356 పరుగుల ఆధిక్యంలో ఆ్రస్టేలియా
ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 272/4
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 286 ఆలౌట్
‘యాషెస్’ మూడో టెస్టు
అడిలైడ్: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆ్రస్టేలియా జట్టు మరో విజయానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఓపెనర్ ట్రవిస్ హెడ్ (196 బంతుల్లో 142 బ్యాటింగ్; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీతో చెలరేగడంతో ఆ్రస్టేలియా జట్టు రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల్లో నెగ్గి 2–0తో ఆధిక్యంలో ఉన్న ఆతిథ్య ఆ్రస్టేలియా... మూడో టెస్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 66 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 271 పరుగులు చేసింది.
మిడిలార్డర్ నుంచి ఓపెనర్‌గా ప్రమోషన్ దక్కించుకున్న హెడ్... ఈ సిరీస్‌లో రెండో సెంచరీ ఖాతాలో వేసుకోవడంతో ఆసీస్ భారీ స్కోరు చేసింది. మరో ఓపెనర్ జాక్ వెదరాల్డ్ (1), మార్నస్ లబుõÙన్ (13), కామెరాన్ గ్రీన్ (7) విఫలం కాగా... తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో అలెక్స్ కేరీ (91 బంతుల్లో 52 బ్యాటింగ్; 4 ఫోర్లు) అజేయ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. ఉస్మాన్ ఖ్వాజా (51 బంతుల్లో 40; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు.
మరో వైపు నుంచి వికెట్లు పడుతున్నా... హెడ్ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆడుతూ పాడుతూ పరుగులు సాధించాడు. మంచి బంతులను గౌరవిస్తూనే... చెత్త బంతులను బౌండరీలకు తరలించాడు. 72 బంతుల్లో హాఫ్‌సెంచరీ పూర్తి చేసుకున్న హెడ్... 146 బంతుల్లో శతకం తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే తనకు అలవాటైన రీతిలో గాల్లోకి ఎగిరి సంబరాలు చేసుకునే హెడ్... ఈసారి మాత్రం అందుకు భిన్నంగా పిచ్‌ను ముద్దాడి ఆనందంలో మునిగిపోయాడు.
సెంచరీకి ఒక పరుగు ముందు హెడ్ ఇచ్చిన క్యాచ్‌ను గల్లీలో హ్యారీ బ్రూక్ వదిలేశాడు. ఆ తర్వాత కొన్ని ఉత్కంఠ క్షణాలు ఎదుర్కొన్న హెడ్ ఎట్టకేలకు సెంచరీ పూర్తిచేసుకున్నాడు. టెస్టుల్లో అతడికిది 11వ శతకం. అబేధ్యమైన ఐదో వికెట్‌కు కేరీతో కలిసి హెడ్ 122 పరుగులు జోడించాడు.
చేతిలో 6 వికెట్లు ఉన్న ఆ్రస్టేలియా.... తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 85 పరుగులతో కలుపుకొని ఓవరాల్‌గా 356 పరుగుల ముందంజలో ఉంది. ఈ మ్యాచ్‌లో మరో రెండు రోజుల ఆట మిగిలుండగా... శనివారం మరింత స్కోరు చేసి ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిలపాలని ఆసీస్ భావిస్తోంది.
స్టోక్స్–ఆర్చర్ రికార్డు భాగస్వామ్యం...
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 213/8తో శుక్రవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ చివరకు 87.2 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. కెపె్టన్ బెన్ స్టోక్స్ (198 బంతుల్లో 83; 8 ఫోర్లు) పట్టుదలగా పోరాడగా... జోఫ్రా ఆర్చర్ (105 బంతుల్లో 51; 5 ఫోర్లు, 1 సిక్స్) కీలక హాఫ్‌సెంచరీ సాధించాడు.
ఈ క్రమంలో స్టోక్స్ 159 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో అతడికిదే నెమ్మదైన అర్ధ శతకం. ఈ జోడీ తొమ్మిదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 106 పరుగులు జోడించడంతో ఆ్రస్టేలియాకు తొలి ఇన్నింగ్స్‌లో ఎక్కువ ఆధిక్యం దక్కలేదు. ఒక్కసారి స్టోక్స్ అవుట్ అయ్యాక... ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆ్రస్టేలియా బౌలర్లలో కమిన్స్, బోలాండ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.


