కేరళ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ అత్యంత ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ముందుగా అధికారులు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపును ప్రారంభించారు. అనంతరం ఈవీఎం ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాజీవ్ చంద్రశేఖర్ (ఎన్‌డీఏ), పినరయి విజయన్ (ఎల్డీఎఫ్), వీడీ సతీశన్ (యూడీఎఫ్) తదితర హేమాహేమీల రాజకీయ భవితవ్యం ఈరోజు తేలిపోనుంది.
కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) భారీ విజయం దిశగా దూసుకుపోతోంది. తొలి ట్రెండ్స్ ప్రకారం యూడీఎఫ్ మెజారిటీ మార్కును (71+ సీట్లు) దాటుతుందని, అలాగే 70-80కి పైగా సీట్లలో ఆధిక్యంలో ఉండే అవకాశం ఉందని సమాచారం.
ఎల్డీఎఫ్ వెనుకబడి ఉంది. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సహా పలువురు మంత్రులు కూడా వెనుకబడి ఉన్నారు. అయితే ఎన్నికల సంఘం అధికారిక ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. ఇప్పటి వరకూ వెలువడుతున్న ఫలితాల నేపధ్యంలో 10 ఏళ్ల ఎల్డీఎఫ్ పాలనకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. కేరళం ముఖ్యమంత్రి అభ్యర్థిని హైకమాండ్ నిర్ణయించనున్నప్పటికీ, నాయకత్వంలో మార్పు వచ్చే అవకాశం ఉందని వినికిడి.
రాష్ట్రంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్)ఘన విజయం దిశగా పయనిస్తుండటంతో తిరువనంతపురంలోని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో సంబరాలు మొదలయ్యాయి.
ఎన్నికల సంఘం అందించిన తాజా వివరాల ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ మెజారిటీ మార్కును అధిగమించింది. కేరళం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు యూడీఎఫ్‌కు అనుకూలంగా ఉన్నాయని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. పలువురు ప్రముఖ ఎల్‌డీఎఫ్ అభ్యర్థులు వెనుకబడి ఉన్నారని థరూర్ పేర్కొన్నారు. కేరళ ఓటర్లలో మార్పు కోరుకుంటున్నారనే విషయాన్ని ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.

#WATCH | Keralam Elections 2026 | Congress-led UDF has crossed the majority mark, according to the latest Election Commission trends.
When asked about factors behind LDF's poor performance, State Congress president Sunny Joseph says, "Anti-people policies."
"That we will decide… pic.twitter.com/pEVBHSjLfK— ANI (@ANI) May 4, 2026
కన్నూరులోని ధర్మడోం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెనుకంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి గంటలో మంత్రులు వీణా జార్జ్, ఎంబి. రాజేష్, ఓఆర్ కేలు, ఆర్. బిందు, జె. చించురాణి, పిరాజీవ్, కెబి. గణేష్ కుమార్, రోషీ అగస్టిన్ తమ నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉన్నారు.
కొడువల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో యూడీఎఫ్ అభ్యర్థి పీకే ఫిరోజ్ 4,875 ఓట్లతో ముందంజలో ఉన్నారు. ఎల్‌డీఎఫ్ అభ్యర్థి సలీం మాదవూర్ 4,083 ఓట్లతో వెనుకంజలో ఉండగా, బీజేపీ అభ్యర్థి గిరి పంబనల్ ఇప్పటివరకు 929 ఓట్లను సాధించారు.
ఇరింజలకుడలో మొదటి రౌండ్ లెక్కింపు తర్వాత థామస్ ఉన్నియాడన్ (కేరళ కాంగ్రెస్) ముందంజలో ఉన్నారు. కడుతురుత్తిలో అడ్వకేట్ మాన్స్ జోసెఫ్ (కేరళ కాంగ్రెస్) 4,750 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.
కేంద్ర మంత్రి సురేష్ గోపి నియోజకవర్గమైన త్రిశూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రాజన్ జె. పల్లన్ ముందంజలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి పద్మజా వేణుగోపాల్ వెనుకంజలో ఉండగా, సీపీఐ మూడవ స్థానంలో ఉంది.
కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 48 స్థానాలతో స్థిరమైన ఆధిక్యాన్ని కొనసాగిస్తుండగా, అధికార లెఫ్ట్ కూటమి 13 స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 10 స్థానాలతో మూడవ స్థానంలోఉంది.
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) ఆరంభ ఆధిక్యాన్ని సాధిస్తున్నది. ఇప్పటివరకు మొత్తం 140 నియోజకవర్గాల్లో 11 చోట్ల ఆధిక్యాలు వెలువడగా, సీపీఐ(ఎం), సీపీఐ సహా ఎల్‌డీఎఫ్ కూటమిలోని పార్టీలు ఈ స్థానాల్లో ముందంజలో ఉన్నాయని సమాచారం.
140 మంది సభ్యులు కలిగిన కేరళ అసెంబ్లీలో ప్రాథమిక ఫలితాల ప్రకారం కాంగ్రెస్ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ ఐదు స్థానాల్లోనూ, ఎల్‌డీఎఫ్ నాలుగు స్థానాల్లోనూ ముందంజలో ఉన్నాయి.కేరళ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తన సోషల్ మీడియా బయోను అప్‌డేట్ చేశారు. అందులో ఆయన తన ‘ముఖ్యమంత్రి’ హోదాను తొలగించి, తనను భారత కమ్యూనిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పేర్కొన్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్న నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల కార్యకర్తలు సంబరాలకు సన్నాహాలు ప్రారంభించారు.
మలప్పురం జిల్లాలోని పండిక్కడ్‌లో తమ విజయం ఖాయమని భావిస్తూ కాంగ్రెస్,యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) కార్యకర్తలు సుమారు 5,000 మందికి సరిపడా బిర్యానీని సిద్ధం చేస్తున్నారు. సంబరాలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.
కొచ్చిలో సంబరాలకు బీజేపీ సిద్ధమయ్యింది. ఇప్పటికే భారీ మొత్తంలో లడ్డూలను ఆర్డర్ చేసింది. బీజేపీకి దాని మిత్రపక్షాలకు ప్రస్తుతం కేరళ అసెంబ్లీలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. కానీ ఈసారి తాము ఖాతాను తెరుస్తామని ఆ పార్టీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Kerala CM Pinarayi Vijayan updates his social media bio, a day before the counting of votes for the Kerala Assembly elections, dropping the “Chief Minister” designation
READ: https://t.co/BEqWeY1DFWhttps://t.co/BEqWeY1DFW— WION (@WIONews) May 4, 2026
VIDEO | Kerala Poll Results 2026: Party cadres arrive at KPCC office in Thiruvananthapuram ahead of counting.#KeralaPollResults2026 #Results2026WithPTI #AssemblyElectionResults2026
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/fnu5YsQrjL— Press Trust of India (@PTI_News) May 4, 2026
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో ఈ లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. తరువాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఈ కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం రాష్ట్రవ్యాప్తంగా 43 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి మే 6వ తేదీ వరకు అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ కోసం 17,565 మంది ఎన్నికల సిబ్బందిని విధులలో నియమించారు.


