బరువు తగ్గించే పద్దతుల్లో అడపాదడపా ఉపవాసం (ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్(ఐఎఫ్). బరువు తగ్గడానికి అత్యంత సులభమైన పద్ధతిగా పేర్కొంటారు. త్వరితగతిన బాడీలో మార్పులు..పైగా ఆరోగ్యకరమైన విధానమని పలువురు వెల్న్‌స్ నిపుణుల అభిప్రాయం. అయితే ఇది మహిళలకు ఎప్పటికీ ప్రమాదకరమని, ముఖ్యంగా పీరియడ్స్ వచ్చే మహిళలకు మరింత ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు ఫెర్టిలిటీ కోచింగ్ వ్యవస్థాపకురాలు ప్రీతికాసిరెడ్డి. సోషల్ మీడియా వేదికగా ఈ పద్ధతి మహిళ ఆరోగ్యానికి ఏవిధంగా చేటు చేస్తుందో తన స్వీయానుభవాన్నిషేర్ చేసుకున్నారు.
విపరీతంగా ప్రజాదరణ పొందిన అడపాదడపా ఉపవాసం మహిళల ఆరోగ్యానికి చాలా వ్యతిరేకంగా పనిచేస్తుందన్నారు. ఇది హర్మోన్లను ఇన్‌బ్యాలెన్స్ కారణమయ్యే విధానంగా అభివర్ణించారు. దీన్ని అవలంభించడంతో తనకు టీ స్థాయిలు గణనీయంగా పడిపోయాయని, జీవక్రియ నెమ్మదించిందని, కార్టిసాల్ స్థాయిలు ఉదయంపూట ఎక్కుగా ఉన్నట్లు తెలిపారు. అలాగే నిరంతరం చలిగా అనిపించిందని, పీరియడ్స్ రావడం తగ్గిపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమయ్యాయని అన్నారామె.
ఈ విధానం మహిళల ఆరోగ్యానికి అత్యంత ప్రమాదమని తేల్చి చెప్పారామె. నిజానికి ఈ విధానంలో అల్పాహారం దాటవేయాల్సి ఉంటుంది. ఇది శరీరాన్ని ఆహరం కంటే కార్టిసాల్‌తో నడపేలా బలవంతం చేస్తుందన్నారు. ఫలితంగా థైరాయిడ్ పనితీరుపై ప్రభావం చూపడం, పునరుత్పత్తి ఆరోగ్యాన్ని దెబ్బతీయడం వంటి సమస్యల బారిన పడతారని హెచ్చరిస్తున్నారామె. బ్రేక్‌ఫాస్ట్ అనేది శక్తి కదలికని, అది తప్పనసరి అన్నారామె. ఇక ఈ అడపాదడపా ఉపవాసం..తప్పుదారి పట్టించే వెల్నెస్ సలహాగా అభివర్ణించారామె.
అడపాదడపా ఉపవాసం అంటే..
ఈ విధానంలో ఏం తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు అనేదానిపై ఫోకస్ పెట్టే చేసే డైట్ విధానం. అత్యంత సాధారణ వెర్షన్ 16:8 పద్ధతి. ఇక్కడ 16 గంటలు ఉపవాసం ఉండి ఎనిమిది గంటలలోపు తినాల్సి ఉంటుంది. ఇది డైటింగ్‌ను సులభతరం చేస్తుందని, బరువు తగ్గడంలో సహాయపడుతుందని, జీవక్రియ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని పలువురు నిపుణులు వాదన. .
సైన్స్ ఏం అంటుందంటే..
అయితే ఈ వాదనలలో కొన్నింటిని సైన్స్ సమర్థిస్తుంది. బహుళ అధ్యయనాలు IF బరువు తగ్గడానికి, నడుము చుట్టుకొలతను తగ్గించడానికి, రక్తంలో మెరుగైన చక్కెర నియంత్రణకు ఉపకరిస్తుందని చెబుతున్నారు.
నిపుణులు ఏమంటున్నారంటే..
నొయిడా ఇంటర్నేషనల్ యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్స్ డీన్ డాక్టర్ సుప్రియా అవస్థి మాట్లాడుతూ, అడపాదడపా ఉపవాసం మహిళలందరికీ మంచిది కాదని చెప్పలేం కానీ ఇది అందరికీ సురక్షితమైనది కాదని అన్నారు. అయితే మహిళలు తమ ఆరోగ్యానికి సరిపడితే ఈ పద్ధతి పాటించొచ్చని, అయితే చాలామటుకు మహిళల్లో ఈ విధానం వల్ల హార్మోన్ల అసమతుల్యతకు దారితీసే ప్రమాదం ఉందని హెచ్చిరిస్తున్నారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువ సేపు ఆహారం తీసుకోకుండా ఉండాలంటే కష్టమని, అది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని అన్నారు.
Intermittent fasting was one of the worst things I did for my hormones (7 years ago).
My free T3 levels dropped significantly when I did it, which means my metabolism slowed to a crawl. I was cold all the time. My cortisol levels were elevated in the morning. My periods were…— Preethi Kasireddy (@iam_preethi) January 26, 2026
(చదవండి: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు తీవ్రమైన కంటి వ్యాధి.. ఆర్‌వీఓ అంటే..?)


