర డజన్ సిక్సర్లతో విరుచుకుపడిన రసెల్ ప్రత్యర్ధి చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుని మెల్బోర్న్ రెనెగేడ్స్‌ను 4 వికెట్ల తేడాతో గెలిపించాడు. రసెల్ మెరుపు ఇన్నింగ్స్ హవాలో నెసర్ హ్యాట్రిక్ వృధా అయిపోయింది. బ్రిస్బేన్ బౌలర్లలో నెసర్తో పాటు మార్క్ స్టీకీట్ (2/23) వికెట్లు దక్కించుకున్నాడు. జేమ్స్ బాజ్లే బౌలింగ్‌లో రసెల్ కొట్టిన 103 మీటర్ల సిక్సర్ మ్యాచ్ మొత్తానికే హైలైట్‌గా నిలిచింది. కాగా, బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ రెనగేడ్స్ జట్టు 1400 రోజుల తర్వాత వరుసగా 3 మ్యాచ్‌ల్లో గెలుపొందడం విశేషం. -
Big Bash League: సిడ్నీ థండర్ 15 ఆలౌట్!
సిడ్నీ: 0 0 3 0 2 1 1 0 0 4 1... ఇవీ ఒక టి20 మ్యాచ్‌లో వరుసగా 11 మంది ఆటగాళ్ల స్కోర్లు! ప్రతిష్టాత్మక బిగ్‌బాష్ లీగ్...ఐపీఎల్ తర్వాత అత్యంత ప్రజాదరణ ఉన్న టి20 టోర్నీ...ఇప్పటికే ఒక సారి చాంపియన్‌గా నిలిచిన సిడ్నీ థండర్ జట్టు... కానీ అత్యంత చెత్త ప్రదర్శనతో ఆ జట్టు టి20 చరిత్రలో తలదించుకునే రికార్డు నమోదు చేసింది. శుక్రవారం అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్ 5.5 ఓవర్లలో 15 పరుగులకే కుప్పకూలింది. ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోగా, ఎక్స్‌ట్రాల రూపంలో 3 పరుగులు వచ్చా యి. టి20 ఫార్మాట్లో విధ్వంసక ఆటగాళ్ల జాబి తాలో నిలిచే అలెక్స్ హేల్స్, రిలీ రోసో సిడ్నీ జట్టు లో ఉన్నారు. కనీసం ఒక్క ఆటగాడు కూడా పరిస్థితిని బట్టి నిలబడేందుకు గానీ, కౌంటర్ అటాక్‌తో పరుగులు రాబట్టేందుకు గానీ ప్రయత్నించలేదు. దాంతో 35 బంతుల్లోనే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. పదో నంబర్ బ్యాటర్ డాగెట్ బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకొని ఒకే ఒక ఫోర్ రాగా... స్టేడియంలో ప్రేక్షకులంతా నిలబడి వ్యంగ్యంగా ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇవ్వ డం పరిస్థితిని చూపిస్తోంది! 17 బంతుల్లో 3 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టిన అడిలైడ్ పేసర్ హెన్రీ థార్టన్ సిడ్నీ పతనంలో కీలక పాత్ర పోషించాడు. వెస్ అగర్ 12 బంతుల్లో 6 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అంతకు ముందు 139 పరుగులు చేసిన స్ట్రైకర్స్ 124 పరుగులతో మ్యాచ్ గెలుచుకుంది. 15: టి20 క్రికెట్లో ఇదే అత్యల్ప స్కోరు. 2019లో కాంటినెంటల్ కప్‌లో భాగంగా చెక్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో టర్కీ 21 పరుగులకే ఆలౌటైన రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. అతి తక్కువ బంతులు (35) సాగిన ఇన్నింగ్స్ కూడా ఇదే. -
బిగ్‌బాష్ లీగ్‌లో సంచలనం..15 పరుగులకే ఆలౌట్
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో పెను సంచలనం నమోదైంది. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ 15 పరుగులకే ఆలౌటై టోర్నీ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు నమోదు చేసింది. అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలర్ హెన్రీ థోర్టన్ కెరీర్ బెస్ట్ స్పెల్(2.5-1-3-5) నమోదు చేశాడు. అంతేకాదు పవర్ ప్లే(తొలి ఆరు ఓవర్లు) ముగియకుండానే ఆలౌట్ అయిన సిడ్నీ థండర్స్.. టి20 చరిత్రలోనే తొలి జట్టుగా మరో చెత్త రికార్డు మూటగట్టుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. క్రిస్ లిన్ 36 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. కొలిన్ డీ గ్రాండ్‌హోమ్ 33 పరుగులు చేశాడు. సిడ్నీ థండర్స్ బౌలింగ్‌లో ఫజల్లా ఫరుఖీ మూడు వికెట్లు తీయగా.. గురీందర్ సందు, డేనియల్ సామ్స్, బ్రెండన్ డోగ్గెట్‌లు తలా రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ కేవలం 5.5 ఓవర్లు మాత్రమే ఆడి 15 పరుగులకే కుప్పకూలింది. అలెక్స్ హేల్స్, రిలీ రొసౌ, డేనియల్ సామ్స్ జాసన్ సంగా లాంటి టి20 స్టార్స్ ఉన్న జట్టు ఇన్నింగ్స్ పేకమేడను తలపించింది. హెన్రీ థోర్టన్, వెస్ అగర్లు ఒకరితో ఒకరు పోటీ పడుతూ వికెట్లు తీయడంతో సిడ్నీ థండర్స్ కోలుకోలేకపోయింది. సిడ్నీ ఇన్నింగ్స్‌లో ఐదుగురు డకౌట్‌గా వెనుదిరగ్గా.. మిగతా ఆరుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. టి20 క్రికెట్ చరిత్రలో సీనియర్ విభాగంలో సిడ్నీ థండర్స్దే అత్యల్ప స్కోరుగా ఉంది. అంతకముందు చెక్ రిపబ్లిక్‌తో మ్యాచ్‌లో టర్కీ 21 పరుగులకే ఆలౌటైంది. ఇప్పటివరకు ఇదే అత్యల్ప స్కోరు కాగా.. తాజాగా సిడ్నీ థండర్స్ ఆ రికార్డును బద్దలు కొట్టిన అత్యంత చెత్త టీమ్‌గా చరిత్ర సృష్టించింది. 🚨 Score Update: 9/14.... Wow... 🤯#BBL12 pic.twitter.com/WldWluV6Tz — 7Cricket (@7Cricket) December 16, 2022 చదవండి: రోహిత్ కోసం సెంచరీ చేసినోడిని పక్కనబెడతారా? FIFA: అర్జెంటీనాదే వరల్డ్‌కప్.. గత రికార్డులు ఏం చెబుతున్నాయంటే! -
క్రికెట్ చరిత్రలోనే అరుదైన ఘటన.. ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే?
బిగ్ బాష్ లీగ్-2022లో భాగంగా బ్రిస్బేన్ హీట్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో మెల్బోర్న్ కెప్టెన్ నిక్ మాడిన్సన్(87) పరుగులతో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో మెల్బోర్న్ ఇన్నింగ్స్ సమయంలో ఓ ఆశ్చర్యకర సంఘటన చోటు చేసుకుంది. గాలి కారణంగా స్టంప్స్ పైన బెయిల్స్ పడితే ఔట్ అని మెల్బోర్న్ బ్యాటర్ పెవిలియన్‌కు వెళ్లేందుకు సిద్దమయ్యాడు. ఏం జరిగిందంటే..? మెల్బోర్న్ ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్లో మార్క్ స్టెకెటీ వేసిన ఒక షార్ట్ పిచ్ బాల్‌ను.. మాడిన్సన్ బ్యాక్వర్డ్ స్క్వేర్-లెగ్ బౌండరీ వైపు షాట్ ఆడాడు. ఈ షాట్ ఆడే క్రమంలో స్టంప్స్ బెయిల్స్ కిందపడిపోయాయి. దీంతో అతడు స్టంప్స్‌ను తన కాలితో తాకడం వల్లే బెయిల్స్ కిందపడిపోయాయి అని అంతా భావించారు. మాడిన్సన్ కూడా హిట్ వికెట్ అయ్యాని భావించి డగౌట్ వైపు నడవడం ప్రారంభించాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. అతడి ఔట్‌పై సందేహంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌కు రిఫర్ చేశాడు. అయితే స్టంప్స్‌కు మాడిన్సన్ బ్యాట్ గానీ, అతడి బ్యాక్‌ఫుట్ గానీ తాకనట్లు రిప్లేలో సృష్టంగా కన్పించింది. దీంతో బెయిల్స్ గాలికి పడి ఉంటాయిని భావించిన థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో కొద్ది నిమిషాలపాటు ఫీల్డ్‌లో గందరగోళం నెలకొంది. ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. What on earth??? Looks like the wind's knocked the bail off! Maddinson stays safe 😅@KFCAustralia #BucketMoment #BBL12 pic.twitter.com/sboxGvIewA — KFC Big Bash League (@BBL) December 15, 2022 చదవండి: IND vs BAN: ఐదు వికెట్లతో చెలరేగిన కుల్దీప్ .. 150 పరుగులకే కుప్పకూలిన బంగ్లాదేశ్ -
కిందా మీదా పడ్డాడు.. నీ కష్టం ఊరికే పోలేదు!
బిగ్‌బాష్ లీగ్ 12వ సీజన్ ప్రారంభమయిన సంగతి తెలిసిందే. మెల్బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్స్ మధ్య తొలి మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. ఫలితం సంగతి ఎలా ఉన్నా మ్యాచ్‌లో మాత్రం ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మెల్బోర్న్ స్టార్స్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ బ్రాడీ కౌచ్ అందుకున్న క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సిడ్నీ థండర్స్ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్లోనే ఇదంతా చోటుచేసుకుంది. బౌల్ట్ వేసిన తొలి ఓవర్ రెండో బంతిని మాథ్యూ గైక్స్ మిడాన్ దిశగా ఆడాడు. అక్కడే నిల్చున్నబ్రాడీ కౌచ్ లో-లెవెల్లో వచ్చిన క్యాచ్‌ను తీసుకునే ప్రయత్నం చేశాడు. కానీ బంతి చేజారింది. ఆ తర్వాత బంతి అతని కాళ్లకు తాకి పైకి లేవగా అందుకునే ప్రయత్నం చేసినప్పటికి మరోసారి మిస్ అయింది. చివరకు ఎలాగోలా బంతి సురక్షితంగా తీసుకోవడం జరిగింది. మొత్తానికి సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా వచ్చిన బ్రాడీ కౌచ్ స్టన్నింగ్ క్యాచ్‌తో అదరగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. నిక్ లార్కిన్ 25 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. బర్న్స్ 18 పరుగులు చేశాడు. సిడ్నీ థండర్స్ బౌలింగ్‌లో గురీందర్ సందు, ఫజల్హక్ ఫరుఖీ, డేనియల్ సామ్స్‌లు తలా రెండు వికెట్లు తీయగా.. బ్రెండన్ డొగ్గెట్, క్రిస్ గ్రీన్ చెరొక వికెట్ పడగొట్టారు. Absolutely INSANE from Brody Couch 🤯🤯🤯 #BBL12 pic.twitter.com/GFKsXCM3GS — KFC Big Bash League (@BBL) December 13, 2022 చదవండి: కోహ్లి, పంత్ 125 పరుగులు చేస్తారు! వారిద్దరూ 10 వికెట్లు తీస్తారు.. -
బిగ్‌బాష్ లీగ్ ఛాంపియన్స్‌గా అడిలైడ్ స్ట్రైకర్స్
మహిళల బిగ్‌బాష్ లీగ్ సరికొత్త ఛాంపియన్స్‌గా ఆడిలైడ్ స్ట్రైకర్స్ అవతరించింది. శనివారం సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన ఫైనల్లో 10 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆడిలైడ్ స్ట్రెకర్స్.. తొలి సారి టైటిల్‌ను ముద్దాడింది. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 147 పరుగులు చేసింది. అడిలైడ్ స్ట్రైకర్స్ బ్యాటర్లలో డాటిన్ (52) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. సిడ్నీ బౌలర్లలో ఎక్లెస్టోన్ రెండు, పెర్రీ, బోల్టాన్, కేట్ పీటర్సన్ తలా వికెట్ సాధించారు. అనంతరం 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్ 137 పరుగులకు ఆలౌటైంది. సిడ్నీ బ్యాటర్లలో బ్రౌన్(34) పరుగులతో టాప్ రాణించింది. అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలర్లలో డార్సీ బ్రౌన్, డాటిన్ తలా రెండు వికెట్లు సాధించగా.. స్కాట్, మెక్‌గ్రాత్, వెల్లింగటన్ చెరో వికెట్ సాధించారు. ఇక అడిలైడ్ స్ట్రైకర్స్‌కు చెందిన దియోంద్ర డాటిన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకోగా, సిడ్నీ సిక్సర్స్ ప్లేయర్ అష్లే గార్డ్నర్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికైంది. చదవండి: IPL 2023: పెద్దగా పరిచయం లేని ఆటగాళ్లకు భారీ ధర.. అసలు ఎలా ఎంపిక చేస్తారు? -
బిగ్‌బాష్ లీగ్ నుంచి వైదొలిగిన హర్మన్‌ప్రీత్
భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆ్రస్టేలియాలో జరుగుతున్న మహిళల బిగ్‌బాష్ లీగ్ టి20 టోర్నీ నుంచి వైదొలిగింది. వెన్ను నొప్పితో ఈ సీజన్లో తాను పాల్గొనడంలేదని హర్మన్ తెలిపింది. గత ఏడాది మెల్బోర్న్ రెనెగెడ్స్ తరఫున ఆడిన హర్మన్ 406 పరుగులు చేసి, 15 వికెట్లు పడగొట్టి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు గెల్చుకుంది. ఇటీవల ఆసియా కప్ టి20 టోర్నీలో హర్మన్ సారథ్యంలో భారత జట్టు విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. -
కొత్త రూల్ ప్రవేశపెట్టనున్న బీసీసీఐ.. ఇన్నింగ్స్ మధ్యలో ఆటగాడిని మార్చేయవచ్చు
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) దేశవాళీ క్రికెట్లో కొత్త రూల్‌ను ప్రవేశపెట్టనుంది. వచ్చే నెలలో (అక్టోబర్) ప్రారంభంకానున్న సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ నుంచి 'ఇంపాక్ట్ ప్లేయర్' అనే నయా రూల్‌ను అమల్లోకి తేనుంది. ఈ రూల్ అమల్లోకి వస్తే ఇన్నింగ్స్ మధ్యలో ఆటగాడిని మార్చుకునే వెసలుబాటు లభిస్తుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం.. ఇన్నింగ్స్ ప్రారంభమయ్యాక 14 ఓవర్ల లోపు ఇరు జట్లు ఒక్కో ఆటగాడిని మార్చుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా మ్యాచ్ మధ్యలో ఆటగాడికి గాయమైనా లేక ఆనారోగ్యం బారిన పడినా అతని స్థానంలో మరో ఆటగాడు (సబ్‌స్టిట్యూట్) బరిలోకి దిగుతాడు. ఇక్కడ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఆటగాడు కేవలం ఫీల్డింగ్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. అదే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రకారం అయితే బౌలింగ్ చేసే జట్టులో ఇన్నింగ్స్ 14 ఓవర్లలోపు ఆటగాడు గాయపడినా లేదా మ్యాచ్ అప్పటి స్థితిగతులను బట్టి ఓ ఆటగాడిని మార్చుకోవాలని భావించినా ఓవర్ ముగిశాక కెప్టెన్ లేదా హెడ్ కోచ్ లేదా మేనేజర్లలో ఎవరో ఒకరు ఫీల్డ్ అంపైర్ లేదా ఫోర్త్ అంపైర్‌కు సమాచారం అందిస్తే ఆటగాడిని మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన ఆటగాడు బ్యాటింగ్‌తో పాటు 4 ఓవర్ల పాటు బౌలింగ్ కూడా చేయవచ్చు. అదే బ్యాటింగ్ చేసే జట్టు వికెట్ పడ్డాక ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్ గురించి అంపైర్‌కు సమాచారం అందిస్తే ఆటగాడిని మార్చుకునే వెసలుబాటు ఉంటుంది. ఇందుకోసం ఇరు జట్లు టాస్ సమయంలో ప్లేయింగ్ ఎలెవెన్‌తో పాటు నలుగురు ఇంపాక్ట్ ప్లేయర్స్ జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. తప్పనిసరి కాని ఈ ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ప్రకారం ఒక్కసారి జట్టును వీడిన ఆటగాడు తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం (ఆ మ్యాచ్ వరకు) ఉండదు. ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో మాత్రమే అమల్లో ఉన్న ఈ రూల్ త్వరలో సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలోనూ అమల్లోకి రానుంది. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్లో సైతం ప్రవేశ పెట్టాలని బీసీసీఐ యోచిస్తుంది. క్రికెట్‌తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ ఫుట్‌బాల్, రగ్బీ, బాస్కెట్ బాల్ వంటి క్రీడల్లో కూడా అమల్లో ఉంది. ఈ రూల్ అమల్లోకి వస్తే క్రికెట్ మరింత రసవత్తరంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
మెల్బోర్న్ స్టార్స్ తరఫున ఆడనున్న టీమిండియా స్టార్ బ్యాటర్
ఆస్ట్రేలియాలో అక్టోబర్ 13 నుంచి జరిగే మహిళల బిగ్‌బాష్ లీగ్ టి20 క్రికెట్ టోర్నీలో భారత స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ బరిలోకి దిగనుంది. 22 ఏళ్ల జెమీమా మెల్బోర్న్ స్టార్స్ జట్టు తరఫున ఆడనుంది. గత సీజన్లో మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన జెమీమా 333 పరుగులు సాధించింది. ఈ ఏడాది బిగ్‌బాష్ లీగ్‌లో జెమీమాతోపాటు హర్మన్‌ప్రీత్ కౌర్ (మెల్బోర్న్ రెనెగేడ్స్), పూజా వస్త్రకర్ (బ్రిస్బేన్ హీట్) కూడా ఆడనున్నారు. -
మెల్బోర్న్ స్టార్స్ తరపున ఆడనున్న భారత స్టార్ బ్యాటర్
భారత మహిళా జట్టు స్టార్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ బిగ్ బాష్ లీగ్-2022లో మెల్బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. దీంతో మెల్బోర్న్ స్టార్స్‌తో ఒప్పందం కుదర్చుకున్న మొదటి భారత క్రికెటర్‌గా రోడ్రిగ్స్ నిలిచింది. కాగా గత బీబీఎల్ సీజన్లో మెల్బోర్న్ రెనెగేడ్స్ తరుపున ఆడిన రోడ్రిగ్స్ అద్భుతంగా రాణించింది. ఆమె గతేడాది టోర్నీలో 116 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 333 పరుగులు చేసింది. ఇక 2018లో భారత్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రోడ్రిగ్స్.. ఇప్పటి వరకు 58 టీ20లు, 21 వన్డేల్లో ఆడింది. ఇక ఇప్పటికే పలు భారత మహిళా క్రికెటర్లు బిగ్‌బాష్ లీగ్‌లో పలు ఫ్రాంచైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. బిగ్ బాష్ లీగ్‌లో భారత స్టార్ క్రికెటర్లు ఇక ఇప్పటికే భారత మహిళా క్రికెటర్లు బిగ్‌బాష్ లీగ్‌లో పలు ఫ్రాంచైజీలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. వారిలో స్మృతి మంధాన, దీప్తి శర్మ (సిడ్నీ థండర్), షఫాలీ వర్మ, రాధా యాదవ్ (సిడ్నీ సిక్సర్స్) తరపున ఆడగా.. రిచా ఘోష్ (హోబర్ట్ హరికేన్స్) హర్మన్‌ప్రీత్ కౌర్ ( మెల్ బోర్న్ రెనెగేడ్స్ ),రాధా యాదవ్ ( సిడ్నీ సిక్సర్స్) తరపున ప్రాతనిధ్యం వహిస్తున్నారు. చదవండి: Suresh Raina Retirement: సురేష్ రైనా సంచలన నిర్ణయం.. క్రికెట్‌కు గుడ్‌బై -
సౌతాఫ్రికా టీ20 లీగ్‌పై కన్నేసిన భారత అండర్ 19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్
భారత అండర్-19 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ (2012) ఉన్ముక్త్ చంద్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభంకాబోయే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో (ఎస్ఏ20) తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఉన్ముక్త్.. సెప్టెంబర్ 19న జరిగే ఎస్ఏ20 లీగ్ వేలం కోసం తన పేరును రిజిస్టర్ చేయించుకున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియాలో జరిగే బిగ్ బాష్ లీగ్‌లో పాల్గొన్న మొట్టమొదటి భారత పురుష క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పిన ఉన్ముక్త్.. ఎస్ఏ20 లీగ్ వేలంలో కూడా అమ్ముడుపోతే, అక్కడ ఆడబోయే తొలి భారత క్రికెటర్‌గానూ రికార్డు నెల్పుతాడు. కాగా, 2012 వరల్డ్ కప్ విజయం తర్వాత రాత్రికిరాత్రి హీరో అయిపోయిన ఉన్ముక్త్.. ఆతర్వాత క్రమంగా అవకాశాలు కనుమరుగు కావడంతో భారత్‌ను వదిలి అమెరికాకు వలస పోయాడు. అక్కడ యూఎస్ మైనర్ క్రికెట్ లీగ్‌లో పాల్గొన్న ఉన్ముక్త్.. బిగ్ బాష్ లీగ్ 2022లో మెల్బోర్న్ రెనెగేడ్స్ తరఫున అవకాశం రావడంతో ఆస్ట్రేలియాకు మకాం మార్చాడు. ఉన్ముక్త్ 2024 టీ20 వరల్డ్‌కప్‌లో యూఎస్ఏ తరఫున ఆడాలని ఆశిస్తున్నాడు. ఉన్ముక్త్ 2012 ఫైనల్లో ఆస్ట్రేలియాపై అజేయమైన 111 పరుగులు చేసి, యువ భారత్‌ను జగజ్జేతగా నిలబెట్టాడు. ఐపీఎల్లో ఢిల్లీ డేర్ డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లకు ఆడిన ఉన్ముక్త్.. ఆశించిన స్థాయి ప్రదర్శన కనబర్చ లేక అక్కడి నుంచి కూడా ఔటయ్యాడు. చదవండి: టీమిండియాకు ఆడాలనుకున్నాడు.. అయితే అదే జట్టుకు ప్రత్యర్ధిగా..! -
వార్నర్ అభిమానులకు గుడ్ న్యూస్.. తొమ్మిదేళ్ల తర్వాత ఆ లీగ్‌లో రీ ఎంట్రీ!
ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొమ్మిదేళ్ల తర్వాత బిగ్‌బాష్ లీగ్‌లో అడుగుపెట్టనున్నాడు. ఈ మెరకు బిగ్‌బాష్ లీగ్ 12వ సీజన్ ముందు సిడ్నీ థండర్‌తో రెండు సంవత్సరాల ఒప్పందాన్ని వార్నర్ కుదుర్చుకున్నాడు. ఈ విషయాన్ని సిడ్నీ థండర్ ఆదివారం సోషల్ మీడియాలో వెల్లడించింది. వచ్చే ఏడాది జనవరిలో దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ముగిసిన అనంతరం వార్నర్ జట్టులో చేరనున్నాడని సిడ్నీ థండర్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఆట పట్ల పూర్తి అంకితభావంతో ఉంటా ఇక ఇదే విషయంపై వార్నర్ స్పందిస్తూ.. నా బిగ్‌బాష్ కెరీర్‌ను ప్రారంభించిన జట్టులోకి మళ్లీ తిరిగి రావడం నాకు సంతోషంగా ఉంది. నేను నా ఆట పట్ల పూర్తి అంకితభావంతో ఉంటాను.. ఒక ప్రొఫెషనల్ క్రికెటర్‌గా నా సీనియర్లు చూపిన మార్గం నుంచి స్ఫూర్తిని పొందుతూ ఎల్లవేళలా ఆటను ఆస్వాదిస్తూ ఉంటా. అదే విధంగా బిగ్‌బాష్ లీగ్ నుంచి భవిష్యత్తు ఆటగాళ్లను తయారు చేయడంతో నా వంతు పాత్ర పోషిస్తాను అని పేర్కొన్నాడు. కాగా 2011 బిగ్‌బాష్ లీగ్ తొలి సీజన్లో వార్నర్ అరేంగట్రం చేసినప్పటికీ.. అంతర్జాతీయ షెడ్యూల్, తదితర కారణాల వల్ల ఇప్పటి వరకు కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. వార్నర్ ఈ లీగ్‌లో చివరసారిగా 2014 సీజన్లో కనిపించాడు. ఇక బిగ్‌బాష్ లీగ్(2022-23) సీజన్ డిసెంబర్13 నుంచి ఫిబ్రవరి 4 వరకు జరగనుంది. మరో వైపు డేవిడ్ భాయ్ యూఏఈ సరికొత్త టీ20లీగ్‌లో కూడా భాగం కానున్నట్లు తెలుస్తోంది. He's BACK. ⚡️@davidwarner31 signs with Sydney Thunder for two seasons ahead of #BBL12! ✍️ pic.twitter.com/pdEDcO6uLl — KFC Big Bash League (@BBL) August 20, 2022 చదవండి: IND vs ZIM: దీపక్ హుడా అరుదైన రికార్డు.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా! -
ఇంగ్లండ్ కెప్టెన్‌కు సర్జరీ.. భారత్‌తో సిరీస్‌కు దూరం!
ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత మహిళలతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఇంగ్లండ్ సారథి హీథర్ నైట్ దూరం కానుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడిన నైట్.. ప్రస్తుతం తన తుంటి ఎముక గాయానికి సర్జరీ చేయించుకుంది. దీంతో ఆమె కొన్ని నెలలపాటు క్రికెట్‌కు దూరంగా ఉండనుంది. ఈ క్రమంలోనే భారత్‌తో జరగనున్న సిరీస్‌కు, మహిళల బిగ్‌బాష్ లీగ్‌కు నైట్ దూరం కానుంది. కాగా ఆమె ఈ గాయం కారణంగానే కామన్వెల్త్ గేమ్స్-2022, ది హండ్రెడ్ సీజన్ నుంచి తప్పుకుంది. ఇక ఇదే విషయాన్ని నైట్ కూడా దృవీకరించింది. "నేను నా తుంటి ఎముక గాయానికి సర్జరీ చేయించుకున్నాను. మళ్లీ ఎప్పటి మాదిరిగానే మైదానంలో పరిగెత్తడానికి సిద్దమవుతాను. అయితే దురదృష్టవశాత్తూ ఈ గాయం నన్ను భారత్ సిరీస్, మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో భాగం కాకుండా చేసింది. కానీ ఈ ఏడాది అఖరి నాటికి తిరిగి జట్టులోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను" నైట్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. భారత్‌తో జరిగే సిరీస్‌కు నైట్ స్థానంలో ఆ జట్టు ఆల్‌రౌండర్ స్కైవర్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా ఆమెనే ఇంగ్లండ్ సారథిగా బాధ్యతలు నిర్వర్తించింది. కాగా ఇంగ్లండ్ పర్యటలో భాగంగా భారత్ మూడు టీ20లు మూడు వన్డేలు ఆడనుంది. సెప్టెంబర్ 10న చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా జరగనున్న తొలి టీ20తో భారత పర్యటన ప్రారంభం కానుంది. చదవండి: ILT20: జట్టును ప్రకటించిన షార్జా వారియర్స్.. మోయిన్ అలీతో పాటు! -
ఆటగాళ్లకు కోట్లలో ఆఫర్.. సొంత లీగ్‌కు తూట్లు పొడిచే యత్నం!
క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిర్వహించే బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)కు ఆటగాళ్లు తూట్లు పొడిచే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఏడాది యూఏఈ వేదికగా జనవరిలో ఇంటర్నేషనల్ లీగ్(ఐఎల్టీ 20) ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో కోట్ల రూపాయలు కుమ్మరించి స్టార్ ఆటగాళ్లను ఆడించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీబీఎల్‌లో ఆడే 15 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఐఎల్టీలో ఆడేందుకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. రిపోర్ట్స్ ప్రకారం 15 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లకు భారత కరెన్సీలో దాదాపు రూ.30 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రతీఏటా బీబీఎల్ డిసెంబర్లో మొదలై.. ఫిబ్రవరిలో ముగుస్తుంది. ఇక ఈ ఏడాది డిసెంబర్ 13న మొదలుకానున్న బీబీఎల్ ఫిబ్రవరి 4 వరకు జరగనుంది.ఇదే సమయంలో ఇంటర్నేషనల్ లీగ్ టి20(ఐఎల్టీ 20) జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12 వరకు మొదటి ఎడిషన్ జరగనుంది. మొత్తం ఆరుజట్లు ఉండగా.. ఈ జట్లను దాదాపు ఐపీఎల్‌తో సంబంధమున్న సంస్థలే కొనుగోలు చేయడం విశేషం. యూఏఈ వేదికగా జరుగుతున్న తొలి సీజన్‌ను విజయవంత చేసేందుకు స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేయాలని అన్ని జట్లు టార్గెట్‌గా పెట్టుకున్నాయి. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీబీఎల్‌లో ఆడుతున్న 15 మంది ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లకు బీబీఎల్ వదిలేసి.. ఐఎల్టీ లీగ్‌లో పాల్గొనేందుకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యూఏఈ టి20 లీగ్‌లో ఒక్కో టీమ్‌కి 2.5 మిలియన్ డాలర్లు (రూ.20 కోట్లు) పర్సు వాల్యూని కేటాయించారు. దీంతో స్టార్ ప్లేయర్లను 450000 డాలర్లు (దాదాపు 3.5 కోట్లు) ఇచ్చి కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఐపీఎల్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ. కానీ మిగిలిన క్రికెట్ లీగులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. పొరుగుదేశం పాక్‌లో పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అత్యధికంగా చెల్లించే మొత్తం రూ.1.9 కోట్లు మాత్రమే... ఐపీఎల్ తర్వాత అత్యంత పాపులారిటీ దక్కించుకున్న బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)లోనూ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. దీంతో యూఏఈ లీగ్ ఫ్రాంఛైజీ ఓనర్లు, బిగ్‌బాష్ లీగ్ ఆడకుండా అదే సమయంలో యూఏఈ టీ20 లీగ్‌లో ఆడేందుకు 15 మంది ఆస్ట్రేలియా క్రికెటర్లకు రూ.4 కోట్ల దాకా కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ఆశచూపిస్తున్నారని సమాచారం. రూ.4 కోట్లంటే ఐపీఎల్లో అన్క్యాప్డ్ రిజర్వు ప్లేయర్‌కి ఇచ్చే మొత్తం. అయితే బీబీఎల్ ద్వారా వచ్చే దానితో పోల్చుకుంటే, ఆసీస్ క్రికెటర్లకు ఇది చాలా ఎక్కువ మొత్తమే. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియాకి భయం పట్టుకుంది. అయితే బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్లో ఆడే ఆటగాళ్లు విదేశీ లీగ్‌ల్లో ఆడాలంటే అనుమతి తప్పనిసరి. కానీ బిగ్‌బాష్ లీగ్‌లో ఆటగాళ్లకు అలాంటి అవసరం లేదు. లీగ్‌లో ఆడాలా వద్దా అనేది ఆటగాళ్ల నిర్ణయానికే వదిలేస్తుంది అక్కడి సీఏ(క్రికెట్ ఆస్ట్రేలియా). అందుకే 2014 నుంచి ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు బీబీఎల్ ఆడింది లేదు. వార్నర్ ఒక్కడే కాదు.. చాలా మంది ఆసీస్ క్రికెటర్లు బీబీఎల్‌ను మధ్యలోనే వదిలేసి వేరే లీగ్ ఆడేందుకు వెళ్లిపోతుంటారు. ఆసీస్ క్రికెటర్లు ఆ డబ్బుకి ఆశపడి యూఏఈ టీ20 లీగ్‌లో ఆడాలని నిర్ణయం తీసుకుంటే, స్టార్ ప్లేయర్లు లేకుండా బీబీఎల్‌ని నిర్వహించాల్సి ఉంటుంది. మిగిలిన దేశాల ప్లేయర్లు కూడా యూఏఈ టీ20 లీగ్ ఆడేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తే బీబీఎల్ నిర్వహణే కష్టమైపోతుంది. దీంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటోందట ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. బీసీసీఐ మాదిరిగానే తమ ప్లేయర్లు, విదేశీ టీ20ల్లో లీగుల్లో పాల్గొనకుండా నియంత్రించాలనే ఆలోచనలో కూడా సమాచారం. ఇక ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కి యూఏఈ నుంచి 7 లక్షల డాలర్లు (దాదాపు 5.5 కోట్లు) ఆఫర్ వచ్చిందని, అలాగే ఆసీస్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌కి కూడా దాదాపు రూ.6 లక్షల డాలర్లకు పైగా ఆఫర్ వచ్చందని... ఈ ఇద్దరూ యూఏఈ టీ20 లీగ్‌లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియాని అనుమతి కోరినట్టు వార్తలు వస్తున్నాయి. చదవండి: NED vs NZ: పసికూనపై కివీస్ ప్రతాపం.. సిరీస్ క్లీన్‌స్వీప్ Andrew Symonds: అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్‌కు ఆండ్రూ సైమండ్స్ పేరు..! -
డేవిడ్ వార్నర్‌కు భారీ ఆఫర్.. 'ఆ లీగ్'లో ఆడించేందుకు విశ్వ ప్రయత్నాలు
David Warner: ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను బిగ్ బాష్ లీగ్‌లో (బీబీఎల్) ఆడించే నిమిత్తం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారీ ఆఫర్‌తో ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. వార్నర్ బీబీఎల్‌లో ఆడేందుకు ఒప్పుకుంటే 5 లక్షల డాలర్ల వరకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఏకు చెందిన కీలక ప్రతినిధి వెల్లడించారు. నివేదికల ప్రకారం..బీబీఎల్ అఫీషియల్ బ్రాడ్ కాస్టర్ అయిన ఛానెల్ 7తో క్రికెట్ ఆస్ట్రేలియాకు న్యాయపరమైన చిక్కులు ఏర్పడ్డాయి. ఛానల్ 7తో ఒప్పందం సమయంలో బీబీఎల్ భారీ సంఖ్యలో వ్యూయర్ షిప్ దక్కించుకుంటుందని సీఏ హామీ ఇచ్చింది. అయితే ఊహించిన దాంట్లో సగం వ్యూయర్ షిప్ కూడా రాకపోవడంతో సీఏపై ఛానల్ 7 దావా వేసింది. బీబీఎల్‌లో క్వాలిటీ ఆటగాళ్లు లేరని, అందు వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని ఛానల్ 7 వాదిస్తుంది. దీంతో సీఏ దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. డేవిడ్ వార్నర్ లాంటి స్టార్ ఆటగాళ్లను బీబీఎల్ బరిలోకి దించితే వ్యూయర్ షిప్ భారీగా పెరుగుతుందని భావిస్తుంది. ఇందుకోసం వార్నర్‌కు ఊహకందని భారీ మొత్తం ఆఫర్ చేయాలని నిర్ణయించుకుంది. అంతర్జాతీయ షెడ్యూల్, తదితర కారణాల వల్ల వార్నర్ ఇప్పటివరకు కేవలం మూడే మూడు బీబీఎల్ మ్యాచ్‌లు ఆడాడు. అతను చివరిసారిగా బీబీఎల్ 2014 సీజన్లో కనిపించాడు. ఇదిలా ఉంటే, వార్నర్ వచ్చే ఏడాది బీబీఎల్ సమయానికి యూఏఈలో జరిగే టీ20 లీగ్‌లో ఆడాలని భావిస్తున్నట్లు అతని మేనేజర్ తెలిపాడు. యూఏఈ లీగ్‌లో పాల్గొనే ఆరు జట్లను ఐపీఎల్ ఫ్రాంచైజీలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వార్నర్‌కు యూఏఈ లీగ్‌లోని ఫ్రాంచైజీలు కూడా భారీ మొత్తంలో ఆఫర్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ వార్నర్ బీబీఎల్‌ను కాదని యూఏఈ లీగ్‌లో ఆడితే బీబీఎల్ ప్రసారదారు ఛానల్ 7కు భారీ నష్టం వస్తుందని అంచనా. ఆసీస్ ప్రేక్షకులు వార్నర్ కోసం బీబీఎల్‌ను కాదని యూఏఈ లీగ్‌ను చూసే అవకాశాలే ఎక్కువ. చదవండి: అదరగొట్టిన సూర్యకుమార్.. నెం1 స్థానానికి చేరువలో! -
బిగ్‌బాష్ లీగ్ లో ఆడనున్న భారత ఆల్ రౌండర్..!
భారత ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ మహిళల బిగ్ బాష్ లీగ్-2022లో తొలి సారి ఆడనుంది. ఈ మెరకు బ్రిస్బేన్ హీట్‌తో పూజా తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా బ్రిస్బేన్ హీట్ వెల్లడించింది. కాగా న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ అమేలియా కెర్ తర్వాత బ్రిస్బేన్ హీట్‌కు పూజా రెండో విదేశీ క్రికెటర్ కావడం గమనార్హం. గత ఏడాది ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టు తరపున వస్త్రాకర్ అద్భుతంగా రాణించింది. అదే విధంగా ఈ ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లోనూ పూజా తన ప్రదర్శనతో అకట్టుకుంది. వరల్డ్‌కప్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన పూజా.. 156 పరుగులతో పాటు 10 వికెట్లు పడగొట్టింది. ఇక కామన్వెల్త్ గేమ్స్-2022కు ప్రకటించిన భారత జట్టులో పూజా భాగంగా ఉంది. అయితే ఆమె కరోనా బరిన పడడంతో ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి మ్యాచ్‌కు దూరం కానుంది. బిగ్ బాష్ లీగ్‌లో భారత స్టార్ క్రికెటర్లు ఇప్పటికే భారత స్టార్ మహిళా క్రికెటర్లు బిగ్ బాష్ లీగ్‌లో భాగమయ్యారు. వారిలో స్మృతి మంధాన, దీప్తి శర్మ (సిడ్నీ థండర్), షఫాలీ వర్మ, రాధా యాదవ్ (సిడ్నీ సిక్సర్స్) తరపున ఆడగా.. రిచా ఘోష్ (హోబర్ట్ హరికేన్స్) హర్మన్‌ప్రీత్ కౌర్ ( మెల్ బోర్న్ రెనెగేడ్స్ ),రాధా యాదవ్ ( సిడ్నీ సిక్సర్స్) తరపున ప్రాతనిధ్యం వహిస్తున్నారు. చదవండి: Prabath Jayasuriya: టెస్ట్ క్రికెట్లో నయా సెన్సేషన్.. తొలి మూడు టెస్ట్‌ల్లో ఏకంగా 29 వికెట్లు..! -
BBL 2022-23: మరో మహా సంగ్రామం ఎప్పటి నుంచి అంటే..?
Big Bash League 2022-23: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో సక్సెస్ అయిన మరో క్రికెట్ లీగ్ ఏదైనా ఉందంటే.. అది ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్‌యేనన్నది జగమెరిగిన సత్యం. తాజాగా ఈ మహా సంగ్రామానికి సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. 2022-23 సీజన్ పురుషుల వెర్షన్ ఈ ఏడాది డిసెంబర్ 13 నుంచి ప్రారంభంకానుండగా.. మహిళల బీబీఎల్ అంతకంటే రెండు నెలల ముందు అక్టోబర్ 13 నుంచి స్టార్ట్ అవుతుంది. Our heroes are returning home! For the first time in three years, every Club is playing at home and we couldn't be more pumped 🤩 Full #WBBL08 schedule deets: https://t.co/oUaicm0FOH pic.twitter.com/oXPyYwRr71 — Weber Women's Big Bash League (@WBBL) July 6, 2022 సిడ్నీ థండర్స్, మెల్బోర్న్ స్టార్స్ మధ్య మ్యాచ్‌తో పురుషుల బీబీఎల్ మొదలుకానుండగా.. బ్రిస్బేన్ హీట్, సిడ్నీ సిక్సర్ మధ్య మ్యాచ్‌తో మహిళల టోర్నీ ప్రారంభంకానుంది. మహిళల టోర్నీ అక్టోబర్ 13న మొదలై నవంబర్ 27 వరకు జరుగనుండగా.. పురుషుల లీగ్ డిసెంబర్ 13 నుంచి వచ్చే ఏడాది (2023) జనవరి 25 వరకు జరుగుతుంది. ఈ రెండు లీగ్‌లకు సంబంధించిన ఫిక్షర్స్ వివరాలు ఇలా ఉన్నాయి.. 🗓 #BBL12 SCHEDULE 🗓 The 12th instalment of the Big Bash is coming your way this summer! pic.twitter.com/npDQAd7U7c — KFC Big Bash League (@BBL) July 14, 2022 చదవండి: BBL: మరోసారి రెనెగేడ్స్‌తో జట్టు కట్టిన భారత కెప్టెన్! -
బిగ్‌బాష్ లీగ్‌లో ఆడనున్న ఆర్సీబీ కెప్టెన్..!
దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, ఆర్సీబీ కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ ఈ బిగ్ బాష్ లీగ్‌లో ఆడేందుకు సిద్దమయ్యాడు. బిగ్ బాష్ లీగ్ 12వ సీజన్ ఓవర్సీస్ డ్రాఫ్ట్ నామినీల జాబితాలో తన పేరును డుప్లెసిస్ నమోదు చేసుకున్నాడు. ఇక బిగ్ బాష్ లీగ్‌లో ఇప్పటి వరకు డుప్లెసిస్ కేవలం ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. 2012 సీజన్లో మెల్బోర్న్ రెనెగేడ్స్ తరపున ఫాప్ ప్రాతినిధ్యం వహించాడు. ఈ మ్యాచ్‌లో 17 బంతులు ఆడిన డుప్లెసిస్ కేవలం 14 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇక ఈ ఏడాది టోర్నమెంట్ హాఫ్ సీజన్‌కు డుప్లెసిస్ అందు బాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా అత్యధిక జీతం కలిగిన ప్లాటినం విభాగంలో డుప్లెసిస్ చోటు దక్కించుకోవచ్చు అని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ కేటగిరీలో ఒక ఆటగాడు అత్యధికంగా 340,000 ఆస్ట్రేలియా డాలర్ల జీతం పొందుతాడు. ఇక అతడితో పాటు ఆ దేశ ఆటగాళ్లు రిలీ రోసోవ్, మార్చంట్ డి లాంగే కూడా తమ పేర్లును నమోదు చేసుకున్నారు. చదవండి: Ind Vs Eng: వాళ్లకు ఐపీఎల్ ముఖ్యం.. ఇది చాలా డేంజర్: బీసీసీఐపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఘాటు వ్యాఖ్యలు -
యాష్లే బార్టీ.. మనకు తెలియని యాంగిల్ ఏంటంటే
ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ 2022 టైటిల్‌ను యాష్లే బార్టీ తొలిసారి గెలిచిన సంగతి తెలిసిందే. డానియెల్ కొలిన్స్‌తో జరిగిన ఫైనల్లో బార్టీ 6-3, 7-6(7-2)తో వరుస సెట్లలో ఓడించి తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ సొంతం చేసుకుంది. 25 ఏళ్ల యాష్లే బార్టీ 2019లో ఫ్రెంచ్ ఓపెన్, 2021లో వింబుల్డన్‌ను గెలుచుకుంది. తాజాగా సాధించిన ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ బార్టీ కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ కావడం విశేషం. ఇక యూఎస్ ఓపెన్ ఒక్కటి గెలిస్తే యాష్లే బార్టీ కెరీర్ గ్రాండ్‌స్లామ్ పూర్తి చేసుకోనుంది. కాగా 2021 ఏడాదిని నెంబర్‌వన్ ర్యాంక్‌తో ముగించిన బార్టీ.. స్టెఫీ గ్రాఫ్, మార్టినా నవ్రతిలోవా, సెరెనా విలియమ్స్, క్రిస్ ఎవర్ట్ సరసన నిలిచింది. చదవండి: Ashleigh Barty: ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత యాష్లే బార్టీ.. 44 ఏళ్ల రికార్డు బద్దలు బార్టీ గురించి మనకు తెలియని యాంగిల్.. ఇక యాష్లే బార్టీ గురించి మనకు తెలియని యాంగిల్ ఒకటి దాగుంది. అదేంటో తెలుసా 2015లో కొన్ని రోజులు బిగ్‌బాష్ లీగ్‌లో క్రికెట్ ఆడింది. బార్టీ వుమెన్స్ క్రికెటర్‌గా మారడానికి ఒక కారణం ఉంది. 2014 యూఎస్ ఓపెన్ తర్వాత యాష్లే బార్టీ సుధీర్ఘ విరామం తీసుకుంది. ఆ సమయంలో ఆమెను టెన్నిస్‌ను పూర్తిగా వదిలేసి.. ఒక సాధారణ టీనేజీ అమ్మాయిలా జీవితం కొనసాగించింది. ఈ సమయంలోనే ఆమెకు క్రికెట్‌వైపు మనసు మళ్లింది. అలా 2015లో బార్టీ క్రికెట్‌వైపు అడుగులు వేసింది. అనుకుందే తడవుగా క్వీన్స్లాండ్ ఫైర్‌కు క్రికెట్ కోచ్‌గా వ్యవహరిస్తున్న ఆండీ రిచర్డ్స్‌ను కలిసి తన మనసులోని కోరికను బయటపెట్టింది. బార్టీ వచ్చి తనను అడిగిన విధానం రిచర్డ్స్కు బాగా నచ్చి ఆమెకు క్రికెట్లో మెళుకువలు నేర్పాడు. కొన్ని నెలల్లోనే క్రికెట్‌పై మంచి పట్టు సాధించిన బార్టీ వెస్ట్రన్ సబరబ్స్ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్‌కు ఆడింది. ఆ తర్వాత బ్రిస్బేన్ వుమెన్స్ ప్రీమియర్ టి20 లీగ్‌లో యాష్లే బార్టీ పాల్గొంది. చదవండి: Rafael Nadal: రెండు నెలల క్రితం రిటైర్మెంట్ ఆలోచన.. కట్‌చేస్తే బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ తరపున.. భారత్‌తో ఐపీఎల్ ఎంత పాపులరో.. ఆస్ట్రేలియా క్రికెట్లో బిగ్‌బాష్ లీగ్‌కు అంతే ప్రాధాన్యముంది. వెస్ర్టన్ సబ్రబ్స్ తరపున ఫైనల్లో బార్టీ 39 బంతుల్లో 37 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించింది. దీంతో బిగ్‌బాష్ లీగ్ ఫ్రాంచైజీ బ్రిస్బేన్ హీట్ ఆమెతో ఒప్పందం కుదుర్చుకుంది. 2015 బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బేన్ హీట్ తరపున బరిలోకి దిగిన యాష్లే బార్టీ మెల్బోర్న్ స్టార్స్‌తో జరిగిన డెబ్యూ మ్యాచ్‌లో 27 బంతుల్లో 39 పరుగులు చేసింది. ఆ సీజన్లో బార్టీ రెగ్యులర్ ప్లేయర్‌గా కొనసాగింది. ఈ సీజన్లో బ్రిస్బేన్ హీట్ 14 మ్యాచ్‌ల్లో ఏడు మ్యాచ్‌లు గెలిచింది. ఇక 2016లో యాష్లే బార్టీ తిరిగి టెన్నిస్‌లోకి అడుగుపెట్టింది. వస్తూనే పారిస్ వేదికగా రోలాండ్ గారోస్ టెన్నిస్ టోర్నమెంట్లో విజృంభించిన బార్టీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక అక్కడి నుంచి బార్టీకి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. 🖤💛❤️ The moment Evonne Goolagong Cawley crowned @ashbarty the #AusOpen women's singles champion 🏆#AO2022 pic.twitter.com/ASBtI8xHjg — #AusOpen (@AustralianOpen) January 29, 2022 -
మ్యాచ్ గెలిచిన ఆనందం.. ముక్కులో నుంచి రక్తం
బిగ్‌బాష్ లీగ్ 11వ సీజన్ విజేతగా పెర్త్ స్కార్చర్స్ నిలిచిన సంగతి తెలిసిందే. సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన ఫైనల్లో 79 పరుగుల తేడాతో విజయం అందుకున్న పెర్త్ స్కార్చర్స్ నాలుగోసారి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన జై రిచర్డ్సన్ ఒక వింత అనుభవం ఎదురైంది. విజయంలో భాగంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సమయంలో రిచర్డ్సన్ను ఇంటర్య్వూ చేసిన బ్రాడ్ హగ్ ఏమైంది అని అడిగాడు. చదవండి: Daniil Medvedev: అంపైర్‌ను బూతులు తిట్టిన స్టార్ టెన్నిస్ ప్లేయర్ ''మ్యాచ్ విజయం తర్వాత సంబరాలు చేసుకుంటున్న సమయంలో స్క్వేర్‌లెగ్ దిశ నుంచి ఎవరో వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చారు. అతని భుజం నా ముక్కుకు బలంగా తాకింది. దీంతో నా ముక్కు నుంచి రక్తం కారడం మొదలైంది. ఇది ఒకరకంగా నాకు ఒక మొమోరీగా ఉండిపోతుంది.'' అని రిచర్డ్సన్ సమాధానమిచ్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. When celebrations go wrong, featuring Jhye Richardson 😂 pic.twitter.com/xAkvP59fqy — 7Cricket (@7Cricket) January 28, 2022 -
కప్పలా నోరు తెరిచాడు.. ఏమైంది గిల్లీ!
ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్ కప్పలా నోరు తెరిచాడు. బీబీఎల్ 11వ సీజన్లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న గిల్లీ.. మ్యాచ్‌లో ఒక బ్యాటర్ కొట్టిన షాట్‌కు షాక్‌తో నోరు తెరిచాడు. ఈ సంఘటన పెర్త్ స్కార్చర్స్ ఇన్నింగ్స్‌లో చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఇవాన్స్ ఒక బంతిని భారీ సిక్స్ కొట్టాడు. లాంగాన్ దిశగా వెళ్లిన ఆ సిక్స్ స్టాండ్స్‌లోని లోవర్ కవర్‌కు తగిలి ప్రేక్షకుల మధ్యలో పడింది. ఇవాన్స్ షాట్‌ను కామెంటరీ బాక్స్ నుంచి చూసిన గిల్‌క్రిస్ట్.. గుడ్షాట్.. అంటూ కప్పలా కాసేపు నోరు తెరిచాడు. ఆ సమయంలో గిల్‌క్రిస్ట్‌ను కెమెరాలు క్లిక్‌మనిపించాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 11) సీజన్ విజేతగా పెర్త్ స్కార్చర్స్ నిలిచింది. సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన ఫైనల్లో పెర్త్ స్కార్చర్స్ 79 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పెర్త్ స్కార్చర్స్ బీబీఎల్ టైటిల్ గెలవడం నాలుగోసారి కాగా.. సిడ్నీ సిక్సర్స్‌ను ఫైనల్లో ఓడించడం ఇది మూడోసారి.76 పరుగులు నాటౌట్‌తో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన పెర్త్ స్కార్చర్స్ బ్యాట్స్‌మన్ లారీ ఇవాన్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అయితే పెర్త్ స్కార్చర్స్ ఆరు ఓవర్లలో 25 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్ ఆస్టన్ టర్నర్, లారీ ఇవాన్స్‌లు ఇన్నింగ్స్‌ను నిర్మించారు. ఈ ఇద్దరు కలిసి 59 బంతుల్లో 104 పరుగులు జతచేయడంతో పెర్త్ స్కార్చర్స్ భారీ స్కోరు చేయగలిగింది. The @foxcricket commentators reaction say it all 😯 Is this the shot of #BBL11? A BKT Golden Moment pic.twitter.com/c32higINi3 — cricket.com.au (@cricketcomau) January 28, 2022 -
సిడ్నీ సిక్సర్స్‌కు ఘోర పరాభవం.. బీబీఎల్ విజేత పెర్త్ స్కార్చర్స్
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 11) సీజన్ విజేతగా పెర్త్ స్కార్చర్స్ నిలిచింది. సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన ఫైనల్లో పెర్త్ స్కార్చర్స్ 79 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. పెర్త్ స్కార్చర్స్ బీబీఎల్ టైటిల్ గెలవడం నాలుగోసారి కాగా.. సిడ్నీ సిక్సర్స్‌ను ఫైనల్లో ఓడించడం ఇది మూడోసారి.76 పరుగులు నాటౌట్‌తో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన పెర్త్ స్కార్చర్స్ బ్యాట్స్‌మన్ లారీ ఇవాన్స్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చదవండి: Beth Mooney: దవడ విరిగింది.. ముఖానికి సర్జరీ.. పడిలేచిన కెరటం మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. లారీ ఇవాన్స్(41 బంతుల్లో 76, 4 ఫోర్లు; 4 సిక్సర్లు), ఆస్టన్ టర్నర్(35 బంతుల్లో 54, 4 ఫోర్లు, ఒక సిక్స్) రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 16.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. డేనియల్ హ్యూజెస్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పెర్త్ స్కార్చర్స్ బౌలర్లలో ఆండ్రూ టై 3, జై రిచర్డ్సన్ 2, జాసన్ బెండార్ఫ్, ఆస్టన్ టర్నర్, పీటర్ హట్జోగ్లో, ఆస్టన్ అగర్ తలా ఒక వికట్ తీశారు. That winning feeling 🤩🏆 #BBL11 pic.twitter.com/FCu3wVSvrJ — KFC Big Bash League (@BBL) January 28, 2022 It’s raining orange under the roof! 🏆 #BBL11 pic.twitter.com/KZgodUli2C — KFC Big Bash League (@BBL) January 28, 2022 -
ఒక చేతిలో ఫోన్.. మరో చేతితో స్టన్నింగ్ క్యాచ్
క్రికెట్లో కొన్ని క్యాచ్‌లు స్టన్నింగ్‌గా ఉంటాయి. ఒక ప్లేయర్ పడితే సూపర్.. అద్బుతం.. అమేజింగ్ అంటూ మెచ్చుకుంటాం. మరీ అదే మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకుడు ఒక చేతితో ఫోన్ పట్టుకొని.. మరో చేతితో వేగంగా వచ్చిన బంతిని ఒడిసి పట్టాడు. ఇంకముంది కెమెరాలన్నీ అతని వైపే తిరిగాయి. అయితే అతను క్రికెటర్ అయ్యుంటే ఈ న్యూస్ సంచలనంగా మారేది. చదవండి: BBL 2021-22: ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు కరోనా లేని ఆటగాళ్లు కావాలి.. వస్తే ఫ్రీ బీర్ బిగ్‌బాష్ లీగ్‌లో సిడ్నీ సిక్సర్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. అడిలైడ్ స్ట్రైకర్స్ ఇన్నింగ్స్‌లో ఆఖరి ఓవర్ తొలి బంతిని మాట్ రెన్షా లాంగాన్ దిశగా భారీ సిక్స్ కొట్టాడు. అతను ఫర్ఫెక్ట్ టైమింగ్‌తో కొట్టిన సిక్స్ స్టాండ్స్‌లోకి దూసుకెళ్లింది. స్టాండ్స్‌లో ఉన్న ఒక ప్రేక్షకుడు ఫోన్ మాట్లాడుతుండగానే.. బంతి అతని వద్దకు వచ్చింది. అయితే ఆ వ్యక్తి మాత్రం సింగిల్ హ్యాండ్‌తో క్యాచ్ తీసుకొని అందర్ని ఆశ్చర్యపరిచాడు. దీనికి సంబంధించిన వీడియోను లీగ్ నిర్వాహకులు తమ ట్విటర్లో షేర్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. వెల్స్ 62 నాటౌట్, ఇయాన్ కాక్బ్రెయిన్ 48, రెన్ షా 36 నాటౌట్ రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. శుక్రవారం జరగనున్న ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్.. పెర్త్ స్కార్చర్స్‌తో తలపడనుంది. చదవండి: Shakib Al Hasan: 'శ్రీవల్లీ' పాటకు బంగ్లా ఆల్‌రౌండర్ స్టెప్పులు.. ఊహించని ట్విస్ట్ Not many crowd catch opportunities on the second tier... and even less taken one-handed with the 📱 in the other mitt! @KFCAustralia | #BBL11 pic.twitter.com/JDqrXiEzcd — KFC Big Bash League (@BBL) January 26, 2022 -
'ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఆటగాళ్లు కావాలి.. వస్తే ఫ్రీ బీర్'
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 11వ సీజన్) చివరి అంకానికి చేరుకుంది. శుక్రవారం పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ సిక్సర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే సిడ్నీ సిక్సర్స్‌కు పెద్ద కష్టం వచ్చి పడింది. ఆ జట్టులోని ఆటగాళ్లు వరుసగా కోవిడ్ బారిన పడడంతో.. ఫైనల్ మ్యాచ్‌కు నిఖార్సైన 11 మంది ఆటగాళ్లు కరువయ్యారు. బుధవారం అడిలైడ్ స్ట్రైకర్స్ తో జరిగిన ప్లేఆఫ్‌కు ఒక ఆటగాడు తక్కువ కావడంతో అసిస్టెంట్ కోచ్‌గా ఉన్న జే లెంటెన్ను తుది జట్టులో ఆడించింది. అయితే మొయిసిస్ హెన్రిక్స్ సారధ్యంలోని సిడ్నీ సిక్సర్స్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి.. పెర్త్ స్కార్చర్స్‌తో తుదిపోరుకు సిద్ధమైంది. చదవండి: BBL 2021-22: మ్యాచ్ గెలిచి ఫైనల్‌కు.. ఆఖరి బంతికి డ్రామాలేంటి?! ఈ సందర్భంగా సిడ్నీ సిక్సర్స్ ఆటగాడు డేనియల్ క్రిస్టియన్ ఒక ఫన్నీ ట్వీట్ చేశాడు.'' పెర్త్ స్కార్చర్స్‌తో శుక్రవారం బీబీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాం. మా జట్టులో కొందరు కరోనా బారిన పడ్డారు. దీంతో ఫైనల్‌కు సరైన ఆటగాళ్లు లేరు.. మాకు కరోనా లేని ఆటగాళ్లు ఫైనల్ ఆడేందుకు కావాలి.. వస్తే వారికి ఫ్రీగా బీర్ కొనిపెడతా. మార్వెల్ స్టేడియంలో గురువారం సాయంత్రం 6:30 గంటలకు మా వార్మప్ ప్రారంభమవుతుంది. ఈలోపు వస్తే జట్టులో చోటుతో పాటు కప్ గెలిచిన తర్వాత ఫ్రీ బీర్ తాగొచ్చు. కానీ ఒక కండీషన్.. టెస్టు క్రికెటర్లకు మాత్రం చాన్స్ లేదు'' అంటూ ట్వీట్ చేశాడు. డేనియల్ క్రిస్టియన్ ఫన్నీ ట్వీట్‌కు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్, ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్లు స్పందించారు. ''ఫైనల్ ఆడేందుకు నేను సిద్ధం.. కానీ బౌలింగ్‌లో 4 ఓవర్ల కోటా బౌలింగ్‌కు గ్యారంటీ ఇస్తానంటేనే..'' అంటూ డివిలియర్స్ పేర్కొన్నాడు. '' సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా ఆడేందుకు కూడా రెడీ.. కానీ మీకు ఆల్రేడీ ఉన్న సబ్‌స్టిట్యూట్‌లకు డబ్బులు చెల్లించాలేమో'' అంటూ ఆర్చర్ రీట్వీట్ చేశాడు. చదవండి: Racial Discrimination: ఆ క్లబ్లో నల్లజాతి క్రికెటర్లకు చోటు లేదా? ఇదేం వివక్ష ఇక డిపెండింగ్ చాంపియన్ హోదాలో బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్ టోర్నీ ఆరంభం నుంచి అదరగొట్టింది. వరుసగా మూడోసారి ఫైనల్లో అడుగపెట్టింది. ఇప్పటికే మూడుసార్లు బీబీఎల్ టైటిల్(2011, 2020,2021) దక్కించుకున్న సిడ్నీ సిక్సర్స్.. తాజాగా నాలుగో టైటిల్‌పై కన్నేసింది. Shout out to anyone* in Melbourne that wants a game of cricket tomorrow night. My team is struggling to get 11 covid free, fit players on the park. Warm up starts at 6.30pm at Marvel Stadium. Free beer afterwards, potentially out of a large cup. DM if keen *no test cricketers — Dan Christian (@danchristian54) January 27, 2022 -
మ్యాచ్ గెలిచి ఫైనల్‌కు.. ఆఖరి బంతికి డ్రామాలేంటి?!
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో అడిలైడ్ స్ట్రైకర్స్, సిడ్నీ సిక్సర్ మధ్య జరిగిన ప్లేఆఫ్ మ్యాచ్ చివర్లో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. సిడ్నీ సిక్సర్స్ ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సి ఉంది. క్రీజులో హెడెన్ కెర్ 94 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. స్ట్రైకింగ్లోనూ అతనే ఉండడంతో సిడ్నీ సిక్సర్స్ ఈజీగానే విజయం సాధిస్తుందనుకున్నాం. అయితే నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న జోర్డాన్ సిల్క్ గాయపడ్డాడు. ఆఖరి బంతి తర్వాత ఎలాగో పెవిలియన్ చేరాల్సి ఉంటుంది. అయితే ఆఖరి బంతికి మందు గాయపడిన సిల్క్‌ను రిటైర్డ్‌హర్ట్‌గా వెనక్కిపిలిచి అతని స్థానంలో జే లెంటన్‌ను నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌కు పిలిచారు. చదవండి: Rovman Powell: 10 సిక్సర్లతో విండీస్ బ్యాటర్ విధ్వంసం క్రికెట్ పుస్తకాల ప్రకారం ఒక బ్యాట్స్‌మన్ ఆట చివర్లో గాయపడితే రిటైర్డ్‌హర్ట్‌గా అతని స్థానంలో కొత బ్యాట్స్‌మన్‌ను తీసుకోవచ్చు. కానీ సిక్సర్స్ ఆ రూల్‌ను ఫాలో అయ్యే లెంటన్‌ను తీసుకొచ్చింది. అయితే గెలిచే సమయానికి ఇలాంటి నిర్ణయం ఎందుకన్నది ఎవరికి అంతుచిక్కలేదు. పైగా ఆఖరి బంతికి ఫోర్ కొట్టి సెంచరీతో హెడెన్ కేర్ జట్టును ఫైనల్ చేర్చాడు. ''మ్యాచ్ ఎలాగో గెలిచారు.. మరి ఆఖర్లో ఈ డ్రామాలేంటి'' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. వెల్స్ 62 నాటౌట్, ఇయాన్ కాక్బ్రెయిన్ 48, రెన్ షా 36 నాటౌట్ రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఇక శుక్రవారం జరగనున్న ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్.. పెర్త్ స్కార్చర్స్‌తో తలపడనుంది. The @sixersBBL decision to retire Jordan Silk hurt on the final ball caught us all off-guard 🤔 #BBL11 pic.twitter.com/GbU2qfBgBi — KFC Big Bash League (@BBL) January 26, 2022 -
క్యాచ్ పట్టలేదని తిట్టిపోశారు.. కట్‌చేస్తే
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా సిడ్నీ థండర్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మ్యాచ్‌లో డేనియల్ సామ్స్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. అయితే అంతకముందు ఓవర్లో సింపుల్ క్యాచ్ జారవిడిచాడని డేనియల్ సామ్స్‌ను బౌలర్ తిట్టినంత పని చేశాడు. ఇది మనుసులో పెట్టుకున్నాడో లేక యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కానీ.. మరుసటి ఓవర్లోనే దిమ్మతిరిగే క్యాచ్ అందుకున్నాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్లో తన్వీర్ సంగా వేసిన మూడో బంతిని అలెక్స్ క్యారీ మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అక్కడే కాచుకొని ఉన్న డేనియల్ సామ్స్ పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేస్తూ రెండు చేతులతో సూపర్ క్యాచ్ తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: "పుష్ప" పాటకు చిందేసిన టీమిండియా మాజీ క్రికెటర్.. తగ్గేదేలే అంటూ..! ఇక మ్యాచ్ విషయానికి వస్తే అడిలైడ్ స్ట్రైకర్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఇయాన్ కాక్బెన్ 65 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసి విజయానికి 6 పరుగుల దూరంలో నిలిచిపోయింది. Don't let his subdued reaction fool you. Daniel Sams makes up for his earlier drop with a hanger in the deep! A BKT Golden Moment | #BBL11 pic.twitter.com/7hCV5VxxK0 — cricket.com.au (@cricketcomau) January 23, 2022 -
స్టన్నింగ్ క్యాచ్.. చరిత్రలో నిలిచిపోయే అవకాశం మిస్సయింది
బిగ్‌బాష్ లీగ్‌లో(బీబీఎల్ 2021-22) అద్భుత సన్నివేశం కొద్దిలో మిస్ అయింది. హరికేన్ హోబర్ట్స్ ఆటగాడు విల్ పార్కర్ బౌండరీ లైన్‌పై స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నప్పటికి.. బౌండరీ లైన్ తాకడంతో అంపైర్లు సిక్స్‌గా ప్రకటించారు. అయితే పార్కర్ బౌండరీ లైన్ తాకకుండా క్యాచ్ తీసుకొని ఉంటే చరిత్రలో నిలిచిపోయేవాడు. హోబర్ట్ హరికేన్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ 13వ ఓవర్ మూడో బంతిని మాట్ షార్ట్ లాంగాన్ దిశగా భారీ షాట్ కొట్టాడు. అక్కడే ఉన్న పార్కర్ పరిగెత్తుకొచ్చి విల్లులా వొంగి.. డైవ్ చేస్తూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. అప్పటికే బౌండరీ లైన్ టచ్ చేయడంతో పార్కర్ ఏం చేయలేక బంతిని విసిరాడు. రూల్ ప్రకారం అంపైర్లు సిక్సర్ ఇవ్వడంతో పార్కర్ విన్యాసం వృథాగా మిగిలింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ 22 పరుగులతో విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 19.4 ఓవర్లలో 166 పరుగులకే కుప్పకూలింది. WILL PARKER! Six in the scorebook, but oh my... 🤯 #BBL11 pic.twitter.com/vIUFy64Kc5 — KFC Big Bash League (@BBL) January 21, 2022 -
డబుల్ హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన బౌలర్
బిగ్‌బాష్ లీగ్‌లో(బీబీఎల్) అద్భుత ఘటన చోటుచేసుకుంది. మెల్బోర్న్ రెనెగేడ్స్ లెగ్ స్పిన్నర్ కామెరాన్ బోయ్స్ డబుల్ హ్యాట్రిక్‌తో మెరిశాడు. బీబీఎల్‌లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించిన బోయ్స్.. ఓవరాల్‌గా టి20 క్రికెట్లో డబుల్ హ్యాట్రిక్ సాధించిన 10వ క్రికెటర్‌గా నిలిచాడు. సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఏడో ఓవర్ ఆఖరి బంతికి అలెక్స్ హేల్స్‌ను ఔట్ చేశాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్ వేసిన బోయ్స్ వరుస మూడు బంతుల్లో జాసన్ సంఘా, అలెక్స్ రాస్, డేనియల్ సామ్స్‌లను వెనక్కి పంపాడు. చదవండి: వికెట్ తీసి వింత సెలబ్రేషన్‌తో మెరిసిన బౌలర్ అలా నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీసి రికార్డు అందుకున్నాడు. అయితే అలెక్స్ రోస్‌ను ఔట్ చేయడం ద్వారా హ్యాట్రిక్ సాధించిన బోయ్స్.. బీబీఎల్ ఈ ఘనత సాధించిన ఎనిమిదో బౌలర్‌గా నిలిచాడు. ఆ తర్వాత బంతికే మరో వికెట్ తీసి డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. ఇక తాను వేసిన మూడో ఓవర్లో మరో వికెట్ తీసిన బోయ్స్.. ఓవరాల్‌గా నాలుగు ఓవర్లలో 21 పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డబుల్ హ్యాట్రిక్ అంటే.. సాధారణంగా హ్యాట్రిక్ అంటే మూడు వరుస బంతుల్లో మూడు వికెట్లు తీయడం అని అందరికి తెలుసు. ఇక డబుల్ హ్యాట్రిక్ అంటే వరుసగా ఆరు వికెట్లు తీయడమని క్రికెట్ భాషలో అర్థం. కానీ ఆస్ట్రేలియా క్రికెట్లో మాత్రం.. నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీయడాన్ని డబుల్ హ్యాట్రిక్ పేరుతో పిలుస్తున్నారు. ఒక ఓవర్ చివరి బంతికి వికెట్.. తర్వాతి ఓవర్లో వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లు.. ఓవరాల్‌గా 1,2,3.. లేదా 2,3,4 వికెట్లను డబుల్ హ్యాట్రిక్‌గా కౌంట్ చేయడం అక్కడ ఆనవాయితీ. ఇక ఐదు వరుస బంతుల్లో ఐదు వికెట్లు తీస్తే దానిని ట్రిపుల్ హ్యాట్రిక్ అని పేర్కొంటారు. చదవండి: విండీస్ ప్లేయర్ "సూపర్ మ్యాన్ క్యాచ్"కు సలాం కొడుతున్న నెటిజన్లు We still can't believe this happened!! A double hattie from Cameron Boyce!! #BBL11 pic.twitter.com/fQWsFakSnx — KFC Big Bash League (@BBL) January 19, 2022 -
BBL: ‘బిగ్‌బాష్’ మ్యాచ్ ఆడిన తొలి భారతీయ క్రికెటర్‌గా...
Unmukt Chand- BBL: ఆస్ట్రేలియాకు చెందిన బిగ్‌బాష్ టి20 లీగ్ టోర్నీలో మ్యాచ్ ఆడిన తొలి భారతీయ క్రికెటర్‌గా ఉన్ముక్త్ చంద్ గుర్తింపు పొందాడు. హోబర్ట్ హరికేన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగెడ్స్ తరఫున ఉన్ముక్త్ బరిలోకి దిగి ఆరు పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ 6 పరుగుల తేడాతో గెలుపొందింది. ఆరోన్ ఫించ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా 2012లో ఉన్ముక్త్ కెప్టెన్సీలో టీమిండియా అండర్–19 ప్రపంచకప్ టైటిల్ గెలిచింది. బీసీసీఐ రూల్స్ ప్రకారం భారత క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఆటగాళ్లకే విదేశీ టి20 లీగ్‌లలో ఆడే అర్హత ఉంది. దాంతో 28 ఏళ్ల ఉన్ముక్త్ గత ఆగస్టులో రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం బీబీఎల్‌లో మెల్బోర్న్ రెనెగెడ్స్కు అతడు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చదవండి: Glenn Maxwell: 'క్యాచ్ పట్టేశావు.. భ్రమలో నుంచి బయటికి రా' Seymour is smokin' them 🔥pic.twitter.com/WwKXFn6bW7 — Melbourne Renegades (@RenegadesBBL) January 18, 2022 -
వికెట్ తీసి వింత సెలబ్రేషన్‌తో మెరిసిన బౌలర్
పాకిస్తాన్ పేస్ బౌలర్ హారిస్ రౌఫ్ ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్) సీజన్లో బిజీగా గడుపుతున్నాడు. మెల్బోర్న్ స్టార్స్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న హారిస్ రౌఫ్ వికెట్ తీసిన ఆనందంలో వింత సెలబ్రేషన్‌తో మెరిశాడు. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి మరోసారి కుదిపేస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ పేరుతో రూపం మార్చుకొని ప్రపంచదేశాలపై తన పడగను విప్పింది. ఈ సెగ బీబీఎల్‌కు కూడా తాకింది. చదవండి: Glenn Maxwell: 'క్యాచ్ పట్టేశావు.. భ్రమలో నుంచి బయటికి రా' ఇప్పటికే బీబీఎల్‌లో సిబ్బందితో పాటు పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు.ఈ సందర్భంగా పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హారిస్ రౌఫ్ కోవిడ్‌పై అవగాహన కల్పించడానికి తోటి ఆటగాళ్లను నవ్విస్తూనే సెలబ్రేట్ చేయడం వైరల్‌గా మారింది. మూడో ఓవర్లో కుర్టీస్ పాటర్సన్‌ను ఔట్ చేసిన హారిస్.. ముందు చేతులను సానిటైజ్ చేసుకున్నట్లుగా.. ఆ తర్వాత జేబులో నుంచి మాస్క్ తీసి ముఖానికి పెట్టుకొని అవగాహన కల్పించాడు. దీనికి సంబంధించిన వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్లో షేర్ చేస్తూ..'' హారిస్ రౌఫ్ సెలబ్రేషన్ కొత్తగా ఉంది.. కోవిడ్‌పై అవగాహన కల్పిస్తూ సెలబ్రేట్ చేసుకోవడం సూపర్'' అంటూ క్యాప్షన్ జత చేసింది. చదవండి: IND Vs WI: కోహ్లి దిగిపోయాడు.. రోహిత్ వచ్చేస్తున్నాడు..! Incredible COVID-safe wicket celebration from Harris Rauf! 🤣#BBL11pic.twitter.com/tG4QmFRbMO — cricket.com.au (@cricketcomau) January 11, 2022 -
'క్యాచ్ పట్టేశావు.. భ్రమలో నుంచి బయటికి రా'
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. అయితే తాను క్యాచ్ పట్టేశానా అన్న విధంగా మ్యాక్సీ ఇచ్చిన హావభావాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే.. మెల్బోర్న్ స్టార్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇన్నింగ్స్ 16వ ఓవర్‌ను నాథన్ కౌల్టర్‌నీల్ వేశాడు. ఓవర్ నాలుగో బంతిని గుడ్‌లెంగ్త్‌తో వేయగా.. సామ్ హీజ్లెట్ మిడాఫ్ దిశగా ఆడాడు. అక్కడే ఉన్న మ్యాక్స్‌వెల్ వెనక్కి పరిగెట్టి.. డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. మ్యాక్సీ విన్యాసాన్ని తోటి ఆటగాళ్లు సహా మైదానంలోని ప్రేక్షకులు ఎంజాయ్ చేయగా.. అతను మాత్రం క్యాచ్ అందుకున్నాన్నా అనే భ్రమలోనే ఉండిపోవడం విశేషం. దీనిపై అభిమానులు వినూత్నరీతిలో స్పందించారు. ' మ్యాక్సీ నువ్వు క్యాచ్ పట్టేశావు.. భ్రమలో నుంచి బయటికి రా' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: IPL 2022 Auction: ఈ ఏడాది ఐపీఎల్లో వారి మెరుపులు లేనట్టేనా..? ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. బెన్ డకెట్ 51 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ 13.5 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. జో క్లార్క్ 62 పరుగులతో రాణించగా.. మ్యాక్స్‌వెల్ 37 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. GLENN MAXWELL! WHAT A CATCH! 😱#BBL11 pic.twitter.com/czENSVwG2s — 7Cricket (@7Cricket) January 16, 2022 -
లీగ్ మధ్యలో చెక్కేసిన పాకిస్థాన్ క్రికెటర్లు
సిడ్నీ: బిగ్ బాష్ లీగ్(బీబీఎల్) 2022 నుంచి పాక్ క్రికెటర్లు మహ్మద్ హస్నైన్, ఫకర్ జమాన్, హరీస్ రౌఫ్, షాదాబ్ ఖాన్లు అర్ధంతరంగా వైదొలిగారు. స్వదేశంలో త్వరలో(జనవరి 27 నుంచి) ప్రారంభంకానున్న పాకిస్థాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) కోసం బీబీఎల్‌ను వీడి రావాలని ఆ దేశ క్రికెట్ బోర్డు ఆదేశాలు జారీ చేయడంతో వారంతా తిరుగు టపా కట్టారు. బీబీఎల్‌లో మెల్బోర్స్ స్టార్స్ తరఫున హరీస్ రౌఫ్, బ్రిస్బేన్ హీట్ తరఫున ఫకర్ జమాన్, సిడ్నీ సిక్సర్స్ తరఫున షాదాబ్ ఖాన్, సిడ్నీ థండర్స్ తరఫున హస్నైన్ ఆడుతున్నారు. వీరంతా లీగ్ కీలక దశలో ఉండగా తిరిగి వెళ్లడంతో ఆయా జట్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా, జాతీయ జట్టుతో ఉన్న కమిట్మెంట్స్ కారణంగా అఫ్గాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ సైతం బీబీఎల్‌ను వీడాడు. రషీద్ బీబీఎల్‌లో అడిలైడ్ స్ట్రైయికర్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. చదవండి: ఐపీఎల్ 2022లో వారి మెరుపులు లేనట్టేనా..? -
వికెట్ పడగొట్టాడు.. మాస్క్ ధరించాడు.. వీడియో వైరల్
పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హరీస్ రౌఫ్ బిగ్‌బాష్ లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. గీలాంగ్ వేదికగా మంగళవారం పెర్త్ స్కాచర్స్తో మెల్బోర్న్ స్టార్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు వచ్చిన పెర్త్స్కాచర్స్కు మెరుపు ఆరంభం లభించింది. తొలి రెండు ఓవర్లలో ఏకంగా 21 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలో ఇన్నింగ్స్ మూడో ఓవర్ వేసిన హరీస్ రౌఫ్ బౌలింగ్‌లో ఓపెనర్ పీటర్సన్ వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఈ క్రమంలో వికెట్ సాధించిన హరీస్ రౌఫ్ వెరైటీ సెలబ్రేషన్‌ను జరుపుకున్నాడు. కోవిడ్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తూ.. శాని టైజర్తో చేతులు శుబ్ర పరుచుకోవడం, మాస్క్ ధరించడం వంటివి మైదానంలో రౌఫ్ చేసి చూపించాడు. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బిగ్‌బాష్ లీగ్ మేనేజ్మెంట్ ట్విటర్లో షేర్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే రౌఫ్ కన్న ముందు దక్షిణాఫ్రికా స్పిన్నర్ తబ్రైజ్ షమ్సీ ఇటువంటి సెలబ్రేషన్లు జరుపుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మెదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కాచర్స్ 196 పరుగుల భారీ స్కోరు సాధించింది. పెర్త్ బ్యాటర్లలో ఎవాన్స్(69),టర్నర్(47) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. "Cleanly" taken for Haris Rauf's first wicket of the day... 😷🧼@KFCAustralia | #BBL11 pic.twitter.com/hLWA0XXoth — KFC Big Bash League (@BBL) January 11, 2022 చదవండి: Ind Vs Sa 3rd Test: టెస్టు మ్యాచ్‌కు సరిగ్గా సరిపోయే పిచ్.. టాస్ గెలిస్తే.. -
ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడికి కరోనా.. ఇప్పటికే 12 మందికి!
BBL 2021 22: బిగ్‌బాష్ లీగ్ జట్టు మెల్బోర్న్ స్టార్స్‌ను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే 12 మంది క్రికెటర్లు, ఎనిమిది మంది సిబ్బంది కరోనా బారిన పడ్డారు. తాజాగా మెల్బోర్న్ స్టార్స్ కెప్టెన్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్‌కు కోవిడ్ సోకింది. యాంటీజెన్ టెస్టులో భాగంగా అతడికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఇక అంతకుముందు స్టార్స్ జట్టు ఆటగాళ్లు ఆడం జంపా, నాథన్ కౌల్టర్ నైల్, మార్కస్ స్టొయినిస్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే, ఐసోలేషన్ పూర్తి కావడం, కరోనా నిర్ధారణ పరీక్షల్లో నెగటివ్‌గా తేలడంతో వీరు తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులోకి రానున్నారు. శుక్రవారం అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరుగనున్న మ్యాచ్‌లో పాల్గొననున్నారు. చదవండి: Nz Vs Ban: టెస్టు చాంపియన్‌ను మట్టికరిపించి.. బంగ్లాదేశ్ సరికొత్త రికార్డులు.. తొలిసారిగా Ashes 2021- 22: సిడ్నీ టెస్టుకు ఆసీస్ తుది జట్టు ఇదే.. రెండేళ్ల తర్వాత అతడి రీ ఎంట్రీ! -
ఔట్ అని వేలు ఎత్తాడు.. వెంటనే లేదు లేదు అన్నాడు!
బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా మెల్బోర్న్ స్టార్స్- పెర్త్ స్కార్చర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ అసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పెర్త్ స్కార్చర్స్ ఇన్నింగ్స్ 14వ వేసిన జేవియర్ క్రోన్ బౌలింగ్‌లో అష్టన్ టర్నర్ పుల్ షాట్ ఆడాడు. అయితే బంతి అతడి హెల్మెట్‌కు తగిలి కీపర్ చేతికి వెళ్లింది. దీంతో కీపర్‌తో పాటు మెల్బోర్న్ స్టార్స్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఆన్ ఫీల్డ్ అంపైర్ ఔట్‌గా వేలు ఎత్తాడు. అయితే వెంటనే బంతి హెల్మెట్‌ను తాకినట్లు గ్రహించి తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకున్నాడు. దీంతో ఆటగాళ్లు అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బిగ్‌బాష్ లీగ్ మేనేజ్మెంట్ ట్విటర్లో షేర్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచకున్న పెర్త్ స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. కుర్టిస్ ప్యాటర్సన్(54), మున్రో(40) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచారు. మెల్బోర్న్ బౌలర్లలో హరీస్ రవూఫ్, కైస్ అహ్మద్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్బోర్న్ స్టార్స్ 130 పరుగులకే కుప్పకూలింది. దీంతో 50 పరుగుల తేడాతో పెర్త్ స్కార్చర్స్ విజయం సాధించింది. చదవండి: SA vs IND: "అతడు వైస్ కెప్టెన్ అవుతాడని అస్సలు ఊహించలేదు" Xavier Crone had his first BBL wicket on debut - for all of three seconds! 👷♂️💥@KFCAustralia | #BBL11 pic.twitter.com/LDz2frhXOV — KFC Big Bash League (@BBL) January 2, 2022 -
'గట్టిగానే తగిలినట్టుంది.. ఏం కాలేదని కవర్ చేశాడు'
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021)లో భాగంగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ బెన్ కటింగ్ చర్య సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విషయంలోకి వెళితే..అడిలైడ్ ఓవల్ వేదికగా అడిలైడ్ స్ట్రైకర్స్, సిడ్నీ థండర్స్ మధ్య జరిగింది. అడిలైడ్ స్ట్రైకర్స్ పేస్ బౌలర్ డానియెల్ వొర్రాల్ షార్ట్‌పిచ్ బంతి విసిరాడు. క్రీజులో ఉన్న బెన్ కటింగ్ దానిని కింద కొట్టాలని చూశాడు. కానీ బంతి మిస్ అయి హెల్మెట్‌కు బలంగా తగిలింది. డేనియల్ ఏమైనా అయిందా అన్నట్లు అడగ్గా.. దానికి కటింగ్ ఏం కాలేదంటూ చేతితో 'థంప్స్ అప్(ఓకే)' సింబల్ చూపించాడు. చదవండి: Brett Lee: కొడుకనే కనికరం లేకుండా క్లీన్‌బౌల్డ్ అయితే కొద్ది సెకన్ల వ్యవధిలోనే బెన్ కటింగ్ తన హెల్మెట్ తీసి గాయమైందా అన్నట్లు పరిశీలించుకోవడం కెమెరాలకు చిక్కింది. కానీ పెద్దగా తగలకపోవడంతో కటింగ్ బ్యాటింగ్‌ను కొనసాగించాడు. అయితే బెన్ కటింగ్ వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు వినూత్నరీతిలో స్పందించారు.'' దెబ్బ గట్టిగానే తగిలినట్టుంది.. కానీ భలే కవర్ చేశాడు..'' అంటూ కామెంట్స్ పెట్టారు. కాగా బెన్ కటింగ్ 32 బంతుల్లో 37 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇక మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ 22 పరుగుల తేడాతో విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 187 పరుగులు చేసింది. జేసన్ సంగా 55 బంతుల్లోనే 91 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 165 పరుగులు మాత్రమే చేయగలిగింది. చదవండి: Team India New Year Celebrations: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌తో అదరగొట్టిన టీమిండియా Yikes! A quick thumbs up from Cutting after that nasty blow to the helmet #BBL11 pic.twitter.com/d7viKgsf74 — cricket.com.au (@cricketcomau) December 31, 2021 -
రెండు సెంచరీలు ఒకే తరహాలో.. అరుదైన ఫీట్
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021)లో సంచలన ఇన్నింగ్స్‌లు నమోదవుతున్నాయి. ముఖ్యంగా హోబర్ట్ హరికేన్స్ ఓపెనర్ మెక్ డెర్మోట్ వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్నాడు. తాజాగా మెల్బోర్న్ రెనెగేడ్స్‌పై సెంచరీ బాదిన అతను బీబీఎల్ చరిత్రలో కొత్త రికార్డు సాధించాడు. అయితే మెక్ డెర్మోట్ రెండు సెంచరీలను ఒకే తరహాలో అందుకోవడం విశేషం. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో 95 పరుగులకు చేరుకున్న మెక్ డెర్మోట్.. కేన్ రిచర్డ్సన్ వేసిన బంతిని స్టాండ్స్‌లో కి బాది సెంచరీ పూర్తి చేశాడు. ఓవరాల్‌గా 65 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 127 పరుగులు చేశాడు. బిగ్‌బాష్ లీగ్‌లో మెక్ డెర్మోట్కు మూడో సెంచరీ కాగా.. ఈ సీజన్లో ఇది రెండో సెంచరీ. చదవండి: BBL 2021: కళ్లు చెదిరే క్యాచ్.. ఔటయానన్న సంగతి మరిచిపోయి కాగా ఇంతకముందు అడిలైడ్ స్ట్రైకర్స్‌తో మ్యాచ్‌లోనూ సిక్స్‌తోనే సెంచరీ సాధించాడు. తద్వారా బీబీఎల్ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలను సిక్సర్లతో పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా మెక్ డెర్మోట్ చరిత్ర సృష్టించాడు. ఇక హోబర్ట్ హరికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. HISTORY MADE 🏆 Ben McDermott just made back-to-back 💯 for the first time in #BBL history! 📺 Watch #BBL11 on @Foxtel CH 503 or stream on @kayosports: https://t.co/gt5iNQ2w7F 📝 Blog: https://t.co/2QI8PpTMaE 🔢 Match Centre: https://t.co/QMgYF6q7lt pic.twitter.com/MFuEmYMWAw — Fox Cricket (@FoxCricket) December 29, 2021 That magic moment 💯 Ben McDermott brings up his second Big Bash century in STYLE 😎 #BBL11 pic.twitter.com/XsZP6cwY8y — KFC Big Bash League (@BBL) December 27, 2021 -
కళ్లు చెదిరే క్యాచ్.. ఔటయానన్న సంగతి మరిచిపోయి
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021)లో సిడ్నీ సిక్సర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సిడ్నీ సిక్సర్స్ ఆటగాడు సీన్ అబాట్ కళ్లు చెదిరే క్యాచ్‌తో మెరిశాడు. బ్రిస్బేన్ హీట్ ఇన్నింగ్స్ 4వ ఓవర్లో జాసన్ బెండార్సీస్ వేసిన బంతిని ఓపెనర్ క్రిస్ లిన్ ఆఫ్‌సైడ్ దిశగా కవర్‌డ్రైవ్ ఆడాడు. అయితే ఎవరు ఊహించని విధంగా సీన్ అబాట్ గాల్లోకి ఎగిరి కుడివైపుకు డైవ్ చేస్తూ ఒంటిచేత్తో అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. దీంతో క్రిస్ లిన్.. సీన్ అబాట్ స్టన్నింగ్ ఫీట్‌కు షాక్ తిన్నాడు. అసలు ఔటయ్యానా అనే సందేహం కలిగిందంటే.. సీన్ అబాట్ ఎంత వేగంతో బంతిని అందుకున్నాడో అర్థమవుతుంది. ఇక చేసేదేం లేక 2 పరుగులు చేసిన లిన్ నిరాశగా పెవిలియన్ చేరాడు. దీనికి సంబంధించిన వీడియోనూ బిగ్‌బాష్ లీగ్ తన ట్విటర్లో షేర్ చేసింది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ 19.1 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. డకెట్ 21, విల్డర్మత్ 27, మాక్స్ బ్రియాంట్ 22 పరుగులు చేశారు. సీన్ అబాట్ 4 వికెట్లతో చెలరేగాడు. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన సిడ్నీ సిక్సర్స్ దారుణ ఆటతీరు కనబరిచింది. ఒక దశలో 100 లోపే ఆలౌట్ అయ్యేలా కనిపించిన సిడ్నీ సిక్సర్స్ ప్రస్తుతం సీన్ అబాట్ బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపిస్తుండడంతో 18 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 8 పరుగుల దూరంలో ఉంది. Catch of the summer? 🤯 Chris Lynn could NOT believe it... #BBL11 This 'Oh What a Feeling' Moment brought to you by @Toyota_Aus pic.twitter.com/6fGBa3l5D0 — Fox Cricket (@FoxCricket) December 29, 2021 -
ఆండ్రూ టైకి ఊహించని షాక్ ఇచ్చిన అంపైర్లు
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021)లో పెర్త్ స్కార్చర్స్ బౌలర్ ఆండ్రూ టైకి ఊహించని షాక్ తగిలింది. సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆండ్రూ టై బౌలింగ్ చేసే సమయంలో రెండు బంతులను బ్యాట్స్‌మన్ నడుముపైకి విసిరాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం బంతులు బ్యాట్స్‌మన్ పైకి విసిరితే బీమర్ అని పిలుస్తారు. అయితే బీమర్ అనేది క్రికెట్లో ప్రమాదకరంగా ఉండడంతో దానిని నిషేధించారు. దీంతో ఒక బౌలర్ ఒక ఓవర్లో రెండు కంటే ఎక్కువ బీమర్లు వేస్తే అతన్ని బౌలింగ్ చేయకుండా నిషేధించొచ్చు. ఆండ్రూ టై అదే తప్పు చేశాడు. దీంతో కీలక మ్యాచ్‌లో బౌలింగ్ చేసే అవకాశం కోల్పోయాడు. ఇన్నింగ్స్ 15వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ ఓవర్ నాలుగో బంతిని బ్యాట్స్‌మన్ అలెక్స్ రాస్ నడుముపైకి బీమర్ వేశాడు. మరుసటి బంతిని వైడ్ వేయగా.. ఆ తర్వాత బంతిని మరోసారి బీమర్ వేయడంతో అంపైర్లు టైను అడ్డుకొని బౌలింగ్ వేయకుండా నివారించారు. ప్రస్తుతం ఆండ్రూ టై బౌలింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ జట్టు 20 ఓవర్లలో 200 పరుగుల భారీ స్కోరు చేసింది. సామ్ బిల్లింగ్స్ 35 బంతుల్లో 67 పరుగులు, జాసన్ సాంగా 46 బంతుల్లో 56 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసి 34 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కొలిన్ మున్రో 64 పరుగులు నాటౌట్‌తో రాణించినప్పటికి మిగిలినవారు విఫలమయ్యారు. Two dangerous no-balls, and he's out. Here's why AJ Tye finished the innings with 1.3 completed overs to his name...@KFCAustralia | #BBL11 pic.twitter.com/nuTs6XF3LI — KFC Big Bash League (@BBL) December 28, 2021 -
12 ఫోర్లు, 5 సిక్స్‌లు.. బౌలర్లకు చుక్కలు చూపించిన ఆసీస్ ఆటగాడు!
బిగ్‌బాష్ లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్ బ్యాటర్ బెన్ మెక్‌డెర్మాట్ విధ్వంసం సృష్టించాడు. హోబర్ట్ హరికేన్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మెక్‌డెర్మాట్ 60 బంతుల్లో 110 పరుగులు సాధించి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. తొలుత 50 పరుగులు 36 బంతుల్లో చేయగా, చివరి 60 పరుగులు కేవలం 24 బంతుల్లోనే సాధించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అడిలైడ్ స్ట్రైకర్స్ తొలుత నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. అడిలైడ్ బ్యాటరల్లో రెన్షా(63),వెదర్‌రాల్డ్(51) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. హోబర్ట్ బౌలరల్లో రిలే మెరెడిత్ మూడు వికెట్లు పడగొట్టగా,రోజర్స్, ఇల్స్ చెరో వికెట్ సాధించారు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హోబర్ట్ హరికేన్స్ ఆదిలోనే వేడ్ వికెట్‌ను కోల్పోయింది. ఆ సమయంలో మెక్‌డెర్మాట్, డిఆర్సీ షార్ట్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కిదిద్దాడు. వీరిద్దరూ కలిసి 81 పరగుల భాగాస్వమ్యాన్ని నమోదు చేశారు.తరువాత ఆర్సీ షార్ట్ ఔటైనప్పటికీ మెక్‌డెర్మాట్ తన జోరును కొనసాగించాడు. ఈ క్రమంలో ఆగర్ బౌలింగ్‌లో సిక్ప్ బాది సెంచరీ సాధించాడు. మెక్‌డెర్మాట్ తుఫాన్ ఇన్నింగ్స్ ఫలితంగా హోబర్ట్ హరికేన్స్ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సునాయసంగా చేధించింది. చదవండి: Ashes 2021: అరంగేట్ర మ్యాచ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించిన ఆసీస్ బౌలర్! That magic moment 💯 Ben McDermott brings up his second Big Bash century in STYLE 😎 #BBL11 pic.twitter.com/XsZP6cwY8y — KFC Big Bash League (@BBL) December 27, 2021 -
ఇదేమి బౌలింగ్రా బాబు.. 4 ఓవర్లలో 70 పరుగులు!
Liam Guthrie BBL, 70 Runs In 4 Overs: బిగ్ బాష్ లీగ్-2021లో బ్రిస్బేన్ హీట్ బౌలర్ లియామ్ గుత్రీ ఓ చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు. మెల్బోర్న్ స్టార్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్ల కోటాలో గుత్రీ ఏకంగా 70 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో బిగ్ బాష్ లీగ్ చరిత్రలోనే అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన గుత్రీ 70 పరుగులతో పాటు రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు సిడ్నీ సిక్సర్స్ బౌలర్ బెన్ ద్వార్షుయిస్ 61 పరుగులు ఇచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మెల్బోర్న్ స్టార్స్ ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ మ్యాక్స్‌వెల్ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. అయితే ఓపెనర్ క్లార్క్, కార్ట్‌రైట్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. క్లార్క్ 44 బంతుల్లో 85 పరుగులు సాధించగా, కార్ట్‌రైట్ 44 బంతుల్లో 79 పరుగులు సాధించాడు. దీంతో మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 207 పరుగులు సాధించింది. బ్రిస్బేన్ హీట్ బౌలర్లలో స్టీక్టీ మూడు వికెట్లు పడగొట్టగా,గుత్రీ, బ్లేజీ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి బ్రిస్బేన్ హీట్ బ్యాటర్లలో క్రిస్ లిన్(57), బెన్ డకెట్(54) తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో187 పరుగులకు ఆలౌటైంది. దీంతో 20 పరుగుల తేడాతో బ్రిస్బేన్ ఓటమి చెందింది. మెల్బోర్న్ బౌలర్లలో బ్రాడీ కౌచ్, కైస్ అహ్మద్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. చదవండి: SA Vs IND: కోహ్లి.. ఎలా ఆడాలో రాహుల్‌ని చూసి నేర్చుకో: భారత మాజీ క్రికెటర్ The Bucket Ball free-hit is sent straight back over Liam Guthrie's head 😳 @KFCAustralia | #BBL11 pic.twitter.com/ua4VNZG0DS — KFC Big Bash League (@BBL) December 27, 2021 -
ఫ్రీ హిట్ అన్న సంగతి మరిచిపోయాడు.. ఇంకేముంది
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021)లో సిడ్నీ సిక్సర్స్, సిడ్నీ థండర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. సిడ్నీ థండర్స్ ఆల్‌రౌండర్ బెన్ కటింగ్ స్టన్నింగ్ క్యాచ్‌తో మెరిశాడు. అయితే అది ఫ్రీ హిట్ అన్న విషయం మరిచిపోయిన బెన్ కటింగ్ సెలబ్రేషన్లో మునిగిపోయాడు. అయితే వెంటనే తేరుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సిడ్నీ సిక్సర్స్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ నాలుగో బంతిని డేనియల్ క్రిస్టియన్ కవర్స్ దిశగా షాట్ ఆడాడు. అక్కడే ఉన్న బెన్ కటింగ్ డైవ్ చేస్తూ అద్బుతంగా క్యాచ్ తీసుకున్నాడు. అయితే ఫ్రీహిట్ అని తెలియడంతో త్రో విసిరాడు. కానీ అప్పటికే ప్రత్యర్థి జట్టు రెండు పరుగులు తీసేసింది. దీంతో బెన్ కటింగ్ ముఖం మాడ్చుకోవడం వీడియోలో కనిపించింది. చదవండి: IND VS SA : లడ్డూలాంటి క్యాచ్ వదిలేశారు.. ఫలితం అనుభవించండి ఇక మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 16 ఓవర్లకు కుదించారు. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ 16 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. డేనియల్ హ్యూజెస్ 50, జేమ్స్విన్స్ 31 పరుగులు చేయగా.. చివర్లో డేనియల్ క్రిస్టియన్ 17 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 41 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ 15.1 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటైంది. జాస్ సంగా 47 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. డేనియల్ సామ్స్ 28 పరుగులు చేశాడు. చదవండి: Cheteshwar Pujara:'డమ్మీ ద్రవిడ్' గోల్డెన్ డక్ అయ్యాడు.. ఏకిపారేసిన ఫ్యాన్స్ Uh oh 😆 A little brain-fade here Ben Cutting would probably like to forget! @KFCAustralia | #BBL11 pic.twitter.com/pkpOtZtAtD — KFC Big Bash League (@BBL) December 26, 2021 -
'మా బంతి పోయింది.. కనబడితే ఇచ్చేయండి!'
బిగ్‌బాష్ లీగ్ 2021లో శుక్రవారం మెల్బోర్న్ స్టార్స్, హోబర్ట్ హరికేన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. మెల్బోర్న స్టార్స్ బౌలర్ నాథన్ కౌల్టర్ నీల్ వేసిన ఇన్నింగ్స్ 12వ ఓవర్ నాలుగో బంతిని హోబర్ట్ హరికేన్స్ ఓపెనర్ బెన్ మెక్‌డెర్మోట్ డీప్ బ్యాక్వర్డ్స్క్వేర్ మీదుగా భారీ సిక్స్ కొట్టాడు. అయితే బంతి వెళ్లి స్డేడియం అవతల చాలా దూరంలో పడింది. దీంతో దెబ్బకు అంపైర్లు కొత్త బంతిని తీసుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోనే బిగ్‌బాష్ లీగ్ తన ట్విటర్లో షేర్ చేస్తూ..'' మా బంతి పోయింది.. ఒకవేళ కనిపిస్తే బ్లండ్స్స్టోన్ ఎరీనాకు తెచ్చివ్వండి'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. కాగా మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ 24 పరుగుల తేడాతో మెల్బోర్న్ స్టార్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్‌కు ఓపెనర్లు బెక్ డెర్మోట్(67 పరుగులు), మాధ్యూ వేడ్(39 పరుగులు) తొలి వికెట్‌కు 93 పరుగుల జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మన్ తలా ఒక చెయ్యి వేయడంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. జో క్లార్క్ 52 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. జో బర్న్స్ 22, హిల్టన్ కార్ట్‌రైట్ 26 పరుగులు చేశారు. Lost ball: if found, please return to @BlundstoneArena 💥#BBL11 pic.twitter.com/Pvo3rzCp7t — KFC Big Bash League (@BBL) December 24, 2021 -
Short Run: ఏకంగా 5 పరుగుల పెనాల్టీ విధించిన అంపైర్
Tim David Attempts Short Run In BBL 2021: బీబీఎల్ 2021-22లో భాగంగా హోబర్ట్ హరికేన్స్, మెల్బోర్న్ స్టార్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. హోబర్ట్ హరికేన్స్ ఆటగాడు టిమ్ డేవిడ్.. స్ట్రయిక్‌ని అట్టిపెట్టుకోవడం కోసం క్రీజ్ సగం మధ్య వరకు మాత్రమే పరిగెత్తి రెండో పరుగు కోసం వెనక్కు వెళ్లాడు. నాన్ స్ట్రైయికింగ్ ఎండ్‌లో నాథన్ ఎల్లీస్కు స్ట్రయిక్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో షార్ట్ రన్ తీసినట్టు నిర్ధారణ కావడంతో అంపైర్లు హోబర్డ్ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధించారు. Stars will start their innings with 5 free runs courtesy of this... #BBL11 pic.twitter.com/lz9tRxNLLB— KFC Big Bash League (@BBL) December 24, 2021 దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియలో వైరలవుతోంది. సాధారణంగా షార్ట్ రన్ అంటే.. క్రీజ్ దగ్గరి దాకా వెళ్లి పొరపాటున రెండో పరుగు కోసం తిరిగి వెళ్లడం. అయితే బిగ్‌బాష్ లీగ్‌లో అలా జరగలేదు. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హోబర్ట్ హరికేన్స్ జట్టు.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఓపెనర్లు బెన్ మెక్‌డెర్మాట్ (43 బంతుల్లో 67; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), మాథ్యూ వేడ్ (27 బంతుల్లో 39; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం 181 పరుగుల లక్ష్యఛేదనకు బరిలో దిగిన మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులకే పరిమితం కావడంతో 24 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. చదవండి: అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్ -
మ్యాచ్ మధ్యలో బ్రొమాన్స్ ఏంటి.. తట్టుకోలేకపోతున్నాం?!
క్రికెట్లో ఎంటర్టైన్మెంట్ అనేది కామన్. మ్యాచ్ ఎంత రసవత్తరంగా సాగినప్పటికి బ్యాట్స్‌మన్ హిట్టింగ్.. బౌలర్ వికెట్లు తీయడం.. ఆటగాళ్ల మధ్య గొడవలు.. ఇలా ఏది చూసిన చూస్తున్న ప్రేక్షకుడికి మంచి ఆనందాన్ని ఇస్తుంది. బిగ్‌బాష్ లీగ్‌లోనూ ఇలాంటివి కోకొల్లలు. ఇక ఈ సీజన్ విషయానికి వస్తే ఒక మ్యాచ్‌లో జోష్ ఫిలిప్, మ్యాక్స్‌వెల్‌లు నోటితో కాకుండా బ్యాట్‌తో మాట్లాడుకోవడం.. ఇక ఆండ్రూ టై, జహీర్ ఖాన్లు వికెట్లతో మాట్లాడుకోవడం ఫన్నీగా కనిపించింది. చదవండి: IND Vs SA: దక్షిణాఫ్రికాకు బిగ్‌షాక్.. గాయంతో స్టార్ పేసర్ దూరం అయితే తాజాగా డేనియల్ వొర్రాల్, పీటర్ సిడిల్ల మధ్య జరిగిన బ్రొమాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డిసెంబర్ 21న సిడ్నీ సిక్సర్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో సిడిల్.. వొర్రాల్ చెంపై ముద్దుపెట్టడం ఆసక్తి కలిగించింది. అడిలైడ్ స్ట్రైకర్స్ కెప్టెన్ పీటర్ సిడిల్ 147 పరుగుల టార్గెట్‌ను కాపాడుకునేందుకు తొలి ఓవర్‌ను డేనియల్ ఓర్రల్తో వేయించాడు. తొలి బంతి వేసిన అనంతరం సిడిల్ ఓర్రల్ దగ్గరకు వచ్చి సుధీర్ఘంగా చర్చించాడు. ఈ నేపథ్యంలో సిడిల్ వోర్రల్ చెంపపై ముద్దు పెట్టడం కెమెరాలకు చిక్కింది. మొదట షాకైన వోర్రల్.. ఆ తర్వాత నవ్వుతూ సిడిల్ చర్యను ఆహ్వానించాడు. అయితే దీనిపై ఫ్యాన్స్ మాత్రం వివిధ రకాలుగా కామెంట్స్ చేశారు. ''ఆట మధ్యలో ఇలాంటి బ్రొమాన్స్లు ఏంటి భయ్యా.. తట్టుకోలేకపోతున్నాం.. మీ బ్రొమాన్స్ తగలయ్యా..'' అంటూ పేర్కొన్నారు. ఇక మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ 4 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. థామస్ కెల్లీ 41 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. వెల్స్ 32 పరుగులు చేశాడు. అనంతరం సిడ్నీ సిక్సర్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. జోర్డాన్ సిల్క్ 36, మొయిసెస్ హెన్రిక్స్ 28 పరుగులు చేశాడు. చదవండి: Vijay Hazare Trophy 2021: జట్టు మొత్తం స్కోరు 200.. ఒక్కడే 109 బాదాడు Lots of love at @StrikersBBL 😘 #BBL11 pic.twitter.com/3pZg8RjkRy — 7Cricket (@7Cricket) December 21, 2021 -
శివాలెత్తిన మ్యాక్స్‌వెల్.. ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసం
Glenn Maxwell In BBL 2021: బిగ్‌బాష్ లీగ్‌లో ఆర్సీబీ స్టార్ బ్యాటర్, ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ రెచ్చిపోయాడు. ప్రస్తుత లీగ్‌లో మెల్బోర్న్ స్టార్స్‌కు సారథ్యం వహిస్తున్న మ్యాక్సీ.. సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ(57 బంతుల్లో 103)తో శివాలెత్తాడు. ఫోర్లు, సిక్సర్లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి విధ్వంసం సృష్టించాడు. కేవలం 54 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో లీగ్‌లో తన తొలి సెంచరీని నమోదు చేశాడు. హాఫ్ సెంచరీని 33 బంతుల్లో పూర్తి చేసిన మ్యాక్సీ.. ఆతర్వాత గేర్ మార్చి ప్రత్యర్ధి బౌలర్లపై విచక్షాణారాహిత్యంగా విరుచుకుపడ్డాడు. ఫలితంగా మెల్ బోర్న్ స్టార్స్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. అనంతరం 178 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్.. జోష్ ఫిలిప్(61 బంతుల్లో 99; 11 ఫోర్లు, సిక్సర్లు) వీరవిహారం చేయడంతో 19.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకోవడం కొసమెరుపు. ఫిలిప్ ఆఖరి వరకు క్రీజ్‌లో నిలబడి జట్టును విజయతీరాలకు చేర్చినప్పటికీ ఒక్క పరుగు తేడాతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఫిలిప్ అద్బుతమైన పోరాటం చేసి జట్టును గెలిపించడంతో మ్యాక్స్‌వెల్ విధ్వంసం మరుగునపడింది. చదవండి: ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆరాధించబడే వ్యక్తుల జాబితాలో టీమిండియా కెప్టెన్.. -
బ్యాట్స్‌మన్ భారీ సిక్స్.. అభిమాని తల పగిలి రక్తం
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్) 2021లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బ్యాట్స్‌మన్ కొట్టిన భారీ సిక్స్‌ను క్యాచ్‌గా తీసుకుందామని భావించిన అభిమాని తల పగిలి రక్తం కారడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంగళవారం పెర్త్ స్కార్చర్స్, హోబర్ట్ హరికేన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. హోబర్ట్ హరికేన్స్ ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ఆండ్రూ టై బౌలింగ్‌లో బ్యాట్స్‌మన్ బెన్ మెక్‌డెర్మోట్ భారీ సిక్స్ బాదాడు. స్టాండ్స్‌లోకి వస్తున్న బంతిని ఒక అభిమాని ఉత్సాహంతో క్యాచ్ అందుకోవాలని ప్రయత్నించాడు. చదవండి: BBL 2021: 60 బంతుల్లో శతకం.. మిచెల్ మార్ష్ విధ్వంసం అయితే బంతి దురదృష్టవశాత్తూ అతని తల బాగంలో కుడివైపు బలంగా తగిలింది. దీంతో కుప్పకూలిన సదరు అభిమాని నుదుట నుంచి రక్తం కారడం మొదలైంది. ఇది చూసిన తోటి ప్రేక్షకులు కాస్త ఆందోళనకు గురయ్యారు. వెంటనే అతన్ని సర్జన్ రూమ్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అతని పరిస్థితి బాగానే ఉన్నట్లు స్టేడియం నిర్వాహకులు ప్రకటించారు. చదవండి: ఆస్ట్రేలియా అండర్-19లో భారత సంతతి కుర్రాడు.. వింత బౌలర్ల జాబితాలో చోటు మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ మిచెల్ మార్ష్(60 బంతుల్లో 100,6 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులకు, లారీ ఇవాన్స్( 40; 24 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 19 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటై 53 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. బెన్ మెక్‌డెర్మోట్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పెర్త్ స్కార్చర్స్ బౌలర్లలో టైమల్ మిల్స్ 3, ఆస్టన్ అగర్, ఆండ్రూ టై చెరో రెండు వికెట్లు తీశారు. చదవండి: Ruturaj Gaikwad: సెలక్టర్లకు తలనొప్పిగా మారుతున్న రుతురాజ్.. తాజా ఫీట్‌తో కోహ్లి సరసన Lucky the fan on the hill is OK... Because his missed catch has drawn blood 😳#BBL11 pic.twitter.com/X0MTmDp7a2 — 7Cricket (@7Cricket) December 14, 2021 -
60 బంతుల్లో శతకం.. మిచెల్ మార్ష్ విధ్వంసం
బిగ్‌బాష్ లీగ్ 2021లో మిచెల్ మార్ష్ విధ్వంసం సృష్టించాడు. బీబీఎల్‌లో పెర్త్ స్కార్చర్స్ తరపున ఆడుతున్న మార్ష్ 60 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 100 పరుగులు బాదాడు. హోబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మార్ష్ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. బీబీఎల్ మార్ష్‌కు ఇది డెబ్యూ సెంచరీ కాగా.. ఈ సీజన్లో రెండోది. ఓవరాల్‌గా బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో 28వ శతకం. ఇంతకముందు పెర్త్ స్కార్చర్స్కే చెందిన ఓపెనర్ కొలిన్ మున్రో ఈ సీజన్లో తొలి శతకంతో మెరిశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ మిచెల్ మార్ష్(60 బంతుల్లో 100,6 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులకు, లారీ ఇవాన్స్( 40; 24 బంతులు, 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 19 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటై 53 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. బెన్ మెక్‌డెర్మోట్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పెర్త్ స్కార్చర్స్ బౌలర్లలో టైమల్ మిల్స్ 3, ఆస్టన్ అగర్, ఆండ్రూ టై చెరో రెండు వికెట్లు తీశారు. Click Here For Video: Mitchel Marsh Century MITCH. MARSH. CENTURY.#BBL11 pic.twitter.com/I4zyNQyv9i — 7Cricket (@7Cricket) December 14, 2021 -
గిల్‌క్రిస్ట్‌తో మహిళా కామెంటేటర్ మజాక్.. వీడియో వైరల్
క్రికెట్ మ్యాచ్ సందర్భంగా కామెంటేటర్స్ మధ్య జరిగే సంభాషణలు ఒక్కోసారి ఆసక్తి కలిగిస్తాయి. మ్యాచ్ గురించి ప్రస్తావన తెస్తూనే తమదైన శైలిలో జోక్‌లు.. పంచ్‌లు పేల్చుకుంటూ సరదాగా ఉంటారు. తాజాగా బిగ్‌బాష్ లీగ్ 2021లో భాగంగా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. డిసెంబర్ 12న మెల్బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్స్ మధ్య సీరియస్‌గా మ్యాచ్ జరుగుతుంది. చదవండి: BBL 2021: కొలిన్ మున్రో విధ్వంసం..బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో 27వ సెంచరీ ఈ మ్యాచ్‌కు ఆస్ట్రేలియా మాజీ విధ్వంసకర ఆటగాడు ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తో పాటు మరో ఇద్దరు కామెంటేటర్స్‌గా వ్యవహరించారు. వీరిలో ఇసా గుహా అనే మహిళ కూడా ఉంది. మ్యాచ్ సందర్భంగా కామెంటరీ ప్యానెల్ మధ్య స్పిన్ బౌలింగ్‌లో ఉండే టెక్నిక్స్ అంశం చర్చకు వచ్చింది. క్యారమ్ బాల్ ప్రస్తావన రాగానే తోటి కామెంటేటర్.. '' క్యారమ్ బాల్ వేయాలంటే .. ఒక బౌలర్ మధ్య వేలును ఎక్కువగా ఉపయోగించడం చూస్తుంటాం'' అని చెప్పాడు. ఇది విన్న వెంటనే ఇసా గుహా.. ''మరి మీది ఎంత పెద్దదిగా ఉంది'' అని డబుల్ మీనింగ్ డైలాగ్ వచ్చేలా మాట్లాడడంతో గిల్‌క్రిస్ట్ ఒక్కసారిగా నవ్వేశాడు. ఇది చూసిన మిగతా టెక్నిషియన్స్ కూడా మొదట ఆశ్చర్యపోయినా నవ్వడం షురూ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. '' ఆడమ్ గిల్‌క్రిస్ట్‌తోనే మజాకా''.. ''డబుల్ మీనింగ్ మరీ ఎక్కువైంది'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: Ashes 2021: క్రేజీ బౌన్సర్.. తృటిలో తప్పించుకున్న రూట్ ఇక మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ 17.1 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. A reasonable question from @isaguha 👀😂😂😂😂😂😂 pic.twitter.com/Tzu5F2emUg — Alexandra Hartley (@AlexHartley93) December 12, 2021 -
ఆండ్రీ రసెల్ సునామీ ఇన్నింగ్స్.. సిక్సర్లతో విధ్వంసం
Andre Russell: విండీస్ విధ్వంసకర ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ బిగ్ బాష్ లీగ్ 2021-22లో సునామీ ఇన్నింగ్స్‌తో ప్రళయంలా విరుచుకుపడ్డాడు. ప్రస్తుత సీజన్లో మెల్బోర్న్ స్టార్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ కరీబియన్ యోధుడు.. సిడ్నీ థండర్‌తో జరిగిన మ్యాచ్‌లో సిక్సర్ల మోత మోగించాడు. 6 బంతుల్లో 5 సిక్సర్లు, ఓ ఫోర్‌తో 34 పరుగులు పిండుకుని మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసాడు. ప్రత్యర్ధి నిర్ధేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మెల్బోర్న్ జట్టు 12 ఓవర్లలో 83 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో బరిలోకి దిగిన రసెల్.. 21 బంతుల్లో 200 స్ట్రైక్ రేట్‌తో 5 సిక్సర్లు, ఫోర్‌తో అజేయమైన 42 పరుగులు సాధించి మరో 17 బంతులు మిగిలుండగానే తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఫలితంగా మెల్బోర్న్ స్టార్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోసిన రసెల్‌కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, రసెల్ ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టుకు ఈ లీగ్‌లో(3 మ్యాచ్‌ల్లో) ఇది రెండో విజయం చదవండి: క్రికెట్ చరిత్రలో అరుదైన ఘట్టం.. ఒకే ఓవర్లో ఆరు వికెట్లు -
కొలిన్ మున్రో విధ్వంసం..బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో 27వ సెంచరీ
Colin Munro Smash Century In BBL 2021.. బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా పెర్త్ స్కార్చర్స్ ఓపెనర్ కొలిన్ మున్రో సెంచరీతో చెలరేగాడు. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మున్రో 73 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 114 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కాగా బిగ్‌బాష్ లీగ్ చరిత్రలో కొలిన్ మున్రోది 27వ సెంచరీ. అతని ధాటికి పెర్త్ స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 195 పరుగులు భారీ స్కోరు చేసింది. మరో ఓపెనర్ బెన్కాఫ్ట్ర్ 45 పరుగులు చేసి రనౌట్‌గా వెనుదిరిగాడు. చదవండి: BBL 2021: సూపర్ క్యాచ్ పట్టాననే సంతోషం లేకుండా చేశారు అనంతరం బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ 17.5 ఓవర్లలో 146 పరుగులకే ఆలౌటై 49 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. మాథ్యూ షార్ట్ 63 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచినప్పటికీ.. మిగతావారు విఫలమయ్యారు. జాసన్ బెండార్ఫ్ , ఆండ్రూ టై చెరో 3 వికెట్లు తీశారు. చదవండి: Big Bash League 2021: కసిగా 213 పరుగులు కొట్టారు.. ప్రత్యర్థి జట్టు మాత్రం That is absolutely MASSIVE from Colin Munro. 114no from 73 deliveries 👏 #BBL11 pic.twitter.com/4t9fIxBC3s — KFC Big Bash League (@BBL) December 11, 2021 -
'విజయ్ హజారే, బీబీఎల్, ఎల్పీఎల్పై కన్నేసి ఉంచండి'
IPL Scouts Keep Eyes On Vijay Hazare, BBL 2021 & LPL 2021.. జనవరిలో ఐపీఎల్ మెగావేలం జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు రిటైన్ లిస్ట్ జాబితాను కూడా ప్రకటించాయి. ఇక వచ్చే ఐపీఎల్‌కు అహ్మదాబాద్, లక్నోల రూపంలో కొత్త ఫ్రాంచైజీలు రానుండడంతో మెగావేలంపై మరింత ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఆయా ఫ్రాంచైజీలు తమకు సమాచారం అందించే స్కౌట్స్‌కు పెద్ద పని అప్పజెప్పింది. మెగావేలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ, బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021), లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్ 2021)పై ఒక కన్నేసి ఉంచాలని తెలిపాయి. జై రిచర్డ్సన్(రూ.14 కోట్లు, పంజాబ్ కింగ్స్) భారీ హిట్టింగ్ చేస్తూ మ్యాచ్‌లను గెలిపించే యువ ఆటగాళ్లను వెతికి పట్టుకోవాలని.. వారిని వేలంలో దక్కించుకోవడానికి ఇప్పటినుంచే ప్రణాళికలు రచించాలని ఆయా ఫ్రాంచైజీలు కోరాయి. ఇంతకముందు కూడా జై రిచర్డ్సన్, రిలే మెరిడిత్ లాంటి ఆటగాళ్లు బీబీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చినవారే. ఇక విజయ్ హజారే ట్రోపీ ద్వారా పృథ్వీ షా, యశస్వి జైశ్వాల్, సంజూ శాంసన్ లాంటి వారికి గుర్తింపు రావడం.. ఆ తర్వాత ఐపీఎల్లో దుమ్మురేపడం చూశాం. ఇక టి20 ప్రపంచకప్ 2021లో హ్యాట్రిక్‌తో మెరిసిన లంక స్పిన్నర్ వనిందు హసరంగ ప్రస్తుతం ఎల్పీఎల్లో బిజీగా ఉన్నాడు. అతనితో పాటు మరికొంతమంది ఆటగాళ్లపై ఐపీఎల్ ప్రాంచైజీలు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. -
సూపర్ క్యాచ్ పట్టాననే సంతోషం లేకుండా చేశారు
BBL 2021 Melbourne Stars vs Sydney Thunders.. సిడ్నీ థండర్స్ బౌలర్ మెక్ ఆండ్రూ మెల్బోర్న్ స్టార్స్ బ్యాటర్ నిక్ లార్కిన్‌కు ఫుల్‌టాస్ బంతి వేశాడు. దీంతో లార్కిన్ స్వేర్‌లెగ్ దిశగా భారీ షాట్ కొట్టాడు. అక్కడే ఉన్న డేనియల్ సామ్స్ వెనక్కు వెళ్లి రెండు చేతులతో బౌండరీలైన్ తాకుకుండా అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. సూపర్ క్యాచ్ పట్టాననే ఊహలో ఉన్న అతను సెలబ్రేషన్ షురూ చేశాడు. కానీ క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్ మాత్రం పరుగులు తీస్తూనే ఉన్నారు. చదవండి: ఈసారి కచ్చితంగా ఔటయ్యేవాడు! బతుకుజీవుడా అనుకున్న వార్నర్ డేనియల్ సామ్స్‌కు ఒక్కక్షణం ఏం అర్థం కాలేదు. అయితే అసలు విషయం తెలిసిన తర్వాత తనకు అదృష్టం లేదంటూ తెగ ఫీలయ్యాడు. మెక్ ఆండ్రూ వేసిన బంతిని ఫీల్డ్ అంపైర్ ఫ్రంట్‌ఫుట్ నోబాల్‌గా పరిగణించాడు. దీంతో బ్యాటర్ నాటౌట్ అని తేలడంతో ప్రత్యర్థి జట్టు ఈ గ్యాప్‌లో మూడు పరుగులు పూర్తి చేసింది. ప్రస్తుతం డేనియల్ సామ్స్ హావబావాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మెల్బోర్న్ స్టార్స్.. సిడ్నీ థండర్స్‌పై నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. నిక్ లారిన్ 52 నాటౌట్ టాప్ స్కోరర్ కాగా.. కార్ట్‌రైట్ 42 పరుగులు చేశాడు. ఇక సిడ్నీ థండర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. మాథ్యూ గ్లైక్స్ 56 పరుగులతో రాణించినప్పటికి ఆఖర్లో ఔట్ కావడంతో జట్టు ఓటమి పాలయింది. చదవండి: 74 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు.. ఆస్ట్రేలియా టార్గెట్ 20 Daniel Sams couldn't believe his luck! 😫 Absolutely robbed by the @KFCAustralia Bucket Ball free-hit #BBL11 pic.twitter.com/TRWcmPvVvr — KFC Big Bash League (@BBL) December 10, 2021 -
స్టన్నింగ్ క్యాచ్.. ప్రేక్షకులకు దిమ్మతిరిగింది
Fielder Stunning Catch Shock Audience BBL 2021.. బిగ్‌బాష్ లీగ్ 2021లో భాగంగా మెల్బోర్న్ రెనెగేడ్స్ ఆటగాడు ఫ్రేజర్-మెక్‌గుర్క్ సూపర్ విన్యాసంతో అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. అడిలైడ్ స్ట్రైకర్స్ ఇన్నింగ్స్ 6వ ఓవర్‌ను జహీర్ ఖాన్ వేశాడు. ఓవర్ రెండో బంతిని స్టంప్స్ మీదకు వేయగా.. అడిలైడ్ ఓపెనర్ జేక్ వెదర్లాండ్ మిడ్ వికెట్ దిశగా స్వీప్ షాట్ ఆడాడు. భారీ సిక్స్ ఖాయమనుకున్న వేళ 19 ఏళ్ల ఫ్రేజర్-మెక్‌గుర్క్ అద్భుతం చేశాడు. అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్ అందుకొని రివర్స్‌లో జిమ్నాస్ట్ చేస్తూ సేఫ్‌గా ల్యాండ్ అయ్యాడు. అతని దెబ్బకు మ్యాచ్ చూడడానికి వచ్చిన ప్రేక్షకులు నోరెళ్లబెట్టారు. ప్రేజ్ అద్భుత విన్యాసానికి మంత్ర ముగ్దులయ్యారు. కాగా స్టన్నింగ్ క్యాచ్ అందుకున్న ఫ్రేజర్‌ను చూసి జేక్ వెదర్లాండ్ ఆశ్చర్యపోయి పెవిలియన్ బాట పట్టాడు. చదవండి: వార్నీ ఎంత సింపుల్‌గా పట్టేశాడు.. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనెగేడ్స్ 2 పరుగుల తేడాతో విజాయన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. మెకెంజీ హార్వే 56 పరుగులతో టాప్ స్కోర్ర్గా నిలవగా.. సామ్ హార్పర్ 33 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ 20 ఓవర్లలో వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసి 2 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. హారీ నీల్సన్ 30, మాథ్యూ షార్ట్ 29 పరుగులు చేశారు. మెల్బోర్న్ బౌలర్లలో జహీర్ ఖాన్ 3 వికెట్లతో మెరిశాడు. చదవండి: Mitchell Santner: మ్యాచ్ ఆడలేదు.. హీరో అయ్యాడు; అవార్డు గెలిచాడు Jake Fraser-McGurk plucks an INSANE grab!! #BBL11 pic.twitter.com/YT18EE0BBR — KFC Big Bash League (@BBL) December 7, 2021 -
కసిగా 213 పరుగులు కొట్టారు.. ప్రత్యర్థి జట్టు మాత్రం
BBL 2021: Melbourne Stars All Out For 61 Vs Sydney Sixers.. బిగ్‌బాష్ లీగ్ 2021-22లో భాగంగా మెల్బోర్న్ స్టార్స్ దారుణ ఆటతీరు కనబరిచింది. ప్రత్యర్థి విధించిన భారీ టార్గెట్‌ను చేధించలేక 61 పరుగులకే కుప్పకూలింది. కాగా సిడ్నీ సిక్సర్స్ 152 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్.. జోష్ ఫిలిప్(83, 47 బంతులు; 8 ఫోర్లు, 3 సిక్సర్లు), హెన్రిక్స్( 38 బంతుల్లో 76 నాటౌట్, 8 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో సిడ్నీ సిక్సర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. జేమ్స్ విన్స్ 44 పరుగులు చేశాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్బోర్న్ స్టార్స్ 11.1 ఓవర్లలో 61 పరుగులకే ఆలౌటైంది. పీటర్ నెవిల్ 18 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలవగా.. హిల్టన్ కార్ట్‌రైట్ 10 పరుగులు చేశాడు. సిడ్నీ సిక్సర్స్ బౌలింగ్ దాటికి ఎనిమిది మంది మెల్బోర్న్ బ్యాటర్స్ సింగిల్ డిజిట్‌కే వెనుదిరగడం విశేషం. స్టీవ్ ఓకిఫీ 4 వికెట్లతో సత్తా చాటగా.. సీన్ అబాట్ 3 వికెట్లు తీశాడు. చదవండి: వార్నీ ఎంత సింపుల్‌గా పట్టేశాడు.. The first boundary of the #BBL11 season goes to Josh Philippe! pic.twitter.com/axrDNIhy2a — cricket.com.au (@cricketcomau) December 5, 2021 He turns 37 this week but Steve O'Keefe is as sprightly as ever! #BBL11 pic.twitter.com/jn3iDkFe4y — cricket.com.au (@cricketcomau) December 5, 2021 -
4-1-8-5 సూపర్ స్పెల్.. 100 వికెట్లు
Amanda-Jade Wellington 5 Wickets Haul Super Spell Reach 100 Wickets.. 4-1-8-5.. ప్రతీ బౌలర్ కలగనే స్పెల్ ఇది. అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలర్ అమెండా వెల్లింగ్టన్ ఈ అరుదైన ఫీట్ నమోదు చేసింది.టి20ల్లో ఐదు వికెట్లు తీయడమే అరుదు.. అలాంటిది ఒక సూపర్ స్పెల్‌తో దానిని అందుకోవడం ఇక్కడ విశేషం. బిగ్‌బాష్ ఉమెన్స్ లీగ్‌లో భాగంగా.. బ్రిస్బేన్ హీట్ ఉమెన్‌తో జరుగుతన్న మ్యాచ్‌లో అమెండా వెల్లింగ్టన్ ఐదు వికెట్లు తీసింది. నాలుగు ఓవర్లు వేసిన అమెండా.. ఒక మెయిడెన్ సహా 8 పరుగులిచ్చి.. గ్రేస్ హారిస్, జార్జియా వాల్, మికాయలా హింక్లీ, లారా కిమిన్స్, జెస్ జోనాసెన్‌లు ఔట్ చేసింది. కాగా ఇదే మ్యాచ్‌లో అమెండా మరో ఘనత కూడా సాధించింది. ఉమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌లో వంద వికెట్ల మైలురాయిని అందుకుంది. లారా కిమ్మిన్స్ను ఔట్ చేయడం ద్వారా అమెండా 100 వికెట్ల మార్క్‌ను అందుకుంది. చదవండి: Venkatesh Iyer: ప్రమాదంలో పాండ్యా కెరీర్; ఆల్‌రౌండర్‌ను.. ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికైనా సిద్ధం! -
Unmukt Chand: ప్రేయసిని పెళ్లాడిన క్రికెటర్... ఫొటోలు వైరల్
Cricketer Unmukt Chand Married To His Girlfriend Simran Khosla Pics Viral: క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ ఓ ఇంటివాడయ్యాడు. తన చిరకాల ప్రేయసి సిమ్రన్ ఖోస్లాను పెళ్లాడాడు. అత్యంత సన్నిహితులు, బంధువుల సమక్షంలో నవంబరు 21న వీరి వివాహం జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉన్ముక్త్.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా.. వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో నూతన జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా దేశవాళీ క్రికెట్లో అద్బుత ప్రదర్శన కనబరిచిన ఉన్ముక్త్ చంద్.. అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టుకు సారథిగా వ్యవహరించాడు. అతడి కెప్టెన్సీలోనే 2012 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి భారత్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే, టీమిండియాకు ఆడాలన్న అతడి కల మాత్రం నెరవేరలేదు. ఈ క్రమంలో ఈ ఏడాది ఆరంభంలో ఉన్ముక్త్ చంద్ అమెరికాకు మకాం మార్చాడు. అక్కడ మైనర్ లీగ్ క్రికెట్లో తన ప్రతిభను నిరూపించుకున్న 28 ఏళ్ల ఉన్ముక్త్ చంద్... బిగ్‌బాష్ లీగ్‌కు సంతకం చేసిన తొలి భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. మెల్బోర్న్ రెనెగేడ్స్ తరఫున అతడు బరిలోకి దిగనున్నాడు. ఇక ఉన్ముక్త్ భార్య సిమ్రన్ ఫిట్నెస్, న్యూట్రిషన్ కోచ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. చదవండి: Viral Video: సోధి సింగిల్ హ్యాండ్ స్టన్నింగ్ క్యాచ్.. రోహిత్ శర్మ షాక్ Today, we decided on forever! 21.11.21 💕💍#SimRANtoChand@KhoslaSimran pic.twitter.com/enG4qCCeAi — Unmukt Chand (@UnmuktChand9) November 21, 2021 -
సూపర్ సెంచరీతో నాటౌట్ .. కానీ జట్టును గెలిపించలేకపోయింది
Smriti Mandhana Smash Maiden Century For Sydney Thunders But Lost Match.. వుమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా బుధవారం సిడ్నీ థండర్స్, మెల్బోర్న్ రెనీగేడ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇద్దరు టీమిండియా వుమెన్ ప్లేయర్స్ దుమ్మురేపారు. స్మృతి మంధాన సూపర్ సెంచరీతో మెరవగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ మొదట బ్యాటింగ్‌లో మెరుపులు.. ఆ తర్వాత బౌలింగ్‌లో తన ప్రతిభను చూపించింది. అయితే స్మృతి మంధాన సూపర్ సెంచరీ సాధించినప్పటికి జట్టును ఓటమి నుంచి గట్టెక్కించలేకపోయింది. సిడ్నీ థండర్స్‌కు చివరి ఓవర్లో 12 పరుగులు అవసరం కాగా.. మెల్బోర్న్ రెనీగేడ్స్ బౌలర్ హర్మన్‌ప్రీత్ మ్యాజిక్ బౌలింగ్ ప్రదర్శించడంతో నాలుగు పరుగులతో ఓటమి పాలైంది. చదవండి: Smriti Mandhana: మెరిసిన స్మృతి మంధాన .. సిడ్నీ థండర్స్ ఘన విజయం తొలుత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ రెనిగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ (55 బంతుల్లో 88 పరుగులు, 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. ఎవెలిన్ జోన్స్ 42, జెస్ డఫిన్ 33 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ వుమెన్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. స్మృతి మంధాన 64 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 114 పరుగులు నాటౌట్ ఊచకోత కోసినప్పటికి ఆఖరి ఓవర్లో ఒత్తిడి తట్టుకోలేక జట్టును గెలిపించలేకపోయింది. ప్రస్తుతం స్మృతి మంధాన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: Wasim Jaffer: అస్సలు గ్యాప్ లేదుగా.. ఒకటి పోతే మరొకటి A beautiful innings! Congratulations, @mandhana_smriti 🤩 #WBBL07 pic.twitter.com/Jwo4E1fN3X — Weber Women's Big Bash League (@WBBL) November 17, 2021 Phoebe Litchfield gave it everything on the rope but it's another six for Harmanpreet Kaur! Watch LIVE: https://t.co/e5UVmQR3sL #WBBL07 pic.twitter.com/X3lZJjjf8t — Weber Women's Big Bash League (@WBBL) November 17, 2021 -
మెరిసిన స్మృతి మంధాన .. సిడ్నీ థండర్స్ ఘన విజయం
మెక్కే (ఆ్రస్టేలియా): భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (39 బంతుల్లో 45; 6 ఫోర్లు) మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో మెరిసింది. ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో చక్కని ప్రదర్శనతో పాటు జట్టుకు ఉపయోగపడే భాగస్వామ్యంతో డిఫెండింగ్ చాంపియన్ సిడ్నీ థండర్స్‌ను గెలిపించింది. మొదట సిడ్నీ సిక్సర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది. సిక్సర్స్ జట్టుకు ఆడుతున్న భారత ప్లేయర్ షఫాలీ వర్మ (8) నిరాశపరిచింది. సిడ్నీ థండర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న మరో భారతీయ క్రికెటర్ దీప్తి శర్మ వికెట్లను నేరుగా గిరాటేయడంతో షఫాలీ రనౌటైంది. తర్వాత 15.2 ఓవర్లలోనే సిడ్నీ థండర్స్ 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కొరినె హాల్ (19)తో కలిసి తొలి వికెట్‌కు స్మృతి 53 పరుగులు జోడించడం విశేషం. చదవండి: T20 World Cup: మార్టిన్ క్రో ఆత్మ శాంతించేదెప్పుడు? -
చరిత్ర సృష్టించిన ఉన్ముక్త్ చంద్.. ఆ లీగ్‌లో ఆడనున్న తొలి భారత క్రికెటర్‌గా గుర్తింపు
Unmukt Becomes First Indian Male Cricketer To Sign For Big Bash League: భారత మాజీ ఆటగాడు, టీమిండియా అండర్-19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)కు ప్రాతినిధ్యం వహించనున్న తొలి భారత పురుష క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వచ్చే నెల(డిసెంబర్) నుంచి ప్రారంభంకానున్న బీబీఎల్ 2021-22 సీజన్లో మెల్బోర్న్ రెనిగేడ్స్ తరఫున ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్న ఉన్ముక్త్.. చాలాకాలంగా టీమిండియా ఆడే అవకాశాలు రాకపోవడంతో ఇటీవలే భారత్‌ను వీడి యుఎస్ఏకు వలస వెళ్లాడు. అక్కడ మేజర్ లీగ్ క్రికెట్ (ఎంఎల్సీ)తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్న అతను.. సిలికాన్ వ్యాలీ స్ట్రయికర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉంటే, 2012 అండర్-19 ప్రపంచకప్‌లో ఉన్ముక్త్ సారధ్యంలో టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన సంగతి తెలసిందే. ఆ టోర్నీ ఫైనల్లో ఉన్ముక్త్ (111 నాటౌట్) వీరోచిత సెంచరీతో భారత్‌కు కప్ అందించి తొలిసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత ఇండియా-ఏకు కెప్టెన్‌గా ఎంపికైన అతను 2015 వరకు జట్టును విజయవంతంగా నడిపించాడు. అయితే అతనికి భారత జట్టుకు ఆడే అవకాశం రాకపోవడంతో నిరాశ చెంది యుఎస్ఏకు వలస వెళ్లాడు. ఉన్ముక్త్ కెరీర్లో 65 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 120 లిస్ట్ ఏ మ్యాచ్‌ల్లో దాదాపు 8000 పరుగులు సాధించాడు. 28 ఏళ్ల ఉన్ముక్త్.. ఐపీఎల్లో ఢిల్లీ, ముంబై, రాజస్థాన్ జట్ల తరఫున 21 మ్యాచ్‌లు ఆడి 300 పరుగులు స్కోర్ చేశాడు. చదవండి: Rohit Sharma: రాత్రికి రాత్రే చెత్త ఆటగాళ్లం అయిపోము కదా.. ఇప్పుడు.. -
వుమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌లో హర్మన్‌ప్రీత్ సిక్సర్ల వర్షం
Harmanpreet Kaur Sensational Innings WBBL: వుమెన్స్ బిగ్‌బాష్ లీగ్ 2021లో మెల్బోర్న్ రెనిగేడ్స్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన ఇన్నింగ్స్‌తో మెరిసింది. 46 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 73 పరుగులు చేసిన హర్మన్ ప్రీత్.. అంతకముందు బౌలింగ్‌లోనూ రెండు వికెట్లతో మెరిసింది. ఓవరాల్‌గా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న హర్మన్ జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించింది. ఈ సందర్భంగా జేమిమా రోడ్రిగ్స్ సంచలన ఇన్నింగ్స్ ఆడిన హర్మన్‌ను ''అకా హర్మన్‌ప్రీత్ థోర్'' అంటూ ట్విటర్లో కామెంట్ చేసింది. చదవండి: క్యాచ్ పట్టేస్తారని మధ్యలో దూరింది; ఔట్ కాదా.. ఇదెక్కడి రూల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. అడిలైడ్ స్ట్రైకర్స్ బ్యాటింగ్‌లో వాన్ నికెర్క్ 62 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. వోల్వార్డట్ 47 పరుగులతో రాణించింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ రెనిగేడ్స్ హర్మన్ ఇన్నింగ్స్‌తో 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. అడిలైడ్ స్ట్రైకర్స్ బౌలింగ్‌లో మేఘన్ స్కట్ రెండు, తమలియా మెక్‌గ్రాత్, సారా కోట్ చెరో వికెట్ తీశారు. చదవండి: Virender Sehwag: నమీబియాకు, టీమిండియాకు తేడా తెలియలేదు aka Harmanpreet Thor. A mighty innings! (thanks for the new nickname, @JemiRodrigues 😄)#GETONRED pic.twitter.com/5PBZYHGAtY — Renegades WBBL (@RenegadesWBBL) October 31, 2021 -
ఒంటిచేత్తో ఆపి.. ఒక్క అడుగు వెనక్కేసి.. కళ్లు చెదిరేక్యాచ్!
మెల్బోర్న్: క్రీడాంశాల్లో క్రికెట్‌కు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. వేలాదిగా తరలివచ్చే అభిమానులు ఆటగాళ్ల అదిరిపోయే ఫీట్లకు ఫిదా అవుతుంటారు. ముఖ్యంగా బౌండరి లైన్ వద్ద ఒడిసిపట్టే క్యాచ్‌లకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుంటాయి. తాజాగా బిగ్‌బాష్ వుమెన్స్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రయికర్స్ క్రీడాకారిణి బ్రిడ్జెట్ ప్యాటర్సన్ పట్టిన క్యాచ్ వహ్వా! అనిపిస్తుంది. సిడ్నీ థండర్స్ తో శనివారం జరిగిన మ్యాచ్‌లో డీప్ మిడ్ వికెట్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న ప్యాటర్సన్.. ఇసబెల్లా వాంగ్ కొట్టిన బంతిని బౌండరీ లైన్ వద్ద ఒంటిచేత్తో ఒడిసిపట్టింది. సిక్సర్‌గా బౌండరీ లైన్ ఆవల పడుతున్న బంతిని ప్యాటర్సన్ అడ్డుకుంది. బ్యాలన్స్ కోల్పోతున్న తరుణంగా దానిని గాల్లోకి నెట్టి.. వెనక్కి అడుగేసింది. లిప్తపాటులో మళ్లీ తిరిగొచ్చి క్యాచ్ పట్టింది. ఇసబెల్లాను వెనక్కి పంపింది. ఈ క్యాచ్ ఫీట్‌పై నెటిజన్లు, సహచర ఆటగాళ్ల నుంచి ప్యాటర్సన్కు ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ స్ట్రయికర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేయగా.. 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ థండర్స్ 19.2 ఓవర్లలో 110 పరుగులకు ఆలౌట్ అయింది. Bridget Patterson walks the boundary tightrope - and catches a classic! #OhWhatAFeeling | @Toyota_Aus | #WBBL07 pic.twitter.com/C7FzpZket6 — cricket.com.au (@cricketcomau) October 16, 2021 -
Poonam Yadav : బిగ్‌బాష్ లీగ్‌లో పూనం.. ఏ జట్టుకు ఆడబోతోందంటే!
India Leg Spinner Punam Yadav: ఆస్ట్రేలియా వేదికగా ఈనెల 14న మొదలయ్యే మహిళల బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్ బరిలోకి దిగనుంది. ఈ మేరకు ఆమె బ్రిస్బేన్ హీట్ జట్టుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సీజన్ బిగ్‌బాష్ లీగ్‌లో భారత్ నుంచి స్మృతి మంధాన, దీప్తి శర్మ (సిడ్నీ థండర్స్), షఫాలీ వర్మ, రాధా యాదవ్ (సిడ్నీ సిక్సర్స్), హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ (మెల్బోర్న్ రెనెగెడ్స్), రిచా ఘోష్ (హోబర్ట్ హరికేన్స్) ఆడనున్నారు. నేడు భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టి20 వర్షంతో రద్దయిన తొలి టి20లో కనబర్చిన బ్యాటింగ్ దూకుడును పునరావృతం చేసేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. గోల్డ్‌కోస్ట్ వేదికగా నేడు భారత్, ఆస్ట్రేలియా మహిళల జట్ల మధ్య రెండో టి20 జరగనుంది. ఇందులో గెలిచి మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచేందుకు హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని భారత్ పట్టుదలగా ఉంది. మధ్యాహ్నం గం. 1.40 నుంచి సోనీ సిక్స్ చానెల్లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. చదవండి: MI Vs SRH: ఐపీఎల్లో సరికొత్త రికార్డు సృష్టించిన మహ్మద్ నబీ -
Big Bash League: రెనెగేడ్స్ తరఫున టీ20 కెప్టెన్, ఓపెనర్
Harmanpreet Kaur And Jemimah Rodrigues: మహిళల బిగ్‌బాష్ టి20 క్రికెట్ లీగ్‌లో తాజాగా భారత టి20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్ ‘మెల్బోర్న్ రెనెగేడ్స్’ జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ఖాయమైంది. ఇప్పటికే బిగ్‌బాష్ లీగ్‌లో స్మృతి మంధాన, దీప్తి శర్మ (సిడ్నీ థండర్), షఫాలీ వర్మ, రాధా యాదవ్ (సిడ్నీ సిక్సర్స్) ఆడబోతున్నారు. ఈ లీగ్‌లో జెమీమా తొలిసారి బరిలోకి దిగనుండగా, గతంలో సిడ్నీ థండర్‌కు ఆడిన హర్మన్ ఇప్పుడు రెనెగేడ్స్‌కు మారింది. చదవండి: Ind W Vs Aus W Pink Ball Test: భారత అమ్మాయిల ‘పింక్’ ఆట RCB Vs RR : మ్యాక్స్‌వెల్ మెరుపులు.. ఆర్సీబీ ఘన విజయం -
బిగ్‌బాష్ టి20 లీగ్‌లో తొలిసారిగా ఆడనున్న భారత స్టార్ ఆల్‌రౌండర్..
Smriti Mandhana And Deepti Sharma Play In Women's Big Bash League: మహిళల బిగ్‌బాష్ టి20 లీగ్‌లో భారత క్రికెటర్లు స్మృతి మంధాన, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ డిఫెండింగ్ చాంపియన్ ‘సిడ్నీ థండర్’ తరఫున ఆడతారు. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న ఇంగ్లండ్ ప్లేయర్లు హీతర్ నైట్, టామీ బీమండ్ స్థానాల్లో వీరికి చోటు దక్కింది. బిగ్‌బాష్ లీగ్‌లో స్మృతికి ఇది మూడో జట్టు. గతంలో ఆమె బ్రిస్బేన్ హీట్, హోబర్ట్ హరికేన్స్ జట్ల తరఫున ఆడింది. దీప్తి శర్మ ఈ టోర్నీలోకి అడుగు పెట్టడం ఇదే తొలిసారి. చదవండి: Indw vs Ausw: తమ వన్డేల చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన టీమిండియా -
సిడ్నీ సిక్సర్స్దే బిగ్‌బాష్ టైటిల్
సిడ్నీ: వరుసగా రెండో ఏడాది సిడ్నీ సిక్సర్స్ జట్టు బిగ్‌బాష్ టి20 టోర్నమెంట్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో సిడ్నీ సిక్సర్స్ జట్టు 27 పరుగుల ఆధిక్యంతో పెర్త్ స్కార్చర్స్ జట్టును ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన డిఫెండింగ్ చాంపియన్ సిడ్నీ సిక్సర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు సాధించింది. ఓపెనర్ జేమ్స్ విన్స్ (60 బంతుల్లో 95; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఐదు పరుగుల తేడాలో సెంచరీ అవకాశాన్ని కోల్పోయాడు. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పెర్త్ స్కార్చర్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 161 పరుగులు చేసి ఓడిపోయింది. ఓపెనర్లు బాన్‌క్రాఫ్ట్ (30; 4 ఫోర్లు, సిక్స్), లివింగ్‌స్టోన్ (45; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) శుభారంభం అందించినా... ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ తడబడటంతో పెర్త్ విజయానికి దూరమైంది. సిడ్నీ బౌలర్లలో బెన్ డ్వార్షుస్ మూడు వికెట్లు తీయగా... జాక్సన్ బర్డ్, సీన్ అబాట్, క్రిస్టియన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. చదవండి: దేవుడా.. పెద్ద గండం తప్పింది సిరాజ్, కుల్దీప్ల గొడవ.. నిజమెంత! What a moment for @SixersBBL 🏆👏🏼#BBL10 pic.twitter.com/EHDTzJSxHC — Fox Cricket (@FoxCricket) February 6, 2021 -
టైం లేదని గ్రౌండ్‌లోనే పని కానిచ్చాడు
కాన్బెర్రా: బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 10)లో భాగంగా ఆదివారం సిడ్నీ థండర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సిడ్నీ థండర్స్ బ్యాటింగ్ సమయంలో ఆ జట్టు ఓపెనర్ ఉస్మాన్ ఖాజా చేసిన ఒక పని సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తుంది. అసలు విషయంలోకి వెళితే.. సిడ్నీ ఇన్నింగ్స్ సమయంలో 9వ ఓవర్ తర్వాత కొన్ని నిమిషాల పాటు బ్రేక్ లభించింది. ఇదే సమయంలో ఖాజా తన అండర్గార్మెంట్లో గార్డ్ సమస్యగా మారడంతో డ్రెస్సింగ్ రూమ్‌కు కాల్ ఇచ్చాడు. అయితే వారు వచ్చేలోపే ఖాజా తన ప్యాంటును విప్పి తన అండర్గార్డ్ను తొలగించి దానిని సరిచేసే పనిలో పడ్డాడు. అంతలో సిబ్బంది అతని వద్దకు వచ్చి కొత్త గార్డ్ అందించడంతో దాన్ని వేసుకొని మళ్లీ యధావిథిగా ఆటను ప్రారంభించాడు. అయితే ఖాజా చర్యతో మైదానంలోని ప్రత్యర్థి ఆటగాళ్లతో పాటు అంపైర్లు, ప్రేక్షకులు ఆశ్చర్యానికి లోనయ్యారు. ఖాజాకు సంబంధించిన వీడియోనూ సెవెన్ క్రికెట్ డాట్‌కామ్ తన ట్విటర్లో షేర్ చేసింది. క్రికెట్లో ఇలాంటి సీన్ మీరు ఎప్పుడు చూసి ఉండరు.. అందరూ చూస్తుండగానే ఖాజా గ్రౌండ్‌లోనే పని కానిచ్చేశాడు అంటూ లాఫింగ్ ఎమోజీతో క్యాప్షన్ జత చేసింది. ఈ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌గా మారి నవ్వులు పూయిస్తుంది. చదవండి: థ్యాంక్స్ మోదీ జీ.. టీమిండియా ఎమోషనల్ ట్వీట్ ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. బ్రిస్బేన్ హీట్.. సిడ్నీ థండర్స్‌పై 7 వికెట్లతో విజయాన్ని అందుకొని ఫైనల్ బెర్తుకు మరింత దగ్గరైంది. మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది. కటింగ్ 34, బిల్లింగ్స్ 34 పరుగులతో రాణించారు. అనంతరం 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిస్బేన్ హీట్ 3 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. సామ్ హీజ్లెట్ 74 నాటౌట్ టాప్ స్కోరర్‌గా నిలవగా.. జిమ్మీ పియర్సన్ 43 పరుగులతో రాణించాడు.చదవండి: కళ్లు చెదిరే సిక్స్.. కొడితే అవతల పడింది Have ... have you ever seen this before 😂 Usman Khawaja had to change everything - on the field! 🙈#BBL10 pic.twitter.com/XOKsXkhLVS — 7Cricket (@7Cricket) January 31, 2021 -
కళ్లు చెదిరే సిక్స్.. కొడితే అవతల పడింది
కాన్బెర్రా: ఆసీస్ ఆల్‌రౌండర్ బెన్ కటింగ్ మీకందరికి గుర్తుండే ఉంటాడు. 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కప్పు కొట్టడంలో బెన్ కటింగ్ పాత్ర మరువలేనిది. ఆర్సీబీతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌లో 15 బంతుల్లోనే 4 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 39 పరుగులు సాధించాడు. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ కీలకమైన రెండు వికెట్లు తీసి ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరిచి సన్‌రైజర్స్‌కు కప్పు అందించాడు. తాజాగా బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా ఆదివారం సిడ్నీ థండర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య ప్లే ఆఫ్ మ్యాచ్ జరుగుతుంది. గెలిస్తే ఫైనల్ అవకాశాలు మరింత మెరుగయ్యే మ్యాచ్‌లో బెన్ కంటింగ్ జూలు విదిల్చాడు. 18 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 34 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే బెన్ కటింగ్ కొట్టిన నాలుగు సిక్సర్లలో .. ఒక సిక్సర్ స్టేడియం అవతల పడింది. మోర్నీ మోర్కెల్ వేసిన 18 ఓవర్ మూడో బంతిని కటింగ్ ప్రంట్ ఫుట్ వచ్చి డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టగా.. బంతి నేరుగా వెళ్లి స్టేడియం రూఫ్‌ను తాకుతూ బయటపడింది. మీటర్ రేంజ్లో కటింగ్ కొట్టిన సిక్స్ 101 మీటర్లుగా నమోదైంది. బెన్ కటింగ్ సిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: ఆండ్రూ టై కావాలనే అలా చేశాడా! ఈ సీజన్ బిగ్‌బాష్ లీగ్‌లో కటింగ్ కొట్టిన సిక్స్ అత్యంత ఎత్తులో వెళ్లిన సిక్స్‌గా రికార్డుకెక్కింది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కటింగ్ 34, సామ్ బిల్లింగ్స్ 34 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ ఆడుతున్న బ్రిస్బేన్ హీట్స్ ఇప్పటివరకు 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. హీట్స్ గెలవాలంటే 48 బంతుల్లో 89 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: దుమ్మురేపిన పుజారా.. కోహ్లి మాత్రం అక్కడే That is OUTTTAAAAA HERE!! Wow! #BBL10 #BBLFinals pic.twitter.com/lOTzhwDtyb — KFC Big Bash League (@BBL) January 31, 2021 -
ఆండ్రూ టై కావాలనే అలా చేశాడా!
కాన్బెర్రా: బిగ్‌బాష్ లీగ్‌లో శనివారం పెర్త్ స్కార్చర్స్‌తో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ ఘనవిజయం సాధించి ఫైనల్‌కు చేరిన మొదటి జట్టుగా నిలిచింది. సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్‌మన్ జేమ్స్ విన్స్ 98* పరుగులతో వీరవిహారం చేసి ఒంటిచేత్తో జట్టును ఫైనల్‌కు చేర్చాడు. అయితే విన్స్ సెంచరీ మిస్ కావడానికి పెర్త్ స్కార్చర్స్ బౌలర్ ఆండ్రూ టై పరోక్ష కారణమయ్యాడు. వాస్తవానికి సిడ్నీ జట్టుకు చివరి బంతికి ఒక పరుగు చేయాల్సిన దశలో విన్స్ 98 పరుగులతో ఉన్నాడు. విజయానికి ఒక పరుగు దూరం.. అతని సెంచరీకి రెండు పరుగులు అవసరమయ్యాయి. అయితే ఆండ్రూ టై కావాలని చేశాడో.. యాదృశ్చికంగా జరిగిందో తెలియదు కాని అతను వేసిన బంతి వైడ్ వెళ్లింది. దీంతో సిడ్నీ సిక్సర్స్ పరుగు అవసరం లేకుండా ఎక్స్ట్రా రూపంలో విజయం సాధించినా... విన్స్‌కు మాత్రం నిరాశ మిగిలింది. ఆండ్రూ టై చేసిన పనిపై సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ వచ్చాయి. 'ఎలాగో మ్యాచ్ ఓడిపోతారని తెలుసు.. విన్స్‌ను సెంచరీ చేయిస్తే బాగుండేది.. ఆండ్రూ టై కావాలనే ఇదంతా చేశాడు' అంటూ కామెంట్స్ రాసుకొచ్చారు. ఆండ్రూ టై చేసిన పనిపై విన్స్ స్పందించాడు. ఆండ్రూ టై కావాలనే ఆ పని చేశాడా అనేది అతనికి తెలియాలి. నేను సెంచరీ మిస్ అయినందుకు బాదేం లేదు.. ఎందుకంటే జట్టును ఫైనల్ చేర్చాననే సంతోషం ఆ బాధను మరిచిపోయేలా చేసింది. అప్పటికి అతను వేసిన బంతిని టచ్ చేసేందుకు ప్రయత్నించాను. కానీ బ్యాట్‌కు దూరంగా బంతి వైడ్ రూపంలో వెళ్లింది. ఒక బౌలర్‌గా ఆలోచించిన టై.. అతని బౌలింగ్‌లో సెంచరీ చేసే అవకాశం ఇవ్వకూడదనే అలా చేశాడు. ఈ విషయంలో ఆండ్రూ టైది కూడా తప్పు అనలేం. అంటూ చెప్పుకొచ్చాడు.చదవండి: వైరల్: బాబు ఈ కొత్త షాట్ పేరేంటో కాగా ఆండ్రూ టై చర్యపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకెల్ వాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. విన్స్ సెంచరీ కాకుండా వైడ్ వేయాలని ఆండ్రూ టై దగ్గరకు ఎవరు వచ్చి చెప్పలేదు.. కావాలనే అతను బంతిని వైడ్ వేశాడు. నిజంగా టై నుంచి ఇలాంటిది ఆశించలేదు. అంటూ విరుచుకుపడ్డాడు. కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇంగ్లిస్ 69 పరుగులు(5 ఫోర్లు, 2 సిక్సర్ల)తో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ టర్నర్ 33 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్స్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సిడ్నీ బ్యాటింగ్‌లో జేమ్స్ విన్స్ 53 బంతుల్లోనే 98 పరుగులు( 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో) వీరవిహారం చేయగా.. మరో ఓపెనర్ జోష్ ఫిలిపి 45 పరుగులతో రాణించాడు. చదవండి: అంపైర్‌ను తిట్టాడు.. మూల్యం చెల్లించుకున్నాడు -
అంపైర్‌ను తిట్టాడు.. మూల్యం చెల్లించాడు
సాక్షి, సిడ్నీ: మైదానంలో క్రికెటర్లు ఆవేశానికి లోనై సహనాన్ని కోల్పోవడం, ఆతరువాత దానికి తగిన మూల్యం చెల్లించుకోవడం తరుచూ గమనిస్తూ ఉంటాం. బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ సిక్సర్స్ మధ్య జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఇలాంటి ఘటనే పునరావృతమయ్యింది. పెర్త్ స్కార్చర్స్ ఆటగాడు మిచెల్ మార్ష్ అంపైర్ నిర్ణయంపై విస్మయానికి గురై క్షణికావేశంలో పరుష పదాజాలాన్ని వాడి, దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకున్నాడు. స్కార్చర్స్ ఇన్నింగ్స్‌లో(13 వ ఓవర్ 5వ బంతి) సిడ్నీ బౌలర్ స్టీవ్ ఓ కీఫ్ వేసిన బంతి మిచెల్ మార్ష్ బ్యాట్‌కు తాకి వికెట్ కీపర్ చేతుల్లోకి వెళ్లిందని భావించిన అంపైర్.. మార్ష్‌ను అవుట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై అసంతృప్తిని వ్యక్తం చేసిన మార్ష్.. ఆవేశంలో దురుసుగా ప్రవర్తించి 5000 డాలర్ల జరిమానాను ఎదుర్కొన్నాడు. క్రికెట్ ఆస్ట్రేలియా కోడ్ ఆఫ్ కాండక్ట్, లెవెల్-2 నేరం కింద ఈ ఆసీస్ ఆల్‌రౌండర్‌కు జరిమానా విధిస్తున్నట్టు మ్యాచ్ రిఫరీ బాబ్ స్ట్రాట్ఫోర్డ్ వెల్లడించారు. కాగా, ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ జట్టు పెర్త్ స్కార్చర్స్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన స్కార్చర్స్ 167 పరుగులు సాధించగా, సిడ్నీ జట్టు మరో 18 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు జోష్ ఫిలిప్(45), జేమ్స్ విన్స్ (53 బంతుల్లో 98 నాటౌట్) అద్భుతంగా ఆడి తమ జట్టుకు విజయాన్నందించారు. -
వైరల్: బాబు ఈ కొత్త షాట్ పేరేంటో
బిగ్‌బాష్(బీబీఎల్ 10) లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ ఆటగాడుజోష్ ఇంగ్లిస్ క్రికెట్ ప్రపంచానికి కొత్త షాట్‌ను పరిచయం చేశాడు. సిడ్నీ సిక్సర్స్ బౌలర్ బెన్డార్సిస్ వేసిన వైడ్ డెలివరిని ఇంగ్లిస్ చివరి నిమిషంలో ఫ్లిక్ చేశాడు. కాగా ఎవరు ఊహించిన విధంగా బంతి బ్యాట్ వెనకవైపు తాకుతూ కీపర్‌ను దాటుకుంటూ వేగంగా బౌండరీలైన్ దాటింది. ఇంగ్లిస్ ఆడిన ఈ తరహా షాట్ ఇప్పటివరకు ఎవరు చూడలేదు. ఈ కొత్త షాట్‌కు క్రికెట్ పుస్తకాల్లో కూడా పేరు లేదు. శనివారం సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో ఈ షాట్ నమోదైంది.ఇంగ్లిస్ ఆడిన షాట్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్లో షేర్ చేసింది. జోష్ ఇంగ్లిస్ కొత్త షాట్ ఏమైనా కనిపెట్టాడా చెప్పండి అంటూ కామెంట్ చేసింది. అయితే అతని షాట్ చూసిన కామెంటేటర్లు.. ఓ.. నో.. బిగ్‌బాష్ లీగ్‌లో అతి దారుణమైన షాట్ ఇదే అంటూ కామెంట్ చేశారు. అయితే ఇంగ్లిస్ ఆడిన షాట్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'ఇంగ్లిస్ నువ్వు ఆడిన ఈ కొత్త షాట్‌కు పేరేంటి బాబు.. కవర్ డ్రైవ్.. స్ట్రెయిట్ డ్రైవ్ లాగా బ్యాక్వర్డ్ డ్రైవ్ అయి ఉండొచ్చు.' అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. చదవండి: ఆసీస్ జట్టులో విభేదాలు.. కారణం అతనే! కాగా సిడ్నీ సిక్సర్స్‌తో జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ ఘోర పరాజయం మూటగట్టుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇంగ్లిస్ 69 పరుగులు(5 ఫోర్లు, 2 సిక్సర్ల)తో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ టర్నర్ 33 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్స్ ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. సిడ్నీ బ్యాటింగ్‌లో జేమ్స్ విన్స్ 53 బంతుల్లోనే 98 పరుగులు( 14 ఫోర్లు, ఒక సిక్సర్‌తో) వీరవిహారం చేయగా.. మరో ఓపెనర్ జోష్ ఫిలిపి 45 పరుగులతో రాణించాడు. చదవండి: అది జాతీయ జంతువు.. అందుకే కట్ చేయలేదు Did Josh Inglis just invent a new shot?!? #BBL10 pic.twitter.com/slVuZ70lGl — cricket.com.au (@cricketcomau) January 30, 2021 -
కిందా మీదా పడ్డాడు.. చివరకు రనౌట్ చేశాడు
పెర్త్: ఆసీస్ వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 10) విజయవంతగా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్‌లో ఇప్పటికే ఎన్నో ఫన్నీ వీడియోలు వైరల్‌గా మారి అభిమానుల మనుసులు గెలుచుకుంటున్నాయి. తాజాగా శనివారం పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ థండర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ కీపర్ జోష్ ఇంగ్లిస్ సిడ్నీ బ్యాట్సమన్‌ను రనౌట్ చేసిన తీరు నవ్వు తెప్పిస్తుంది. విషయంలోకి వెళితే.. జాసన్ బెండార్ఫ్ వేసిన బంతిని సామ్ బిల్లింగ్స్ ఆఫ్‌సైడ్ పుష్ చేసి నాన్ స్ట్రైకింగ్‌లో ఉన్న అలెక్స్ రాస్‌ను పరుగుకు పిలిచాడు. అయితే బెండార్ప్ వేగంగా వెళ్లి బంతిని అందుకని ఇంగ్లిస్‌కు త్రో విసిరాడు. అయితే ఇంగ్లిస్ మాత్రం బంతిని అందుకునే క్రమంలో తడబడ్డాడు. దీంతో బంతి చేతిలో నుంచి జారి గాల్లోకి లేవడంతో తన చేతిని ఉపయోగించి బంతిని వికెట్ల వైపు విసిరాడు. అదృష్టం బాగుండి వికెట్లను గిరాటేయడంతో అలెక్స్ రాస్ రనౌట్ అయ్యాడు. అయితే ఇంగ్లిస్ చర్య ఇంగ్లండ్ ఆటగాడు జేసన్ రాయ్‌కు నవ్వు తెప్పించింది. ఇంగ్లిస్.. ఎలాగైతేనేమి కిందా మీద పడి రనౌట్ అయితే చేశావంటూ నవ్వుతూ పేర్కొన్నాడు. ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.(చదవండి: 'నన్ను తిడతావేంటి... ఆ నిర్ణయం థర్డ్ అంపైర్‌ది') ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. కొలిన్ మున్రో 50, ఆస్టన్ టర్నర్ 31, జై రిచర్డసన్ 20* రాణించారు. 186 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ థండర్స్ 20 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌట్ అయి 17 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. సిడ్నీ థండర్స్ ఇన్నింగ్స్‌లో సామ్ బిల్లింగ్స్ 83 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.(చదవండి: సిడ్నీ టెస్ట్: బుమ్రా, సిరాజ్‌లపై వర్ణ వివక్ష వ్యాఖ్యలు) You are KIDDING me!!! Jason Roy's reaction to this run out is golden! 😂😂@BKTtires | #BBL10 pic.twitter.com/JDhIJ8CjLW — cricket.com.au (@cricketcomau) January 9, 2021 -
ఏబీ జెర్సీ ధరించాడు.. అందుకే అలా పడ్డాడు
పెర్త్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్-10)లో భాగంగా బుధవారం పెర్త్ స్కార్చర్స్, సిడ్నీ సిక్సర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పెర్త్ స్కార్చర్స్ కెప్టెన్ ఆస్టన్ టర్నర్ కొట్టిన ఒక షాట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెర్త్ ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ను జేక్ బాల్ వేశాడు. క్రీజులో మిచెల్ మార్ష్, ఆస్టన్ టర్నర్లు ఉన్నారు. బాల్ వేసిన మొదటి బంతిని ఆస్టన్ టర్నర్ ఫైన్‌లెగ్ దిశగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కింద పడ్డాడు.. కానీ అప్పటికే బంతి బ్యాట్‌కు సరైన దిశలో తగలడంతో వేగంగా బౌండరీ లైన్‌ను దాటేసింది. (చదవండి: సిక్స్ కొడితే బీర్ మగ్‌లో పడింది..!) ఇలాంటి షాట్లను దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఎక్కువగా ఆడుతుంటాడు. ఆస్టన్ టర్నర్ ధరించిన జెర్సీ నెంబర్ 17.. అంతర్జాతీయ క్రికెట్లో ఏబీ డివిలియర్స్ జెర్సీ నెంబర్ కూడా 17 కావడం ఇక్కడ యాదృశ్చికం. ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేసింది. ఆస్టన్ ఆడిన షాట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. 'పడితే పడ్డాడు కాని షాట్ మాత్రం సూపర్‌గా ఆడాడు.. ఏబీ డివిలియర్స్ జెర్సీని ధరించాడే కాబట్టే అలాంటి షాట్లు ఆడాడు.. టర్నర్‌కు డివిలియర్స్ గుర్తుచ్చాడేమో.. ఒక్కసారి టర్నర్ ధరించిన జెర్సీ నెంబర్ చూడండంటూ ' వినూత్న రీతిలో కామెంట్లు పెట్టారు.(చదవండి: 'ఛీ.. స్కూల్ లెవల్ కన్నా దారుణం') కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, కొలిన్ మున్రో 50 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ సిక్సర్స్ 16.4 ఓవర్లలోనే 97 పరుగులకే ఆలౌటైంది. జాక్ ఎడ్వర్డ్స్ 44 పరుగులు మినహా ఏ ఒక్కరు ఆకట్టుకోలేకపోయారు. పెర్త్ స్కార్చర్స్ బౌలర్లలో అండ్రూ టై 4 వికెట్లు తీయగా.. జై రిచర్డ్సన్ 3 వికెట్లు తీశాడు. How on earth did Ashton Turner do that!? #BBL10 pic.twitter.com/juU0uXH5MW — cricket.com.au (@cricketcomau) January 6, 2021 -
వైరల్ : టాస్ వేశారు.. కాని కాయిన్‌తో కాదు
పెర్త్ : క్రికెట్ మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ వేయడం ఆనవాయితీ. టాస్ వేయడానికి ఎక్కడైనా కాయిన్‌ను ఉపయోగిస్తారు.. కానీ బిగ్‌బాష్ లీగ్‌లో కాయిన్‌కు బదులు బ్యాట్‌ను ఫ్లిప్ చేసి టాస్ ఎంచుకోవడం వైరల్‌గా మారింది. ఈ ఘటన ఆదివారం పెర్త్ స్కార్చర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్ మధ్య జరుగుతున్న మ్యచ్‌లో చోటుచేసుకుంది. టాస్ సమయంలో కాయిన్‌కు బదులుగా బ్యాట్‌ను వాడారు. మెల్బోర్న్ రెనెగేడ్స్ కెప్టెన్ బ్యాట్ ఫ్లిప్‌తో టాస్ గెలిచిన మెల్బోర్న్ రెనెగేడ్స్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేశారు. (చదవండి: సెకన్ల వ్యవధిలో సూపర్ రనౌట్) In Perth, the @RenegadesBBL have won the bat flip and have elected to BOWL first against the @ScorchersBBL #BBL10 https://t.co/OvGFGccQuj — cricket.com.au (@cricketcomau) January 3, 2021 ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన పెర్త్ స్కార్చర్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. జోష్ ఇంగ్లిస్ 72 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కొలిన్ మున్రో 52 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మెల్బోర్న్ రెనెగేడ్స్ పరాజయం ముంగిట నిలిచింది. ఇప్పటికే 9 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 59 పరుగులతో ఓటమి అంచున నిలిచింది. -
పాపం ఫ్లెచర్.. సెకన్ కూడా గ్యాప్ ఇవ్వలేదు
హోబర్ట్ : బిగ్‌బాష్ లీగ్ 2020లో శనివారం హోబర్ట్ హరికేన్స్, మెల్బోర్న్ స్టార్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో డీ ఆర్సీ షార్ట్ చేసిన రనౌట్ వైరల్‌గా మారింది. మెరుపు వేగంతో చేసిన ఆ రనౌట్‌కు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఈ క్రేజీ రనౌట్ హోబర్ట్ హరికేన్ ఇన్నింగ్స్ 3వ ఓవర్లో చోటుచేసుకుంది. స్కాట్ బోలాండ్ వేసిన బంతిని అండ్రీ ఫ్లెచర్ మిడాఫ్ దిశగా పుష్ చేశాడు. నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న కార్ట్‌రైట్ పరుగుకు పిలుపివ్వగా.. ప్లెచర్ క్రీజు నుంచి పరిగెత్తాడు. (చదవండి : స్టన్నింగ్ క్యాచ్.. షాక్‌లో బౌలర్, బ్యాట్స్‌మన్) అప్పటికే బంతిని మెరుపు వేగంతో అందుకున్న షార్ట్ నాన్‌స్ట్రైకింగ్ వైపు త్రో విసరగా.. అది నేరుగా వికెట్లను గిరాటేసింది. అప్పటికీ ప్లెచర్ క్రీజులోకి చేరుకోలేక రనౌట్‌గా వెనుదిరిగాడు. డీ ఆర్సీ షార్ట్ చేసిన రనౌట్ తీరు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. షార్ట్ ఏంటి ఆ వేగం.. నీ రనౌట్‌తో ఫ్లెచర్ బిక్కమొహం వేశాడు. పాపం ఫ్లెచర్‌కు సెకన్ కూడా గ్యాప్ ఇవ్వలేదు.. అంటూ కామెంట్లు చేశారు. (చదవండి : ఆస్పత్రిలో చేరిన సౌరవ్ గంగూలీ) The rocket arm from D'Arcy Short runs out Fletcher and the Stars lose their second wicket #BBL10 pic.twitter.com/4wGRhQuyKr — KFC Big Bash League (@BBL) January 2, 2021 ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. మలన్ 75 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మెల్బోర్న్ స్టార్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేసి 21 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. కెప్టెన్ మ్యాక్స్‌వెల్ 70 పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్ ఆడినా అతనికి మద్దతు ఇచ్చేవారు కరువయ్యారు. అటు హరికేన్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో మెల్బోర్న్ స్టార్స్ పరాజయం మూటగట్టుకుంది. (చదవండి : 8 ఏళ్ల తర్వాత కూడా అదే తీరు) -
స్టన్నింగ్ క్యాచ్.. షాక్‌లో బౌలర్, బ్యాట్స్‌మన్
కాన్బెర్రా : బిగ్‌బాష్ లీగ్ 2020లో మెల్బోర్న్ రెనెగేడ్స్, సిడ్నీ థండర్స్ మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో మెకేంజీ హార్వే అందుకున్న స్టన్నింగ్ క్యాచ్ హైలెట్‌గా నిలిచింది. హార్వే అందుకున్న క్యాచ్ ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌నే కాదు బౌలర్‌ను కూడా షాక్‌కు గురిచేసింది. కష్టసాధ్యమైన క్యాచ్‌ను హార్వే సూపర్డైవ్ చేసి అందుకున్న తీరు అభిమానులను మునివేళ్లపై నిలబెట్టింది. హార్వే సాధించిన ఈ ఫీట్ సిడ్నీ ఇన్నింగ్స్ మూడో ఓవర్లో జరిగింది. (చదవండి : వైరల్ : క్రికెటర్ల బిల్లు చెల్లించిన అభిమాని) మెల్బోర్న్ రెనేగేడ్స్ బౌలర్ మిచెల్ పెర్రీ వేసిన ఫుల్‌టాస్ బంతిని అలెక్స్ హేల్స్ పాయింట్ దిశగా షాట్ ఆడాడు. ఆ షాట్ తీరు చూస్తే ఎవరైనా ఫోర్ అనుకుంటారు. కానీ బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న హార్వే ముందుకు డైవ్ చేసి స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. హార్వే క్యాచ్‌తో షాక్‌కు గురైన హేల్స్ నిరాశగా వెనుదిరగగా.. బౌలర్ పెర్రీ ఆశ్చర్యం వక్తం చేస్తూ కాసేపు అలాగే నిల్చుండిపోయాడు. ఈ వీడియోనూ క్రికెట్ ఆస్ట్రేలియా తన ట్విటర్లో షేర్ చేసింది. అమేజింగ్ హార్వే.. ఇది క్యాచ్ ఆఫ్ ది టోర్న్‌మెంట్ అవుతుందా? హార్వేను బెస్ట్ ఫీల్డర్ ఆఫ్ ది వరల్డ్ అనొచ్చా? దీనిపై మీ కామెంట్ ఏంటి అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా మ్యాచ్‌కు ముందు వర్షం అంతరాయం కలిగించడంతో 17 ఓవర్లకు ఆటను కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ రెనెగేడ్స్ నిర్ణీత 17 ఓవర్లలో 6వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. షాన్ మార్ష్ 87 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, నబీ 33 పరుగులతో రాణించాడు. (చదవండి: క్యారీ స్టన్నింగ్ క్యాచ్.. వహ్వా అనాల్సిందే) అనంతరం 20 ఓవర్లలో 173 పరుగుల సవరించిన లక్ష్యాన్ని సిడ్నీ థండర్స్ ముందు ఉంచారు. ఓపెనర్లు ఉస్మాన్ ఖాజా, అలెక్స్ హేల్స్ దాటిగా ఆడడంతో సిడ్నీ థండర్స్ వేగంగా పరుగులు సాధించింది. హేల్స్ వెనుదిరిగిన అనంతరం మ్యాచ్‌కు మరోసారి వర్షం అంతరాయం కలిగింది. అప్పటికి సిడ్నీ థండర్స్ 12 ఓవర్లలో 117 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. దీంతో డక్‌వర్త్ లుయీస్ పద్దతిలో సిడ్నీ థండర్స్ 7 పరుగుల తేడాతో విజయం సాధించినట్లు రిఫరీ ప్రకటించారు. The catch of the tournament!? The best fielder in the world!? What a grab...#BBL10 | @BKTtires pic.twitter.com/ByRq1ecBCL — cricket.com.au (@cricketcomau) January 1, 2021 -
సూపర్ రనౌట్.. ఆ మీసానికి పవర్స్ ఉన్నాయా!
హోబర్ట్ : బిగ్‌బాష్ లీగ్ 2020లో హోబర్ట్ హరికేన్స్, అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హరికేనక్స్ బౌలర్ రిలే మెరెడిత్ ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్‌ను రనౌట్ చేసిన తీరు ఇప్పుడు వైరల్‌గా మారింది. అడిలైడ్ స్ట్రైకర్స్ ఇన్నింగ్స్ సమయంలో 9వ ఓవర్ వేసిన మెరెడిత్ మూడో బంతిని ర్యాన్ గిబ్సన్‌కు విసిరాడు. అయితే బంతి బ్యాట్‌ను తాకి పిచ్‌లో ఉండిపోయింది. అప్పటికే నాన్ స్ట్రైకింగ్ ఎండింగ్లో ఉన్న బ్యాట్స్‌మన్ ముందుకు రావడంతో ర్యాన్ గిబ్సన్ కూడా క్రీజు వదిలి పిచ్ మధ్యకు వచ్చేశాడు.(చదవండి : రషీద్‌ను దంచేసిన ఆసీస్ బ్యాట్స్‌మన్) అప్పటికే పిచ్‌పై పాదరసంలా కదిలిన మెరెడిత్ బంతిని చేత్తో తీసుకోకుండా కేవలం ఫుట్వర్క్తోనే వికెట్లకు గిరాటేశాడు. గిబ్సన్ క్రీజులోకి చేరేలోపే బంతి వికెట్లను తాకినట్లు రిప్లేలో కనపడడంతో రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత బంతికే రషీద్‌ఖాన్‌ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చిన మెరెడిత్ అంతకముందు వేసిన ఓవర్లోనూ జొనాథన్ వెల్స్‌ను కూడా డకౌట్ చేశాడు. ఓవరాల్‌గా మెరెడిత్ నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. అయితే మెరెడిత్ గిబ్సన్‌ను ఔట్ చేసిన తీరును బిగ్‌బాష్ లీగ్ తన ట్విటర్లో షేర్ చేసింది. 'ఇది నిజంగా నమ్మశక్యం కాని విషయం.. మెరెడిత్ ఒక్కడే అన్ని పనులు చేస్తున్నాడు.. కచ్చితంగా అతని మీసానికి ఏవో సూపర్ పవర్స్ ఉన్నాయి' అంటూ ఫన్నీ క్యాప్షన్ జత చేశారు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. (చదవండి : ముందు మీ టాప్ ఆర్డర్ చూసుకో : వసీం జాఫర్) Incredible! That moustache has super powers. Riley Meredith is doing it all out there! #BBL10 pic.twitter.com/I6ccaj2QQ7 — KFC Big Bash League (@BBL) December 13, 2020 కాగా ఈ మ్యాచ్‌లో హోబర్ట్ హరకేన్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. డీ ఆర్సీ షార్ట్ 48 బంత్లుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 175 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన అడిలైడ్ స్ట్రైక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. అడిలైడ్ బ్యాట్స్మెన్లలో డేనియల్ వోర్రాల్ 66* పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హరికేన్స్ బౌలర్లలో జేమ్స్ ఫాల్కనర్ 3 వికెట్లతో రాణించగా.. జాన్ బోతా, రిలే మెరిడిత్ చెరో 2 వికెట్లు తీశారు. (చదవండి : వైరల్ : రనౌట్ తప్పించుకునేందుకే..) -
రషీద్‌ను దంచేసిన ఆసీస్ బ్యాట్స్‌మన్
హోబర్ట్ : బిగ్‌బాష్ లీగ్ 2020లో ఆదివారం అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హోబర్ట్ హరకేన్స్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. హోబర్ట్ హరికేన్స్ బ్యాట్స్‌మెన్ డీ ఆర్సీ షార్ట్ 48 బంత్లుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 72 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించాడు. కాగా అడిలైడ్ స్రైకర్స్ బౌలర్ రషీద్ ఖాన్‌ను డీ ఆర్సీ షార్ట్ దంచికొట్టాడు. రషీద్ వేసిన ఒక ఓవర్లో 3 సిక్సర్లు, ఒక ఫోర్ సహా మొత్తం 24 పరుగులు పిండుకున్నాడు. ఇదే డీ ఆర్సీ షార్ట్ టీమిండియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో మాత్రం ఘోరంగా విఫలమయ్యాడు.(చదవండి : ముందు మీ టాప్ ఆర్డర్ చూసుకో : వసీం జాఫర్) వాస్తవానికి షార్ట్ 23 పరుగుల వద్ద ఉన్నప్పుడు డాన్ వోర్రాల్ క్యాచ్ జారవిడవడంతో బతికిపోయిన డీ ఆర్సీ షార్ట్ మరో అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. 175 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన అడిలైడ్ స్ట్రైక్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 163 పరుగులు మాత్రమే చేయగలిగింది. అడిలైడ్ బ్యాట్స్మెన్లలో డేనియల్ వోర్రాల్ 66* పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హరికేన్స్ బౌలర్లలో జేమ్స్ ఫాల్కనర్ 3 వికెట్లతో రాణించగా.. జాన్ బోతా, రెలీ మెరిడిత్ చెరో 2 వికెట్లు తీశారు.(చదవండి : ఆసీస్‌కు మరో దెబ్బ.. కీలక బౌలర్ ఔట్!) 6⃣ 6⃣ 4⃣ 6⃣ 2⃣ D'Arcy Short smashes 24 runs in a single over off the No.1 T20I bowler, Rashid Khan 🔥#BBL10 pic.twitter.com/FsSRtj1Okh — ICC (@ICC) December 13, 2020 -
వైరల్ : రనౌట్ తప్పించుకునేందుకే..
కాన్బెర్రా : బిగ్‌బాష్ లీగ్ 2020లో శనివారం మెల్బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్స్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మెల్బోర్న్ స్టార్స్ ఇన్నింగ్ ఆఖరి ఓవర్లో డేనియల్ సామ్స్ వేసిన బంతిని బ్యాట్స్‌మెన్ లార్కిన్ ఫ్లిక్ చేశాడు. అయితే పొరపాటున బంతి లార్కిన్ జెర్సీలోకి దూరిపోయింది. అయితే లార్కిన్ కొట్టిన బంతి ఎక్కడా కనిపించకపోవడంతో సిడ్నీ థండర్స్ ఆటగాళ్లు కన్య్ఫూజ్ అయ్యారు. ఈ విషయం గమనించని లార్కిన్ నాన్ స్ట్రైకర్ ఎండ్ పిలుపుతో లార్కిన్ సింగిల్ పూర్తి చేశాడు. అతను సింగిల్ పూర్తి చేసే క్రమంలో జెర్సీ నుంచి బంతి కిందకు జారింది. (చదవండి : ఆసీస్‌కు మరో దెబ్బ.. కీలక బౌలర్ ఔట్!) దీంతో అవాక్కైన ఫీల్డర్లు ఇది ఛీటింగ్.. రనౌట్ తప్పించుకోవాలనే అలా చేశాడని.. అతని సింగిల్ చెల్లదని అంపైర్‌కు ఫిర్యాదు చేశారు. ఫీల్డ్ అంపైర్లు పరిశీలించి లార్కిన్ తీసిన సింగిల్‌ను రద్దు చేసి అతన్ని మళ్లీ స్ట్రైకింగ్‌కు పంపించారు. ఈ సంఘటనతో మైదానంలో కాసేపు డ్రామా నెలకొంది. ఈ వీడియోనూ బిగ్‌బాష్ లీగ్ నిర్వాహకులు ట్విటర్ షేర్ చేశారు. ' రనౌట్ తప్పించుకునేందుకు బంతిని జెర్సీలో దాచి పరుగులు పెట్టాడు... ఎంతైనా లార్కిన్ ఇంటలిజెంట్ బ్యాట్స్‌మెన్' అని సరదాగా కామెంట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఆ తర్వాత బంతికే లార్కిన్ రన్ఔట్ అయ్యాడు.. ఈసారి మాత్రం అతన్ని అదృష్టం వరించలేదు. (చదవండి : క్యాచ్ వదిలేశాడని బౌలర్ బూతు పురాణం) Hide the ball and run! Bit cheeky here from Nick Larkin... 😝 A @KFCAustralia Bucket Moment | #BBL10 pic.twitter.com/M4T4h2l3g6 — KFC Big Bash League (@BBL) December 12, 2020 ఈ మ్యాచ్‌లో మెల్బోర్స్ స్టార్స్ 22 పరుగులతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. మెల్బోర్న్ స్టార్స్ జట్టులో స్టోయినిస్ 61, మ్యాక్స్‌వెల్ 39 పరుగులతో రాణించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ థండర్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. పెర్గూసన్ 54 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అలెక్స్ హేల్స్ 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. (చదవండి : నా తండ్రి వ్యాఖ్యలు నన్ను బాధించాయి) -
‘బయో బబుల్’ కోసం రూ. 159 కోట్లు
మెల్బోర్న్: కరోనాతో ఆర్థికంగా కుదేలైన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌తో పాటు బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్) కోసం అత్యధిక మొత్తం ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. ఈ టోర్నీలు నిర్విఘ్నంగా జరిగేందుకు వీలుగా కోవిడ్–19 బయో బబుల్ బడ్జెట్‌ను భారీగా పెంచింది. 30 మిలియన్ ఆస్ట్రేలియా డాలర్లు (రూ.159 కోట్లు) బయో బబుల్ నిర్వహణ కోసమే వినియోగించనున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది చివర్లో 4 టెస్టుల సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటించనుంది. దీనితో పాటు బిగ్ బాష్ లీగ్ (బీబీఎల్)ను సురక్షిత పరిస్థితుల్లో నిర్వహించేందుకు సీఏ ఈ భారీ మొత్తాన్ని కేటాయించింది. నిజానికి బ్రాడ్‌కాస్టర్ ‘చానెల్ సెవెన్’తో తమ ఒప్పందాన్ని నిలుపుకునేందుకే సీఏ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. చానెల్ సెవెన్, సీఏల మధ్య 300 మిలియన్ డాలర్ల (రూ. 1592 కోట్లు) ప్రసార హక్కుల ఒప్పందం ఉంది. అయితే అత్యంత ప్రేక్షకాదరణ ఉండే బీబీఎల్‌ను తాజా పరిస్థితుల్లో సీఏ నిర్వహించదేమోనన్న అనుమానంతో ఈ ఒప్పందం నుంచి తప్పుకునేందుకు చానెల్ సెవెన్ సిద్ధమైంది. ఇదే జరిగితే సీఏకు భారీ నష్టం వాటిల్లుతుంది. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు టోర్నీలను సురక్షితంగా నిర్వహించేందుకు తొలుత 10 మిలియన్ డాలర్లు (రూ. 53 కోట్లు)గా ఉన్న బయో బబుల్ బడ్జెట్‌ను 30 మిలియన్ డాలర్లకు పెంచింది. (చదవండి: కార్తీక దీపం కోసం ‘ఐపీఎల్ టైమింగ్ మార్చండి') -
‘దీనినే తెలుగులో దురదృష్టమంటారు’
బ్యాట్స్‌మన్ నుంచి ఎలాంటి తప్పిదం జరగలేదు.. బౌలర్ గొప్పదనమేమి లేదు.. ఫీల్డర్ చాకచక్యంగానూ వ్యవహరించలేదు.. కానీ అవతలి ఎండ్‌లో నాన్ స్ట్రయికర్ రనౌట్‌గా వెనుదిరిగాడు. బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా సిడ్నీ సిక్సర్స్-మెల్బోర్న్ రెనిగెడ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మెల్బోర్స్ బౌలర్ విల్ సదర్లాండ్ విసిరిన బంతిని సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్‌మన్ జోష్ ఫిలిప్ బౌలర్ వైపు బలంగా కొట్టాడు. అయితే బ్యాట్స్‌మన్ షాట్ తప్పి బంతి నేరుగా బౌలర్ చేతుల్లోకి వెళ్లింది. అయితే ఆ బంతిని బౌలర్ అందుకోవడం విఫలమయ్యాడు. కానీ అనూహ్యంగా బౌలర్ జారవిడిచిన ఆ బంతిన నాన్స్ట్రయిక్లో ఉన్న వికెట్లను ముద్దాడింది. అప్పటికే క్రీజు వదిలి ఉన్న నాన్‌స్ట్రయికర్ జేమ్స్ విన్సే రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే అసలేం జరిగిందో తెలియక విన్సేతో పాటు స్టేడియంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయితే రిప్లైలో క్లియర్‌గా చూశాక జేమ్స్ విన్సే భారంగా క్రీజు వదిలివెళ్లాడు. ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియోను బీబీఎల్ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేయడంతో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతేకాకుండా నెటిజన్లు సరదాగా కామెంట్ చేస్తున్నారు. ‘దీనినే తెలుగులో దురదృష్టమంటారు’అని ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ చేయగా.. ‘ఈ బీబీఎల్‌లో విన్సే చుట్టు దురదృష్టం వైఫైలా తిరుగుతోంది’అంటూ మరొకరు కామెంట్ చేశారు. ఇక తాజా బీబీఎల్ సీజన్లో ఈ ఇంగ్లీష్ క్రికెటర్ విన్సేకు ఏదీ కలసిరావడం లేదు. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన విన్సే 25.75 సగటుతో 309 పరుగులు సాధించి నిరుత్సాహపరుస్తున్నాడు. అయితే తన చివరి రెండు మ్యాచ్‌ల్లో 41 నాటౌట్, 51 పరుగులతో ఫామ్‌లోకి వచ్చినట్టు కనపడ్డాడు. కాగా, మెల్బోర్న్ మ్యాచ్‌లో 13 బంతుల్లో 22 పరుగులు చేసి సత్తా చాటుతున్న సమయంలో దురదృష్టవశాత్తు రనౌట్‌గా వెనుదిరిగాడు. అయితే శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. Could James Vince BE any more unlucky?? 😱#BBL09 pic.twitter.com/fJDssdx2FA — KFC Big Bash League (@BBL) January 25, 2020 చదవండి: ‘ఇప్పుడే ఐపీఎల్లో ఆడటం అవసరమా?’ పరుగు కోసం తాపత్రయం.. తప్పిన ప్రమాదం -
‘ఇప్పుడే ఐపీఎల్లో ఆడటం అవసరమా?’
లండన్: ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ టామ్ బాంటన్ రానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఆడటం కంటే ప్రస్తుతం కౌంటీ చాంపియన్ షిప్లో ఆడటమే బెటర్ అని ఇంగ్లీష్ జట్టు మాజీ సారథి మైకేల్ వాన్ అభిప్రాయపడ్డాడు. ‘టీ20ల్లో బాంటన్ సూపర్ స్టార్ అన్న విషయం తెలిసిందే. ప్రత్యేకంగా ఆ ఫార్మట్‌లో అతడు నిరూపించుకోవాల్సింది ఏమీ లేదు. అయితే ప్రస్తుతం ఇంగ్లండ్ టెస్టు జట్టులో ఆరో స్థానం నాణ్యమైన బ్యాట్స్‌మన్ కోసం ఎదురుచూస్తోంది. దీంతో బాంటన్ కౌంటీల్లో తన సత్తా నిరూపించుకుని టెస్టు జట్టులోకి వచ్చే సువర్ణావకాశం ముందుంది. అతడు ఇప్పుడే ఐపీఎల్లో ఆడటం అవసరం లేదు. ఇంకొంత కాలం ఆగితేనే బెటర్. ఐపీఎల్ కంటే కౌంటీ చాంపియన్ షిప్లో సోమర్ సెట్ తరుపున ఆడితే అతడి కెరీర్‌కు ఎంతో లాభం చేకూరుతుంది. అవసరమైతే ఐపీఎల్ కాంట్రాక్టును రద్దు చేసుకున్నా పర్వాలేదు. కౌంటీల్లో ఆడటం వల్ల ఆటగాడిగా బాంటన్ మరింత పరిణితి చెందుతాడు. టెస్టు ఆడినప్పుడు పరిపూర్ణమైన ఆట బయటకు వస్తుంది. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది అతడే. మరి ఏం నిర్ణయం తీసుకుంటాడో చూడాలి’ అని వాన్ పేర్కొన్నాడు. ఇక గతేడాది డిసెంబర్లో ఐపీఎల్-2020 కోసం జరిగిన వేలంలో టామ్ బాంటన్‌ను కనీస ధర రూ. కోటికి కోల్‌కతా నైట్‌రైడర్స్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా బ్రిస్బేన్ హీట్ తరుపున ఆడుతున్న ఈ క్రికెటర్ సిక్సర్ల వర్షం కురిపిస్తుండటంతో కేకేఆర్ అభిమానులు ఇక్కడ చప్పట్లు కొడుతున్నారు. చదవండి: ‘అక్తర్.. ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడు’ కాంబ్లికి సచిన్ సవాల్.. -
పరుగు కోసం తాపత్రయం.. తప్పిన ప్రమాదం
మెల్బోర్న్: మిగతా ఆటలతో పోలిస్తే క్రికెట్లో కాస్త రిస్క్ తక్కువ అని కొందరి అభిప్రాయం. అయితే ఏ మాత్రం అదుపు తప్పిన, అలసత్వం ప్రదర్శించినా ఊహకు కూడా అందని పరిణామాలు చోటు చేసుకుంటాయి. గతంలో ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్ ఉదంతమే ఇందుకు ఉదాహరణ. బిగ్‌బాష్‌లీగ్ (బీబీఎల్) భాగంగా మెల్బోర్న్ రెనిగెడ్స్ బ్యాట్స్‌మన్ సామ్ హార్పర్ పరుగు తీసే క్రమంలో బౌలర్‌ను ఢీ కొట్టి ఆస్పత్రిపాలయ్యాడు. అయితే ఈ ఘటన జరిగిన తీరు చూశాక సహచర ఆటగాళ్లతో పాటు మైదానంలోని ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. బీబీఎల్‌లో భాగంగా మంగళవారం హార్బర్ట్ హరికేన్స్, మెల్బోర్న్ రెనిగెడ్స్ జట్ల మధ్య హోరాహోరు పోరు జరిగింది. అయితే మెల్బోర్న్ బ్యాటింగ్ సందర్భంగా హరికేన్స్ బౌలర్ నాథన్ ఎల్లిస్ వేసిన బంతిని బ్యాట్స్‌మన్ సామ్ హార్పర్ మిడాఫ్ మీదుగా ఆడి సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. అయితే మిడాఫ్‌లో ఉన్న ఫీల్డర్ బంతిని అందుకోవడాన్ని గమనించిన హార్పర్ ఎదురుగా ఉన్న బౌలర్‌ను చూసుకోకుండా పరిగెత్తాడు. అయితే బంతిని అందుకోవడానికి వికెట్ల దగ్గరే ఉన్న ఎల్లిస్‌ను హార్పర్ బలంగా ఢీ కొట్టి గాల్లొకి ఎగిరాడు. అయితే గాల్లోకి ఎగిరి కిందపడే సమయంలో హార్పర్ మెడ బలంగా మైదానాన్ని తాకింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడు. డాక్టర్లు వచ్చి హార్పర్‌కు ప్రాథమిక చికిత్స అందించారు. అయితే అతడికి మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి తరలించాలని డాక్టర్లు సూచించారు. దీంతో రిటైర్ట్ హర్ట్‌గా వెనుదిరిగాడు. 😨 Nasty collision in the middle between Sam Harper and Nathan Ellis. Play has stopped while the docs take a look at Harper #BBL09 pic.twitter.com/yDARqnMtRl — KFC Big Bash League (@BBL) January 21, 2020 ఈ ఘటనకు సంబంధించిన వీడియోను బీబీఎల్ తన అధికారిక ట్విటర్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అయింది. హార్పర్ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు ఆశిస్తున్నారు. అంతేకాకుండా ఆటగాళ్లు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో మెల్బోర్న్ రెనిగెడ్స్ 4 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లకు 190 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం రెనిగేడ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 186 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. చదవండి: కాంబ్లికి సచిన్ సవాల్ స్టార్క్‌ను ట్రోల్ చేసిన భార్య -
‘కష్టమే అనుకున్నాం.. కానీ కళ్లు చెదిరే క్యాచ్’
సిడ్నీ : క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫీల్డర్ మైదానంలో చురుగ్గా కదిలి అందివచ్చిన క్యాచ్‌ను ఒడిసి పట్టుకుంటేనే ఫలితం ఆశాజనకంగా ఉంటుంది. అయితే, ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో కొన్నిసార్లు బంతిని అంచనా వేయలేకపోవచ్చు. దాంతో అటు క్యాచ్, ఇటు మ్యాచ్ ప్రత్యర్థి వశం అయ్యే ప్రమాదం ఉంటుంది. లేదంటే పరుగులు సమర్పించుకోవచ్చు. ఇక ఆస్ట్రేలియాలో జరిగే ప్రతిష్టాత్మక బిగ్‌బాష్ లీగ్‌లో శనివారం అద్భుతమైన క్యాచ్ సన్నివేశమొకటి ఆవిష్కృతమైంది. సిడ్నీ థండర్, హోబర్ట్ హారికేన్స్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో.. హొబర్ట్ ఆటగాడు నాథన్ ఎల్లిస్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టాడు. సిడ్నీ థండర్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజా ఆట 12వ ఓవర్లో డీప్ స్క్వేర్ లెగ్ దిశగా కొట్టిన భారీ షాట్ గాల్లోకి లేచి వేగంగా బౌండరీ లైన్ వైపు దూసుకొచ్చింది. బంతి క్యాచ్ పడుదామని నాథన్ ముందుకు కదిలాడు. కానీ, అతని అంచనా తప్పింది. బంతి తక్కువ ఎత్తులో అతని వైపు రాసాగింది. చాకచక్యంగా వ్యవహరించిన నాథన్.. మోకాళ్లపై కూర్చుని క్యాచ్ పట్టేందుకు యత్నించాడు. అయితే, అంచనాలు తలక్రిందులు చేస్తూ.. బంతి అతని పైనుంచి వెళ్లింది. వెంటనే అలర్టయిన నాథన్ మోకాళ్లపైనే కూర్చుని రెండు చేతులు పైకి చాచడం.. బంతి అతని చేతిలో పడటం చకచక జరిగిపోయాయి. దీంతో 35 పరుగులు చేసిన ఓపెనర్ ఖవాజా పెవిలియన్ చేరక తప్పలేదు. ఈ మ్యాచ్‌లో హోబర్ట్‌పై థండర్ విజయం సాధించింది. నాథన్ క్యాచ్ వీడియోపై సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. చేజారిందనుకున్న క్యాచ్‌ను నాథన్ చక్కగా ఒడిసిపట్టాడని నెటిజన్లు పేర్కొన్నారు. -
పొరబడి.. తేరుకుని చేతుల్లో బంధించాడు
-
భారీ షాట్ ఆడబోయి బ్యాట్‌ను వదిలేశాడుగా
-
షాట్ ఆడబోయి బ్యాట్‌ను వదిలేశాడుగా
బ్రిస్బేన్ : క్రికెట్ ఆటలో ఫన్నీ మూమెంట్స్ చోటు చేసుకువడం సహజంగా కనిపిస్తూనే ఉంటాయి. అందులో కొన్ని మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా బ్రిస్బేన్‌లోని గబ్బా స్టేడియంలో గురువారం బ్రిస్బేన్ హీట్ , హోబర్ట్ హరికేన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. కాగా హోబర్ట్ హరికేన్స్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌లో భాగంగా 18వ ఓవర్లో ఆప్ఘనిస్తాన్ స్పిన్నర్ ఖైస్ అహ్మద్ స్ట్రైకింగ్‌లో ఉన్నాడు. బ్రిస్బేన్ హీట్ బౌలర్ జోష్ లాలోర్ వేసిన ఫుల్ లెంగ్త్ డెలివరినీ స్టంప్స్‌కు దూరంగా జరిగి ఫైన్‌లెగ్ మీదుగా షాట్ ఆడాలని ప్రయత్నించి పొరపాటున బ్యాట్‌ను వదిలేశాడు. దీంతో బ్యాట్ గాల్లో గిర్రున తిరిగి కొంచెం దూరంలో పడింది. అయితే బ్యాట్‌ను తీసుకొచ్చిన ఆటగాడు ఖైస్కు ఇస్తూ' గబ్బాలో బాల్‌కు బదులు బ్యాట్లు ఎగురుతున్నాయి' అంటూ నవ్వుతూ చెప్పాడు. దీంతో ఖైస్‌తో పాటు ఇతర ఆటగాళ్లు కూడా చిరునవ్వులు చిందించారు. కాగా ఈ మ్యాచ్‌లో బ్రిస్బేన్ హీట్ హోబర్ట్ హరికేన్స్‌పై 5వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన హోబర్ట్ హరికేన్స్ 20 ఓవరల్లో 9వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఆ తర్వాత 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బ్రిస్బెన్ హీట్ 18.2 ఓవరల్లో 5 వికెట్లు కోల్పోయి 131 పరుగులు సాధించింది. (ఇట్స్ మిరాకిల్.. ఒకే రోజు రెండు) -
ఇట్స్ మిరాకిల్.. ఒకే రోజు రెండు
అడిలైడ్: బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్) ఒకే రోజు రెండు అద్భుతాలు చోటు చేసుకున్నాయి. ధనాధన్ ఫార్మట్‌లో బ్యాట్స్‌మెన్ హవా కొనసాగుతున్న తరుణంలో బౌలర్లు కూడా తమ సత్తా చాటుతున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఒకే రోజు రెండు హ్యాట్రిక్ వికెట్స్ నమోదయ్యాయి. తొలుత అడిలైడ్ స్ట్రైకర్ స్పిన్నర్, అఫ్గానిస్తాన్ సంచలనం రషీద్ ఖాన్ సిడ్నీ సిక్సర్స్‌పై హ్యాట్రిక్ నమోదు చేయగా.. ఇదే రోజు మెల్బోర్న్ స్టార్స్, పాకిస్తాన్ ప్లేయర్ హ్యారీస్ రౌఫ్ సిడ్నీ థండర్‌పై రెండో హ్యాట్రిక్ నమోదు చేశాడు. సిడ్నీ థండర్‌తో మ్యాచ్‌లో మెల్బోర్న్ పేస్ బౌలర్ వరుసగా ఫెర్గుసన్ (35), గిల్స్క్(41), స్యామ్స్ (0) వికెట్లన పడగొట్టి హ్యాట్రిక్ నమోదు చేశాడు. దీంతో ఒకే రోజు రెండు హ్యాట్రిక్ వికెట్లు నమోదవడంపై బీబీఎల్ ఫ్యాన్స్ సంబరపడుతూ ఇట్స్ మిరాకిల్ అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సిడ్నీ సిక్సర్‌తో జరిగిన మ్యాచ్‌లో అడిలైడ్ స్ట్రైకర్ మిస్టరీ స్పిన్నర్ రషీద్ ఖాన్ హ్యాట్రిక్ నమోదు చేసిన విషయం తెలిసిందే. వరుసగా జేమ్స్ విన్సే(27), జోర్డాన్ సిల్క్(16), జాక్ ఎడ్వర్డ్స్(0)లను ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. అయితే రషీద్ హ్యాట్రిక్‌తో మెరిసినా అడిలైడ్ ఓటమి చవిచూసింది. రెండు వికెట్లు తేడాతో సిడ్నీ సిక్సర్ విజయం సాధించింది. ఇక గత కొంతకాలంగా విశేషంగా రాణిస్తున్న జూనియర్ రావల్సిండి ఎక్స్‌ప్రెస్ హ్యారీస్ రౌఫ్ టీ20 ప్రపంచకప్ కోసం సమయాత్తమవుతున్నాడు. దీనికోసం బీబీఎల్‌ను చక్కగా వినియోగించుకోవాలని ఈ పాక్ బౌలర్ భావిస్తున్నాడు. గతేడాది డిసెంబర్లో బీబీఎల్‌లో భాగంగా జరిగిన ఓ మ్యాచ్‌లో ఈ పాకిస్తాన్ క్రికెటర్ హ్యారీస్ రౌఫ్.. ఆ మ్యాచ్‌లో వాడిని బంతిని మ్యాచ్ అనంతరం అక్కడున్న ఓ భారతీయ సెక్యూరిటీ గార్డుకు బహుమతిగా ఇవ్వడం నెటిజన్లను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. A day of hat-tricks at the #BBL 🤯 Haris Rauf claims the second 🎩🎩🎩 of the day! pic.twitter.com/s1tTHG8xnA — T20 World Cup (@T20WorldCup) January 8, 2020 -
రషీద్ హ్యాట్రిక్.. కానీ బర్త్‌డే బాయ్‌దే గెలుపు
అడిలైడ్: బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)లో బుధవారం రెండు వినూత్న ఘటనలు జరిగాయి. అడిలైడ్ స్ట్రైకర్ స్పిన్నర్ రషీద్ ఖాన్, సిడ్నీ సిక్సర్స్ బౌలర్, బర్త్‌డే బాయ్ జోష్ హేజిల్వుడ్ల మధ్య ఆసక్తికర పోరు జరిగింది. అయితే ఈ పోరులో బర్త్‌డే బాయ్ హేజిల్ వుడ్ విజయం సాధించాడు. కాగా సిడ్నీ ఆల్‌రౌండర్ టామ్ కరన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. బీబీఎల్‌లో భాగంగా బుధవారం అడిలైడ్, సిడ్నీ జట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన అడిలైడ్‌కు టామ్ కరన్(4/22) చుక్కలు చూపించాడు. కరన్‌కు తోడు మిగతా సిడ్నీ బౌలర్లు సహకారం అందించడంతో అడిలైడ్ జట్టు 19.4 ఓవర్లలో 135 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీకి కూడా ఆశించిన ఆరంభం లభించలేదు. అడిలైడ్ బౌలర్ నెసెర్ ఆరంభంలోనే సిడ్నీ సిక్సర్స్ ఓపెనర్ల వికెట్లు పడగొట్టాడు. అయితే ఎట్టాగెట్టానో గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్న సిడ్నీ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ పనిపట్టాడు రషీద్ ఖాన్. వరుసగా జేమ్స్ విన్సే(27), జోర్డాన్ సిల్క్(16), జాక్ ఎడ్వర్డ్స్(0)లను ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. కాగా, బీబీఎల్‌లో రషీద్‌కు ఇది మూడోది కాగా, అడిలైడ్ స్ట్రైకర్ జట్టుకు మొదటిది. రషీద్ దెబ్బకు 97 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి సిడ్నీ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ తరుణంలో టామ్ కరన్ ఈ సారి బ్యాట్‌తో జట్టును ఆదుకున్నాడు. అయితే అతడు కూడా 18 ఓవర్ చివరి బంతికి ఔటవ్వడంతో సిడ్నీ జట్టు ఆశలు ఆవిరయ్యాయి. అంతేకాకుండా చివరి రెండో ఓవర్లలో సిడ్నీ సిక్సర్స్ జట్టుకు 12 పరుగులు అవసరం కాగా క్రీజులో టెయిలెండర్లు మాత్రమే ఉన్నారు. అయితే సిడిల్ వేసిన 19 ఓవర్లో హేజిల్ వుడ్ అనూహ్యంగా హ్యాట్రిక్ ఫోర్ కొట్టి సిడ్నీ జట్టుకు విజయాన్ని అందించాడు. దీంతో రషీద్, హేజిల్ వుడ్ పోరులో(హ్యాట్రిక్) బర్త్‌డే బాయే గెలిచాడాని కామెంటేటర్లు సరదాగా కామెంట్ చేశారు. ఇక ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న టామ్ కరన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
రషీద్ హ్యాట్రిక్ సాధించినప్పటికీ..!
-
వరుసగా ఐదు సిక్సర్లు.. ఆనందంలో కేకేఆర్
కోల్‌కతా నైట్‌రైడర్స్(కేకేఆర్) ఆనందంతో మురిసిపోతుంది. ఎందుకంటే గతేడాది డిసెంబర్లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2020 కోసం జరిగిన వేలంలో తాము చేజిక్కించుకున్న ఆటగాడు అదరగొట్టడమే దీనికి కారణం. ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ టామ్ బాంటన్‌ను ఐపీఎల్లో కనీస ధర రూ. కోటికి కేకేఆర్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఆటగాడు బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా బ్రిస్బేన్ హీట్ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సోమవారం సిడ్నీ థండర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బాంటన్ విశ్వరూపం ప్రదర్శించాడు. కేవలం 16 బంతుల్లోనే అర్ధసెంచరీ సాధించాడు. ముఖ్యంగా సిడ్నీ ఆటగాడు అర్జున్ నాయర్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో బాంటన్ ఏకంగా ఐదు సిక్సర్లు బాదాడు. అంతేకాకుండా బాంటన్ ఓకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన వీడియోను బీబీఎల్ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ‘సిడ్నీలో బాంటన్ కొట్టిన సిక్సర్ల సౌండ్ కోల్‌కతాలో వినపడుతోంది’, ‘క్రిస్ లిన్ లేకున్నా బాంటన్ ఉన్నాడుగా’అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇది కేకేఆర్‌కు అమితానందం కలిగించేదే అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. ఇక బ్రిస్బేన్-సిడ్నీల మధ్య జరిగిన మ్యాచ్‌కు వరణుడు పలుమార్లు అడ్డంకిగా నిలిచాడు. వర్షం కారణంగా తొలుత మ్యాచ్‌ను 8 ఓవర్లకు కుదించారు. దీంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన బ్రిస్బేన్ నాలుగు వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. బాంటన్(19 బంతుల్లో 56; 2ఫోర్లు, 7 సిక్సర్లు)కు తోడు క్రిస్ లిన్(31; 13 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ ఐదు ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 60 పరుగులతో ఉన్న క్రమంలో వర్షం మరోసారి రావడంతో డక్‌వర్త్‌లూయిస్ ప్రకారం బ్రిస్బేన్ 16 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. This is just extraordinary. Tom Banton launches five consecutive sixes! #BBL09 pic.twitter.com/STYOFVvchy — KFC Big Bash League (@BBL) January 6, 2020 -
అసభ్యంగా ప్రవర్తించాడని క్రికెటర్‌కు జరిమానా
మెల్బోర్న్ : ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్ మార్కస్ స్టొయినిస్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా భారీ జరిమానా విధించింది. దేశవాలి టీ20బిగ్‌బాష్‌లీగ్‌లో మార్కస్ స్టొయినిస్ మెల్బోర్న్ స్టార్స్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో శనివారం మెల్బోర్న్ స్టార్స్, రినిగేడ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. మ్యాచ్ మధ్యలో స్టొయినిస్ తన సహచర ఆటగాడైన కేన్ రిచర్డ్సన్పై అసభ్య పదజాలంతో దూషించాడు. దీంతో ఆటగాడిగా ప్రవర్తన నియమావళి ఉల్లగించినందుకు గాను కోడ్ ఆఫ్ కండక్ట్ కింద స్టొయినిస్‌కు 7500 ఆస్ట్రేలియన్ డాలర్లను జరిమానాగా విధిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది.' నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నా. కేన్ రిచర్డ్‌సన్‌తో అసభ్యంగా ప్రవర్తించినందుకు గ్రౌండ్‌లోనే అంపైర్ల ముందు అతనికి క్షమాపణ చెప్పాను. నేను ఎందుకలా ప్రవర్తించానో నాకు మాత్రమే తెలుసు. క్రికెట్ ఆస్ట్రేలియా నాకు వేసిన జరిమానాను అంగీకరిస్తున్నా' అని మార్కస్ స్టొయినిస్ స్పందించాడు. సరిగ్గా ఆరు వారాల క్రితం ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ పాటిన్సన్ విక్టోరియా తరపున మ్యాచ్ ఆడుతూ ఇదే తరహాలో తీవ్ర అసభ్యపదజాలంతో దూషించడంతో క్రికెట్ ఆస్ట్రేలియా ఒక మ్యాచ్ సస్పెన్షన్‌తో పాటు భారీ జరిమానాను విధించింది. దీంతో నవంబర్‌లో పాక్‌తో జరిగిన హోమ్ సిరీస్‌లో పాటిన్సన్ మొదటి టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యాడు. కాగా బిగ్‌బాష్ లీగ్‌లో ఈ ఏడాది స్టొయినిస్ అసాధారణ ఆటతీరు కనబరిచి 281 పరుగులతో లీగ్ టాప్ స్కోర్ర్లలో ఒకడిగా నిలిచినా, జనవరిలో భారత్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. మరోవైపు కేన్ రిచర్డ్సన్ మాత్రం ఈ సిరీస్‌కు ఎంపిక కావడం విశేషం. 2018లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడినప్పటి నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా తప్పు చేసిన ఆటగాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటుంది. బాల్ ట్యాంపరింగ్ చేసినందుకు అప్పటి జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లు ఏడాది , బౌలర్ బెన్‌క్రాప్ట్ 9 నెలల పాటు జట్టుకు దూరమయ్యరు.కాగా మార్కస్ స్టొయినిస్‌ను డిసెంబర్లో జరిగిన ఐపీఎల్ వేలంలో రూ. 4.80 కోట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ సొంతం చేసుకోగా, కేన్ రిచర్డ్సన్ను ఆర్సీబీ రూ. 4 కోట్లకు దక్కించుకున్న సంగతి తెలిసిందే. (క్రికెట్‌కు పఠాన్ గుడ్‌బై ) (ముగిసిన ఐపీఎల్ వేలం) -
రషీద్ ఆ బ్యాట్ ఐపీఎల్‌కు తీసుకురా..
మెల్బోర్న్ : అఫ్గానిస్తాన్ క్రికెట్ సంచలనం రషీద్ ఖాన్ ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్‌లో(బీబీఎల్) ఆడుతున్న సంగతి తెలిసిందే. బీబీఎల్‌లో ఆదివారం అడిలైడ్ స్ట్రైకర్స్, మెల్బోర్న్ రెనెగేడ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ఆడుతున్న రషీద్ సరికొత్త బ్యాట్‌తో మెల్బోర్న్ జట్టుపై విరుచుకుపడ్డాడు. కేవలం 16 బంతుల్లోనే 25 పరుగులు సాధించాడు. అందులో 2 ఫోర్ల్, 2 సిక్స్‌లు ఉన్నాయి. అలాగే 4 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి, 2 వికెట్లు తీసిన రషీద్.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే రషీద్ ఉపయోగించిన బ్యాట్‌ను ‘ది కెమల్’ అంటూ పేర్కొంటూ క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేసింది. దీనిపై ఐపీఎల్లో రషీద్ ప్రాతినిథ్యం వహిస్తున్న సన్‌రైజర్స్ టీమ్ స్పందించింది. రషీద్ ఆ బ్యాట్‌ను 2020 ఐపీఎల్‌కు తీసుకురా అంటూ ట్వీట్ చేసింది. సన్‌రైజర్స్ ట్వీట్‌కు బదులు ఇచ్చిన రషీద్.. ఐపీఎల్ 2020 కి తప్పకుండా కెమల్ బ్యాట్ తీసుకువస్తా అని పేర్కొన్నాడు. ఆశ్చర్యపరిచిన అంపైర్ చర్య అలాగే రషీద్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. 17వ ఓవర్లో అతను వేసిన బంతి మెల్బోర్న్ బ్యాట్స్‌మెన్ వెబ్‌స్టార్ ప్యాడ్లను తగలడంతో.. రషీద్ ఎల్బీడబ్ల్యూకు అప్పీలు చేశాడు. అయితే ఆ సమయంలోనే అంపైర్ గ్రెగ్ డేవిడ్సన్ ముక్కు రుద్దుకోవడానికి చేయి పైకి లేపాడు. అయితే అంపైర్ చేయి పైకి లేపినట్టు కనిపించడంతో అడిలైడ్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. వెబ్‌స్టార్ కూడా క్రీజ్ వదిలి ముందుకు కదిలాడు. వెంటనే తెరుకున్న అంపైర్.. తను జౌట్ అని ప్రకటించలేదని.. ముక్కు రుద్దుకున్నానని తెలిపాడు. దీంతో అడిలైడ్ నిరాశ చెందారు. వెబ్‌స్టార్ కూడా తిరిగి క్రీజ్‌లోకి వచ్చేశాడు. మొదట ఈ దృశ్యాన్ని చూసినప్పుడు ఆటగాళ్లతో పాటు స్టేడియంలోని జనాలు ఆశ్చర్యపోయినప్పటికీ.. ఆ తర్వాత జరిగింది తెలుసుకుని నవ్వుకున్నారు. Carry it along for IPL 2020, @rashidkhan_19! 😎 https://t.co/qP0WVo1S8v — SunRisers Hyderabad (@SunRisers) December 29, 2019 👃 Greg Davidson with a bit of an itchy schnoz at Marvel Stadium #nosegate #BBL09 pic.twitter.com/m3M772Atox — KFC Big Bash League (@BBL) December 29, 2019 కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు సాధించింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మెల్బోర్న్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 137 పరుగులకే పరిమితమైంది. -
పంజాబ్ ఊపిరి పీల్చుకో.. అతడొస్తున్నాడు
హైదరాబాద్: ఇంగ్లండ్ స్టార్ బౌలర్ క్రిస్ జోర్డాన్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాడు. బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో భాగంగా పెర్త్ స్కాచర్స్ తరుపున ఆడుతున్న ఈ పేసర్ ఓ స్టన్నింగ్ క్యాచ్‌తో అందరినీ షాక్‌కు గురిచేశాడు. బీబీఎల్‌లో భాగంగా మెల్బోర్న్ రెనిగేడ్స్-పెర్త్ స్కాచర్స్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆ సంఘటన చోటుచేసుకుంది. మెల్బోర్న్ బ్యాటింగ్ సందర్భంగా ఆ జట్టు ఆల్‌రౌండర్ క్రిస్టియాన్ లాంగాన్ వైపు భారీ షాట్ కొట్టాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న జోర్డాన్ గాల్లోకి అమాంతం ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. దీంతో షాక్‌కు గురైన క్రిస్టియాన్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ షేర్ చేసింది. దీంతో ఈ స్టన్నింగ్ క్యాచ్ వీడియో నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. ఇక తాజాగా ముగిసిని ఐపీఎల్ వేలంలో క్రిస్ జోర్డాన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ. 3 కోట్లకు చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో పంజాబ్‌కు జోర్డాన్ రూపంలో బౌలర్‌తో పాటు మంచి ఫీల్డర్ దొరికాడంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ‘పంజాబ్ ఊపిరి పీల్చుకో.. మిమ్మల్ని గెలిపించడానికి జోర్డాన్ వస్తున్నాడు’ అంటూ మరో నెటిజన్ సరదాగా కామెంట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన మెల్బోర్న్ 185 పరుగులకే పరిమితమై ఓటమిచవిచూసింది. ఐపీఎల్లో అంతగా మంచి రికార్డులు లేని జోర్డాన్ ఈసారి పంజాబ్ తరుపున ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. ఇక ఐపీఎల్ చరిత్రలో పంజాబ్ ఒక్కసారి కూడా టైటిల్ నెగ్గలేదు. తాజాగా కేఎల్ రాహుల్ సారథ్యంలోని నయా పంజాబ్ జట్టు వచ్చే సీజన్లో శక్తిమేర పోరాడాలని భావిస్తోంది. Chris Jordan, just wow! 🤯 pic.twitter.com/yVH67BZpdq — ICC (@ICC) December 21, 2019 -
‘ఇస్మార్ట్’ క్రికెట్
సిడ్నీ : సాంకేతికత పుణ్యమా అని క్రికెట్ కొత్త పుంతలు తొక్కుతోంది. మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం నుంచి ప్రస్తుతం డీఆర్ఎస్ వరకు ఆధునిక క్రికెట్ రూపాంతరం చెందుతోంది. టెక్నాలజీ రాకతో అంపైర్ల పని కూడా సులువైంది. అల్ట్రా ఎడ్జ్, హకాయ్, హాట్‌స్పాట్, స్టంప్ మైక్రొఫోన్, బాల్ ట్రాకింగ్ వంటివి క్రికెట్లో అతిసాధారణమైనవిగా మారిపోయాయి. తాజాగా క్రికెట్లో మరో పెను మార్పుకు కూకాబుర్ర సంస్థ శ్రీకారం చుట్టింది. అన్నీ కుదిరితే త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లో ఇస్మార్ట్(స్మార్ట్) బంతులను చూస్తాం. ఈ విషయాన్ని ఆస్ట్రేలియాకు చెందిన కూకాబుర్ర సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ఈ బంతులను అన్ని విధాల పరీక్షించామని.. త్వరలో బిగ్‌బాష్ లీగ్‌లో ప్రయోగాత్మకంగా పరిశీలించి అంతర్జాతీయ స్థాయిలో ఫలితాలు ఎలా ఉంటాయో అంచనావేస్తామని పేర్కొంది. ఇస్మార్ట్ బంతులు అంటే? మామూలు కూకాబుర్రా బంతుల్లాగే ఉంటాయి. కానీ ఆ బంతుల్లో మైక్రో చిప్‌లను అమర్చుతారు. అంతర్జాతీయ క్రికెట్లో అంపైర్లు అత్యంత కచ్చితత్వంతో నిర్ణయాలు ప్రకటించేందుకు ఆస్ట్రేలియాకు చెందిన కూకాబుర్ర సంస్థ మైక్రో చిప్‌లతో (స్మార్ట్ బంతి) కూడిన క్రికెట్ బంతుల్ని తయారు చేస్తోంది. ఈ ప్రత్యేకమైన బంతులు వేగం, బౌన్స్ తదితర అంశాలను సాధారణ రాడార్ కన్నా మరింత కచ్చితత్వంతో అందిస్తాయని కూకాబుర్ర ప్రకటించింది. ఇక స్పిన్నర్లకు ఎన్ని డిగ్రీల్లో బంతి టర్న్ అవుతోంది?. బంతిని ఎక్కడ విసిరితే ఎలా టర్న్ అవుతుంది? వంటి వివరాల్ని ఇవ్వనుంది. డీఆర్ఎస్, క్యాచ్‌ల విషయంలో ఈ స్మార్ట్ బంతులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ స్మార్ట్ బంతి తయారీ కోసం కూకాబుర్రతో స్పోర్ట్‌కోర్ అనే సంస్థ చేతులు కలిపింది. ఆస్ట్రేలియా మాజీ పేసర్ మైకెల్ కాస్ప్రోవిజ్ దీనికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న టీ20 క్రికెట్ లీగుల్లో ఈ బంతిని పరీక్షించాలని ఆ సంస్థలు కోరుకుంటున్నాయి. అందులో భాగంగానే మొదట బీబీఎల్‌లో ప్రయోగించనున్నారు. -
ఆర్చర్.. అదిరిందిపో!
హోబర్ట్ : కరేబియన్ స్టార్ జోఫ్రా ఆర్చర్ బౌండరీ లైన్ వద్ద అదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా మంగళవారం బ్రిస్బెన్హీట్-హోబర్ట్ హరికేన్స్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో జోఫ్రా అద్భుత ఫీల్డింగ్ అదరగొట్టాడు. బ్రిస్బెన్ హీట్ ఇన్నింగ్స్‌లో జేమ్స్ ఫాల్క్‌నర్ వేసిన మూడో ఓవర్ ఐదో బంతిని ఓపెనర్ మ్యాక్స్ బ్రియాంట్ లాంగాన్‌లో భారీ షాట్ ఆడాడు. అందరూ పక్కా సిక్స్ అని భావించారు. కానీ ఆ దిశలో ఫీల్డింగ్ చేస్తున్న ఆర్చర్.. చిరుతలా పరుగెత్తి బౌండరీ లైన్ వద్ద ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. ఈ సమయంలో సమన్వయం కోల్పోతున్ననట్లు గ్రహించిన ఆర్చర్ బంతిని గాల్లోకి విసిరేసి తిరుగొచ్చి అందుకున్నాడు. రెప్పపాటులో జరిగిన ఈ ఫీట్‌తో మైదానంలో ఆటగాళ్లు, అభిమానులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఇక బ్యాట్స్‌మన్ మ్యాక్స్ బ్రియాంట్ (7) నిరాశగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో హోబర్ట్ హరికేన్స్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిది. ఆర్చర్ ఈ అద్భుత క్యాచ్‌తో పాటు క్రిస్‌లిన్(10),రేన్షా(0)ల వికెట్లను పడగొట్టాడు. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బెన్ హీట్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన హరికేన్స్ 14.2 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. JOFRA ARCHER STOP IT 😲😲#BBL08 | @BKTtires pic.twitter.com/ZjkGB7BjVp — cricket.com.au (@cricketcomau) 29 January 2019 -
వైరల్ : క్యాచ్ పట్టలే కానీ.!
సిడ్నీ : లాంగాన్‌లో బ్యాట్స్‌మన్ ఆడిన భారీ షాట్‌ను ఫీల్డర్ అందుకోలేకపోయాడు.. కానీ అద్భుత ఫీల్డింగ్‌తో సిక్సర్‌ను అడ్డుకోని ఔరా అనిపించాడు. భారీ షాట్ ఆడిన బ్యాట్స్‌మన్ ఇంగ్లండ్ క్రికెటర్ జేమ్స్ విన్స్ కాగా.. మైమరిపించే ఫీల్డింగ్‌తో అదరగొట్టింది న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్. అభిమానులు కనువిందు చేసిన ఈ దృశ్యం బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బెన్ హీట్-సిడ్నీ సిక్సర్స్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ చోటుచేసుకుంది. సిడ్నీ సిక్సర్ ఇన్నింగ్స్ 17వ ఓవర్లో జేమ్స్ విన్స్ లాంగాన్‌లో ఆడిన భారీ షాట్ ఆడాడు. దాదాపు సిక్స్ అని అందరూ భావించారు. కానీ రెప్పపాటులో అదే దిశలో బౌండరీ లైన్ వద్ద నిల్చున్న బ్రెండర్ మెకల్లమ్ బంతిని అద్భుతంగా అందుకున్నాడు. అయితే బ్యాలెన్స్ కోల్పోతున్నట్లు భావించిన మెకల్లమ్ బంతిని గాల్లోకి విసిరేసి మరోసారి క్యాచ్ అందుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సారి కూడా బౌండరీ రోప్‌పై పడుతానని భావించి బంతిని మైదానంలోకి నెట్టేశాడు. క్షణిక కాలంలో ఈ కివీస్ ప్లేయర్ చేసిన ఫీట్‌ను చూసి మైదానంలో అభిమానులు, ఆటగాళ్లు ఆశ్చర్యచకితులయ్యారు. బౌండరీ విషయంలో సందిగ్ధం నెలకొనడంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరగా మెకల్లమ్‌కు ఫేవర్‌గా వచ్చింది. ఇప్పటికే బ్యాట్‌తో ఎన్నో గుర్తుండిపోయే ఇన్నింగ్స్‌లు ఆడిన మెకల్లమ్.. 37 ఏళ్ల వయసులో కూడా అద్భుత ఫీల్డింగ్‌తో అదరగొట్టడంపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో క్రికెట్ ఆస్ట్రేలియా తన అధికారిక ట్విటర్లో ‘క్యాచ్ పట్టలే కానీ.. మెకల్లమ్ ఎలా బౌండరీ ఆపాడో చూడండి!’ అని షేర్ చేసింది. దీంతో ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 177 పరుగులు చేయగా.. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన బ్రిస్బెన్ హీట్ 98 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. -
వైరల్ : క్యాచ్ పట్టలే కానీ.!
-
క్రికెట్ అసలు మజా ఇదే కదా!
సిడ్నీ : చివరి బంతి వరకు తీవ్ర ఉత్కంఠ.. మరోవైపు ఇరు జట్లను ఊరించే విజయం.. ఇలాంటి మ్యాచ్‌ను చూస్తే ఆ మజానే వేరు. ఇక ఆఖరి బంతికి కూడా ఫలితం తేలకుండా.. మళ్లీ సూపర్ ఓవర్ ఆడిస్తే ఆ మ్యాచ్ అద్భుతం. ప్రతి క్రికెట్ అభిమాని ఇలాంటి మ్యాచ్‌నే కోరుకుంటాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఇలాంటి సందర్భమే చోటుచేసుకుంది. ఇప్పుడిప్పుడే మహిళా క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్న సమయంలో ఇలాంటి మ్యాచ్‌లు ఆ సంఖ్యను మరింత పెంచుతున్నాయి. సిడ్నీ సిక్సర్స్- రెనిగేడ్స్ జట్ల మధ్య శుక్రవారం జరిగిన రెండో సెమీ ఫైనల్లో ఈ అత్యద్భుతం చోటు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సిడ్నీసిక్సర్స్ మహిళలు నిర్ణీత 20 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేశారు. అనంతరం 132 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగిన రెనిగేడ్స్ మహిళలు.. 6 వికెట్లు కోల్పోయి సరిగ్గా అవే 131 పరుగులు చేశారు. దీంతో మ్యాచ్ టై అయింది. అయితే చివరి బంతికి రెనిగేడ్స్ విజయానికి మూడు పరుగులు అవసరం ఉండగా.. రెనిగేడ్స్ ఓపెనర్ సోఫీ మోలన్ ఆఫ్‌సైడ్ భారీ షాట్ ఆడింది. బంతి బౌండరీకి సమీపిస్తుండగా.. సిడ్నీ సిక్సర్ ఫీల్డర్ అద్భుతంగా అందుకొని కీపర్‌కు అందజేసింది. బంతిని అందుకున్న కీపర్ నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో వికెట్లకు డైరెక్ట్‌గా కొట్టడంతో సోఫీమోలన్ రనౌట్ అయింది. దీంతో రెనిగేడ్స్ తృటిలో విజయాన్ని చేజార్చుకుంది. అనంతరం సూపర్ ఓవర్ నిర్వహించగా.. తొలుత బ్యాటింగ్ చేసిన రెనిగేడ్స్ ఓ వికెట్ కోల్పోయి 6 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత బరిలోకి దిగిన సిడ్నీ సిక్సర్స్.. రెండు బంతులు మిగిలి ఉండగానే విజయన్నందుకుంది. ఈ గెలుపుతో సగర్వంగా ఫైనల్లో అడుగెట్టింది. ఈ థ్రిల్లింగ్ విక్టరీ విషయాన్ని ఐసీసీ ట్వీట్ చేయడంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. Another #WBBL4 last-ball thriller for today, and we're still processing! Top effort from all of Burns, Aley and Healy!pic.twitter.com/CqLAgzquix — ICC (@ICC) 19 January 2019 -
ఇలాంటి మ్యాచ్‌ను చూస్తే ఆ మజానే వేరు
-
ఔరా.. ఏం క్యాచ్ అది!
సిడ్నీ: అసలైన క్రికెట్ మజా కేవలం పురుషుల క్రికెట్లోనే ఉంటుందనుకుంటే పొరపాటు పడినట్టే. సంచలన ఇన్నింగ్స్‌లు నమోదు చేస్తూ.. పురుషుల క్రికెట్లోనూ సాధ్యంకాని కొత్త రికార్డులను మహిళా క్రికెటర్లు సృష్టిస్తున్నారు. తాజాగా గెలుపును డిసైడ్ చేసే బంతిని బౌండరీ వద్ద కళ్లు చెదిరే రీతిలో డైవ్ చేస్తూ ఒడిసిపట్టుకున్న విధానం చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. ఈ అపురూప దృశ్యం మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో బ్రిస్బెన్ హీట్, సిడ్నీ థండర్ జట్ల మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ మ్యాచ్‌లో చోటు చేసుకుంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో సిడ్నీ జట్టు నాలుగు పరుగుల తేడాతో బ్రిస్బేన్‌పై గెలిచి ఫైనల్‌కు చేరుకుంది. క్యాచ్‌కు సంబంధించిన వీడియో ఐసీసీ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టంట్లో తెగ హల్చల్ చేస్తోంది. ఇక హైదీని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. అనంతరం 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సిడ్నీ జట్టు ఆరంభం ఘనంగానే ప్రారంభించింది. అయితే బ్రిస్బేన్ పటిష్ట బౌలింగ్ మందు సిడ్నీ మిడిలార్డర్ బ్యాట్స్వువెన్ పరుగులు రాబట్టడానికి నానా తంటాలు పడ్డారు. దీంతో చివరి ఓవర్లో 13 పరుగుల చేస్తేనే సిడ్నీ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. బంతి బంతికి సమీకరణాలు మారిపోతున్నాయి. ఇక సిడ్నీ గెలుపు సమీకరణాలు ఎలా ఉన్నాయంటే చివరి బంతికి ఫోర్ కొడితే డ్రా, ఐదు పరుగులు చేస్తే విజయం. ఈ సమయంలో జోనాసెన్ బౌలింగ్‌లో నికోలా కారే గాల్లోకి బంతిని బలంగా బాదింది.. అందరూ పక్కా సిక్సర్ అనుకున్న తరుణంలో మెరుపువేగంతో వచ్చిన హైదీ బిర్కెట్ కళ్లు చెదిరే రీతిలో డైవ్ చేస్తూ క్యాచ్ అందుకుంది. దీంతో గెలుపు సంబరం బ్రిస్బెన్ను వరించగా .. ఓటమి బాధ సిడ్నీ జట్టుకు దక్కింది. -
గెలుపును డిసైడ్ చేసే బంతి.. బౌండరీ వద్ద కళ్లు చెదిరే క్యాచ్..
-
అంపైర్ తప్పిదం.. సెంచరీ మిస్
మెల్బోర్న్ : టెక్నాలజీ యుగంలో కూడా ఫీల్డ్ అంపైర్లు పప్పులో కాలేస్తున్నారు. ఈ మధ్య ఈ తరహా ఘటనలు మరి ఎక్కువయ్యాయి. మొన్న భారత్-ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్‌లో అంపైర్ తప్పిదం మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపగా.. తాజాగా మరో అంపైర్ అలసత్వం బ్యాట్స్‌మెన్ శతకాన్ని పూర్తిచేసుకోకుండా చేసింది. ఆస్ట్రేలియా బిగ్‌బాష్‌లీగ్‌లో హోబర్ట్ హరికేన్స్, మెల్బోర్న్ స్టార్స్ మధ్య సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ డీఆర్సీ షార్ట్ అంపైర్ తప్పిదాని బలయ్యాడు. తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. హోబర్ట్ హరికేన్స్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన డీఆర్సీ షార్ట్ 57 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 96 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అయితే ఇన్నింగ్స్ 18వ ఓవర్లో విండీస్ స్టార్ బౌలర్ డ్వాన్ బ్రావో యార్కర్ సంధించగా.. డీఆర్సీ అద్భుతంగా ఫైన్ లెగ్ దిశగా బౌండరీ సాధించాడు. కానీ అంపైర్ మాత్రం ఆ ఫోర్‌ను లెగ్ బైస్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంతో డీఆర్సీ అవాక్కయ్యాడు. వెంటనే అంపైర్ నిర్ణయంపై అసహనం కూడా వ్యక్తం చేశాడు. ఆసమయంలో డీఆర్సీ వ్యక్తిగత స్కోర్ 86 పరుగులు. ఆ తరువాత అతను స్ట్రైకింగ్ చేసినప్పటికి సెంచరీ పూర్తి చేసుకునే అవకాశం దక్కలేదు. ఆ ఫోర్‌పై అంపైర్ సరైన నిర్ణయం తీసుకొని ఉంటే డీఆర్సీ సెంచరీ పూర్తి అయ్యేది. ఈ ఓవర్‌కు సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా అధికార వెబ్సైట్ క్రికెట్.కామ్. ఏయూ అధికార ట్విటర్లో షేర్ చేసింది. దీంతో అభిమానులు ఆ అంపైర్‌పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సందేహంగా ఉంటే థర్డ్ అంపైర్ సమీక్ష కోరవచ్చుగా.. అసలేం అయింది ఈ అంపైర్లకు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో హరికేన్స్ 59 పరుగలుతో ఘనవిజయం సాధంచింది. (చదవండి : అంపైర్ తప్పిదమే కోహ్లిసేన కొంపముంచిందా? ) D'Arcy Short finishes unbeaten on 96, but this one was given four leg byes just a couple of overs earlier! #BBL08 pic.twitter.com/lpBldgqQaq — cricket.com.au (@cricketcomau) 14 January 2019


