వికెట్‌ తీసి వింత సెలబ్రేషన్‌తో మెరిసిన బౌలర్‌ | BBL 2021-22: Haris Rauf Incredible Covid-Safe Wicket Celebration Viral | Sakshi
Sakshi News home page

వికెట్‌ తీసి వింత సెలబ్రేషన్‌తో మెరిసిన బౌలర్‌

Jan 18 2022 9:00 PM | Updated on Jan 18 2022 9:48 PM

BBL 2021-22:  Haris Rauf Incredible Covid-Safe Wicket Celebration Viral - Sakshi

పాకిస్తాన్‌ పేస్‌ బౌలర్‌ హారిస్‌ రౌఫ్‌ ప్రస్తుతం బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌) సీజన్‌లో బిజీగా గడుపుతున్నాడు. మెల్‌బోర్న్‌ స్టార్స్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న హారిస్‌ రౌఫ్‌ వికెట్‌ తీసిన ఆనందంలో వింత సెలబ్రేషన్‌తో మెరిశాడు. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా మహమ్మారి మరోసారి కుదిపేస్తోంది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ పేరుతో రూపం మార్చుకొని ప్రపంచదేశాలపై తన పడగను విప్పింది. ఈ సెగ బీబీఎల్‌కు కూడా తాకింది.

చదవండి: Glenn Maxwell: 'క్యాచ్‌ పట్టేశావు.. భ్రమలో నుంచి బయటికి రా'

ఇప్పటికే బీబీఎల్‌లో సిబ్బందితో పాటు పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడ్డారు.ఈ సందర్భంగా పెర్త్‌ స్కార్చర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హారిస్‌ రౌఫ్‌ కోవిడ్‌పై అవగాహన కల్పించడానికి తోటి ఆటగాళ్లను నవ్విస్తూనే సెలబ్రేట్‌ చేయడం వైరల్గా మారింది. మూడో ఓవర్లో కుర్టీస్‌ పాటర్సన్‌ను ఔట్‌ చేసిన హారిస్‌.. ముందు చేతులను సానిటైజ్‌ చేసుకున్నట్లుగా.. ఆ తర్వాత జేబులో నుంచి మాస్క్‌ తీసి ముఖానికి పెట్టుకొని అవగాహన కల్పించాడు.  దీనికి సంబంధించిన వీడియోనూ క్రికెట్‌ ఆస్ట్రేలియా ట్విటర్‌లో షేర్‌ చేస్తూ..'' హారిస్‌ రౌఫ్‌ సెలబ్రేషన్‌ కొత్తగా ఉంది.. కోవిడ్‌పై అవగాహన కల్పిస్తూ సెలబ్రేట్‌ చేసుకోవడం సూపర్‌'' అంటూ క్యాప్షన్‌ జత చేసింది.

చదవండి: IND Vs WI: కోహ్లి దిగిపోయాడు.. రోహిత్‌ వచ్చేస్తున్నాడు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement