టీమిండియా దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్ (Big Bash League) నుంచి వైదొలిగాడు. మోకాలి గాయం కారణంగా 15వ ఎడిషన్‌కు దూరమయ్యాడు. అశ్విన్ ఇటీవలే బీబీఎల్‌లోని సిడ్నీ థండర్ (Sydney Thunder) ఫ్రాంచైజీతో ఒప్పందం చేసుకున్నాడు. ఈ ఒప్పందం చారిత్రాత్మకమైంది. బీబీఎల్‌లో ఇప్పటివరకు ఏ భారత క్రికెటర్ ఆడలేదు.
అశ్విన్ బీబీఎల్ అరంగేట్రం చేసుంటే చరిత్ర సృష్టించేవాడు. గాయం కారణంగా అశ్విన్ బీబీఎల్ ఎంట్రీ వాయిదా పడింది. ఈ సీజన్ మొత్తానికి అశ్విన్ దూరమైనట్లు సిడ్నీ థండర్ యాజమాన్యం ప్రకటించింది. అశ్విన్ సేవలు కోల్పోవడం దురదృష్టకరమని థండర్ ఫ్రాంచైజీ జనరల్ మేనేజర్ అన్నారు. యాష్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించాడు. యాష్‌పై ఈ సీజన్‌లో తామెన్నో ఆశలు పెట్టుకున్నామని తెలిపాడు.
అతడి అరంగేట్రాన్ని గ్రాండ్‌గా ప్లాన్ చేశామని, దురదృష్టవశాత్తు అది వాయిదా పడిందని చెప్పుకొచ్చాడు. మరోవైపు అశ్విన్ కూడా బిగ్‌బాష్ లీగ్‌ను మిస్ అయినందుకు బాధ పడ్డాడు. ఫ్యాన్స్‌ను నిరాశపరిచినందుకు క్షమాపణలు చెప్పాడు. యాష్ ఇటీవల చెన్నైలో జరిగిన ఓ షూటింగ్‌లో గాయపడ్డాడని తెలుస్తుంది.
కాగా, 2025-26 బిగ్‌బాష్ లీగ్ సీజన్ డిసెంబర్ 14 నుంచి ప్రారంభమవుతుంది. అశ్విన్ ప్రాతినిథ్యం వహించాల్సిన సిడ్నీ థండర్ తమ తొలి మ్యాచ్‌ను డిసెంబర్ 16న హోబర్ట్ హరికేన్స్‌తో ఆడాల్సి ఉంది.
బీబీఎల్ 2025-26లో సిడ్నీ థండర్ జట్టు..
వెస్ అగర్, టామ్ ఆండ్రూస్, కామెరాన్ బాన్‌క్రాఫ్ట్, సామ్ బిల్లింగ్స్, ఓలీ డేవిస్, లోకీ ఫెర్గూసన్, మాథ్యూ గిల్క్స్, క్రిస్ గ్రీన్, ర్యాన్ హాడ్లీ, షాదాబ్ ఖాన్, సామ్ కొన్‌స్టాస్, నాథన్ మెక్‌ఆండ్రూ, బ్లేక్ నికితారాస్, డేవిడ్, అడియన్ ఓకానర్, డేనియల్ సామ్స్, తన్వీర్ సంఘా, డేవిడ్ వార్నర్
చదవండి: IPL 2026: ఆసీస్ దిగ్గజానికి కీలక పదవి


