రెండేళ్లకే రెండు గిన్నిస్‌ రికార్డులు..! | Manchester Boy Sets 2 Guinness World Records For Snooker Trick Shots | Sakshi
Sakshi News home page

రెండేళ్లకే రెండు గిన్నిస్‌ రికార్డులు..!

Jan 30 2026 3:50 PM | Updated on Jan 30 2026 4:08 PM

Manchester Boy Sets 2 Guinness World Records For Snooker Trick Shots

పిట్ట కొంచెం..కూత ఘనం అన్నట్లుగా ఈ బుడతడు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. తన ఎత్తుకు సరిపోని స్నూకర్‌ గేమ్‌ని ఆడి అందర్ని అబ్బురపరుస్తున్నాడు. పెద్దవాళ్లు ఆడగలిగే ఈ గేమ్‌ తన ఎత్తు కారణంగా ఇబ్బందిపడ్డా కూడా..ఆశ్చర్యపోయే విధంగా షాట్‌లు కొట్టి గిన్నిస్‌ రికార్డులకెక్కడు. 

ఇంగ్లాడ్‌లోని మాంచెస్టర్‌కు చెందిన ఈ రెండేళ్ల బాలుడు జూడో ఓన్స్‌ ఒక ఆటలో రెండు ట్రిక్‌ షాట్‌ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచినట్లు గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ధృవీకరించింది. స్నూక్‌ర్‌ క్రీడా పూల్‌ క్యూ క్రీడను పోలి ఉంటుంది. టేబుల్‌పై పెద్ద సంఖ్యలో బంతులు పెట్టి ఆడతారు. క్యూ బాల్‌తో ఇతర బాల్‌లను కొట్టినప్పుడూ నేరుగా నిర్ధేశిత హోల్‌లో పడేలా చేస్తారు. ఇక జూడ్‌ అక్టోబర్ 12, 2025న పూల్‌లో బ్యాంక్ షాట్ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. 

ఈ ఘనత సాధించడానికి 41 రోజుల ముందు స్నూకర్‌ గేమ్‌లో డబుల్‌ షాట్‌(టేబుల్‌ అంచులకు తాకిస్తూ) చేసిన అతి పిన్నవయస్కుడిగా నిలిచాడు. ఇక్కడ డబుల్ పాట్ అనేది ఒకే స్ట్రైక్‌లో రెండు బంతులను క్యూ బాల్‌తో జత చేసి నిర్దేశిత హోల్‌లో పడేలా చేస్తే బ్యాంక్‌ షాట్‌ అంటారు. నిజానికి ఎత్తు రీత్యా అంత ఎత్తులో ఉండే టేబుల్‌పై ఆడే క్రీడను జూడో కిచెన్‌ స్టూల్‌ సాయంతో నుంచొని ఆడటం విశేషం. అలా అయినా అతని వయసుకి ఆడటం కష్టమే కానీ ఈ చిచ్చరపిడుగు అదేమంతా కష్టం కాదంటూ అవలీలగా చేసి అందరిచేత శెభాష్‌ అనిపించుకున్నాడు. 

కాగా, జూడ్‌ తండ్రి లూక్‌​ ఒక మినీ టేబుల్‌ని కొన్నప్పుడే అతనికి స్నూకర్‌, పూల్‌ ఆటలను పరిచయం చేశాడు. ఆ చిన్న వయసులోనే తన చిట్టి చేతులతో చాలా సునాయాసంగా క్యూని తీసుకుని అవలీలగా బాల్స్‌ అన్నింటిని కొట్టేసేవాడని వివరించాడు. అందుకు సంబంధించిన వీడియోలను కూడా నెట్టింట షేర్‌ చేసేవాడు జూడో తండ్రి లూక్‌. ఇక గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ క్రెయిగ్‌ గ్లెండే కూడా ఇంత చిన్న వయసులోనే జూడ్‌ ఇంత ప్రతిభ,అంకితభావం, ఉత్సాహాన్ని చూపించడం అత్యంత ప్రత్యేకమని అన్నారు. 

(చదవండి: Intermittent Fasting: అడపాదడపా ఉపవాసం.. మహిళలకు చేటు! నిపుణుల స్ట్రాంగ్‌ వార్నింగ్‌)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement