దీదీకి ఝలక్‌ : 144 రేసు గుర్రాలు రెడీ | BJP announces first list of 144 candidates for West Bengal Assembly Elections | Sakshi
Sakshi News home page

దీదీకి ఝలక్‌ : 144 రేసు గుర్రాలు రెడీ

Mar 16 2026 6:43 PM | Updated on Mar 16 2026 7:16 PM

BJP announces first list of 144 candidates for West Bengal Assembly Elections

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన వేళ బీజేపీ (BJP) తన రేసు గుర్రాలను ప్రకటించింది. 2026 ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న  ఎ‍న్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) బీజేపీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.  ఈ నేపథ్యంలో  144 మందితో  తొలి జాబితాను ప్రకటించింది.ఈ జాబితాలో మొత్తం 10 మంది మహిళా అభ్యర్థులకు చోటు దక్కింది.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే బీజేపీ తన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. ఈ జాబితాలో 10మంది మహిళలు బరిలోకి దిగనున్నారు. అసన్సోల్ దక్షిణ నియోజకవర్గం నుండి అగ్నిమిత్ర పాల్, బెంగాల్ శాసనసభ ప్రతిపక్ష నాయకుడు (LoP) సువేందు అధికారి (భవానీపూర్ నియోజకవర్గం), దిలీప్ ఘోష్ (ఖరగ్‌పూర్ సదర్) వంటి ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి. మరోవైపు ఈసారి ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య  జాబితా తగ్గిపోవడం ప్రధాన వివాదంగా మారింది. గత ఏడాది నవంబర్‌లో ఓటర్ల సంఖ్య 7.66 కోట్లుగా ఉండగా, ఫిబ్రవరి 28న విడుదల చేసిన తుది జాబితాలో అది 6.44 కోట్లకు తగ్గింది.

 

"లాజికల్ డిస్క్రెపెన్సీ"  విభాగం కింద వర్గీకరించి, న్యాయపరమైన పరిశీలన కోసం పంపిన దాదాపు 42 లక్షల మందికి పైగా ఓటర్ల భవిష్యత్తు మాత్రం ఇంకా సందిగ్ధంలోనే ఉంది.ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల నుండి వచ్చిన వారితో కలిపి మొత్తం 732 మంది జుడీషియల్ ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు.

(అట్టుడుకుతున్న దుబాయ్‌ : విమానాశ్రయం వద్ద డ్రోన్‌ దాడి)

ప్రధాని పర్యటన సందర్భంగా తృణమూల్,  బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలపై కేంద్ర ఎన్నికల సంఘం (ECI) సీరియస్ అయింది. షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందని, హింసాత్మక ఘటనలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల ప్రధాన కమిషనర్ హెచ్చరించారు.

కాగా పశ్చిమ బెంగాల్‌తో సహా నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం (ECI) ఆదివారం నాడు ప్రకటించిన వెంటనే బీజేపీ  తొలి జాబితా సిద్ధం కావడం విశేషం.  ఈ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడతాయి.

కేరళలో కూడా
కేరళ అసెంబ్లీ ఎన్నికలు 2026 కోసం బిజెపి సోమవారం (మార్చి 16) 47 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. క్రైస్తవ ఓటు బ్యాంకును ఆకర్షించే ప్రయత్నాల్లో భాగంగా. క్రైస్తవుల కోట అయిన కొట్టాయంలోని కంజిరపల్లిలో కేంద్ర మైనారిటీ వ్యవహారాల సహాయ మంత్రి,రాజ్యసభ సభ్యుడు జార్జ్ కురియన్‌ను పోటీకి దింపగా, ప్రాంతీయ పార్టీ కేరళ కాంగ్రెస్ మాజీ నాయకులు మరియు మాజీ ఎమ్మెల్యే పిసి జార్జ్ మరియు అతని కుమారుడు షోన్ జార్జ్‌లను వరుసగా కొట్టాయం జిల్లాలోని పూంజర్ , పాలాలో పోటీకి దింపడం గమనార్హం.
 

 ఇదీ చదవండి: అమ్మానాన్నకు సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌ : ఎమోషనల్‌ వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement