బెన్ స్టోక్స్‌కు తీవ్ర గాయం.. ముఖం వాచిపోయింది | Ben Stokes Suffers Facial Injury During Practice, Shares Shocking Photo On Instagram Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

బెన్ స్టోక్స్‌కు తీవ్ర గాయం.. ముఖం వాచిపోయింది

Feb 5 2026 9:49 PM | Updated on Feb 6 2026 6:09 PM

Ben Stokes suffers gruesome facial injury

ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ప్రాక్టీస్ చేస్తుండ‌గా ఓ రాకాసి బంతి అత‌డి మొఖానికి బ‌లంగా తాకింది.  ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫోటోను స్టోక్స్ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. త‌ను షేర్ చేసిన ఫోటోలో అతడి ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

స్టోక్స్ కుడి కన్ను బాగా వాచిపోవడంతో పాటు పెదవి, ముక్కుకు గాయమైనట్లు కనిపిస్తోంది. ఈ ఫొటోకు స్టోక్స్ 'ఆ బంతి పరిస్థితి ఎలా ఉందో మీరు చూడాలి'అని నవ్వుతూ ఉన్న ఎమోజీ క్యాప్షన్‌గా ఇచ్చాడు. అయితే స్టోక్స్ బ్యాటింగ్ చేస్తుండ‌గా కాకుండా.. తన సహచర ఆటగాళ్లతో పక్కన నిలబడి ఉన్న సమయంలో బంతి త‌గిలి గాయ‌మైన‌ట్లు ప‌లు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

కాగా యాషెస్ సిరీస్‌లో ఘోర ప‌రాభ‌వం త‌ర్వాత తిరిగి స్వ‌దేశానికి వ‌చ్చిన స్టోక్స్‌.. కౌంటీ సీజ‌న్ కోసం సిద్ద‌మ‌వుతున్నాడు. స్టోక్స్ గాయం నుంచి కోలుకోవడానికి దాదాపు మూడు వారాల స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ట్లు ఇంగ్లండ్ క్రికెట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆ త‌ర్వాత అత‌డు తిరిగి ప్రాక్టీస్ మొద‌లు పెట్ట‌నున్నాడు.

అయితే స్టోక్స్ కేవ‌లం టెస్టుల్లో మాత్ర‌మే ఆడుతుండ‌డంతో ఈ ఏడాది జూన్ వ‌ర‌కు జాతీయ జ‌ట్టుకు దూరంగా ఉండ‌నున్నాడు. ఇంగ్లండ్ జట్టు జూన్ నెలలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో 3 టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌లో స్టోక్స్ తిరిగి జ‌ట్టును న‌డిపించ‌నున్నాడు.  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో నిలవాలంటే ఇంగ్లండ్‌కు ఈ సిరీస్ చాలా కీలకం.
 

Advertisement
 
Advertisement
Advertisement