ఐపీఎల్ 2026కి ముందు ఆస్ట్రేలియా దిగ్గజం టామ్ మూడీకి (Tom Moody) కీలక పదవి దక్కింది. లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) ఫ్రాంచైజీ మూడీని గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించింది. ఈ పదవి చేపట్టాక మూడీ ఎల్‌ఎస్‌జీతో పాటు సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్, హండ్రెడ్ లీగ్‌లో మాంచెస్టర్ ఆధారిత ఫ్రాంచైజీ కార్యకలాపాలు పర్యవేక్షిస్తాడు.
గతంలో ఈ పదవిలో టీమిండియా దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్ ఉండేవాడు. జహీర్ తప్పుకున్న తర్వాత మూడీని ఈ పదవి వరించింది. మూడో రానున్న ఐపీఎల్ సీజన్‌లో రిషబ్ పంత్ (కెప్టెన్), జస్టిన్ లాంగర్ (హెడ్ కోచ్), కేన్ విలియమ్సన్ (స్ట్రాటజిక్ అడ్వైజర్), భరత్ అరుణ్ (బౌలింగ్ కోచ్), లాన్స్ క్లూసెనర్‌తో (అసిస్టెంట్ కోచ్) కలిసి పని చేస్తాడు.
మూడీకి కోచింగ్‌తో పాటు ఫ్రాంచైజీ మేనేజ్‌మెంట్‌లో అపార అనుభవం ఉంది. ఈ అనుభవాన్ని క్యాష్ చేసుకునేందుకే ఎల్‌ఎస్‌జీ మూడీని తమ ఫ్రాంచైజీల గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా నియమించింది. మూడీ పర్యవేక్షణలో (కోచ్‌గా) సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ తొలి, ఏకైక టైటిల్ (2016) సాధించింది.
మూడీ ప్రొఫైల్..
2000 సంవత్సరం ప్రారంభంలో ఆటకు వీడ్కోలు పలికిన మూడీ.. 2005-07 మధ్యలో శ్రీలంక జాతీయ జట్టుకు కోచ్‌గా పని చేశాడు. అతని జమానాలో శ్రీలంక 2007 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరింది.
అదే ఏడాది మూడీ వెస్ట్రన్ ఆస్ట్రేలియా జట్టుకు హెడ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వహించాడు.
అంతర్జాతీయ స్థాయిలో కోచ్‌గా రాణించిన మూడీ.. 2008-10 మధ్యలో ఐపీఎల్‌లో Kings XI Punjab (ఇప్పుడు Punjab Kings) జట్టుకు కోచ్‌గా సేవలందించాడు.
2013లో Sunrisers Hyderabad ఫ్రాంచైజీలో హెడ్ కోచ్‌గా చేరి, 2016లో ఆ జట్టుకు తొలి ఐపీఎల్ టైటిల్ అందించాడు. 2019 వరకు అదే బాధ్యతలు నిర్వహించిన మూడీ.. 2020 డిసెంబర్‌లో అదే ఫ్రాంచైజీకి Director of Cricketగా తిరిగి వచ్చాడు.
చదవండి: జైస్వాల్ సూపర్ సెంచరీ


