విజయవాడ : ఇంద్రకీలాద్రిపై ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు, నీట్ పరీక్ష నేపథ్యంలో వేకువజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు, విద్యార్థులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.
అమ్మవారి మహా నివేదన నిమిత్తం మధ్యాహ్నం అన్ని దర్శనాలు నిలిపివేయడంతో క్యూలైన్లలో రద్దీ మరింత పెరిగింది. ఎండల తీవ్రత నేపథ్యంలో భక్తులకు మజ్జిగ, మంచినీటితో పాటు పిల్లలకు బిస్కెట్లు అందజేశారు.


