పీకే అంచనాలు బ్రేక్‌ : విజయ్‌ విజయ దుందుభి! | Prashant Kishor’s Predictions Go Viral As TVK Leads Tamil Nadu Poll Trends Under Vijay Solo Strategy | Sakshi
Sakshi News home page

పీకే అంచనాలు బ్రేక్‌ : విజయ్‌ విజయ దుందుభి!

May 4 2026 11:53 AM | Updated on May 4 2026 1:03 PM

TN polls Keep this video Prashant Kishor prediction on Vijay goes viral

సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంచనాలు నిజమవుతున్నట్లు కనిపిస్తున్నాయి. నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) అనూహ్య ఆధిక్యంతో విజయం దిశగా దూసుకుపోతోంది.

మే 4  నాటి కౌంటింగ్ అప్‌డేట్స్ ప్రకారంప్రధాన పార్టీలైన డీఎంకే, ఏఐడీఎంకే కూటములను వెనక్కి నెట్టి  మరీ విజయ్ పార్టీ ‘విజిల్‌ పోడు..పోడు’ అన్నట్టు ప్రభంజనం సృష్టిస్తోంది. టీవీకే 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది.  ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  

ప్రశాంత్ కిషోర్ అంచనా ఏంటి?
గతంలో  ఒక మీడియాకు  ఇచ్చిన ఇంటర్వ్యూలో కిషోర్ ఈ క్రింది ఆసక్తికర విషయాలను పంచుకున్నారు ఒంటరి గానే విజయ్‌ విజయ దుందుభి మోగిస్తారని జోస్యం చెప్పారు. విజయ్ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేస్తేనే గెలిచే అవకాశాలు ఎక్కువని చెప్పారు.

ఒంటరిగానే పోరు
పీకే అంచనా వేసినట్టుగా టీవీకే పార్టీ మేజిక్ ఫిగర్ అయిన 118 స్థానాలను గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా? అని ప్రశ్నించినపుడు "ఖచ్చితంగా సాధ్యమే, ఫలితాలు వచ్చాక ఈ వీడియోని మళ్ళీ ప్లే చేసి చూడండి" అంటూ ధీమా వ్యక్తం చేయడం  విశేషం. ప్రస్తుతం ట్రెండ్స్‌ నేపథ్యంలో పీకే వీడియో వైరల్‌గా మారింది. మరోవైపు విజయ్ తన రాజకీయ అరంగేట్రం కోసం ప్రశాంత్ కిషోర్‌ను సలహాదారుగా నియమించు కున్నట్లు సమాచారం. కిషోర్ అందించిన వ్యూహాలు, క్షేత్రస్థాయి విశ్లేషణలు ఈ విజయానికి ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కాగా తమిళనాడులో దశాబ్దాలుగా సాగుతున్న DMK-AIADMK ద్వైపాక్షిక రాజకీయాలకు విజయ్ చెక్ పెట్టినట్లు కనిపిస్తోంది. ప్రస్తుత ట్రెండ్స్ కొనసాగితే, విజయ్ కింగ్ మేకర్‌గా కాకుండా ఏకంగా కింగ్‌గా అవతరించే అవకాశం ఉంది. ప్రశాంత్ కిషోర్ చెప్పినట్లే, ఏ కూటమితోనూ కలవకుండా ఒంటరిగా బరిలోకి దిగి విజయ్ సక్సెస్ అయ్యారు.  ఇది ఇలా ఉంటే తుది ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

ఇదీ చదవండి: అస్సాం, బెంగాల్, పుదుచ్చేరి మావే : విజయోత్సాహంలో బీజేపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement