Five State Elections 2026
-
పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. కీలక అభ్యర్థులు వీరే..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ఓటింగ్ ఏప్రిల్ 23న జరుగుతుంది. తొలి దశలో 152 స్థానాలకు పోలింగ్ ఉంటుంది. తొలి దశ ప్రచారం మంగళవారం (ఏప్రిల్ 21)న ముగిసింది. మిగిలిన ప్రాంతాల్లో ఏప్రిల్ 29న ఓటింగ్ జరుగుతుంది. ఫలితాలు మే 4న ప్రకటిస్తారు.రాజకీయంగా కీలకమైన పశ్చిమ బెంగాల్లో ప్రధాన పోటీ తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ మధ్యే ఉంది. ఏప్రిల్ 23న ఓటింగ్ 16 జిల్లాల్లోని 152 నియోజకవర్గాల్లో ఉన్నాయి.తొలి దశలో పోటీ చేసే కీలక అభ్యర్థులునందిగ్రామ్లో సువేందు అధికారి vs పబిత్ర కర్బీజేపీ నేత సువేందు అధికారి నందిగ్రామ్ నుంచి పోటీ చేస్తున్నారు. 2021లో మమతా బెనర్జీని ఓడించి ఈ స్థానాన్ని గెలిచారు. అలాగే భవానీపూర్ నుంచి కూడా ఆన పోటీ చేస్తున్నాడు. నందిగ్రామ్ లో ఏప్రిల్ 23న, భవానీపూర్‌లో ఏప్రిల్ 29న పోలింగ్ జరుగుతుంది. సువేందు అధికారి 2020లో టీఎంసీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2021 ఎన్నికల్లో టీఎంసీ 294 స్థానాలకుగానూ 213 స్థానాలు గెలిచింది. కానీ, నందిగ్రామ్‌లో సువేందు అధికారి.. బెనర్జీపై విజయం సాధించారు.ప్రస్తుతం అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న అధికారి. టీఎంసీ అభ్యర్థి పబిత్ర కర్ పై ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. కర్ ఒకప్పుడు బీజేపీలో కొనసాగారు. తర్వాత టీఎంసీ చేరారు. ఇప్పుడు తన మాజీ గురువుతో పోటీ పడుతున్నారు.బహరంపూర్‌లో అధీర్ రంజన్ చౌధురి vs సుబ్రత మైత్రాఅధీర్ రంజన్ చౌధురి దీర్ఘకాలం కాంగ్రెస్ ఎంపీగా బహరంపూర్ నుంచి 5 సార్లు గెలిచారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీ నేత యూసుఫ్ పఠాన్ చేతిలో ఓడిపోయారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికలో బహరంపూర్ నుంచి బీజేపీ అభ్యర్థి సుబ్రత మైత్రాను ఎదుర్కొంటున్నారు.ఆసన్సోల్ దక్షిణలో అగ్నిమిత్ర పాల్ vs తపాస్ బెనర్జీఅగ్నిమిత్ర పాల్ బీజేపీ మహిళా నాయకుల్లో ప్రముఖురాలు. 2019లో బీజేపీలో చేరి, 2021 ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి సాయోని ఘోష్ పై విజయం సాధించారు. ఇప్పుడు టీఎంసీ అభ్యర్థి తపాస్ బెనర్జీతో పోటీ పడుతున్నారు. తపాస్ బెనర్జీ టీఎంసీకి చెందిన సీనియర్ నాయకుడు. 2011 నుంచి 2021 వరకు ఈ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు.ఖరగ్‌పూర్ సదర్‌లో దిలీప్ ఘోష్ vs ప్రదీప్ సర్కార్దిలీప్ ఘోష్ బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు. పశ్చిమ బెంగాల్ లో పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. 2016లో ఖరగ్‌పూర్ సదర్ నుంచి గెలిచారు. 2021లో బీజేపీ అభ్యర్థి హిరణ్ చటర్జీ స్వల్ప తేడాతో విజయం సాధించారు. 2026 ఎన్నికల్లో ఘోష్ మళ్లీ అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. టీఎంసీ ప్రదీప్ సర్కార్ ను రంగంలోకి దింపింది. సర్కార్ 2019 ఉపఎన్నికలో గెలిచారు.మథాభంగాలో నిసిత్ ప్రమాణిక్ vs సబ్‌లు బర్మన్కేంద్ర మాజీ మంత్రి నిసిత్ ప్రమాణిక్ బీజేపీ అభ్యర్థిగా కూచ్ బెహార్ జిల్లా మథాభంగా (ఎస్సీ) స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. టీఎంసీ నుంచి సబ్‌లు బర్మన్ పోటీకి దిగారు. సీపీఎం అభ్యర్థి ఖగేన్ చంద్ర బర్మన్, కాంగ్రెస్ అభ్యర్థి క్షితేంద్ర నాథ్ బర్మన్ కూడా రంగంలో ఉన్నారు. ప్రమాణిక్ 2021 లో దిన్హాటా నుంచి గెలిచారు. తర్వాత లోక్ సభ సభ్యత్వం కొనసాగించేందుకు ఆ స్థానాన్ని ఖాళీ చేశారు. ఉపఎన్నికలో ఉదయన్ గుహ గెలిచారు.డోంకల్లో హుమాయున్ కబీర్ vs మొస్తాఫిజుర్ రహమాన్మాజీ టీఎంసీ నేత, మమతా బెనర్జీ కేబినెట్లో మంత్రిగా పనిచేసి హుమాయున్ కబీర్.. ఇప్పుడు ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీని స్థాపించి స్వతంత్రంగా పోటీ నిర్ణయం తీసుకున్నారు. 2025 లో బాబ్రీ మసీదు నిర్మాణ ప్రతిపాదన కారణంగా ఆయన పార్టీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. మాజీ ఐపీఎస్ అధికారి అయిన కబీర్, సీపీఎం అభ్యర్థి మొస్తాఫిజుర్ రహమాన్ పై పోటీ చేస్తున్నారు. 2021లో ఈ స్థానం నుంచి టీఎంసీకి చెందిన జాఫికుల్ ఇస్లాం గెలిచారు.పానిహాటిలో రత్నా దేవనాథ్ vs నిర్మల్ ఘోష్ఆర్జీకర్ ఆసుపత్రి ఘటనలో అత్యాచారం, హత్యకు గురైన మహిళా వైద్యురాలి తల్లి రత్నా దేవనాథ్. బీజేపీ అభ్యర్థిగా పానిహాటి నుంచి రత్నా దేవనాథ్ పోటీ చేస్తున్నారు. ఆమె ప్రత్యర్థి టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్. -
PM Modi : పది రూపాయల స్నాక్.. పది కోట్ల వ్యూస్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్ 21న జహాగ్రామ్‌లో ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సభ అనంతరం హెలిప్యాడ్ వైపు వెళ్తూ రోడ్డు పక్కన ఉన్న ఒక చిన్న దుకాణం వద్ద ఆగి, స్థానిక స్ట్రీట్ ఫుడ్ అయిన ఝల్మురి రుచి చూశారు. అక్కడి ప్రజలతో సరదాగా మాట్లాడారు. ఆ క్షణాల ఫొటోలు, వీడియోలను ఆయన ట్విట్టర్లో షేర్ చేశారు.ఈ సంఘటనతో ఆ దుకాణం యజమాని విక్రమ్ కుమార్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. మోదీ రాకతో నేను ఓవర్‌నైట్‌లో ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారాను అని విక్రమ్ మీడియాతో చెప్పుకొచ్చాడు. ఊహించని విధంగా ప్రజలు తన దుకాణానికి పోటెత్తుతున్నారని, ఫోన్‌కాల్స్ ఎక్కువై సమాధానం చెప్పలేక ఫోన్‌ను ఫ్లైట్ మోడ్‌లో పెట్టాల్సి వచ్చిందని వివరించాడు. కస్టమర్లతో పాటు రీల్స్ తీసుకునేవారు, సెల్ఫీలు దిగేవారు కూడా పెరిగారని చెప్పాడు.ప్రధాని మోదీ కొనుగోలు చేసిన ఝల్మురి ధర కేవలం రూ.10 మాత్రమేనని విక్రమ్ వెల్లడించాడు. మోదీ షేర్ చేసిన వీడియో 24 గంటల్లోపే ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల వ్యూస్, ఫేస్బుక్లో 11 కోట్ల వ్యూస్ దాటింది. అంతేకాదు, ఝల్మురి కోసం గూగుల్‌లో గత 20 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా సెర్చ్‌లు పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి.ప్రధాని సభ ముగించుకుని హెలిప్యాడ్ వైపు వెళ్తున్నప్పుడు నా స్టాల్ వద్ద ఆగారు. ఝల్మురి ధర ఎంత అని అడిగారు. నా నేపథ్యం, చదువు గురించి తెలుసుకున్నారు. నేను తొమ్మిదో తరగతి వరకు చదివానని చెప్పాను’అని విక్రమ్ గుర్తు చేసుకున్నాడు. తరువాత మోదీ సోషల్ మీడియాలో ‘జహాగ్రామ్‌లో మసాలా ఝల్మురి రుచి చూశాను’ అని రాశారు. ఆ రోజు ఆయన నాలుగు సభలు నిర్వహించినప్పటికీ, ఈ చిన్న విరామం ప్రత్యేకంగా నిలిచింది. ముఖ్యంగా, మోదీ స్వయంగా డబ్బు చెల్లించి కొనుగోలు చేయడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.ఈ ఒక్క క్షణం వెనుక విక్రమ్ కుటుంబం దీర్ఘ ప్రయాణం ఉంది. 12 ఏళ్ల క్రితం వారు బీహార్ నుంచి జహాగ్రామ్‌కి వచ్చారు. చిన్న చిన్న స్టాళ్లలో మారుతూ, చివరికి రాజ్ కాలేజ్ మోర్ వద్ద ప్రభుత్వ అనుమతితో 77 అడుగుల స్థలం పొందారు. అక్కడే శాశ్వతంగా ఝల్మురి అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. కుటుంబం జహాగ్రామ్లోని బఛ్ఛుర్దోహా ప్రాంతంలో ఇల్లు కూడా నిర్మించుకుంది. షాపు నుంచే వచ్చే ఆదాయంతో ఆ ఇల్లు నిర్మాణం సాగిందని విక్రమ్ తెలిపారు. ఇప్పుడు తన దుకాణం రద్దీ పెరిగింది. కస్టమర్లతో పాటు నెటిజన్లను ఆకర్షిస్తోంది. Jhalmuri break in Jhargram! pic.twitter.com/LJNjEojAW4— Narendra Modi (@narendramodi) April 19, 2026 -
ఎల్లుండే బెంగాల్ పోలింగ్.. ఈసీ కొత్త ఆంక్షలు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఆంక్షలను తెర మీదకు తెచ్చింది. టూవీలర్స్ ప్రయాణాలపై నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. ఎన్నికలు జరగబోయే 152 నియోజకవర్గాలకు ఈ ఆంక్షలు వర్తించనున్నాయి. గురువారం తొలి దఫా పోలింగ్ నేపథ్యంలో.. ఈ రెండ్రోజుల పాటు బైక్ ప్రయాణాలపై నిషేధం విధించింది ఈసీ. సాయంత్రం 6 నుంచి వేకువ జామున 6 దాకా రోడ్లపై బైక్ ఎక్కడానికి వీల్లేదు. అయితే.. అత్యవసరం సేవల కోసం మాత్రమే మినహాయింపు ఉంటుందని ఈసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక ఉదయం 6 నుంచి సాయంత్రం 6 మధ్య బైక్‌లు రోడ్ల మీద తిరగవచ్చు. కానీ, ఒంటరిగానే వెళ్లాల్సి ఉంటుంది. అంటే పిలియన్ రైడింగ్(pillion riding) కు అనుమతి లేదన్నమాట. అలాగే.. బైక్ ర్యాలీలకు అస్సలు అనుమతి లేదు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు ప్రకటించింది. నిబంధనలను ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని ఈసీ హెచ్చరించింది. అయితే.. పగటి పూట పిలియన్ రైడింగ్ విషయంలో టూవీలర్స్ వాహనదారులకు మాత్రం ఈసీ కాస్త ఊరట ఇచ్చింది. పిల్లలను విద్యా సంస్థల్లో దింపడం, వేడుకలకు హాజరు కావడం, మెడికల్ ఎమర్జెన్సీలకు మినహాయింపు ఉంటుందని తెలిపింది. ఓట్లు వేయడానికి వెళ్లేవారికి కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. పోలింగ్‌కు విఘాతం కలగవచ్చనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ చెబుతోంది. బెంగాల్లో ఏ ఎన్నికలు జరిగినా.. హింసాత్మక ఘటనలు జరగడం చూస్తున్నదే. అందుకే అక్కడి ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బెంగాల్లో ఈసారి ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించి తీరతామని సీఈసీ జ్ఞానేష్ కుమార్ సోమవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే కఠిన ఆంక్షలు అమలు చేయాలని ఈసీ భావిస్తోంది. అయితే.. బెంగాల్ ఎన్నికల కోసం ఈసీ ఈ కొత్త ఆంక్షలు తేవడం ఇదే తొలిసారి కాదు. 2021 బెంగాల్ ఎన్నికల టైంలోనూ ద్విచక్ర వాహనాలపై ఇలాంటి ఆంక్షలే విధించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల టైంలోనూ ఈసీ ఈ తరహా నిర్ణయమే అమలు చేసింది. -
ప్రధాని మోదీకి ‘తమిళ మేకప్?.. నెట్టింట రచ్చ
చెన్నై: సార్వత్రిక ఎన్నికల వేళ సోషల్ మీడియాలో విచిత్ర చర్చ మొదలైంది. ఏప్రిల్ 23న జరగనున్న తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆ బహిరంగ సభలో మోదీ చర్మం మునుపటికంటే కాస్త ముదురు రంగులో (నల్లగా) కనిపించడం వెనుక ఏదైనా రాజకీయ వ్యూహం ఉందా? అనే కోణంలో తీవ్రమైన చర్చ నడుస్తోంది.స్థానిక ఓటర్ల కోసమే మేకప్ వేశారా?ఎక్స్, ఇన్స్టాగ్రామ్ తదితర మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియోలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. తమిళనాడు ఓటర్లను ఆకర్షించేందుకు, స్థానికులతో మమేకమయ్యేందుకు ఉద్దేశపూర్వకంగానే మోదీకి ముదురు రంగు మేకప్ లేదా బ్రాంజర్ వేశారంటూ కొందరు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వాదనలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని, వీటికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టమవుతోంది. అయినా ఈ అంశంపై వ్యంగ్యాస్త్రాలు, మీమ్స్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. DARK MAKEUP FOR DARKER VOTES — Tamil Nadu Tantrum!” 😡🎭 ⁉️Everything is a PR stunt for our PM.In Tamil Nadu, he seems to have applied darker skin-tone makeup to “look like one among them. Does he really think all Tamilians are black or dark? If this is true then this is… https://t.co/b8oGXWAZgA— 🥇 Pragnya Gupta (@GuptaPragnya) April 20, 2026కెమెరా ఎఫెక్టా, ఎండ ప్రభావమా?ఒకవైపు ఈ 'తమిళనాడు మేకప్' వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతుండగా, మరోవైపు నెటిజన్లు పెద్ద ఎత్తున మోదీకి మద్దతుగా నిలుస్తున్నారు. తీవ్రమైన ఎండలో బహిరంగ సభలో పాల్గొన్నప్పుడు కెమెరా ఎక్స్పోజర్, లైటింగ్ లోపాలు లేదా సూర్యరశ్మి ప్రభావం వల్ల సహజంగానే చర్మం రంగు అలా కనిపించి ఉండొచ్చని వారు అంటున్నారు. వీడియోలు తీసిన కోణం లేదా పోస్ట్-ప్రాసెసింగ్ ఎఫెక్ట్స్ కూడా దీనికి కారణం కావొచ్చని విజువల్ మీడియా నిపుణులు సైతం విశ్లేషిస్తున్నారు. Different shades; early morning in Bengal election campaign V/s evening election campaig in Tamil Nadu after applying shoe polish on face..He’s not insulting entire Tamilians ? pic.twitter.com/InN7RxsCn1— RajSpeak Parody ☭ (@RajSpeak_) April 21, 2026ఉత్తర-దక్షిణ వివాదంగా మారిన రాజకీయంవాస్తవ నిర్ధారణ జరగకముందే ఈ వివాదం ఉత్తర-దక్షిణ రాష్ట్రాల మధ్య విభజన రేఖలు గీసే స్థాయికి చేరుకుంది. ఆన్లైన్ వేదికగా రెండు వర్గాలు తీవ్రంగా వాదించుకుంటూ సోషల్ మీడియాను రెండుగా చీల్చాయి. ఎన్నికల వాతావరణంలో ఇలాంటి చిన్న చిన్న దృశ్యాలు కూడా ఎంత వేగంగా పెద్ద చర్చకు దారితీస్తాయో ఈ ఘటన నిరూపిస్తోంది. ఇప్పటివరకు ప్రధానమంత్రి కార్యాలయం లేదా ప్రభుత్వ వర్గాల నుంచి ఈ ప్రచారంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.ఇది కూడా చదవండి: తెల్ల టవల్ జారిపోతే.. అధికారం ఊడినట్లేనా? -
‘టీవీకే’ రోబోను చూశారా? సందడి మాములుగా లేదుగా!
చెన్నై: కోయంబత్తూరులో తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ వినూత్నంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది. రోబోతో ఓట్ల వేట మొదలుపెట్టింది. టీవీకే కండువా ధరించిన ఒక రోబోను రంగంలోకి దించారు. సౌత్ చెన్నై అభ్యర్థి సెంథిల్ కుమార్‌కు మద్దతుగా రోబో ప్రజలకు అభివాదం చేస్తూ.. వారితో కరచాలనం చేస్తూ సందడి చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధినేత విజయ్ క్షేత్రస్థాయి ప్రచారంలో తక్కువగా పాల్గొంటుండటంతో అభ్యర్థులు వినూత్న పద్ధతుల్లో ప్రచారం చేస్తున్నారు తిరువెరుంబూర్‌లో అభ్యర్థి విజయ్ కార్డ్బోర్డ్ కటౌట్‌ను ఉపయోగించారు. కుంభకోణంలో హోలోగ్రామ్ ఏఐ సాంకేతికతతో ప్రచారం నిర్వహించారు. కొలత్తూరులో విజయ్ పోలికలతో ఉన్న వ్యక్తితో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కోయంబత్తూరు సౌత్‌లో ఇప్పుడు రోబో ప్రచారం హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి విజయ్ కేవలం ఏడు జిల్లాల్లో మాత్రమే పర్యటించడంతో విపక్షాలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.ఈ విమర్శలపై విజయ్ స్పందిస్తూ.. పోలీసులు, కొందరు అధికారులు చివరి నిమిషంలో టీవీకే కార్యక్రమాలకు అనుమతులు నిరాకరిస్తున్నారంటూ ఆరోపించారు. కేవలం సంప్రదాయ ప్రచార పద్ధతులపైనే తాము ఆధారపడలేదని, ఇప్పటికే తమిళనాడులోని ప్రతి ఇంటిలోనూ సానుకూల పవనాలు వీస్తున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమిళనాడులో ఏప్రిల్ 23న పోలింగ్ జరగనుండగా.. నేటితో(ఏప్రిల్ 21, మంగళవారం) ప్రచార గడువు ముగియనుంది.ఈ చివరి రోజున విజయ్ సౌత్ చెన్నైలో రోడ్‌షో నిర్వహించడంతో పాటు చెన్నైలోని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. పోలింగ్ ఏప్రిల్ 23 (గురువారం) ఉదయం 7.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు జరగనుంది. ప్రచారం ముగిసిన తర్వాత ఎలాంటి బహిరంగ సభలు, ఊరేగింపులు నిర్వహించకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సంగీత కచేరీలు, థియేటర్ ప్రదర్శనలు లేదా ఇతర వినోద కార్యక్రమాల ద్వారా ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేయకూడదన్నారు. ఎన్నికల అంశాలను టీవీలు, సినిమాలు, ఎఫ్.ఎమ్. రేడియోలు, వాట్సాప్, ఫేస్బుక్, ఎక్స్(ట్విట్టర్) వంటి ఏ మాధ్యమం ద్వారా కూడా ప్రసారం చేయకూడదన్నారు. ఎల్రక్టానిక్ రూపంలో వచ్చే సంక్షిప్త సందేశాల, ఇంటర్నెట్ ప్రచారాలకు కూడా ఇది వర్తిస్తుందని స్పష్టం చేశారు. गजब,अभिनेता विजय चुनाव प्रचार में एडवांस टेक्नोलॉजी का बखूबी इस्तेमाल कर रहे है....अब चुनाव प्रचार में रोबोट को उतार दिया है....यह शायद भारत में संभवत पहला चुनाव होगा, जिसमें रोबोट वोट मांग रहा है....कोयंबटूर साउथ सीट में यह रोबोट विजय की पार्टी के लिए कैंपेन कर रहा है... pic.twitter.com/UmSmlk1Vh9— Dinesh Dangi (@dineshdangi84) April 20, 2026 -
మమత వర్సెస్ మోదీ: ఐ-ప్యాక్ అడ్డాగా యుద్ధం!
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో పెను తుఫాను చెలరేగుతోంది. ఎన్నికల వ్యూహకర్త సంస్థ ‘ఐ-ప్యాక్’ చుట్టూ అల్లుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు ఇప్పుడు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), కేంద్రంలోని బీజేపీ మధ్య యుద్ధానికి దారితీశాయి. మనీ లాండరింగ్ విచారణతో మొదలైన ఈ వ్యవహారం.. దాడులు, అరెస్టులు, సమన్లు దాటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రమేయమున్న ‘గ్రీన్ ఫైల్’ ఎపిసోడ్‌తో దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అసలు ఇంతకీ ఈ ఐ-ప్యాక్ చుట్టూ ఏం జరుగుతోంది?తనిఖీల నుంచి రాజకీయ రగడకు.. ఐ-ప్యాక్ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండగా, ఊహించని రీతిలో సీఎం మమతా బెనర్జీ అక్కడికి చేరుకోవడంతో హైడ్రామా చోటుచేసుకుంది. ఏజెన్సీ వర్గాల సమాచారం ప్రకారం.. ఆమె తన అనుచరులు, పోలీసులతో కలిసి దాడులు జరుగుతున్న ప్రదేశం నుంచి కీలకమైన పత్రాలు, ఎలక్ట్రానిక్ సాక్ష్యాలను బలవంతంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత సాల్ట్ లేక్‌లోని ఐ-ప్యాక్ కార్యాలయంలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. మమత చేతిలో ఉన్న ఆ ‘గ్రీన్ ఫైల్’ దృశ్యాలు జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.పరస్పర తీవ్ర ఆరోపణలుమనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద జరుగుతున్న విచారణను సీఎం అడ్డుకున్నారని ఈడీ ఆరోపిస్తుండగా.. దర్యాప్తు సంస్థలు ఉద్దేశపూర్వకంగా తమ పార్టీకి చెందిన సున్నితమైన సమాచారాన్ని, అభ్యర్థుల జాబితాను, హార్డ్ డిస్క్‌లను లాగేసుకుంటున్నాయని టీఎంసీ ఎదురుదాడికి దిగింది. ‘ఓ పార్టీ వ్యూహాలను, పత్రాలను ఎత్తుకెళ్లడం అమిత్ షా బాధ్యతా?’ అని ప్రశ్నించిన మమత, దమ్ముంటే ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడి గెలవాలని సవాల్ విసిరారు.బొగ్గు కుంభకోణం, హవాలా లింక్స్..ఈ మొత్తం వివాదానికి మూలం 2020లో అనూప్ మాఝీ అలియాస్ లాలాకు చెందిన అక్రమ బొగ్గు మైనింగ్ కుంభకోణం. ఈ స్కామ్ ద్వారా వచ్చిన నల్లధనాన్ని హవాలా మార్గాల ద్వారా ఐ-ప్యాక్ మాతృసంస్థ అయిన ‘ఇండియన్ ప్యాక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్’కు మళ్లించారని ఈడీ ప్రధాన ఆరోపణ. హవాలా ఆపరేటర్ల ద్వారా కోట్ల రూపాయలు ఈ సంస్థకు బదిలీ అయ్యాయని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.సాక్ష్యాలను మాయం చేయడం ఏంటి?ఈ ఆరోపణలపై దాడులు జరుగుతుండగా, ముఖ్యమంత్రి నేరుగా వెళ్లి సాక్ష్యాలను మాయం చేయడంపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి మాఫియాకు మద్దతు ఇస్తున్నారని.. ప్రభుత్వాలను కూల్చడానికి, ఏర్పాటు చేయడానికి ఐ-ప్యాక్ నేరుగా మాఫియా నుంచి డబ్బులు తీసుకుంటోందని బీజేపీ ఎంపీ సంజయ్ జైస్వాల్ ఆరోపించారు. విచారణను అడ్డుకున్న మమతపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దర్యాప్తు సమయంలో ముఖ్యమంత్రి ప్రవేశించి సాక్ష్యాలను తీసుకెళ్లడం బహుశా భారతదేశ చరిత్రలో ఇదే తొలిసారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర విమర్శించారు.అరెస్టులు,ముమ్మర విచారణ..మనీ లాండరింగ్ విచారణలో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఐ-ప్యాక్ మరో సహ వ్యవస్థాపకుడు వినేష్ చందేల్‌ను ఈడీ అరెస్టు చేయడంతో ఈ కేసు ఉచ్చు మరింత బిగుసుకుంది. ఈ వ్యవహారంలో పీఎంఎల్ఏ నిబంధనలకు అనుగుణంగానే ఈడీ వ్యవహరించిందని, సరైన ఆధారాలు సమర్పించిందని ఢిల్లీ కోర్టు సైతం స్పష్టం చేసింది. దర్యాప్తు విస్తృతం కావడంతో డైరెక్టర్ రిషి రాజ్ సింగ్‌కు విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేయడమే కాకుండా, ప్రతీక్ జైన్, ఆయన భార్య, సోదరుడి వ్యాపార లావాదేవీలపై కూడా ఈడీ నిఘా పెట్టింది.ప్రశాంత్ కిషోర్ తప్పుకున్నాక..2021 ఎన్నికల తర్వాత ప్రశాంత్ కిషోర్ ఐ-ప్యాక్ నుంచి వైదొలిగినప్పటికీ, ఈ సంస్థ బెంగాల్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఇంకా కీలకంగానే వ్యవహరిస్తోంది. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు జరుగుతున్న ఈ దాడులు టీఎంసీ ప్రచార యంత్రాంగాన్ని దెబ్బతీసే కుట్ర అని ఆ పార్టీ ఆరోపిస్తుండగా.. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ఈ అంశాన్ని వాడుకుంటోంది. ఈ వ్యవహారం రాబోయే ఎన్నికల్లో ఓటర్ల నాడిని ప్రభావితం చేసే ప్రధాన అస్త్రంగా మారనుందని విశ్లేషకులు అంటున్నారు. -
‘ఝాల్మురీ’ ఓ డ్రామా: మమత
కోల్‌కతా: ఝార్గ్రామ్లో సోమవారం ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రధాని మోదీ దుకాణం వద్ద ఆగి ‘ఝాల్మురీ’ని కొనుగోలు చేయడం ఒక డ్రామా అని సీఎం మమతా బెనర్జీ కొట్టిపారేశారు. ‘అదంతా ప్రణాళికతో చేసిందే. అనుకోకుండా జరిగితే∙అక్కడికి అన్ని కెమెరాలు ఎలా వచ్చాయి?’ అని ప్రశ్నించారు. ప్రధాని వెంట ఉండే భద్రతాధికారులే వీటిని ముందుగానే ఏర్పాటు చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ తన జేబు నుంచి రూ.10 నోటు బయటకు తీయడాన్ని ప్రస్తావిస్తూ ‘ఇదంతా నమ్ముతారా? మొత్తం డ్రామయే’ అని ఆమె అన్నారు. ‘మీకు అకస్మాత్తుగా ఝాల్మురీపై ప్రేమ పుట్టుకొచ్చింది. అయితే, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలను చేపలు, మాంసం తినకుండా అడ్డుకోవడాన్ని ఏమంటారు?’ అంటూ మోదీని సీఎం ప్రశ్నించారు. -
‘ఝాల్మురీ’కి విశేష స్పందన
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఆదివారం పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచారం సమయంలో ఝాల్మురీ దుకాణాన్ని సందర్శించినప్పటి ఫొటోలకు సామాజిక మాధ్యమ వేదికల్లో విపరీత స్పందన లభించింది. ఈ ఫొటోలకు 24 గంటల వ్యవధిలో ఇన్‌స్టాగ్రామ్‌లో 10 కోట్ల వ్యూస్, ఫేస్బుక్లో 9 కోట్ల వ్యూస్ లభించాయి. గత 22 ఏళ్ల కాలంలో గూగుల్ సెర్చ్‌లో ‘ఝాల్మురీ’కి ఇంతటి స్పందన రావడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. ప్రఖ్యాత చిరుతిండి ఝాల్మురీని మరమరాలు, పచ్చి మిర్చి, టమాటాలు, ఉల్లి, ఇతర మసాలా దినుసులు కలిపి తయారు చేస్తారు. -
విజయ్ ఎన్నికల ర్యాలీలో అనూహ్య ఘటన
చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో పార్టీల నేతల ప్రచారంలో మరింత జోరు కనపడుతోంది. అన్ని పార్టీల ప్రధాన నేతలు ర్యాలీలు, బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. అలాగే, టీవీకే అధినేత విజయ్ సోమవారం పొన్నేరి అసెంబ్లీ నియోజకవర్గం పంచట్టి సహా పలు ప్రాంతాల్లో భారీ రోడ్‌షో నిర్వహించారు.ప్రచారం సమయంలో ఓ కొత్త జంట విజయ్ వద్దకు వచ్చింది. వారిని విజయ్ తన వాహనం మీదకు ఎక్కించుకున్నారు. దీంతో ఆనందం పట్టలేక పెళ్లికూతురు ఉబ్బితబ్బిబ్బయిపోయింది. పెళ్లికొడుకు, పెళ్లికూతురిని విజయ్ ఆశీర్వదించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కొత్త దంపతులు విజయ్ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. విజయ్ తన జేబు నుంచి ఒక బహుమతిని తీసి ఆ జంటకు ఇచ్చారు. వధువు-వరుడు విజయ్ చేతులను ముద్దుపెట్టుకొని, ఆయన పాదాలను తాకుతూ కనిపించారు. వరుడు విజయ్ను ఆలింగనం చేసుకున్నాడు. విజయ్ ఆ జంట చేతులను పైకి ఎత్తి విజయం మనదే అనే సంకేతం చూపించారు. పరమానందంలో ఉత్సాహంతో ఉన్న వధువు జన సమూహాన్ని అభినందిస్తూ విజిల్ వేసింది. తమిళనాడు ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న జరుగుతుంది. ఓట్ల కౌంటింగ్ మే 4న జరుగుతుంది. ప్రచారానికి సమయం తక్కువగా ఉండడంతో ప్రచారంలో నేతలు దూకుడుగా పాల్గొంటున్నారు. #ThalapathyVijay Blessed a Newly Married couple during today's campaign..❣️🤝pic.twitter.com/FPHWZqd4oO— Laxmi Kanth (@iammoviebuff007) April 20, 2026 -
అందుకే మహిళా బిల్లును ఓడించాం: రాహుల్ గాంధీ
కన్యాకుమారి: మహిళా రిజర్వేషన్ బిల్లును ఓడించిన పాపం విపక్షాలదే అంటూ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన విమర్శలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డం పెట్టుకుని అసంబద్ధంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలనుకున్న బీజేపీ పన్నాగాన్ని అడ్డుకున్నామని చెప్పారు. అందుకే మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి, పార్లమెంటులో ఓడించామని వెల్లడించారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం కన్యాకుమారిలో బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్డీఏ సర్కారు ప్రతిపాదించిన నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయన్నారు.''మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయాలని కొద్ది రోజుల క్రితం పార్లమెంటులో ప్రధానమంత్రి చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనతో దేశ ఎన్నికల వ్యవస్థను మార్చాలన్న ఉద్దేశంతోనే ఈ బిల్లు తెచ్చారు. ఏన్డీఏ ప్రతిపాదించిన పునర్విభజనతో తమిళనాడు, కర్ణాటక, కేరళతో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం బలహీనపడుతుంది. ఇది రాష్ట్రాల సమాఖ్యకు వ్యతిరేకంగా జరిగిన దేశద్రోహ చర్య. అందుకే మేము మహిళా బిల్లును వ్యతిరేకించి, పార్లమెంటులో ఓడించాం. దేశంలోని ఏ ప్రాంత ప్రాతినిధ్యాన్నైనా తక్కువ చేసే ప్రయత్నాలను ఎప్పటికీ ఒప్పుకోమ''ని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేందుకు మోదీ సర్కారు కుట్ర పన్నుతోందని లోక్‌సభలో మహిళా బిల్లుపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ ఆరోపించారు. అధికారంలో కొనసాగడం కోసం దక్షిణాది, ఈశాన్య ప్రాంతాలకు, చిన్న రాష్ట్రాలకు లోక్‌సభలో ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ దేశ ఎన్నికల ముఖచిత్రాన్నే మార్చే కుట్రగా రాహుల్ గాంధీ వర్ణించారు. కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టింది అసలు మహిళా బిల్లు కానే కాదని కొట్టిపారేశారు.చదవండి: హమ్మయ్య! అమిత్ షా నవ్వారు.. రాహుల్ గాంధీ సరదా కామెంట్స్ -
విజయ్.. ఇక ఆరంభిద్దామా!
తమిళనాడులో సినీ తారల రాజకీయ ప్రయాణం ఎప్పుడూ ప్రత్యేకమే. ఎంజీఆర్, జయలలిత, సినీ నేపథ్యం ఉన్న కరుణానిధిలు సూపర్ సక్సెస్ అయ్యారు. శివాజీ గణేశన్, విజయకాంత్, కమల్ హాసన్ వంటి కొందరు మాత్రం ఒక స్థాయి వరకే పరిమితం అయ్యారు. రజనీ కాంత్ లాంటి బడా సూపర్ స్టార్ రాజకీయాల్లోకి అడుగుపెట్టకుండానే వెనక్కి తగ్గారు. ఈ నేపథ్యంలో మరో అగ్రనటుడు విజయ్ ఎంట్రీ ‘మార్పు’ తేవొచ్చనే అంచనాలను రేకెత్తిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయ వాతావరణానికి మళ్లీ సినిమా రంగు పులుముకుంది. అధికార పార్టీ డీఎంకే పశ్చిమ తమిళనాడు నిజయోకవర్గాల ప్రచారానికి తన మిత్రుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్ హాసన్‌ను రంగంలోకి దించింది. అయితే ఇది విజయ్‌కు చెక్ పెట్టే వ్యూహంలో భాగమేనన్న చర్చ ఇప్పుడు జోరందుకుంది. ఆదివారం రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ కోయంబత్తూరులో డీఎంకే అభ్యర్థి సెంథిల్ బాలాజీ తరఫున ప్రచారం చేశారు. మన నియోజకవర్గం అంటూ ఉద్వేగంగా మాట్లాడిన ఆయన.. మెట్రో ప్రాజెక్టును నిరాకరించిన కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో టీవీకే అనేది అక్కడ పోటీలోనే లేదన్నట్లు కమల్ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది. కోయంబత్తూరు ప్రతిపక్ష అన్నాడీఎంకేకు కంచుకోటగా ఉంటూ వస్తోంది. అయితే ఈసారి ఎలాగైనా దానిని చేజక్కించుకునేందుకు కమల్‌ను ముందు ఉంచింది. కమల్‌కు ఈ నియోజకవర్గంతో వ్యక్తిగతంగా అలాగే రాజకీయంగానూ అనుబంధం ఉంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసి.. బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. తన ప్రచారంలో ఆ విషయాన్ని ప్రస్తావించిన కమల్.. బాలాజీని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయించే బాధ్యత తనదేనని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. తమిళనాట టీవీకే అధినేత విజయ్‌కి యువత, మహిళలు, జెన్‌జీ ఓటర్లలో విపరీతమైన ఆదరణ ఉంది. అందుకు తగ్గట్లే.. హోలోగ్రామ్‌లు, కటౌట్లు, సోషల్ మీడియా ద్వారా ఆయన తన ప్రచారాన్ని విస్తృతస్థాయిలో ఉధృతం చేశారు. పైకి పట్టనట్లే కనిపిస్తున్నప్పటికీ.. విజయ్ ప్రచారాన్ని డీఎంకే సీరియస్‌గానే తీసుకుంది. విజయ్ ఈ ఎన్నికల్లో చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం, త్రిచీ ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్‌లో డీంఎకే, అన్నాడీఎంకే, టీవీకే మధ్య ప్రధాన పోటీ ఉంది. త్రిచీ ఈస్ట్ డీఎంకేకు బలమైన స్థానమే అయినా టీవీకే ఎంట్రీతో పోటీ ఉత్కంఠగా మారింది. ఈ క్రమంలో.. కమల్‌ను ‘స్టార్’ క్యాంపెయినర్‌గా సీన్లో ఉంచింది. కమల్ ఇప్పటికే చెపాక్–తిరువల్లిక్కేని నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ కోసం ప్రచారం చేశారు. మరో 15 నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం బ్యాలెన్స్ ఉంది. ఇందులో పెరంబూర్, త్రిచీ ఈస్ట్ కూడా ఉన్నాయి. ఈ క్రమంలో విజయ్ను కమల్ హాసన్ నేరుగా టార్గెట్ చేసే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. కరూర్ తొక్కిసలాట, జన నాయగన్ చిత్రానికి సెన్సార్ నిరాకరణ అంశాల్లో విజయ్‌కు కమల్ హాసన్ నేరుగా మద్దతు ఇచ్చారు. అయితే ఇప్పుడు డీఎంకే కోసం ఆయన దళపతిని విమర్శించాల్సిన పరిస్థితి. అదే జరిగితే.. విజయ్ కూడా లోకనాయకుడి(ఉళగ నాయగన్)పై ఎదురు దాడి చేయాల్సి వస్తుంది. అంటే.. ఇదంతా తమిళనాడులో స్టార్ల మధ్య నేరుగా రాజకీయ పోరాటాన్ని ఆసక్తికరంగా మార్చుబోతోందన్నమాట. -
మమతా బెనర్జీకి టెన్షన్.. ఏడు లక్షల కొత్త ఓటర్లు చేరిక
కోల్‌కతా: బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో సుమారు ఏడు లక్షల మంది కొత్త ఓటర్లను ఎన్నికల సంఘం చేర్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య ఇప్పుడు 6,82,51,008కి చేరింది. కాగా, ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు జాబితాలో మరికొందరి పేర్లు చేరితే ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఈసీ తెలిపింది. కొత్త ఓటర్లలో సుమారు 3.22 లక్షల మంది మొదటి విడతలో, 3.88 లక్షల మంది రెండో విడతలో ఓటేయనున్నారు. వీరిలో తొలిసారి ఓటేస్తున్నవారు ఎందరు అనే వివరాలేవీ ఈసీ వెల్లడించలేదు. అవసరమైతే వాటిని తర్వాత పంచుకుంటామని పేర్కొంది. కాగా, కొత్త ఓటర్ల చేరికతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కొత్త టెన్షన్ మొదలైనట్టు తెలిసింది. ఇదిలా ఉండగా.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ముఖచిత్రాన్ని ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) సమూలంగా మార్చేసింది. ఓటర్ల జాబితా నుంచి 90.83 లక్షల మంది పేర్లను తొలగించడంతో ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సర్ కారణంగా రాష్ట్రంలో ఓట్ల సంఖ్య 7.66 కోట్ల నుంచి 6.77 కోట్లకు తగ్గింది. 2021 నాటి పరిస్థితులకు భిన్నంగా ఈసారి తృణమూల్, బీజేపీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఓటర్ల జాబితాలో అత్యధిక కోతలు.. ప్రభుత్వాలను ఏర్పాటు చేసేందుకు ఎల్లప్పుడూ సహకరించే మైనారిటీ ప్రాంతాల్లో చోటుచేసుకున్నాయి. తృణమూల్‌కు వెన్నెముకగా నిలిచే దక్షిణ ప్రాంతంలోనూ భారీగా కోతలు పడ్డాయి. అన్నిచోట్లా పరిస్థితి ఒకేలా లేదు. తృణమూల్‌కు బాగా బలమున్న దక్షిణ బెంగాల్లో ఇప్పుడు పరిస్థితి ఇబ్బందికరంగా మారినట్లు కనిపిస్తోంది. ఉత్తర బెంగాల్, జంగల్ మహల్ ప్రాంతాల్లో బీజేపీ తన పట్టును నిలుపుకొన్నట్లు కనిపిస్తున్నా మతువా ప్రాంతాల్లో ఓట్లు తగ్గడంతో కొంత ఇబ్బందిగానే కనిపిస్తోంది.తృణమూల్‌కు సవాలే..పశ్చిమ బెంగాల్లో తృణమూల్ లెక్కలు.. మైనారిటీలు, మహిళలు, 24 పరగణాల జిల్లాలపై ఆధారపడి ఉంటాయి. ఈ జిల్లాల్లో దెబ్బ పడటంతో కొన్ని డజన్ల నియోజకవర్గాల్లో బీజేపీ పోటీనిచ్చే అవకాశం ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. సర్‌కు ముందు రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుష ఓటర్లకు 959 మంది మహిళా ఓటర్లు ఉండేవారు. సర్ తర్వాత అది 950కి పడిపోయింది. దీంతో మమతకు అండగా నిలిచే మహిళల ఓట్లకు భారీగా కోతపడింది. మైనారిటీలు అధికంగా ఉన్న జిల్లాల్లో ఓట్ల కోతతో వారిలో అభద్రతా భావం పెరిగింది. దీనివల్ల తృణమూల్‌వైపు ఓట్లు మరింత ఏకపక్షంగా మళ్లే అవకాశం కనిపిస్తోంది. గతంలో మైనారిటీ ఓట్లద్వారా లబ్ధి పొందిన ఐఎస్ఎఫ్, ఏజేయూపీ, ఎంఐఎం నష్టపోయే అవకాశముంది.నదియాలో విచారణలో ఉన్న ఓటర్లలో 78శాతం పేర్లను తొలగించారు. ఇది రాష్ట్రంలోనే అత్యధిక తొలగింపు రేటు. 2011 నుంచి తృణమూల్ కాంగ్రెస్‌కు ఆయువుపట్టులా నిలిచిన జిల్లాలపై భారీగానే దెబ్బ పడింది. ఇందులో ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, ముర్షీదాబాద్, నదియా, మాల్దా, హూగ్లీ, హావ్‌డా, ఉత్తర్ దినాజ్‌పుర్, పూర్వ బర్ధమాన్ ఉన్నాయి. ఈ జిల్లాల్లో 66.6 లక్షల మంది పేర్లు గల్లంతయ్యాయి. ఈ జిల్లాల్లోనే 178 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. -
కోల్‌కతా డీసీ నివాసంపై ఈడీ దాడులు
కోల్‌కతా: మనీలాండరింగ్ విచారణలో భాగంగా కోల్‌కతా పోలీస్ డిప్యూటీ కమిషనర్ శంతను సిన్హా బిస్వాస్‌తో పాటు జాయ్ కామ్దార్ అనే వ్యాపారవేత్త ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ ఆదివారం దాడులు చేసింది. దాడుల సమయంలో బిస్వాస్ అందుబాటులో లేరు. కామ్దార్ను విచారణ నిమిత్తం స్థానిక ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లాక అరెస్టు చేశారు. రాష్ట్రంలో మూడు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నేపథ్యంలో ఈ దాడులు, అరెస్టు చర్చనీయాంశమయ్యాయి. కేసులో ఏప్రిల్ 1న ఈడీ మొదటి విడత సోదాలు నిర్వహించింది. రూ. 1.47 కోట్ల నగదుతో పాటు రూ. 67.64 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వెండి, ఒక నాటు తుపాకీని స్వాధీనం చేసుకుంది. అల్లర్లు, హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, ఆయుధాల చట్ట ఉల్లంఘనల అభియోగాలతో కోల్కత్తా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించింది. -
బీజేపీతోనే మహిళలకు న్యాయం
సాక్షి, చెన్నై: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి కాంగ్రెస్, డీఎంకే లు మహిళలకు ద్రోహం చేశాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రమే మహిళలకు న్యాయం జరిగేలా చూస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మోదకురిచి నియోజకవర్గ బీజేపీ కృతికా శివకుమార్‌కు మద్దతుగా ఆదివారం జరిగిన రోడ్‌షోలో ప్రసంగించారు. అధికార డీఎంకే చేస్తున్న కుటుంబ రాజకీయాలపైనా ఆయన విమర్శలు గుప్పించారు. తన కొడుకు ఉదయనిధిని ముఖ్యమంత్రిని చేయడంపై స్టాలిన్ దృష్టిపెట్టారని, ఈ కుటుంబ రాజకీయాలు రాష్ట్ర ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మేలు చేయలేవని షా ఆరోపించారు. ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి కె.పళనిస్వామి నాయకత్వంలో ఎన్డీయే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఏఐఏడీఎంకే–బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలను మెరుగుపరుస్తామని, తమిళనాడుకు పూర్వ వైభవం తీసుకొస్తామబని స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీకి లభిస్తున్న మద్దతుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. -
లూటీలో తృణమూల్ పీహెచ్డీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ 15 ఏళ్ల పాలనలో దోపిడీలో పీహెచ్డీ చేసిందని ధ్వజమెత్తారు. చొరబాటుదార్ల అభివృద్ధిలోనే తృణమూల్‌కు అమితాసక్తి ఉందని విమర్శించారు. బుజ్జగింపు రాజకీయాలతో యువత, మహిళలు, రైతన్నలను పూర్తిగా నిర్లక్ష్యంగా చేసిందని ఆరోపించారు. చొరబాటుదార్ల ఓట్లతో కేవలం వారి మేలుకోసం పనిచేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తృణమూల్ భావిస్తోందని మండిపడ్డారు. ప్రధాని ఆదివారం బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నారాయణ్‌గఢ్, పురూలియా, బంకురా, ఝార్గ్రామ్ బహిరంగ సభల్లో ప్రసంగించారు. ఈసారి పోటీ తృణమూల్ లూటీ, ఓటు బ్యాంకు రాజకీయాలకు, బీజేపీ అభివృద్ధి ఎజెండాకు మధ్యేనన్నారు. రాష్ట్రంలో అభివృద్ధిని కోరితే బీజేపీ డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఇవి బెంగాల్ అస్తిత్వాన్ని కాపాడేందుకు జరుగుతున్న ఎన్నికలన్నారు. అభివృద్ధి జాడే లేదు ‘‘భారత్ 3జీ నుంచి 5జీకి ఎదిగింది. ప్రపంచంలో మూడో అతి పెద్ద స్టార్టప్ వ్యవస్థ మన దేశంలోనే ఉంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాం. బెంగాల్లో మాత్రం అభివృద్ధి జాడే లేదు’’ అంటూ మోదీ దుయ్యబట్టారు. ‘‘మమత పాలనలో అవినీతి, ఉద్యోగాల కొరత తప్ప ఇంకేమీ లేదు. ఉపాధి లేక బెంగాల్ మహిళలు ఢిల్లీ, ముంబై వలస వెళ్లాల్సి వచ్చింది. స్థానికులకు దక్కాల్సిన ఉద్యోగాలను చొరబాటుదార్లకు తృణమూల్ పంచిపెడుతోంది. బీజేపీ అధికారంలోకి రాగానే ఈ దోపిడీని అడ్డుకుంటాం. ఇది నా హామీ! తృణమూల్ దిగజారుడు రాజకీయాలు రాష్ట్ర సామాజిక స్వరూపాన్నే మార్చేశాయి. చొరబాట్లతో బెంగాల్ భాష, సంస్కృతి మారిపోతున్నాయి. మమత ప్రభుత్వం గిరిజన భాషలను, గుర్తింపును అవమానిస్తోంది. మదర్సాలకు రికార్డు స్థాయిలో బడ్జెట్ కేటాయిస్తూ సంతాలీ భాషను నిర్లక్ష్యం చేస్తున్నారు. గిరిజనుల భూములను విచ్చలవిడిగా ఆక్రమిస్తున్నారు. తృణమూల్ నేతలకు లంచమివ్వనిదే ఒక్క పనీ జరగడం లేదు. లంచాల సంస్కృతిని తట్టుకోలేక పరిశ్రమలు రాష్ట్రం వీడాయి. అవినీతితో ఉపాధి సంక్షోభం పెరిగింది. ఉద్యోగాల్లేక యువత అలమటిస్తోంది’’ అని విమర్శించారు. మహిళలకు తీరని ద్రోహం మహిళా రిజర్వేషన్ల చట్టం ఆమోదానికి లోక్‌సభలో తెచ్చిన బిల్లును అడ్డుకుని మహిళలకు తృణమూల్ తీరని ద్రోహం చేసిందని మోదీ ఆరోపించారు. ‘‘2029 నుంచే చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలన్న మహిళల ఆకాంక్షలతో కాంగ్రెస్‌తో కలిసి తృణమూల్ సమాధి కట్టింది. తద్వారా బెంగాల్ సోదరీమణులనూ దగా చేసింది. బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. కొన్ని జిల్లాల్లో టీఎంసీ ఒక్క సీటూ గెలవదని నా రాజకీయ అనుభవంతో చెప్పగలను’’ అన్నారు. ‘‘బీజేపీ అధికారంలోకి వస్తే మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తాం. మాతృశక్తి భరోసా పథకం కింద వారికి ఏటా రూ.36,000, గర్భిణులకు రూ.21,000, కుమార్తెల చదువుకు రూ.50,000 ఇస్తాం. వరి మద్దతు ధర క్వింటాల్‌కు రూ.3,100కు పెంచుతాం’’ అని హామీ ఇచ్చారు. ఝాల్మురీ రుచికిమోదీ ఫిదాబెంగాల్లో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రఖ్యాత చిరుతిండి ఝాల్మురీని మోదీ రుచి చూశారు. దీన్ని మరమరాలు, పచ్చి మిర్చి, టమాటాలు, ఉల్లిపాయలు, ఇతర మసాలాలతో తయారు చేస్తారు. ఝార్గ్రామ్ జిల్లాలో మోదీ కాన్వాయ్ ఓ దుకాణం ముందు హఠాత్తుగా ఆగింది. మోదీ వాహనం దిగి దుకాణదారును పలకరించారు. ‘‘సోదరా! ఝాల్మురీ ఎంత? నాకు రుచి చూపించు. రుచికరంగా త యారు చెయ్’’ అని కోరా రు. తను వెంటనే ఝాల్ మురీ చేసి ప్రధానికి అందించాడు. డబ్బులు తీసుకోవడానికి నిరాకరించగా మోదీ బలవంతంగా అతడి చేతిలో పెట్టారు. రుచెలా ఉందని దుకాణదారు ప్రశ్నించగా ఉప్పు తప్ప అన్నీ బాగున్నాయని బదులిచ్చారు. ఆరోగ్యం దృష్ట్యా తాను ఉప్పు వాడడం లేదని చెప్పారు. ఝాల్మురీ ఆరగిస్తున్న ఫొటో, వీడియోను మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. -
టీఎంసీ గుండాలు పది రోజుల్లో లొంగిపోవాలి.. లేదా: మోదీ వార్నింగ్
కోల్‌కతా: బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ప్రధాని మోదీ విరుచుకపడ్డారు. బెంగాల్లో అశాంతి సృష్టిస్తున్న టీఎంసీ గుండాలను ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బెంగాల్‌లోని బిష్ణుపూర్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మే నాలుగు తర్వాత అవినీతిపరులు, గుండాలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. కనుక టీఎంసీ గుండాలు పదిరోజుల్లోపు తమంతట తామే పోలీసుల ఎదుట లొంగిపోవాలని లేకుంటే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. బిష్ణుపూర్ మాఫియా, టీఎంసీ సిండికేట్ ఆటలు ఇకసాగవన్నారు. గత 15 ఏళ్లుగా పశ్చిమబెంగాల్లో టీఎంసీ ఏవిధమైన అభివృద్ధి చేసిందో ప్రజలకు తెలియజేయాలన్నారు. టీఎంసీ విధానాలతో బెంగాల్ గుర్తింపు ప్రమాదకరంగా మారిందన్నారు. బెంగాల్ బ్రాండ్‌ను బీజేపీ కాపాడుతుందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.అయితే అంతకుముందు లోక్‌సభలో లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడంపై ప్రధాని మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు చాలా పెద్ద తప్పు చేశాయని పేర్కొన్నారు. దీనికి తగిన పర్యవసానాలను విపక్షాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని దేశ మహిళలకు ప్రతిపక్షాలు సమాధానం చెప్పుకోవాలన్నారు. ప్రతిపక్ష పార్టీలు దేశ మహిళలను మోసం చేశాయని ఈ సందేశాన్ని దేశంలోని ప్రతి ఒక్కరికీ, ప్రతి గ్రామానికి చేరవేయాలని బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోదీ సూచించినట్లు తెలుస్తోంది -
‘మోదీ జీ.. మీ ప్రసంగం చట్ట విరుద్ధం’
కోల్‌కతా: ప్రధాని నరేంద్ర మోదీ శనివారం( ఏప్రిల్ 18వ తేదీ) రాత్రి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయ ప్రచారం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని మోదీ దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. దేశాన్ని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు నిజాయితీగా మాట్లాడాలని, కానీ మీరు(మోదీ) ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. ఆదివారం(ఏప్రిల్ 19వ తేదీ) హుగ్లీ జిల్లాలోని తారకేశ్వర్‌లో జరిగిన ఒక ర్యాలీలో ఆమె మాట్లాడుతూ, మహిళా రిజర్వేషన్ బిల్లుపై జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ద్వారా ప్రధాని మోదీ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కోసం చట్టవిరుద్ధమైన ప్రచారం చేశారని ఆరోపించారు. వారు (బీజేపీ) రాజకీయ ప్రచారాల కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. మేము దీనిని తీవ్రంగా ఖండిస్తున్నాము మరియు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) ఉల్లంఘన జరిగింది’ అని మమతా బెనర్జీ ధ్వజమెత్తారు. తాము మహిళా రిజర్వేషన్ బిల్లు వ్యతిరేకం కాదని ,డీలిమిటేషన్ బిల్లుకు మాత్రమే వ్యతిరేకమన్నారు. డీలిమిటేషన్ అంశం మోదీ పొలిటికల్ అజెండాగా మమతా అభివర్ణించారు.శనివారం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలను ఉద్దేశించి ప్రధాని మోదీ హెచ్చరిస్తూ పాపం చేసినందుకు భారతదేశ మహిళలు వారిని తీవ్రంగా శిక్షించడం ఖాయమన్నారు. మరోవైపు నేటి పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్‌పై తన దాడిని కొనసాగించారు. శాసనసభలలోకి ఎక్కువ మంది మహిళలు ప్రవేశించకుండా నిరోధించడానికి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), కాంగ్రెస్‌లు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు మోదీ. ప్రస్తుతం పశ్చిమబెంగాల్లో రాజకీయ సమర శంఖారావం మరింత వేడెక్కింది. మోదీ వర్సెస్ మమతా అన్నట్లుగా పశ్చిమబెంగాల్ ఎన్నికల ప్రచారం వేడిక్కింది. -
స్వార్థంతోనే బిల్లును వ్యతిరేకించారు
సాక్షి, చెన్నై: తమ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లు ఒక గొప్ప ప్రయత్నమని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. డీఎంకే, కాంగ్రెస్ పార్టీల విద్వేష, నీచ రాజకీయాల వల్ల ఆ బిల్లు పట్టాలు తప్పిందని అన్నారు. అధికారం కేవలం తమ కుటుంబాల చేతుల్లోనే ఉండాలన్న స్వార్థంతోనే విపక్షాలు మహిళా రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తమిళనాడులోని కోయంబత్తూరులో ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. మహిళా రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని, బిల్లు క్రెడిట్‌ను ప్రతిపక్షాలే తీసుకోవాలంటూ వ్యక్తిగతంగా అభ్యర్థించానని చెప్పారు. అయినా సరే విపక్షాలు మద్దతు ఇవ్వలేదన్నారు. సాధారణ కుటుంబాల్లో జన్మింంచిన ఆడబిడ్డలు అత్యున్నత చట్టసభలకు అధిక సంఖ్యలో రావాలని కోరుకున్నట్లు తెలిపారు. కానీ, దురదృష్టవశాత్తూ ఈ గొప్ప ప్రయత్నం సాకారం కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రతిపక్షాలే అందుకు కారణమని మండిపడ్డారు. బిల్లు ఆమోదం పొంది ఉంటే సామాన్య కుటుంబాలకు చెందిన ఎంతోమంది తమిళ మహిళలు ఎంపీలుగా, ఎమ్మెల్యేలు అయ్యేవారని.. 2011 జనాభా లెక్కల ప్రకారం తమిళనాడుకు లోక్‌సభలో మరెన్నో సీట్లు వచ్చేవని తెలిపారు. కానీ, ఇదంతా జరగడం డీఎంకేకు ఇష్టం లేదని ప్రధానమంత్రి ఆరోపించారు. -
మోదీ గుట్టు ట్రంప్‌కు తెలుసు
సాక్షి, చెన్నై: ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నియంత్రిస్తున్నారని.. మోదీ మాత్రం తమిళనాడును నియంత్రించాలని చూస్తున్నారని కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ విమర్శించారు. తమిళనాడులో అధికారం దక్కించుకోవడానికి అన్నా డీఎంకేను గుప్పిట పట్టారని చెప్పారు. ప్రధాని మోదీ మన రైతులను, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఇతర దేశాలకు అమ్మేశారని, మన ఇంధన భద్రతను పరాయి దేశాలకు అప్పగించారని, మన డేటాను కూడా పంచిపెట్టారని ఆరోపించారు. శుక్రవారం పార్లమెంట్లో మోదీ ముఖంలో ఆత్మవిశ్వాసం లోపించడం చూశా మని అన్నారు. ఆయన ప్రతిపక్షాలకు ముఖం చూపించలేకపోయారని, పక్కన కూర్చుండిపోయారని చెప్పారు. మోదీ అమెరికా నియంత్రణలో ఉండటమే అందుకు కారణమని తేల్చిచెప్పారు. మన దేశాన్ని అమ్మేయడానికి భారత్–అమెరికా ఒప్పందంపై ప్రధాని సంతకం చేశారని ఆక్షేపించారు. తమిళనాడులోని రాణిపేట, పొన్నేరి, తిరుచిరాపల్లిలో శనివారం ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. ట్రంప్ ఎలా చెబితే అలా మోదీ తలవంచే పరిస్థితి ఉందన్నారు. ఎప్స్టీన్ ఫైల్స్ ద్వారా మోదీని ట్రంప్ నియంత్రిస్తున్నారని చెప్పారు. మోదీ ఆర్థిక లావాదేవీలు, అదానీతో మోదీకి ఉన్న బంధం గురించి ట్రంప్‌కు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. దేశాన్ని పరిరక్షించుకోవడానికే శుక్రవారం లోక్‌సభలో ప్రతిపక్షాలు డీలిమిటేషన్ బిల్లును ఓడించాయని రాహుల్ గాంధీ అ న్నారు. పార్లమెంట్లో తమిళనాడు ప్రాతినిధ్యాన్ని తగ్గించాలన్నదే అసలు ఉద్దేశమని విమర్శించారు. దక్షిణ రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల బలాన్ని తగ్గించడానికే బీజేపీ ఈ పునరి్వభజన చర్య చేపట్టిందని ధ్వజమెత్తారు. తమిళనాడును కాపాడుకోవాలంటే డీఎంకే నేతృత్వంలోని కూటమిని ఎన్నికల్లో గెలిపించాలని రాహుల్ కోరారు. -
Tamil Nadu Survey: 178 స్థానాలలో గెలుపు బాటలో డీఎంకే
సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ, రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. డీఎంకే వర్గాలలో మంచి జోష్ నింపే విధంగా తాజాగా ఏఎన్ఎస్ సర్వే వివరాలు వెలుగు చూశా యి. ఇందులో తమిళనాడులో మళ్లీ డీఎంకే ప్రభంజనం సృష్టించబోతున్నట్టుగా సమాచారం వెలువడింది. తాజా సర్వే గణాంకాల ప్రకారం ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే కూటమి 178 స్థానాలను కైవసం చేసుకుని భారీ మెజారిటీతో మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోనుందని ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు మరి కొద్ది రోజులే సమయం ఉంది. ఎన్నికలకు ముందుగా వెలువడ్డ అనేక సర్వేలు డీఎంకేకు అనుకూలంగా ఫలితాల్ని ఇచ్చాయి. అదే సమయంలో ఎన్నికల నగారా మోగినానంతరం ప్రచార హోరు నేపథ్యంలో అన్నాడీఎంకేకు సైతం అనుకూలంగా సర్వేలు రావడంతో ఉత్కంఠ తప్పలేదు. అదే సమయంలో టీవీకే అధినేత విజయ్ కీలక శక్తిగా మారనున్నట్టుగా సర్వేలు పేర్కొంటూ వచ్చాయి. ఓటరు నాడి ఎటు అన్న ఉత్కంఠ నేపథ్యంలో తాజాగా వెలువడ్డ ఈ సర్వే వివరాలను డీఎంకే అనుకూల పత్రిక ప్రకటించింది. జోన్ల వారీగా అంచనాలు సర్వే నివేదిక ప్రకారం వివిధ ప్రాంతాల్లో డీఎంకే కూటమి పరిస్థితిని వివరించారు. ఇందులో చెన్నై జోన్లో 37 నియోజకవర్గాలకు డీఎంకే కూటమి 36 స్థానాల్లో పటిష్టంగా ఉండగా, అన్నాడీఎంకే ఒకే స్థానానికి పరిమితం కానున్నట్టు ప్రకటించారు. సెంట్రల్ జోన్లో 37 స్థానాల్లో 35 చోట్ల డీఎంకే గెలుస్తుందని సర్వేలో తేల్చారు. దక్షిణ జోన్లో 58 స్థానాలకు గాను 42 స్థానాల్లో డీఎంకే కూటమి ఆధిక్యంలో ఉన్నట్టు ప్రకటించారు. జిల్లా వారీగా క్లీన్ స్వీప్ అనేక జిల్లాల్లో డీఎంకే కూటమి 100 శాతం సీట్లు గెలుచుకుంటుందని సర్వేలో వివరించారు. ఆ మేరకు చెన్నై జిల్లాలో 16 సీట్లు, తిరువళ్లూరు జిల్లాలో 10 సీట్లు, తంజావూరు 8 సీట్లు, కాంచీపురం 11 సీట్లు, నీలగిరి, కరూర్, తిరువారూర్, రామనాథపురం జిల్లాల్లోని అన్ని సీట్లను డీఎంకే గెలుచుకునే అవకాశం ఉందని ఆ సర్వే ద్వారా వివరించారు. విజయ్ ప్రభావం ఓట్ల శాతం పరంగా ఈసారి రాజకీయ ముఖచిత్రం ఆసక్తికరంగా మారుతుందని ప్రకటించారు. డీఎంకే కూటమి 45.4 శాతం, అన్నాడీఎంకే కూటమి 35.3 శాతం ఓట్లతో రెండో స్థానంలో నిలిచే అవకాశం ఉందని వివరించారు. అయితే, నటుడు విజయ్ టీవీకే 11.5 శాతం ఓట్లు, సీమాన్ ఎన్టీకే 5.6 శాతం ఓట్లను దక్కించుకోనున్నట్టు పేర్కొన్నారు. 234 సీట్లున్న తమిళనాడు అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 118 కాగా, సర్వే ప్రకారం డీఎంకే 178 సీట్లు సాధించి తిరుగులేని శక్తిగా అవతరించనున్నదని, అన్నాడీఎంకే 56 సీట్ల వద్ద నిలిచిపోయే అవకాశం ఉందని తాజా సర్వే పేర్కొంది. అయితే తుది ఓటరు తీర్పు అన్నది మే 4న వెలువడే ఫలితాల మేరకు ఉండబోతుండడం గమనార్హం. ఈ సర్వే తమకు అనుకూలంగా ఉండడంతో డీఎంకే వర్గాలలో జోష్ పెరిగింది. గెలుపు దిశగా మరింత ఉత్సాహంతో ప్రచారంచేసే పనిలో పడ్డారు. -
దీదీ లోకల్ మంత్రం.. కమలం బూత్ తంత్రం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంటున్న కొద్దీ ప్రధాన రాజకీయ పక్షాలైన అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. 15 ఏళ్లుగా అధికారంలో ఉన్న తృణమూల్ తమ ప్రభుత్వంపై వ్యతిరేకతను అధిగమించేందుకు స్థానిక సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈసారి తృణమూల్‌ను ఎలాగైనా గద్దె దింపి రాష్ట్రంలో తొలిసారి అధికారం చేపట్టాలని పట్టుదలగా ఉన్న బీజేపీ బూత్ స్థాయి నుంచే పక్కా ప్రణాళికలు రచిస్తోంది. తృణమూల్ ‘ప్రతిజ్ఞా స్తంభాలు’ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ‘స్థానిక మేనిఫెస్టో’లతో తృణమూల్ వినూత్నంగా ప్రచారం చేస్తోంది. స్థానికంగా ప్రధాన సమస్యలను గుర్తిస్తూ, వాటి పరిష్కారానికి మేనిఫెస్టోల్లో హామీలిస్తోంది. డార్జిలింగ్ పర్వత ప్రాంతంలో మూడు అసెంబ్లీ స్థానాలు మినహా రాష్ట్రంలోని మిగతా 291 చోట్లా తృణమూల్ బరిలో ఉంది. అభ్యర్థుల్లో జవాబుదారీతనం పెంచేందుకు, ప్రజల్లో విశ్వాసం పాదుకొల్పేందుకు ప్రతి నియోజకవర్గంలో ‘ప్రతిజ్ఞా స్తంభం’ పేరిట వినూత్న కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టింది. స్థానిక అభ్యర్థి తాలూకు ఎన్నికల కార్యాలయం ముందు ఈ స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దానిపై అభ్యర్థి పేరుతో పాటు సమస్యల పరిష్కారానికి చేస్తున్న వాగ్దానాలను పొందుపరుస్తున్నారు. వారంక్రితం ప్రారంభమైన ఈ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా శరవేగంగా కొనసాగుతోంది. ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ప్రతిజ్ఞా స్తంభాలు, ప్రచార కార్యక్రమాల వీడియోను పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీలో కూడా పంచుకుంది. అభ్యర్థి ప్రజలకు నేరుగా జవాబుదారీగా ఉంటారనే స్పష్టమైన సందేశాన్ని రాష్ట్రవ్యాప్తంగా పంపడం దీని వెనక వ్యూహమని భావిస్తున్నారు. గతం నుంచి బీజేపీ పాఠాలు ఇక బీజేపీ 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన సంస్థాగత లోపాలను దిద్దుకునే పనిలో పడింది. ర్యాలీలు, రోడ్‌షోలు, బహిరంగ సభల ద్వారా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తూనే, అసలు యుద్ధభూమి అయిన పోలింగ్ బూత్‌ల నిర్వహణపై ఈసారి ప్రధానంగా దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని మొత్తం 85,379 పోలింగ్ బూత్‌ల్లో ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు మినహాయించి అంతటా ఇప్పటికే బూత్ కమిటీల ఏర్పాటును పూర్తి చేసింది. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు చెలరేగిన హింస కారణంగా బీజేపీ కార్యకర్తలు భారీగా బూత్‌లను వదిలి వెళ్లడం ఓటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ఈసారి ఆ పరిస్థితి తలెత్తరాదని కార్యకర్తలకు పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది. చివరి నిమిషం దాకా ఎట్టి పరిస్థితుల్లోనూ బూత్‌ను వదలకూడదని ఆదేశించింది. ప్రధాని నరేంద్ర మోదీ కూడా నేరుగా బూత్ స్థాయి కార్యకర్తలతో సంభాషిస్తూ ఉత్సాహం నింపుతున్నారు. బూత్ మేనేజ్మెంట్ను పకడ్బందీగా అమలు చేసేందుకు బెంగాల్‌ను బీజేపీ ఐదు భాగాలుగా విభజించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు అనంత్ నారాయణ్ మిశ్రా, పవన్ రాణా, సిద్ధార్థన్, ఎన్.మధుకర్, పవన్ సాయ్‌కి వాటి బాధ్యతలు అప్పగించింది. వీరంతా గత అక్టోబర్ నుంచే క్షేత్రస్థాయిలో మకాం వేశారు. సంస్థాగత లోపాలను సరిదిద్దుతూ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ వస్తున్నారు. మూడు నుంచి ఐదు బూత్‌లను కలిపి ఒక ‘శక్తి కేంద్రం’గా ఏర్పాటు చేసి, వాటి పర్యవేక్షణ బాధ్యతలను రా్రõÙ్టతర నేతలకు అప్పగించారు. నిరంతర సమీక్షలతో బూత్ స్థాయిలో రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. బూత్ మేనేజ్మెంట్లో ఈసారి తృణమూల్‌కు దీటుగా నిలుస్తామని బీజేపీ ధీమాగా ఉంది.రంగంలోకి ఆరెస్సెస్ క్షేత్రస్థాయిలో హిందువులను ఏకం చేసేందుకు ఆరెస్సెస్ ఆధ్వర్యంలో బెంగాల్ అంతటా ముమ్మర ప్రచారం సాగుతోంది. బెంగాలీ హిందువుల ఉనికిని ఈ ఎన్నికలు కీలకమంటూ ప్రచారం చేస్తోంది. ఎన్నికల హింసకు వెరచి ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు దూరంగా ఉండే ధోరణికి స్వస్తి పలకాలి. ప్రతి బూత్నూ సురక్షితం చేసి, ఓటర్లు నిర్భయంగా ఓటేసేలా చూడాలి’’ అని కార్యకర్తలకు సూచిస్తోంది. ఈసారి ఒక్క బూత్ నుంచి కూడా తమ కార్యకర్తలను తృణమూల్ పారదోలే పరిస్థితి ఉండబోదని ఆరెస్సెస్ ముఖ్య నేత ఒకరు చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి భారీగా వచ్చిన ఆరెస్సెస్ స్వయంసేవకులు జనజాగరణ కార్యక్రమంలో నిమగ్నమైనట్టు వెల్లడించారు. శరత్ చంద్ర ముక్తవరం -
టీఎంసీ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఐటీ అధికారులు శుక్రవారం టీఎంసీ నేతల ఇళ్లలో సోదాలు చేపట్టారు. వీరిలో ఒకరు రస్బెహారీ అసెంబ్లీ సీటుకు పోటీ చేస్తున్న టీఎంసీ ఎమ్మెల్యే దేబాశీస్ కుమార్ కాగా, మరొకరు భవానీపూర్ నియోజకవర్గంలో సీఎం మమతా బెనర్జీని బలపర్చిన మిరాజ్ షా కావడం గమనార్హం. కోల్‌కతాలోని దేబాశీస్ కుమార్ నివాసం, ఎన్నికల కార్యాలయం, ఆయనకు సంబంధించిన ఇతర కార్యాలయాల్లో ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించిన తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగాయి. ఐటీ అధికారుల మరో బృందం దక్షిణ కోల్‌కతాలోని ఎల్గిన్ రోడ్డులో ఉన్న మిరాజ్ షా నివాసంపై దాడి చేసింది. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీని బలపర్చిన నాలుగు వేర్వేరు మతాలకు చెందిన నేతల్లో మిరాజ్ ఒకరు. దేబాశీస్ కుమార్ సన్నిహితుడు, టీఎంసీ నేత కుమార్ సాహాకు చెందిన కాళీఘాట్ నివాసంపైనా ఐటీ దాడులు జరిగాయి. భూకుంభకోణం ఆరోపణలున్న దేబాశీస్ కుమార్ ఇప్పటికే పలుమార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. తమ నేతల ఇళ్లలో ఐటీ సోదాలను టీఎంసీ ఖండించింది. తమ పార్టీ నేతలను రెచ్చగొట్టేందుకు, వేధించేందుకే బీజేపీ ప్రభుత్వం ఇలా దాడులు చేయిస్తోందని ఆరోపించింది. ఐటీ సోదాల సమయంలో దేబాశీస్ నివాసం వద్ద గుమికూడిన టీఎంసీ కార్యకర్తలు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముందు జాగ్రత్తగా అక్కడ కేంద్ర బలగాలను మోహరించారు. -
అఖిలభారత సర్వీసుల విధానం నిష్ఫలమవుతోంది
న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డాక ఉన్నపళంగా సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సహా 1,000 మందికిపైగా ఉన్నతాధికారులను రాత్రికి రాత్రే ఈసీ బదిలీచేసిన ఘటనపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తంచేసింది. అయితే ఈ ఘటనలో తాము జోక్యంచేసుకోబోమంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ మేరకు ఈసీ నిర్ణయాన్ని సమరి్థస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌చేస్తూ దాఖలైన పిల్‌ను కొట్టేస్తున్నట్లు ధర్మాసనం పేర్కొంది. ‘‘ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో ఉన్నతాధికారుల బదిలీలపై నిర్ణయాలు తీసుకునేటప్పుడు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ సంప్రదిస్తే సముచితంగా ఉంటుంది. ఈసీ, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాల బేధాలతో అఖిలభారత సర్వీసుల అధికారులు నలిగిపోతున్నారు. ఆలిండియా సర్వీసెస్ ఏర్పాటు ఉద్దేశం నిష్ఫలమవుతోంది. ఇష్టారీతిన వాళ్లను బదిలీచేస్తున్నారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, ఈసీ మధ్య నమ్మకం లోపించిన నేపథ్యంలో సమన్వయం కోసం ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)సర్వే కోసం న్యాయాధికారులను మేం నియమించాల్సి వచ్చింది’’అని వ్యాఖ్యానించింది. -
విజయ్ వరాల జల్లు : భారీ హామీలతో TVK మేనిఫెస్టో
సాక్షి, చెన్నై: రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం యాక్టర్ టర్న్డ్ పొలిటీషియన్ విజయ్ గురువారం తమిళగ వెట్రి కజగం(TVK) మేనిఫెస్టోను ఆవిష్కరించారు. ఇందులో మహిళలు, రైతులు మరియు బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని పలు సంక్షేమ చర్యలను వాగ్దానం చేశారు. విజయ్ తన మేనిఫెస్టోను నిజాయితీకి నిదర్శనంగా అభివర్ణించారు. విజయ్ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన అంశాలు, వాగ్దానాలు ఆసక్తికరంగా మారాయి.నిజాయితీ పరిపాలనను తన సిద్ధాంతం టీవీకే పార్టీ అధినేత ప్రకటించారు. అందుకే తమ పార్టీ తొలి ఎన్నికల ప్రణాళిక కూడా నిజాయితీకి హామీలనీ, తాము స్టాలిన్ లాగా ప్రజలను తప్పుదోవ పట్టించమని వెల్లడించారు.. ప్రజలకు ఉత్తుత్తి వాగ్దానాలతో రూపొందించిన తొందరపాటు ఎన్నికల ప్రణాళిక తమది కాదని పేర్కొన్నారు. డీఎంకే, మిగతా పార్టీలన్నీ ఒకటే అని చెప్పాం కదా?... కావాలంటే ఇరు పక్షాలు విడుదల చేసిన ఎన్నికల ప్రణాళికలను తీసుకుని పోల్చి చూడండని విజయ్ అన్నారు.పీటీఐ ప్రకారం, ఈ ప్రకటనలలో ముఖ్యంంగా మహిళలకు నెలకు రూ. 2,500 సహాయం, పెళ్లి చేసుకునే పేదింటి వధువులకు నాణ్యమైన పట్టు చీరతో పాటు 8 గ్రాముల బంగారం మహిళలు నడుపుతున్న స్వయం సహాయక బృందాలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు , బడి మానేయడాన్ని నివారించడానికి తల్లులకు సంవత్సరానికి రూ. 15,000 సహాయం అందిస్తామని కూడా విజయ్ హామీ ఇచ్చారు. ప్రధాన పార్టీలు నిజమైన విధాన ప్రత్యామ్నాయాలను అందించడం కంటే, ఒకరిని మించి ఒకరు పోటీ పడాలనే లక్ష్యంతో ఒకే రకమైన వాగ్దానాలతో కూడిన తొందరపాటు ఎన్నికల ప్రణాళికలను జారీ చేస్తున్నాయని ఎద్దేవా ఏశారు. ఈ పార్టీలన్నీ ఒకే గొడుగు కింద పనిచేస్తున్న "అవినీతి ముఠాలు" అని ఆయన ఆరోపించారు. టీవీకే ఓటర్లను అదే విధంగా తప్పుదోవ పట్టించదని అన్నారు.ముఖ్యమైన హామీలుమహిళా సంక్షేమానికి నగదు సాయం: మహిళలకు నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం.నిరుపేద వధువులకు 8 గ్రాముల (కాసు) బంగారం , పట్టుచీర.మహిళా స్వయం సహాయక సంఘాలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు.5 ఎకరాలలోపు భూమి ఉన్న చిన్న రైతులకు సహకార బ్యాంకుల్లో ఉన్న పంట రుణాల పూర్తి మాఫీ.వరి పంటకు క్వింటాల్‌కు రూ. 3,500 మద్దతు ధర (MSP).ఆరోగ్యం మరియు విద్య విషయంలో కూడా కీలక హామీని తన మానిఫెస్టోలో పొందుపర్చారు. దీనికి ప్రకారం ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షల ఆరోగ్య బీమా.రాష్ట్రవ్యాప్తంగా ఆధునిక ఆసుపత్రుల ఏర్పాటు మరియు ఏటా ఉచిత ఆరోగ్య పరీక్షలు.విద్యా రంగానికి సంబంధించి, విద్యార్థులకు అండగా నిలిచేందుకు రూ. 20 లక్షల వరకు ఉన్నత విద్యా రుణాలను అందించనున్నట్లు TVK అధినేత ప్రకటించారు మాజీ ముఖ్యమంత్రి కె. కామరాజ్ పేరుతో 100 ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు చేస్తామన్నారు. పాఠశాల విద్యను మధ్యలోనే మానేసే సమస్యను పరిష్కరించే ఉద్దేశంతో, ప్రభుత్వ, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం. దీంతోపాటు తమిళనాడును డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని హామీ ఇవ్వడం విశేషం. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. తాము అధికారంలోకి వస్తే అవినీతి రహిత, నిజాయితీతో కూడిన పరిపాలన అందిస్తామని విజయ్ పేర్కొన్నారు.ప్రస్తుత అధికార పక్షం (DMK), ఇతర పార్టీలు తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని, తమ మేనిఫెస్టో మాత్రం ఆచరణాత్మక మైందని ఆయన స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఇన్‌స్టా లవ్ : 40 ఏళ్ల విడోతో 21 ఏళ్ల యువకుడి పెళ్లి -
ఈవీఎం బటన్‌పై పెర్ఫ్యూమ్.. ఎన్నికల సంఘం సీరియస్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ పోలింగ్ బూత్‌లలో అనూహ్య పరిణామాలకు సంబంధించిన బెదిరిపులు వెలుగుచూస్తున్నాయి. ఓటర్లను భయపెట్టేందుకు, నిఘాను తప్పించుకునేందుకు దుండగులు వేస్తున్న కొత్త ఎత్తుగడలు తెలుసుకున్న ఎన్నికల సంఘం (ఈసీ) అవాక్కవుతోంది. ఈవీఎం బటన్లకు పెర్ఫ్యూమ్ పూయడం, వెబ్‌కాస్టింగ్ కెమెరాలకు చూయింగ్ గమ్ అంటించడం వంటి చర్యలపై ఈసీ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి అక్రమాలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని, వెంటనే ఆయా బూత్‌లలో రీపోలింగ్ నిర్వహిస్తామని గట్టి హెచ్చరికలు జారీ చేసింది.ఓటర్లకు పెర్ఫ్యూమ్ బెదిరింపులుఓటర్లను ప్రభావితం చేసేందుకు కొందరు అగంతకులు దారుణమైన బెదిరింపులకు పాల్పడుతున్నారు. ‘మీరు ఏ పార్టీకి ఓటు వేశారో మాకు ఇట్టే తెలిసిపోతుంది, ఎందుకంటే ఈవీఎం బటన్లపై మేము పెర్ఫ్యూమ్ పూస్తాం’ అంటూ ఓటర్లను భయాందోళనలకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. అంతేకాకుండా పోలింగ్ కేంద్రాల్లో రికార్డింగ్ జరగకుండా ఉండేందుకు సీసీ కెమెరాలకు చూయింగ్ గమ్ అంటిస్తూ, నిఘా వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అక్రమాలపై దృష్టి సారించిన ఎన్నికల సంఘంఓటర్లను బెదిరించినా, నిఘా వ్యవస్థను ట్యాంపరింగ్ చేసినా రీపోలింగ్ తప్పదని స్పష్టం చేసింది.విద్యుత్ కోతలు లేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లుపోలింగ్ సజావుగా సాగేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) మనోజ్ అగర్వాల్ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. పోలింగ్ సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేకంగా జనరేటర్లను సైతం సిద్ధం చేస్తున్నారు. నెట్వర్క్ సమస్యలు ఉన్న డార్జిలింగ్, కాలింపాంగ్ సహా 642 'షాడో జోన్ల'లో వెబ్‌కాస్టింగ్ ఆగకుండా టెలికాం ఆపరేటర్ల ద్వారా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నారు. పోలింగ్‌కు 7 రోజుల ముందే బూత్‌లలో కెమెరాల ఏర్పాటు, 2 రోజుల ముందే లైవ్ వెబ్‌కాస్టింగ్ ప్రారంభం కానుంది.అడుగడుగునా భారీ భద్రతఎన్నికలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కేంద్ర బలగాలతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 152 నియోజకవర్గాల్లో జరిగే తొలి దశ పోలింగ్ కోసం ఏకంగా 2,404 కేంద్ర బలగాల కంపెనీలను మోహరిస్తున్నారు. అత్యధికంగా ముర్షిదాబాద్‌లో 316 కంపెనీలు రంగంలోకి దిగుతుండగా.. ఆ తర్వాత తూర్పు మేదినీపూర్ (273), పశ్చిమ మేదినీపూర్ (272) జిల్లాల్లో భారీగా బలగాలను నియమించారు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద సాయుధులైన కేంద్ర బలగాలతో పాటు లాఠీలు ధరించిన రాష్ట్ర పోలీసు సిబ్బంది అప్రమత్తంగా కాపలా ఉండనున్నారు.ఇది కూడా చదవండి: లష్కరే టాప్ కమాండర్‌పై దాడి.. పరిస్థితి విషమం -
వింత ప్రచారాలు: జిలేబీలు వేస్తూ.. గడ్డాలు గీస్తూ..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. కేవలం రాజకీయ విమర్శలు, సవాళ్లతోనే కాకుండా, ఓటర్లను ఆకర్షించేందుకు అభ్యర్థులు అనుసరిస్తున్న వినూత్న వ్యూహాలు ఇప్పుడు బెంగాల్ వీధుల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరగనున్న పోలింగ్ కోసం ప్రధాన పార్టీలైన టీఎంసీ, బీజేపీ అభ్యర్థులు ఒకరిని మించి మరొకరు వింత విన్యాసాలతో ప్రజల ముందుకు వస్తున్నారు.బన్స్బేరియాలో ‘స్వీట్’ పాలిటిక్స్సప్తగ్రామ్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి స్వరాజ్ ఘోష్ తనదైన శైలిలో ప్రచార బరిలోకి దిగి అందరినీ ఆశ్చర్యపరిచారు. బన్స్బేరియాలో ప్రచారంలో ఉన్న ఆయన అకస్మాత్తుగా ఓ స్థానిక స్వీట్ షాపులోకి వెళ్లారు. అక్కడ హల్వాయి అవతారమెత్తి వేడి వేడి నూనెలో జిలేబీలు వేయడం, రసగుల్లాలను తయారు చేయడం మొదలుపెట్టారు. తనకు పన్నీరుతో స్వీట్లు చేయడం బాగా తెలుసని, ఫలితాలు వెలువడే మే 4వ తేదీన తాను గెలిచినా, ఓడినా తన ప్రత్యర్థులకు కూడా ఈ రసగుల్లాలు తినిపిస్తానని ఆయన ప్రకటించడం విశేషం.చేపతో చెక్ పెట్టిన బీజేపీ అభ్యర్థిమరోవైపు బిధాన్నగర్ బీజేపీ అభ్యర్థి శారద్వత్ ముఖోపాధ్యాయ్ ప్రచారం చర్చనీయాంశమైంది. బెంగాలీల ఆహారపు అలవాట్లపై బీజేపీ ఆంక్షలు విధిస్తుందన్న మమతా బెనర్జీ విమర్శలకు కౌంటర్‌గా, ఆయన ఏకంగా ఒక పెద్ద చేపను చేతితో పట్టుకుని ప్రచారం నిర్వహించారు. బీజేపీ అధికారంలోకి వచ్చినా బెంగాలీలు తమకు ఇష్టమైన చేపల కూరను ఆస్వాదించవచ్చని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు భరోసా ఇచ్చారు.గృహిణులతో కలిసి రొట్టెలు.. ఉట్టి కొట్టే వేడుకలుఅధికార టీఎంసీ అభ్యర్థులు కూడా ప్రజలతో మమేకం కావడంలో వెనకడుగు వేయడం లేదు. పుర్సురాయ్ టీఎంసీ అభ్యర్థి పార్థా హజారీ ఒక ఇంటికి వెళ్లి కట్టెల పొయ్యిపై గృహిణి చేస్తున్న రొట్టెలను స్వయంగా కాల్చారు. అలాగే, బీర్భూమ్ జిల్లాలో టీఎంసీ అభ్యర్థి నరేశ్ చంద్ర బౌరీ ఈద్ సందర్భంగా జరిగిన ‘హాండీ ఫోడ్’ (ఉట్టి కొట్టే) కార్యక్రమంలో పాల్గొన్నారు. కళ్లకు గంతలు కట్టుకుని ఆయన కుండను పగలగొట్టిన తీరు ఓటర్లను విశేషంగా ఆకట్టుకుంది.బార్బర్‌గా ఎమ్మెల్యే.. యాగంలో కమ్యూనిస్ట్ నేతప్రచార పర్వం పతాక స్థాయికి చేరడంతో అభ్యర్థులు తమ ఇమేజ్ను పక్కన పెట్టి సామాన్యుల్లో కలిసిపోతున్నారు. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనూప్ కుమార్ సాహా ఏకంగా ఓ గ్రామస్థుడికి గడ్డం గీసి సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. ఇక కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఎం) అభ్యర్థి మీనాక్షి ముఖర్జీ ఉత్తరపరాలో ఒక మతపరమైన కార్యక్రమంలో పాల్గొని తనదైన శైలిలో అక్కడున్నవారికి ఆకట్టుకున్నారు. మరోవైపు, సీనియర్ నేత సువేందు అధికారి ప్రచారం ముగిసిన తర్వాత ఒక సాధారణ ఓటరు ఇంట్లో మధ్యాహ్న భోజనం చేసి తన సామాన్య జీవితాన్ని చాటుకున్నారు. వంట చేయడం, గడ్డం గీయడం, మసాలా దినుసులు నూరడం, రైతుల పక్కన పొలంలో పనిచేయడం వంటి రోజువారీ పనులతో అభ్యర్థులు సరికొత్త ప్రచార పర్వాన్ని సృష్టించారు. ఓటర్ల మదిలో చెరగని ముద్ర వేసేందుకు సాగుతున్న ఈ 'వినూత్న యుద్ధం'లో చివరకు ఎవరిని విజయం వరిస్తుందో తెలియాలంటే మే 4వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇది కూడా చదవండి: ‘ఇంతకు తెగిస్తారా?’.. నిర్మలపై మమత ఫైర్ -
‘ఇంతకు తెగిస్తారా?’.. నిర్మలపై మమత ఫైర్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంగ్రామం అనూహ్య మలుపులు తిరుగుతూ మరింత వేడెక్కింది. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రాజకీయ పార్టీలు వేస్తున్న ఎత్తుగడలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సాక్షాత్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని (ఎంసీసీ) ఉల్లంఘించి, మహిళల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసేలా వ్యవహరిస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ఈసీఐ)డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది.ఓటర్లకు నిర్భయంగా లంచంతాజాగా బీజేపీ నేతలు పంపిణీ చేసిన ‘మాతృశక్తి గ్యారెంటీ కార్డుల’ చుట్టూనే ఇప్పుడు కొత్త రాజకీయ వివాదం నడుస్తోంది. ఈ కార్డుల ద్వారా మహిళా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ.3,000 జమ చేస్తామని బీజేపీ పరోక్షంగా హామీ ఇస్తోంది. ఎన్నికల సమయంలో ఇలాంటి ఆర్థిక ప్రయోజనాలను ప్రకటించడాన్ని మమతా బెనర్జీ తప్పుబట్టారు. ఇది ప్రజాస్వామ్య నిబంధనలను అపహాస్యం చేస్తూ, ఓటర్లకు బహిరంగంగా లంచం ఇవ్వడమేనని ఆమె మండిపడ్డారు. పోలింగ్‌కు ముందే ఆదరాబాదరాగా కొత్త ఖాతాలు ఎందుకు తెరుస్తున్నారని, ఇదంతా మహిళా ఓటర్లను ప్రలోభపెట్టే ఓటు బ్యాంకు జిమ్మిక్కు మాత్రమేనని ఆమె ఆరోపించారు.ఈసీ నిష్పాక్షికతపై దీదీ ప్రశ్నల వర్షంఈ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరును కూడా ముఖ్యమంత్రి తప్పుబట్టారు. ఈసీ కేవలం ప్రతిపక్షాలపై మాత్రమే ఉక్కుపాదం మోపుతోందని, అధికార బీజేపీ నేతలు నిబంధనలు ఉల్లంఘిస్తే ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని ఆమె ప్రశ్నించారు. అందరికీ చట్టం సమానమే అయినప్పుడు, బీజేపీ నేతలపై వచ్చిన ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ప్రధాని పదవిపై తనకు అపార గౌరవం ఉందని, అయితే ప్రజలను ఇలా బహిరంగంగా తప్పుదోవ పట్టిస్తుంటే తాను మౌనంగా ప్రేక్షకపాత్ర పోషించలేనని మమత అన్నారు. ఆర్థిక మంత్రిపై వెంటనే విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.ఉత్కంఠ రేపుతోన్న బెంగాల్ పోరురాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఒక కేంద్ర మంత్రిపై ఆరోపణలు చేయడంతో ఈ వివాదం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. అయితే తమవి కేవలం మహిళా సాధికారతకు సంబంధించిన పరిపాలనా పరమైన హామీలే తప్ప, ఎలాంటి ఎన్నికల ప్రలోభాలు కావని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సరికొత్త వివాదం ఓటర్ల మనోభావాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ రాజకీయ పోరులో అందరి దృష్టి ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయం మీదే నిలిచింది.ఇది కూడా చదవండి: టీవీకే vs ఆర్బీఐ: విజయ్ రుణ మాఫీ హామీకి బ్రేక్? -
టీవీకే vs ఆర్బీఐ: విజయ్ రుణ మాఫీ హామీకి బ్రేక్?
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేడిలో టీవీకే అధినేత, దళపతి విజయ్ ప్రకటించిన రైతుల రుణమాఫీ హామీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతుల పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామన్న ఆయన ప్రకటన అందరినీ ఎంతగానో ఆకర్షిస్తోంది. అయితే ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఈ బృహత్తర హామీని అమలు చేయడం ఎంతవరకు సాధ్యమనే దానిపై సహకార శాఖ అధికారులు, ఆర్థిక నిపుణులు తీవ్ర సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.సహకార బ్యాంకుల విలవిలవిజయ్ ప్రకటించిన వ్యవసాయ రుణాల మాఫీ హామీని నెరవేర్చడం అంత సులభం కాదని సహకార శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. సహకార బ్యాంకులు కేవలం తమ సొంత నిధులతో నడవవని, అవి ‘నాబార్డ్’ నుంచి రుణాలు తీసుకుని, ప్రజల డిపాజిట్లను ఉపయోగించి రైతులకు అప్పులు ఇస్తాయని వారు వివరిస్తున్నారు. రుణమాఫీ వల్ల కేవలం పేద రైతులకే కాకుండా సంపన్న రైతులకు కూడా లబ్ధి చేకూరుతుందని, తద్వారా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని వారు అంటున్నారు.బ్యాంకులపై పెనుభారంసాధారణంగా ఏ ప్రభుత్వమైనా రుణమాఫీ ప్రకటించిన వెంటనే సహకార సంఘాలకు ఆ మొత్తాన్ని ఏకమొత్తంగా చెల్లించదు. ఐదేళ్ల పాటు వాయిదాల పద్ధతిలో నిధులు విడుదల చేస్తుంది. దీనివల్ల సహకార సంస్థలు తీవ్ర ఆర్థిక అగాధంలో కూరుకుపోతాయి. ఒకపక్క ప్రభుత్వ పరిహారం కోసం ఎదురుచూస్తూనే, తాము తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించాల్సిన ఒత్తిడి వాటిపై పడుతుంది. ఈ జాప్యాల వల్ల రైతులకు కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకుల వద్ద తగిన నిధులు ఉండవని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి.ఆర్బీఐ కఠిన నిబంధనలుఈ సమస్యలను అరికట్టేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024లో తీసుకొచ్చిన కఠిన నిబంధనలు ఇప్పుడు కీలకంగా మారాయి. రుణమాఫీ పరిహారాన్ని ప్రభుత్వాలు వాయిదాల్లో కాకుండా 45 నుంచి 60 రోజుల్లోపు ఒకేసారి చెల్లించాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇప్పటికే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమిళనాడు లాంటి రాష్ట్రాలకు, రెండు నెలల వ్యవధిలో ఇంత భారీ మొత్తాన్ని సర్దుబాటు చేయడం దాదాపు అసాధ్యం. ఈ వాస్తవాన్ని గ్రహించిన మీదటనే అధికార డీఎంకే కూడా తమ ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీ హామీని చేర్చలేదని అధికారులు విశ్లేషిస్తున్నారు.ఇది కూడా చదవండి: ట్రంప్ దెబ్బ: బీబీసీలో భారీ లేఆఫ్స్ -
ఖరగ్‌పూర్: సెకనుకో మలుపు.. ఓటరు నాడి ఎటు?
ఖరగ్‌పూర్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల రణరంగంలో ఖరగ్‌పూర్ నియోజకవర్గం ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరిత పోరుకు వేదికగా మారింది. ఇది కేవలం ఒక స్థానిక అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే కాదు.. రాష్ట్ర స్థాయి రాజకీయాలకు, భవిష్యత్ పరిణామాలకు అద్దం పట్టే ఒక ‘మినీ ఇండియా’. దేశంలోనే అతిపెద్ద రైల్వే వర్క్‌షాప్, ఐఐటీ ఖరగ్‌పూర్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థతో పాటు, హిందీ మాట్లాడే వలసదారులు, బెంగాలీ స్థానికుల సమ్మేళనం ఈ ప్రాంతం సొంతం. ఈ పారిశ్రామిక నగరంలో ఓటర్లు ఏ ఒక్క రాజకీయ పార్టీకి శాశ్వతంగా ఎప్పుడూ పట్టం కట్టలేదు. 2026 ఎన్నికల నగారా మోగినది మొదలు ఖరగ్‌పూర్ రాజకీయాలు తారాస్థాయికి చేరాయి.క్షణక్షణానికీ మారుతున్న రాజకీయాలుఖరగ్పూర్ నియోజకవర్గంలోని ఓటర్ల నాడిని పసిగట్టడం ఏ రాజకీయ విశ్లేషకుడికైనా పెద్ద సవాలే. 2006 నుంచి 2011 వరకు కాంగ్రెస్ అభ్యర్థి జ్ఞాన్ సింగ్ సోహన్‌పాల్ భారీ మెజారిటీలతో ఇక్కడ గెలుపొంది.. దీనిని కాంగ్రెస్ కంచుకోటగా మార్చారు. 2011లో రాష్ట్రమంతటా వీచిన తృణమూల్ (టీఎంసీ)గాలిని సైతం ఎదుర్కొని ఆయన విజయం సాధించారు. కానీ 2016 ఎన్నికలు ఖరగ్‌పూర్ చరిత్రలో ఒక చారిత్రాత్మక మలుపును లిఖించాయి. బీజేపీ అభ్యర్థి దిలీప్ ఘోష్ సంచలన విజయం సాధించి, బెంగాల్లో కమల వికాసానికి బలమైన పునాది వేశారు. ఆ తర్వాత దిలీప్ ఘోష్ ఎంపీగా వెళ్లడంతో, 2019లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి ప్రదీప్ సర్కార్ గెలుపొందారు. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సీటు ‘స్వింగ్ సీటు’గా మారింది. హోరాహోరీగా జరిగిన ఆ పోరులో బీజేపీ అభ్యర్థి హిరన్ ఛటర్జీ కేవలం 3,771 ఓట్ల స్వల్ప తేడాతో టీఎంసీని చిత్తు చేశారు. ఇక్కడ ప్రతి ఒక్క ఓటూ ఎంత కీలకమో ఈ చరిత్ర స్పష్టం చేస్తోంది.‘టైగర్ కబ్’ దిలీప్ ఘోష్ దూకుడు2026 మహా సంగ్రామంలో బీజేపీ ఫైర్‌బ్రాండ్ నేత దిలీప్ ఘోష్ మరోసారి బరిలోకి దిగడంతో ఎన్నికల వేడి అమాంతం పెరిగింది. ‘బాఘేర్ బచ్చా’ (టైగర్ కబ్ - పులి బిడ్డ) అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే దిలీప్ ఘోష్.. తనదైన దూకుడు, ముక్కుసూటితనంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. 35 ఏళ్ల వామపక్షాల పాలన, 15 ఏళ్ల టీఎంసీ పాలనను ప్రశ్నిస్తూ, మార్పు తథ్యమని ఆయన గర్జిస్తున్నారు. మతపరమైన రాజకీయాలు చేస్తున్నారన్న ఆరోపణలను తిప్పికొడుతూ, తాము ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ సిద్ధాంతాన్ని నమ్ముతామని స్పష్టం చేశారు. టీఎంసీ హయాంలో రాష్ట్రంలో భయానక వాతావరణం నెలకొందని ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపిస్తున్నారు. ‘ఈసారి మా ప్రత్యర్థికి లక్షకు మించి ఓట్లు రానివ్వను’ అంటూ ఆయన విసురుతున్న సవాళ్లు నియోజకవర్గంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.దీటుగా బదులిస్తున్న ‘మట్టి బిడ్డ’బీజేపీ దూకుడుకు ఏమాత్రం తగ్గకుండా, అధికార టీఎంసీ అభ్యర్థి ప్రదీప్ సర్కార్ తనదైన శైలిలో పదునైన వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. 2019లో ఒకసారి ఇక్కడినుంచి గెలిచిన అనుభవంతో, తాను ఖరగ్‌పూర్ ‘మట్టి బిడ్డ’నని, ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉంటానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో కుట్ర జరిగిందని ఆయన బీజేపీపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ముస్లిం ఓట్లను చీల్చేందుకే హుమాయున్ కబీర్‌ను బీజేపీ బరిలోకి దించిందని విమర్శించారు. అంతేకాకుండా, రైల్వేలు, సీఆర్పీఎఫ్ (సీఆర్పీఎఫ్), ఐఐటీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను బీజేపీ తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటోందని ఆరోపించారు. రైల్వే ఉద్యోగాలు, స్థానిక మౌలిక సదుపాయాలు, వలసదారుల సమస్యలు ప్రధాన అస్త్రాలుగా సాగుతున్న ఈ పోరులో ప్రజల విశ్వాసాన్ని ఎవరు చూరగొంటారో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: విజయ్ ర్యాలీలో ఉద్రిక్తత: స్పృహ కోల్పోయిన టీవీకే అభ్యర్థి -
దమ్ముంటే రోజూ నా కారు తనిఖీ చేయండి
ఇస్లాంపూర్: పశ్చిమబెంగాల్లో ఎన్నికల ప్రచారం వేళ తృణమూల్ కాంగ్రెస్ నేతలను మాత్రమే ఎన్నికల సంఘం అధికారులు లక్ష్యంగా చేసుకున్నారని టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఆరోపించారు. బుధవారం ఉత్తర్ దినాజ్‌పూర్ జిల్లాలోని ఇస్లాంపూర్‌లో ప్రచారసభలో ఆమె ప్రసంగించారు. ‘‘కోల్‌కతాలోని డమ్‌డమ్ ఎయిర్పోర్ట్ సమీపంలో నా కారును తనిఖీచేసేందుకు కేంద్రబలగాలు దుస్సాహసం చేశాయి. మా టీఎంసీ నేతలందరి వాహనాల్లో సోదాలు చేస్తున్నప్పుడు ప్రధాని మోదీ, హోం మంత్రి, ఇతర బీజేపీ అగ్రనేతల వాహనాలను ఎందుకు వదిలేస్తున్నట్లు?. కేంద్రబలగాలకు అంత దమ్ముంటే నా వాహనాన్ని రోజూ తనిఖీచేయండి. ఇదే విషయం ఇవాళ వాళ్లకు చెప్పా. భయంతో వాళ్లు పారిపోయారు’’ అని మమత అన్నారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కారును సైతం తనిఖీచేశారని టీఎంసీ బుధవారం తెలిపింది. ఈసారి ఎలాగైనా బెంగాల్లో టీఎంసీని అన్యాయంగా ఓడించి తాము గద్దెనెక్కాలని బీజేపీ శతథా ప్రయత్నిస్తోందని టీఎంసీ ఆరోపించింది. -
తమిళ పార్టీలకు చిక్కని ఓటరు నాడి
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలు మిగతా దేశానికి పూర్తి భిన్నంగా ఉంటాయి. ద్రవిడవాదం తమిళ ప్రజల గుండెల్లో పాతు కుపోయింది. ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే), ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకే) ఆ నినాదం దన్నుతోనే ఒకరి తర్వాత మరొకరు అధికారంలోకి వస్తున్నారు. దివంగత సీఎంలు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత బాటలోనే ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ ఎం.కె.స్టాలిన్ కూడా ద్రవిడ సిద్ధాంతమే ప్రధానాస్త్రంగా అధికారాన్ని నిలుపుకునేందుకు సర్వ శక్తులూ ఒడ్డుతున్నారు.స్టాలిన్ మహా మెగా కూటమిజయలలిత మాదిరిగా వరుసగా తమిళనాట రెండోసారి విజయం సాధించిన ముఖ్యమంత్రిగా స్టాలిన్ నిలుస్తారా అన్నది ఈసారి ఆసక్తికరమైన అంశంగా మారింది. ఎన్నికలను ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాంగ్రెస్, డీఎండీకే, సీపీఎం, సీపీఐ, వీసీకే, ఐయూఎంఎల్ వంటి 21 పార్టీలతో మహా మెగా కూటమికి తెర తీశారు. స్టాలిన్‌తో పాటు డిప్యూటీ సీఎం ఉదయనిధి తదితరులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ద్రావిడ మోడల్ 2.0 పాలన నినాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహిణులకు రూ.1,000 ప్రోత్సాహం వంటి పథకాలను విజయవంతంగా కొనసాగిస్తున్న వైనాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఈసారి గెలిపిస్తే రూ.8,000 విలువైన కూపన్లు తదితర హామీలతో మహిళా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో పడ్డారు. అయితే అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కంటే కొత్తగా బరిలో దిగిన సినీ నటుడు జోసెఫ్ విజయ్ డీఎంకేకు గుబులు పుట్టిస్తున్నారు. ఆయన ఎవరి ఓటు బ్యాంకుకు గండి కొడతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రజలను ఆకట్టుకోవడానికి అందివచ్చిన ఏ అవకాశాన్నీ స్టాలిన్ వదులుకోవడం లేదు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణను అందివచ్చిన అస్త్రంగా వాడుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. లోక్‌సభ స్థానాల పెంపులో తమిళనాడుకు బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేయనుందంటూ ఇప్పటికే ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై కేంద్రంతో ఢీ అంటే ఢీ అనడం ద్వారా ప్రధాని మోదీని ఎదుర్కొంటున్న నేతగా నిలిచే ప్రయత్నంలో పడ్డారు. మైనారిటీ ఓట్లు కూడ ఎంతో కొంత గట్టెక్కిస్తాయని డీఎంకే నమ్ముతోంది.అన్నా కూటమి ఆపసోపాలుఅన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేకతపైనే ఆశలన్నీ పెట్టుకుంది. బీజేపీతో పాటు అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం, అన్బుమణి రాందాసు నేతృత్వంలోని పీఎంకే, జికే వాసన్ సారథ్యంలోని తమిళ మానిల కాంగ్రెస్ తదితర పార్టీలను కలుపుకుని పోరాడుతోంది. డీఎంకే కుటుంబ రాజకీయాలు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, రాష్ట్రంలో పేట్రేగుతున్న హింస తదితరాలను అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి పళనిస్వామి ప్రధాన ప్రచారాస్త్రా లుగా మలచుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు తమిళనాడులో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. డీఎంకే మాదిరిగానే అన్నాడీఎంకేకు కూడా విజయ్ పార్టీ గుబులు పట్టుకుంది. ఆయన పార్టీ అంతిమంగా ఎవరి ఓట్లు చీలుస్తోందన్నది ఆసక్తికరంగా మారింది. ఒంటరిగానే బరిలో ఉన్న మరో సినీ నటుడు, దర్శకుడు సీమాన్ నేతృత్వంలో నామ్ తమిళర్ కట్చి కూడా ప్రధాన కూటముల ఓట్లను చీల్చేలా కన్పిస్తోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీ 8 శాతానికి పైగా ఓట్లు సాధించింది. ఈసారి ఏకంగా 116 మంది మహిళలకు, ఒక ట్రాన్స్‌జెండర్‌కు కూడా టికెటిచ్చింది! వీరికి తోడు జయలలిత నెచ్చెలి శశికళ పార్టీ కూడా పలు నియోజకవర్గాల్లో బరిలో ఉంది!ఓటరు నాడి ఎటో..!ఈసారి తమిళ ఓటరు నాడి ఎవరికీ అందడం లేదు! ఇప్పటిదాకా జరిగిన సర్వేలు కూడా ఈ విషయంలో ఎటూ తేల్చిచెప్పలేకపో యాయి. కాకపోతే విజయ్ పార్టీ టీవీకే కనీసం 15 నుంచి 30 స్థానాల దాకా గెలుచుకోవచ్చని పలు సర్వేల్లో తేలింది. అయితే టీవీకే ప్రధాన కూటముల్లో దేని ఓటు బ్యాంకుకు గండి కొట్టవచ్చన్నది ఎవరికీ అంతుపట్టడం లేదు.మూడో శక్తిగా విజయ్తొలిసారి ఎన్నికల బరిలోకి దిగుతున్న నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్రి కళగం (టీవీకే) రాష్ట్రంలో మూడో శక్తిగా అవతరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజల్లో, ముఖ్యంగా యువతలో విజయ్‌కి ఉన్న ఆదరణనే టీవీకే నమ్ముకుంది. ఆ ఆదరణ ఏ మేరకు ఓట్ల రూపంలో ప్రతిఫలిస్తుందన్నది ప్రశ్నగా మారింది. దీనికి తోడు విజయ్‌ని మినహాయిస్తే పార్టీలో పెద్దగా ప్రజాదరణ ఉన్న నేతలంటూ ఎవరూ లేకపోవడం ప్రతికూలాంశంగా కనిపిస్తోంది. టీవీకేతో ఎలాగైనా పొత్తు పెట్టుకోవాలని బీజేపీ ఎంతగా ప్రయత్నించినా చివరికి ఆ పార్టీ అన్ని స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకోలేక పోయినా భవిష్యత్తులో రాష్ట్రంలో ప్రధాన శక్తిగా ఎదగాలన్న భావన టీవీకేలో కనిపిస్తోంది. పార్టీలో జోష్ నింపేందుకు విజయ్ రెండుచోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. యువత, మహిళల్లో డీఎంకే, అన్నాడీఎంకే ఓటు బ్యాంకుకు ఈసారి టీవీకే భారీగా గండి కొట్టవచ్చన్న విశ్లేషణలున్నాయి. -
దక్షిణ రాష్ట్రాలకు ఇదేనా ప్రతిఫలం?
చెన్నై: మోదీ సర్కారు తలపెట్టిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మరోసారి ఫైర్ అయ్యారు. డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నల్లజెండాలు ఎగురవేయాలని తమిళనాడు ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించబోమని మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. బుధవారం ఈ మేరకు ఎక్స్‌లో వీడియో సందేశం విడుదల చేశారు."నల్ల జెండాలు ఎగరనివ్వండి! భారతదేశ ప్రగతికి దోహదపడినందుకు మాకు శిక్ష విధిస్తారా? తమిళనాడు, దక్షిణ రాష్ట్రాలకు ఇదేనా ప్రతిఫలం? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రేపు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని యోచిస్తున్న డీలిమిటేషన్ సవరణ బిల్లు.. తమిళనాడు, దక్షిణ రాష్ట్రాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక భారీ చారిత్రక అన్యాయం. డీలిమిటేషన్‌కు నిరసనగా రేపు తమిళనాడు వ్యాప్తంగా ఇళ్లపైనా, బహిరంగ ప్రదేశాల్లోనూ నల్ల జెండాలు ఎగురుతాయి. తమిళనాడు గళాన్ని గౌరవించి వెనక్కి తగ్గడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తే, తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. డీఎంకే అధ్యక్షుడిగా, అన్నింటికంటే ముఖ్యంగా ఆత్మగౌరవం గల తమిళుడిగా ఇది నా హెచ్చరిక'' అని స్టాలిన్ తన సందేశంలో పేర్కొన్నారు.ఎంపీలతో అత్యవసర భేటీనియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ బిల్లు పార్లమెంట్లో చర్చకు రానున్న నేపథ్యంలో డీఎంకే ఎంపీలతో స్టాలిన్ ఈ రోజు ఉదయం అత్యవసర భేటీ నిర్వహించారు. పార్లమెంట్ సమావేశాల్లో తమ పార్టీ అనుసరించాల్సిన వ్యూహాల గురించి ఎంపీలతో ఆయన చర్చించారు. కాగా, గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. స్టాలిన్‌కు ఓటమి భయం: అన్నామలైస్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు అన్నామలై స్పందించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో స్టాలిన్ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. డీలిమిటేషన్ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వివాదం చేస్తున్నారని ఆరోపించారు. కోయంబత్తూరులో అన్నామలై మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ వీలైనంత త్వరగా అమలు చేయాలని తమిళనాడు మహిళలు కోరుకుంటున్నారని చెప్పారు. తమిళనాడులో ఈసారి భారీ మెజారిటీతో ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, డీఎంకే ప్రభుత్వం పోవాలని భావిస్తున్నారని చెప్పారు. భారీ మెజారిటీతో ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. உயரட்டும் கருப்புக்கொடி!தமிழ்நாடு போராடும்! தமிழ்நாடு வெல்லும்!இந்தியாவின் வளர்ச்சிக்காகப் பாடுபட்ட குற்றத்துக்காக தமிழ்நாடு உள்ளிட்ட தென்மாநிலங்களுக்குத் தண்டனையா? ஒன்றிய பா.ஜ.க. அரசு நாளை நாடாளுமன்றத்தில் கொண்டுவரவுள்ள #Delimitation சட்டத்திருத்தம் தமிழ்நாட்டுக்கும்,… pic.twitter.com/6gbEAHvNn4— M.K.Stalin - தமிழ்நாட்டை தலைகுனிய விடமாட்டேன் (@mkstalin) April 15, 2026 చదవండి: గెలిస్తే ఏఐ యూనివర్సిటీ, మంత్రిత్వ శాఖ -
విజయ్ ర్యాలీలో ఉద్రిక్తత: స్పృహ కోల్పోయిన టీవీకే అభ్యర్థి
తిరుప్పూర్: టీవీకే అధినేత దళపతి విజయ్ ఎన్నికల ప్రచారంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఎండల తీవ్రత, కిక్కిరిసిన జనసందోహం మధ్య గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. తమిళనాడులోని తిరుప్పూర్‌కు వచ్చిన తమ అభిమాన నాయకుడిని చూడాలని ఆశగా ఎదురుచూసిన అభిమానులు, పార్టీ శ్రేణులు భానుడి భగభగలకు విలవిలలాడారు. ఎండ దెబ్బకు తట్టుకోలేక ఏడుగురు మహిళలు, ఒక ఎమ్మెల్యే అభ్యర్థి స్పృహతప్పి పడిపోయారు.ఎండకు అల్లాడిన జనంతమిళనాడు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ విజయ్ చెన్నై నుంచి కోయంబత్తూర్ మీదుగా తిరుప్పూర్ బయలుదేరారు. విజయ్ను చూసేందుకు వేలాదిగా ప్రజలు తరలివచ్చారు. ఎండ తీవ్రత విపరీతంగా పెరగడం, మరోవైపు జనసందోహం అదుపు తప్పడంతో అక్కడివారికి ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారింది. దాహంతో అలమటిస్తున్న జనాలకు నిర్వాహకులు నీరు అందించినప్పటికీ, వడగాల్పుల తీవ్రతకు ఏడుగురు మహిళలు స్పృహ కోల్పోయారు. వారిని వెంటనే అంబులెన్స్‌లో స్థానిక ఆసుపత్రికి తరలించారు.స్పృహ కోల్పోయిన సులూరు అభ్యర్థి సుకుమార్ పార్టీ ముఖ్య నేతలకు కూడా ఈ ఎండల సెగ తప్పలేదు. కోయంబత్తూరులోని సులూరు నియోజకవర్గ టీవీకే అభ్యర్థి సుకుమార్, కనియూర్ టోల్ ప్లాజా వద్ద విజయ్‌కు స్వాగతం పలికేందుకు తన మద్దతుదారులతో కలిసి వేచి ఉన్నారు. విపరీతమైన ఎండ కారణంగా ఆయన అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన అనుచరులు ఆయనకు ప్రథమ చికిత్స అందించి కోలుకునేలా చేశారు.తిరుప్పూర్‌లో విజయ్ సుడిగాలి పర్యటనఈ పరిస్థితుల నడుమ, కొచ్చిన్-సేలం జాతీయ రహదారి మీదుగా విజయ్ తన ప్రచార రథంపై తిరుప్పూర్ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో (తిరుప్పూర్ నార్త్, తిరుప్పూర్ సౌత్, అవినాషి, పల్లడం, కంగేయం, ధారాపురం, ఉడుమలై, మడతుకులం) పోటీ చేస్తున్న టీవీకే అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే ఒకే రోజు ఇంత మంది వడదెబ్బకు గురవడం పలు ఆందోళనలకు తావిస్తోంది. -
Kerala: హైకమాండ్ వార్నింగ్.. ఆగని ‘సీఎం’ ఫైట్!
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ఇంకా మూడు వారాల సమయం ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీలో అప్పుడే రాజకీయ సెగలు మొదలయ్యాయి. మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాతో పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం ‘కుర్చీలాట’ షురూ అయ్యింది. అధిష్టానం కఠిన హెచ్చరికలు జారీ చేసినా, సోషల్ మీడియా వేదికగా కొందరు నేతలు తమ వర్గానికే పట్టం కట్టాలని డిమాండ్ చేస్తుండటంతో కేరళ రాజకీయాలు మరింతగా వేడెక్కాయి.వివాదాలకు కేంద్ర బిందువుడీసీసీ అధ్యక్షుడు మహమ్మద్ షియాస్ ఇటీవల మాట్లాడుతూ తదుపరి ముఖ్యమంత్రి ఎర్నాకులం నుండి ఉండాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో ఈ చర్చ ఊపందుకుంది. దానికి తోడు ఎమ్మెల్యే కాని వ్యక్తి కూడా ముఖ్యమంత్రి కావచ్చా? అనే ప్రశ్నకు కేపీసీసీ అధ్యక్షుడు ఇచ్చిన సమాధానం అంచనాలను అమాంతం పెంచేసింది. సీనియర్ నాయకులు వీడీ సతీశన్, రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్ ఈ విషయంపై నేరుగా స్పందించకుండా పార్టీ విధానమే శిరోధార్యమని సమాధానాన్ని దాటవేస్తున్నారు. గతంలో కరుణాకరన్, ఆంటోనీ, ఊమెన్ చాందీ వంటి నాయకుల కాలంలో ఉన్న స్పష్టత ఇప్పుడు లోపించింది. అయినప్పటికీ, తుది నిర్ణయం తీసుకునే ముందు అధిష్టానం ఖచ్చితంగా ఎమ్మెల్యేలతో చర్చిస్తుందని భావిస్తున్నారు.రేసులో ఉన్న ప్రధాన అభ్యర్థులుముఖ్యమంత్రి రేసులో ప్రధానంగా రెండు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో మొదటిది వీడీ సతీశన్. ఒకవేళ యూడీఎఫ్ అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని ప్రకటించిన సతీశన్, కాంగ్రెస్ గెలిస్తే సీఎం పీఠానికి ప్రాధాన్యత కలిగిన అభ్యర్థిగా కనిపిస్తున్నారు. భారీ మెజారిటీ వస్తే అది ఆయన నాయకత్వ విజయంగానే పరిగణిస్తారు. ఇక రెండో అభ్యర్థి మాజీ ప్రతిపక్ష నేత రమేష్ చెన్నితల. పార్టీలో ఆయనకున్న సుదీర్ఘ అనుభవం అతిపెద్ద బలం. ఒకవేళ స్వల్ప మెజారిటీ మాత్రమే వస్తే, అందరినీ కలుపుకుపోయే ఆయన విధానం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.ఢిల్లీ నుంచి అనూహ్య ఎంట్రీ?ఈ ఇద్దరితో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పేరు కూడా తెరపైకి రావడం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. జాతీయ స్థాయిలో సంస్థాగత మార్పులు జరిగే అవకాశం ఉన్నందున, హైకమాండ్ ఆయనను రాష్ట్ర రాజకీయాలకు పంపే యోచనలో ఉన్నట్లు సమాచారం. కాంగ్రెస్, సీపీఎం పార్టీలలో ఎమ్మెల్యేలు కాని వారిని కూడా ముఖ్యమంత్రులుగా చేసిన చరిత్ర ఉండటంతో ఆయన అవకాశాలను కొట్టిపారేయలేమని విశ్లేషకులు అంటున్నారు. ఈ ముగ్గురిలో కేరళ కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి దక్కుతాయో తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.ఇది కూడా చదవండి: బెంగాల్ రణరంగం: జెన్ జెడ్ చేతిలో ‘బ్రహ్మాస్త్రం’ -
బెంగాల్ రణరంగం: జెన్ జెడ్ చేతిలో ‘బ్రహ్మాస్త్రం’
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రణరంగం(2026) మునుపెన్నడూ లేనంత రసవత్తరంగా మారింది. ఇది రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న పోరు మాత్రమే కాదు.. యువత భవిష్యత్ ఆలోచనల మధ్య సాగుతున్న మహా సంగ్రామం. ఈ చరిత్రక ఎన్నికల్లో గెలుపోటములను శాసించే బ్రహ్మాస్త్రం ఇప్పుడు ‘జెన్ జెడ్’ చేతుల్లోనే ఉంది. మొదటిసారి ఓటు వేస్తున్న లక్షలాది మంది యువత.. కుల, మత, వారసత్వ రాజకీయాలకు అతీతంగా, తమ భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ, పశ్చిమ బెంగాల్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేందుకు సిద్ధమయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మళ్లీ అధికారంలోకి రావాలా లేదా బీజేపీ నేతృత్వంలోని ‘పరివర్తన్ 2.0’కు పట్టం కట్టాలా అనేది ఇప్పుడు ఈ తరం యువత చేతుల్లోనే ఉందంటున్నారు విశ్లేషకులు.సంక్షేమ పథకాలే టీఎంసీకి శ్రీరామరక్షతృణమూల్ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలని కోరుకునే యువత, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థినులు ‘కన్యాశ్రీ’, ‘సబుజ్ సాథి’ వంటి సంక్షేమ పథకాలపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. ఈ పథకాలు కేవలం కాగితాలకే పరిమితం కాలేదు. వారి విద్యాభ్యాసానికి, ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడి వారి జీవితాల్లో ప్రత్యక్ష ప్రభావాన్ని చూపాయి. అలాగే, బెంగాలీ సంస్కృతి, అస్తిత్వాన్ని కాపాడే నాయకత్వంపై కొంతమంది యువతకు మక్కువ ఎక్కువ. దీదీ పాలనను కొనసాగిస్తే తమకు అందుతున్న ప్రయోజనాలకు ఎలాంటి ఆటంకం ఉండదన్నది వారి భావన. అయితే 2011లో వచ్చిన రాజకీయ మార్పును కేవలం సుదూర చరిత్రగా మాత్రమే చూస్తున్న నేటి ‘జెన్ జెడ్’ ఓటర్లు.. పాత రాజకీయ కథనాలను గుడ్డిగా నమ్మడం లేదు. డిజిటల్ ప్రపంచంలో పుట్టి పెరిగిన వీరు సోషల్ మీడియా ప్రభావంతో, రాజకీయ నాయకులు ఇచ్చే ప్రతి హామీని నిశితంగా పరిశీలిస్తూ, ఫ్యాక్ట్ చెక్ చేస్తున్నారు.‘డబుల్ ఇంజిన్’ సర్కార్‌తోనే..పట్టణ ప్రాంతాల్లోని విద్యావంతులైన యువతలో మాత్రం పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అధికార పార్టీ పాలనపై వారిలో క్రమంగా అసంతృప్తి రగులుతోంది. రాష్ట్రంలో భారీ స్థాయి ప్రైవేట్ పెట్టుబడులు లేకపోవడం, ఉపాధి అవకాశాలు మృగ్యం కావడంతో.. బెంగాల్ యువత ఉద్యోగాల కోసం బెంగళూరు, పూణే, హైదరాబాద్ వంటి నగరాలకు వలస వెళ్లాల్సి వస్తోంది. దీనికి తోడు ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రాసెస్‌లో వెలుగుచూసిన అవినీతి ఆరోపణలు నైపుణ్యాన్ని నమ్ముకున్న యువతలో తీవ్ర నైరాశ్యాన్ని నింపాయి. సరిగ్గా ఈ అసంతృప్తినే తమకు అనుకూలంగా మార్చుకోవాలని బీజేపీ చూస్తోంది. పారదర్శకత, అవినీతి రహిత పాలన, కేంద్రంతో కలిసి పనిచేసే ‘డబుల్ ఇంజిన్’ సర్కార్‌తోనే బెంగాల్ అభివృద్ధి సాధ్యమంటూ 'పరివర్తన్ 2.0' నినాదంతో యువతను ఆకర్షించేందుకు వ్యూహరచన చేస్తోంది.‘సీఈఓ’ లాంటి లీడర్ కావాలినేటి యువత ఏ ఒక్క రాజకీయ పార్టీకీ కట్టుబడి ఉండలేదు. వారు పూర్తిగా సమస్యల ఆధారిత విధానాన్ని నమ్ముతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ తరంలో చాలా మంది తమకు రాజకీయాలంటే ఆసక్తి లేదని చెబుతున్నప్పటికీ, వారు అడిగే ప్రశ్నలు, డిమాండ్లు మాత్రం రాజకీయ వ్యవస్థను నిలదీసేలా ఉన్నాయి. వారికి ఉద్వేగభరితమైన మాటలు చెప్పే నాయకులు కాదు, ఒక బహుళజాతి కంపెనీని నడిపించే ‘సీఈఓ’ మాదిరిగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే సమర్థుడైన నాయకుడు కావాలి. ఉద్యోగాలు, మెరుగైన మౌలిక సదుపాయాలు, సాంకేతికతను యువత కోరుకుంటోంది. రాష్ట్రంలోని పట్టణ యువత ఓటింగ్ శాతమే విజేతను నిర్ణయించనున్నదని విశ్లేషకులు అంటున్నారు. ఈ నేపధ్యంలోనే డిజిటల్ క్యాంపెయిన్ల ద్వారా యువతను ప్రసన్నం చేసుకునేందుకు టీఎంసీ, బీజేపీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి.ఇది కూడా చదవండి: కొత్త జంటకు ప్రధాని మోదీ క్షమాపణ.. వైరల్ వీడియో -
ఎన్నికల వేళ బెంగాల్లో కొత్త ట్విస్ట్?
సాక్షి, న్యూఢిల్లీ: బెంగాల్ ఎన్నికల ప్రచారం హోరెత్తుతున్న వేళ సిలిగురి కారిడార్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానాంశంగా మారింది. దేశ భద్రత దృష్ట్యా దాన్ని కేంద్రపాలిత ప్రాంతం చేస్తారంటూ మొదలైన ప్రచారం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. దేశ సమాఖ్య స్వరూపాన్ని దెబ్బతీసేందుకు, రాష్ట్రాల హక్కులను కాలరాసేందుకే మోదీ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరుగుతున్నారు. ఈ అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా మలచుకుంటున్నారు.వ్యూహాత్మకంగా కీలకం భారత ప్రధాన భూభాగాన్ని తూర్పు, ఈశాన్య రాష్ట్రాలతో కలిపే అతి సన్నని మార్గం సిలిగురి కారిడార్. కేవలం 22 కిలోమీటర్ల వెడల్పుండే ఈ కారిడార్ భౌగోళికంగా చిన్నదైనా వ్యూహాత్మకంగా అత్యంత కీలకం. దేశానికే ‘లైఫ్ లైన్’వంటిది. దీనికి ఓ వైపున నేపాల్, మరోవైపు బంగ్లాదేశ్, ఇంకోవైపు భూటాన్, చైనా సరిహద్దు ప్రాంతాలున్నాయి. కోడి తల మాదిరిగా ఉండటంతో ఈ కారిడార్‌ను ‘చికెన్ నెక్’గా పిలుస్తారు. ఈశాన్య రాష్ట్రాలకు రోడ్డు, రైల్వే, సైనిక సరఫరా, వాణిజ్య రవాణా తదితరాలన్నీ ఈ మార్గంపైనే ఆధారపడి ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల వేళ ఈ మార్గం గనుక మూసుకుపోతే తూర్పు–ఈశాన్య ప్రాంతానికి మిగతా దేశంతో సంబంధాలే తెగిపోయే ప్రమాదముంది.తృణమూల్ మండిపాటు సరిహద్దు ప్రాంతాల పరిరక్షణ, భద్రతపై ఇటీవల పార్లమెంట్లో చర్చ సందర్భంగా సమయంలో సిలిగురిని కేంద్రపాలిత ప్రాంతం చేయవచ్చన్న వార్తలు తెరపైకొచ్చాయి. అలాగైతే ఉద్రిక్తతల వేళ ఆ ప్రాంత భద్రతపై కేంద్రానికి మెరుగైన నియంత్రణ ఉంటుందని, చైనాతో యుధ్ద పరిస్థితుల వంటివి తలెత్తితే త్వరిత నిర్ణయాలు, వ్యూహాత్మక కదలికలకు వీలుంటుందనే వాదన తెరపైకొచ్చింది. అలాంటి ప్రతిపాదనలేవీ లేవని కేంద్రం స్పష్టం చేసినా విపక్షాలు, ముఖ్యంగా తృణమూల్ మాత్రం దీన్ని రాజకీయ ఆయుధంగా మార్చుకుంది. స్థానికుల్లో తాము బెంగాల్ నుంచి వేరుపడుతున్నామన్న భావన వస్తుందని ఆ పార్టీ వాదిస్తోంది.‘‘ఇలా ఒక రాష్ట్రం నుంచి కొంత ప్రాంతాన్ని విడదీసి కేంద్రపాలిత ప్రాంతం చేయడం సమాఖ్య నిర్మాణానికి విరుద్ధం. ఇది కేవలం పాలనాపరమైన మార్పు కాదు, రాష్ట్ర హక్కులపై దెబ్బ’’అంటూ జోరుగా ప్రచారం చేస్తోంది. మమత సర్కారుపై ఒత్తిడి పెంచడం, బెంగాలీల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడం, భద్రతాపరమైన అంశాలను తెరపైకి తేవడం వంటి ఉద్దేశాలతో బీజేపీ తొలుత ఉద్దేశపూర్వకంగానే ‘కేంద్రపాలిత ప్రాంతం’అంశాన్ని ప్రచారంలో పెట్టిందనే విశ్లేషణలు విని్పస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఇలాంటి నిర్ణయమేదీ ఉండకపోయినా భద్రతాపరంగా పరిస్థితులు మారి ఉద్రిక్తతలు పెరిగితే ఈ దిశగా కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు అంటున్నారు.ఎన్నికలపై ప్రభావం..సిలిగురి కారిడార్‌పై రాజకీయ రచ్చ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయవచ్చని భావిస్తున్నారు. ఆ ప్రాంతంలో ఇదే అంశాన్ని తృణమూల్ ప్రచారాస్త్రంగా మార్చుకుంది. గౌతమ్ దేవ్ వంటి ఆ పార్టీ నేతలు ‘కేంద్రపాలిత ప్రాంతం’అంశాన్ని ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. పట్టణ, గ్రామీణ, తేయాకు కార్మికుల మిశ్రమంగా ఉండే సిలిగురి ప్రాంతంలో కనీసం 25 నుంచి 30 అసెంబ్లీ స్థానాల్లో ఈ ప్రచారం బాగా ప్రభావం చూపనుంది. దీనికి విరుగుడుగా స్థానిక సమస్యలు, ఉద్యోగాలు, వేతనాలు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలను బీజేపీ నమ్ముకుంది. వాటిపైనే ముమ్మరంగా ప్రచారం చేస్తూ స్థానికులను ఆకట్టుకునే పనిలో పడింది. సిలిగురి ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాల్లోని తేయాకు తోట కార్మికులు, గిరిజన వర్గాలు, రాజబన్షీలలో బీజేపీ ఇప్పటికే ప్రాబల్యాన్ని పెంచుకుంది. దాంతో ఇక్కడ తిరిగి పట్టు సాధించేందుకు తృణమూల్ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. -
కొత్త జంటకు ప్రధాని మోదీ క్షమాపణ.. వైరల్ వీడియో
సిలిగురి: దేశ ప్రధాని స్థాయి వ్యక్తి, ఒక సామాన్య కొత్త జంటకు స్వయంగా క్షమాపణలు చెప్పడం ఎప్పుడైనా చూశారా? పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో సరిగ్గా ఇదే జరిగింది. ఒక వైపు కట్టుదిట్టమైన భద్రత, మరోవైపు పెళ్లి సందడి.. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ఒక చిన్న పని ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.రిసార్ట్‌లో అనూహ్య ఘటనపశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సిలిగురిలోని మయ్‌ఫెయిర్ టీ రిసార్ట్‌కు చేరుకున్నారు. అదే సమయంలో అక్కడ శ్రేయ, అక్షయ్ అనే యువజంట వివాహ వేడుకలు జరుగుతున్నాయి. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాటు చేసిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల కారణంగా ఆ పెళ్లి సందడికి కొంత అంతరాయం ఏర్పడింది. ఈ విషయాన్ని గమనించిన మోదీ, ఊహించని విధంగా ఆ కొత్త జంట వద్దకు వెళ్లి, వారికి కలిగిన అసౌకర్యానికి స్వయంగా క్షమాపణలు తెలియజేశారు. A heartfelt moment from PM Shri @narendramodi ji in Siliguri.He personally apologised to newlyweds Shreya and Akshay, whose wedding celebrations at Mayfair Tea Resort were affected due to heightened security during his visit.𝐀 𝐬𝐦𝐚𝐥𝐥 𝐠𝐞𝐬𝐭𝐮𝐫𝐞, 𝐛𝐮𝐭 𝐢𝐭… pic.twitter.com/JjJGUE86ru— BJP (@BJP4India) April 13, 2026నెట్టింట వైరల్‌గా మారిన వీడియోదేశ అత్యున్నత నేత తమ వద్దకు వచ్చి క్షమాపణలు చెప్పడంతో ఆ జంటతో పాటు అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ తమ అధికారిక ‘ఎక్స్’ఖాతాలో పంచుకోగా, అది క్షణాల్లో వైరల్ అయింది. ఏప్రిల్ 23, 29 తేదీల్లో జరగనున్న రెండు దశల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ సిలిగురిలో పర్యటిస్తున్నారు. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు మే 4న జరగనుంది. 2021 ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాలతో ఘన విజయం సాధించగా, బీజేపీ 77 స్థానాలతో బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది. -
బీజేపీ మేనిఫెస్టోలో ఊహించని వరాలు.. ప్రత్యర్థులకు షాక్!
చెన్నై: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో విజయబావుటా ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్న భారతీయ జనతా పార్టీ ఓటర్లపై వరాల వర్షం కురిపించింది. చెన్నై వేదికగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మహిళలు, రైతులు, సామాన్యులే లక్ష్యంగా.. ప్రజా సంక్షేమం, మెరుగైన వైద్యం, ఆర్థిక స్థిరత్వమే మహా మంత్రంగా రూపొందించిన ఈ మేనిఫెస్టో ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది.మహిళలకే అగ్రపీఠంబీజేపీ తన మేనిఫెస్టోలో మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది. కుటుంబ యజమానురాళ్లకు ప్రతి నెలా రూ. 2,000 ఆర్థిక సాయం, ప్రతి ఇంటికి ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, అర్హులైన మహిళలకు ఈ-స్కూటర్ కొనుగోలుకు రూ. 25,000 సాయం ఇస్తామని ప్రకటించింది. ఇల్లు కొనుగోలు చేసే మహిళలకు స్టాంప్ డ్యూటీలో మూడు శాతం రాయితీ, ప్రతి కుటుంబానికి ఏకకాలంలో రూ. 10,000 ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. స్వయం సహాయక సంఘాలు, ఎంఎస్ఎంఈ లకు రూ. 50 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని తెలిపింది.జల్లికట్టుకు జైవిద్యార్థినులు, మహిళల భద్రత కోసం బస్సులు, పాఠశాలలు, విశ్వవిద్యాలయాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుతో పాటు జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. నేరాల సత్వర విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. ఇక తమిళుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన ‘జల్లికట్టు’కు పూర్తి మద్దతు ప్రకటిస్తూ.. ఎద్దులను పెంచే వారికి నెలకు రూ. 2,000 సాయం, ఒకవేళ ఆటలో పాల్గొనే వ్యక్తి మరణిస్తే రూ. 10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది.రైతులకు కేంద్ర సాయానికి అదనంగా మరో రూ. 3,000 (మొత్తం రూ. 9,000) ఇస్తామని తెలిపింది. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, కే అన్నామలై, తమిళసై సౌందరరాజన్ తదితరుల సమక్షంలో విడుదలైన ఈ మేనిఫెస్టో.. ఎన్నికల ప్రచారంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. 🔴LIVE | பாஜக தாமரை வாக்குறுதி 2026 | தமிழக சட்டமன்றத் தேர்தலுக்கான பாஜகவின் தேர்தல் அறிக்கை வெளியீட்டு விழா#தாமரை_வாக்குறுதி #TNBJPManifesto https://t.co/mHA6ezpAnk— BJP Tamilnadu (@BJP4TamilNadu) April 14, 2026 -
తమిళిసై మైలాపూర్ ‘మహారాణి’.. వేచి చూడాలి!
చెన్నై: ఆధ్యాత్మికతకు, చారిత్రక వారసత్వానికి చిరునామా అయిన మైలాపూర్ ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు అధికార డీఎంకే బలం, మరోవైపు మాజీ గవర్నర్, బీజేపీ ఫైర్ బ్రాండ్ తమిళిసై సౌందరరాజన్ దూకుడుతో ఈ ‘టెంపుల్ టౌన్’లో రాజకీయ సెగలు పుడుతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో గెలుపోటములను శాసించే అసలైన శక్తి మాత్రం మహిళా ఓటర్లే.‘లేడీ పవర్’ ఎవరి వైపు?మైలాపూర్‌లో పురుషుల కంటే మహిళలే అధికం అని గణాంకాలు చెబుతున్నాయి. మొత్తం 2,70,568 మంది ఓటర్లలో మహిళా ఓటర్లు 1,39,349, పురుష ఓటర్లు 1,31,179. ఈ నియోజకవర్గంలో మహిళా ఓటర్లు అధికంగా ఉండటం తమిళిసైకి అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారిందని విశ్లేషకులు అంటున్నారు. ఒక మహిళా నాయకురాలిగా, ఒక వైద్యురాలిగా, మాజీ గవర్నర్‌గా ఆమెకున్న క్లీన్ ఇమేజ్ మహిళా ఓటర్లను ఆకర్షిస్తోందని చెబుతున్నారు. ఇంటింటి ప్రచారంలో మహిళలతో ఆమె మమేకమవుతున్న తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.కమలం వికసిస్తుందా?గత చరిత్రను చూస్తే మైలాపూర్ ఏ పార్టీకీ శాశ్వత చిరునామా కాదు. 2016లో అన్నాడీఎంకేను ఆదరించిన ప్రజలు 2021లో డీఎంకే అభ్యర్థి ధా వేలుకు పట్టం కట్టారు. ప్రస్తుతం డీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే ధా.వేలుపై వ్యతిరేకత ఉందా? లేక పి.వెంకటరమణన్ (టీవీకే), ఆర్ఎల్ అరుణ్ అయ్యంగార్ (ఎన్టీకే)లు ఓట్లను చీల్చుతారా? అన్నది పక్కన పెడితే.. తమిళిసై మాత్రం ‘మహిళా శక్తి’ మీదనే తన ఆశలన్నీ పెట్టుకున్నారు. మహిళా ఓటర్లు కరుణిస్తే మైలాపూర్ గడ్డపై కమలం వికసించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.బహుముఖ పోరులో ఉత్కంఠతత్వవేత్త తిరువళ్లువర్ జన్మించిన ఈ పవిత్ర నేలపై తనదైన ముద్ర వేయాలని తమిళిసై గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే మైలాపూర్ మహిళా ఓటర్లు ఎవరికి పట్టం కడతారో? ఈ ‘టెంపుల్ టౌన్’ పోరులో చివరకు విజేతగా ఎవరు నిలుస్తారో వేచి చూడాలి. ఇది కూడా చదవండి: నోయిడాలో కార్మిక రణరంగం: ఎవరీ మేధా రూపమ్? -
దళపతి ‘మాయ’.. షాకిస్తున్న ‘హోలోగ్రామ్ విజయ్’
చెన్నై: తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటాయి. అయితే ఈసారి ఎన్నికల ప్రచారంలో దళపతి విజయ్ సరికొత్త ట్రెండ్ సృష్టించారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో స్వయంగా పర్యటించడం అసాధ్యం కావడంతో, ఆయన పార్టీ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) ఒక అద్భుతమైన ఐడియాతో ముందుకొచ్చింది. ఏఐ సాంకేతికతతో సృష్టించిన విజయ్ 3డీ హోలోగ్రామ్‌లు ఇప్పుడు వీధుల్లో అదరగొడుతున్నాయి. ప్రజలను ఈ హైటెక్ ప్రచారం ఎంతగానో ఆకర్షిస్తోంది.ప్రచార బరిలో ‘3డీ విజయ్’ హవాకుంభకోణం టీవీకే అభ్యర్థి వినోద్ రవి ఈ వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రచార రథంపై అభ్యర్థితో పాటు నిల్చున్న విజయ్ 3డీ హోలోగ్రామ్.. అచ్చం ఆయన లాగే కనిపిస్తూ, ఆయన గొంతుతోనే ప్రసంగిస్తోంది. ‘విజిల్ వేయడానికి సిద్ధమా? ఓటు మన హక్కు, దాన్ని ఎవరూ తీసుకోలేరు. మన ఓటు విజిల్ (టీవీకే గుర్తు)కే వేయాలి. మనం ఎవరి మాటలకూ మోసపోం’ అని హోలోగ్రామ్ విజయ్ చెబుతుంటే.. అభిమానులు, ఓటర్లు ఆశ్చర్యంతో చూస్తూ అక్కడే ఉండిపోతున్నారు. ఈ డిజిటల్ దళపతి భౌతికంగా ఆయన అక్కడే ఉన్నారన్న భ్రమను కల్పిస్తూ విశేషంగా ఆకట్టుకుంటోంది. TVK candidate in Kumbakonam uses a full hologram of Vijay…. pic.twitter.com/eWooTr2EKk— Vasudha Venugopal (@Vasudha156) April 13, 2026విద్యార్థి మేధస్సుకు ప్రతిరూపంమొత్తం 234 స్థానాల్లో పోటీ చేస్తున్న పార్టీ.. అన్ని చోట్లా విజయ్ సందేశాన్ని చేర్చాలనే ఉద్దేశంతో ఈ వ్యూహం అమలు చేసింది. తంజావూరు జిల్లా టీవీకే కోశాధికారి విజయ్ చంద్రన్ ఆలోచన మేరకు, ప్రవీణ్ అనే 20 ఏళ్ల ఏఐ, డేటా సైన్స్ విద్యార్థి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశాడు. కేవలం మూడు రోజుల్లోనే ఏఐ సాయంతో విజయ్ ప్రసంగాన్ని 50 సెకన్ల వీడియోగా మార్చి, దానిని హోలోగ్రామ్ ద్వారా ప్రదర్శించారు. ఈ ప్రయోగం ఆన్లైన్లో వైరల్ కావడంతో పాటు, క్షేత్రస్థాయిలో విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా దీనిని విస్తరించే పనిలో పార్టీ బిజీగా ఉంది.డూప్‌ల నుంచి డిజిటల్ దాకా..ఏప్రిల్ 23న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం టీవీకే శ్రేణులు చేయని ప్రయత్నం లేదు. హోలోగ్రామ్ల కంటే ముందు తిరువెరుంబూర్ అభ్యర్థి నావల్పట్టు విజి.. విజయ్ మైనపు బొమ్మను (మ్యాన్విన్) ప్రచారానికి వాడారు. అలాగే సీఎం స్టాలిన్‌పై పోటీ చేస్తున్న కొలత్తూరు అభ్యర్థి వీఎస్ బాబు సైతం, అచ్చం విజయ్‌లా ఉన్న డూప్లతో ప్రచారం చేయించారు. చెన్నై ఆఫీసులో వందల కొద్దీ విజయ్ బొమ్మలు ఉన్నాయన్న వార్తలు కూడా వచ్చాయి. ఇలా డూప్‌లు, బొమ్మలతో మొదలైన వారి ప్రచారం.. ఇప్పుడు ఏఐ, 3డీ హోలోగ్రామ్ల స్థాయికి చేరి, రాజకీయ ప్రచార రూపురేఖలనే మార్చేస్తోంది.ఇది కూడా చదవండి: నేడు అంబేద్కర్ జయంతి: ఏవి ఓపెన్? ఏవి క్లోజ్? -
బెంగాల్ ఎన్నికలు: అభిషేక్ బెనర్జీ సరికొత్త ప్రకంపనలు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రచారంలో కేంద్ర బిందువుగా మారిన యువ నేత, కీలక వ్యూహకర్త అభిషేక్ బెనర్జీ సరికొత్త రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. పదునైన విమర్శలు, ప్రతిపక్షాలపై సూటి ప్రశ్నలు, క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటనలతో ఆయన తన ప్రచార శైలికి మరింత పదునుపెట్టారు. ఒకవైపు ప్రతిపక్షాల వ్యూహాలను ఎండగడుతూనే, పార్టీ మూలాలను బలోపేతం చేసే దిశగా ఆయన వేస్తున్న అడుగులు బెంగాల్ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి.ఈసీ తీరుపై సంచలన ఆరోపణలువరుస ప్రజా సభలు, సమావేశాల్లో పాల్గొంటున్న అభిషేక్ బెనర్జీ.. ఎన్నికల నిర్వహణ, రాజ్యాంగ సంస్థల తటస్థతపై తీవ్రస్థాయిలో ప్రశ్నలు సంధించారు. ఎన్నికల సంఘం (ఈసీ) తీరు పక్షపాతంగా మారిందని, ఎన్నికల ప్రక్రియలో అందరికీ సమాన అవకాశాలు లేకుండా పోయాయని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. వ్యవస్థాగత లోపాలను ఎత్తిచూపుతూనే, టీఎంసీ శ్రేణుల్లో విశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలు, ఇతర సంస్థలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, 2021 అసెంబ్లీ ఎన్నికల కంటే ఈసారి తృణమూల్ కాంగ్రెస్ మరింత భారీ మెజారిటీతో విజయం సాధించి తీరుతుందని అభిషేక్ బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు.‘ప్రతిపక్షాలది అపవిత్ర కలయిక’రెజీనగర్‌లో జరిగిన ఓ భారీ బహిరంగ సభలో ప్రతిపక్షాలపై అభిషేక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ, ఏజేయూపీ, ఐఎస్ఎఫ్, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు కేవలం అవకాశవాదంతో ఏకమయ్యాయని, అదొక అపవిత్ర కలయిక అని ఆయన అభివర్ణించారు. వివిధ పార్టీలకు చెందిన కుళ్టిన మూలకాలను కలపడం వల్ల రాష్ట్రంలో కేవలం అస్థిరత మాత్రమే ఏర్పడుతుందని, ఆ కూటమికి ఎలాంటి సైద్ధాంతిక నిబద్ధత లేదని విమర్శించారు. ఇదే క్రమంలో, ఏజేయూపీ నేత హుమాయున్ కబీర్‌కు సంబంధించిన వివాదాస్పద వైరల్ వీడియో వ్యవహారాన్ని కూడా ప్రస్తావించారు. పలు పార్టీల సీనియర్ నేతలు, కేంద్ర సంస్థల ప్రమేయంతో భారీ స్థాయిలో రాజకీయ డీల్ జరిగినట్లు ఆ వీడియో స్పష్టం చేస్తోందని ఆరోపించి బెంగాల్ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించారు.క్షేత్రస్థాయి వ్యూహాలు.. భవిష్యత్ నాయకత్వంకేవలం మాటలకే పరిమితం కాకుండా, అభిషేక్ బెనర్జీ జిల్లాల స్థాయిలో విస్తృత పర్యటనలు చేస్తూ క్షేత్రస్థాయి కార్యకర్తలతో నేరుగా మమేకమవుతున్నారు. పౌరసత్వం తదితర కీలక అంశాలపై మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలో ‘జాతీయ పౌర పట్టిక’(ఎన్ఆర్సీ) అమలును బెంగాల్ ఎంత కఠినంగా వ్యతిరేకించిందో ఆయన ప్రజలకు గుర్తుచేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అత్యధిక సీట్లు గెలుస్తుందని పదేపదే చెప్పడం ద్వారా క్యాడర్లో నూతనోత్సాహాన్ని నింపుతున్నారు.‘దీదీ’ శిష్యరికంలో రాటుదేలి..పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీతో ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి ఉన్న బంధం కేవలం కుటుంబపరమైనది మాత్రమే కాదు. టీఎంసీలో తిరుగులేని అగ్ర నాయకురాలిగా మమతా బెనర్జీ కొనసాగుతుండగా, ఆమె మార్గదర్శకత్వంలో ఎదిగిన అభిషేక్ ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, ప్రధాన వ్యూహకర్తగా, అప్రకటిత ‘నెంబర్ 2’గా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యువతను ఏకం చేస్తూ, ఆధునిక సాంకేతిక ప్రచార వ్యూహాలతో సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేస్తున్నారు.ఇది కూడా చదవండి: బెంగాల్ బరిలో నలుగురు రిపోర్టర్లు -
బెంగాల్లో బాబ్రీ మసీదు కట్టనివ్వం
రాణిగంజ్: టీఎంసీ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ చీఫ్ హుమాయూన్ కబీర్ ఇద్దరూ ఒక్కటేనని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. బెంగాల్లో బీజేపీ గెలిస్తే హుమాయూన్ ప్రకటించినట్లుగా బాబ్రీ మసీదును నిర్మించనివ్వబోమని స్పష్టం చేశారు. సోమవారం ఆయన బీర్భూమ్, పశ్చిమ్ బర్దమాన్ జిల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. అప్పట్లో అయోధ్యలో రామాలయం నిర్మాణాన్ని మమతా బెనర్జీ వ్యతిరేకించగా.. ఆమె పార్టీ మాజీ నేత ఇప్పుడు అయోధ్యలో కూల్చిన బాబ్రీ మసీదును నిర్మించేందుకు చూస్తున్నారన్నారు. ‘550 ఏళ్లుగా టెంట్ కిందే ఉంటున్న రామ్ లల్లాను అలా ఉంచేందుకే కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే, ఎస్పీ, బీఎస్పీలు మద్దతు తెలిపాయి. తిరుగులేని మెజారిటీతో గెలిచిన మోదీ ప్రభుత్వం మాత్రమే అయోధ్యలో రామాలయాన్ని నిర్మించింది. మమతా బెనర్జీ మాదిరిగా ఆలోచించే హుమాయూన్ ఇప్పుడు బెంగాల్లో బాబ్రీ మసీదు కట్టాలనుకుంటున్నారు’అని అమిత్ షా వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బాబ్రీ మసీదు నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించదని స్పష్టం చేశారు. బాంబులు, బుల్లెట్లకు బెంగాల్ ప్రజలు ఓట్లతోనే సమాధానం చెబుతారన్నారు. టీఎంసీ ప్రభుత్వాన్ని సాగనంపండి, ఆ వెంటనే సిండికేట్ కట్‌మనీ ముఠాదార్లను, వారి మద్దతుదార్లను తలకిందులుగా వేలాడదీసి, తాము దారికి తెస్తామని హెచ్చరికలు చేశారు. టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి టాటాబైబై చెప్పి, బీజేపీకి అధికారమిచ్చేందుకు ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారన్నారు. బీజేపీ కార్యకర్తలను చిత్రహింసలు పెట్టేందుకు టీఎంసీ నేరగాళ్లకు ఆశ్రయం కల్పిస్తోందంటూ మండిపడిన అమిత్ షా..మే 5న ఓట్ల లెక్కింపు తర్వాత కాషాయ పార్టీ కార్యకర్తలు ఈ నేరగాళ్లను బయటకు లాగి, చట్టం ముందు నిలబెడతారని స్పష్టం చేశారు. అందుకే టీఎంసీ గూండాలు మొదటి దశ పోలింగ్ జరిగే 23న ఇళ్లలోనే ఉండిపోవాలని సలహా ఇచ్చారు. రాష్ట్రంలోని మెజారిటీ మతస్తులను మమతా బెనర్జీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటూ ఆయన.. ఈ ఎన్నికల్లో ప్రధాన అంశం చొరబాటుదార్లను వెళ్లగొట్టడమేనన్నారు. -
శిఖరాగ్రం నుంచి శిథిలావస్థకు
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు ప్రధానంగా అధికార తృణమూల్ కాంగ్రెస్, విపక్ష బీజేపీ మధ్యే కేంద్రీకృతమైంది. రాష్ట్రాన్ని 30 ఏళ్ల పాటు అప్రతిహతంగా పాలించిన కాంగ్రెస్ ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సిన దురవస్థకు చేరింది. 50 ఏళ్లుగా అధికారానికి దూరమైన కుర వృద్ద పార్టీ ఈసారి ఖాతా తెరిచేందుకే కిందా మీదా పడే పరిస్థితికి చేరుకుంది...! 1977 నుంచి మొదలైన పతనం స్వాతంత్య్రానంతరం నుంచి బెంగాల్‌ను కాంగ్రెస్ 1977 దాకా పాలించింది. బిదాన్ చంద్రరాయ్, ప్రఫుల్ల చంద్రసేన్, అజయ్ ముఖర్జీ, సిద్ధార్థ శంకర్ రే వంటి దిగ్గజ నేతలు ముఖ్యమంత్రులుగా చేశారు. 1977లో రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం మొదలైంది. ఆ ఏడాది జ్యోతిబసు నాయకత్వంలోని కమ్యూనిస్టులు రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్నారు. కాంగ్రెస్‌తో విభేదించి 1998లో మమతా బెనర్జీ సొంత కుంపటి పెట్టుకోవడంతో బెంగాల్లో పార్టీ పరిస్థితి మరింత కునారిల్లుతూ వచ్చింది. అప్పటినుంచీ క్రమంగా ప్రాధాన్యతను కోల్పోయింది. 2011లో బెంగాల్లో తృణమూల్ తొలిసారిగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ కాంగ్రెస్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. 2006 అసెంబ్లీ ఎన్నికల్లో 21 సీట్లు సాధించిన కాంగ్రెస్ 2011లో 42, 2016లో 44 సీట్లు నెగ్గింది. కానీ గత ఐదేళ్లలో బెంగాల్లో బీజేపీ పుంజుకోవడంతో కాంగ్రెస్ భారీగా నష్టపోయింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క స్థానం కూడా నెగ్గలేకపోయింది! ఓట్ల శాతంలోనూ సింగిల్ డిజిట్‌కు పరిమితమైంది. 2016లో కేవలం 3 అసెంబ్లీ స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ 2021లో ఏకంగా 77 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్ష హోదా చేజిక్కించుకుంది. కార్యాలయాల్లోనూ కన్పించని సందడి ప్రస్తుతం బెంగాల్‌వ్యాప్తంగా ప్రతి మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో తృణమూల్, బీజేపీ జెండాలతో ఎన్నికల కోలాహలం కనబడుతుంటే కాంగ్రెస్‌లో మాత్రం చడీచప్పుడే లేదు. చాలా జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను సైతం తెరిచే పరిస్థితి లేదు! పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో హస్తంజెండా పట్టుకునే కార్యకర్తే కరువైన పరిస్థితి! 2021 అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకొంటే అన్ని పార్టీలూ ‘సున్నా’చుట్టాయి. దాంతో కాంగ్రెస్ ఈసారి మొత్తం 294 అసెంబ్లీ స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తోంది. బెహ్రాంపూర్ నుండి అధిర్ రంజన్ చౌదరి, మాలతీపూర్ నుంచి మౌసమ్ నూర్, సుజాపూర్ నుంచి అబ్దుల్ హన్నన్ తదితరులు బరిలో ఉన్నారు.పతనానికి కారణాలెన్నో బెంగాల్లో కాంగ్రెస్ పతనానికి అనేక కారణాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార పార్టీలకు వ్యతిరేకంగా భారీ ఉద్యమాలు నడపడంలో మూడు దశాబ్దాలుగా పార్టీ విఫలమైంది. తొలుత లెఫ్ట్ ఫ్రంట్‌కు దన్నుగా ఉన్న మధ్య, ఉన్నత తరగతి ఓటర్లు ఆ తర్వాత టీఎంసీ వైపు మళ్లారు. బీజేపీ ఎదుగుదలతో గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు దాదాపుగా గండి పడింది. రాష్ట్రంలో 30 శాతమున్న ముస్లింలు పూర్తిగా తృణమూల్ వైపు వెళ్లారు. -
బెంగాల్ బరిలో నలుగురు రిపోర్టర్లు
కోల్‌కతా: ఎన్నికల సమయంలో మైకులు పట్టుకుని, నాయకుల వెంటపడే జర్నలిస్టులను మనం చూసేవుంటాం. అయితే ఇప్పుడు ఓటర్ల ముందు చేతులు కట్టుకుని నిలుచుని, ఓట్లు అడుగుతున్న జర్నలిస్టులు తారసపడుతున్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ వైనం కనిపిస్తోంది. దశాబ్దాల పాటు వార్తలు రాసి, ఎన్నికల విశ్లేషణలు చేసి, నాయకులకు ప్రశ్నలు వేసిన నలుగురు రిపోర్టర్లు ఇప్పుడు నేరుగా ఎన్నికల బరిలోకి దిగారు. న్యూస్ రూమ్ నుంచి నామినేషన్ సెంటర్ల వరకు వీరి ప్రయాణం పలు మలుపులు తిరిగింది. బెంగాల్ రాజకీయాల్లో ఇది హాట్ టాపిక్‌గా మారింది.ఖర్దహా నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తరపున జర్నలిస్ట్ దేవదీప్ పురోహిత్ బరిలో ఉన్నారు. స్థానికంగా తనకున్న పరిచయాలు, క్షేత్రస్థాయి అవగాహన తనను గెలిపిస్తాయని ఆయన నమ్ముతున్నారు. అయితే ఆయనకు ప్రత్యర్థులుగా కల్యాణ్ చక్రవర్తి (బీజేపీ), జాయ్‌దేబ్ ఘోష్ (కాంగ్రెస్), దేబ్జ్యోతి దాస్ (సీపీఐ-ఎం)గట్టి పోటీ ఇస్తున్నారు. సియురి (Siuri) నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా మరో జర్నలిస్ట్ జగన్నాథ్ ఛటోపాధ్యాయ్ పోటీ చేస్తున్నారు. ఒకప్పుడు నాయకుల ప్రసంగాలు కవర్ చేసిన ఆయన, ఇప్పుడు స్వయంగా ఇంటింటి ప్రచారంలో మునిగిపోయి ప్రజల మద్దతు కూడగడుతున్నారు.మరోవైపు మేమారి నియోజకవర్గం నుంచి 25 ఏళ్ల సుదీర్ఘ పాత్రికేయ అనుభవం ఉన్న మానబ్ గుహక్.. బీజేపీ టికెట్‌పై బరిలో నిలిచారు. ఆయనపై టీఎంసీకి చెందిన రాసబిహారి హల్దర్ పోటీలో ఉన్నారు. అలాగే తారకేశ్వర్ నుంచి మరో రిపోర్టర్ సంతు పాన్ సైతం బీజేపీ అభ్యర్థిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మే 4న వెలువడే ఎన్నికల ఫలితాల్లో వీరి జర్నలిజం అనుభవం ఓట్లుగా మారుతుందో లేదో వేచిచూడాలి.ఇది కూడా చదవండి: అరుణాచల్ వివాదం: ‘డ్రాగన్’కు దిమ్మతిరిగే రిటర్న్ గిఫ్ట్ -
కోడలికి వ్యతిరేకంగా మామ ప్రచారం
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాలలో పీఎంకేలో నెలకొన్న వివాదం మరింతగా ముదురుతోంది. పీఎంకేలో రాందాసు, ఆయన తనయుడు అన్భుమణి మధ్య నెలకొన్న వివాదం తెలిసిందే. అన్బుమణికి వ్యతిరేకంగా రాందాసు న్యాయ పోరాటంచేసినా ఫలితం శూన్యం. పార్టీ, ఎన్నికల గుర్తు మామిడి పండు అన్బుమణి గుప్పెట్లోకి చేరింది. దీంతో అన్బుమణి మద్దతుదారులు ఎన్నికలలో పోటీ చేస్తున్న చోట్ల రాందాసు వ్యతిరేక ప్రచారానికి సిద్ధమయ్యారు. వన్నియర్ సామాజిక వర్గంతో నిండిన నియోజకవర్గాలలో అన్బుమణికి వ్యతిరేకంగా రాందాసు వ్యాఖ్యల తూటాలను పేల్చేందుకు సిద్ధమయ్యారు. ఈ పర్యటన ధర్మపురి నుంచే బయలు దేరనుండడంతో వ్యవహారం ఎలాంలలి రచ్చకు దారితీయబోతున్నదో అన్న ఉత్కంఠ నెలకొంది. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో అన్బుమణి సతీమణి సౌమ్య అన్బుమణి పోటీ చేస్తున్నారు. ఆమెకు వ్యతిరేకంగా స్వయంగా ప్రచారానికి రాందాసు రంగంలోకి దిగారు. ప్రచార బాట సోమవారం ధర్మపురిలో సౌమ్య అన్బుమణికి వ్యతిరేకంగా రాందాసు ప్రచారం చేయనున్నారు. 35 ఏళ్లుగా తన భుజాలపై మోసిన పార్టీ, చిహ్నంకు వ్యతిరేకంగా రాందాస్ ప్రచారం నిర్వహించనున్నడం గమనార్హం. రాందాసు మద్దతు దారులకు సిలిండర్ గుర్తును ఎన్నికల కమిషన్ కేటాయించిన విషయం తెలిసిందే. దీంతో తన అభ్యర్థులకు మద్దతుగా, అన్బుమణి అభ్యర్థులకు వ్యతిరేకంగా రామ్‌దాసు ప్రచార బాటకు సిద్ధమయ్యారు. సోమవారం ధర్మపురిలో తన కోడలు సౌమ్య అన్బుమణికి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించనున్నారు. ప్రచార సభ నిర్వహించనున్నారు. కుటుంబ విభేదాలు రచ్చకెక్కిన నేపథ్యంలో రాందాసు ఎలాంటి వ్యాఖ్యల తూటాలను పేల్చనున్నారో వేచి చూడాల్సిందే. ఆతదుపరి 16న కుంబకోణం. 17న కాట్టుమన్నార్కోయిల్, జయకొండం, 18న తిట్టకుడి, విరుదాచలం, భువనగిరి, 19న చెయ్యార్, పోలూరు, కలసపాక్కం. 20న విక్రవాండి, సెంజి, కీల్‌పెన్నాత్తూరులలో అన్బుమణి పీఎంకే, మామిడి చిహ్నంకు వ్యతిరేకంగా ప్రచారంకు రాందాసు నిర్ణయించడం గమనార్హం. కాగా ఒకే పారీ్టకి చెందిన తండ్రీకొడుకులు ఇప్పుడు ప్రత్యర్థులుగా మారి, ఒకరిపై ఒకరు ఓట్లు వ్యాఖ్యల తూటాలన పేల్చుకునేందుకు సిద్ధం కావడంతో పీఎంకే కార్యకర్తలు అయోమయంలో పడ్డారు. ధర్మపురిలో ఈ ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
యోగి, సువేందుల వైరల్ వీడియో.. ‘ఎంత భక్తో’
కోల్‌కతా: రాజకీయ వేదికలపై కనిపించే కొన్ని దృశ్యాలు వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో చోటుచేసుకున్న ఒక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ విషయంలో బెంగాల్ ఫైర్ బ్రాండ్ నేత సువేందు అధికారి చూపిన అనూహ్య భక్తిభావం, అణకువ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.పశ్చిమబెంగాల్లోని కొంటాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభ ఈ ఆసక్తికర ఘట్టానికి వేదికైంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా యోగి ఆదిత్యనాథ్ ఇక్కడకు వచ్చారు. ఆయన వేదిక పైకి అడుగుపెట్టగానే సువేందు అధికారి వేగంగా వెళ్లి, కాషాయ కండువాతో స్వాగతం పలికారు. అంతేకాదు, ఏమాత్రం సంకోచించకుండా వేదికపైనే యోగి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశారు. వెంటనే స్పందించిన యోగి ఆయనను ఆప్యాయంగా పైకి లేపి, చేయి పట్టుకుని అక్కడున్న ప్రజల వైపు తిరిగి అభివాదం చేశారు. ఈ క్షణాలను క్యాప్చర్ చేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు ‘ఎంత భక్తో’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. Beautiful video ♥️Kanthi, West Bengal : Bengal LoP Suvendu Adhikari seeks blessings from UP CM Yogi Adityanath by prostrating in-front him and touching his feet.#BengalElections #BJP4Bengal pic.twitter.com/eUj1lPdOe9— Amitabh Chaudhary (@MithilaWaaala) April 12, 2026ఈ సభలో యోగి ఆదిత్యనాథ్ అధికార తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బెంగాల్ సంస్కృతిని, శాంతిభద్రతలను కాపాడటంలో టీఎంసీ సర్కార్ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, భద్రత కోసం ఇక్కడ కూడా నరేంద్ర మోదీ నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా మాల్దా, ముర్షిదాబాద్, బీర్భూమ్ వంటి ప్రాంతాల్లో హిందువుల జనాభాను తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బెంగాల్లో దుర్గాపూజ, రామ నవమి ఊరేగింపులను అడ్డుకోవడాన్ని యోగి తప్పుబట్టారు. బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.ఇది కూడా చదవండి: Noida: కార్మికుల తిరుగుబాటు.. కలెక్టర్ కీలక నిర్ణయం! -
గెలిస్తే.. ఏఐ మంత్రిత్వ శాఖ
సాక్షి, చెన్నై : టీవీకే అధికారంలోకి వస్తే తమిళనాడును దేశానికే ఏఐ రాజధానిగా మారుస్తామని ఆ పార్టీ అధినేత విజయ్ ప్రకటించారు. రాష్ట్రంలో మొట్టమొదటి ఏఐ సాంకేతిక విశ్వవిద్యాలయాన్ని, అలాగే ఒక ప్రత్యేక ఏఐ నగరాన్ని నిర్మిస్తామని వివరించారు. ఇక ఒక ప్రత్యేక ఏఐ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం టీవీకే అధినేత విజయ్ కన్యాకుమారిలో పర్యటించారు. జాతీయ రహదారిలో ప్రజల్ని ఆకర్షించే విధంగా సైకిల్ తొక్కు తూ ముందుకు సాగారు. నా గుండెల్లో.. కన్యాకుమారిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో విజయ్ మాట్లాడుతూ: ‘నా గుండెల్లో నివసించే కన్యాకుమారి, కారైక్కుడి ప్రజలకు నా నమస్కారాలు అని వ్యాఖ్యానించారు. ఆ రోజు కారైక్కుడిలో తాను మాట్లాడలేకపోయానని గుర్తు చేశారు. ఇప్పుడు టీవీకే ప్రభుత్వం చేపట్టబోయే కొన్ని పథకాలను ఇక్కడ ప్రకటిస్తున్నానని వివరించారు. టీవీకే ప్రభుత్వం ఏర్పడితే, పాలనలో ఎటువంటి అవినీతి లేకుండా ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. ఇందుకోసం ఆధార్ కార్డు తరహాలోనే తమిళనాడులో ఒక ప్రత్యేక గుర్తింపు కార్డును రూపొందిస్తామన్నారు. ఏఐ డేటా సహా యంతో, ఎటువంటి మధ్యవర్తులు లేకుండా, లంచం ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఈ కార్డు ద్వారా పథకాలు నేరుగా ప్రజలకు అందుతాయని వివరించారు. దీని కోసం ప్రజలు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో ఏదైనా పని కావాలంటే రకరకాలుగా తిప్పించుకుంటున్నారని, ఇందుకు ప్రధాన కారణం లంచం. లంచం... అంటూ ఇలా తీసుకునే లంచం కేవలం అధికారులకే కాకుండా, మంత్రుల వరకు వెళ్తోందని ఆరోపించారు. సేవా ధృవీకరణ పథకం టీవీకే అధికారంలోకి రాగానే ‘తమిళనాడు సేవ «ధృవీకరణ పథకం రూపొందిస్తామని ప్రకటించారు. ఒక మొబైల్ యాప్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ సహా అన్ని ప్రభుత్వ సేవలను మధ్యవర్తులు లేకుండా, లంచం ఇవ్వకుండా పొందవచ్చు అని వివరించారు. ప్రస్తుతం బడ్జెట్ అనేది కేవలం ఒక పత్రం లాగే కనిపిస్తున్నదని, ఆ నిధులు ఎక్కడికి వెళ్తున్నా యో తెలియడం లేదంటూ, ఇది చిదంబర రహ స్యం లాగా స్టాలిన్ రహస్యంగా ఉంటోందని ఆరోపించారు. ఇక, జాలర్ల భద్రత గురించి ప్రస్తావిస్తూ, నిషేధ కాలంలో ఇస్తున్న రూ. 8 వేలు సాయాన్ని రూ. 20 వేలకు పెంచుతామని ప్రకటించారు. పడవల్ని రక్షించేందుకు రాయబార కార్యాలయం ద్వారా దౌత్య పరంగా చర్యలు తీసుకుంటామని పేర్కొంటూ, అంత వరకు బ్యాంక్ రుణాల చెల్లింపు, జాలర్ల కుటుంబాలకు సాయం నిమిత్తం పడవ యజమానికి రూ. 5 లక్షల వరకు మధ్యంత నివారణ నిధులు అందజేస్తామని వివరించారు. కడల్ తాయ్ ఇల్లం పేరిట సముద్ర తీరంలో ఉన్న గుడిసెలు, పాడు బడ్డ గృహాలను తొలగించి, వాటి స్థానంలో ఎలాంటి విపత్తులైనా ఎదుర్కొనే విధంగా గృహాలను నిర్మించి ఇస్తామన్నారు. అలాగే, ఇంధన రక్షణ పథకం ద్వారా నెలకు 1800 లీటర్ల నుంచి 3 వేల లీటర్లుగా కోటాను పెంచుతామని, లీటరకు రూ. 15 సబ్సిడీ పడవ యజామాని బ్యాంక్‌ఖాతాలో నేరుగా జమ చేస్తామని ప్రకటించారు. -
బీజేపీని భరించడం కష్టం: ‘దీదీ’ చెంతకు నేతాజీ వారసుడు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. అత్యంత ఉత్కంఠభరితంగా మారిన ఈ పోరులో బీజేపీకి ఊహించని భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కుటుంబం నుంచి వచ్చిన కీలక నేత, ఆయన మనుమడు చంద్ర కుమార్ బోస్ తృణమూల్ కాంగ్రెస్ గూటికి చేరారు. బీజేపీ సిద్ధాంతాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన ఆయన, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసం ప్రకటిస్తూ, టీఎంసీ కండువా కప్పుకున్నారు.ఈ సందర్భంగా చంద్ర కుమార్ బోస్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. నాడు బ్రిటిష్ వారు అవలంబించిన విభజించు, పాలించు విధానాన్నే నేడు బీజేపీ పాటిస్తోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మతాన్ని వాడుకుంటూ, ప్రజల మధ్య చిచ్చుపెడుతోందని విమర్శించారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, శరత్ చంద్రబోస్ తదితరులు తీవ్రంగా వ్యతిరేకించిన మత రాజకీయాలను బీజేపీ ప్రోత్సహిస్తుండటం ఏమాత్రం అంగీకారం కాదని ఆయన పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, కేవలం సిద్ధాంతపరమైన విభేదాల వల్లే తాను తొమ్మిదేళ్ల బంధాన్ని తెంచుకుని, బీజేపీకి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. #WATCH | Kolkata, West Bengal | Netaji Subhas Chandra Bose's grandnephew Chandra Kumar Bose joins TMC. pic.twitter.com/z8Rzt46XHo— ANI (@ANI) April 12, 2026దేశ రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్న బీజేపీ విధానాలను భరించలేకే ఆ పార్టీని వీడానని, లౌకికవాదం, అందరినీ కలుపుకుపోయే తత్వం ఉన్న టీఎంసీ విధానాలు నచ్చడంతోనే ఆ పార్టీలో చేరానని చంద్ర కుమార్ బోస్ వివరించారు. రాబోయే ఎన్నికల్లో దీదీ మరోసారి ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.కాగా ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతలుగా బెంగాల్ ఎన్నికలు జరగనుండగా మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. గత 2021 ఎన్నికల్లో 213 స్థానాలతో అఖండ విజయం సాధించిన టీఎంసీకి, 77 స్థానాలతో బలపడిన బీజేపీకి మధ్య ఈసారి హోరాహోరీ పోరు జరగనుంది. ఈ తరుణంలో నేతాజీ వారసుడు టీఎంసీలో చేరడం ఆ పార్టీ ప్రచారానికి మరింత బలాన్ని చేకూర్చింది. ఇది కూడా చదవండి: ఇరాన్ యుద్ధం: ‘ఐఎంఎఫ్’ తీవ్ర హెచ్చరిక -
అన్నాడీఎంకే కూటమికితిరుగులేదు..!
సాక్షి, చైన్నె : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పారీ్టన్నీ నువ్వా నేనా అనే రీతిలో ప్రచారం సాగిస్తున్నారు. తాజాగా ఎన్నికల్లో అన్నాడీఎంకేే కూటమి వ్యూహాలు.. హామీలపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి స్పందించారు. మీడియాతో వివిధ అంశాలపై ఆయన అభిప్రాయాలను తెలియజేశారు.. ‘‘2009లో జరిగిన తిరుమంగళంలో ఉపఎన్నిక పనుల్లో తనతో పాటుగా కొందరు నిర్వాహకులను అమ్మ జయలలిత పంపించారని వివరించారు. ఒకరోజు అమ్మ పిలిచి, అందరినీ... నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందని అడిగినట్టు పేర్కొన్నారు. అందరు నేతలు అద్భుతం, గెలుపు మనదే అని రిపోర్ట్ ఇవ్వగా, తాను మాత్రం కష్టం అని సమాధానం ఇచ్చానని గుర్తు చేశారు. ఈ సమయంలో ఇక పళణి స్వామి పని అయిపోయిందని అందరూ భావించారని, అయితే, తాను చెప్పినట్టుగానే ఫలితం రావడంతో అమ్మ పిలిచి అభినందించారని తెలిపారు. నిజాయితీగా, ధైర్యంగా నిజాన్ని చెప్పి నందుకు గాను తన మీద నమ్మకం అమ్మకు పెరిగిందని పేర్కొన్నారు. ఆ నిజాయితీ, ధైర్యం తాజాగా ఈ స్థాయికి చేర్చిందని’’ అన్నారు. తమను తీర్చిదిద్దిన పురట్చి తలైవర్ (ఎం.జి.ఆర్) బోధించిన, ‘కష్టపడి పనిచేసేవారే గొప్పవారు’ అనే సిద్ధాంతాన్ని అనుసరించి, ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా 50 ఏళ్లకు పైగా పనిచేసిన ఫలితంగా పార్టీ సహచరులు నాకు ఈ హోదాను బహుమతిగా ఇచ్చారన్నారు. వారి నమ్మకాన్ని కాపాడే విధంగా కృషి చేస్తానని.. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాను అని పేర్కొన్నారు. ఏదైనా ఒక పార్టీ నాయకత్వం, ఉద్యమం క్రమశిక్షణతో, నియంత్రణతో సాగాలని కోరుకుంటుంది. మా రాజకీయ గురువు అరిజ్ఞర్ అన్నా ’కర్తవ్యం – గౌరవం – క్రమశిక్షణ’ను బోధించారు. ఆయన మార్గంలోనే ఎం.జి.ఆర్, జయలలిత నడిచారు. నేను కూడా వారు చూపిన బాటలోనే పయనిస్తున్నాను. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించి, పార్టీకి ద్రోహం చేసిన వారిపై జనరల్ బాడీ సమావేశంలో చర్యలు తీసుకున్నాము. ఇక్కడ ఉన్నంత కాలం పదవులను అనుభవించి, పార్టీకి ద్రోహం చేయడమే కాకుండా, స్వలాభం కోసం వారు ఇతర పార్టీల్లో చేరుతున్నారు. దాని గురించి మేము ఆందోళన చెందాలా? అని పేర్కొన్నారు.కూటమి అనేది ఎన్నికల పరిస్థితులను బట్టి ఏర్పడుతుంది. 1999లో బీజేపీ కూటమి నుండి వైదొలిగిన అన్నాడీఎంకే, 2004లో మళ్లీ జత కట్టింది. 1999లో బీజేపీతో చేరిన డీఎంకే, 2004లో అక్కడి నుండి విడిపోయి కాంగ్రెస్‌తో చేరింది. తమిళనాడులోని దుష్టశక్తి అయిన డీఎంకే పాలనను అంతం చేయాలనే ఏకై క లక్ష్యంతో అన్నాడీఎంకే, బీజేపీ కూటమిగా ఏర్పడి ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. ఇందులో ఢిల్లీ ఒత్తిడి అనేది ఊహ మాత్రమే. అమ్మ మరణం తర్వాత నిజమైన, విశ్వాసపాత్రులైన కార్యకర్తలు ఒక సామాన్య కార్యకర్తగా, కష్టపడే వ్యక్తిగా ఉన్న నాకు మద్దతు ఇచ్చారు. పార్టీని తాకట్టు పెట్టిన వారిని, ద్రోహం చేసిన వారిని గుర్తించి ‘కలుపు మొక్కలను తొలగించి పార్టీని కాపాడుకున్నాం. శత్రువులతో పోరాడుతున్నాం, క్షేత్రస్థాయిలో విజయం సాధించడం ఖాయం అని స్పష్టం చేశారు.మణిపూర్ విషయంలో మేం సరైన రీతిలో గళం విప్పాం. సీఏఏ చట్టం వల్ల భారతీయ ముస్లింలకు, ముఖ్యంగా తమిళనాడు ముస్లింలకు ఎటువంటి నష్టం లేదని నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అసెంబ్లీలో స్పష్టంగా చెప్పాను. సీఏఏ వల్ల ముస్లింలకు కలిగే నష్టం ఏంటో ఆధారాలతో చెబితే నేను సమాధానం ఇస్తాను. ఓట్ల కోసం తమను ఆదరించేది ఎవరు, నిజంగా తమ సంక్షేమం కోసం పాటుపడేది ఎవరు అనేది తమిళనాడులోని ముస్లిం సోదరులకు బాగా తెలుసు. ఈ ఎన్నికల్లో వారు పూర్తి ఇష్టంతో అన్నాడీఎంకేకు ఓటు వేస్తారనే నమ్మకం మాకు ఉంది. సోనియా గాంధీని, రాహుల్ గాంధీని సిద్ధాంతకర్తలుగా అంగీకరించి వారికి ఎంకే స్టాలిన్ సలాం కొడుతారేమోగానీ, తమ వరకు ఆదర్శ నాయకులు ఎవరో ప్రజలకు బాగా తెలుసని అభిప్రాయపడ్డారు.రాజకీయంలో అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ విజయ్ టీవీకే వారికీ ఉందంటూ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం అని స్టాలిన్ కుటుంబం విదేశాలకు విహారయాత్రకు వెళ్లి వచ్చిందని మరో ప్రశ్నకు ఆరోపించారు. ఎస్ఐఆర్తో దొంగ, బోగస్ ఓట్లను తొలగించారని ఇంకో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రజలకు ఇబ్బంది కలగని విధంగా విమానాశ్రయం నిర్మించాలన్నదే అప్పుడూ, ఇప్పుడూ తమ విధానం అని పరందూరు విషయంగా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వాగ్దానాలను ఉచితం అని అనకండి. లేనివారికి, లేని పక్షంలో ఉన్నవారికి కుటుంబ అవసరాలకు కావాల్సినవి వెల లేకుండా ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆ ప్రాతిపదికన ఫ్రిడ్జ్ ఇస్తామని చెప్పాం. అన్ని కుటుంబ కార్డుదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 జమ చేస్తామని హామీ ఇచ్చాం. పేద , మధ్యతరగతి ప్రజలు తమకు ఓటు వేయడానికి ఇప్పటికే సిద్ధమైపోయారు. గెలుపు తమదే, అధికారం తమదే అని ధీమా వ్యక్తం చేశారు.వ్యక్తిగత విమర్శలు చేయనుఇటీవల ప్రసంగాలలో వ్యక్తిగత విమర్శలు తీవ్రంగా ఉన్నట్టుందే ? అని సూచించగా, తాను ఎప్పుడైనా మర్యాద లేకుండా మాట్లాడటం చూశారా?, ఎవరైనా సరే వారు అని గౌరవంగా సంబోధించడమే నా పద్ధతి అని వ్యాఖ్యలు చేశారు. అయితే, అనవసరంగా గొడవకు దిగితే ఎలా వదలగలను? లక్షలాది మంది కార్యకర్తలు ఉన్న పార్టీ అన్నాడీఎంకే, ఊరికే వదిలేస్తే నా గురించి కార్యకర్తలు ఏమనుకుంటారు? అని ప్రశ్నించారు. -
‘లక్ష్మీ’ వర్సెస్ ‘దుర్గ’: ఎవరిది అసలైన స్కెచ్?
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు(2026) దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇటు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), అటు బలమైన ప్రతిపక్షంగా ఎదిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మధ్య పోరు అత్యంత రసవత్తరంగా మారింది. గెలుపే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలు దాదాపు ఒకే వర్గం ఓటర్లను టార్గెట్ చేశాయి. అవే మహిళలు, యువత, సంక్షేమ పథకాల లబ్ధిదారులు. అయితే ఈ ఓట్లను రాబట్టేందుకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పాత ఫార్ములాను నమ్ముకోగా, ఆమె కోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ సరికొత్త వాగ్దానాలతో రంగంలోకి దిగింది.ప్రభుత్వ వ్యతిరేకతను పోగొట్టుకునేందుకు..2011 నుండి బెంగాల్లో టీఎంసీకి తిరుగులేని విజయాలు అందిస్తున్న మహిళలు, మైనారిటీలు, ఎస్సీ-ఎస్టీ సామాజిక వర్గాల కూటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోకూడదని మమతా బెనర్జీ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇందులో భాగంగానే అత్యంత ఆదరణ పొందిన ‘లక్ష్మీర్ భండార్’ పథకం కింద జనరల్ కేటగిరీ మహిళలకు నెలవారీ ఆర్థిక సాయాన్ని రూ.1,500కి, ఎస్సీ, ఎస్టీ మహిళలకు రూ.1,700కి పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ వ్యతిరేకతను పోగొట్టుకునే ప్రయత్నం చేస్తూ, పార్టీని ఆదుకుంటున్న మహిళా ఓటర్లను కట్టిపడేసేందుకే టీఎంసీ ఈ ఎత్తుగడ వేసింది. రాష్ట్రంలో 30 శాతంగా ఉంటూ, సుమారు 110 సీట్లలో ప్రభావం చూపే ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు వక్ఫ్ ఆస్తుల రక్షణ, అలియా యూనివర్సిటీ అభివృద్ధి వంటి హామీలను టీఎంసీ ఇచ్చింది. ‘మతం పేరిట రాష్ట్రాన్ని విభజించాలనుకునే వారికి ఒక్కటే చెబుతున్నాం. ఈ రాష్ట్రం ఇక్కడి తల్లులు, కుమార్తెలు, మైనారిటీలు, పేదల పక్షాన నిలబడుతుంది’ అని టీఎంసీ నేత జయప్రకాశ్ మజుందార్ స్పష్టం చేశారు.మహిళల ఆగ్రహానికి అడ్డుకట్ట వేసేందుకు..ఇదే సమయంలో టీఎంసీకి అత్యంత బలంగా ఉన్న మహిళా ఓటు బ్యాంకుకే గండికొట్టాలని బీజేపీ మాస్టర్ ప్లాన్ వేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి సంచలన హామీలు గుప్పించారు. ప్రతి మహిళకు నెలకు రూ.3,000 ఆర్థిక సాయం, ఉచిత బస్సు ప్రయాణం, ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, మహిళా పోలీస్ స్టేషన్లు, ప్రత్యేకంగా ‘దుర్గా సురక్షా స్క్వాడ్’ల ఏర్పాటు వంటివి బీజేపీ సంకల్ప్ పత్రలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆర్జీ కర్ ఆస్పత్రి ఘటన, సందేశ్‌ఖాలీ ఉదంతాలతో మహిళల్లో రగులుతున్న ఆగ్రహాన్ని ఓట్లుగా మలుచుకునేందుకు, వారికి భద్రతపై భరోసా కల్పించేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.‘చేపలు, గుడ్లు తినకుండా ఎవరూ ఆపలేరు’ మహిళా సాధికారతతో పాటు, హిందుత్వ అజెండాను కూడా బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) అమలు చేస్తామని, చొరబాటుదారులను ఏరివేస్తామని, ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’లకు వ్యతిరేకంగా కఠిన చట్టాలు తెస్తామని హామీ ఇచ్చింది. ‘ఈ ఎన్నికలు బుజ్జగింపులకు-న్యాయానికి, చొరబాట్లకు-భద్రతకు, అవినీతికి-అభివృద్ధికి మధ్య జరుగుతున్న పోరాటం’ అని బీజేపీ నేత దేబ్జిత్ సర్కార్ అభివర్ణించారు. 2021లో బీజేపీ అత్యధికంగా లాభపడిన ఎస్సీ-ఎస్టీ బెల్టుల్లో టీఎంసీ ఈసారి స్కాలర్షిప్లు, హాస్టళ్ల ఏర్పాటుతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి దీటుగా బీజేపీ.. రాజ్‌బన్షీ, కుర్మి భాషలకు గుర్తింపుతో పాటు, ఉత్తర బెంగాల్‌కు ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎం వంటి భారీ ప్యాకేజీని ప్రకటించింది. మరోవైపు తమపై ఉన్న ‘ఉత్తరాది పార్టీ’ అనే ముద్రను చెరిపేసుకునేందుకు బీజేపీ ఈసారి ‘బెంగాలీ హిందుత్వ’ నినాదాన్ని ఎత్తుకుంది. వందేమాతరం మ్యూజియం, ఠాగూర్ కల్చరల్ సెంటర్లు, చైతన్య మహాప్రభు సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని చెబుతూనే.. చేపలు, గుడ్లు తినకుండా బెంగాలీలను ఎవరూ ఆపలేరని భరోసా ఇవ్వడం గమనార్హం.ఉనికిని కాపాడుకునేందుకు వామపక్షాలు, కాంగ్రెస్..ఇక ఈ ద్విముఖ పోరులో ఉనికి కాపాడుకునేందుకు పోరాడుతున్న వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు గుర్తింపు రాజకీయాలను పక్కనబెట్టి ఉపాధి చుట్టూ తమ ప్రచారాన్ని అల్లుకున్నాయి. ప్రతి కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామని లెఫ్ట్ ఫ్రంట్ హామీ ఇస్తే, అవినీతి లేని సంక్షేమ పాలన అందిస్తామని, ప్రభుత్వ ఖాళీలను భర్తీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు విశ్వనాథ్ చక్రవర్తి మాటల్లో.. ‘టీఎంసీ తన పాత ఓటు బ్యాంకును కాపాడుకోవాలని చూస్తుంటే, బీజేపీ దానిని బద్దలు కొట్టేందుకు ప్రయత్నిస్తోంది. తాము ఇంకా రేసులో ఉన్నామని గుర్తుచేయడానికే లెఫ్ట్, కాంగ్రెస్ పోరాడుతున్నాయి’. కాగా పోలింగ్ సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ పార్టీలు వేస్తున్న ప్రతి ఎత్తుగడ, ఇస్తున్న ప్రతి హామీ బెంగాల్ ఓటర్లను ఆలోచనలో పడేస్తోంది. ఏ మేనిఫెస్టో ఎవరి ఓటు బ్యాంకును కొల్లగొడుతుందో ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే!ఇది కూడా చదవండి: అమెరికాలో వివేకానందునికి అరుదైన గౌరవం -
బెంగాల్‌ను మూడు ముక్కలు చేసేందుకు కుట్ర: మమత
కోల్‌కతా: డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా పశ్చిమ బెంగాల్‌ను మూడు ముక్కలుగా విభజించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలను ఒడిశా, బిహార్లలో కలుపుతారే మోనంటూ అనుమానం వ్యక్తం చేశారు. బంకురా జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో మమత మాట్లాడారు. టీఎంసీ నుంచి గద్దె దించేందుకు బీజేపీ రూ.వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకుందని ఆరోపించారు. ఈ విషయమై బీజేపీ తనతో రూ.1,000 కోట్లకు ఒప్పందం కుదుర్చుకుందని, ఇప్పటికే రూ.200 కోట్లు ఇచ్చిందని హుమాయూన్ కబీర్ చేసిన ఆరోపణలతో కూడిన వీడియోను ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్య చేశారు. -
తుక్డే గ్యాంగ్‌కు మద్దతా?
సిలిగురి: ‘‘ఈశాన్య రాష్ట్రాలను దేశంలోని మిగతా భూభాగం నుండి వేరు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయి. వ్యూహాత్మక సిలిగురి కారిడార్ (చికెన్ నెక్)ను తెంచేస్తామని తుక్డే–తుక్డే గ్యాంగ్ బెదిరించింది. బుజ్జగింపు రాజకీయాలనే నమ్ముకుంటున్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ తుక్డే గ్యాంగ్‌కు గల్లీ నుంచి ఢిల్లీ దాకా మద్దతిచ్చింది. ఇదే ఆ పార్టీ అసలు రంగు’’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆదివారం పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. ఆ పార్టీ యువత, గిరిజనులు, మహిళల వ్యతిరేకి అని ఆరోపించారు. బుజ్జగింపు రాజకీయాల వల్ల బెంగాల్ తీవ్రంగా నష్టపోయిందని, దుర్బర స్థితిలోకి జారుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. సిలిగురి కారిడార్‌ను దేశ రక్షణకు, శ్రేయస్సుకు మధ్య వారధిగా ప్రధాని అభివరి్ణంచారు. ఈ ప్రాంతాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి, పటిష్టంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు. సిక్కింను సిలిగురితో అనుసంధానించే సేవోక్–రాంగ్పో రైల్వే రైల్ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయని ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టుతో బెంగాల్, సిక్కిం అనుసంధానం ఏర్పడడమే గాక స్థానికంగా వాణిజ్యం, పర్యాటకం ఊపందుకుంటుందని, యువతకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. దోషులు మూల్యం చెల్లించాల్సిందే బెంగాల్లో అభివృద్ధి జరగాలంటే డబుల్ ఇంజన్ ప్రభుత్వం రావాలని మోదీ అన్నారు. ‘‘ప్రగతిని పక్కనపెట్టి బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్న పార్టీలను చిత్తుగా ఓడించాలి. మదర్సాల కోసం తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో రూ.6,000 కోట్లు ఇవ్వడమేమిటి? ఉత్తర బెంగాల్‌కు నిధులివ్వకుండా మొండిచెయ్యి చూపారు. గత 15 ఏళ్లలో చేసిన ఖర్చులకు మమత సర్కారు సమాధానం చెప్పాలి. బీజేపీ అధికారంలోకి రాగానే తృణమూల్ కాంగ్రెస్ అవినీతి, అక్రమాలపై దర్యాప్తు జరిపిస్తాం. తప్పు చేసినవారు మూల్యం చెల్లించాల్సిందే. 15 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు బెంగాల్లో అమలు కాకపోవడం దారుణం. తృణమూల్ వైఖరితో ప్రజలు నష్టపోయారు. రాష్ట్రంలో క్రూరమైన ప్రభుత్వం ఉంది. ఆ భయానక పాలన పట్ల జనం విసుగెత్తిపోయారు. దానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు’’ అని చెప్పారు. బీజేపీకి ఒక్క చాన్స్ తృణమూల్ నిర్వాకాల వల్ల బెంగాల్లోకి అక్రమ వలసలు పోటెత్తాయని మోదీ ఆరోపించారు. ‘‘రాష్ట్రంలో చొరబాటుదార్లు తిష్టవేశారు. దాంతో స్థానికంగా జనాభా నిష్పత్తి మారిపోయింది. సామాజిక సమతుల్యం దెబ్బతిన్నది. బెంగాల్ ప్రజల భాష, సంస్కృతుల్లో మార్పులొచ్చాయి. స్థానికుల ఉపాధి, ఉద్యోగాలను చొరబాటుదార్లు కొల్లగొట్టారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే చాలా ఆలస్యం చేసినవాళ్లమవుతాం. అందుకే మన నినాదం ‘కమల్ ఖిలావో, ఘుస్పతియా భగావో (కమలానికి ఓటేద్దాం, చొరబాటుదార్లను గెంటేద్దాం)’. ఉత్తర బెంగాల్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేద్దామని కేంద్రం సంకల్పిస్తే మమత సర్కారు సహకరించలేదు. బీజేపీ అధికారంలోకి రాగానే ఉత్తర బెంగాల్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తాం. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు, క్యాన్సర్ ఆసుపత్రి, ఫ్యాషన్ డిజైన్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటు చేస్తాం. బెంగాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, తృణమూల్‌కు అవకాశమిచ్చారు. ఈసారి బీజేపీకి ఒక్క చాన్సిచ్చి చూడండి. ఆడబిడ్డలకు భద్రత కల్పించడానికి, చొరబాటుదార్ల నుంచి విముక్తి కల్పించడానికి, యువతకు ఉద్యోగాలు కల్పించడానికి, పెట్టుబడులు తీసుకురావడానికి, చట్టబద్ధ పాలన స్థాపించడానికి, పేదలకు ఉచితంగా వైద్యం అందించడానికి, ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి, బుజ్జగింపు రాజకీయాల బారి నుంచి బెంగాల్ సంస్కృతిని కాపాడడానికి మాకు అవకాశమివ్వండి’’ అని బెంగాలీలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. -
‘విజయ్ అంటే విజయకాంత్ కాదు’
చెన్నై: తమిళనాడులో డీఎండీకే వ్యవస్థాపకుడు, దివంగత నేత, సినీనటుడు “కెప్టెన్” విజయకాంత్ వారసత్వాన్ని కొనసాగించేందుకు ఆయన భార్య ప్రేమలత పోరాడుతున్నారు. విజయకాంత్ 2023 డిసెంబరు 28న కన్నుమూశారు. కొన్ని నెలల క్రితం సినీనటుడు విజయ్ కూడా టీవీకే పేరుతో పార్టీని స్థాపించారు. అయితే, కొందరు విజయకాంత్‌ను విజయ్‌తో పోల్చుతుండడం సరికాదన్నట్లు ప్రేమలత మాట్లాడారు. తాజాగా ఆమె తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.విజయ్ను కొందరు విజయకాంత్‌తో పోల్చుతుండడం పట్ల తాను ఎలాంటి అభిప్రాయాన్నీ వ్యక్తం చేయలేనని తెలిపారు. విజయకాంత్ కేవలం నటుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి మాత్రమే కాదని, ప్రజల మధ్య వారి కోసం నిలిచిన నాయకుని చెప్పారు.“కెప్టెన్ ప్రజల నాయకుడు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో తన అభిమాన సంఘాలను రాజకీయ పార్టీగా మార్చి ఎన్నికల్లోకి వచ్చారు. ఏ సమస్య వచ్చినా ముందుగా అక్కడికి వెళ్లేవారు. ప్రజలతో నిలబడేవారు. నాయకుడు వేరుగా, ప్రజలు వేరుగా ఉంటే ఆ బంధం నిలబడదు. పార్లమెంటరీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు. విజయకాంత్ కలలు, లక్ష్యాలను నెరవేర్చడమే డీఎండీకే లక్ష్యం. రాజకీయాల్లో లింగ వివక్ష లేదు. నేను పురుషుడు, మహిళ అనే కోణంలో ఆలోచించను. సరైనది ఏదైతే అదే చేస్తాం. మాతృభాషను రక్షించాలి, అన్ని భాషలు నేర్చుకోవాలి. మాతృభాష మన కళ్లలా.. ఇతర భాషలు కళ్లద్దాల్లా.. అవసరమైనప్పుడు వాడుతాం. తమిళనాడులో ఎప్పటినుంచో రెండు భాషల విధానం ఉంది. మూడు భాషల విధానం లేదు’ అని తెలిపారు. -
తమిళనాడు ఎన్నికల వేళ ట్విస్ట్.. కాంగ్రెస్‌కు బిగ్ షాక్!
సాక్షి, చైన్నె: తమిళనాడులో ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అభ్యర్థుల ఎంపికలో మహిళలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, పార్టీ సీనియర్ నాయకురాలు హసీనా సయ్యద్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆమె పార్టీ అధిష్టానంపై, ముఖ్యంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాష్ట్ర అధ్యక్షుడు సెల్వపెరుంతొగైపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయమై హసీనా సయ్యద్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వేదికలపై మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని గొప్పగా చెబుతుందని, కానీ ఆచరణలో తమిళనాడులో పోటీ చేస్తున్న 28 స్థానాల్లో కేవలం ఇద్దరు మహిళలకు (సుమారు 7%) మాత్రమే అవకాశం ఇచ్చిందని హసీనా మండిపడ్డారు. తనకు పట్టున్న కృష్ణగిరి నియోజకవర్గాన్ని కేటాయించాలని కోరగా, స్క్రీనింగ్ కమిటీలో తన పేరు మొదటి స్థానంలో ఉందని ఆమె తెలిపారు. అయితే, ఎంపీ చెల్లకుమార్ తన పలుకుబడిని ఉపయోగించి ఆ సీటును దక్కించుకున్నారని, దీని వెనుక నాయకుల మధ్య ఉన్న వ్యక్తిగత స్నేహాలే కారణమని ఆరోపించారు.నాయకత్వంపై ధ్వజం..ఢిల్లీలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తనకు మైలాడుతురై సీటు ఇస్తామని హామీ ఇచ్చి, చివరి నిమిషంలో పార్టీతో సంబంధం లేని వ్యక్తికి కేటాయించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్గే, సెల్వపెరుంతొగై కుమ్మక్కై అభ్యర్థుల ఎంపికలో ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. 27 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ ఐదుగురు మహిళలకు అవకాశం ఇచ్చిందని, అయితే, మహిళా సాధికారత గురించి మాట్లాడే కాంగ్రెస్ మాత్రం అర్హత ఉన్న మహిళలను విస్మరించిందని విమర్శించారు. రాజకీయంగా అణచివేతకు గురవుతున్న మహిళల గొంతుకను వినిపించేందుకు తాను ’రివల్యూషనరీ పిజియన్స్’ అనే సంస్థను ప్రారంభిస్తున్నట్లు హసీనా ప్రకటించారు. కాగా, ఎన్నికల సమయంలో కీలక మహిళా నేత ఇలా ఆరోపణలు చేస్తూ పార్టీని వీడటం తమిళనాడు కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. -
‘దళపతి’కి భారీ షాక్.. బరిలో ఇంతమంది ‘విజయ్’లా?
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం రోజురోజుకూ వేడెక్కుతోంది. 2026, ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో ఏ విధంగానైనా గెలిచేందుకు రాజకీయ పార్టీలు సరికొత్త ఎత్తుగడలకు తెరతీస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు తమిళనాట అత్యంత హాట్ టాపిక్‌గా మారిన అంశం ‘డమ్మీ అభ్యర్థుల వ్యూహం’ ముఖ్యంగా టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్, డీఎంకే నేత సెంథిల్ బాలాజీ వంటి ఉద్దండులను టార్గెట్ చేస్తూ పలు పార్టీలు ఒకే పేరుతో పలువురు అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. ఇది ఓటర్లను తీవ్ర గందరగోళానికి గురిచేసి, ఓట్లను చీల్చేందుకు ప్రతిపక్షాలు పన్నుతున్న పక్కా మాస్టర్ ప్లాన్ అని విశ్లేషకులు చెబుతున్నారు.అసలు ఏమిటీ డమ్మీ అభ్యర్థుల వ్యూహం?ఒక ప్రముఖ నేత పేరుతో మరికొంత మంది డమ్మీ అభ్యర్థులను నిలబెట్టడమే ఈ వ్యూహం ప్రధాన ఉద్దేశం. ఉదాహరణకు టీవీకే పార్టీ నుండి ‘విజయ్’ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో.. ఏ విజయ్, కె విజయ్ కుమార్, ఎం విజయ్, విజయ్ రాజ్ వంటి పేర్లతో అభ్యర్థులు దర్శనమిస్తారు. పార్టీ గుర్తులపై పెద్దగా అవగాహన లేని ఓటర్లు, కంగారులో తమ అభిమాన నేత పేరు చూసి వేరే ‘విజయ్’కి ఓటు వేసే అవకాశం ఉంది.ఇప్పుడిది ఎందుకు ట్రెండ్ అవుతోంది?మీడియాకు అందిన నివేదికల ప్రకారం తమిళనాడు వ్యాప్తంగా వందకు పైగా ఇలాంటి ‘ఒకే పేరున్న అభ్యర్థులు’ బరిలో నిలిచారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి కొత్తగా ఎంట్రీ ఇస్తున్న నేతలను టార్గెట్ చేస్తూ పట్టణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో ఈ వ్యూహాన్ని ఎక్కువగా అమలు చేస్తున్నారు. కొత్త పార్టీలు బరిలో ఉండటం, ఈసారి పోటీ హోరాహోరీగా సాగుతుండటంతో ఇది ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేసే అంశంగా మారింది.‘విజయ్’నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్.. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలనం. యువతలో ఆయనకున్న విపరీతమైన క్రేజ్, సోషల్ మీడియా మద్దతు, ఎన్నికల బరిలో పార్టీ వేగంగా ఎదుగుతున్న తీరు ప్రత్యర్థి వర్గాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. విజయ్‌కి పడే ఓట్లను చీల్చడం ద్వారా ఆయన గెలుపు అవకాశాలను దెబ్బతీయాలనేదే ఈ డమ్మీ కాండిడేట్ల ప్రణాళిక.కొత్త ఓటర్లపై ప్రభావం2026 తమిళనాడు ఎన్నికల్లో దాదాపు 12 లక్షల 50 వేల మంది యువత తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వీరు పార్టీ గుర్తుల కంటే నాయకుల పేర్లను చూసి ఓటు వేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన పోటీ ఉన్న నియోజకవర్గాల్లో కేవలం ఒకటి లేదా 2 శాతం ఓట్లు చీలిపోయినా తుది ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.ఇది చట్టబద్ధమేనా?ఒకే పేరున్న వారు పోటీ చేయడం చట్ట ప్రకారం పూర్తిగా సమ్మతమే. ఏ పౌరుడైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. వారి పేర్లు ఒకేలా ఉన్నాయనే కారణంతో నామినేషన్లను తిరస్కరించడానికి వీల్లేదు. అయితే, ఓటర్లలో ఏర్పడే గందరగోళాన్ని తగ్గించడానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈవీఎంల మీద అభ్యర్థుల ఫోటోలు, పార్టీ గుర్తులను స్పష్టంగా ముద్రిస్తుంది. అయినా సరే ఓటర్లు కంగారు పడినప్పుడు కన్ఫ్యూజన్ తప్పదు.ఎక్కడెక్కడ ఈ ప్రభావం ఉంది?చెన్నైలోని పట్టణ నియోజకవర్గాలు, దక్షిణ తమిళనాడులోని ప్రధాన ప్రాంతాలు, ముఖ్యంగా పెరంబూర్, తిరునెల్వేలి, మదురై శివార్లలో, కోయంబత్తూర్ అర్బన్ జోన్లలో ఈ డమ్మీ అభ్యర్థుల బెడద ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో అభ్యర్థుల మధ్య గెలుపు మార్జిన్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు మెజారిటీ రెండు వేల ఓట్లు ఉన్నప్పుడు, డమ్మీ అభ్యర్థికి 1500 ఓట్లు పడితే అసలు అభ్యర్థి ఓడిపోయే ఛాన్స్ స్పష్టంగా ఉంటుంది.ఓటర్లు ఏం చేయాలి?ఈ గందరగోళాన్ని అధిగమించడానికి ఓటర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఓటు వేసేటప్పుడు కంగారు పడకుండా, పార్టీ గుర్తును నిశితంగా పరిశీలించాలి. ఈవీఎంపై ఉన్న అభ్యర్థి ఫోటోను కచ్చితంగా నిర్ధారించుకున్న తర్వాతే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు కేవలం మేనిఫెస్టోలు, పొత్తులకే పరిమితం కాలేదు.. బ్యాలెట్ మీద ఎవరున్నారు, వారిని ఓటర్లు ఎలా గుర్తిస్తున్నారు అనేది కీలకం కాబోతోందనడంలో సందేహం లేదు.ఇది కూడా చదవండి: ‘దీదీ’కి మైండ్ బ్లాంక్.. బెంగాల్ బరిలో బీజేపీ బ్రహ్మాస్త్రం -
భవానీపూర్‌లో నా అభ్యర్థిత్వం చెల్లకుండా కుట్ర
కోల్‌కతా: భవానీపూర్‌లో తన అభ్యర్థిత్వం చెల్లకుండా చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని టీఎంసీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. ఇందులో భాగంగా రెండు తప్పుడు కేసుల్లో తనను ఇరికించేందుకు చేసిన ప్రయత్నాలను ప్రజలు, టీఎంసీ కార్యకర్తలు వమ్ము చేశారన్నారు. ఆమె శనివారం పశ్చిమ్ మేదినీపూర్ జిల్లాలో జరిగిన టీఎంసీ ప్రచార ర్యాలీల్లో ప్రసంగించారు. ‘ఈసీ సాయంతో భవానీపూర్‌లో నా అభ్యర్థిత్వాన్ని చెల్లకుండా చేసేందుకు శుక్రవారం బీజేపీ నాకు వ్యతిరేకంగా రెండు తప్పుడు అఫిడవిట్లు సమర్పించేందుకు కుట్ర పన్నింది. వారి ప్రయత్నాలను మేం భగ్నం చేశాం’అని ఆమె ప్రకటించారు. భవానీపూర్‌లో మమతకు ప్రధాన ప్రత్యర్థిగా ప్రతిపక్ష బీజేపీ నేత సువేందు అధికారి బరిలో ఉండటం తెల్సిందే. సర్ ప్రక్రియ సందర్భంగా బీజేపీ బలవంతంగా ఓటరు జాబితాల్లోని 90 లక్షల ఓటర్ల పేర్లను తొలగించిందని మమత విమర్శించారు. ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసి నెగ్గే సత్తా లేకనే బీజేపీ దొడ్డిదారిన ఓట్లను కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల ఫలితాలను అనుకూలంగా మార్చుకునేందుకు ఈవీఎంలను ట్యాంపర్ చేసేందుకూ బీజేపీ పథకం వేస్తోందన్నారు. -
సానుభూతి కోసం బాధిత కార్డు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై కేంద్ర హోం మంత్రి అమి త్ షా నిప్పులు చెరిగారు. ప్రజల సానుభూతి కోసం సీఎం మమత బాధితురా లినంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆరో పించారు. టీఎంసీ 15 ఏళ్ల పాలనతో రాష్ట్రం ఆర్థికంగా, శాంతిభద్రతల విషయంలో పూర్తిగా దిగజారిపోయిందని విమర్శించారు. అమిత్ షా శనివారం బంకురా, పురూలియా జిల్లాల్లో శనివారం బీజేపీ ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. బీజేపీకి అధికారమిస్తే టీఎంసీ సిండికేట్ పాలనకు ముగింపు తప్పదన్నారు. మహిళలకు అన్ని వేళలా రక్షణ కల్పిస్తామని తెలిపారు. అన్యాయానికి గురవుతున్న మహిళలకు న్యాయం చేకూరుస్తామని హామీ ఇచ్చారు. ‘సీఎం మమత బాధితురాలినంటూ చెప్పుకుంటున్నారు. కాలికో తలకో బ్యాండేజీ కట్టుకుని కనిపిస్తుంటారు. ఈసారి అలా జరగదు. కాలికి, చేతికి, తలకు బ్యాండేజీతో కనిపించినా బెంగాల్ ప్రజలు ఆమెకు ఓటేయరు’అని ఆయన స్పష్టం చేశారు. -
వచ్చేది ద్రావిడ మోడల్ 2.0 ప్రభుత్వమే
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 234 సీట్లకు గాను డీఎంకే కూటమి 200కుపైగా స్థానాలు గెల్చుకోవడం తథ్యమని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ధీమా వ్యక్తంచేశారు. అన్నా డీఎంకే–బీజేపీ కూటమికి సిద్ధాంతం గానీ, ఒక విధానం గానీ లేవని విమర్శించారు. బీజేపీ స్వరాలకు అనుగుణంగా అన్నాడీఎంకే నర్తిస్తోందని ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి ఢిల్లీ బీజేపీయే ప్రధాన కార్యాలయంగా మారిపోయిందని అన్నారు. స్టాలిన్ తాజాగా పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. గత ఐదేళ్ల ద్రావిడ మోడల్ పాలనలో ప్రజల కోసం ఎన్నెన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు. కళైంజర్ మహిళా పథకం కింద నెలకు రూ.1,000, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, రెండు లక్షల మంది రైతులకు ఉచిత విద్యుత్ కనెక్షన్ల జారీ వంటి పథకాలను ప్రస్తావించారు. ప్రజల ప్రేమాభిమానాలు, అండదండలతో లౌకిక ప్రజాస్వామ్య కూటమి(ఎస్పీఏ) 200కుపైగా సీట్లు గెల్చుకొని ద్రావిడ మోడల్ 2.0 ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఉద్ఘాటించారు. అన్నాడీఎంకే నాయకులు ఢిల్లీ పెద్దలకు బానిసలుగా మారిపోయారని మండిపడ్డారు. తమిళనాడు హక్కులను తాకట్టుపెట్టాలని చూస్తున్నవారు ముమ్మాటికీ బానిసలేనని తేల్చిచెప్పారు. స్టాలిన్ ఇంకా ఏం చెప్పారంటే.. మహిళల భద్రత మా బాధ్యత ‘‘మా కూటమిలో సీట్ల పంపకం విషయంలో పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు. సానుకూలంగా చర్చించుకొని సీట్లు ఖరారు చేసుకున్నాం. కూటమి అభ్యర్థుల విజయం కోసం మిత్రపక్షాలు కలిసికట్టుగా కృషి చేస్తున్నాయి. కొత్త పార్టీల చేరికతో ఎస్పీఏ మరింత బలంగా మారింది. తమిళనాడుతోపాటు పుదుచ్చేరిలోనూ అద్భుత విజయం సాధించబోతున్నాం. ద్రావిడ విప్లవ సిద్ధాంతాన్ని విశ్వసించేవారు మా పార్టీలో చేరారు. అందుకే మాజీ సీఎం పన్నీర్‌సెల్వం డీఎంకేను ఎంచుకున్నారు. జాతీయ స్థాయిలో విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక పాత్ర పోషించాలన్న ఆసక్తి లేదు. నా పరిధి ఏమిటో నాకు తెలుసు. స్టాలిన్ కుటుంబం పవర్ సెంటర్‌గా మారిందన్న విపక్షాల ఆరోపణల్లో నిజం లేదు. ద్రావిడ మోడల్ సుపరిపాలన, గత ఐదేళ్లలో మేము సాధించిన విజయాలను జీర్ణించుకోలేక ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు. మహిళల భద్రతకు మా ప్రభుత్వం పెద్దపీట వేసింది. వారి రక్షణ కోసం పటిష్టమైన చర్యలు చేపట్టాం. మహిళలపై నేరాలకు పాల్పడిన వారికి శిక్షలను కఠినతరం చేశాం. మహిళా ఉద్యోగులు, కార్మికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. వారి భద్రత మా బాధ్యత’’ అన్నారు. మనసుకు దగ్గరైన పథకాలు ‘‘మహిళలకు నెలకు రూ.1,000 ఆర్థిక సాయం, స్కూల్ విద్యార్థులకు అల్పహారం పథకాలు నా మనసుకు చాలా దగ్గరయ్యాయి. మహిళలకు ఆర్థిక సాయం పథకం దేశంలో అత్యుత్తమంగా అమలవుతున్న పథకం కావడం గర్వకారణం. ఇతర రాష్ట్రాల్లోనూ అమలు చేస్తున్నారు. విమర్శించినవారే ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. మళ్లీ అధికారంలోకి రాగానే ఈ సాయాన్ని రూ.2,000కు పెంచుతాం. అలాగే అల్పాహారం పథకాన్ని ఎనిమిదో తరగతి విద్యార్థుల దాకా విస్తరింపజేస్తాం. ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలితో పాఠశాలకు రాకూడదు. అదే మా లక్ష్యం. పిల్లల కడుపు నిండుతోంది, చక్కగా చదువుకుంటున్నారు. అది నాకు చాలా సంతృప్తినిస్తోంది’’ అని ఆయన అన్నారు. తమిళనాడు పోరాడుతుంది.. గెలుస్తుంది‘‘మహిళా రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రాజకీయ లబ్ధి కోసం ఆయుధంగా ఉపయోగించుకుంటోంది. మహిళలకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి. నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టకూడదు. ఈ పునర్విభజన విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగితే సహించే ప్రసక్తే లేదు. జనాభా పెరుగుదలను విజయవంతంగా నియంత్రించిన రాష్ట్రాలను శిక్షించాలనుకోవడం సరైంది కాదు. తమిళనాడు పోరాడుతుంది, తమిళనాడు గెలుస్తుంది. ఇదే మా నినాదం. మైనార్టీలను భయపెట్టాలన్నదే బీజేపీ అసలు ఎజెండా. మోదీ పాలనలో ముస్లింలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్నాయి. క్రిస్టమస్ పండుగ కూడా ప్రశాంతంగా నిర్వహించుకోలేని దుస్థితి ఏర్పడింది. క్రైస్తవులను కూడా టార్గెట్ చేశారు. భారత్ ఎప్పటికీ లౌకిక దేశంగానే ఉండాలి. మైనార్టీలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడాలి. మైనార్టీల హక్కుల కోసం మొదట మేమే గొంతు వినిపిస్తాం’’ అని స్టాలిన్ స్పష్టం చేశారు. -
బెంగాలీలను మైనార్టీలు కానివ్వం
జాంగీపూర్/కత్వా/కుష్మాండీ: పశ్చిమ బెంగాల్లో బుజ్జగింపు రాజకీయాలను అంతం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని, బెంగాల్ ప్రజలను సొంత రాష్ట్రంలో మైనార్టీలు కానివ్వబోమని తేల్చిచెప్పారు. శనివారం బెంగాల్‌లోని జాంగీపూర్, కత్వా, కుష్మాండీలో ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ అసెంబ్లీ ఎన్నికలను బెంగాల్ గుర్తింపు, భవిష్యత్తు పరిరక్షణ కోసం జరుగుతున్న యుద్ధంగా అభివర్ణించారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని, చొరబాటుదార్లకు మద్దతు ఇస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే చొరబాటుదార్లను బయటకు పంపిస్తామని పునరుద్ఘాటించారు. జాతీయ భద్రతే తమకు ముఖ్యమని తేల్చిచెప్పారు. అక్రమ వలసల కారణంగా బెంగాల్లో చాలా ప్రాంతాల్లో జనాభా నిష్పత్తి మారిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ‘మా, మాటీ, మనుష్’నినాదాన్ని తృణమూల్ కాంగ్రెస్ వదిలేసిందని, అధికారం నిలబెట్టుకోవడానికి చొరబాటుదార్లపై ఆధారపడుతోందని ధ్వజమెత్తారు. వారి ఓట్లతో వారి కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నదే తృణమూల్ కాంగ్రెస్ ఉద్దేశమని విమర్శించారు. ఓటు బ్యాంకు రాజకీయాలను ఇకపై సహించే ప్రసక్తే లేదన్నారు. ప్రజలంతా ఏకమై ప్రభుత్వాన్ని మార్చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు వేసే ప్రతి ఓటు బీజేపీకి ఆశీర్వాదంగా మారాలని చెప్పారు. ప్రధానమంత్రి ప్రసంగం ఆయన మాటల్లోనే.. కమ్యూనిస్టులకు కార్బన్ కాపీగా తృణమూల్ ‘‘బెంగాల్లో మార్పు తీసుకొస్తాం. రాష్ట్రాన్ని కాపాడుతాం. మార్పును ఎవరూ అడ్డుకోలేరు. బెంగాల్లో అహంకారం ప్రదర్శించిన ఎంతోమంది అడ్రస్ లేకుండాపోయారు. బ్రిటిష్ పాలకులతోపాటు కాంగ్రెస్, వామపక్షాలు గతంలో ఏమైందో చూశాం. ఇప్పుడు అదే పరిస్థితి తృణమూల్ కాంగ్రెస్‌కు ఎదురవుతుంది. బెంగాల్లో శ్రీరామనవమి వేడుకల్లో హింస జరిగితే మమతా బెనర్జీ ప్రభుత్వం నిందితులను కాపాడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పదని తేలడంతో తృణమూల్ కాంగ్రెస్ నాయకులు అది సహించలేక తప్పుడు వీడియోలు, అబద్ధాలను పోస్టు చేస్తున్నారు. అస్సాం, పుదుచ్చేరిలోనూ ఇలాంటి కుతంత్రాలు సాగించారు. అబద్ధాలను నమ్మొద్దని ప్రజలను కోరుతున్నా. ఎన్నికల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలి. బీజేపీని గెలిపించుకోవాలి. మా, మాటీ, మనుష్ నినాదంతో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టు పార్టీలకు కార్బన్ కాపీగా మారిపోయింది. కమ్యూనిస్టు శక్తులు, సిండికేట్లు తృణమూల్ కాంగ్రెస్‌తో చేతులు కలిపాయి. కమ్యూనిస్టుల పాలనలో జరిగినట్లుగానే వేధింపులు, అరాచకాలు, అవినీతి అక్రమాలు కొనసాగుతున్నాయి. వామపక్ష కార్యకర్తలు ఓట్ల కోసం ప్రజలను బెదిరించేవారు. నేడు టీఎంసీ రౌడీలు సైతం అదే పని చేస్తున్నారు. అక్రమ ఆయుధా లు, డ్రగ్స్, పశువుల అక్రమ రవాణా, కట్ మనీ, కమీషన్లు.. ఇలా అన్నింటినీ తృణమూల్ కాంగ్రెస్ కాంట్రాక్టు తీసుకుంది. బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతిపరులను కచ్చితంగా శిక్షిస్తాం. ప్రజలను వేధించినవారి కోసం జైలు తలుపులు తెరుచుకుంటాయి’’ అని అన్నారు. శరణార్థులకు భారత పౌరసత్వం ‘‘బీజేపీ అధికారంలోకి రాగానే మతువా, నామశూద్ర వర్గాలతోపాటు ఇతర శరణార్థులకు సీఏఏ కింద భారత పౌరసత్వం కల్పించే ప్రక్రియను వేగవంతం చేస్తాం. చొరబాటుదార్లు తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోవాల్సిందే. వారు వెనక్కి వెళ్లిపోవాల్సిన సమయం వచ్చింది. చొరబాటుదార్లను కాపాడేవారికి కూడా శిక్ష తప్పదు. బెంగాల్లో మా నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్ ఒక్కటే కాదు. మరొకటి కూడా ఉంది. అదే సబ్కా హిసాబ్. ప్రతి అరాచకవాదిని, అవినీతిపరుడిని శిక్షిస్తాం. శరణార్థులకు రాజ్యాంగపరమైన రక్షణ ఉంటుంది. అలాగే బీజేపీ పాలనలో బెంగాల్‌ను ఉన్నత శిఖరాలకు చేరుస్తాం. ఓటింగ్‌లో మహిళల భాగస్వామ్యం అధికంగా ఉన్నచోట బీజేపీ విజయం సాధిస్తోంది. బెంగాల్లోనూ మహిళల ఓట్లతో అధికారంలోకి రాబోతున్నాం. ప్రజలంతా కలిసి తృణమూల్ కాంగ్రెస్ పాలనను అంతం చేయాలి. బీజేపీ పాలన వచ్చాక.. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, సిండికేట్ల అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేస్తాం. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. బెంగాల్లో అమలవుతున్న పథకాలను కొనసాగిస్తాం. వాటిని ఆపబోం’’అని మోదీ స్పష్టం చేశారు.మహిళల భద్రతే మా ధ్యేయం ‘‘మహిళల భద్రతకు బీజేపీ సర్కార్ అత్యధిక ప్రాధాన్యం ఇస్తుంది. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో మహిళలపై లెక్కలేనన్ని నేరాలు జరిగాయి. వారిని దారుణంగా వేధించారు. మా ప్రభుత్వం వచ్చాక నేరగాళ్లను కఠినంగా శిక్షిస్తాం. పాత కేసులను మళ్లీ తెరుస్తాం. ఇది మోదీ గ్యారంటీ. మహిళల భద్రతే మా ధ్యేయం. తృణమూల్ ప్రభుత్వం ఫుట్‌బాల్ ఆటను కూడా సిండికేట్లకు అప్పగించింది. గత డిసెంబర్లో అర్జెంటీనా ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటన సందర్భంగా గందరగోళం జరిగింది. ఆ సిగ్గుచేటైన చిత్రాలను ప్రపంచమంతా చూసింది. బెంగాల్లో ప్రభుత్వం అంటే సిండికేట్, సిండికేట్ అంటే ప్రభుత్వం అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. చట్టవిరుద్ధమైన పాలనకు పర్యాయపదం తృణమూల్ సర్కార్. మమతా బెనర్జీ పార్టీకి సిద్ధాంతాలు, విలువులు లేవు. అందుకే అది ఇతర రాష్ట్రాల్లో అడుగుపెట్టలేకపోయింది’’అని మోదీ అన్నారు. -
పశ్చిమ బెంగాల్లో వచ్చే మార్పు ఇదే: ప్రధాని మోదీ
ముర్షిదాబాద్: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం (ఏప్రిల్ 11) తృణమూల్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. అధికార టీఎంసీ కూడా వామపక్ష పాలనా విధానాన్ని అనుకరించిందని, పశ్చిమ బెంగాల్లో మార్పును తీసుకురావడంలో విఫలమైందని చెప్పారు. ముర్షిదాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. పశ్చిమ బెంగాల్లో టీఎంసీని ప్రజలు అదే విధంగా ఓడిస్తారని అన్నారు. “స్వాతంత్య్రం వచ్చిన తర్వాత.. బెంగాల్‌ను సవాలు చేసిన ప్రతి ఒక్కొక్కరి అహంకారం ఛిద్రమైపోతూ వచ్చింది. మొదట బ్రిటిష్, తరువాత కాంగ్రెస్, చివరికి వామపక్షాలు తమ అహంకారంతో కుప్పకూలిపోయాయి. ఇప్పుడు బెంగాల్ ప్రజలు టీఎంసీ అహంకారాన్ని ఛిద్రం చేస్తారు” అని ప్రధాని చెప్పారు. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన టీఎంసీ వాగ్దానాలను నెరవేర్చలేకపోయిందని చెప్పారు.అవినీతి వ్యవస్థలను టీఎంసీ ప్రోత్సహించిందని మోదీ ఆరోపించారు. గతంలో ఉన్న ప్రభుత్వాలకు సంబంధించిన వర్గాలు ప్రస్తుత ప్రభుత్వంలో కొనసాగుతున్నాయని అన్నారు. “వామపక్షాలకు చెందిన గూండాలు, సిండికేట్లు అన్నీ తృణమూల్‌లోకి మారాయి. ఆయుధాలు, మాదక ద్రవ్యాలు, పశువుల అక్రమ రవాణా నుంచి కమిషన్ల వరకు అన్నింటిని ఇప్పుడు టీఎంసీ నియంత్రిస్తోంది” అని అన్నారు.దేశ భద్రత తమకు అత్యంత ముఖ్యమైనదని మోదీ చెప్పారు. పశ్చిమ బెంగాల్లో యూసీసీ అమలు చేసి, బుజ్జగింపు రాజకీయాలకు ముగింపు పలుకుతామని అన్నారు. టీఎంసీ జంగిల్ రాజ్, సిండికేట్ రాజ్‌కు ముగింపు పలకడమే బీజేపీ లక్ష్యమని తెలిపారు. ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో పరిస్థితి మారుతుందని చెప్పారు. కాగా, ఏప్రిల్ 23, 29 తేదీల్లో పశ్చిమ బెంగాల్లో పోలింగ్ జరగనుంది. ఫలితాలు మే 4న ప్రకటిస్తారు. -
మెగా శనివారం.. ఒకేరోజు బరిలో మోదీ, మమత, షా..
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల సంగ్రామం అత్యంత ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. ఏప్రిల్ 11.. శనివారం.. ‘మెగా శనివారం’గా మారింది. నేడు బెంగాల్ రాజకీయ ముఖచిత్రంపై ఒక మహా ఘట్టంగా నిలిచిపోనుంది. ఒకే రోజు ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ తమ సత్తా చాటేందుకు సుడిగాలి పర్యటనలు చేస్తుండటంతో రాష్ట్రంలో పొలిటికల్ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోయింది.ఈ నలుగురు అగ్ర నేతల రాకతో బెంగాల్ ఎన్నికల వాతావరణం దద్దరిల్లుతోంది. తూర్పు బర్ధమాన్ జిల్లాలోని కల్నా సమీపంలోని సిమ్లాన్ వద్ద ఏర్పాటు చేసిన ‘విజయ్ సంకల్ప్’ సభలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇందుకోసం కల్నా-బర్ధమాన్ స్టేట్ హైవే పక్కన ఉన్న వ్యవసాయ భూమిలో భారీ వేదికను సిద్ధం చేశారు. భద్రత కోసం వేదిక పరిసరాలను సీసీటీవీ నిఘాలోకి తీసుకురావడంతో పాటు, హెలికాప్టర్ ట్రయల్స్ కూడా పూర్తి చేశారు. ఈ సభకు 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు హాజరవుతున్నారని, ప్రతిపక్ష శిబిరాల నుంచి భారీగా వలసలు ఉంటాయని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రాజీబ్ భౌమిక్ తెలిపారు.మరోవైపు బంకురా జిల్లా ఈరోజు ఒకేసారి రెండు ప్రధాన పార్టీల బలప్రదర్శనకు వేదిక కానుంది. బర్జోరా కాలేజ్ గ్రౌండ్స్‌లో సీఎం మమతా బెనర్జీ భారీ ఎన్నికల ర్యాలీని నిర్వహించనున్నారు. ఈ సభకు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీగా ప్రజలు తరలివస్తారని టీఎంసీ నాయకులు తెలిపారు. ఇదే జిల్లాలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఒండాలోని రామ్‌సాగర్, ఛత్నాలోని ఝాటిపహాడీ వద్ద రెండు వేర్వేరు సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. దీంతో పాటు ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి కూడా గంగాజల్ఘటిలో బీజేపీ అభ్యర్థి బిల్లేశ్వర్ సిన్హా తరఫున ప్రచారం చేయనున్నారు.బీర్భూమ్ జిల్లాలోనూ రాజకీయ వాతావరణం తారాస్థాయికి చేరింది. టీఎంసీ యువ నేత అభిషేక్ బెనర్జీ సైంథియాలోని జాలీబగాన్ సమీపంలో జరిగే సభలో పాల్గొననున్నారు. ఈ సభ కోసం భారీ వేదికతో పాటు ప్రత్యేక హెలిప్యాడ్‌ను కూడా సిద్ధం చేశారు. కేవలం సైంథియా నియోజకవర్గం నుంచే 50 నుంచి 60 వేల మందిని సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్థానిక టీఎంసీ అధ్యక్షుడు దేబాశిష్ సాహా తెలిపారు. లాబ్పూర్, మయూరేశ్వర్, నానూర్ అభ్యర్థులతో పాటు సీనియర్ నేత అనుబ్రత మండల్ కూడా ఈ సభకు హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఈ అగ్ర నేతల ప్రచార పర్వం ఓటర్లను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. -
‘దీదీ’కి మైండ్ బ్లాంక్.. బెంగాల్ బరిలో బీజేపీ బ్రహ్మాస్త్రం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచార హోరును మరింతగా పెంచింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేసిన ‘సంకల్ప్ పత్ర’ (మేనిఫెస్టో)ను తృణమూల్ కాంగ్రెస్ ఓటు బ్యాంకుకు గండికొట్టేలా రూపొందించారు. ముఖ్యంగా మహిళలు, యువతను ఆకర్షించడంతో పాటు, బెంగాలీ సంస్కృతిని కాపాడేలా బీజేపీ చేసిన హామీలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. బీజేపీ మేనిఫెస్టోలోని ఐదు ప్రధాన అంశాలు ఇవే..చొరబాట్లపై ఉక్కుపాదంఅక్రమ చొరబాట్లను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేసిన బీజేపీ.. చొరబాటుదారులను గుర్తించి, దేశం నుంచి పంపించే (డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్) విధానాన్ని అమలు చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని తీసుకువస్తామని, అలాగే లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్‌లను అరికట్టేందుకు కఠిన చట్టాలు రూపొందిస్తామని హామీ ఇచ్చింది.మహిళలకు పెద్ద పీటమహిళా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భారీ నజరానాలు ప్రకటించింది. టీఎంసీ ప్రభుత్వం ఇస్తున్న ‘లక్ష్మీర్ భండార్’ సాయం కంటే దాదాపు రెట్టింపుగా ప్రతి మహిళకు నెలకు రూ.3,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగాలు, పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు, 75 లక్షల మందిని ‘లఖ్పతి దీదీ’లుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేసింది.యువతకు ఉపాధినిరుద్యోగ సమస్యపై ప్రధానంగా ఫోకస్ పెట్టిన కమలనాథులు.. నిరుద్యోగ యువతకు నెలకు రూ.3,000 భృతి ఇస్తామని ప్రకటించారు. రాబోయే ఐదేళ్లలో కోటి కొత్త ఉద్యోగాలు, స్వయం ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని హామీ ఇచ్చారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు 5 లక్షల మంది యువతకు చెరో రూ.10 లక్షల ఆర్థిక సాయం (సగం గ్రాంట్, సగం వడ్డీ లేని రుణం) అందించనున్నామని తెలిపారు.బెంగాలీ సంస్కృతి పరిరక్షణతమను బయటి వ్యక్తులుగా ముద్రవేస్తున్న టీఎంసీ వాదనను తిప్పికొడుతూ.. బెంగాలీ ఆత్మగౌరవాన్ని కాపాడతామని బీజేపీ స్పష్టం చేసింది. ఇందులో భాగంగా వందేమాతరం మ్యూజియం, ఠాగూర్ కల్చరల్ సెంటర్ల ఏర్పాటుతో పాటు అన్ని శక్తిపీఠాలను కలుపుతూ ప్రత్యేక సర్క్యూట్ అభివృద్ధి చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది.మౌలిక సదుపాయాల అభివృద్ధిరాష్ట్రంలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తూ.. తాజ్పూర్, కుల్పిలో ఆధునిక డీప్-సీ పోర్టులను నిర్మిస్తామని బీజేపీ తెలిపింది. సుందర్బన్స్ నుండి డార్జిలింగ్ వరకు నేరుగా జాతీయ రహదారితో పాటు, ఉత్తర బెంగాల్లో నాలుగు కొత్త నగరాల నిర్మాణాన్ని తమ ‘సంకల్ప్ పత్ర’లో ప్రముఖంగా పొందుపరిచింది.ఇది కూడా చదవండి: ‘కుంభమేళా మోనాలిసా’ పెళ్లి.. చిక్కుల్లో సీపీఎం నేతలు -
దుర్గా స్టాలిన్ ఎంట్రీతో రాజకీయాల్లో హీట్
సాక్షి,చైన్నె : తమిళనాడు ఎన్నికల చరిత్రలో ఇప్పటివరకు ఏ అభ్యర్థి తరపున నేరుగా ఓట్లు అడగని సీఎం స్టాలిన్ సతీమణి దుర్గా స్టాలిన్ తొలిసారిగా శీర్గాలి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డీఎంకే కూటమి తరపున ఎండీఎంకే అభ్యర్థిగా సెంథిల్ సెల్వన్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఆమె ఇంటింటికీ తిరుగుతూ ‘ఉదయ సూర్యుడు’ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.ప్రప్రథమంగా..సాధారణంగా దుర్గా స్టాలిన్ రాజకీయాలకు దూరంగా ఉంటారు. కేవలం ఆలయ సందర్శనలకే పరిమితం అవుతుంటారు. గతంలో ఓ మారు కొళత్తూరులో తన భర్త స్టాలిన్ తరపున మహిళా ఓటర్లను కలిశారు. ఈ పరిస్థితులలో తాజాగా ఆమె నేరుగా ప్రచార రంగంలోకి దిగడం గమనార్హం.శీర్గాలి సెంటిమెంట్తమిళనాడు రాజకీయాల్లో శీర్గాళి నియోజకవర్గానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తుందే, ఆ పార్టీయే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్న బలమైన నమ్మకం. దీనిని ‘దీర్ఘదర్శి నియోజకవర్గం’ అని కూడా పిలుస్తారు. అంటే రాష్ట్ర భవిష్యత్తును ఈ నియోజకవర్గ ఫలితం ముందుగానే చెబుతుందని అర్థం.ఎండీఎంకే అభ్యర్థి.. డీఎంకే గుర్తువాస్తవానికి ఈ సీటు కూటమిలో ఎండీఎంకే పార్టీకి దక్కింది. వారు సొంత గుర్తుపై పోటీ చేస్తామని తొలుత ప్రకటించినా, చివరకు సెంటిమెంట్ దృష్ట్యా, డీఎంకే గుర్తు అయిన ‘ఉదయ సూర్యుడు’ పైనే అభ్యర్థిని నిలబెట్టారు. ఇక్కడ గెలిస్తేనే డీఎంకే మళ్లీ అధికారంలోకి వస్తుందనే నమ్మకంతో స్టాలిన్ దంపతులు ఈ నియోజకవర్గాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సీఎం స్టాలిన్ కూడా నాగపట్నంలో జరగాల్సిన సభను రద్దు చేసుకుని మరీ శీర్గాళిలో బహిరంగ సభ నిర్వహించారు. ‘నేను ఈ ఊరి అల్లుడిగా ఓటు అడగడానికి వచ్చాను’ అని స్టాలిన్ ఇప్పటికే వ్యాఖ్యలు చేశారు. దుర్గా స్టాలిన్ తన స్వగ్రామం తిరువెంకాడు ఈ నియోజకవర్గ పరిధిలోనే ఉండటంతో, తాను ఈ ఊరి కోడలినని, తన ఊరి ప్రజలు తమ పార్టీని ఆశీర్వదించాలని కోరడం విశేషం. సెంటిమెంట్‌ను బలంగా నమ్మే దుర్గా స్టాలిన్ స్వయంగా రంగంలోకి దిగడంతో, ఈసారి శీర్గాళి సెంటిమెంట్ పలికి మళ్ళీ డీఎంకే అధికారంలోకి వస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. -
West Bengal: ‘పీకే’ లేని పందెం.. మమత హ్యాట్రిక్ కొడతారా?
అసెంబ్లీ ఎన్నికలు పశ్చిమ బెంగాల్ రాజకీయాలను మరింత వేడెక్కించాయి. ఈ ఎన్నికల సంగ్రామం పైకి పాత కథలాగే కనిపిస్తున్నా, లోపల మాత్రం అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకవైపు సంక్షేమం, ప్రాంతీయ అస్తిత్వం నినాదంతో మమతా బెనర్జీ.. మరోవైపు జాతీయ నాయకత్వం, బెంగాల్ మార్పు నినాదంతో ప్రధాని నరేంద్ర మోదీ తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈసారి కూడా ప్రధాన పోరు తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల మధ్యే నెలకొంది. అయితే గత ఎన్నికల్లో భారీ విజయానికి కారణంగా నిలిచిన వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు దీదీ పక్కన లేరు. ఆయన మార్క్ వ్యూహాలు లేకుండా తృణమూల్ తిరిగి కాషాయ దళాన్ని నిలువరించగలదా? ఇదే ఇప్పుడు బెంగాల్ నుంచి ఢిల్లీ పీఠం వరకూ ఉత్కంఠ రేపుతున్న ప్రధాన ప్రశ్న.భవానీపూర్‌లో హై ఓల్టేజ్2026, ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు విడతలుగా జరగనున్న ఈ అత్యంత కీలకమైన ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మే 4న వెలువడనున్నాయి. మొత్తం 294 స్థానాలకు గానూ 291 స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ నేరుగా పోటీ చేస్తుండగా, మిగిలిన మూడు డార్జిలింగ్ హిల్ సీట్లను తన మిత్రపక్షమైన బీజీపీఎంకు కేటాయించింది. భవానీపూర్ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బీజేపీ అభ్యర్థి సువేందు అధికారిపై మరోసారి హై-వోల్టేజ్ పోరుకు సిద్ధమయ్యారు. సువేందు అదనంగా తన పాత స్థానమైన నందిగ్రామ్ నుంచి కూడా పోటీకి దిగడం విశేషం.వ్యూహాన్ని మార్చిన బీజేపీమార్చి 17న వెలువడిన టీఎంసీ అభ్యర్థుల జాబితాలో మధుజ, మదన్ మిత్ర, ఫిర్హాద్ హకీమ్ లాంటి సీనియర్ నేతలకు చోటు దక్కింది. సామాజిక సమీకరణల్లో భాగంగా ఏకంగా 52 మంది మహిళలకు, 95 మంది ఎస్సీ, ఎస్టీలకు దీదీ అవకాశం కల్పించారు. ‘ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మేము కచ్చితంగా 226 కు పైగా సీట్లు సాధిస్తాం’ అని మమతా బెనర్జీ అత్యంత ధీమాగా చెబుతున్నారు. మరోవైపు, 2021లో ‘200 పార్’ నినాదంతో బరిలోకి దిగి వెనుకబడిన బీజేపీ, ఈసారి వ్యూహాన్ని మార్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్‌కతా సభలో మాట్లాడుతూ ‘మేము ఒకదాని తర్వాత ఒకటిగా 170 సీట్లు గెలుచుకుంటాం, ఆ తర్వాతే బెంగాల్లో అసలైన మార్పు వస్తుంది’ అని సవాల్ విసిరారు.సంక్షేమ పథకాల సాయంతో..ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ‘భయం లేని బెంగాల్’ నినాదంతో పట్టణ, హిందూ మెజారిటీ ప్రాంతాల్లో బీజేపీ తీవ్రంగా శ్రమిస్తోంది. కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీల ప్రభావం ఉన్నప్పటికీ ప్రధానంగా శాంతిభద్రతల సమస్యలు, నిరుద్యోగంపై అధికార పార్టీని బీజేపీ నిలదీస్తోంది. దానికి ధీటుగా టీఎంసీ ‘లక్ష్మీర్ భండార్’ వంటి ప్రజాదరణ పొందిన సంక్షేమ పథకాలను నమ్ముకుంది. ఓటర్ల జాబితా సవరణలను దీటుగా ఎదుర్కొనేందుకు తమ బూత్ స్థాయి ఏజెంట్లను తిరిగి చురుగ్గా రంగంలోకి దించింది. రెండు దశల్లోనే ఎన్నికలు ఉండటంతో, ఇరు పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి.కుదిపేసిన బొగ్గు కుంభకోణంఎన్నికల ప్రచారం ఊపందుకోకముందే, జనవరి నెలలో జరిగిన ఒక నాటకీయ పరిణామం రాష్ట్ర రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసింది. 2020 నాటి బొగ్గు కుంభకోణం కేసుకు సంబంధించి కోల్‌కతాలోని ఐ-ప్యాక్ ప్రధాన కార్యాలయాలతో పాటు, దాని చీఫ్ ప్రతీక్ జైన్ ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. అయితే, తమ ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల రహస్య డేటాను దొంగిలించేందుకే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కక్షపూరితంగా ఈ దాడులు చేయిస్తున్నారని మమతా బెనర్జీ ఆరోపించారు. ఏకంగా రాష్ట్ర పోలీసులతో కలిసి దాడులు జరుగుతున్న ప్రాంతానికి ఆమె స్వయంగా చేరుకుని, కీలక పత్రాలను సీజ్ చేయకుండా ఈడీ అధికారులను అడ్డుకున్నారు. దీనిని రాజకీయ కక్షసాధింపు చర్యగా అభివర్ణించి, కోల్‌కతాలో భారీ నిరసన చేపట్టారు.నాడు ఐ-ప్యాక్ అండతో..అయితే విచారణకు ఆటంకం కలిగించారని ఈడీ ఆరోపించగా, ఈ వివాదంపై సుప్రీంకోర్టు స్పందిస్తూ, ఈడీ అధికారుల విధులకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దని బెంగాల్ ప్రభుత్వాన్ని కఠినంగా హెచ్చరించాల్సి వచ్చింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 38 శాతం ఓట్లతో 77 సీట్లు గెలుచుకున్న బీజేపీ గట్టి పోటీనిచ్చినా, 213 సీట్లతో దీదీ తన ఆధిపత్యాన్ని ,చెక్కుచెదరనీయలేదు. ఆ చారిత్రక విజయంలో ప్రశాంత్ కిషోర్‌తో పాటు, ఆయన సంస్థ ఐ-ప్యాక్ పోషించిన పాత్ర అసాధారణం. ‘దీదీ కే బోలో’ లాంటి వినూత్న కార్యక్రమాలను కేవలం ప్రచారానికే పరిమితం చేయకుండా, క్షేత్రస్థాయి సమస్యలను ప్రణాళికాబద్ధంగా గుర్తించి వాటిని ప్రభుత్వ విధానాలుగా, హామీలుగా మార్చడంలో ఐ-ప్యాక్ ఒక పటిష్టమైన డేటా వ్యవస్థలా పనిచేసింది.ఏం జరగనుంది?.. సర్వత్రా ఉత్కంఠఅయితే ప్రశాంత్ కిషోర్ బీహార్‌లో సొంతంగా ‘జన్ సురాజ్ పార్టీ’ పెట్టుకుని రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. (ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు). ఈ 2026 ఎన్నికల్లో ఐ-ప్యాక్ ఇప్పటికీ టీఎంసీకి వ్యూహాత్మక భాగస్వామిగానే కొనసాగుతున్నప్పటికీ, గత ఎన్నికల్లో పీకే స్వయంగా నడిపించిన ఆ పదునైన వ్యూహాత్మక యంత్రాంగం ఇప్పుడు పూర్తిగా కనిపించడం లేదు. ఈ లోటు ఎన్నికల ఫలితాలపై ఎంతగా ప్రభావం చూపుతుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ కిషోర్ లాంటి దిగ్గజ వ్యూహకర్త నేరుగా లేకపోయినా, ఐ-ప్యాక్ మద్దతుతో పాటు, తనకున్న సొంత ఇమేజ్, పటిష్టమైన సంక్షేమ పథకాలతో మమతా బెనర్జీ ఈ మహా పోరును మరోసారి తనవైపు తిప్పుకుంటారో లేదో వేచి చూడాలి.ఇది కూడా చదవండి: టెక్ ప్రపంచం షేక్.. ‘ఓపెన్ ఏఐ’ సంచలన ప్రతిపాదన! -
మోదీ పొలిటికల్ గేమ్
సాక్షి, న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ల అంశంపై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సుదీర్ఘ కాలం మౌనంగా ఉండి, ఇప్పుడు అకస్మాత్తుగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేయడం వెనుక కేవలం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలనే కుతంత్రం దాగి ఉందని మండిపడ్డారు. శుక్రవారం ఢిల్లీలోని ఇందిరా భవన్లో జరిగిన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం (సీడబ్ల్యూసీ)లో ఆయన ప్రారం¿ోపన్యాసం చేశారు. కేంద్రం వైఖరిని ఎండగట్టారు. సమావేశంలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, సంస్థాగత వ్యవహారాల ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుక్కు, కీలక నేతలు ప్రియాంకా గాం«దీ, జైరాం రమేష్, సల్మాన్ ఖుర్షీద్, అంబికా సోనీ, సచిన్ పైలట్, భూపేశ్ బఘేల్ పాల్గొన్నారు. అమలు లేని రిజర్వేషన్ ఎందుకు?... ‘ఏప్రిల్ 16 నుంచి 18వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి అధికారిక ప్రతిపాదన రాలేదు. ప్రధాని రాసే వ్యాసాలు చదివి కొన్ని విషయాలు తెలుసుకోవాల్సి వస్తోంది. మాకు అందిన సమాచారం ప్రకారం.. ఈ రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కేవలం ఈ ఎన్నికల్లో లబ్ది కోసమే ఈ బిల్లును తెస్తున్నారు’అని ఖర్గే విమర్శించారు. డీలిమిటేషన్ వెనుక కుట్ర... లోక్‌సభ సీట్లను 543 నుంచి 816కు పెంచాలన్న ప్రతిపాదనపై ఖర్గే తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు సంబంధించి ప్రభుత్వం ముందుకు తెచ్చిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ తీవ్ర విపరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. ‘డీ లిమిటేషన్ ప్రతిపాదన అత్యంత ప్రమాదకరమైంది. దీనిపై లోతైన చర్చ జరగాలి. బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో ఎంపీలు బిజీగా ఉన్న సమయంలో సమావేశాలు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవడం నిబంధనల ఉల్లంఘనే. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించడం లేదు. అది హోంశాఖ కింద పనిచేసే ఒక విభాగంలా మారిపోయింది. అందుకే ఈ కోడ్ ఉల్లంఘనలను వారు పట్టించుకుంటారని మేం ఆశించడం లేదు’అని ఘాటుగా వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సీడబ్ల్యూసీలో తీర్మానం చేశాం మహిళా సాధికారత విషయంలో తమకు ఎవరి సరి్టఫికెట్లు అవసరం లేదని ఖర్గే స్పష్టం చేశారు. ‘స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చొరవతో తెచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణల వల్లే నేడు స్థానిక సంస్థల్లో 14.5 లక్షల మంది మహిళలు ప్రతినిధులుగా ఉన్నారు. 2023లోనే ఈ బిల్లుపై మేం హైదరాబాద్ సీడబ్ల్యూసీలో తీర్మానం చేశాం. సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ అనేకసార్లు ప్రధానికి లేఖలు రాశారు. జనగణన, డీ లిమిటేషన్ పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే రిజర్వేషన్లు అమలు చేయాలి’అని డిమాండ్ చేశారు. పశ్చిమ ఆసియా సంక్షోభం వల్ల తలెత్తిన ఆర్థిక ఒత్తిడిపై విపక్షాలతో కలిసి ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళ్తాం’అని ఖర్గే వెల్లడించారు. వచ్చే వారం ప్రతిపక్ష నేతలతో ఖర్గే భేటీ ప్రభుత్వం తలపెట్టిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చించేందుకు ప్రతిపక్ష నేతలతో సమావేశం జరపనున్నట్లు కాంగ్రెస్ శుక్రవారం తెలిపింది. మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి కాకుండా నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశాన్ని ఈ సమావేశాల్లో చర్చించనున్నట్లు ప్రభుత్వం చెబుతోందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ చెప్పారు. అయితే, ఇందుకు సమాచారాన్ని ప్రభుత్వం ఇంతవరకు ప్రతిపక్షాలకు అందజేయలేదని ఆరోపించారు. ఈ నెల 15వ తేదీన కాంగ్రెస్ చీఫ్ ఖర్గేఅధ్యక్షతన ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశం జరుగుతుందన్నారు. -
ఆరు నెలల్లోనే ఉమ్మడి పౌరస్మృతి
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వస్తే ఆరు నెలల్లోనే ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు చేస్తామని బీజేపీ ప్రకటించింది. పొరుగుదేశాల నుంచి చొరబాట్లకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తామని స్పష్టంచేసింది. రాష్ట్రంలో ప్రధానంగా మహిళలు, యువత, రైతులు, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని వెల్లడించింది. వారి కోసం సంక్షేమ పథకాలను విస్తరింపజేస్తామని హామీ ఇచ్చింది. బెంగాల్లో బీజేపీ మేనిఫెస్టో ‘సంకల్ప పత్ర’ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుక్రవారం విడుదల చేశారు. సోనార్ బంగ్లా(బంగారు బెంగాల్)కు ఇదొక రోడ్ మ్యాప్ అని ఆయన అభివరి్ణంచారు. అవినీతి, రాజకీయ హింస, చొరబాట్లు, నిరుద్యోగ సమస్యకు ఈ అసెంబ్లీ ఎన్నికలు ఒక రెఫరెండమ్ అని తేల్చిచెప్పారు. మహిళలకు ఉచిత ప్రయాణం రాష్ట్ర సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేస్తామని బీజేపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ప్రభుత్వ భూముల్లో తిష్టవేసిన ఆక్రమణదారులను, చొరబాటుదార్లను అక్కడి నుంచి వెళ్లగొడతామని పేర్కొన్నారు. ఆయా భూములకు విముక్తి కల్పిస్తామని తెలిపారు. ప్రజా రవాణా సంస్థ వాహనాల్లో మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు రూ.15,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అధికార పార్టీ అవినీతి వ్యవహారాలు, ఉపాధ్యాయ నియామకాల్లో కుంభకోణం వల్ల ఉద్యోగాలు కోల్పోయినవారికి ఐదేళ్లపాటు వయసు సడలింపు ఇస్తామని చెప్పారు. ఉద్యోగాలను పారదర్శకంగా, నైపుణ్యాల ఆధారంగా భర్తీ చేస్తామని స్పష్టంచేశారు. అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే ఉద్యోగుల కోసం ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సులు అమలు చేస్తామని వెల్లడించారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఏటా రూ.9,000 చొప్పున అందజేస్తామని పేర్కొన్నారు. చేపలు, గుడ్లపై నిషేధం ఉండదు: అమిత్ షా బీజేపీ అధికారంలోకి వస్తే బెంగాలీ బిడ్డనే పశ్చిమ బెంగాల్‌కు ముఖ్యమంత్రిని చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. బీజేపీకి అధికారం అప్పగిస్తే చేపలు, గుడ్లపై నిషేధం విధిస్తారంటూ కొందరు దు్రష్పచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి నిషేధం ఉండదని స్పష్టంచేశారు.బీజేపీ సంకల్ప పత్రలో కీలకాంశాలు.. → బెంగాల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు కోసం చట్టం. → అక్రమ వలసలపై కఠిన చర్యలు. పశువుల అక్రమ రవాణాకు అడ్డుకట్ట. → ప్రజలు తమకు నచ్చిన మతాన్ని స్వేచ్ఛగా ఆచరించేలా చట్టం. → మహిళలకు ప్రతినెలా రూ.3,000 చొప్పున ఆర్థిక సాయం. వారి సాధికారతకు చేయూత. → పోలీసు శాఖలో ప్రత్యేకంగా మహిళా బెటాలియన్ ‘దుర్గా సురక్ష స్క్వాడ్’ఏర్పాటు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు. → కోటి మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించేదాకా నెలకు రూ.3,000 చొప్పున ఆర్థిక సాయం. → ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం కేంద్ర రేట్లకు అనుగుణంగా మార్పు. ఏడో వేతన కమిషన్ సిఫార్సుల అమలు. → 15 ఏళ్ల తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలు, దిగజారిన శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల. → కట్ మనీ(చట్టవిరుద్ధమైన కమిషన్లు/లంచాలు) సంస్కృతికి చరమగీతం. సిండికేట్ వ్యవస్థ అంతం. → ఆయుష్మాన్ భారత్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు బెంగాల్లోనూ అమలు. ఉత్తర బెంగాల్ జిల్లాల్లో ఎయిమ్స్, ఐఐటీ, ఐఐఎం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ డిజైన్ ఏర్పాటు. → వరి, బంగాళదుంప, మామిడి పండించే రైతులకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రోత్సాహకాలు. పంటలకు గిట్టుబాటు ధరలు. → రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్లోకి కుర్మాలీ, రాజ్‌బన్షీ భాషలు. → అత్యున్నత పారిశ్రామిక హబ్‌గా బెంగాల్ అభివృద్ధి. అతిపెద్ద చేపల ఎగుమతి కేంద్రం ఏర్పాటు. → పాత తేయాకు తోటల పునరుద్ధరణ. డార్జీలింగ్ తేయాకుకు గ్లోబల్ బ్రాండ్ గుర్తింపు లభించేలా చర్యలు. జనపనార పరిశ్రమ ఆధునీకరణ. → రాష్ట్రంలో వందేమాతరం మ్యూజియం నిర్మాణం. -
యూపీనుంచి 50వేలమంది, పామునైనా నమ్మొచ్చేమో గానీ : మమత మండిపాటు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతున్న నేపథ్యంలో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని తెంతులియాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈశాన్య రాష్ట్రమైన అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఓటర్ల మద్దతుపై నమ్మకం లేక, బీజేపీ బయటి వ్యక్తులను రప్పించిందని ఆమె ఆరోపించారు.బీజేపీపై ఘాటు విమర్శలుఅయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అస్సాంలో 126 మంది సభ్యులున్న అసెంబ్లీకి ఏప్రిల్ 9, గురువారం నాడు ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. ఈ సందర్బంగా అస్సాం ఎన్నికల సరళిపై మమతా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశంలోని ఏ దర్యాప్తు సంస్థా తటస్థంగా లేదని, కాషాయ పార్టీ వాటన్నింటినీ కొనేసిందని ఆరోపించారు. పామునైనా నమ్మవచ్చు కానీ, బీజేపీని మాత్రం నమ్మలేము అంటూ దీదీ ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్ నుండి సుమారు 50వేల మందిని రైళ్లలో అస్సాంకు తీసుకువచ్చారని మమతా బెనర్జీ ఆరోపించారు. పశ్చిమ బెంగాల్లో కూడా ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేయాలని బీజేపీ చూస్తోందని, అందుకే ఎన్నికల కమిషన్ ద్వారా అధికారులను బదిలీ చేయిస్తోందని విమర్శించారు. ఎన్నికల కోసం డబ్బు, మాదకద్రవ్యాలు, బయటి వ్యక్తులతో ఓటింగ్, లాంటి అక్రమాలకు తెగబడుతోందన్నారు. అయితే తమ కార్యకర్తలు వాటిని ఎదుర్కొని విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ వివాదంపశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుంచి 90 లక్షల పేర్లను తొలగించారని, ఒక వార్తాపత్రిక నివేదిక ప్రకారం, తొలగించిన 90 లక్షల పేర్లలో 60 లక్షలు హిందువులవి, 30 లక్షలు ముస్లింలవి అని కూడా బెనర్జీ అన్నారు. బీజేపీని ఎన్నడూ నమ్మకూడదని బెనర్జీ అన్నారు. అస్సాంలో జరిగిన ఎన్ఆర్సి ప్రక్రియలో తొలగించిన 19 లక్షల పేర్లలో 13 లక్షలు హిందువులు, 6 లక్షలు ముస్లింలు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రంలోని మొత్తం 294 స్థానాల్లో తనను టీఎంసీ అభ్యర్థిగా పరిగణించాలని ఓటర్లను కోరుతూ, "నా నాయకత్వంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం కావాలంటే, అన్ని స్థానాల్లో నేనే అభ్యర్థిని" అని బెనర్జీ అన్నారు. ఓటర్ల జాబితా నుంచి అనేక షెడ్యూల్డ్ కులాల వారి పేర్లను తొలగించారని, అలాగే తన నియోజకవర్గంలో కూడా ఓటర్ల పేర్లను తొలగించారని టీఎంసీ అధినేత్రి ఆరోపించారు. అయినా తనకు బెంగాల్ ప్రజలపై నమ్మకం ఉందన్నారు.ఇదీ చదవండి: షుగర్ పేషెంట్లు బొప్పాయి పచ్చిది తినాలా? పండుది తినాలా?బీజేపీ ప్రభుత్వం బెంగాల్ ప్రజలు ఏం తినాలో, ఏం తినకూడదో నిర్దేశిస్తుందని ఆమె మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజల మాంసాహార అలవాట్లపై ఆంక్షలు విధిస్తుందని ఆరోపించారు.అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ వలస కార్మికులపై దాడులు జరుగుతున్నాయని, అక్కడ వారిని రక్షించలేని ప్రధాని మోదీ, ఇక్కడ 'సోనార్ బంగ్లా' (బంగారు బెంగాల్) నిర్మిస్తామనడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ ప్రజలకు భద్రత కల్పించిన తర్వాతే మాత్రమే 'సోనార్ బంగ్లా' గురించి మాట్లాడాలన్నారు. (నల్లగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త హత్య .. కట్ చేస్తే!) -
పశ్చిమబెంగాల్లో బీజేపీ మేనిఫెస్టో విడుదల
కోల్‌కాతా: పశ్చిమబెంగాల్లో మహిళలు, యువత లక్ష్యంగా బీజేపీ తన మేనిఫెస్టో విడుదల చేసింది. పలు వర్గాలను ఆకట్టుకునేలా బీజేపీ హామీలు ఇచ్చింది. ఇంటికి పెద్దగా ఉన్న మహిళకు నెలకు రూ.3 వేలు ఆర్థిక ప్రోత్సాహకం ప్రకటించింది. ప్రభుత్వ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తామని బీజేపీ హమీ ఇచ్చింది. మేనిఫెస్టోను విడుదల చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. 15 ఏళ్ల మమతా బెనర్జీ పాలనపై ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారన్నా అమిత్ షా.. బెంగాల్లో చీకటి పాలన ముగుస్తుందన్నారు.వికసిత్ బెంగాల్ రోడ్‌మ్యాప్‌ను మేనిఫెస్టోలో పెట్టాం. పేదలకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ అమలు చేస్తామన్న అమిత్ షా.. రైతుల సంక్షేమం, యువత ఉపాధి అవకాశాలపై కీలక హామీలు ఇచ్చారు. మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చాక బెంగాల్లో యూసీసీ అమలు చేస్తామని తెలిపారు.భయం లేని బెంగాల్.. పునర్నిర్మాణమే తమ లక్ష్యం అన్న అమిత్ షా.. బీజేపీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చొరబాటుదారుల ఏరివేత.. 7వ పే కమిషన్ అమలు చేస్తామని తెలిపారు. ‘‘ఆరు నెలల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు డిఏ చెల్లిపులు. మహిళలకు ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్. రాజకీయ హింస కేసులపై ముమ్మర దర్యాప్తు. బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్ కోసం భూముల కేటాయింపు. ఆవుల స్మగ్లింగ్ నిలిపివేస్తాం. దుర్గా సురక్ష స్క్వాడ్ ఏర్పాటు’’ చేస్తామని అమిత్ షా తెలిపారు. -
ఓటెత్తిన కేరళ
తిరువనంతపురం: కేరళ 16వ అసెంబ్లీ ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. 78.12% మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఓటేసిన ప్రముఖుల్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్, కాంగ్రెస్ నేత సతీశన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపి, బీజేపీ రాష్ట్ర చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ తదితరులున్నారు. ఉదయం 7 గంటలకు మొదలైన సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) రతన్ యూ కేల్కర్ తెలిపారు. అక్కడక్కడా సాంకేతిక లోపాలు తలెత్తాయన్నారు. రెండు పోలింగ్ బూత్‌లలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైందన్నారు. ప్రస్తుత సరళిని బట్టి చూస్తే 90 శాతం వరకు ఓటింగ్ నమోదయ్యే అవకాశాలున్నాయని అంచనా వేశారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 74.06 శాతం మంది ఓటేయగా, ఈసారి అంతకుమించి తరలిరావడం విశేషం. అసెంబ్లీలోని మొత్తం 140 నియోజకవర్గాల్లో 2.71 కోట్ల ఓటర్లున్నారు. 1987 ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డుస్థాయిలో 80.54 శాతం ఓటింగ్ నమోదైంది. మరోసారి భారీగా ఓటింగ్ నమోదు కావడంపై వివిధ పార్టీలు తమకు అనుకూలమైన విశ్లేషణలు విన్పిస్తున్నాయి. సర్ ప్రక్రియ వల్లే ఈ స్థాయిలో ఓటర్లు తరలివచ్చారని సీపీఎం నేత మోహనన్ పేర్కొన్నారు. గతంలో ఓటింగ్ శాతాలు భారీగా ఉన్నప్పుడు ఫలితాలు యూడీఎఫ్‌కే అనుకూలంగా వచ్చాయని కాంగ్రెస్ నేత దీప్తి మేరీ వర్గీస్ గుర్తు చేశారు. అయితే, ఈ దఫా మహిళలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడం వల్లే ఓటింగ్ శాతం పెరిగినట్లు బీజేపీ నేత షైజు విశ్లేషించారు. ఇది తమ పారీ్టకి అనుకూల అంశమన్నారు.పుదుచ్చేరిలో 89.87%పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీకి గురువారం జరిగిన పోలింగ్‌లో ఏకంగా 89.87 శాతం పోలింగ్ నమోదైంది. 1964లో ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొంది, భారత్‌లో విలీనమయ్యాక పుదుచ్చేరిలో దాదాపు 90 శాతం మంది ఓటర్లు తరలివచ్చి ఓటేయడం ఇదే మొదటిసారి. గతంలో ఇక్కడ జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలన్నిటిలోనూ ఇదే రికార్డని చీఫ్ ఎలక్టోరల్ అధికారి పి.జవహర్ తెలిపారు. ఇది చరిత్రాత్మకం, అసాధారణమని ఆయన పేర్కొన్నారు. ఒక్క స్వల్ప ఘటన మినహా పుదుచ్చేరి, కారైకాల్ మొత్తమ్మీద పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. మొత్తం 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ప్రారంభమైన ఉదయం 7 గంటలకే జనం పోలింగ్ బూత్‌ల వద్దకు చేరుకున్నారు. ఎండలు మండిపోతున్నా లెక్కచేయలేదు. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న వారిని ఓటు వేసేందుకు అవకాశమి చ్చారు. సీఎం ఎన్.రంగస్వామి, లోక్‌సభ ఎంపీ వీ వైతిలింగం, డీఎంకే నేత ఆర్.శివ, హోంమంత్రి నమశ్శివాయం ఓటు వేసిన వారిలో ఉన్నారు. అస్సాంలో 85% మైనారిటీల ప్రాబల్యమున్న చోట్ల 90 శాతంపైనే గువాహటి: అస్సాం అసెంబ్లీకి గురువారం జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం 5 గంటల నాటికి 85.64 శాతం మంది ఓటేశారని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొత్తం 126 స్థానాలకు ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గత 2021లో జరిగిన ఎన్నికల్లో 82.04 శాతం ఓటింగ్ నమోదైంది. 2016 శాతం అత్యధికంగా 84.72 మంది ఓటేయడం రికార్డు నెలకొల్పింది. రాష్ట్ర ప్రజలు ఈదఫా గత రికార్డును తిరగరాయడం విశేషం. ఓ వైపు వర్షం కురుస్తున్నా జనం లెక్క చేయలేదు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని ఈసీ పేర్కొంది. దాల్గావ్ నియోజకవర్గంలో అత్యధికంగా 95.83 శాతం మంది ఓటేయగా, అత్యల్పంగా న్యూ గువాహటిలో 72.10 మంది ఓటేశారు. మైనారిటీల ప్రాబల్యమున్న 19 నియోజకవర్గాల్లో 90 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. 2023లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనంతరం రాష్ట్రంలో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికలివి. గురువారం సీఎం హిమంత బిశ్వ శర్మ, భార్య, పిల్లలతో కలిసి వచ్చి కామ్రూప్ (మెట్రో) గారాల్ బునియాదీ స్కూల్ బూత్‌లో ఓటేశారు. జోర్హాత్లోని డీసీబీ స్కూల్ బూత్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ ఓటేశారు. ఓటేసిన మరికొందరు ప్రముఖుల్లో కేంద్ర మంత్రి పబిత్రా మర్ఘరెటా, ప్రతిపక్ష నేత దేబబ్రత సైకియా తదితరులున్నారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలిరావడంపై రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ గౌరవ్ గొగోయ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు మార్పును, నయా అస్సాంను కోరుకుంటున్నారనేందుకు ఇదే సంకేతమని విశ్లేషించారు. ఓటరు శాతం భారీగా నమోదు కావడాన్ని చారిత్రక పరిణామంగా సీఎం హిమంత అభివరి్ణంచారు. ఫలితం ఇప్పటికే నిర్ణయమైపోయిందని వ్యాఖ్యానించారు. తమ పాలన పట్ల ప్రజలు సంతృప్తి, సంతోషాన్ని వ్యక్తం చేశారన్నారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న పోలింగ్ సంబంధిత ఘర్షణల్లో 30 మంది గాయపడినట్లు ఐజీ అఖిలేశ్ కుమార్ తెలిపారు. -
ఓటర్లను పలకరించిన ‘నీల’
పుదుచ్చేరి: ఓటర్లలో ఉత్సాహం కల్గించేందుకు ఎన్నికల అధికారులు ఓ వినూత్న ప్రయోగం చేపట్టారు. రోబోను రంగంలోకి దించారు. నీలం అనే పేరుగల ఈ రోబో లంగా ఓణీతో పూలున్న ప్లేట్‌ను చేతులతో పట్టుకుని క్యూలో నిలబడ్డ ఓటర్లకు ఆహ్వానం పలుకుతూ, వారిని పలకరిస్తూ పోలింగ్ బూత్ వరండాలో ముందుకు సాగింది. ఓటుహక్కు వినియోగించుకోవాలని, వంద శాతం ఓటింగ్ నమోదు చేయాలని కోరింది. పుదుచ్చేరిలోని రాజ్‌భవన్ నియోజకవర్గంలో వీవోసీ ప్రభుత్వ సెకండరీ స్కూల్లో ఏర్పాటు చేసిన బూత్ వద్ద గురువారం ఈ రోబో అందరినీ ఆకర్షించింది. స్కూల్లో ఏర్పాటైన మోడల్ బూత్‌లో చెన్నై నుంచి తెప్పించిన రోబో ‘నీల’తో తాము చేపట్టిన ప్రయోగం విజయవంతమైందని జిల్లా ఎన్నికల అధికారి కుళోత్తుంగన్ చెప్పారు. ఓటర్ల నుంచి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. -
మోదీ చెప్పేవన్నీ తప్పుడు లెక్కలు
కోల్‌కతా: పశ్చిమబెంగాల్ టీఎంసీ పాలనలో మత్స్య ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి సాధించలేక పోయిందంటూ ప్రధాని మోదీ చేసిన విమర్శలపై సీఎం మమతా బెనర్జీ దీటుగా స్పందించారు. ఆయన చెబుతున్నవన్నీ తప్పుడు గణాంకాలంటూ ఎదురుదాడికి దిగారు. ‘బిహార్ అత్యధికంగా మత్స్య ఉత్పత్తులను ఎగుమతి చేస్తుండగా బెంగాల్లో వెనుకబడిపోయిందంటూ ప్రధాని మోదీ విమర్శించినట్లు తెలిసింది. బీజేపీ పాలనలోని రాష్ట్రాల్లో ప్రజలను మాంసాహారం, చేపలు, గుడ్లు తిననివ్వడం లేదు. అక్కడ బీఫ్, మాసం దుకాణాలను మూసివేస్తున్నారు. అందుకే, ఆ పార్టీ అధికారంలో ఉన్న రాజస్తాన్, బిహార్, యూపీలు మాంసం, బీఫ్, చేపలను ఎక్కువగా ఎగుమతి చేస్తున్నాయి. బెంగాల్లో మాత్రం ఎక్కడ చూసినా చేపల మార్కెట్లు కనిపిస్తాయి. ఇక్కడ దొరికే మత్స్య ఉత్పత్తులను ప్రతి వారూ ఇక్కడ ఆహారంగా వాడుతారు. అందుకే, దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది’అంటూ ఆమె వివరించారు. గతంలో ఏపీ నుంచి మత్స్య ఉత్పత్తులను దిగుమతి చేసుకునేవారమని, ఇప్పుడా పరిస్థితి లేదని ఆమె అన్నారు. సొంత పార్టీ నేతలు చెప్పేవన్నీ యథాతథంగా వల్లెవేయడానికి బదులుగా, ఇలాంటి వాటిని కూడా మోదీ తెలుసుకోవాలని హితవు పలికారు. గురువారం సీఎం మమత ఉత్తర 24 పరగణాల జిల్లాలో జరిగిన పలు ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు. రాష్ట్రంలో టీఎంసీని ఓడించాలనే కుట్రతోనే సర్ ప్రక్రియలో 90 లక్షలకు పైగా ఓటర్ల పేర్లను తొలగించారని, అయినప్పటికీ విజయం ఖాయమని మమత స్పష్టం చేశారు. -
బెంగాల్‌కు ఆరు గ్యారంటీలు
హల్దియా: క్రూరత్వానికి మారుపేరైన తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని పశ్చిమ బెంగాల్ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అభివృద్ధి వైఫల్యానికి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తోందని, రాష్ట్రాన్ని వెనక్కి లాగుతోందని ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రగతి కావాలంటే బీజేపీని గెలిపించాలని సూచించారు. బెంగాల్లో తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. భయానక పాలన నుంచి బెంగాల్‌ను రక్షిస్తామని, సర్వత్రా విశ్వాసం నెలకొనే వాతావరణాన్ని సృష్టిస్తామని ప్రకటించారు. రేవు నగరం హల్దియా, అసన్సోల్తోపాటు సూరి పట్టణంలో గురువారం ఎన్నికల ప్రచార సభల్లో ప్రధానమంత్రి ప్రసంగించారు. భయానక వాతావరణం నెలకొని ఉంటే పెట్టుబడులను ఆకర్షించలేమని, విశ్వాసం ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని తేల్చిచెప్పారు. మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని నిర్మమ్(క్రూరమైన) సర్కార్‌గా అభివర్ణించారు. దేశమంతా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంటే బెంగాల్ మాత్రం వెనుకంజలోనే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. వికసిత్ బెంగాల్ స్వప్నం సాకారం కావాలంటే ఈ క్రూర ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని పేర్కొన్నారు. బెంగాల్లో బీజేపీ గెలిస్తే చేపలు, మాంసం తిననివ్వరంటూ సీఎం మమతా బెనర్జీ చేసిన ఆరోపణలను మోదీ తిప్పికొట్టారు. డిమాండ్‌కు సరిపడా చేపలను ఉత్పత్తి చేయడంలో గత 15 ఏళ్లుగా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. బీజేపీ అధికారంలోకి రాగానే చేపల ఉత్పత్తిలో బెంగాల్ స్వయం సమృద్ధి సాధించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రధాన మంత్రి ఇంకా ఏం మాట్లాడారంటే.. వందేళ్లకైనా విముక్తి లభించదు ‘‘ప్రతికూల వాతావరణంలోనూ ఈ సభకు జనం భారీగా తరలిరావడం సంతోషంగా ఉంది. ప్రభుత్వ మార్పునకు వారంతా సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఈసారి తృణమూల్ కాంగ్రెస్‌కు ఉద్వాసన తప్పదు. బీజేపీ ప్రభంజనం సృష్టించబోతోంది. పూర్బమేదినీపూర్లో గత ఎన్నికల్లో బీజేపీ 16 స్థానాలకు గాను 15 స్థానాలు గెల్చుకుంది. ఈసారి బెంగాల్ మొత్తం అదే పరిస్థితి కనిపించబోతోంది. భవానీపూర్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో సీఎం మమతా బెనర్జీ ఓడిపోతారు. తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ బెంగాల్ యువతకు తీవ్ర అన్యాయం చేసింది. ప్రైవేట్ రంగాన్ని నాశనం చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలను అమ్ముకున్నారు. ఇప్పటిదాకా చేసిన పాపాలకు గాను ఆ పార్టీకి వందేళ్లకైనా విముక్తి లభించదు. ఇకపై తృణమూల్ ముక్త్ బెంగాల్ బెంగాల్లో కట్ మనీ సంస్కృతిని, సిండికేట్రాజ్ను అంతం చేస్తాం. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో మాఫియారాజ్ చెలరేగిపోతోంది. బొగ్గు, ఇసుక, మట్టిని దోచుకుంటోంది. ప్రజలకు తీరని అన్యాయం చేస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ పాపాలు గరిష్టస్థాయికి చేరాయి. ఈ పార్టీని ఇంటికి పంపాల్సిన సమయం వచ్చింది.‘మా, మాటీ, మనుష్ ’నినాదం ఉత్తదే.. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చట్టాలకు విలువ లేకుండాపోయింది. మహా జంగిల్రాజ్దే ఇక్కడ పెత్తనం. మాల్డా జిల్లాలో ఇటీవల జ్యుడీషియల్ అధికారులను నిర్బంధించారు. చట్టవిరుద్ధంగా మనదేశంలోకి ప్రవేశించినవారి వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. రాష్ట్రంలో పాలన మారగానే చొరబాటుదార్ల పోషకులపై ప్రత్యేక దర్యాప్తు జరిపిస్తాం. ఊచలు లెక్కబెట్టిస్తాం. తృణమూల్ కాంగ్రెస్ ‘మా, మాటీ, మనుష్ ’నినాదం ఉత్తదేనని తేలిపోయింది. మా(తల్లి) రోదిస్తోంది. మనుషులు భయంతో బతుకున్నారు. ఇక్కడి భూములను చొరబాటుదార్లు ఆక్రమించారు. చొరబాటుదార్ల కారణంగా స్థానికులకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు దక్కడం లేదు. బీజేపీ సర్కార్ వచ్చాక జీ రామ్ జీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తాం. పేదలకు ఉపాధి కల్పిస్తాం’’అని ప్రధాని మోదీ ప్రకటించారు. -
బీజేపీ గెలిస్తే.. నో చేపలు, నో మాంసం,నో బెంగాలీ : మమత ధ్వజం
కోల్‌కతా: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో భాగంగా లక్షలాది ఓట్లు తొలగించడం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వ్యవహారంలో న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. తాను మళ్లీ న్యాయవాద వృత్తిలోకి అడుగుపెడుతున్నట్లుగా ఉందని తెలిపారు. మమతా బెనర్జీ ఎల్ఎల్బీ అభ్యసించారు. ఫిబ్రవరి 4న సుప్రీంకోర్టులో వాదించారు. ఎస్ఐఆర్ విషయంలో జోక్యం చేసుకోవాలని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు. బుధవారం హుగ్లీ జిల్లాలో ఎన్నికల ప్రచార సభల్లో ఆమె ప్రసంగించారు. బెంగాల్‌ను బీజేపీ, ఎన్నికల సంఘం టార్గెట్ చేశాయని, అందుకే ఓట్లు తొలగించారని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో వాదించిన తొలి ముఖ్యమంత్రిని తానేనని వెల్లడించారు. ఓట్లు తొలగించినంత మాత్రాన తృణమూల్ కాంగ్రెస్‌ను ఎవరూ ఓడించలేరని తేల్చిచెప్పారు. ఓట్ల తొలగింపును వ్యతిరేకిస్తూ కచ్చితంగా కోర్టును ఆశ్రయిస్తామన్నారు. తొలగించిన పేర్లను మళ్లీ ఓటర్ల జాబితాలో చేర్చేలా చట్టపరంగా పోరాడుతామని ప్రకటించారు. ఎస్ఐఆర్ అంశం ట్రిబ్యునల్ ఎదుట పెండింగ్‌లో ఉండగానే మొదటి దశ ఓటర్ల జాబితాను ఎలా ఖరారు చేశారంటూ ప్రశ్నించారు. ప్రజలు ఓట్లు వేయలేని పరిస్థితి ఉంటే ఇక ట్రిబ్యునల్స్‌తో ప్రయోజనం ఏమిటని పేర్కొన్నారు. మళ్లీ న్యాయవాద వృత్తి చేపట్టాలని ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాను కాబట్టి ఆ పని చేయలేనని వ్యాఖ్యానించారు. బీజేపీ గెలుపు కోసం ఈసీ ఆరాటం ఎన్నికల్లో నెగ్గడానికి బీజేపీ అడ్డదార్లు తొక్కుతోందని మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. ఓటర్ల జాబితాను తారుమారు చేస్తున్నారని, ప్రజలను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల సంఘం కూడా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు. బీజేపీ గెలుపు కోసమే ఎన్నికల సంఘం ఆరాటపడుతోందని ధ్వజమెత్తారు. బీజేపీకి పొరపాటున ఓటు వేస్తే చేపలు, మాంసం తినడం, బెంగాలీ భాష మాట్లాడడం మానుకోవాల్సి వస్తుందని ప్రజలను హెచ్చరించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రజలను గుడ్లు, చేపలు, మాంసం తిననివ్వడం లేదని చెప్పారు. బీజేపీని గెలిపిస్తే అదే పరిస్థితి బెంగాల్లోనూ వస్తుందన్నారు. నియోజకవర్గాల పునర్విభజన ముసుగులో బెంగాల్‌ను ముక్కలు చేయడానికి బీజేపీ కుట్ర పన్నిందని మమతా బెనర్జీ దుయ్యబట్టారు. బెంగాల్‌ను విడదీసి మరో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని ఆక్షేపించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల గురించి గోదీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఇదీ చదవండి: కాంగ్రెస్ విత్ డ్రా : ఆమె ఎన్నిక ఇక లాంఛనమే!భవానీపూర్‌లో మమత నామినేషన్ సీఎం మమతా బెనర్జీ బుధవారం భవానీపూర్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. మమతకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తాను భవానీపూర్‌లోనే పుట్టి పెరిగానని మమతా బెనర్జీ అన్నారు. తన జీవితం ఈ ప్రాంతంతోనే ముడిపడి ఉందన్నారు. భవానీపూర్‌తోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: వ్యాపారవేత్త హత్య: దుబాయ్‌లో భారతీయ గ్యాంగ్‌స్టర్ అరెస్ట్ -
బెంగాల్లో మళ్లీ అదే రిపీట్ అవుద్ది: మోదీ
హాల్దియా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ సీఎం మమతా బెనర్జీ ప్రభుత్వంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు గుప్పించారు. త్వరలోనే బెంగాల్లో మార్పుల రాబోతుందని చెప్పారు. మోదీ గురువారం పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.2021 ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీపై పశ్చిమ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి సాధించిన విజయాన్ని మోదీ ప్రస్తావించారు. గత ఎన్నికల్లో జరిగిన ఆ అద్భుతం ఈ సారి భవానీపూర్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా పునరావృతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు."రాష్ట్రంలోని ప్రతికూల పరిస్థితులను ఓడించాలని బెంగాల్ ప్రజలు నిర్ణయించారు. అని నేను చూశాను. ఈ ఉత్సాహం, ఉత్తేజంలోనే బీజేపీ విజయం కనిపిస్తోంది. ఇది మార్పును తీసుకువచ్చే తుపాను. ఇది టీఎంసీ సర్కారుకు వీడ్కోలు. ఐదు సంవత్సరాల క్రితం మేదినిపూర్, నందిగ్రామ్ మార్పునకు మార్గాన్ని చూపాయి. ఇప్పుడు మొత్తం పశ్చిమ బెంగాల్ అదే దారిలో నడవడం ప్రారంభించింది.ఇతర రాష్ట్రాలు ఆర్థికంగా వేగంగా ఎదుగుతున్నాయి. టీఎంసీ ప్రభుత్వం బెంగాల్ అభివృద్ధికి అడ్డంకులు సృష్టించింది. బెంగాల్లో ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కాదు. బెంగాల్‌ను అభివృద్ధి వైపుగా తీసుకెళ్లడానికి పునాదిని శక్తిమంతంగా వేసే ఎన్నికలు ఇవి. టీఎంసీ సర్కారును గద్దె దించడం అవసరం. ఇప్పుడు భారత్ వేగంగా పురోగమిస్తోంది. దేశంలో వృద్ధి వేగవంతంగా ఉందంటే అనేక రాష్ట్రాలు ముందుకు సాగుతున్నాయి. కానీ దేశం ముందుకు వెళ్తుండగా, టీఎంసీ సర్కార్ బెంగాల్‌ను వెనక్కి నెడుతోంది" అని ప్రధాన మంత్రి అన్నారు.చొరబాటుదారుల పరిశ్రమలు పెరిగాయి.. ఒకప్పుడు భారత పురోగతికి పునాది వేసిన తయారీ, వాణిజ్యాన్ని బలపరిచిన బెంగాల్‌ను టీఎంసీ అన్ని అభివృద్ధి సూచికల్లో దిగజార్చిందని మోదీ చెప్పారు. ‘ఈ పరిస్థితి మేదినిపూర్, హాల్దియా ప్రజల కంటే ఎవరికి బాగా ఎవరు తెలుసు? శతాబ్దాల క్రితమే చారిత్రక తమ్రలిప్త (Tamralipta Kingdom)తో వాణిజ్యం జరిగిన పోర్ట్ నగరం. హాల్దియా ఆధునిక భారతదేశంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాల్లో ఒకటి. కానీ ఇటీవల దశాబ్దాల్లో హాల్దియాలో కర్మాగారాలు మూతపడ్డాయి. ఒకప్పుడు దేశం నలుమూలల నుంచి ప్రజలు హాల్దియాకు వచ్చేవారు. ఇప్పుడు ఇక్కడి యువత ఉద్యోగాల కోసం అండమాన్, ఒడిశాకు వలస వెళ్తున్నారు. టీఎంసీ సర్కార్‌లో చొరబాటుదారుల పరిశ్రమలు మాత్రమే పెరిగాయి. నకిలీ పత్రాలు తయారు చేయడం, పశువుల అక్రమ రవాణా వంటి రంగాలు అభివృద్ధి చెందాయి" అని ఆయన అన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్లో 294 స్థానాలకు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. ఓట్ల లెక్కింపు మే 4న ఉంటుంది. -
ఎన్టీకే అభ్యర్థిగా ట్రాన్స్‌జెండర్ రోహిణి
విల్లివాక్కం నియోజకవర్గంలో రాజకీయ సమరం రసవత్తరంగా మారింది. డీఎంకే అభ్యర్థిగా పోటీలో ఉన్న అన్నానగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే మోహన్ వారసుడు కార్తీక్ మోహన్‌కు విల్లివాక్కం ఓటర్లు గెలుపు కిరీటాన్ని అందించేనా అన్న ఎదురు చూపులు పెరిగాయి. అలాగే టీవీకే అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆపార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జునను ఓటర్లు ఆదరించేనా అన్న చర్చ జోరందుకుంది. ఇక, ఈ ఇద్దరి మధ్య తాను సైతం అంటూ అన్నాడీఎంకే అభ్యరి్థ, మాజీ ఎంపీ ఎస్ఆర్ విజయకుమార్ దూసుకెళ్తున్నారు. తమకూ అవకాశం ఇవ్వాలని ఎన్టీకే అభ్యర్థి రోహిణి ఓట్ల వేటలో ఉన్నారు.సాక్షి, చెన్నై : చెన్నై నగరంలో విల్లివాక్కం ఒకప్పుడు దేశంలోనే అతి పెద్ద అసెంబ్లీ స్థానం. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో డీఎంకే ఐదుసార్లు విజయఢంకా మోగించింది. అన్నాడీఎంకే రెండు సార్లు, సీపీఐ రెండు సార్లు, కాంగ్రెస్, టీఎంసీలు తలా ఓ సారి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. చెన్నై నగరం విస్తరణ పరిధిలో శరవేగంగా దూసుకెళ్తున్న ప్రాంతంగా విల్లివాక్కం ఉంది. ఐసీఎఫ్ గడ్డగా రైల్వే కారి్మకుల ఓటు బ్యాంక్, తెలుగు వారి ఓటు బ్యాంక్ అత్యధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో సమరం రసవత్తరంగా సాగుతోంది. 2011 పునర్విభజన తర్వాత ఈ నియోజకవర్గం రూపురేఖలు మార్చుకుంది. ఈ పరిధిలో ఐసీఎఫ్, తిరుమంగళం, అన్నానగర్(కొంత భాగం), కెల్లీస్, ఐనావరం వంటి నగరంలో అత్యంత ముఖ్యమైనప్రాంతాలు అనేకం ఉన్నాయి. ప్రసిద్ధ రైలు పెట్టెల తయారీ కేంద్రం ఐసీఎఫ్‌తో పాటుగా సిడ్కో పారిశ్రామక వాడ, కీల్పాకం మానసిక చికిత్సాలయం వంటివి ఆధవ్ను ఆదరించేనా.. విజయ్ తమిళగ వెట్రి కళగం(టీవీకే) ఎన్నికల ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి, పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆధవ్ అర్జున ఇక్కడ పోటీ చేస్తున్నారు. యువ ఓటర్లను గురి పెట్టడమే కాదు, మహిళా ఓటర్లను ఆకర్షించే విధంగా నియోజకవర్గంలో ఆధవ్ తిష్ట వేశారు. ప్రచారంలో దూసుకెళ్తున్నారు. అదే సమయంలో గతంలో ఇక్కడ అన్నాడీఎంకే తరపున పోటీ చేసి గెలిచిన జేసీడీ ప్రభాకర్‌కు మద్దతు గణం ఇక్కడ ఉంది. తాజాగా ఆయన టీవీకేలో చేరిన దృష్ట్యా, ఆ మద్దతు తనకు కలివచ్చిందన్న ధీమాతో ఆధవ్ ఉన్నారు. టీవీకే అధినేత విజయ్ పోటీ చేస్తున్న పెరంబూరు తదుపరి ఈ విల్లివాక్కం నియోజకవర్గం ఉండటంతో తమ అధినేత చరిష్మా మరింతగా కలిసి వస్తుందన్న ధీమాతో ఆధవ్ దూసుకెళ్తున్నారు. విజయకుమార్ ఎదురీత అన్నాడీఎంకే అభ్యరి్థగా ఎస్ఎస్ఆర్ విజయకుమార్ పోటీలో ఉన్నారు. ఆయన మాజీ ఎంపీ కూడా, కూటమి బలం, పార్టీకి ఇక్కడ అనాదిగా ఉన్న రెండుకుల గుర్త మద్దతు తనను గట్టెక్కిస్తాయన్న ధీమాతో ఉన్నారు. ప్రచారంలో దూసుకెళ్లడమే కాకుండా, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు తాను ఈ పరిసరాలకు చేసిన మంచి పనులను గుర్తు చేస్తూ ముందుకెళ్తున్నారు. ఇక, సీమాన్ నాన్ తమిళర్ కట్చి( ఎన్టీకే ) అభ్యరి్థగా సామాజిక కార్యకర్త, ట్రాన్స్‌జెండర్ అయిన రోషిణిని బరిలో ఉనర్నారు.సామాజిక మార్పు కోరుకునే ఓటర్లను ఆమె ఆకట్టుకుంటున్నారు.హోరాహోరీ సమరం... విల్లివాక్కం డీఎంకే కంచుకోట. ఈ కూటమిలోని వామపక్షాలకు సైతం ఇక్కడ కారి్మక ఓటు బ్యాంక్ మరీ ఎక్కువే. అయితే ఈసారి సమీకరణాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న వెట్రి అళగన్కు ఈసారి డీఎంకే సీటు ఇవ్వలేదు. అన్నానగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంకే మోహన్ కుమారుడు కార్తీక్ మోహన్‌ను ఈసారి డీఎంకే రంగంలోకి దించింది. అధికార డీఎంకే కూటమి బలం, పటిష్ట ఓటు బ్యాంక్ గెలుపు కిరీటాన్ని కార్తీక్ ఓటర్లకు అప్పగించే అవకాశాలు ఎక్కువే. అదే సమయంలో ఆయన స్థానికేతరుడు అన్న ముద్ర ఉండటం సవాలుగా మారింది. యువకుడైన కార్తీక్‌ను గెలిపించేందుకు ఓ వైపు ఆయన తండ్రి మోహన్, మంత్రి శేఖర్‌బాబుతో పాటూ చెన్నై మేయర్ ఆర్ ప్రియ ఉరకలు తీస్తున్నారు. ఇక, కార్తీక్ కోసం స్వయంగా సీఎం స్టాలిన్ అల్లుడైన శబరీషన్ సైతం రంగంలోకి దిగి వ్యూహాలకు పదును పెట్టడం గమనార్హం.ఓటరు ఎటో ఈ నియోజకవర పరిధిలోనే ఉన్నాయి. ఇక్కడ 76947 పురుçషులు, 82785 మహిళలు, 32 మంది ఇతరులు ఓటర్లుగా ఉన్నారు. మొత్తం ఓటర్ల సంఖ్య 1,59,765గా ఉంది. వన్నియర్, నాయుడు , ఆది ద్రావిడ సామాజిక వర్గాల ఓట్లు కూడా ఇక్కడ కీలకం. వీరితో పాటు ముదలియార్ , నాడార్ ఓట్లు కూడా గెలుపోటములను ప్రభావితం చేస్తాయి. డీఎంకే వారసత్వ రాజకీయాల పై వ్యతిరేకత అన్నది ఇక్కడ పనిచేస్తుందా లేక సంక్షేమ పథకాలు కాపాడుతాయా?, అన్నాడీఎంకే పూర్వ వైభవాన్ని తెచ్చుకుంటుందా? లేక విజయ్ పార్టీ ’విజిల్’ కొత్త చరిత్ర సృష్టిస్తుందా? అన్నది ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. -
లీమా రోజ్ ఆస్తి రూ.1000 కోట్లు
సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులలో అత్యంత ధనికులుగా కొందరు జాబితాలో చేరారు. వీరిలో నంబర్ ఒన్ కోటీశ్వరరాలుగా లీమా రోజ్ ముందంజలో ఉన్నారు. ఆమె ఆస్తి రూ. 1049 కోట్లుగా తేలింది. వివరాలు.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్‌లోని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో కోటీశ్వరుల వివరాలు కొందరివి బయట పడ్డాయి. ఇందులో అత్యంత ధనవంతులైన అభ్యర్థుల జాబితాలో తొలి స్థానాన్ని లాల్గుడిలో పోటీ చేస్తున్న అన్నాడీఎంకే అభ్యర్థి లీమా రోజ్ దక్కించుకున్నారు. ఆమె ఆస్తి రూ. 1,049 కోట్లు. లాటరీ కింగ్ఙ్గా పిలవబడే శాంటియాగో మార్టిన్ భార్య లీమా రోజ్ కావడం గమనార్హం. ఈమె కేవలం 6వ తరగతి వరకే చదువుకున్నట్టు సమాచారం. ఇందులో రూ. 909 కోట్లు స్థిరాస్తులుగా ఉన్నాయి. కుటుంబ ఆస్తి అయితే, ఆమె భర్త శాంటియాగో మార్టిన్ ఆస్తుల విలువ సుమారు రూ. 4,149 కోట్లుగా పేర్కొన్నారు. తర్వాతి స్థానంలో విజయ్ సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం పార్టీ వ్యవస్థాపకుడు విజయ్ తన రాజకీయ అరంగేట్రంలోనే భారీ ఆస్తులను ప్రకటించారు. ఆయన పెరంబూర్ , తిరుచ్చి ఈస్ట్‌లో పోటీ చేస్తున్నారు. ఆయన ఆస్తి రూ. 603.20 కోట్లుగా తేలింది. వివిధ బ్యాంకుల్లో రూ. 213 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి. బీఎండబ్ల్యూ జీ7, టయోటా వెల్ఫైర్, లెక్సస్ వంటి అత్యాధునిక విలాసవంతమైన కార్లు ఆయన వద్ద ఉన్నాయి. ఆతదుపరి టీవీకేకు చెందిన ఆధవ్ అర్జున ఉన్నారు. ఆయన ఆస్థి రూ. 197 కోట్లు. జాబితాలో తొలి స్థానంలో ఉన్న లీమా రోజ్ కుటుంబానికి చెందిన వ్యక్తే ఈ ఆధవ్ అర్జున కావడం గమనార్హం. ఆయన విల్లివాక్కంలో పోటీ చేస్తున్నారు. ఇక, డిప్యూటీ సీఎం ఉదయ నిధికి రూ. 20.64 కోట్లు ఆస్తులు ఉండటం విశేషం. ఆయన తండ్రి, సీఎం స్టాలిన్ కంటే ఉదయ నిధి ఆస్తులు సుమారు మూడు రెట్లు ఎక్కువ ఉండటం ఆలోచించదగిన విషయమే. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఆస్తి రూ. 10 కోట్లు కాగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఆస్తి రూ. 34 కోట్లుగా పేర్కొన్నారు. కొంతమంది అభ్యర్థులు కిలోల కొద్దీ వెండి, కోట్లాది రూపాయల విలువైన బంగారాన్ని కలిగి ఉన్నట్లు ప్రకటించారు. ప్రధానంగా కన్యాకుమారి, దక్షిణ తమిళనాడు అభ్యర్థులు అనేక మంది వద్ద తమ వద్ద వందల సవరల బంగారం ఉన్నట్లు ప్రకటించి ఉండడం గమనార్హం. -
ప్రచారంలో శశికళ ఉద్వేగం
సాక్షి, చైన్నె : దివంగత సీఎం జే జయలలిత నెచ్చెలి శశికళ ప్రచార బాట పట్టారు. తన పురట్చి తలైవర్ మక్కల్ మున్నేట్ర కళగం అభ్యర్థులకు మద్దతుగా ప్రచారంలో దూసుకెళ్లే పనిలో పడ్డారు. దక్షిణ తమిళనాడులో ముక్కళత్తోర్ సామాజిక వర్గం అత్యధికంగాఉన్న ప్రాంతాలలో తన ప్రచారంలో శశికళ భావోద్వేగ ప్రసంగం చేస్తున్నారు. జైలు జ్ఞాపకాలు – ఆంక్షల పర్వం గురించి వివరిస్తూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు అన్నాడీఎంకే రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. తనను పార్టీ నుండి దూరం చేసేందుకు జరిగిన ప్రయత్నాలను ఆమె గుర్తు చేసుకుంటున్నారు. పార్టీని కాపాడటం కోసం బాధ్యతలు అప్పగిస్తే, తాను జైలుకు వెళ్లిన మూడవ నెలలోనే పార్టీ నుండి బహిష్కరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల జైలు జీవితం తర్వాత బయటకు వచ్చినప్పుడు కనీసం పార్టీ జెండాను కూడా వాడనివ్వలేదని, జయలలిత సమాధి వద్ద నివాళులర్పించేందుకు వెళ్తే.. మరమ్మతుల సాకుతో మండపాన్ని మూసివేసి తనను అడ్డుకున్నారని ఉద్వేగానికి లోనయ్యారు. కేవలం కార్యకర్తలను, ప్రజలను కాపాడాలని పార్టీ కోరుకుందని, కానీ కొందరు స్వార్థం కోసం తనను అరెస్టు చేయాలని పోలీసులను కూడా ఆదేశించారని ఆమె విచారం వ్యక్తం చేశారు. ద్రోహుల్ని తరిమి కొడుదామని, కొబ్బరి తోట చిహ్నంపై పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని ఆమె కోరారు. అన్నాడీఎంకేను మరో పార్టీకి తాకట్టు పెట్టేసి , స్వార్థ ప్రయోజనాల కోసం ఉవ్విళ్లూరుతున్న వారికి గుణపాఠం చెప్పాలంటే, తాను సూచించిన అభ్యర్థులను గెలిపించాలని విన్నవించారు. -
అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో ప్రారంభమైన పోలింగ్
సాక్షి, ఢిల్లీ: అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కేరళ, పుదుచ్చేరిల్లో సాయంత్రం ఆరు గంటల దాకా పోలింగ్ జరగనుంది. అస్సాంలో మాత్రం పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఐదింటికే ముగుస్తుంది. రెండు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే విడతలో కేంద్ర ఎన్నికల సంఘం పోలింగ్ నిర్వహిస్తోంది. పోలింగ్ ప్రక్రియ శాంతియుతంగా జరిగేలా చూసేందుకు ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు. మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడించనున్నారు.మూడు చోట్ల.. 296 నియోజకవర్గాల్లో మొత్తం 6.1 కోట్లకు పైగా ఓటర్లు.. తమ హక్కును వినియోగించుకోనున్నారు. అస్సాంలో మెత్తం 126 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా.. 2.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. కాంగ్రెస్ నుంచి 99 మంది, బీజేపీ నుంచి 90 మంది బరిలో ఉన్నారు. కేరళలో 140 అసెంబ్లీ స్థానాల్లో పోలింగ్ జరుగుతుండగా, 2.71 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. 31,490 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా, 9.44 లక్షల మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోబోతున్నారు. ఇక్కడ 1,099 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అస్సాంలో బీజేపీ, కేరళలో లెఫ్ట్ కూటమి హ్యాట్రిక్‌పై కన్నేశాయి. పుదుచ్చేరిలో అధికార, ప్రతిపక్ష కూటముల మధ్య పోటీ నెలకొంది.కాకినాడ:కేంద్రపాలిత యానాం (పుదుచ్చేరి) లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. బరిలో 13 మంది అభ్యర్థులు ఉండగా.. 37,972 మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్ఆర్ కాంగ్రెస్ నుండి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు, కాంగ్రెస్ నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి ఆశోక్, టివికే పార్టీ నుండి తోట రాజు పోటీ చేస్తున్నారు. యానాంలో సా.6 గంటల వరకు జరగనున్న పోలింగ్ జరగనుంది. ఇక్కడ 42 పోలింగ్ కేంద్రాలు ఎన్నికల సంఘం ఏర్పాటు చేయగా.. అధికారులు 13 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించారు. -
సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ ఇలా..
అస్సాం, కేరళం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పోలింగ్ ప్రారంభమైంది. అస్సాంలో 126, కేరళంలో 140, పుదుచ్చేరిలో 30 స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 4న జరుగుతుంది. -
గోవాలో పోండా ఉప ఎన్నిక రద్దు
పనాజీ: గోవాలోని పోండా అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికను బాంబే హైకోర్టు రద్దు చేసింది. ఉప ఎన్నిక కోసం ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం జరగాల్సిన ఉప ఎన్నిక ఒక్క రోజు ముందే రద్దయ్యింది. అయితే, బాంబే హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. గోవాలో ప్రస్తుత శాసనసభ గడువు ఏడాది లోపే ఉంది. ఈ నేపథ్యంలో ఒక అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక నిర్వహించడానికి ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్ చెల్లదని పేర్కొంటూ ఇద్దరు ఓటర్లు బాంబే హైకోర్టు గోవా బెంచ్‌లో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గోవా ధర్మాసనం న్యాయమూర్తులు జస్టిస్ వాల్మీకి మెనెజెస్, జస్టిస్ అమిత్ జమ్సందేకర్ విచారణ చేపట్టారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. అసెంబ్లీ పదవీ కాలం ఏడాదిలోపే ఉంటే ఉప ఎన్నిక నిర్వహించడం తప్పనిసరి కాదని పిటిషన్లు వాదించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ఏడాది కంటే తక్కువ సమయమే పదవిలో ఉంటాడని పేర్కొన్నారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవించింది. పోండా ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. మోండా ఎమ్మెల్యే, మాజీ మంత్రి రవి నాయక్ గత ఏడాది అక్టోబర్‌లో మరణించారు. ఖాళీ అయిన మోండా స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తిచేసింది. కోర్టు ఉత్తర్వులతో ఉప ఎన్నిక ఆగిపోయింది. అయితే, ఓటమి భయంతోనే బీజేపీ ఇక్కడ ఉప ఎన్నికను రద్దు చేయించిందని కాంగ్రెస్ కేంద్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు గిరీశ్ చొడాంకర్ ఆరోపించారు. -
అస్సాం, కేరళలో నేడే పోలింగ్
అస్సాం, కేరళల్లో అసెంబ్లీ ఎన్నికల పోరు తుది దశకు చేరుకుంది. రెండు రాష్ట్రాల్లోనూ గురువారం ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కూడా వాటితో పాటే జరగనుంది. పోలింగ్ ప్రక్రియ శాంతియుతంగా జరిగేలా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పకడ్బందీగా ఏర్పాటు చేసింది. సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ సంఖ్యలో కేంద్ర బలగాలను మోహరించారు. కేరళ, పుదుచ్చేరిల్లో ఉదయం ఏడింటి నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా పోలింగ్ జరగనుంది. అస్సాంలో మాత్రం పోలింగ్ ప్రక్రియ సాయంత్రం ఐదింటికే ముగుస్తుంది. మూడు చోట్లా తమిళనాడు, పశ్చిమబెంగాల్‌తో పాటు మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలు వెల్లడించనున్నారు.కేరళలో కూటముల పోరుకేరళలో సీపీఎం సారథ్యంలోని పాలక ఎల్డీఎఫ్ కూటమి హ్యాట్రిక్‌పై కన్నేసింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ అధికారాన్ని నిలబెట్టుకోవడం తెలిసిందే. రాష్ట్రంలో ఒక పార్టీ, లేదా కూటమి వరుసగా రెండోసారి నెగ్గడం అదే తొలిసారి. ఎల్డీఎఫ్ ఆశలకు గండికొట్టి ఈ సారి ఎలాగైనా విజయం సా ధించాలని కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష యూడీఎఫ్ కూటమి సర్వశక్తులూ ఒడ్డుతోంది. దశాబ్దాలుగా కొరకరాని కొయ్యగా మారిన కేరళలో ఈసారి ఎలాగైనా గట్టిగా ఉనికి చాటుకోవాలని బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో పలు అసెంబ్లీ స్థానాల్లో ముక్కోణపు పోరు నెలకొంది.ప్రచార హోరుమూడు కూటములూ నెల రోజులకు పైగా హోరాహోరీ ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించాయి. గురువారం జరిగే పోలింగ్‌లో 2.71 కోట్ల మంది ఓటర్లు వాటి భాగ్యరేఖలను తేల్చనున్నారు. ఎన్డీఏ కూటమికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్టార్ ప్రచారకులుగా నిలిచారు. యూడీఎఫ్ తరఫున కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా ముమ్మరంగా ప్రచారం చేశారు. ఎల్డీఎఫ్ కూటమికి మాత్రం ముఖ్యమంత్రి పినరయి విజయన్ అంతా తానై ప్రచార ప్రక్రియను ముందుండి నడిపించారు. సుపరిపాలన, అభివృద్ధి ఈసారి కూడా తమను ఒడ్డుకు చేరుస్తాయని ఎల్డీఎఫ్ ఆశలు పెట్టుకుంది. అయితే ఇటీవలి స్థానిక ఎన్నికల్లో ఎదురుదెబ్బలు ఆ కూటమిని భయపెడు తున్నాయి. దీనికి ప్రభుత్వ వ్యతిరేకత తోడై తమ విజయం ఖాయమని యూడీఎఫ్ విశ్వసిస్తోంది. సీపీఎం, బీజేపీ కుమ్మక్కయ్యాయంటూ తాము చేసిన ప్రచారాన్ని ప్రజలు విశ్వసించారని ఆ కూటమి భావిస్తోంది. కొన్నేళ్లుగా కేరళలో ఓటు బ్యాంకును పెంచుకుంటూ వస్తున్న బీజేపీ, ఈసారి దాన్ని ఎలాగైనా సీట్ల రూపంలోకి మార్చాలని పట్టుదలగా ఉంది. స్థానిక ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన కలిసొస్తుందని నమ్ముతోంది. – తిరువనంతపురంఅస్సాంలో హోరాహోరీఅస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ కూటములు హోరాహోరి తలపడ్డాయి. వరుసగా మూడో విజయంతో హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుండగా, ఆ పార్టీ ఆశలకు గండి కొట్టి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ఈసారి సర్వశక్తులూ ఒడ్డింది. రెండు పార్టీలూ ఎప్పట్లాగే పలు ప్రాంతీయ పక్షాలతో జట్టు కట్టి బరిలోకి దిగాయి. హిమంత దూకుడు: బీజేపీ తరఫున మోదీ, అమిత్ షా రెండేసిసార్లు ప్రచారంలో పాల్గొన్నా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మే అన్నీ తానై వ్యవహరించారు. రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలు, దూకుడైన ప్రచారంతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ కూడా ఎక్కువగా పీసీసీ చీఫ్ గౌరవ్ గొగొయ్పైనే ఆధారపడింది. మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గాను అత్యధికంగా 99 చోట్ల అభ్యర్థులను బరిలోకి దించింది. దాని భాగస్వాముల్లో రైజోర్ దళ్ 13, ఏజేపీ 10, సీపీఎం 3, ఏపీహెచ్ఎల్సీ 2 చోట్ల పోటీలో ఉన్నాయి. ఇక బీజేపీ 90 స్థానాల్లో పోటీ చేస్తోంది. భాగస్వాములు ఏజీపీ 26, బీపీఎఫ్ 11 చోట్ల బరిలో దిగాయి. పలు స్థానాల్లో స్నేహపూర్వక పోటీలు ఇరు కూటములకూ తలనొప్పిగా మారాయి. 9 అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఇద్దరేసి అభ్యర్థులు మాత్రమే బరిలో ఉండటం విశేషం! రాష్ట్రవ్యాప్తంగా 59 మంది మహిళలు పోటీ చేస్తున్నారు. జాలూక్బారీ స్థానం నుంచి వరుసగా ఆరోసారి విజయం సాధించాలని సీఎం హిమంత ప్రయత్నిస్తున్నారు. లోక్‌సభ సభ్యుడైన పీసీసీ చీఫ్ గౌరవ్ జోర్హాట్ నుంచి తొలిసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. ఈ ఎన్నికల్లో అస్సాంలో 6.42 లక్షల మంది తొలిసారి ఓటేయనున్నారు! – గువాహటిపుదుచ్చేరిలో టీవీకే ఉనికి చాటేనా?పుదుచ్చేరిలో సీఎం ఎన్.రంగస్వామి సారథ్యంలోని ఏఐఎన్ఆర్సీ, బీజేపీ, అన్నాడీఎంకేలతో కూడిన ఎన్డీఏ కూటమి ఈసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డింది. దానికి పోటీగా విపక్ష డీఎంకే, కాంగ్రెస్‌లతో కూడిన ఇండియా కూటమితో పాటు సినీ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) కూడా తొలిసారి బరిలో దిగింది. ప్రజల ముఖ్యమంత్రిగా రంగస్వామికి ఉన్న పేరుపైనే ఎన్డీఏ కూటమి ఆశలు పెట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందని డీఎంకే, కాంగ్రెస్ భావిస్తున్నాయి. వాటిలో విజయ్ పార్టీ ఎవరికి నష్టం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తమిళ జాతీయవాది సీమాన్ సారథ్యంలోని నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) కూడా దాదాపు అన్ని స్థానాల్లో పోటీ చేస్తోంది. – చెన్నై -
బయటకు వెళ్లిపొండి
న్యూఢిల్లీ: ఎన్నికల ప్రక్రియపై దృష్టిసారించాల్సిన ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర అధికారులు బీజేపీ నేతలతో అంటకాగుతున్నారంటూ తృణమూల్కాంగ్రెస్ చేసిన ఆరోపణలతో ఆ పార్టీ నేతలు, ప్రధాన ఎన్నికల కమిషన్ సభ్యుల మధ్య జరిగిన సమావేశం కొన్ని నిమిషాల్లోనే రసాభాసగా మారి అర్ధంతరంగా ముగిసింది. తర్వాత అటు ఈసీ, ఇటు టీఎంసీ నేతలు పరస్పర ఆరోపణలు గుప్పించుకున్నారు. సమావేశంలో వాగ్వాదం జరగడానికి మీరే కారణమని రెండు వర్గాలూ వాదించుకున్నాయి. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ఈ వాగ్వాదానికి వేదికగా మారింది. బీజేపీ ముఖ్యులతో ఎన్నికల అధికారులకు సత్సంబంధాలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)లో లోపాలను ఎత్తిచూపుతూ తృణమూల్ చీఫ్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ రాసిన పలు లేఖలను టీఎంసీ ప్రతినిధి బృందం ఈసీకి అందజేసింది. భేటీ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఒబ్రియాన్, సాగరికా ఘోష్, ఎంపీలు సాకేత్ గోఖలే, మేనకా గురుస్వామిల ప్రతినిధి బృందం ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్‌కుమార్ సారథ్యంలోని ఎన్నికల సంఘానికి ఈ లేఖలను ఇచ్చారు. ఈ సందర్భంగా బెంగాల్‌లోని నందిగ్రామ్‌లో స్థానిక బీజేపీ నేతతో చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్‌కు ఉన్న అనుబంధం సహా ఆరు ఘటనల సాక్ష్యాధారాలతో టీఎంసీ నేతలు అందించారు. ఎస్ఐఆర్ పేరిట లక్షలాది నిజమైన ఓటర్ల పేర్లను జాబితాను నుంచి తొలగించారని టీఎంసీ నేతలు వాదించారు. మమత రాసిన 9 లేఖలను సీఈసీకి ఇచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎన్నికల అధికారులను రాష్ట్రం నుంచి బదిలీచేయాలని డిమాండ్‌చేశారు. భేటీ అర్ధంతరంగా ముగిశాక మీడియాతో ఓబ్రియాన్ మాట్లాడారు. ‘‘ఆరోపణలున్న అధికారుల సమక్షంలో పారదర్శకంగా ఎన్నికలు ఎలా జరుపుతారు? అని ప్రశ్నించాం. అందుకు సీఈసీ సమాధానం చెప్పాల్సిందిపోయి మీరంతా బయటకు వెళ్లండి అని గెంటేశారు. గతంలో 8–9 సార్లు ఎలక్షన్ కమిషన్‌తో భేటీ అయ్యాం. ప్రతిసారీ సీఈసీనే మాట్లాడారు. ఎవరినీ మాట్లాడనివ్వట్లేరు. అందుకే ఈసారి తిరిగొచ్చేటప్పుడు ఆయనను అభినందించా. పదవి నుంచి తొలగించాలని ఏకంగా పార్లమెంట్లో మీకు వ్యతిరేకంగా నోటీసులు జారీఅయ్యాయి అని చెప్పి బయటికొచ్చేశా’’అని ఓబ్రియాన్ వెల్లడించారు. ఇష్టారీతిన మాట్లాడారు: ఈసీ వాగ్వాదంపై ఈసీ తన వాదనను తర్వాత ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్చేసింది. ‘‘టీఎంసీ ప్రతినిధి బృందంతో ఈసీ ఉన్నతాధికారులు నిక్కచ్చిగా మాట్లాడారు. టీఎంసీ ఎంపీ ఓబ్రియాన్ గట్టిగా అరుస్తూ ఎలక్షన్ కమిషనర్లలో ఎవరినీ మాట్లాడనివ్వలేదు. హోదా మరచి అనుచితంగా ప్రవర్తించారు. ఆరోపణల అంశంపై సీఈసీ మాట్లాడబోతే ఆయననూ ఓబ్రియాన్ అడ్డుకున్నారు. దాంతో సీఈసీ ఆగ్రహంతో బయటకు వెళ్లండి అని చెప్పాల్సి వచ్చింది. పోలింగ్‌కేంద్రాల్లో రిగ్గింగ్, బూత్ జామింగ్, సోర్స్ జామింగ్ వంటి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడవద్దని ఈసీ హెచ్చరించింది. ప్రతినిధి బృందంలో ముందుగా అనుమతి పొందిన వ్యక్తులు ఎందుకు రాలేదని నిలదీశాం. వాళ్లలో అసహనం పెరిగింది’’అని ఈసీ పేర్కొంది. ఈసీ వివరణపై టీఎంసీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘ముక్కుసూటిగా మాట్లాడటంతోనే మాకు కోపం వచ్చిందని ఈసీ చెబుతోంది. మరి ఇంతే ముక్కుసూటిగా బీజేపీ నేతలకు ఆదేశాలిచ్చే దమ్ము ఈసీకి ఉందా?’’అని టీఎంసీ నాయకురాలు సాగరికా ఘోష్ ప్రశ్నించారు. -
తమిళనాడులో అధికార మార్పు తప్పదా? సర్వేలో ఏముందంటే
మరికొద్ది రోజుల్లో తమిళనాడు ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సీఎన్ఎన్, సీఓటర్ ఆ రాష్ట్రంలో నిర్వహించిన ఓపీనియన్ పోల్ సంచలన ఫలితాలను చూపుతోంది. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సీ-ఓటర్, CNN-News18 వెల్లడించిన ఓపీనియన్ ఫోల్ ప్రకారం ప్రస్తుతం అధికారంలో ఉన్న DMK మరియు ప్రధాన ప్రతిపక్షం AIADMK మధ్య పోటీ తీవ్రంగా ఉండనున్నట్లు నివేదికలు తెలిపాయి. సీఓటర్ సర్వే ప్రకారం ఎన్నికల్లో డీఎంకే 41 శాతం ఓట్లు సాధించే అవకాశాలుండగా, ఏఐడీఎంకేకు 38 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. అదే సీఎన్ఎన్- న్యూస్ 18 సర్వే ప్రకారం ఏఐడీఎంకేకు 41 శాతం, డీఎంకేకు 39 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది.అదే సీట్ల విషయానికి వస్తే ఆశ్చర్యంగా ఏఐడీఎంకే కూటమికి 130-140 సీట్లు, డీఎంకే కూటమికి 90-100 సీట్ల మధ్యలో వచ్చే అవకాశం ఉన్నట్లు సర్వే తెలిపింది. అదే విధంగా విజయ్ పార్టీకి 2-6 సీట్లు సాధించే అవకాశం ఉన్నట్లు నివేదికలు పేర్కొన్నాయి. అదే ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలనే విషయంలో ఎం.కె. స్టాలిన్ మరియు ఎం. పళనిస్వామి ఇద్దరూ 39% మద్దతుతో సమానంగా ఉన్నారు. అయితే తమిళనాడులో మెుత్తం 234 స్థానాలుండగా మెజారిటీ మార్కు 118 కాగా ప్రస్తుత సర్వేల ప్రకారం 130 - 140 సీట్లు (ప్రస్తుతానికి ఆధిక్యంలో ఉంది కూటమి: 90 - 100 సీట్లు, TVK విజయ్ పార్టీ 2 - 6 సీట్లు సాధించే అవకాశం ఉంది.అయితే ఈసారి AIADMK, బీజేపీ పార్టీలు కలిసి పోటీ చేస్తుండగా, DMK తన పాత మిత్రపక్షాలతో కలిసి బరిలోకి దిగుతోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం తమిళనాడులో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో AIADMK కూటమికి స్వల్ప ఆధిక్యం లభించే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. అయితే గతంలో చాలా సార్లు సర్వేల అంచనాలు తలకిందులైన సంగతి తెలిసిందే. -
విజయ్‌కు షాక్.. పోటీ చేయకముందే ఓటమి
టీవీకే అధినేత విజయ్‌కి ఎన్నికల ముందు ఊహించని షాక్ తగిలింది. ఎడప్పాడి నియోజకవర్గం నుంచి టీవీకే తరపున బరిలోకి దిగుతున్న అభ్యర్థి దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్ని ఎన్నికల కమిషన్ తిరస్కరించింది. దీంతో ఎన్నికల్లో పోటీ చేయకముందే టీవీకే ఒక స్థానాన్ని కోల్పోవాల్సి వచ్చింది.ఎడప్పాడీ నియోజకవర్గంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల కమిషన్ నియామాల ప్రకారం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌పై పదిమంది ప్రపోజర్ల సంతకాలు ఉండాలి. అయితే టీవీకే తరుపున పోటీ చేస్తున్న అరుణ్ కుమార్ అనే అభ్యర్థి నామినేషన్ పత్రాలపై ఎనిమిది మంది సంతకాలు మాత్రమే ఉండడంతో పత్రాల్ని రిజెక్ట్ చేశారు. అంతే కాకుండా అతనికి ప్రత్యామ్నయంగా నామినేషన్ దాఖలు చేసిన మరో అభ్యర్థి నిత్య నామినేషన్ పత్రాలు కూడా ఏడుగురు అభ్యర్థుల సంతకాలు ఉండడంతో రిజెక్ట్ అయ్యింది.అయితే ఈ నియోజకవర్గం నుంచి ఏఐడీఏంకే అధ్యక్షుడు కెె. పళనిస్వామి పోటీ చేస్తున్నారు. అయికే ప్రస్తుతం టీవీకే ఎమ్మెల్యే అభ్యర్థి అరుణ్ కుమార్ ప్రస్తుతం అదృశ్యం అయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో వీరి నామినేషన్ రిజెక్ట్ కావడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతే కాకుండా దీంతో ఆయనను ఏవరైనా కిడ్నాప్ చేసి ఉండవచ్చని పార్టీ వర్గాలు ఆందోళన చేస్తున్నాయి. కాగా తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది. -
కేరళ ‘చరిత్ర’ ను తిరగ రాస్తారా? ఎవరీ రాజీవ్ చంద్రశేఖర్!
రాజీవ్ చంద్రశేఖర్. ఇంజనీర్‌గా మొదలుపెట్టి, వ్యాపారవేత్తగా మారి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేత. దేన్ని ఎక్కడ ఎలా ముగించాలి, ఎప్పుడు కొత్త మార్గాల్లో అడుగువేయాలనే ఎరుక కలిగిన వ్యక్తి. కేరళ బీజేపీ సారథిగా పార్టీ అసెంబ్లీ ఎన్నికల పోరాటాన్ని ముందుండి నడుపుతున్నారు. బీజేపీకి అందని రాష్ట్రమైన కేరళలో ఈసారి ఎలాగైనా గెలుపు అందించి చరిత్రను తిరగరాయాలని పట్టుదలగా ఉన్నారు. మోదీ హవాను పసిగట్టి రాజీవ్ 2006లో రాజకీయ రంగప్రవేశం చేశారు. కర్ణాటకలోని అధికార జేడీ(ఎస్), బీజేపీ కూటమి ఆశీస్సులతో స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. పాలనా సంస్కరణలు, జాతీయ భద్రత, సాయుధ దళాల సిబ్బంది, ముఖ్యంగా మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమానికి కృషి చేశారు. 2012, 2018లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. దేశ రాజకీయాలు మోదీకి అనుకూలంగా మారుతున్నాయని రాజీవ్ ముందే పసిగట్టారు. 2014కు ముందు నుంచే మోదీని సమరి్థంచడం ప్రారంభించారు. 2020లో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి అయ్యారు. 2021లో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ సహాయ మంత్రి అయ్యారు. డిజిటల్ పాలన, డేటా భద్రతా విధానాలు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించే కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. డిజిటల్ ఇండియా, ఇంటర్నెట్ పాలన, సాంకేతిక విధానాల్లో లోతైన పరిజ్ఞానమున్న పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారు. 2023లో కేరళ బీజేపీ సారథిగా పగ్గాలందుకున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ శశిథరూర్ చేతిలో ఓడారు. కేరళ చరిత్రలో బీజేపీ గెలిచిన ఏకైక అసెంబ్లీ స్థానం నెమోమ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆసక్తికర నేపథ్యం రాజీవ్ చంద్రశేఖర్ స్వస్థలం కేరళలో త్రిసూర్ జిల్లాలోని దేశమంగళం. 1964లో అహ్మదాబాద్‌లో మలయాళీ నాయర్ కుటుంబంలో జన్మించారు. తండ్రి చంద్రశేఖర్ వైమానిక దళంలో ఎయిర్ కొమొడోర్గా పనిచేశారు. దాంతో రాజీవ్ బాల్యం దేశమంతటా భిన్న సంస్కృతుల మధ్య గడిచింది. ఆయన మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశారు. స్టార్టప్‌ల గురించి కనీసం వినని 1981లో ఢిల్లీకి చెందిన ఓ ఐటీ స్టార్టప్‌లో ఉద్యోగం సంపాదించారు. తండ్రి ప్రోత్సాహంతో అమెరికాకు వెళ్లి ఇలినాయీ వర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ చేశారు. ఇంటెల్‌లో డిజైన్ ఇంజనీర్‌గా చేసి భారత్‌కొచ్చారు. బీపీఎల్ గ్రూప్ వ్యవస్థాపకుడు నంబియార్ కుమార్తె అంజును పెళ్లాడారు. 2005లో జుపిటర్ క్యాపిటల్ అనే పెట్టుబడి సంస్థను స్థాపించారు. రాజకీయ రంగప్రవేశం చేసినప్పుడే ఏషియానెట్ కమ్యూనికేషన్స్‌లో 51 శాతం వాటా కొనుగోలు చేసి మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. 2017లో యాంకర్ అర్నాబ్ గోస్వామితో కలిసి రిపబ్లిక్ టీవీని స్థాపించారు.ఇదీ చదవండి: BMWలో అమ్మడికి జాక్‌పాట్... ఎలాగో తెలిస్తే షాకవుతారు!జేబులో పెన్సిల్ : ముఖ్య విషయాలు నోట్ చేసుకోవడానికి రాజీవ్ చంద్రశేఖర్ జేబులో నిత్యం పెన్సిల్ ఉంచుకుంటారు. ‘‘ప్రతిదాన్నీ తిరగరాయడం ఆయనకిష్టం. చివరకు చరిత్రను కూడా’’అని విపక్ష నేతలు చమత్కరిస్తుంటారు! ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్ దోస పిండి – సాక్షి, నేషనల్ డెస్క్ -
అస్సాం: అగ్గి రాజేస్తున్న 40 ఏళ్ల నాటి ఒప్పందం
గౌహతి: అస్సాం ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. బంగ్లాదేశ్ చొరబాటుదారుల అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. సరిగ్గా ఎన్నికలకు ముందు 40 ఏళ్ల నాటి ‘అస్సాం ఒప్పందం’ ఇప్పుడు ప్రధాన అస్త్రంగా మారింది. ఇంతకీ నాడు ఏం జరిగింది? ఎందుకు ఇప్పటికీ ఆ ఒప్పందమే అస్సాం ఎన్నికల తలరాతను శాసిస్తోంది?‘అస్సాం ఒప్పందం’ 1985 ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వం, ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్‌యూ), ఏఏజీఎస్‌పీల మధ్య కుదిరింది. మార్చి 25, 1971 తర్వాత రాష్ట్రంలోకి అక్రమంగా ప్రవేశించిన విదేశీయులను గుర్తించి, ఓటరు జాబితా నుంచి వారి పేర్లను తొలగించి, బహిష్కరించాలన్నది దీని ప్రధాన ఉద్దేశం. అయితే 40 ఏళ్లు గడుస్తున్నా ఏ ప్రభుత్వమూ దీనిని చిత్తశుద్ధితో అమలు చేయలేదని, సరిహద్దుల గుండా చొరబాట్లను అడ్డుకోకపోవడం వల్ల అస్సామీల ఉనికికే ముప్పు వాటిల్లుతోందని ఏఏఎస్‌యూ తీవ్రంగా విమర్శిస్తోంది.అస్సాం ప్రజల గుర్తింపును కాపాడే జస్టిస్ బిప్లబ్ కుమార్ శర్మ కమిటీ (క్లాజ్ 6) సిఫార్సులను అమలు చేసేందుకు అడుగులు వేశామని రాష్ట్ర మంత్రి అతుల్ బోరా చెబుతున్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ వాదనను కొట్టిపారేస్తున్నాయి. బీజేపీ సర్కారు కావాలనే ఈ ఒప్పందాన్ని పక్కనపెట్టి, పౌరసత్వ సవరణ చట్టం తీసుకొచ్చిందని కాంగ్రెస్, అస్సాం జాతీయ పరిషత్ (ఏజేపీ) మండిపడుతున్నాయి. 2014కి ముందు ఒప్పందాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ.. తీరా అధికారంలోకి వచ్చాక 1971 తర్వాత వచ్చిన అక్రమ బంగ్లాదేశీయులకు సీఏఏ ద్వారా స్వాగతం పలుకుతోందని ఏజేపీ ఆరోపిస్తోంది.ఈ వివాదంపై 2024 అక్టోబర్ 17న సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6A రాజ్యాంగబద్ధతను సమర్థిస్తూ, మార్చి 25, 1971ని సరైన కట్-ఆఫ్ తేదీగా తేల్చింది. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా అస్సాంలో మాత్రమే ఉన్న ‘డీ-ఓటర్ (పౌరసత్వంపై అనుమానం ఉన్నవారు) విధానాన్ని 1997లో ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. భారత పౌరులుగా సరైన ఆధారాలు చూపించలేని వారి పేర్ల ముందు ‘డి’ అని చేరుస్తారు. ఫారినర్స్ ట్రిబ్యునల్స్, న్యాయస్థానాల తీర్పుల ఆధారంగా వీరిని ఓటరు జాబితా నుంచి తొలగించడం లేదా పౌరులుగా గుర్తించడం జరుగుతుంది.2026, ఏప్రిల్ 9న ఒకే విడతలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుండగా.. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. అధికార బీజేపీ కూటమి (ఎన్డీఏ), కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు జరగనున్న ఈ ఎన్నికల్లో.. ఎవరి రాజకీయ భవితవ్యాన్ని ఈ ‘అస్సాం ఒప్పందం’ ఏ తీరుగా మారుస్తుందో వేచి చూడాల్సిందే.ఇది కూడా చదవండి: వైట్ హౌస్ వద్ద ఉద్రిక్తత.. ట్రంప్ గద్దె దిగాలంటూ నిరసనలు -
పట్టు కోసం ‘దీదీ’.. పక్కా వ్యూహంలో బీజేపీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయ, సాంస్కృతిక సిగలో ప్రధాన కేంద్రంగా నిలిచిన కోల్‌కతా.. 2026 అసెంబ్లీ ఎన్నికలకు మరోసారి అత్యంత కీలక యుద్ధభూమిగా మారింది. కోల్‌కతాలో తన పట్టు నిలుపుకోవాలని అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పట్టుదలతో ఉండగా, పట్టణ ఓటర్లను తమవైపు తిప్పుకునే పక్కా వ్యూహంతో బీజేపీ బరిలోకి దిగింది. తాజాగా వెలువడిన ఒపీనియన్ పోల్స్ ఈసారి ఎన్నికల పోరు ఎంత ఉత్కంఠభరితంగా ఉండనుందో స్పష్టం చేస్తున్నాయి. అధికార పార్టీకి కాస్త సానుకూలత ఉన్నప్పటికీ, బీజేపీ అనుసరిస్తున్న సరికొత్త అర్బన్ వ్యూహాలతో పోరు మరింత ఉత్కంఠ భరితంగా మారనున్నదని తాజా నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.అసలు సిసలు పోరుకోల్కతా నగర పరిధిలో సుమారు 11 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హై-ప్రొఫైల్ స్థానం ‘భవానీపూర్’. ఇక్కడ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, బీజేపీ కీలక నేత సువేందు అధికారికి మధ్య నేరుగా కురుక్షేత్రం నెలకొంది. ఇటీవలి ఒపీనియన్ పోల్స్ ప్రకారం, పశ్చిమ బెంగాల్లో టీఎంసీ తన ఆధిపత్యాన్ని మరోసారి కొనసాగించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ 140 నుంచి 170 స్థానాలను గెలుచుకోవచ్చని, అదే సమయంలో బీజేపీ సైతం బలమైన పోటీనిస్తూ 100 నుంచి 150 స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇది రసవత్తరమైన పోటీని సూచిస్తున్నది.కోల్‌కతాలో గట్టి పోటీ..గ్రామీణ బెంగాల్‌తో పోలిస్తే కోల్‌కతా నగరంలో అధికార పార్టీకి సవాలు గట్టిగానే ఉండబోతోందని రాష్ట్ర స్థాయి వర్గాలు, రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న తీవ్ర వ్యతిరేకతను, పాలనాపరమైన లోపాలను, పట్టణ ఓటర్లలో రగులుతున్న అసంతృప్తిని తమకు అనుకూలంగా మలచుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోంది. ‘ ఈసారి కోల్‌కతాలో ఏ పార్టీకీ ఏకపక్ష విజయం దక్కదు. టీఎంసీకి క్షేత్రస్థాయిలో బలమైన సంస్థాగత పునాది ఉన్నప్పటికీ, నగరంలోని ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో బీజేపీ గణనీయంగా పుంజుకుంది’ అని ఓ సీనియర్ రాజకీయ విశ్లేషకుడు స్థానిక మీడియాతో వ్యాఖ్యానించారు.బలమైన సానుకూల అంశాలునగరంలో పోటీ తీవ్రంగా మారుతున్నప్పటికీ, అధికార పార్టీకి ఇప్పటికీ పలు బలమైన సానుకూల అంశాలు ఉన్నాయి..గత దశాబ్ద కాలంగా అధికారంలో ఉండటం వల్ల క్షేత్రస్థాయిలో ఏర్పడిన పటిష్టమైన సంస్థాగత నెట్వర్క్.పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు నేరుగా లబ్ధి చేకూరుస్తున్న సంక్షేమ పథకాలు.ముఖ్యంగా దక్షిణ కోల్‌కతాలో మమతా బెనర్జీకి ఉన్న వ్యక్తిగత ఆదరణ, ఛరిష్మా.భవానీపూర్, బల్లిగంజ్, ఉత్తర కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో టీఎంసీ సంస్థాగతంగా అత్యంత బలంగా ఉందని రాష్ట్ర వర్గాలు చెబుతున్నాయి. ఇక్కడ క్షేత్రస్థాయి సమీకరణాలు ఇప్పటికీ ఆ పార్టీకే అనుకూలంగా కనిపిస్తున్నాయి.వ్యూహం మార్చిన ‘కమలం’మరోవైపు, బీజేపీ కూడా కోల్‌కతాపై మునుపెన్నడూ లేని విధంగా ప్రత్యేక దృష్టి సారించింది. గతంలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలపైనే ఆధారపడిన ఆ పార్టీ.. ఇప్పుడు తన పంథా మార్చుకుంది. నగరంలోని మౌలిక సదుపాయాల కొరత, ఉద్యోగాల సృష్టి, పౌర సమస్యలను ఎత్తిచూపుతూ నిర్దిష్ట నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకొని ‘మైక్రో-లెవల్’ ప్రచారానికి శ్రీకారం చుట్టింది. కోల్‌కతాలోని కీలక స్థానాలను గెలుచుకోవడం రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అత్యంత కీలకమని బీజేపీ సీనియర్ నేతలు స్పష్టం చేస్తున్నారు.క్షేత్రస్థాయిలో ఉద్రిక్త వాతావరణంహోరాహోరీ ప్రచారాలు, వీధి స్థాయి ఘర్షణలు, భవానీపూర్ లాంటి ప్రతిష్టాత్మక పోరుతో కోల్‌కతాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ట్రాఫిక్ రద్దీ నుంచి వాయు కాలుష్యం వరకు నగరంలోని పౌర సమస్యలు కూడా ఈసారి ఓటర్ల ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. పౌర సమాజ సంఘాలు సైతం ఈ పట్టణ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అన్ని రాజకీయ పార్టీలపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి.తీర్పు ఎటువైపు?ఒపీనియన్ పోల్స్, గత ఎన్నికల చరిత్ర టీఎంసీకి కాస్త పైచేయి ఇస్తున్నప్పటికీ.. బీజేపీ అనూహ్యంగా బలపడుతుండటంతో ‘సిటీ ఆఫ్ జాయ్’లో ఇకపై వన్‌సైడ్ వార్ లేనట్టే. పోలింగ్ శాతం, అభ్యర్థుల ఎంపిక, చివరి నిమిషంలో జరిగే ప్రచార సరళి.. ఇవన్నీ కోల్‌కతాలోని పలు నియోజకవర్గాల్లో మెజారిటీని తారుమారు చేసే అవకాశం ఉందని రాజకీయ పండితులు స్పష్టం చేస్తున్నారు. పార్టీల ఎత్తులు, పైఎత్తులతో కోల్‌కతా పోరు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది.ఇది కూడా చదవండి: ‘సైలెంట్ పీరియడ్’ షురూ.. ఈ 48 గంటల్లో.. -
టీ నగర్.. దక్కేదెవరికో?
సాక్షి, చైన్నె: చైన్నె నగరంలోని అత్యంత కీలక నియోజకవర్గాల్లో ఒకటిగా టీనగర్ (త్యాగరాయ నగర్) ఉంది. ఈ నియోజకవర్గంలో తాజాగా సమరం రసవత్తరంగా మారింది. తెలుగు, బ్రహ్మణ ఓట్లతో కూడిన ఈ పరిసరాలలో తెలుగు నేపథ్యం కలిగిన ఇద్దరు నేతల మధ్య సమరం హోరా హోరీగా మారి ఉంది. ఇందులో ఒకరు టీవీకే ప్రధాన కార్యదర్శి భుస్సీ ఆనంద్ కాగా, మరొకరు అన్నాడీఎంకే అభ్యర్థి సత్యనారాయణన్ అలియాస్ సత్య. ఇక, డీఎంకే అభ్యర్థిగా రాజా అన్భళగన్, నామ్ తమిళర్ కట్చి(ఎన్టీకే) అభ్యర్థిగా అనూష్ విజయకుమార్ పోటీలో ఉన్నారు. వివరాలు.. చైన్నెకి గుండెకాయగా టీ.నగర్‌ను పరిగణించవచ్చు. కేవలం వాణిజ్య కేంద్రంగానే కాకుండా అత్యధిక జనాభా కలిగిన ప్రాంతంగానూ ఇది ఉంది. కోడంబాక్కం, వెస్ట్ మాంబళం, అశోక్ నగర్ వంటి కీలక ప్రాంతాలు ఈ నియోజకవర్గ పరిధిలోకి వస్తాయి.రాజకీయ చదరంగంలో..టీ నగర్ నియోజకవర్గంలో రాజకీయ ముఖచిత్రం ఆసక్తికరం. చారిత్రక నేపథ్యం కలిగిన ఈ నియోజకవర్గంలో 1957 నుండి ఇప్పటివరకు జరిగిన ఎన్నికలలో డీఎంకే– 6 సార్లు, అన్నాడీఎంకే – 4 సార్లు గెలిచింది. కాంగ్రెస్– 2 సార్లు, టీఎంసీ ఒక సారి విజయం సాధించింది. అన్నాడీఎంకే గుప్పెట్లో ఉన్న ఈ స్థానాన్ని 2021లో డీఎంకే కై వశం చేసుకుంది. డీఎంకే అభ్యర్థి జె. కరుణానిధి (దివంగత డీఎంకే నేత జె. అన్బళగన్ సోదరుడు) 56,035 ఓట్లు సాధించగా, అన్నాడీఎంకే అభ్యర్థి టి.నగర్ సత్య 55,898 ఓట్లు సాధించారు. కేవలం 137 ఓట్ల స్వల్ప తేడాతో డీఎంకే విజయం సాధించింది. ఇక్కడ మొత్తం ఓటర్లు 1,54,943. వీరిలో మహిళా ఓటర్లు పురుషుల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇందులో పురుషులు – 74,682, మహిళలు –80,228, ఇతరులు 33 మంది ఉన్నారు.2026 బరిలో ఉన్న అభ్యర్థులుఈసారి ప్రధాన పార్టీలు వ్యూహాత్మకంగా అభ్యర్థులను రంగంలోకి దించాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే జె. కరుణానిధికి ఈ సారి డీఎంకే సీటు ఇవ్వలేదు. ఆయన స్థానంలో జె. అన్బళగన్ కుమారుడు రాజా అన్బళగన్ పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో తృటిలో విజయాన్ని కోల్పోయిన టి.నగర్ సత్య మళ్లీ పోటీలో ఉన్నారు. కూటమి పార్టీల బలం ఈసారి తనను గెలిపిస్తుందని ఆయన ధీమాతో ఉన్నారు. అయితే, ప్రపథమంగా ఎన్నికలను ఎదుర్కొంటున్న తమిళగ వెట్రికళగం (టీవీకే)తరపున ఇక్కడ ఆపార్టీ ప్రధాన కార్యదర్శి ఎస్ ఆనంద్ అలియాస్ భుస్సీ ఆనంద్ పోటీలో ఉన్నారు. ఒంగోలు పూర్వీకంగా కలిగి పుదుచ్చేరిలో స్థిర పడి, తదుపరి విజయ్‌కు సన్నిహితుడై పార్టీ స్థాపనలో భుస్సీ ఆనంద్ కీలకంగా వ్యవహరించారు. ఈ నియోజకవర్గంలోని యువత, బ్రహ్మణ, తెలుగు ఓటర్లతో పాటుగా మైనారిటీ యువత ఓట్లు కలిసి వచ్చే అవకాశాలు అధికంగా ఉండటంతో భుస్సీ ఆనంద్ విస్తృతంగా వ్యూహాలకు పదును పెట్టి ఉన్నారు. ఇక్కడ తెలుగు ఓటర్లు , బ్రహ్మణ సామాజిక వర్గం ఓట్లు ఎటు వైపు అన్నది కీలకంగా మారింది. ఓ వైపు భుస్సీ ఆనంద్, మరో వైపు సత్య ఈ ఓట్లపై దృష్టి పెట్టారు. ఇక, నామ్ తమిళర్ కట్చి తరపున మహిళా అభ్యర్థిగా అనూష విజయకుమార్ పోటీలో ఉన్నారు. గత ఎన్నికలలో 137 ఓట్లతో ఓడిన సత్య ఈసారి గెలుపు కోసం తీవ్రంగానే శ్రమిస్తున్నారు. ఇక, డీఎంకే అభ్యర్థి రాజా అన్భళగన్ అయితే, తన తండ్రి అన్భళగన్ చరిష్మా, ప్రభుత్వ సంక్షేమ పథకాలను గట్టెక్కిస్తాయన్న ధీమాతో ఉన్నారు. అయితే పెరిగిన వాణిజ్యీకరణతో నివాస ప్రాంతాల్లో ఏర్పడుతున్న ఇబ్బందులపై నెలకొన్న వ్యతిరేకతను అధిగమించడం డీఎంకేకు సవాలుగా మారింది. ఇక ఈ మూడు పార్టీ మగరాయుళ్లను ఎన్టీకే తరపున అనూష విజయకుమార్ ఢీ కొడుతున్నారు. మహిళా ఓటర్లు తనను ఆదరిస్తారన్న నమ్మం ఆమెలో మెండుగా ఉండటం గమనార్హం.ప్రధాన సమస్యలు:● ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మించినా టి.నగర్లో ట్రాఫిక్ సమస్య తీరడం లేదు. మెట్రో రైలు పనుల కారణంగా గత రెండేళ్లుగా రద్దీ మరింత పెరిగింది.● పాండీ బజార్‌లోని మల్టీ–లెవల్ పార్కింగ్ సౌకర్యం తరచుగా సాంకేతిక సమస్యలతో మూతపడటం లేదా పూర్తి సామర్థ్యంతో నిండిపోవడం వల్ల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పార్కింగ్ సమస్యా ఎక్కువే.● వర్షాల సమయంలో వెస్ట్ మాంబళం వంటి ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కడం పరిపాటిగా మారింది. వర్షపు నీటి కాలువల నిర్మాణం జరిగినా, ప్రయోజనం ఆశించిన స్థాయిలో లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.● నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో వాయు కాలుష్యం పెరగడం, వాణిజ్య సముదాయాల నుండి వెలువడే టన్నుల కొద్దీ చెత్తను సక్రమంగా తొలగించకపోవడం ప్రధాన సమస్యలుగా మారాయి. -
కీలక నేతల నామినేషన్లకు ఆమోదం
సాక్షి, చైన్నె : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పరిశీలనలో మంగళవారం కీలక నేతలకు ఆమోదం లభించింది. ఇందులో సీఎం స్టాలిన్, ప్రధాన ప్రతి పక్ష నేత పళనిస్వామి తదితరులు ఉన్నారు. ముఖ్యంగా టీవీకేఅ ధినేత విజయ్ నామినేషన్ టెన్షన్ పెట్టినా చివరకు ఆమోదించారు. ఇక, పళణిస్వామి పోటీ చేస్తున్న ఎడప్పాడి నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి అరుణ్‌కు షాక్ తగిలింది. ఆయన నామినేషన్ తిరస్కరణకు గురి కావడంతో ఇక్కడ టీవీకే పోటీ నుంచి తప్పుకున్నట్లయ్యింది. వివరాలు.. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ సోమవారం సాయంత్రం ముగిసిన విషయం తెలిసిందే. మొత్తంగా 7,600 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో పురుషులు 6,217, మహిళలు 1,380, ఇతరులు ముగ్గురు ఉన్నారు. నామినేషన్ల పరిశీలన ప్రక్రియ మంగళవారం ఉదయం నుంచి మొదలైంది. కట్టుదిట్టమైన ఆంక్షలు, సమగ్ర పరిశీలన మేరకు నామినేషన్లకు రిటర్నింగ్ అధికారులు ఆమోదం తెలియజేశారు. బుధవారం కూడా ఈ ప్రక్రియ జరగనుంది. గురువారం ఉప సంహరణ ప్రక్రియ అనంతరం తుది జాబితాను ప్రకటించనున్నారు.నామినేషన్లకు ఒకేచైన్నెలోని కొళత్తూరు నియోజకవర్గం నుండి నాలుగోసారి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నామినేషన్ ఆమోదం పొందింది. అలాగే ఎడప్పాడి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నామినేషన్ కూడా ఓకే అయింది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడైన విజయ్, తాను పోటీ చేస్తున్న పెరంబూర్ , తిరుచ్చి ఈస్ట్ రెండు నియోజకవర్గాల్లోనూ నామినేషన్లు ఆమోదించడంతో ఆయన ఎన్నికల బరిలో నిలవడం ఖరారైంది. పెరంబూరులో నామినేషన్ అఫిడవిట్ రోటరి నకిలీగా చర్చ సాగడంతో విజయ్‌కు టెన్షన్ తప్పలేదు. చివరకు ఒరిజినల్ అని తేలడంతో నామినేషన్ ఆమోదించారు. అదేసమయంలో విజయ్ పేరును ఇరకాటంలో పెట్టే విధంగా జోషఫ్ పేరిట ఇద్దరు, విజయ్ పేరిట మరో ఇద్దరు దాఖలు చేసిన నామినేషన్లకు ఆమోదం లభించడం గమనార్హం. చేపాక్కం– ట్రిప్లికేన్‌లో ఉదయ నిధి స్టాలిన్, కారైక్కుడిలో నామ్ తమిళర్ కట్చి నేత సీమాన్, సాత్తూరులో బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, ధర్మపురిలో సౌమ్య అన్బుమణి, టీ నగర్లో భుస్సీ ఆనంద్ , అవినాశిలో కేంద్రసహాయమంత్రి ఎల్ మురుగన్, మైలాపూర్‌లో తమిళి సై సౌందరరాజన్ వంటి ముఖ్యుల నామినేషన్లు ఆమోదం పొందాయి.విల్లివాక్కంలో ఉత్కంఠచైన్నెలోని విల్లివాక్కం నియోజకవర్గం నుంచి టీవీకే తరపున పోటీలో ఉన్న ఆదవ్ అర్జున నామినేషన్ ప్రస్తుతం నిలిపివేశారు. ఆయన సమర్పించిన అఫిడవిట్లో భార్య ఆస్తుల వివరాలకు సంబంధించి కొన్ని సందేహాలు తలెత్తడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం వెలువడటంతో ఉత్కంఠ తప్పలేదు. చివరకు సమగ్ర వివరాలను సమర్పించడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అలాగే, గోబిచెట్టి పాళయంలో ఆదాయ పన్ను సమర్పించ లేదంటూ టీవీకే కన్వీనర్ సెంగొట్టయ్యన్ నామినేషన్ పెండింగ్‌లో పెట్టారు. ఎడప్పాడి నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి అరుణ్, ఆయనకు ప్రత్యామ్నాయంగా నామినేషన్ వేసి మరొకరి నామినేషన్లు తిరస్కరణకు గురి అయ్యాయి. దీంతో మాజీ సీఎం పళణిస్వామి ఓట్లకు చీలిక గండం తప్పినట్లయ్యింది. అదే సమయంలో అభ్యర్థి అరుణ్ కనిపించడం లేదంటూ టీవీకే వర్గాలు ఆరోపించాయి. ఇక, డీఎంకే తరపున పోటీలో ఉన్న నెహ్రు, అన్బిల్ మహేశ్ తదితర మంత్రలందరినామినేషన్లు ఆమోదించారు. ఇక, దిండుగల్‌లో మాజీ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్‌కు చిక్కులు ఎదురయ్యాయి. ఇక్కడ రాందాసు తరపున నామినేషన్ దాకలు చేసిన అభ్యర్థిని పీఎంకే పార్టీకి చెందిన వారుగా ఎన్నికల కమిషన్ ఆమోదించింది. దీంతో ఇక్కడ అన్బుమణి పీఎంకేతో కూటమిలో ఉన్న అన్నాడీఎంకేకు చిక్కులు తప్పలేదు. మాజీ మంత్రి కేసీ వీరమణి నామినేషన్‌ను సైతం పెండింగ్‌లో పెట్టారు. -
ఎన్నికల్లో వీరప్పన్ కుటుంబం
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్మగ్లర్ వీరప్పన్ భార్య, కుమార్తె పోటీ చేస్తున్నారు. అయితే, వీరు వేర్వేరు నియోజకవర్గాలలో పోటీలో ఉన్నారు. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి కృష్ణగిరి నియోజకవర్గం నుంచి తమిళనాడు జీవ హక్కుల కట్చి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సోమవారం సాయంత్రం కృష్ణగిరి రెవెన్యూ కమిషనర్, ఎన్నికల అధికారి షాజహాన్న్కు నామినేషన్ పత్రాలను సమర్పించారు.వీరప్పన్ కుమార్తె విద్యారాణి మెట్టూరు నియోజకవర్గం నుంచి నామ్ తమిళర్ కట్చి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. విద్యారాణి వృత్తిరీత్యా న్యాయవాది. గత పార్లమెంట్ ఎన్నికల్లో కృష్ణగిరి నుంచి పోటీ చేసిన ఆమె, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మెట్టూరు నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. సీమాన్ నేతృత్వంలోని నామ్ తమిళర్ పార్టీ అభ్యర్థిగా ఆమె తన నామినేషన్న్ను ఇప్పటికే దాఖలు చేశారు.కాగా, ఒకే కుటుంబానికి చెందిన వీరు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేస్తుండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే వారు వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుండడంతో నేరుగా ఒకరిపై ఒకరు తలపడడం లేదు. వీరప్పన్ ప్రభావం ఉన్న అటవీ ప్రాంత నియోజకవర్గాల్లో వీరిద్దరికీ ఓటర్లు ఎలాంటి మద్దతు తెలుపుతారో వేచి చూడాలి. -
అస్సాం, కేరళలో ప్రచారానికి తెర
తిరువనంతపురం/గువాహటి/చెన్నై: కేరళ, అస్సాం అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో తెర పడింది. వాటితో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ మైకులు మూగబోయాయి. మూడు అసెంబ్లీలకూ గురువారం ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఇందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ చేసింది. మే 4న ఓట్ల లెక్కింపు జరిపి ఫలితాలను వెల్లడించనుంది. కేరళలో 140, అస్సాంలో 126, పుదుచ్చేరిలో 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. మంగళవారం చివరి రోజు కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో ప్రధాన పార్టీలన్నీ ముమ్మర ప్రచారంతో హోరెత్తించాయి. సభలు, రోడ్ షోలు, ర్యాలీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు చివరి నిమిషందాకా ప్రయత్నించాయి. కేరళలోనైతే కొన్ని చోట్ల అభ్యర్థులు క్రేన్లపైకి ఎక్కి మరీ ప్రసంగాలు చేశారు! హోరాహోరీ పోరు కేరళలో మూడు కూటములు బరిలో ఉన్నా పోరు ప్రధానంగా సీపీఎం సారథ్యంలోని అధికార ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష యూడీఎఫ్ కూటముల మధ్యే కేంద్రీకృతమైంది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈసారి రాష్ట్రంలో ఎలాగైనా గట్టిగా ఉనికి చాటుకోవాలని పట్టుదలగా ఉంది. నెల రోజులపాటు పార్టీలన్నీ ముమ్మరంగా ప్రచారం చేశాయి. ఎన్డీఏ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పలుమార్లు రాష్ట్రంలో పర్యటించగా కాంగ్రెస్ నుంచి రాహుల్‌గాం«దీ, ప్రియాంకా గాంధీ వాద్రా స్టార్ ప్రచారకులుగా నిలిచారు.ఎల్డీఎఫ్ కూటమి ప్రచారం ప్రధానంగా సీఎం విజయన్‌పైనే ఆధారపడి సాగింది. యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలన్నీ ఈసారి ప్రాధాన్యమివ్వడం విశేషం. అస్సాంలో ఈసారి కూడా నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. దాన్ని ఎలాగైనా అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఎప్పట్లాగే అవి రెండూ పలు ప్రాంతీయ పార్టీలతో జట్టు కట్టి బరిలో దిగాయి. బీజేపీ తరఫున మోదీ, అమిత్ షా, కాంగ్రెస్ నుంచి రాహుల్, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే విస్తృతంగా ప్రచారం చేశారు. మోదీ, అమిత్ షా పుదుచ్చేరిలో కూడా ప్రచారంలో పాల్గొన్నారు. పుదుచ్చేరిలో ఎన్నికలు పాలక ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటములకు ప్రతిష్టాత్మకంగా పరిణమించాయి. ప్రచారం కొత్త పుంతలు ప్రచారంలో పలువురు నేతలు కొత్త పుంతలు తొక్కారు. కేరళలో పుత్తుపల్లి కాంగ్రెస్ అభ్యర్థి ఛండీ ఒమెన్ నియోజకవర్గమంతటినీ పలుమార్లు సైకిల్‌పై చుట్టేశారు. ఓటర్లను నేరుగా కలుసుకుంటూ ప్రచారం కొనసాగించిన తీరు రాహుల్ తదితర నేతలను ఆకర్షించింది. పాలక్కాడ్ కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ పిషరోడీ గోడలపై రోబోలతో రాతలు రాయించారు. -
కేరళ, తెలంగాణ మధ్య ఎన్నికలు కావివి: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కేరళ, తెలంగాణల మధ్య కాదని, కేరళలోని యూడీఎఫ్, ఎల్డీఎఫ్ల మధ్య జరుగుతున్నాయన్న వాస్తవాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ గ్రహించాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను విజయన్ ఎప్పుడైనా వచ్చి పరిశీలించవచ్చని పేర్కొన్నారు. ‘పినరయి విజయన్‌తో పాటు కేరళ కమ్యూనిస్టు మహిళా నేతలను కూడా నేను తెలంగాణకు ఆహా్వనిస్తున్నా. రాష్ట్రంలోని ఏ మూలకైనా వెళ్లి మేం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించవచ్చు. అతిథులుగా మీకు అన్ని ఏర్పాట్లు చేస్తాం. ఎప్పుడైనా వచ్చి మా రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు..’అంటూ సవాల్ విసిరారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చివరి రోజు మంగళవారం..కోవలం, మాలవిక్కర, పతానపురం నియోజకవర్గాల్లో యూడీఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ రేవంత్ రోడ్‌షోలు నిర్వహించారు. ఈ రోడ్‌షోల్లో అలాగే అక్కడి మీడియాతో ముఖ్యమంత్రి మాట్లాడారు. విజయన్ హయాం ముగిసింది..: ‘కేరళలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత కాంగ్రెస్ సీఎంలు కరుణాకరన్, ఉమెన్ చాందీలదే. పినరయి విజయన్ హయాం ముగిసింది. ఆయన 120 నెలల పాలన వైఫల్యానికి ప్రతీకగా నిలిచింది. ఆయన వైదొలిగే సమయం ఆసన్నమైంది. మూడింట రెండొంతుల మెజార్టీతో కేరళలో యూడీఎఫ్ పాలన రాబోతోంది. విజయన్ గాడ్‌ఫాదర్ నరేంద్ర మోదీ ఢిల్లీలో ఉన్నారు. ఆయనే విజయన్ను కేసుల నుంచి ర క్షిస్తున్నారు. దేశం కోసం జీవితాలు, ఆస్తులను త్యాగం చేసిన గాంధీ కుటుంబాన్ని, కేజ్రీవాల్‌తో సహా అనేక మంది నేతలను వేధిస్తున్న కేంద్రం.. విజయన్ జోలికి ఎందుకు వెళ్లడం లేదు? మోదీ, విజయన్‌ల మధ్య అవగాహనతోనే కేసులు, అరెస్టులు లేవు. వారిద్దరి బంధాన్ని కేరళ ప్రజలు అర్థం చేసుకున్నారు. పోలింగ్ బూత్‌కు వెళ్లి సరైన నిర్ణయం చెపుతారు..’అని సీఎం రేవంత్ అన్నారు. కొనసాగుతున్న లేఖల యుద్ధం కేరళ సీఎం విజయన్, తెలంగాణ సీఎం రేవంత్‌ల మధ్య మాటల యుద్ధం లేఖల రూపంలో సాగుతూనే ఉంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ కేరళ వెళ్లి చేసిన వ్యాఖ్యలకు ‘ఎక్స్’వేదికగా విజయన్ కౌంటర్ ఇవ్వగా, విజయన్‌కు లేఖ రాస్తూ రేవంత్ అంతే ధీటుగా స్పందించారు. దీనికి మరోమారు విజయన్ లేఖ రూపంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగా రేవంత్ మరోసారి ప్రతి లేఖ రాశారు. ‘కేరళ ప్రభుత్వ పనితీరుపై నేను గౌరవంగా, హుందాగా స్పందించాలని అనుకున్నా. కానీ మీ ప్రతిస్పందనలో అభ్యంతరకరమైన భాషను వాడారు. నేనెప్పుడూ ప్రత్యర్థుల తొందరపాటు వ్యాఖ్యలపై ఆవేశపూరితంగా స్పందించను. అయితే మీరు నీతి ఆయోగ్ ఇచ్చిన 2023–24 నివేదికను ఉదహరిస్తున్నారు. ఆ సమయంలో మేం అధికారంలో లేము. అది బీఆర్ఎస్, బీజేపీల పదేళ్ల దుష్పరిపాలనలో చివరి దశ. మేం అధికారంలోకి వచ్చిన 28 నెలల్లో ఏం జరిగిందనే దాన్ని ఆధారంగా చేసుకుని మమ్మల్ని అంచనా వేయండి. తలసరి ఆదాయం, జీఎస్డీపీ తదితర ఆర్థిక సూచీల్లో ఆర్బీఐ హ్యాండ్‌బుక్ 2024–25 గణాంకాల ప్రకారం కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాలను తెలంగాణ అధిగమించింది. దేశంలోనే ముందు స్థానంలో నిలిచింది. బంగారం స్మగ్లింగ్ కేసు ఏమైంది? నీతి ఆయోగ్ ఇచ్చిన అవినీతి ర్యాంకులను కూడా నేను గౌరవిస్తాను. కానీ మీ ప్రభుత్వం స్వచ్ఛమైనది అయితే బంగారం స్మగ్లింగ్ కేసు ఎందుకు అపరిష్కృతంగా మిగిలిపోయింది. మీ కార్యాలయంలోని ఉన్నతాధికారులు, కీలక వ్యక్తులకు సంబంధాలున్నాయని ఆధారాలతో సహా బయటపడినా చర్యలేవి? శబరిమల అయ్యప్ప ఆలయం నుంచి 4.5 కిలోల బంగారం అక్రమ తరలింపు ఆరోపణలకు ఎందుకు జవాబు చెప్పడం లేదు? మా ప్రభుత్వం తెలంగాణ రైజింగ్–2047 దార్శనికతతో ముందెకెళుతోంది. అలాగే కేరళలో రాబోయే కొద్ది రోజుల్లో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం ’నవ కేరళ’దార్శనికతను అమలు చేస్తుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను. కేరళ ప్రజలు త్వరలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకుంటారు. జరగాల్సింది కూడా అదే..’అని రేవంత్ ఆ లేఖలో పేర్కొన్నారు. కాగా కేరళ ఎన్నికల ప్రచారం ముగించిన సీఎం హైదరాబాద్ చేరుకున్నారు. -
‘తొలగింపుల’ జాతర!
పశ్చిమ బెంగాల్లో ఈ నెల 23న జరగబోయే తొలి దశ పోలింగ్‌కు సంబంధించి తాజాగా 27 లక్షల 17 వేలమంది ఓటర్లు జాబితాల నుంచి కనుమరుగైనట్టు సోమవారం అర్ధరాత్రి దాటాక ఎన్నికల సంఘం (ఈసీ) విడుదల చేసిన తుది జాబితా వెల్లడిస్తోంది. దీంతో ఇప్పటివరకూ జాబితాల్లో పేర్లు లేనివారి సంఖ్య దాదాపు 91 లక్షలకు చేరింది. రెండో దశకు సంబంధించి తొలగింపులు కూడా కలుపుకొంటే ఇది కోటికన్నా ఎక్కువే ఉండొచ్చు. న్యాయ నిర్ణయ పరిధి (అజ్యుడికేషన్) ప్రక్రియ గత నెలలో మొదలయ్యాక ఈసీ విడుదల చేసిన అనుబంధ జాబితా ఇది. సహజంగానే ముస్లిం మెజారిటీ ఉన్న ముర్షీదాబాద్‌లో అత్యధికుల పేర్లు తొలగించారు. అక్కడ అజ్యుడికేషన్ పరిధిలోకెళ్లిన 11,01,145 మందిలో 4,55,137 మంది అనర్హులుగా తేలారు. ‘స్వచ్ఛమైన’ జాబితాతోనే ఎన్నికలు నిర్వహించాలన్న దృఢ నిశ్చయంతోనే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)కు శ్రీకారం చుట్టామని బిహార్‌లో ఏరివేతలు మొదలెట్టినప్పుడే ఈసీ చెప్పింది. ఉద్దేశం మంచిదే కావొచ్చు. కానీ బిహార్ అనుభవం తర్వాతైనా ఆ ప్రక్రియకు పట్టే సమయంపై అంచనా ఉండాలి. అది లేకపోబట్టే లక్షలాదిమంది ఓటర్లు ఈసారి ఓటింగ్‌కు దూరం కాబోతున్నారు. వారి అప్పీళ్లపై ట్రిబ్యునళ్ల విచారణ జరుగు తోంది. వారిలో విశ్వసనీయమైన ఓటర్లుగా నిర్ధారణయ్యేవారు కూడా ఉండొచ్చు. కానీ 2031 అసెంబ్లీ ఎన్నికలకు తప్ప వారు ఓట్లేయటం సాధ్యపడదు. న్యాయ నిర్ణయ ప్రక్రియకు సమయం పడుతుంది గనుక అంతవరకూ ఓటర్ల జాబితాలను ఆపటం సాధ్యపడదని సోమవారం సుప్రీంకోర్టు చెప్పటంతో అలాంటి ఓటర్లకు ప్రస్తుతానికి తలుపులు మూసుకుపోయాయి. ఈ నెల 23న పోలింగ్ జరగబోయే 152 నియోజక వర్గాలకు సంబంధించిన ఓటర్ల తుది జాబితా సోమవారం విడుదలైంది. 29న రెండో దశలో 142 నియోజకవర్గాల్లో జరగబోయే పోలింగ్‌కు సంబంధించిన జాబితా బుధవారం అర్ధరాత్రి విడుదలవుతుంది. వ్యవధి తక్కువున్న తరుణంలో సుదీర్ఘ సమయం పట్టే ఇంత పెద్ద ప్రక్రియను ఒక అంచనా లేకుండా ఈసీ చేపట్టడాన్ని ధర్మాసనం తప్పుబట్టకపోవచ్చు గానీ, సాధారణ పౌరుల దృష్టిలో ఈసీది దోషమే అవుతుంది. ఎందుకంటే వారు బాధితులు. నిజానికి బిహార్ ‘సర్’ బెంగాల్‌తో పోలిస్తే ఎంతో మెరుగు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే తొలగింపులు పూర్తికావటం వల్ల ఫామ్–6 ద్వారా తిరిగి జాబితాలోకెక్కడానికి చాలామందికి అవకాశం వచ్చింది. బెంగాల్లో ఆ అదృష్టం దక్కలేదు. తమ పేరుందనుకునే లోగానే ఎవరో ఫామ్–7 కింద ఫిర్యాదు చేశారన్న కారణంతో ఓటర్లకు తాఖీదులు పోయాయి. పనులన్నీ మానుకుని కార్యాలయాల చుట్టూ తిరిగి అవసరమైన పత్రాలు తీసుకెళ్లినా సమస్య పరిష్కారం అనుమానమే. నిబంధనల ప్రకారం 2002 రికార్డులతో లింక్ లేని (అన్మ్యాప్డ్) సంగతి బయటపడినా, పేర్లలో అక్షర క్రమంలో స్వల్ప తేడాలొచ్చినా అనర్హులుగా జమవేయటం పెను సమస్యగా మారింది. తాజా జాబితాలో పేర్లు లేని వారిలో అనేకులు అడిగిన పత్రాలన్నీ ఇచ్చినా ఫలితం లేకపోయిందని బావురు మంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు పెద్దయెత్తున అందజేసే ఫామ్–7 పత్రాలను తీసుకుని, వాటి ఆధారంగా తొలగింపులు చేపడుతున్నారన్న ఆరోపణలు వాస్తవం అనటానికి ఒక బీజేపీ నాయకురాలి పేరిట దాఖలైన ఫిర్యాదులే తార్కాణం. ఆ సంగతే తనకు తెలియదని ఆమె చెప్పటం గమనించదగ్గ అంశం.ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతైనవారి సమస్య ఎన్నికల్లో ఓటేయలేకపోవటం మాత్రమే అయితే ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. రెండేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన దొంగ ఓటర్ల జాతర మాదిరి ఉదంతాల్లో తప్ప చాలా సందర్భాల్లో పోలింగ్ 65 శాతానికి మించదు. కానీ ఈ ‘సర్’ వల్ల గల్లంతైన వారికి భవిష్యత్తులో కష్టాలు చుట్టుముడతాయి. వారి పౌరసత్వమే సంశయాస్పదంగా మారి దేశం నుంచి గెంటేసే ప్రమాదం ఏర్పడుతుంది. బెంగాల్లో పార్టీల మధ్య ఉన్న కలహాలు సాధారణ ఓటర్ల భవితవ్యాన్ని అగమ్యగోచరం చేస్తున్నాయి. ఈసీ సక్రమంగా వ్యవహ రించివుంటే, ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లు చేసుకుంటే సమస్యలు తలెత్తేవి కాదు. ఆ సంస్థ చేతగానితనం సామాన్యుల బతుకుల్ని అయోమయంలోకి నెట్టింది. -
మోదీని పినరయి విజయన్ ఫాలో అవుతున్నారు: రేవంత్
తిరువనంతపురం: కేరళం అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లపై కేరళ సీఎం పినరయి విజయన్ ఎక్స్‌లో ఘాటుగా సమాధానం చెప్పారు. దీంతో రేవంత్ రెడ్డి మళ్లీ స్పందిస్తూ ఆ వ్యాఖ్యలకు దీటుగా బదులిస్తూ పినరయి విజయన్‌కు ఓ లేఖ రాశారు. ఎక్స్‌లో విజయన్ స్పందనను చదివానని.. అందులో తప్పుదారి పట్టించే అంశాలతో పాటు ముఖ్యాంశాల్లో లోపాలు ఉన్నాయని చెప్పారు.రేవంత్ రెడ్డి రాసిన లేఖపై ఇవాళ (ఏప్రిల్ 7న) ఆయనను మీడియా ప్రశ్నించింది. దీనికి రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. "పినరయి విజయన్ ఎప్పుడు సిద్ధంగా ఉన్నా ఆయనతో చర్చకు నేను సిద్ధమే. ఆయనకు రోల్ మోడల్స్ ఎవరు? నరేంద్ర మోదీ, అమిత్ షా లేదా జ్యోతి బసు, సోమనాథ్ చటర్జీ? నరేంద్ర మోదీని పినరయి విజయన్ రోల్ మోడల్‌గా తీసుకున్నారు. ఇది కేరళం ప్రజలకు ఆమోదయోగ్యం కాదు. అతను ఇంకో నరేంద్ర మోదీలా పినరయి విజయ్ ప్రచారం చేస్తున్నారు" అని అన్నారు.కాగా, తాను అన్ని అంశాలపై చర్చించేందుకు మంగళవారం (ఏప్రిల్ 7న) త్రివేండ్రం వస్తానని, అన్ని విషయాలపై గణాంకాలతో సహా చర్చ జరుపుదామని లేఖలో విజయన్ను రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. పినరయి విజయ్ను రేవంత్ రెడ్డి మోదీతో పోల్చుతుండడం గమనార్హం. -
‘సైలెంట్ పీరియడ్’ షురూ.. ఈ 48 గంటల్లో..
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరానికి సమయం ఆసన్నమైన వేళ, కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. పోలింగ్‌కు ముందు తప్పనిసరిగా అమలు చేసే 48 గంటల ‘సైలెంట్ పీరియడ్’లో రాజకీయ పార్టీలు, మీడియా పాటించాల్సిన కఠిన నిబంధనలను మరోసారి స్పష్టం చేసింది.సైలెంట్ పీరియడ్ అంటే ఏంటి?అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో ఏప్రిల్ తొమ్మదిన పోలింగ్ జరగనుంది. తమిళనాడులో ఏప్రిల్ 23న, పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. ప్రజాప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 126 (1)(b) ప్రకారం.. పోలింగ్ ప్రక్రియ ముగియడానికి ముందున్న 48 గంటల సమయాన్ని ‘సైలెంట్ పీరియడ్’ అని అంటారు. ఈ సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే లేదా ఏదైనా రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండే ఎలాంటి సమాచారాన్ని మీడియా లేదా ఇతర పబ్లిక్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రసారం చేయకూడదు.ఈ 48 గంటల్లో నిబంధనలు ఏంటి?ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నికలకు సంబంధించిన అంశాలు, ఒపీనియన్ పోల్స్, సర్వే ఫలితాలు ప్రసారం చేయడం పూర్తిగా నిషేధం.టీవీ, రేడియో, కేబుల్ నెట్‌వర్క్‌లు, సినిమా హాళ్లలో రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదు. ఎస్ఎంఎస్, వాయిస్ మెసేజ్‌లు, ఆడియో విజువల్ ప్రదర్శనల ద్వారా ప్రచారం చేయరాదు.స్టార్ క్యాంపెయినర్లు, రాజకీయ నాయకులు ప్రెస్ మీట్లు నిర్వహించడం గానీ, ఎన్నికల గురించి ఇంటర్వ్యూలు ఇవ్వడం గానీ చేయకూడదు.పోలింగ్ ప్రాంతంలో మద్యం విక్రయాలు, పంపిణీపై పూర్తి నిషేధం (డ్రై డే) ఉంటుంది.ఎగ్జిట్ పోల్స్‌పై బ్యాన్ఓటర్లు ప్రభావితం కాకుండా ఉండేందుకు ఎగ్జిట్, ఒపీనియన్ పోల్స్‌పై ఈసీ పూర్తి నిషేధం విధించింది. ఏప్రిల్ 9వ తేదీ ఉదయం 7 గంటల నుంచి ఏప్రిల్ 29 సాయంత్రం 6.30 గంటల వరకు ఈ బ్యాన్ అమలులో ఉంటుంది. ఈ ఐదు రాష్ట్రాలతో పాటు గోవా, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లో జరిగే ఎనిమిది ఉప ఎన్నికలకూ ఇది వర్తిస్తుంది. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాలకు ఈ నిబంధనలు సమానంగా వర్తిస్తాయి.ఉల్లంఘిస్తే ఏమవుతుంది?ఈ నిబంధనలను ఉల్లంఘించి ఈ 48 గంటల సైలెంట్ పీరియడ్‌లో ప్రచారం చేసినా, నిబంధనలు అతిక్రమించినా రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా.. లేదంటే రెండూ విధించే అవకాశం ఉంది. ఇది కూడా చదవండి: కేరళ వరదలు.. సంచలన ఆడియో విడుదల -
Assam: పవన్ ఖేడా ఇంటికి పోలీసులు!
మరో రెండురోజుల్లో అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ అక్కడి రాజకీయాలు మరింత వేడెక్కాయి. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్మ రిణికి భూయాన్ శర్మ వద్ద మూడు దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని, దీంతోపాటు ఆమె ఆస్తులను ఆయన అఫిడవిట్లో వెల్లడించకుండా దాచి పెట్టారని కాంగ్రెస్ నేత పవన్ ఖేడా ఆరోపించిన విషయం తెలిసిందే. పవన్ ఖేడా వ్యాఖ్యలపై సీఎం సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అస్సాం పోలీసుల బృందం మంగళవారం దిల్లీలోని పవన్ ఖేడా నివాసానికి వెళ్లారు. అయితే పోలీసులు వెళ్లే సమయానికి పవన్ ఖేడా అక్కడ లేకపోవడంతో.. వారు ఆయనకోసం ఎదురుచూస్తున్నారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. పవన్ ఖేడా తనపై తప్పుడు ఆరోపణలు చేశారని హిమంత సతీమణి రిణికి భూయాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. భారత్ ఎటువంటి ద్వంద్వ పౌరసత్వాన్ని అనుమతించదని.. కానీ తనకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయని కాంగ్రెస్ నేత నిరాధార ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. త్వరలో ఎన్నికలు జరగనున్న సమయంలో తమ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే కాంగ్రెస్ నేతలు ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఏప్రిల్ 9న అస్సాంలోని 126 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.చదవండి: Assam: అభ్యర్థుల భవితవ్యం వాళ్ల చేతుల్లోనే! -
అఫిడవిట్ వైరల్.. మాజీ సీఎంకు ఇల్లు, కారు లేవు!
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం సోమవారంతో ముగిసింది. సుమారు 5 వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజున ఎడప్పాడిలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి పలువురు కీలక నేతలు నామినేషన్లు సమర్పించారు. అయితే, పళనిస్వామి నామినేషన్ అఫిడవిట్‌పై చర్చ మొదలైంది.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ మాజీ సీఎం పళనిస్వామి నామినేషన్ చర్చనీయాంశంగా మారింది. ఆయన తన కుటుంబానికి రూ.8.99 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. అలాగే, తనకు చరాస్తులు రూ.50.86 లక్షలు ఉన్నాయని.. ఇల్లు, ఇంటి స్థలం, వ్యవసాయ భూమి, వంటి స్థిరాస్తులేవని చెప్పారు. తనకుగానీ, తన కుటుంబానికి గానీ ఎలాంటి వాహనాల్లేవని వెల్లడించారు. ఆయన సతీమణి రాధకు స్థిర, చరాస్థులు కలిపి రూ.5.61 కోట్లు ఉన్నట్లు, ఉమ్మడి కుటుంబం పేరుమీద మరో రూ.2.87 కోట్ల ఆస్తి ఉన్నట్లు పళనిస్వామి చెప్పారు. దీంతో, ఆయన అఫిడవిట్ చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు స్పందిస్తున్నారు. ఆయన అబద్దం చెబుతున్నారని ఆరోపిస్తున్నారు.ముగిసిన నామినేషన్ల పర్వంమార్చి 15న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకాగా, 30వ తేది నుంచి నామినేషన్లు స్వీకరించారు. ఇందులో మూడు రోజులు సెలవు దినాలు వచ్చాయి. ఎట్టకేలకు సోమవారం సాయంత్రం మూడు గంటలతో నామినేషన్లు ముగిశాయి. మంగళవారం పరిశీలన జరుగుతోంది. ఉప సంహరణ తర్వాత ఈనెల 9వ తేదీన తుది జాబితాను ప్రకటించనున్నారు. సమాచారం మేరకు రాష్ట్రంలో 5072 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో పురుషులు 4097, మహిళలు 974, ఇతరులు ఒకరు ఉన్నారు. -
ఈసారి గెలవకపోతే..? తమిళిసై భవిత ఏంటి!
ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఒక్క సారైనా విజయకేతనం ఎగురవేయాలన్న ఆకాంక్షతో గవర్నర్ పదవిని సైతం త్యాగం చేసి వరుస ఎన్నికలను బీజేపీ మహిళా సీనియర్ నేత తమిళి సై సౌందరరాజన్ ఎదుర్కొంటూ వస్తున్నారు. తాజాగా ఆమె ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ మైలాపూర్ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. అయితే సిట్టింగ్ సీటులతో తనదే మళ్లీ విజయం అన్న ధీమాతో డీఎంకే అభ్యర్థి టీ వేలు ఉన్నారు. ఇక ఈ ఇద్దరీ మధ్యలో ఓట్లను చీల్చే దిశగా తమిళగ వెట్రి కళగం (టీవీకే), నామ్ తమిళర్ కట్చి (ఎన్టీకే) అభ్యర్థులు ఉన్నారు.సాక్షి,చెన్నై : తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో అత్యంత పురాతన ప్రాంతాలలో మైలాపూర్ ఒకటి. ప్రసిద్ధ కపాలీశ్వరర్ ఆలయం, శాంతోమ్ చర్చి ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో అన్నాడీఎంకే ఏడు సార్లు విజయ కేతనం ఎగుర వేసింది. గతంలో రెండు సార్లు గెలిచినా, చివరకు రెండు దశాబ్దాల తర్వాత 2021లో డీఎంకే అభ్యర్థి టి. వేలు పాగా వేశారు. ఇక, ఇక్కడ ఒకప్పుడు కాంగ్రెస్ మూడు సార్లు గెలిచినా, ఐదు దశాబ్దాలుగా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి పోటీకి సాహసించ లేదు. ఇక, 2001లో ఇక్కడ బీజేపీ విజయ ఢంకా మోగించింది. అప్పటి సీనియర్ నేత కేఎన్ లక్ష్మణన్ గెలిచారు. గెలుపు గుర్రం ఎవరో.. ఇక్కడ మొత్తం 1,94,731 ఓటర్లు ఉన్నారు. మహిళా ఓటర్లే ఎక్కువ. పురుషులు 93,017, మహిళలు 1,01,691, ఇతరులు 23 మంది ఉన్నారు. మైలాపూర్‌లో మత్స్యకార సామాజిక వర్గం, బ్రాహ్మణ సామాజిక వర్గం ఓట్లు అత్యంత కీలకం. ఈ ఓటుతో డీఎంకే తన పట్టును నిలుపుకుంటుందా? లేదా తమిళిసై ద్వారా ఇక్కడ కమలం వికసిస్తుందా..? లేదా విజయ్ రూపంలో విజిల్ మోత మోగేనా అన్నది వేచి చూడాల్సిందే. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఈ పరిధిలోని మందవేలి, అభిరామపురం వంటి ప్రాంతాల్లో డ్రైనేజీ సమస్యలు, పాత నివాస ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కొరత ప్రధానంగా మారింది. మెట్రో రైలు పనుల కారణంగా నిత్యం ట్రాఫిక్ జాం ఏర్పడటం సామాన్యులకు పెద్ద ఇబ్బందిగా మారింది. వేసవిలో తాగునీటి ఎద్దడి, వర్షాకాలంలో వర్షపు నీరు నిలిచిపోవడం వంటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఓటర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.తమిళిసై విశ్వ ప్రయత్నంతమిళిసై సౌందరరాజన్ ఆమె తమిళనాడుకే కాదు, తెలంగాణ, పుదుచ్చేరికి సైతం సుపరిచితురాలే. సాధారణ కార్యకర్త స్థాయి నుంచి బీజేపీలో పనిచేస్తున్నారు. తమిళనాడు పార్టీ అధ్యక్షురాలిగా సైతం సేవలు అందించారు. అయితే, ఆమె ఆకాంక్ష అంతా ఒక్కసారైనా ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవాలన్నదే. 2006, 2011 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009, 2019 లోక్‌సభ ఎన్నికలలో సైతం పోటీ చేసినా అదృష్టం దక్కలేదు. చివరకు ఆమెకు తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఏక కాలం పనిచేసే అవకాశం దక్కింది. అయినా, ఎన్నికలలో పోటీ చేసి గెలవాలన్న ఆకాంక్ష ఆమెలో తగ్గలేదు. గవర్నర్ పదవికి రాజీనామా చేసి మరీ 2024 లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసినా అదృష్టం దక్కలేదు. ఈ పరిస్థితులలో తాజాగా అసెంబ్లీ ఎన్నికలలో మైలాపూర్ నుంచి ఎన్నికల రేసులోకి దిగారు. ఈసారి తనకు ఓటర్లు ఒక్క ఛాన్స్ ఇస్తారన్న నమ్మకంతో ఉన్నారు. ఇందుకు అన్నాడీఎంకే, పీఎంకే , టీఎంసీ తదితర పార్టీలతో కూడిన తమ కూటమి బలంతో పాటూ బ్రహ్మణ సామాజిక వర్గం ఓట్లు కూడా కలిసి వస్తుందన్న ధీమా కారణంగా చెప్పవచ్చు. ఇక ఆమె డీఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యే టీ వేలును ఢీ కొడుతున్నారు. స్థానికుడైన వేలు నిత్యం ప్రజల్లోనే ఉండే వ్యక్తి కావడంతో గెలుపు కోసం ఆమె మరింత శ్రమించక తప్పదు. గత ఐదు సంవత్సరాలలో తాను చేసిన అభివృద్ధి గెలిపిస్తుందన్న ధీమా వేలులో ఉన్నప్పటికీ, టీవీకే తరపున ఆ పార్టీ కోశాధికారి వెంకటరమణన్ ఇక్కడ రేసులో ఉండడంతో ఓట్ల చీలిక టెన్షన్ రేపుతోంది.విజయ్ అభిమానులు, యువతను ఆకట్టుకునే ప్రయత్నంలో వెంకటరమణన్ ఉన్నారు. నామ్ తమిళర్‌కట్చి(ఎన్టీకే) అభ్యర్థిగా అరుణ్ పోటీ చేస్తున్నారు. తమిళ జాతీయవాదం, స్వచ్ఛమైన రాజకీయాల నినాదంతో ప్రచారంలో ఉరకలు తీస్తున్నారు. వీరితో పాటూ తమిళగ ద్రావిడర్ కట్చి నుండి మూర్తి, స్వతంత్ర అభ్యర్థిగా స్థానికుడైన విజయకృష్ణ కూడా ఇక్కడ రేసులో ఉన్నారు. -
ఎన్డీయేకు టెన్షన్.. ఎన్నికల మీటింగ్‌లో హైడ్రామా
కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు తారస్థాయికి చేరింది. పాలక ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ కూటములు పోటాపోటీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. బీజేపీ కూడా ఈసారి రాష్ట్రంలో గట్టిగా ఉనికి చాటుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో ఎన్డీయేలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఎన్నికలకు సంబంధించిన కీలక సమావేశంలో ఎన్డీయే అభ్యర్థి ఒకరు అసహనం వ్యక్తం చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే..అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తిరువనంతపురంలోని మాస్కాట్ హోటల్లో ఎన్డీయే కూటమి ఎన్నికల కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో ఎన్డీయే కూటమి అభ్యర్థులు, స్థానిక బీజేపీ నేతలు పాల్గొన్నారు. సమావేశంలో కేంద్రమంత్రి జైశంకర్ ప్రసంగిస్తున్న సమయంలో అక్కడ హైడ్రామా చోటుచేసుకుంది. జైశంకర్ కేవలం.. రాజీవ్ చంద్రశేఖర్ అభ్యర్థిత్వాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆయన విజయాన్ని ఖాయం చేయాలని ఓటర్లను కోరారు. అయితే, ఆయన ప్రసంగంలో వట్టియూర్కావు నియోజకవర్గం కూటమి అభ్యర్థి ఆర్. శ్రీలేఖ పేరును ప్రస్తావించకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అవమానంగా భావించారు.దీంతో, కూటమి అభ్యర్థి శ్రీలేఖ నిరసనగా వాకౌట్ చేయడంతో హై డ్రామా చోటుచేసుకుంది. అంతేకాకుండా ప్రారంభోపన్యాసంలో శ్రీలేఖ పేరును గానీ, ఆమె నియోజకవర్గాన్ని గానీ ప్రస్తావించలేదని తెలిసింది. ఈ క్రమంలో అసంతృప్తితో ఉన్న శ్రీలేఖ ఎన్డీయే నేతలను ప్రశ్నిస్తూ ఆ ప్రాంగణం నుండి నిష్క్రమించారు. ప్రచారం చివరి, కీలక దశలోకి ప్రవేశిస్తున్న తరుణంలో ఆమె అలా వెళ్లిపోవడం స్థానిక నాయకత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఇంతలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ సీనియర్ నాయకులు వేగంగా జోక్యం చేసుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఎస్. ఓమన, వి.వి. రాజేష్ సహా రాష్ట్ర నాయకులు, శ్రీలేఖ సమస్యలను పరిష్కరించడానికి ఆమెతో చర్చలు జరిపారు. వారు నచ్చజెప్పిన తర్వాత, ఆమె తిరిగి హోటల్‌కు చేరుకుని కార్యక్రమాలలో పాల్గొన్నారు.Heartwarming news coming out of Kerala: > S. Jaishankar was in Vattiyoorkavu to campaign for R. Sreelekha.> During his speech, Jaishankar mentioned Rajiv Chandrashekhar, who's fighting from another constituency.> But he forgot to mention Sreelekha. She left the stage in… pic.twitter.com/IpMe1ulQCr— Jawaharlal Nehru (@PMNehru) April 6, 2026ఇదిలా ఉండగా.. ఆర్. శ్రీలేఖ వట్టియూర్కావు నియోజకవర్గానికి ఎన్డీఏ అభ్యర్థి. ఆమె కేరళలో తొలి మహిళా ఐపీఎస్ అధికారి, అలాగే రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (DGP) పదవిని చేపట్టిన మొదటి మహిళ. రిటైర్మెంట్ తర్వాత బీజేపీలో చేరి, స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి విజయాలు సాధించారు. ప్రస్తుతం ఆమె వట్టియూర్కావు నుంచి పోటీ చేస్తున్నారు. అయితే, తరచూ వివాదాల్లో నిలవడం ఆమె ప్రచారానికి సవాలుగా మారుతోంది. -
వార్నీ.. వేలికి సిరా ఉంటే చాలు.. ఆఫర్లే ఆఫర్లు!
తిరువనంతపురం: ఓటు వేయడం మన ప్రాథమిక బాధ్యతే కాదు.. అది ఇప్పుడు అదిరిపోయే ఆఫర్లను కూడా అందిస్తోంది. ఏప్రిల్ 9న జరగనున్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను పోలింగ్ బూత్‌లకు రప్పించేందుకు ఎన్నికల సంఘం పలు సంస్థలతో కలిసి వినూత్న ప్రయత్నాలు చేస్తోంది. ఓటు హక్కు వినియోగించుకున్న వారికి ప్రముఖ ‘కేఫ్ కాఫీ డే’(సీసీడీ) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓటు వేసినట్లు వేలిపై ఉన్న సిరా చుక్కను చూపిస్తే చాలు.. కాఫీపై ఏకంగా 25 శాతం డిస్కౌంట్ అందిస్తోంది.ముందు వచ్చిన వారికే ఛాన్స్..ఓటింగ్ శాతాన్ని, ముఖ్యంగా యువత భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో ఎన్నికల సంఘం, కేఫ్ కాఫీ డే సంయుక్తంగా ఈ ఆఫర్‌ను తీసుకువచ్చాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రతన్ యు. కేల్కర్ వెల్లడించారు. అయితే ఈ ఆఫర్ అందరికీ కాదు.. రాష్ట్రంలోని ప్రతి కేఫ్ కాఫీ డే ఔట్లెట్లో.. సిరా చుక్కను చూపించిన మొదటి 15 మంది కస్టమర్లకు మాత్రమే ఈ 25శాతం రాయితీ లభిస్తుంది. ముందుగా ఓటు వేసిన వారికే ఈ లక్కీ ఛాన్స్ దక్కనుంది.తొలి ఓటుకు తీయని ‘హల్వా’..యువతను ఆకట్టుకునేందుకు కేవలం కాఫీ డిస్కౌంట్ మాత్రమే కాదు.. తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకునే యువ ఓటర్లకు సాంప్రదాయబద్ధంగా తీయటి ‘హల్వా’ను బహుమతిగా ఇవ్వాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.ఉబెర్ ఉచిత రైడ్స్.. రూ.1 కే బియ్యం పిండిఓటర్లు పోలింగ్ కేంద్రాలకు సులభంగా చేరుకునేందుకు ప్రఖ్యాత క్యాబ్ సేవల సంస్థ ‘ఉబెర్’ సైతం ముందుకు వచ్చింది. ఎర్నాకులం, తిరువనంతపురం నగరాల్లో.. పోలింగ్ స్టేషన్‌కు రెండు కిలోమీటర్ల పరిధిలో ప్రయాణించే ఓటర్లకు ఉచిత రైడ్లను ఉబెర్ అందిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ 'సప్లైకో' (SupplyCo) స్థానిక ప్రజల ప్రయోజనార్థం మరో ప్రత్యేక పథకాన్ని పరిశీలిస్తోంది. ఎన్నికల ముగిసిన వెంటనే అంటే ఏప్రిల్ 10, 11 తేదీలలో కేవలం ఒక్క రూపాయినే (Re 1) బియ్యం పిండిని అందించే యోచనలో ఉంది. మొత్తానికి.. ఓటర్లలో ఉత్సాహం నింపి, ఈ ప్రజాస్వామ్య పండుగలో అందరినీ భాగస్వాములను చేసేందుకు కేరళలో ముందెన్నడూ చూడని రీతిలో ఆఫర్లు సిద్ధమయ్యాయి.ఇది కూడా చదవండి: ఎన్నికల వేళ.. షాకిస్తున్న కేరళ సర్కారు వైఖరి! -
పాకిస్తాన్‌కు వార్నింగ్.. అభిషేక్ బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
కోల్కత్తా: బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం హీటెక్కింది. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ వ్యాఖ్యలకు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ బెనర్జీ స్ట్రాంగ్ కౌంటరిచ్చారు. తామే పాకిస్తాన్‌లోని వారి ఇళ్లలోకి చొరబడి చంపేస్తామని హెచ్చరించారు. దీంతో, బెంగాల్ రాజకీయంలో మరింత చర్చకు దారి తీసింది.తృణముల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ సోమవారం బెంగాల్‌లోని సిలిగురిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోల్‌కతాపై పాకిస్తాన్ ఇటీవల చేసిన హెచ్చరికకు కేంద్రం స్పందించిన తీరుపై విమర్శలు గుప్పించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ.. ‘భారత్-పాకిస్తాన్ మధ్య భవిష్యత్తులో ఘర్షణలు తలెత్తితే కోల్‌కతా లక్ష్యం కావచ్చని పాకిస్తాన్ నాయకుడు ఒకరు మాట్లాడారు. కోల్‌కతాను పేల్చివేస్తామని ఖవాజా ఆసిఫ్ అన్నారు. మన ప్రధానమంత్రి, హోం మంత్రి, రక్షణ మంత్రి.. ఆయన వ్యాఖ్యలకు మౌనంగా ఉండిపోయారు. కానీ, నేను మాత్రం ఊరుకోను. నేను నా జాబితాలో ఖవాజా ఆసిఫ్ పేరు రాసుకున్నాను. మమతా బెనర్జీ, ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజు.. మేము వారి ఇళ్లలోకి చొరబడి వారిని చంపుతాము’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, అతను పాకిస్తాన్లో కూర్చుని కోల్‌కతాపై దాడి చేస్తామని బెదిరిస్తున్నాడు. దీనిపై అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ మౌనంగా ఉన్నారు. బెంగాల్ విషయంలో మాత్రం అమిత్ షా మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. ఆయన ప్రతీరోజు మమ్మల్ని బంగ్లాదేశీయులు, పాకిస్తానీయులు అని పిలుస్తారు. కానీ, పాకిస్తాన్ కోల్‌కతాను బెదిరించినప్పుడు మాత్రం ఆయన మూగ ప్రేక్షకుడుగా మారిపోతారు. ప్రధాని మోదీ కూడా బెంగాల్లో టీఎంసీని ఓడించాలని ఎన్నికల ప్రచారంలో చెబుతున్నారు. కానీ, పాకిస్తాన్ వ్యాఖ్యలపై ఆయన కూడా స్పందించరు అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. ఆయన వ్యాఖ్యలతో బెంగాల్లో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఇక, అంతకుముందు.. భారత్‌ను ఉద్దేశించి పాక్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ మరోసారి ప్రేలాపనలు చేశారు. భవిష్యత్తులో భారత్ ఏదైనా దాడులకు పాల్పడితే.. కోల్‌కతానూ లక్ష్యంగా చేసుకుంటామన్నారు. ప్రతిదాడులను ఆ ప్రాంతం వరకూ తీసుకెళ్తామంటూ వ్యాఖ్యానించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. -
బెంగాల్ రణరంగం: ‘దీదీ’ ముంగిట అతిపెద్ద గండం
గడచిన 15 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్ రాజకీయాలను ఏకఛత్రాధిపత్యంగా శాసిస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తన ప్రయాణంలో ఎన్నో రాజకీయ సవాళ్లు ఎదురయ్యాయి. అయితే ప్రతిసారీ ఆమెదే పైచేయి అవుతూ వచ్చింది. దశాబ్దం క్రితం శారద, నారద వంటి కుంభకోణాలు చుట్టుముట్టినా, 2011లో మునుపటి కన్నా 27 సీట్లు అదనంగా సాధించి, ఆమె సత్తా చాటి తొలిసారి సీఎం అయ్యారు. ఇక 2016లో 211 సీట్లతో టీఎంసీ విజయ ఢంకా మోగించింది. ఇక 2021లో అధికార వ్యతిరేకత, బీజేపీ సృష్టించిన భారీ ఫిరాయింపుల సునామీని సైతం ‘లక్ష్మీర్ భండార్’ అనే మహిళా సంక్షేమ పథకం సాయంతో మమత తిప్పికొట్టారు. అలాగే రికార్డు స్థాయిలో 215 సీట్లు కైవసం చేసుకున్నారు. అయితే ఈ ఏప్రిల్(2026) నెలాఖరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు ‘దీదీ’కి నిద్రలేకుండా చేస్తున్నాయి. ఈసారి ఆమెకు ప్రధాన శత్రువులు ప్రతిపక్షాలు కాదు.. ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణే అని విశ్లేషకులు అంటున్నారు.లోలోపల టెన్షన్..పైకి అంతా సవ్యంగానే ఉన్నట్లు, ధీమాగా కనిపిస్తున్నా.. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)అభ్యర్థుల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ‘చాలా ఒత్తిడి ఉంది.. 226 స్థానాల టార్గెట్‌ను చేరుకోవడం కష్టమే అనిపిస్తోంది’ అని స్వయంగా ఓ టీఎంసీ అభ్యర్థి పెదవి విరవడం క్షేత్రస్థాయి పరిస్థితికి అద్దం పడుతోంది. ఏప్రిల్ 23న తొలిదశ పోలింగ్ జరగనుంది. కాగా 152 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా 35,97,704 మంది ఓటర్ల భవితవ్యం ఎన్నికల సంఘం చేపట్టిన ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) కారణంగా గాలిలో దీపంలా మారింది. ఎంతమంది ఓటు హక్కు కోల్పోతారోనన్న స్పష్టత లేకపోవడం తృణమూల్ శ్రేణులను వెంటాడుతోంది.కంచుకోటకు భారీ దెబ్బఓటర్లే పునాదిగా నిర్మించుకున్న మమత కంచుకోటను ఈసీ ఓటర్ల సవరణ ప్రక్రియ బలంగా కొడుతోందని టీఎంసీ భావిస్తోంది. విచారణ (అడ్జుడికేషన్)లో ఉన్న 60.06 లక్షల మంది ఓటర్లలో ఏప్రిల్ 5 నాటికి 57 లక్షల కేసులను ఈసీ పరిష్కరించింది. అయితే, ఈ ప్రక్రియ ఎంత అస్తవ్యస్తంగా ఉందో చెప్పేందుకు ఓ గణాంకం సాక్ష్యంగా నిలుస్తోంది. ముస్లిం జనాభా అధికంగా ఉండే నార్త్ దినాజ్‌పూర్‌లోని ఒక్క 'గోల్పోఖర్' నియోజకవర్గంలోనే 78,475 మంది ఓటర్లు విచారణలో ఉండగా.. గిరిజన జనాభా అధికంగా ఉండే బంకురా, పురూలియా జిల్లాలను పూర్తిగా కలిపినా ఆ సంఖ్య 72,694 మాత్రమే ఉండటం గమనార్హం.‘కేంద్రం కుట్రపూరితంగా..’బరాక్‌పూర్ టీఎంసీ ఎంపీ పార్థా భౌమిక్ మాట్లాడుతూ ‘మైదానంలో మాకు ప్రతిపక్షమే లేదు. మేం నేరుగా ఎన్నికల సంఘంతోనే పోరాడుతున్నాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం కుట్రపూరితంగా ఈసీ ద్వారా ప్రజల ఓటు హక్కును హరించాలని చూస్తోందని, అయినా బెంగాల్ ప్రజలు నాలుగోసారి మమతా దీదీకే పట్టం కడతారని మంత్రి చంద్రమా భట్టాచార్య ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఎన్నికల గణాంకాలు టీఎంసీకి ఏమాత్రం సానుకూలంగా లేవు. 2021లో 55 స్థానాల్లో టీఎంసీ 15,000 లోపు మెజారిటీతో బయటపడింది. అందులో 39 చోట్ల మెజారిటీ 10 వేల లోపే. ఒకవేళ ఏమాత్రం వ్యతిరేక పవనాలు వీచినా, ఈ 55 సీట్లు చేజారి, టీఎంసీ బలం 170కి పడిపోతుంది.సొంత నియోజకవర్గంలో సెగలు2024 లోక్‌సభ లెక్కల ప్రకారం చూస్తే, అసెంబ్లీ సెగ్మెంట్లలో 15 వేల లోపు స్వల్ప మెజారిటీ ఉన్న స్థానాలు 69కి పెరిగాయి. దీదీ సొంత నియోజకవర్గం భవానీపూర్, మానిక్తల, రాస్ బిహారీలలో మార్జిన్ తగ్గగా.. రాజార్హట్-గోపాల్‌పూర్‌లో మెజారిటీ కేవలం 74 ఓట్లే! ఈ లెక్కన స్వల్ప స్వింగ్ వచ్చినా టీఎంసీ మ్యాజిక్ ఫిగర్ కంటే తక్కువగా 146కి పడిపోయే ప్రమాదం ఉంది. ముస్లిం బెల్ట్ అయిన నార్త్ దినాజ్‌పూర్, మాల్డా, ముర్షిదాబాద్, బీర్భూమ్ (తొలి దశ పోలింగ్)లలోని 52 స్థానాలతో పాటు, సౌత్, నార్త్ 24 పరగణాలు, హౌరా జిల్లాల్లో టీఎంసీకి ఎదురులేదని విశ్లేషకులు చెబుతున్నారు.వణికిస్తున్న నార్త్ బెంగాల్నార్త్ బెంగాల్ మాత్రం టీఎంసీ పార్టీకి అతిపెద్ద బలహీనతగా మారింది. ఓటర్ల జాబితా అప్పీళ్ల ప్రక్రియను సరిదిద్దేందుకు పార్టీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ప్రతిరోజూ ప్రచారం ముగిశాక అర్ధరాత్రి వరకూ కుస్తీ పడుతున్నారు. తమ సగం శ్రమను ఈసీతో పోరాడటానికే వెచ్చించాల్సి వస్తోందని టీఎంసీ వర్గాలు వాపోతున్నాయి. మరోవైపు ఈ ఎన్నికల్లో బీజేపీ వంద సీట్లు దాటినా అది తమకు పెద్ద ప్రమాద హెచ్చరికేనని టీఎంసీ చెబుతోంది. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీని చిత్తు చేస్తే, ఆ ప్రభావం 2029 లోక్‌సభ ఎన్నికల వరకు ఉంటుందని కూడా విశ్వసిస్తోంది. ‘మే 4తో మా పోరాటం ముగియదు.. 2029 వరకు కొనసాగుతుంది’ అంటూ ఓ టీఎంసీ నేత చేసిన వ్యాఖ్యలు.. ఈ ఎన్నికలు ఆ పార్టీని ఎంతలా భయపెడుతున్నాయో చెప్పకనే చెబుతున్నాయి.ఇది కూడా చదవండి: విజయ్ కొత్త అఫిడవిట్.. వెలుగులోకి రెండు కేసులు -
కాంగ్రెస్ నోట పాక్ పాట
బార్పేట/హోజాయ్/దిబ్రూగఢ్: ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ విమర్శల జడి కురిపించారు. ‘‘పాకిస్తాన్‌కు అనుగుణంగా కాంగ్రెస్ నడుచుకుంటోంది. తాజా ఘటనలే ఇందుకు సాక్ష్యం’’ అన్నారు. సోమవారం అస్సాంలోని బార్పేట, హోజాయ్, దిబ్రూగఢ్‌లలో మోదీ ఎన్నికల సభల్లో ప్రసంగించారు. ‘‘2016 సర్జికల్ దాడులు మొదలు సిందూర్ దాకా మనం చేపట్టిన ప్రతి ఆపరేషన్‌లోనూ కాంగ్రెస్ పాక్‌కే వంతపాడుతోంది. పాక్ ఎజెండాకే విలువిస్తోంది. దశాబ్దాల తరబడి మాజీ సైనికులకు వన్‌ర్యాంక్–వన్ పెన్షన్ విధానం అమలు చేయకుండా కాంగ్రెస్ మాజీ సైనికులకు ద్రోహంచేసింది. మేం వచ్చాక రూ.1.24 లక్షల కోట్లను నేరుగా వాళ్ల బ్యాంక్ ఖాతాలో జమచేశాం. రాహుల్‌గాంధీ ప్రేమ దుకాణాలు తెరిచానని గొప్పగా చెప్పుకుంటారుకానీ వాస్తవానికి ఆయన అబద్ధాల దుకాణాలు, అవమానకర షాప్‌లు తెరిచారు. ప్రజల నుంచి బీజేపీ భూములు లాక్కుందని ఆరోపిస్తారుగానీ నేషనల్ హెరాల్డ్, రాజీవ్‌గాంధీ చారిటబుల్ ట్రస్ట్ తదితరాల గుప్పిట్లో ఎంత భూమి ఉందో చెప్పరు. కాంగ్రెస్ హయాంలో అస్సాంలో గుంతలు పడ్డ రోడ్లపై వాహనాలు కూడా సరిగా నడపలేని దుస్థితి. మేం ఏకంగా యుద్ధ విమానాలు అత్యవసరంగా ల్యాండ్ అయ్యేంత పటిష్టంగా రోడ్లు నిర్మించాం’’అంటూ మొరాన్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ రహదారిని ఉద్దేశించి మోదీ చెప్పారు.మోదీ మెచ్చిన స్ఫటిక కమలం ఇటీవల కేరళలోని తిరువళ్లలో ప్రచార సభలో మోదీ ప్రసంగం మధ్యలో ఉన్నట్టుండి ఎస్పీజీ కమెండోలను పిలిచారు. ‘‘స్ఫటిక కమలం ఆకృతిలోని పేపర్వెయిట్ను ఈ సభలో చూశా. అలాంటిది ఒకటి కావాలి. కుదిరితే తెప్పించండి’’ అని సూచించారు. వెంటనే రంగంలోకి దిగిన నిర్వాహకులు సభలో క్రిస్టిల్ కమలం ఎవరి వద్ద ఉందా అని ఆరా తీశారు. దాన్ని ఎక్కడ కొన్నారో కనుక్కున్నారు. తిరువళ్ల ప్రైవేట్ బస్టాండ్ సమీపంలోని ఆ దుకాణానికి వెళ్లి రెండింటిని కొని ప్రజాపనుల శాఖ గెస్ట్‌హౌస్ వద్ద ఎస్పీజీ అధికారులకు అందజేశారు. అదే రాత్రి వాటిని ఢిల్లీకి పంపించారు. మోదీ మెచ్చిన ఆ పేపర్ వెయిట్‌ను ప్రాచీన ఫెంగ్ షుయీ విధానంలో తయారు చేశారు. దాంట్లో 16 పూల రేకులు ఒక ఆధారానికి అతికించి ఉన్నాయి. దాన్ని తిప్పితే అందమైన పూల రేకులన్నీ తిరుగుతాయి. -
మోదీ దురహంకారి
త్రిసూర్/పాలక్కడ్: ప్రధాని మోదీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోమారు విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. త్రిసూర్ జిల్లాలోని మాలా, కున్నంకులమ్ పట్టణాలతోపాటు పాలక్కడ్ జిల్లా కేంద్రంలో సోమవారం రాహుల్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొని ప్రసంగించారు. ‘‘మోదీ, పినరయి విజయన్‌లకు దురహంకారం చాలా ఎక్కువ. ప్రజలతో కలిసి పనిచేయడం మానేసి రాజు అనే ఆలోచనాధోరణితో వ్యవహరిస్తారు. తమను విమర్శించే పార్టీలు, వ్యక్తులను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటుంది. కానీ కేరళలో సీఎం, ఆయన కుటుంబం వైపు బీజేపీ కన్నెత్తిచూడట్లేదు. కేసుల విచారణలు, ఈడీ, సీబీఐ దాడుల ఊసే ఎత్తట్లేదు. ఎల్డీఎఫ్, బీజేపీ రహస్య పొత్తు పెట్టుకున్నాయనడానికి ఇవే తార్కాణాలు. బీజేపీ దాడులకు కాంగ్రెస్ బెదిరిపోదు. పోరాటం కొనసాగిస్తాం’’అని రాహుల్ పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి విజయన్ ఫొటోను ముద్రించి విజయన్కాకుండా ఇంకెవరు మరోసారి సీఎం అవుతారు? అనే ధోరణిలో ‘ఇంకెవరు?’అంటూ ఎల్డీఎఫ్ కార్యకర్తలు ప్రచారంలోకి తీసుకొచ్చిన బిల్‌బోర్డులపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ‘‘ఇంకెవరు? అంటే అర్థమేంటి? ఆయనేమైనా దేవుడా? ఆయన ఒక్కడే రాష్ట్రం మొత్తాన్నీ పరిపాలించలేడు. ఎంతో శక్తిసామర్థ్యాలున్న మహిళలు, ప్రతిభావంతులైన వ్యక్తుల సమన్వయంతో రాష్ట్రంలో పరిపాలన అనేది సాగుతుంది. ఇంకెవరు? అంటూ బ్యానర్లు కట్టడం అందర్నీ అవమానించడమే. ఇది దురహంకారానికి పరాకాష్ట. సీఎం ఒక్కరేకాదు అమిత్ షా, హిమంత బిశ్వ శర్మలకూ దురహంకారం పాళ్లు ఎక్కువ. ప్రధాని మోదీ అయితే తాను స్వయంగా దైవాంశగా చెప్పుకుని తిరుగుతున్నారు. ఆయన అలాగే ఊహాలోకంలో బతికేస్తున్నారు. కేరళలో సీఎం అయితే రాజునని భావిస్తున్నారు’’ అని రాహుల్ ధ్వజమెత్తారు. -
‘ప్రాంతీయ’ వ్యూహం!
సాక్షి, న్యూఢిల్లీ: ఈశాన్య ప్రవేశద్వారం అస్సాంలో ఎన్నికల సమరం తుది ఘట్టానికి చేరింది. హోరాహోరీగా సాగిన ప్రచార పర్వానికి మంగళవారం సాయంత్రంతో తెరపడనుంది. పదేళ్లుగా రాష్ట్రాన్ని ఏలుతున్న బీజేపీని ఎలాగైనా గద్దె దించాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కంకణం కట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వకూడదని ప్రాంతీయ పార్టీలను కలుపుకుని బరిలో దిగింది. కంచుకోటను కాపాడుకుని హ్యాట్రిక్ కొట్టాలని కాషాయ దళం సర్వశక్తులూ ఒడ్డుతోంది. సంక్షేమం, జాతీయవాద అ్రస్తాలతో ఓటర్ల ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్ ‘ఐక్య’మంత్రం 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ 40 నుంచి 45 శాతం ఓట్లు సాధించింది. కాంగ్రెస్ నిలకడగా 25 నుంచి 30 శాతం ఓట్లు సాధించినా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ప్రాంతీయ పార్టీల మధ్య చీలడంతో బీజేపీ గెలుపు సునాయాసం అవుతూ వచ్చింది. దాంతో ఈసారి కాంగ్రెస్ జాగ్రత్త పడుతోంది. ఓట్ల విభజనకు అడ్డుకట్ట వేసే వ్యూహంతో ముందుకెళ్తోంది. రైతుల్లో, గ్రామీణ వర్గాల్లో పట్టున్న అఖిల్ గొగోయ్ సారథ్యంలోని రైజోర్ దళ్, యువతను ప్రభావితం చేయగల లురిన్జ్యోతి గొగోయ్ నేతృత్వంలోని అస్సాం జాతీయ పరిషత్‌ను తనవైపు తిప్పుకుంది. దీనికి తోడు సంప్రదాయ, మైనారిటీ ఓటర్లను సంఘటితం చేయడంపై పీసీసీ చీఫ్ నేత గౌరవ్ గొగోయ్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఓట్ల బదిలీపైనే ఆశలు ప్రాంతీయ పార్టీలు గత ఎన్నికల్లో 8 నుంచి 15 శాతం ఓట్లు సాధించాయి. ఆ ఓటు బ్యాంకును ఈసారి కాంగ్రెస్ కూటమికి పక్కాగా బదిలీ చేసుకోగలిగితే 40 శాతానికి పైగా ఓట్లు రావడం ఖాయమని కాంగ్రెస్ భావిస్తోంది. 60 నుంచి 70 స్థానాలతో విజయం సాధిస్తామని గంపెడాశలు పెట్టుకుంది. కాకపోతే భిన్న సిద్ధాంతాలున్న ప్రాంతీయ పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీ ఏ మేరకు సాధ్యమన్నది ప్రశ్నార్థకంగా మారింది. అయితే విభేదాలను పక్కనపెట్టి పార్టీల నేతలంతా ఉమ్మడిగా పని చేసేలా ప్రత్యేక సమన్వయ కమిటీలను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ‘హిమంత’కోట పదిలమేనా? గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ అస్సాం ప్రజలు కమలనాథులకే పట్టం కట్టారు. 2016 ఎన్నికల్లో సొంతంగా 60 స్థానాలు నెగ్గిన బీజేపీ మిత్రపక్షాలతో కలిపి 86 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2021లోనూ సొంతంగా 60, మిత్రపక్షాలతో కలిసి 75 సీట్లు నెగ్గి అధికారాన్ని నిలబెట్టుకుంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ సారథ్యంలో సంస్థాగతంగా, క్షేత్రస్థాయిలో బీజేపీ మరింత బలంగా కనిపిస్తోంది. ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని భావిస్తోంది. మైక్రో మేనేజ్మెంట్, క్షేత్రస్థాయిలో శ్రేణుల మధ్య సమన్వయంతో దూసుకెళ్తోంది. భారీ మౌలిక వసతుల కల్పన, రహదారుల నిర్మాణం, సంక్షేమ పథకాలు అధికార పార్టీకి శ్రీరామరక్షగా మారాయి. శాంతిభద్రతల పరిరక్షణ కూడా సానుకూలాంశమే. పదునైన హిందూత్వ ఎజెండా, బంగ్లాదేశ్ చొరబాట్ల నివారణ వంటి సున్నితమైన అంశాలను ముమ్మరంగా ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్‌ను హిమంత ఆత్మరక్షణలో పడేశారు. -
రికార్డుల సీఎం!
పినరయి విజయన్. ఆచరణాత్మక కమ్యూనిస్టు. అభివృద్ధివాద నేత. కేరళ చరిత్రలో అత్యంత శక్తిమంతుడైన సీఎంగా నిలిచారు. రాష్ట్ర చరిత్రలో అధికారాన్ని నిలబెట్టుకున్న తొలి సీఎం కూడా. ప్రస్తుతం దేశంలోనే అత్యంత వయసు పైబడిన ముఖ్యమంత్రి కూడా విజయనే! రక్తపు చొక్కాతో అసెంబ్లీకి విజయన్ చిన్న వయసులోనే సీపీఎంలో చేరారు. కేరళ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐకి ముందు సంస్థ)లో ఎదిగారు. కేరళ స్టేట్ యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా చేశారు. సీపీఎం రాష్ట్ర కమిటీ నేతగా ఎదిగారు. 25 ఏళ్ల వయసులో కుతుపరంబ అసెంబ్లీ నుంచి తొలిసారిగా గెలిచారు. కేరళలో అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా నిలిచారు. 1977లో అసెంబ్లీలో చరిత్రాత్మక ప్రసంగంతో వెలుగులోకి వచ్చారు. ఎమర్జెన్సీ సమయంలో తాను ఎదుర్కొన్న కస్టడీ చిత్రహింసల అనుభవాన్ని వివరించారు. రక్తపు మరకలున్న చొక్కాను ఈ సందర్భంగా సభలో చూపారు.ఆ షర్టును చాలాకాలంపాటు దాచుకున్నట్లు ఇటీవల ఇంటర్వ్యూలో కూడా గుర్తు చేసుకున్నారు. 1996లో తొలిసారి విద్యుత్ శాఖ మంత్రి అయ్యారు. విద్యుదుత్పాదనలో రాష్ట్రాన్ని స్వయంసమృద్ధి దిశగా నడిపారు. కేరళ చూసిన అత్యుత్తమ విద్యుత్ శాఖ మంత్రిగా నిలిచారు. రాష్ట్ర విద్యుత్ బోర్డు, కెనడాకు చెందిన ఎస్ఎన్సి–లావాలిన్ సంస్థ ఒప్పందంపై అవినీతి ఆరోపణలు దుమారం రేపినా ఆ కేసులో నిర్దోషిగా తేలారు.1998లో మంత్రి పదవి వీడి సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా 18 ఏళ్లు కొనసాగారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేరళ సీపీఎంను విభిన్నంగా నిలబెట్టారు. పార్టీ నాయకత్వంలో కైరళి టీవీని ప్రారంభించారు. విజయన్ సారథ్యంలోనే సీపీఎం 2006, 2016, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గింది. సీఎంగా కీలక చర్యలు సీఎం అయ్యాక తొలి మంత్రివర్గ భేటీలోనే విజయన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిరాశ్రయులకు ఇళ్లు, ఆర్థిక సాధికారత మిషన్, ఆరోగ్య రంగం ఆధునీకరణ, వ్యర్థాల నిర్వహణ పథకాలు చేపట్టారు. 2018 కేరళ వరదలు, నిఫా, కోవిడ్ వంటి సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కొన్నారు. పార్టీలో ‘కెప్టెన్’గా పేరు తెచ్చుకున్నారు. అధికారుల పనితీరుపై నిరంతర పర్యవేక్షణ విజయన్ను విలక్షణంగా నిలబెట్టింది. దాంతో ఐదేళ్లకోసారి అనివార్యంగా అధికార మార్పిడి జరిగే కేరళలో 2021లో సీపీఎం కూటమి వరుసగా రెండోసారి గెలిచి రికార్డు సృష్టించింది. విజయన్ రెండోసారి సీఎం కాగానే మంత్రివర్గాన్ని యువతతో నింపేశారు. అయితే అల్లుడు రియాజ్‌ను మంత్రిని చేయడం విమర్శలకు దారితీసింది. పెట్టుబడిదారి విధానంలో తలమునకలై కమ్యూనిస్టు సిద్ధాంతం నుంచి పక్కదారి పడుతోందనే విమర్శలూ వచ్చాయి. శబరిమలలో ప్రభుత్వపరంగా గ్లోబల్ అయ్యప్ప సదస్సు నిర్వహణ కూడా చర్చనీయాంశమైంది. బీడీలు చుట్టి.. మగ్గం నేసి.. విజయన్ 1945లో కన్నూర్‌లోని పినరయిలో జన్మించారు. కోరన్, కళ్యాణి దంపతులకు ఆఖరి సంతానం. బాల్యంలో సిగ్గరి. కాకపోతే చురుకైన విద్యార్థి. తండ్రి అకాల మరణంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. దాంతో ప్రాథమిక విద్య కాగానే విజయన్ను తల్లి బీడీలు చుట్టే పనికి పంపింది. టీచర్లు తల్లిని ఒప్పించి తనను బడిబాట పట్టించారు. చేనేత కార్మికునిగా పనిచేస్తూ తలస్సేరి ప్రభుత్వ కాలేజీలో అర్థశాస్త్రంలో డిగ్రీ చేశారు. ఉపాధ్యాయురాలైన కమలను వివాహం చేసుకున్నారు. వారికిద్దరు పిల్లలు. చేపలు విజయన్‌కు ఇష్టమైన ఆహారం. చదవడం, సినిమాలు చూడటం హాబీలు. ఇష్టమైన నటుడు రజనీకాంత్. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మదామ్ నియోజకవర్గం నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
క్షమించేదే లేదు : అస్సాం సీఎం హిమంతపై రాహుల్ విసుర్లు
Assam Assembly Election 2026 గోలాఘాట్: అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలోని ముఖ్యమంత్రుల్లోనే అత్యంత అవినీతి పరుడు హిమంత బిశ్వ శర్మ అంటూ ధ్వజమెత్తారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే హిమంతపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆదివారం రాహుల్ అస్సాంలోని బిశ్వనాథ్, గోలాఘాట్ జిల్లాల్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీల్లో ప్రసంగించారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజల మధ్య విద్వేషాలను వ్యాప్తి చేస్తోందన్నారు. ‘మరికొన్ని రోజులు ఆయన్ను మాట్లాడనివ్వండి. ఆ తర్వాత అస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. క్షమాపణ కోరినా వదిలేది లేదు. 10–15 రోజుల్లోనే ఆయన్ను జైలుకు పంపుతాం’అని పేర్కొన్నారు. శర్మ కుటుంబసభ్యుల అవినీతిపైనా చర్యలు తప్పవన్నారు. ఇదీ చదవండి: ఇద్దరు చిన్నారులను మింగేసిన రెడీ మేడ్ దోస పిండసీఎం హిమంతతో కలిసి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా అస్సాంలో ‘ల్యాండ్ ఏటీఎం’ఏర్పాటు చేసి ప్రజల భూముల్ని బడాబాబులకు కట్టబెడుతున్నారని రాహుల్ ఆరోపించారు. ఇప్పటికే 98 వేల బిఘాల భూమి మూడు కార్పొరేట్ సంస్థలకు బదలాయించారని అన్నారు. ఈ సంస్థలు బీజేపీకి ఆర్థికంగా దన్నుగా నిలుస్తున్నాయన్నారు. అమెరికా ప్రభుత్వంతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం ఫలితంగా అమెరికా వస్తువులు మన మార్కెట్లను ముంచెత్తనున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మన రైతులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు. అస్సాంను ఐక్యంగా ఉంచేందుకు జీవితాంతం కృషి చేసిన గాయకుడు జుబీన్ గర్గ్ తమ పార్టీకి ఆదర్శమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. ఆయన మాదిరిగా అస్సాం ప్రజలను ఐక్యంగా ఉంచేందుకు కృషి చేయాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇదీ చదవండి: 17 కిలోల బంగారం, రూ. 25 కోట్లు : వ్యాపారుల గుండెల్లో రైళ్లు -
‘మీ వ్యాఖ్యలకు నవ్వొస్తుంది.. పబ్లిక్‌గా నిరూపిస్తే పోలా?’
దిస్పూర్: తనకు మూడు పాస్‌పోర్టులు ఉన్నాయంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై అస్సాం సీఎం హిమాంత్ బిశ్వా శర్మ భార్య రింకీ భుయాన్ శర్మ స్పందించారు. వారికి వ్యాఖ్యలను చూస్తే నవ్వొస్తుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ చేసిన ఆరోపణలు రాజకీయ దురద్దేశంతో మాత్రమే చేశారనే విషయం అర్ధమైందని, అందుకే మీ ఆరోపణలు చూసి నవ్వొస్తుందన్నారు. మీ ఉత్కంఠకు తానే సమాధానమిస్తానంటూ ట్వీట్ చేశారు రింకీ భుయాన్ శర్మ. ఆ మూడు పాస్‌పోర్టుల సాయంతో భారత బయట పలు వ్యాపారాలు చేస్తున్నానంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గగోయ్ ఎంతో ఉత్కంఠతో, ఆతృతతో తనపై వ్యాఖ్యలు చేశారని, వాస్తవాలు ఉంటే 24 గంటల్లో బయటపెట్టాలన్నారు. ‘మీకు 24 గంటలు టైమ్ ఇస్తున్నా. వాస్తవాలు ఉంటే బయటపెట్టండి. ఎన్నికల స్టంట్స్ చేయొద్దు. నాకు కానీ, నా పిల్లలు కానీ భారత బయట ఎక్కడా ఆస్తులు, వ్యాపారాలు లేవు. మీరు నిరూపించి చూపించండి’ అంటూ సవాల్ చేశారు. తనకు పాకిస్తాన్ బ్యాంక్‌లతో కూడా సంబంధాలున్నాయని కూడా కాంగ్రెస్ ఎంపీ ఆరోపించారు. ‘ అవేంటో చూపించి మాట్లాడండి. ఎందుకో అంత ఆతృత.. పబ్లిక్ నిరూపిస్తే పోతుంది కదా’ అని ట్వీట్లో పేర్కొన్నారు.I’ll save you the suspense and answer these laughable questions myself, @GauravGogoiAsm.Here it is: Neither I, nor my children, nor my husband have any business interests or assets in Dubai or anywhere outside India.Now your turn. Can you disclose whether your wife has or has… https://t.co/1R364UxzOX— Riniki Bhuyan Sharma (@rinikibsharma) April 6, 2026 -
కేరళ ఎన్నికల్లో జరుగుతోంది ఇదే
తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ప్రత్యర్థి పార్టీలపై మాటల దాడులు, తీవ్ర ఆరోపణలతో ప్రచారాన్ని హీటెక్కిస్తున్నాయి. కాంగ్రెస్ నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తమ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. సోమవారం మలప్పురంలో ప్రచారం సాగించిన ఆమె.. బీజేపీ, సీపీఎం పార్టీలపై విరుచుకుపడ్డారు. సిద్ధాంతాలను పక్కనపెట్టి ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయని ఆరోపించారు. బీజేపీతో సీపీఎం కుమ్మక్కయిందని విమర్శించారు.మరోసారి అధికారం దక్కించుకోవడం కోసం కాషాయ పార్టీతో కమ్యూనిస్టులు డీల్ మాట్లాడుకున్నారని ప్రియాంక ధ్వజమెత్తారు. పదేళ్లపాటు అధికారంలో కొనసాగడం కోసం అధికార ఎల్డీఎఫ్ సిద్ధాంతం, జవాబుదారీతనం, బాధ్యతల విషయంలో రాజీ పడుతోందని ఆరోపించారు. మైనారిటీలను, ముఖ్యంగా క్రైస్తవులను వేధించే బీజేపీతో ఎల్డీఎఫ్ ఒప్పందం చేసుకుందని దుయ్యబట్టారు. ఎల్డీఎఫ్ నేతలు, మంత్రుల్లో అహంకారం పెరిగిపోయిందని విమర్శించారు. ప్రజల పట్ల ప్రతి నాయకుడికి ఉండాల్సిన బాధ్యత, జవాబుదారీతనం కొరవడిందని మండిపడ్డారు.మోదీకి వ్యతిరేకంగా మాట్లాడితే అంతేప్రఖ్యాత పుణ్యక్షేత్రం శబరిమలలో భారీగా దొంగతనం జరిగితే ప్రధాని నరేంద్ర మోదీ నుంచి కనీస స్పందన కరువైందని ప్రియాంక గాంధీ అన్నారు. ఈ వ్యవహారంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని.. బీజేపీ-ఎల్డీఎఫ్ ఒప్పందానికి ఇంత కంటే ఏం సాక్ష్యం కావాలని ప్రశ్నించారు. ఎవరైనా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గళం విప్పితే.. వారు సీబీఐ, ఈడీ లేదా ఆదాయపు పన్ను కేసులను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై అలాంటి ఒక్క కేసు కూడా లేకపోవడం అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు. చదవండి: టికెట్ నిరాకరణపై మౌనం వీడిన అన్నామలైఒకే దెబ్బతో రెండు పార్టీలకు చెక్!కాగా, బీజేపీతో ఎల్డీఎఫ్ రహస్య పొత్తు పెట్టుకుందని ఇంతకుముందే రాహుల్ గాంధీ ఆరోపించారు. మైనార్టీలపై దాడులు చేయించిన బీజేపీతో ఎలా చేతులు కలుపుతారని ప్రశ్నించారు. మోదీకి కేరళ సీఎం భయపడుతున్నారని, తన కేసుల నుంచి కూతురిని కాపాడుకునేందుకు బీజేపీ చెప్పినట్టల్లా వింటున్నారని విమర్శించారు. ఎల్డీఎఫ్-బీజేపీ ఒప్పందం కుదుర్చుకున్నాయని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలనే తాజాగా ప్రియాంక గాంధీ ఉటంకించారు. ఒకే దెబ్బతో రెండు పార్టీలకు చెక్ పెట్టాలన్న వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ అగ్ర నేతలు ఈ ఆరోపణలు చేస్తున్నట్టు కనబడుతోందని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఆరోణలను అధికార ఎల్డీఎఫ్ నాయకులు తోసిపుచ్చారు. కాగా, ఏప్రిల్ 9న కేరళ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడతాయి. -
కోల్‌కతాపై దాడి చేస్తామంటే ప్రధాని ఏం చేస్తున్నారు?: మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ప్రధాని మోదీపై విరుచుకపడ్డారు. కోల్‌కతా దాకా దాడి చేస్తాం అని పాకిస్థాన్ ప్రగల్భాలు పలుకుతుంటే మోదీ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ( సోమవారం) నైదా జిల్లాలో నిర్వహించిన ర్యాలీలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.ఇటీవల పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌పై తీవ్ర విమర్శలు చేశారు. "భారత్ గనుక ఈసారి ఏదైనా 'ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్' (కృత్రిమంగా దాడులు సృష్టించడం) చేయడానికి ప్రయత్నిస్తే, దేవుడి దయ వల్ల మేము ఆ యుద్ధాన్ని కోల్‌కతా వరకు తీసుకెళ్తాము" అని హెచ్చరించారు. అంటే, సరిహద్దులకే పరిమితం కాకుండా భారత్ లోపలికి చొచ్చుకెళ్లి కోల్‌కతా (తూర్పు తీరం వరకు) దాడులు చేస్తామని ఆయన పరోక్షంగా బెదిరించారు. అయితే ఈ వ్యాఖ్యలపై స్పందించనందుకు మమతా బెనర్జీ, ప్రధాని మోదీపై ఆగ్రహాం వ్యక్తం చేస్తూ మాట్లాడారు.మమతా బెనర్జీ ప్రధాని మోదీ గురించి మాట్లాడుతూ " ప్రతి ఎన్నికల సభలో బెంగాల్‌ను టార్గెట్ చేసి మాట్లాడే మోదీ కోల్‌కతాపై దాడి చేస్తామని పాక్ మంత్రి హెచ్చరిస్తుంటే ఎందుకు స్పందించలేదు. ఒకవేళ ఈ ప్రాంతంపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎందుకు హెచ్చరించలేదు. దీనికి బాధ్యతగా ప్రధాని మోదీ రాజీనామా చేయాలి " అని ప్రధానిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.అదే ఏవరైనా భారత్ అదే విధంగా కోల్‌కతాను టార్గెట్ చేస్తూ హెచ్చరిస్తే ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. కాగా ఈ నెల 23,29 తేదీలలో ఈ రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. -
మా మేనిఫెస్టోనే సూపర్‌స్టార్: స్టాలిన్
విరుధునగర్/విరాలిమలై: 2026 అసెంబ్లీ ఎన్నికలకు డీఎంకే మేనిఫెస్టో సూపర్ స్టార్ వంటిదని ఆ పార్టీ చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అభివర్ణించారు. హామీలు ఎవ్వరైనా ఇస్తారు కానీ, తమ పార్టీ ఇచ్చిన హామీలను మాత్ర మే ప్రజలు నమ్ముతారని చెప్పారు. విరుధునగర్‌లో ఆదివారం జరిగిన ఎన్నికల ర్యాలీలో స్టాలిన్ ప్రసంగించారు.ఈ సందర్భంగా ‘అన్ని వయస్సుల వారు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు.. ఇలా అందరూ డీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను ఇష్టపడతారు. ఇష్టం లేని వారంటూ ఎవ్వరూ ఉండరు. అందుకే నేను విడుదల చేసిన పార్టీ మేనిఫెస్టో 2026 ఎన్నికల క్షేత్రంలో సూపర్‌స్టార్ లాంటిది’అని ఆయన చెప్పారు. ‘‘విశ్వసనీయత కలిగిన వ్య క్తుల వాగ్దానాలనే ప్రజలు విశ్వసిస్తారు. ఇతరులు ఏది చెప్పినా జనం నమ్మరు’’ అని స్టాలిన్ అన్నారు.ఢిల్లీ టీమ్‌ను ఇంటికి పంపించాలి: ఉదయనిధితమిళనాడు రాష్ట్ర స్వయంప్రతిపత్తి కోసం ఈ ఎన్నికల్లో ఢిల్లీ టీమ్‌ను ఇంటికి సాగనంపాలని డిప్యూటీ సీఎం ఉదయనిధి ప్రజలను కోరారు. ఈ ఎన్నికలను ఢిల్లీ టీమ్‌కు, తమిళనాడు టీమ్‌కు మధ్య జరిగే యుద్ధంగా ఆయన పేర్కొన్నారు. డీఎంకే కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టడం ద్వారా ఢిల్లీ టీమ్‌ను ఇంటికి పంపించేయాలని పిలుపునిచ్చారు. తమిళనాడును నియంత్రించేందుకు ఢిల్లీ ఉపయోగిస్తున్న రిమోట్కంట్రోల్ను పగుల గొట్టాలన్నారు. -
వివాదరహితుడు
వి.వైతిలింగం... పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి. ఐదు దశాబ్దాలకు పైగా రాజకీయ జీవితంలో వివాద రహితుడు. నిష్కళంక నాయకుడు. పార్టీ అంతర్గత సవాళ్లను ఎదుర్కోవడంలో సమర్థుడు. ఎంతటి రాజకీయ గందరగోళంలో అయినా.. నిబ్బరంగా, సౌమ్యంగా ఉండటం ఆయన విలక్షణ శైలి. సరళంగా, సూటిగా మాట్లాడటంలో ఆయనకు ఆయనేసాటి. ఒకప్పుడు సహచరుడు, ఇప్పుడు ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామితో తట్టంచవాడి నియోజకవర్గంలో పోటీ పడుతున్నారు. సుస్థిర పాలన... వైతిలింగం తండ్రి వి.వెంకటసుభ రెడ్డియార్ పాండిచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన స్ఫూర్తితో 1971లో యూత్ కాంగ్రెస్ సభ్యునిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 30 ఏళ్ల వయసులో నెట్టపాక్కం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, కేవలం 90 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1985లో రెండోసారి పోటీ చేసి గెలుపొందారు. 1996 నుంచి 2001 వరకు పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ పదవిని చేపట్టిన అతి పిన్న వయసు్కలలో ఒకరు. తాను ముఖ్యమంత్రికాగానే బడ్జెట్ లోటుపై దృష్టి సారించారు. ఆర్థిక వృద్ధి తోడ్పాటుకోసం ప్రైవేట్ రంగ పెట్టుబడులను ఆకర్షించారు. మౌలిక సదుపాయాలు మెరుగుపరిచారు. పొత్తుల విషయంలో పార్టీ హైకమాండ్‌తో విభేదాల కారణంగా కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడిగా ఎన్.రంగస్వామి రాజీనామా చేయడంతో, 2008లో ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టి సంక్షేమ పథకాలు, అభివృద్ధి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. పుదుచ్చేరి శాసనసభకు ఎనిమిది సార్లు ఎన్నికైన సీనియర్ నేత. తాను అధికారంలో ఉన్న రెండు పర్యాయాలు స్థిరమైన పాలనను అందించిన నాయకుడు. అసెంబ్లీ నుంచి లోక్‌సభకు... 2011 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమితో ఐదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. కాంగ్రెస్ శాసనసభా పక్ష నేతగా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై గళమెత్తారు. 2016 జూన్‌లో అసెంబ్లీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పుదుచ్చేరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2024లో మరోసారి పోటీ చేసి ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. అధికార కూటమిపై ప్రతిపక్షం విజయం సాధించడం పుదుచ్చేరి లోక్‌సభ చరిత్రలో అదే మొదటిసారి. 2021 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు సీట్లను మాత్రమే గెలుచుకుని, పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోరమైన ఓటమిని చవిచూసింది. ఆ ఓటమితో కేడర్‌లో నైతిక స్థైర్యం తగ్గడం, వర్గపోరాటాల నేపథ్యంలో, 75 ఏళ్ల వైతిలింగం జూన్ 2023లో పుదుచ్చేరి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి... పార్టీని చక్కబెట్టే పనిలో పడ్డారు. పుదుచ్చేరి ఏకైక లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనను ఈసారి అనూహ్యంగా బరిలోకి దిగారు. ప్రస్తుత ముఖ్యమంత్రి ఎన్.రంగస్వామిపై తట్టంచవాడి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. వ్యవసాయం చేస్తూ... 1950లో అక్టోబర్ 5న తమిళనాడులోని కడలూరులో జన్మించారు. పుదుచ్చేరిలోని మదుక్కరైలో పెరిగారు. అక్కడ పాఠశాల విద్య పూర్తి చేశాక, చెన్నైలోని లయోలా కళాశాలలో చేరారు. మదుక్కరైలో కుటుంబ వ్యవసాయం మధ్య పెరిగిన ఆయనకు చిన్న వయస్సు నుండే వ్యవసాయ పనులంటే ఆసక్తి. తన మాధ్యమిక విద్యను పూర్తిచేసి వ్యవసాయంపై దృష్టి సారించారు. ఆ తరువాత డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. పుదుచ్చేరికి వైద్య సేవల సంచాలకుడిగా విశేష సేవలు అందించిన డాక్టర్ సాంబశివం కుమార్తె అయిన శశికళను 1969లో వివాహం చేసుకున్నారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడానికి కుట్ర పన్నారనే ఆరోపణలతో ఆయనపై కేసు నమోదైంది. తగినంత సాక్ష్యాధారాలు లేకపోవడంతో వైతిలింగంతోపాటు సహ నిందితులందరినీ నిర్దోషులుగా విడుదలయ్యారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈళవ ఓట్లే కీలకం
కేరళలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు తారస్థాయికి చేరింది. పాలక ఎల్డీఎఫ్, విపక్ష యూడీఎఫ్ కూటములు పోటాపోటీ ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. బీజేపీ కూడా ఈసారి రాష్ట్రంలో గట్టిగా ఉనికి చాటుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో ఈళవ సామాజికవర్గం ఓట్లపై అన్ని పార్టీలూ కన్నేశాయి. ఆరు జిల్లాల్లో కనీసం 53 అసెంబ్లీ స్థానాల్లో వీరి ఓట్లు నిర్ణాయకంగా మారనున్నాయి. ఈళవల ప్రాబల్యం కేరళ జనాభాలో హిందువులు 54.73%. ముస్లింలు 26.56%, క్రైస్తవులు 18.38 శాతమున్నారు. హిందూ జనాభాలో ఈళవ సామాజికవర్గం అత్యధికంగా 21.60 శాతం ఉంది. తర్వాత నాయర్లు 14.9 శాతం, ఎస్సీలు 9 శాతం, ధీవర 3 శాతం, ఓబీసీ 3 శాతం, బ్రాహ్మణులు 2 శాతం, ఎస్టీలు ఒక శాతం చొప్పున ఉన్నారు. ట్రావెన్కోర్ ప్రాంతంలో ఈళవ సామాజికవర్గం ప్రాబల్యం ఎక్కువగా ఉంది. మొ త్తం 6 జిల్లాల్లో 53 అసెంబ్లీ స్థానాల్లో 40 శాతం నుంచి 70 శాతం దాకా ఈళవ వర్గం ఓటర్లే ఉన్నా రు! తిరువనంతపురం జిల్లా లో 14 స్థానాలు, కొల్లంలో 11, కొట్టాయంలో 9, అలప్పుజలో 9, పత్థనంతిట్టలో 5, ఇడుక్కిలో 5 స్థానాల్లో ఫలితాలను వీరే శాసిస్తున్నారు. ఓట్ల కోసం పాట్లు ఈళవ ఓట్ల కోసం పార్టీలన్నీ తలపడుతున్నాయి. కేరళలో అణగారిన వర్గాలకు జరిగిన చారిత్రక అన్యాయాలపై పోరాడింది తామేనని వామపక్షాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఒకప్పటి నంగేలి పోరాటాన్ని, చన్నార్ తిరుగుబాటును గుర్తు చేస్తున్నాయి. ఎన్సీఈఆర్టీ 9వ తరగతి చరిత్ర పుస్తకం నుంచి ట్రావెన్కోర్ కుల పోరాటాల అధ్యాయాన్ని తొలగించడం కేరళలో వివాదంగా మారింది. దీన్ని బీజేపీ కుట్రగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభివరి్ణంచారు. ఆ పాఠాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా బోధించేలా చర్యలు తీసుకున్నారు. ఈళవ ఓటుబ్యాంకును కొల్లగొట్టేందుకు బీజేపీ కూడా గట్టి ప్రయత్నాలే చేస్తోంది.ఓటింగ్ సరళిలో మార్పులిలా కేరళ హిందూ ఓటర్లలో అత్యధికులు వామపక్ష కూటమి వైపే నిలుస్తున్నారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో హిందూ ఓటర్లలో 48% లెఫ్ట్‌కు మద్దతిచ్చారు. 2021 అసెంబ్లీ ఎన్నికల నాటికి అది 50 శాతానికి పెరిగింది. 25% కాంగ్రెస్ వైపు నిలవగా 21% బీజేపీకి మద్దతిచ్చారు. అయితే కులాలవారీగా సమీకరణాల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఈళవ వర్గం: 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 49 శాతం వామపక్షాలకు, 28 శాతం కాంగ్రెస్ కు, 18 శాతం బీజేపీకి ఓటు వేశారు. 2021 నాటికి ఇది లెఫ్ట్‌కు 53 శాతానికి, బీజేపీకి 23 శాతానికి పెరగ్గా కాంగ్రెస్‌కు 21 శాతానికి పడిపోయింది. నాయర్లు: 2016లో 45 శాతం లెఫ్ట్ కూటమికే ఓటేశారు. 2021 నాటికి ఇది 32 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్‌కు 2016లో 20 శాతం మంది ఓటేయగా 2021కల్లా 38 శాతానికి పెరిగింది. నాయర్లలో బీజేపీకి ఆదరణ 33 శాతం నుంచి 27 శాతానికి తగ్గింది. ఎస్సీలు: లెఫ్ట్‌కు కంచుకోటలా మారారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 51 శాతం ఎల్డీఎఫ్కు ఓటేయగా 2021 నాటికి అది ఏకంగా 69 శాతానికి పెరిగింది.శరత్చంద్ర ముక్తవరం -
అస్సాం సీఎం హిమంత భార్యకు మూడు పాస్‌పోర్టులు
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తున్న వేళ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. సీఎం హిమంత బిశ్వ శర్మ భార్య రినికి భూయాన్ శర్మ మూడు దేశాల పాస్‌పోర్టులు కలిగి ఉన్నారని, దుబాయ్‌లో ఆమె పేరిట ఆస్తులు, అమెరికాలో కంపెనీ ఉన్నాయని పేర్కొంది. కాంగ్రెస్ మీడియా ఇన్చార్జి పవన్ ఖేరా ఆదివారం మీడియా సమావేశంలో ఈ ఆరోపణలు చేశారు. ఆమెకు దుబాయ్, అంటిగ్వా బార్బుడా, ఈజిప్టు పాస్పోర్టులున్నాయన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన పక్షంలో విదేశాలకు పారిపోవాలని ప్లాన్ వేసుకున్నారా? అంటూ ఖేరా ఎద్దేవా చేశారు. ఇందుకు సంబంధించిన పలు పత్రాలను ఆయన మీడియాకు చూపారు. సీఎం శర్మ భార్య పేరుతో అమెరికాలో ఓ కంపెనీ ఉందని చెప్పారు. ఈ వివరాలను దాచినందుకు గాను ఎన్నికల కమిషన్ సీఎం శర్మ నామినేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై సీఎం హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా స్పందించారు. వచ్చే 48 గంటల్లోగా ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఖేరా చూపుతున్న పత్రాల్లోని వివరాలకు ఎటువంటి పొంతన లేదన్నారు. ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసి నిస్పృహతో ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ సీఎం శర్మ ఆరోపించారు. -
గుజరాతీలు నిరక్షరాస్యులు!
ఇడుక్కి/న్యూఢిల్లీ: గుజరాతీలు నిరక్షరాస్యులంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి. ఆదివారం ఆయన కేరళలోని ఇడుక్కిలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. ‘‘గుజరాత్ ప్రజలు నిరక్షరాస్యులైనందున ప్రధాని మోదీ వారిని నమ్మించి మోసగించారు. కానీ కేరళ ప్రజలు ఎంతో తెలివైనవారు. అక్షరాస్యులు. వారిని మోదీ, కేరళ సీఎం విజయన్ ఏమాత్రం మోసం చేయలేరు’’ అని పేర్కొన్నారు. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. గుజరాతీలు, ఉత్తర భారతీయులను ఆయన అవమానిస్తున్నారని ధ్వజమెత్తింది. కాంగ్రెస్‌కు ఓట్లేయడం లేదనే అక్కసుతోనే గుజరాత్, యూపీవాసులను ఖర్గే అవమానిస్తున్నారని ఆరోపించింది. ఆయన వ్యాఖ్యలను గుజరాత్ కాంగ్రెస్ నేతలు, ఎస్పీ చీఫ్ అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ సమర్థిస్తారా అని ప్రశ్నించింది. విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్) నిబంధనలు మార్చాలని ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని ఖర్గే మండిపడ్డారు. దీన్ని క్రైస్తవ సంస్థలు, ఎన్జీవోలు, పౌర సంఘాలపై దాడిగా అభివర్ణించారు. ఎఫ్సీఆర్ఏ సవరణలతో బీజేపీ, మోదీ నిజంస్వరూపం బట్టబయలైందన్నారు. ‘‘సీఎం విజయన్ స్వతంత్రుడు కారు. మోదీ చెప్పినట్లే నడుచుకుంటున్నారు’’ అని ఆరోపించారు. -
భయానికి, భరోసాకు పోరు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ‘మహా జంగిల్‌రాజ్’ను నడిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాష్ట్రంలో ఈసారి అసెంబ్లీ ఎన్నికలు అధికార పార్టీ సృష్టించిన భయానికి, బీజేపీ ఇస్తున్న భరోసాకు మధ్య జరుగుతున్నాయని తేల్చిచెప్పారు. ఆదివారం ఉత్తర బెంగాల్‌లోని కూచ్‌బెహార్‌లో ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. మాల్డా జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) విధుల్లో ఉన్న జ్యుడీషియల్ అధికారులపై అల్లరి మూకలు దౌర్జన్యానికి దిగి, నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించారు. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారాయని ఆరోపించారు. చొరబాటుదార్లను ఇక్కడి పాలకులు ఓటు బ్యాంకుగా మార్చుకున్నారని ధ్వజమెత్తారు. అధికార పార్టీ ప్రోద్బలంతోనే పొరుగుదేశం నుంచి జనం అక్రమంగా వలస వస్తున్నారని, దాంతో స్థానికంగాజనాభా నిష్పత్తిలో విపరీతమైన మార్పులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. చొరబాటుదార్ల వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. జ్యుడీషియల్ అధికారులకు కూడా రక్షణ లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ అరాచక ప్రభుత్వం ప్రజలను కాపాడుతుందన్న విశ్వాసం లేదని తేల్చిచెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ మహా జంగిల్‌రాజ్‌కు మాల్డా ఘటనే నిదర్శనమని పేర్కొన్నారు. బెంగాల్లో శాంతి భద్రతలకు అంత్యక్రియలు నిర్వహించడానికి అధికార పార్టీ కంకణం కట్టుకుందని దుయ్యబట్టారు. గూండాల బెదిరింపులను లెక్కచేయొద్దు కట్‌మనీ, అవినీతికి మారుపేరైన తృణమూల్ కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలని, అభివృద్ధి చేసి చూపించే బీజేపీని గెలిపించాలని బెంగాల్ ప్రజలకు మోదీ పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక అక్రమ వలసలను కచ్చితంగా అడ్డుకుంటామని, చొరబాటుదార్లను బయటకు పంపిస్తామని హామీ ఇచ్చారు. మారుతున్న జనాభా నిష్పత్తి కారణంగా సొంత గడ్డపై స్వేచ్ఛను కోల్పోతామనే భయం ప్రజల్లో ఉందన్నారు. ప్రజలు సొంత గడ్డపై గర్వంగా తల ఎత్తుకొని జీవించే పరిస్థితి తీసుకొస్తామని వెల్లడించారు. చొరబాటుదార్లను కాపాడేందుకే ఎస్ఐఆర్, సీఏఏను తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. హిందూ శరణార్థులకు భారతదేశ పౌరసత్వం దక్కడం ఆ పార్టీకి ఇష్టం లేదన్నారు. బుజ్జగింపు రాజకీయాల కారణంగా బెంగాల్ గుర్తింపునకు ముప్పు ఏర్పడిందన్నారు. బెంగాల్ అస్తిత్వాన్ని పణంగా పెట్టిన పార్టీలకు ఈసారి ఓటమి తప్పదని స్పష్టంచేశారు. పోలింగ్ రోజు తృణమూల్ కాంగ్రెస్ గూండాలు ఎన్ని బెదిరింపులకు దిగితే లెక్కచేయొద్దని ప్రజలకు మోదీ సూచించారు. చట్టంపై విశ్వాసంతో పోలింగ్‌లో పాల్గొనాలని కోరారు. ఎన్నికల సంఘంపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, అసెంబ్లీ ఎన్నికలు స్వేచ్ఛగా, పారదర్శకంగా జరుగుతాయని తెలిపారు. మే 4వ తేదీ తర్వాత చట్టం తన పని తాను చేస్తుందన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అవినీతి, అరాచకాలపై తప్పనిసరిగా దర్యాప్తు జరిపిస్తామని పునరుద్ఘాటించారు. దోషులు శిక్ష నుంచి తప్పించుకోలేరని చెప్పారు. వారు ఎంతటివారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. బెంగాల్ మహిళలకు భద్రత, గౌరవం, సాధికారత కల్పిస్తామని, ఇది తన గ్యారంటీ అంటూ స్పష్టంచేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమల్లోకి తీసుకొస్తున్నామని ప్రధానమంత్రి చెప్పారు. కేంద్రం తీసుకొచ్చిన లఖ్పతి దీదీ పథకం గురించి ప్రస్తావించారు. జనాభా పెరుగుదలను నియంత్రించిన రాష్ట్రాలకు నియోజకవర్గాల పెంపులో ఎలాంటి అన్యాయం జరగదని మోదీ మరోసారి హామీ ఇచ్చారు. అన్ని రాష్ట్రాల భాగస్వామ్యం, హక్కులకు కచ్చితంగా రక్షణ ఉంటుందన్నారు. -
దీదీపై ప్రధాని మోదీ ఆగ్రహం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు. కూచ్ బెహార్‌లోని చారిత్రాత్మక రాస్ మేళా మైదానంలో జరిగిన ‘విజయ్ సంకల్ప సభ’లో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మోదీ, టీఎంసీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.మోదీ మాట్లాడుతూ.. టీఎంసీ ప్రభుత్వం అవినీతిలో పూర్తిగా కూరుకుపోయిందని, ప్రజల సొమ్మును నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ‘చేసిన అక్రమాలకు టీఎంసీ నేతలు తప్పక మూల్యం చెల్లించుకోవాలి. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అవినీతిపరుల నుంచి దొంగిలించిన డబ్బును తిరిగి తీసుకుంటాం. నేరస్తులను తగిన విధంగా శిక్షిస్తాం’ అని ఆయన హామీ ఇచ్చారు.రాష్ట్రంలో అక్రమ చొరబాట్లను బీజేపీ అడ్డుకుందని, కానీ అది సరిపోదని, ప్రతి అక్రమ వలసదారుని వెనక్కి పంపుతామని మోదీ స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలతో టీఎంసీ అవినీతి, హింస, పాలన పతనంపై ప్రజల్లో ఆగ్రహం పెరుగుతోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.ఈ ప్రచారం ద్వారా బీజేపీ, ఈ నెల చివర్లో జరగనున్న ఓటింగ్‌కు ముందు ప్రజలను మరింతగా ఆకర్షించాలనే వ్యూహాన్ని అమలు చేస్తోంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి 294 స్థానాల కోసం ఎన్నికలు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు దశల్లో జరుగుతాయి. మే 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. సారాంశంగా, మోదీ ప్రసంగం బీజేపీ ఎన్నికల ప్రచారానికి నాంది పలికింది.Today’s rally in Cooch Behar clearly indicates the mood on the ground. Across West Bengal, there is growing anger against TMC’s corruption, violence and collapse of governance.@BJP4Bengalhttps://t.co/gMHIFeaMXr— Narendra Modi (@narendramodi) April 5, 2026 -
విజయ్ కొత్త అఫిడవిట్.. వెలుగులోకి రెండు కేసులు
చెన్నై: తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్ 23న ఎన్నికల సమరం జరగనుంది. అయితే ఇంతలో టీవీకే అధినేత విజయ్ సవరించిన అఫిడవిట్ సమర్పించడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. తొలిసారి దాఖలు చేసిన అఫిడవిట్లో ప్రస్తావించని రెండు కేసుల వివరాలను తాజాగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించిన కొత్త అఫిడవిట్లో ఆయన వెల్లడించారు. మార్చి 30న తొలి నామినేషన్ వేసిన విజయ్.. ఏప్రిల్ 3న నోటరీ చేయించి, ఏప్రిల్ 4న తన ప్రతినిధి ద్వారా సవరించిన అఫిడవిట్‌ను దాఖలు చేశారు. ఇందులో చెన్నై, మదురైలకు చెందిన రెండు క్రిమినల్ కేసుల వివరాలను కొత్తగా చేర్చారు.ఆ రెండు కేసులు ఇవే..మొదటి ఎఫ్ఐఆర్ (74/2026) చెన్నైలోని పెరవళ్లూరు పోలీస్ స్టేషన్లో నమోదైంది. మార్చి 30న ఎన్నికల ప్రచారంలో ప్రజాశాంతికి భంగం కలిగించారనేది ఆరోపణ. అయితే ఏప్రిల్ 2న సోషల్ మీడియా ద్వారానే ఈ కేసు గురించి తనకు తెలిసిందని విజయ్ అఫిడవిట్లో పేర్కొన్నారు. రెండో ఎఫ్ఐఆర్ (108/2025) మదురై జిల్లా కూడకోవిల్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. 2025 ఆగస్టు 21న జరిగిన పార్టీ సదస్సులో విజయ్ ర్యాంప్ వాక్ చేస్తుండగా, బౌన్సర్లు నెట్టివేయడంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయనేది దీని సారాంశం. ఈ ఫిర్యాదుపై తనకు ఇంకా ఎలాంటి అధికారిక సమన్లు అందలేదని విజయ్ స్పష్టం చేశారు.కోట్లలో ఆస్తులు.. పన్ను బకాయిలు..క్రిమినల్ కేసుల జాబితా మారినా ఆస్తుల వివరాలు దాదాపు పాత అఫిడవిట్ మాదిరిగానే ఉన్నాయి. ఆయన చరాస్తుల విలువ గతంలో రూ.404.58 కోట్లు ఉండగా, అది కాస్తా రూ. 410.59 కోట్లకు పెరిగింది. ఇందులో రూ. 15 లక్షల విలువైన వెండి, రూ. 1.20 కోట్లకు పైగా విలువైన 883 గ్రాముల బంగారం ఉన్నాయి. నీలాంకరై, సాలిగ్రామంలోని వాణిజ్య, నివాస భవనాలతో కలుపుకుని ఆయన స్థిరాస్తుల విలువ రూ. 220.15 కోట్లు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి తన ఆదాయం రూ. 184.53 కోట్లుగా చూపించిన ఆయన.. సుమారు రూ. 3.44 కోట్ల ఆదాయపు పన్ను బకాయిల వివాదం అప్పీలు దశలో ఉన్నట్లు వెల్లడించారు.రాబోయే ఎన్నికల్లో విజయ్.. పెరంబూర్, తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. తిరుచిరాపల్లి ఈస్ట్ స్థానానికి (ఏప్రిల్ 2న దాఖలు) ఇచ్చిన వివరాలకు, తొలిసారి పెరంబూర్ స్థానానికి ఇచ్చిన వివరాలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను సరిచేస్తూ, పెండింగ్ క్రిమినల్ కేసులన్నింటినీ బహిర్గతం చేయాలనే ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు విజయ్ ఈ కొత్త అఫిడవిట్‌ను దాఖలు చేసినట్లు సమచారం.ఇది కూడా చదవండి: అదృష్టం అంటే ఆమెదే.. చెత్తలో ‘టికెట్’కు రూ. కోటి! -
బెంగాల్ కురుక్షేత్రం: ‘దీదీ’ కోటలో ‘కమలం’ చిచ్చు
పశ్చిమ బెంగాల్ రాజకీయ క్షేత్రం ఇప్పుడు యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల కారణంగా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. గత కొంతకాలంగా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని వెంటాడుతున్న వరుస కుంభకోణాలు, కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు బెంగాల్ రాజకీయాలను కుదిపేస్తున్నాయి. అధికార పక్షం సంక్షేమ పథకాలను నమ్ముకుంటే, ప్రతిపక్ష బీజేపీ మాత్రం అవినీతి ఆరోపణలనే ప్రధాన అస్త్రంగా మార్చుకుని ఎన్నికల యుద్ధానికి దిగింది.ఉద్యోగాల వేట.. జైలు గోడలురాష్ట్రంలో సంచలనం సృష్టించిన ‘స్కూల్ రిక్రూట్మెంట్ స్కామ్’ టీఎంసీకి పెద్ద తలనొప్పిగా మారింది. వేల సంఖ్యలో ఉద్యోగాల రద్దు, అర్హులైన అభ్యర్థుల రోడ్డున పడటం లాంటి అంశాలు ప్రజల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. మాజీ మంత్రి పార్థ ఛటర్జీతో పాటు కీలక నేతలు జైలుకు వెళ్లడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీసింది. దీనికి తోడు రేషన్ కుంభకోణం, పశువుల అక్రమ రవాణా కేసులు కూడా తోడవడంతో రాష్ట్రంలో ‘అవినీతి’ అనేది ఎన్నికల ప్రధాన ఎజెండాగా మారుతోంది.బెయిల్ పాలిటిక్స్: నైతిక విజయమా?ఇటీవల జ్యోతిప్రియ మల్లిక్, అనుబ్రత మండల్ వంటి కీలక నేతలు బెయిల్‌పై విడుదలవ్వడం టీఎంసీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. దీన్ని తాము ఎదుర్కొంటున్న రాజకీయ కక్షసాధింపుపై లభించిన నైతిక విజయంగా టీఎంసీ అభివర్ణిస్తోంది. ‘బెయిల్ రావడం అంటే పాపం కడిగేసుకోవడం కాదు’ అని బీజేపీ హెచ్చరిస్తున్నా, జైలు నుంచి వచ్చిన నేతలు మాత్రం 2026లో తమదే విజయం అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ బెయిల్ వ్యవహారాలు ఎన్నికల ప్రచారంలో హాట్ టాపిక్ కానున్నాయి.ఛార్జ్షీట్ల యుద్ధం.. బీజేపీ వ్యూహంప్రతిపక్ష నేత సువేందు అధికారి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ టీఎంసీని ఇరకాటంలో పెట్టేందుకు దూకుడు పెంచారు. ముఖ్యంగా మాల్డా, ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లో టీఎంసీ ఎమ్మెల్యేలపై బహిరంగంగా ‘ఛార్జ్షీట్లు’ విడుదల చేయడం బెంగాల్ రాజకీయాల్లో కొత్త ట్రెండ్‌కు తెరలేపింది. కేంద్ర నిధులను మళ్లించారని, ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆరోపిస్తూ, బీజేపీ క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్తోంది. అవినీతిని అంతం చేయడమే తమ లక్ష్యమని కమలనాథులు నినదిస్తున్నారు.పరస్పర ఆరోపణల రచ్చటీఎంసీ కూడా బీజేపీపై ఎదురుదాడికి పదును పెట్టింది. ఇతర పార్టీల నేతలు బీజేపీలోకి వెళ్లగానే వారిపై ఉన్న కేసులు ఎలా మాయమవుతాయంటూ పలు ఆరోపణలను ఎక్కుపెట్టింది. గతంలో నారద స్టింగ్ వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారు బీజేపీ కండువా కప్పుకోగానే పవిత్రులు అయిపోయారా? అని మమతా బెనర్జీ ప్రశ్నిస్తున్నారు. ఉపాధి హామీ నిధులను కేంద్రం అడ్డుకోవడం వెనుక రాజకీయ కక్ష ఉందన్న అభిషేక్ బెనర్జీ వాదనను కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతోంది.సంక్షేమం వర్సెస్ కుంభకోణం2026 అసెంబ్లీ పోరులో మమతా బెనర్జీ ప్రధానంగా తన సంక్షేమ పథకాలను ‘రక్షణ కవచం’గా భావిస్తున్నారు. ‘లక్ష్మీ భండార్’, ‘కన్యాశ్రీ’ వంటి పథకాల ద్వారా మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని దీదీ వ్యూహాలు రచిస్తున్నారు. ఒకవైపు అవినీతి ఆరోపణలు, మరోవైపు సంక్షేమ ఫలాలు.. ఈ రెండింటిలో బెంగాల్ ఓటర్లు దేనికి పట్టం కడతారన్నది ఉత్కంఠ రేపుతోంది.ఇది కూడా చదవండి: ‘మమ్మల్ని చంపేయండి’.. పాక్‌లో అల్లకల్లోలం -
కరుణానిధిని గృహనిర్బంధం చేశారు: పళని స్వామి సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని చివరి రోజుల్లో గృహనిర్బంధంలో ఉంచారని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి సంచలన ఆరోపణలు చేశారు. అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే దీనిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. శనివారం తిరువణ్ణామలైలో ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడారు. ‘‘కరుణానిధి గురించి డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి ఎ.రాజా చెప్పిన విషయాలనే గుర్తు చేస్తున్నా. తండ్రిని గృహనిర్బంధంలో ఉంచడం న్యాయమేనా అని సీఎం స్టాలిన్‌ను ఉద్దేశించి ఒక వీడియోలో రాజా ప్రశ్నించారు’’ అని చెప్పారు. మాజీ సీఎం జయలలిత మృతిపై విచారణ జరిపిస్తామన్న స్టాలిన్, తన తండ్రి కరుణానిధిని గృహనిర్బంధంలో ఉంచిన వారిపై విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు. అన్నాడీఎంకే అధికారంలోకి రాగానే దీనిపై విచారణ చేయించి, బాధ్యులను శిక్షిస్తామని పళనిస్వామి ప్రకటించారు. 2021–26 మధ్య కాలంలో తమిళనాడును అప్పుల్లో, అవినీతిలో, డ్రగ్స్ వాడకంలో, శాంతిభద్రతల వైఫల్యంలో స్టాలిన్ నంబర్‌వన్ స్థానానికి తీసుకెళ్లారని విమర్శించారు. ఆయన కేవలం ఫొటోషూట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. -
మైనార్టీలపై దాడిచేసిన వారితో దోస్తీనా!
అలప్పుజ/ఇడుక్కి/కొచ్చి: మణిపూర్, ఛత్తీస్‌గఢ్‌ల లో మైనార్టీలపై దారుణ దాడులకు తెగబడిన బీజేపీతో కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ సారథ్యంలోని ఎల్డీఎఫ్ కూటమి అంటకాగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపణల నిప్పులు కురిపించారు. కేరళ శాసనసభ ఎన్నికల సందర్భంగా శనివారం అలప్పుజ, ఇడుక్కి, ఇర్నా కులం జిల్లాలోని కట్టప్పణ, ఫోర్ట్ కొచ్చి, కున్నథునాడ్ల లో ప్రచార ర్యాలీల్లో రాహుల్ పాల్గొని ప్రసంగించారు. ‘‘ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు కేరళ నర్సులపై దాడులు జరిగా యి. మణిపూర్‌లో చర్చిలను తగలబెట్టారు. ఇలాంటి హే యదాడులకు పాల్పడుతు న్న (బీజేపీ) వాళ్లతో సీఎం విజయన్ చెలిమి చేస్తున్నారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కు లపై దాడిచేసే వాళ్లతో సీఎం రహస్య పొత్తు పెట్టుకున్నా రు. వామపక్ష సిద్ధాంతాలు ఒంటబట్టించుకుని కూడా సీఎం ఎలా ఇలాంటి వాళ్లతో జతకడతారు? ఆయన కు కనీసం సిగ్గు అన్పించట్లేదా? దీనికి సీఎం రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే. తన కుమార్తె (వీణ)ను ఒక కేసు నుంచి కాపాడేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు. కేంద్ర దర్యాప్తునకు, ప్రధాని మోదీకి సీఎం భయపడుతున్నారు’’ అని అన్నారు. కేరళలో వెలుగుచూసిన కొచ్చి మినరల్స్ అండ్ రూటైల్ లిమిటెడ్ (సీఎంఆర్ఎల్), ఎక్సోలాజిక్ సొల్యూషన్స్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయని వీణపై కేసు నమోదవడం తెల్సిందే. ‘‘మన వామ పక్ష నేత(సీఎం) తన కుమార్తెను కాపాడుకునేందుకు మతవాద(బీజేపీ) పార్టీ పంచనచేరారు. తన పిల్లల కోసం సీఎం ప్రజలను గాలికొదిలేశారు. మతవాద పార్టీ ఎలా ఆడిస్తే సీఎం అలా ఆడుతు న్నారు’ అని రాహుల్ అన్నారు. ‘‘ఎల్డీఎఫ్ను అదృశ్య శక్తి నడిపిస్తోంది. ఆ అదృశ్య శక్తి ఒక మత శక్తి. అది భారతరాజ్యాంగాన్ని యథాతథంగా ఒప్పుకోదు. విడగొట్టడం, విద్వేషం రెచ్చగొట్టడం దాని ఏకైక లక్ష్యం. కేరళలో ఇప్పుడు బీజేపీ, ఆర్ఎస్ఎస్, సీపీఐ(ఎం) బంధాన్ని స్పష్టంగా చూడొచ్చు’’ అని అన్నా రు. ‘‘అమెరికా అధ్యక్షుడి అనుమతి లేకుండా మోదీ సర్కార్ ఏ దేశం నుంచీ చము రు కొనలేని దుస్థితి దాపురించింది. ఏ దేశం నుంచి మనం చమురు, గ్యాస్ కొనాలో ట్రంపే నిర్ణయిస్తున్నారు’’ అని రాహుల్ ఆరోపించారు. ‘‘కేరళలో రైతులకు ఎల్డీఎఫ్ సర్కార్ నుంచి తోడ్పాటు కరువైంది. తేయాకు, రబ్బర్, యాలకుల సాగు తగ్గిపోయింది. రైతులు రుణాల ఊబిలో చిక్కుకుంటున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరుగుతోంది. ఇడుక్కిలో వైద్యసంరక్షణ వ్యవస్థ నాశనమైంది. అందుకే అత్యవసర వైద్యం కోసం జనం కొట్టాయంకు వెళ్తున్నారు. ఇక్కడ ప్రతి ముగ్గురిలో ఒకరికి ఉద్యోగం లేదు. మేం అధికారంలోకి వస్తే యూడీఎఫ్ కూటమి హామీలను నెరవేరుస్తుంది’’ అని రాహుల్ భరోసా ఇచ్చారు. -
ఓటింగ్‌పై గల్ఫ్ దెబ్బ!
కేరళలో ప్రతి ఎన్నికల్లోనూ ప్రవాస ఓటర్లు కీలక పాత్ర పోషిస్తుంటారు. వీరిలో అత్యధికులు గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డవారే. కన్నూర్ మొదలుకుని పాలక్కాడ్ దాకా కనీసం 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రవాసుల ఓట్లు నిర్ణాయకంగా మారుతుంటాయి. దాంతో ఎన్నికల వేళ పార్టీలన్నీ గల్ఫ్ ఓటర్లపై ప్రత్యేకంగా దృష్టి పెడతాయి. వారిని ఓటింగ్‌కు రప్పించేందుకు అన్నిరకాలుగా ప్రయత్నిస్తుంటాయి. కానీ ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా గల్ఫ్ దేశాల్లోని మలయాళీలు ఈసారి ఓటేసేందుకు వచ్చే అవకాశాలు పెద్దగా కన్పించడం లేదు. ఇది పార్టీల విజయావకా శాలను గణనీయంగా ప్రభావితం చేయడం ఖాయమని భావిస్తున్నారు.కేరళలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. రాష్ట్రంలో ప్రతి ఎన్నికల్లోనూ గల్ఫ్ ఓటర్లది కీలక పాత్రగా ఉంటూ వస్తోంది. ఆ దేశాల్లో 2.25 లక్షల మంది దాకా ఓటర్లున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ వారిలో కనీసం 60 శాతం పైచిలుకు ఓటింగ్ నమోదవడం పరిపాటి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా యుద్ధం దెబ్బతో ఈసారి మాత్రం పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోయాయి. గల్ఫ్ నుంచి భారత్‌కు విమాన సర్వీసులు బాగా తగ్గిపోయాయి. దీనికి తోడు టికెట్ల ధరలు చుక్కలనంటుతున్నాయి. రూ.8 వేల నుంచి 13 వేలలోపు ఉండే టికెట్లు ఏకంగా రూ.60 వేల దాకా ఎగబాకాయి! పైగా సెలవులు తీసుకుని వస్తే ఉద్యోగం ఊడే పరిస్థితి! దాంతో ఈసారి ఓటింగ్ కోసం వచ్చే మలయాళీల సంఖ్య బాగా తగ్గడం ఖాయంగా కనిపిస్తోంది. 10 శాతం ఓటింగ్ నమోదైనా గొప్పేనని భావిస్తున్నారు!మలబార్లో కీలకంఉత్తర కేరళ ప్రాంతంలో, ముఖ్యంగా మలబార్ ప్రాంతంలో ప్రవాసుల ఓట్లు కీలకంగా మారుతుంటాయి. ఇక్కడ వాటి సంఖ్య చాలా ఎక్కువగా ఉండటమే గాక అతి స్వల్ప మెజారిటీలు నమోదవుతుండటమే ఇందుకు కారణం. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో పెరింతల్మన్న అసెంబ్లీ స్థానంలో కేవలం 38 ఓట్ల తేడాతో, కుట్టియాడిలో 333 ఓట్ల మెజారిటీతో ఫలితం తేలింది! తనూర్, త్రితల వంటి చోట్ల మెజారిటీ 5,000 ఓట్ల లోపే నమోదైంది. ఇలాంటి స్థానాల్లో ప్రవాసుల ఓట్లు వేలాదిగా ఉండటం విశేషం. కుట్టియాడి అసెంబ్లీ స్థానం పరిధిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 16 వేల పైచిలుకు ప్రవాస ఓటర్లున్నారు!! నాదపురంలో 12,424 మంది, తిరూర్‌లో 8,601, కళ్లియసెరిలో 8,097 మంది ప్రవాస ఓటర్లున్నారు. స్వల్ప మెజారిటీలు నమోదయ్యే ఇలాంటి స్థానాల్లో ప్రవాసుల ఓట్లే నిర్ణాయకంగా ఉంటూ వస్తున్నాయి. కానీ ఈసారి వారు భారీ సంఖ్యలో స్వదేశానికి వచ్చి ఓటేసే పరిస్థితులు కన్పించకపోవడంతో పార్టీలు కూడా వారిపై ఆశలు వదులుకుంటున్నాయి. స్థానిక ఓట్లపైనే మరింతగా దృష్టి పెడుతూ గెలుపు వేటలో పడ్డాయి. గల్ఫ్ ఓటర్లపై గట్టి పట్టున్న విపక్ష యూడీఎఫ్ కూటమికి ఇది ఒకరకంగా ఎదురుదెబ్బేనని ఓవర్సీస్ ఇండియన్ కల్చరల్ కాంగ్రెస్ (ఓఐసీసీ) పశ్చిమాసియా కన్వీనర్ కె.టి.ఎ.మునీర్ అభిప్రాయపడ్డారు. ‘‘గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డ యూడీఎఫ్ కార్యకర్తల్లో 30 శాతం మంది, మద్దతుదారుల్లో 60 శాతం మంది ఈసారి ఓటింగ్‌కు రాలేకపోవచ్చు. విమాన టికెట్ల ధరలు నాలుగింతలు, అంతకుమించి పెరగడమే ఇందుకు ప్రధాన కారణం’’ అంటూ ఆయన వాపోయారు. వారు గల్ఫ్ నుంచే ఓటేసేలా ఇ–ఓటింగ్ సదుపాయం అందుబాటులో ఉంటే తమకెంతో కలిసొచ్చేదని అభిప్రాయపడ్డారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
కేరళలో ఎల్డీఎఫ్ ఇక ఇంటికే..
తిరువల్ల/తిరువనంతపురం: కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడానికి కౌంట్‌డౌన్ మొదలైందని తేల్చిచెప్పారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే అధికారంలోకి రాబోతోందని ధీమా వ్యక్తంచేశారు. శనివారం కేరళ రాష్ట్రం పథనంతిట్ట జిల్లాలోని తిరువల్లలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో మోదీ ప్రసంగించారు. రాష్ట్రంలో వామపక్షాల పాలనకు వీడ్కోలు చెప్పాల్సిన సమయం వచ్చేసిందన్నారు. ఎల్డీఎఫ్ను ఓడించడమే ధ్యేయంగా బీజేపీ కార్యకర్తలు శ్రమిస్తున్నారని చెప్పారు. ఈశాన్యంలోని ఏడు రాష్ట్రాలకు గాను ఆరు రాష్ట్రాలతోపాటు గోవాలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అద్భుతంగా అభివృద్ధి చేశామని తెలిపారు. అదే తరహాలో కేరళలోనూ అభివృద్ధి చేసి చూపిస్తామని ప్రకటించారు. అవినీతి, మతతత్వమే అవరోధాలు కేరళలో ప్రగతికి ఎన్నెన్నో అవకాశాలు ఉన్నప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే వెనుకంజలోనే ఉండిపోయిందని ప్రధానమంత్రి ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవన్నారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు కేరళను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ ఒక్కసారి కూడా అధికారంలోకి రాకపోయినప్పటికీ ఇక్కడి అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం అందిస్తూనే ఉన్నామని గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన నిధుల కంటే ఐదు రెట్లు ఎక్కువ నిధులు ఇచ్చామని తెలిపారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ విధానాలతో ప్రధానంగా మహిళలే అత్యధికంగా లబ్ధి పొందారని వెల్లడించారు. కేరళలో ప్రగతికి అవినీతి, మతతత్వం అతిపెద్ద అవరోధాలుగా మారాయన్నారు. అవి తొలగిపోవాలంటే ఎల్డీఎఫ్ను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బీజేపీకి బీ–టీమ్ అంటూ ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌లు సరస్పరం నిందలు వేసుకుంటున్నాయని చెప్పారు. నిజానికి కేరళలో ఎ–టీమ్ బీజేపీ మాత్రమేనని స్పష్టంచేశారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌ల మధ్య రహస్య స్నేహం సాగుతోందన్నారు. అవి రెండు ఒకే నాణేనికి బొమ్మా బొరుసుల్లాంటివని విమర్శించారు. అందుకే ఆ రెండు పక్షాలు బీజేపీని టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే ఎల్డీఎప్, యూడీఎఫ్‌ల అరాచకాలపై దర్యాప్తు జరిపిస్తామని, దోషులను శిక్షిస్తామని ప్రకటించారు. పశ్చిమాసియా యుద్ధంపై కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారంగా నోరు పారేసుకుంటున్నారని ప్రధానమంత్రి ధ్వజమెత్తారు. వారి నోటిదురుసు వల్ల పశ్చిమాసియాలోని భారతీయులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. రాజకీయాలు, ఎన్నికలు వస్తుంటాయి పోతుంటాయని అన్నారు. గల్ఫ్‌లో మన భారతీయుల సంక్షేమం కోసం అన్ని చర్యలూ తీసుకుంటున్నామని పేర్కొన్నారు. తిరువనంతపురంలో భారీ రోడ్ షో ప్రధాని మోదీ కేరళ రాజధాని తిరువనంతపురంలో శనివారం సాయంత్రం రోడ్ షోలో పాల్గొన్నారు. జనం భారీ ఎత్తున తరలివచ్చారు. వీధులు కిక్కిరిసిపోయాయి. నగరం జనసంద్రాన్ని తలపించింది. మోదీ ఓపెన్ టాప్ వాహనంలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. బీజేపీ అభ్యర్థులు పాలుపంచుకున్నారు. ఒకటిన్నర కిలోమీటర్ల మేర సాగిన మో దీ రోడ్ షో అంచనాలకు మించి విజయవంతం కావడంతో బీజేపీలో ఉత్సాహం నెలకొంది. -
దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదు: ప్రధాని మోదీ
తిరువల్ల (కేరళ): లోక్‌సభ స్థానాల పెంపు విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయమూ జరగబోదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జనాభా ఆధారంగా ఆ రాష్ట్రాల్లో పెరిగే లోక్‌సభ స్థానాల సంఖ్య స్వల్పంగానే ఉండనుందన్న వార్తలను కొట్టిపారేశారు. ‘‘జనాభా పెరుగుదలను నియంత్రించిన కారణంగా దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాల సంఖ్యను తగ్గించే ప్రసక్తే ఉండబోదు. లోక్‌సభ స్థానాల సంఖ్య పెంపుతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకూ లబ్ధి కలుగుతుంది’’అని వెల్లడించారు. శనివారం కేరళలోని తిరువల్లలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. ‘‘దక్షిణాది రాష్ట్రాల్లో జన సంఖ్య తగ్గిన కారణంగా అక్కడ లోక్‌సభ స్థానాల సంఖ్యను తగ్గిస్తారంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏ మాత్రమూ వాస్తవం లేదు. సీట్ల పెంపులో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు ఏ మాత్రమూ తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ విషయంలో వాటి ప్రయోజనాలను పరిరక్షించేందుకు పార్లమెంటు అన్ని చర్యలూ తీసుకుంటుంది’’అని ప్రకటించారు. ‘‘కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గోవా, తెలంగాణ తదితర రాష్ట్రాలు జనాభా పెరుగుదలను విజయవంతంగా కట్టడి చేశాయి. జనాభా పెరుగుదల శాతం తక్కువగా ఉందన్న కారణంగా అవి లోక్‌సభ స్థానాలను కోల్పోవడానికి వీల్లేదు. స్థానాల పెంపులో వాటికి ఎలాంటి అన్యాయమూ జరగబోదు’’అని చెప్పారు. మహిళా బిల్లుపై పార్టీలు కలిసి రావాలి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను ఏప్రిల్ 16 నుంచి 18 దాకా మూడు రోజుల పాటు పొడిగించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టానికి సవరణలకు ఆ సందర్భంగా ఆమోదముద్ర పడనుందని మోదీ వెల్లడించారు. ‘‘లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33 శాతం కేటాయించేలా నారీ శక్తి వందన్ అధినియమ్ చట్టం తీసుకొచ్చాం. దానిపై పార్లమెంటు మూడు రోజుల పాటు చర్చించి మరింత ముందుకు తీసుకెళ్లనుంది. తద్వారా 2029 నుంచి పార్లమెంటులో మహిళలకు 33 శాతం ప్రాతినిధ్యం దక్కేలా చూడటమే మా ప్రభుత్వ లక్ష్యం. అందుకే నారీ శక్తి అధినియమ్ సవరణ బిల్లుకు మద్దతివ్వాలని అన్ని పార్టీలకూ విజ్ఞప్తి చేస్తున్నా’’అన్నారు. ‘‘ఎన్డీఏ విధానాల అతి పెద్ద లబ్ధిదారులు మహిళలేనని మోదీ చెప్పుకొచ్చారు. ‘‘మహిళా సాధికారత, వారికి సముచిత ప్రాతినిధ్యం మా ప్రాథమ్యాలు. మహిళల సమస్యల పరిష్కారానికి మా ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోంది. ప్రతి ఇంటికీ టాయ్‌లెట్ సౌకర్యం కల్పించాం. లఖ్పతి దీదీ వంటి పథకాలు తెచ్చాం. మహిళల పేరిటే ఇళ్ల నిర్మాణం చేపట్టాం. జన్‌ధన్ ఖాతాలు తెరిచాం. వారికి ముద్రా లోన్లు అందేలా చేశాం. దాంతో ఎందరో మహిళలు సొంత వ్యాపారాలు మొదలు పెట్టడమే గాక వాటిని విజయవంతంగా నడుపుతూ రాణిస్తున్నారు’’అని వివరించారు. కాంగ్రెస్ విమర్శలు లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి 816కు పెంచాలని మోదీ సర్కారు నిర్ణయించడం తెలిసిందే. ఈ విషయమై ఎన్డీఏ పక్షాలతో పాటు పలు కాంగ్రెసేతర పార్టీలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇటీవల సమావేశమయ్యారు. జనాభా ప్రాతిపదికగా కాకుండా ప్రతి రాష్ట్రంలోనూ 50 శాతం మేరకు స్థానాలను పెంచనున్నట్టు వెల్లడించారు. మహిళలకు 33 శాతం చొప్పున లోక్‌సభలో 273 స్థానాల దాకా వారికి రిజర్వు చేయనున్నారు. ఇందుకు వీలుగా డీ లిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ల చట్ట సవరణ బిల్లును కూడా మోదీ సర్కారు పార్లమెంటు ముందు పెట్టనుంది. ఇందుకు వీలుగా, ఏప్రిల్ 2న నిరవధికంగా వాయిదా పడాల్సిన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను మరో మూడు రోజుల పాటు పొడిగించారు. లోక్‌సభ స్థానాల పెంపు నిర్ణయాన్ని, అందుకు ఎంచుకున్న సమయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రశ్నించింది. నాలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఈ ఎత్తుగడకు దిగిందని విమర్శించింది. లోక్‌సభ స్థానాల పెంపు విషయంలో అన్ని పార్టీలను సంప్రదించకుండా మోదీ సర్కారు ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆరోపించింది. దక్షిణాది రాష్ట్రాలు జనాభాను కట్టడి చేసినందుకు అక్కడ లోక్‌సభ స్థానాలను తగ్గించి వాటిని శిక్షించరాదని డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాని తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
టీవీకే విజయ్ ఉగ్రరూపం.. సినిమాలో కాదు..
పుదుచ్చేరి ఎన్నికల వేళ ఇవాళ (ఏప్రిల్ 4న) టీవీకే అధినేత, సినీనటుడు విజయ్ రోడ్ షో నిర్వహించారు. ఆ సమయంలో ఓ వృద్ధుడిని భద్రతా సిబ్బంది వృద్ధుడిని తోసేశాడు. దీంతో భద్రతా సిబ్బందిపై విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.ఆ రోడ్ షోలో విజయ్ను చూడటానికి ప్రజలు భారీ సంఖ్యలో వచ్చారు. ఆయన అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు వెళ్తున్నారు. వ్యానుపై ఉన్న విజయ్ను చూడడానికి ప్రజలు ఆయనకు దగ్గరగా వచ్చే ప్రయత్నం చేశారు. భద్రతా సిబ్బంది అక్కడి జనసమూహాన్ని నియంత్రించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ఒక వృద్ధుడు.. విజయ్ వ్యానును దగ్గరగా వచ్చాడు.ఈ విషయాన్ని గమనించిన భద్రతా సిబ్బంది ఆ వృద్ధుడిని తోసినట్టు ఈ వీడియోలో కనపడుతోంది. వెంటనే విజయ్ అది గమనించాడు. ఆ సిబ్బందిని చూసి అలా ప్రవర్తించవద్దని చెబుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వృద్ధుడితో భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు పట్ల విజయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.ఈ ఘటన కెమెరాలో రికార్డయింది. విజయ్ అభిమానులు, మద్దతుదారులు ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. విజయ్ వ్యవహరించిన తీరు ప్రశంసనీయమని అంటున్నారు. ఆ పరిస్థితిలో వృద్ధుడి పక్షాన విజయ్ నిలబడ్డారని అంటున్నారు. విజయ్ రోడ్ షోలకు ప్రజలు భారీగా వస్తున్నారు. Thalapathy Vijay was angry with the security for pushing an elderly man 🥹🥹 pic.twitter.com/SkbSPXd08P— Vijay Fans Trends (@VijayFansTrends) April 4, 2026 -
టికెట్ నిరాకరణ.. మౌనం వీడిన అన్నామలై
చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ శుక్రవారం ప్రకటించింది. 27 స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. ఈ జాబితాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. అన్నామలై పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే ఒత్తిడి మేరకే ఆయనను పోటీకి దూరంగా పెట్టారన్న ఊహాగానాలు వచ్చాయి. ఈ వదంతులను అన్నామలై కొట్టిపారేశారు. తానే పోటీ చేయనని అధిష్టానానికి చెప్పినట్టు వెల్లడించారు.తనకు టికెట్ నిరాకరించలేదని, తనకు తానుగా పోటీకి దూరంగా ఉన్నట్టు అన్నామలై చెప్పారు. కోయంబత్తూరు నుంచి చెన్నై వచ్చిన ఆయన విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. తన నిర్ణయాన్ని పార్టీ నాయకత్వానికి చాలా ముందే అధికారికంగా లిఖితపూర్వకంగా తెలియజేశానని వెల్లడించారు. ''అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని కోర్ కమిటీకి ఎప్పుడో చెప్పేశాను. కాబట్టి నాకు టికెట్ ఇవ్వలేదన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. నాకు నేనుగా పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంటే, అధిష్టానం టికెట్ ఎలా ఇస్తుంద''ని ప్రశ్నించారు.అధిష్టానం తనకు టికెట్ ఇవ్వలేదని మీడియాలో ప్రచారం జరుగుతుండడంతోనే తాను స్పష్టత ఇస్తున్నానని అన్నామలై తెలిపారు. తన నిర్ణయాన్ని గౌరవించినందుకు, ఎన్డీఏ అభ్యర్థుల ప్రచారం చేసేలా అనుమతి ఇచ్చినందుకు పార్టీ నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కాగా, గెలిచే సత్తా నాయకులనే అభ్యర్థులుగా ఎంపిక చేసిందని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. తమిళనాడు ప్రజలు డీఎంకే సంకీర్ణ ప్రభుత్వ మోసాలతో విసిగిపోయారని, ఈసారి ఎన్డీఏకు పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. చదవండి: తమిళనాడు ఎన్నికల బరిలో తెలంగాణ మాజీ గవర్నర్అన్నామలై అలిగారా?తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నామలై హాట్‌టాపిక్‌గా మారారు. అన్నాడీఎంకేతో సీట్ల సర్దుబాటు విషయంలో ఆయన గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కోయంబత్తూరులోని కీలక స్థానాలను అన్నాడీఎంకే పార్టికి కేటాయించడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారని సమాచారం. ఇదే విషయంపై పార్టీ కేంద్ర నాయకత్వానికి లేఖ కూడా రాసినట్టు వార్తలు వచ్చాయి. సీట్ల పంపిణీలో అన్నాడీఎంకే అగ్రనేత పళనిస్వామి పెత్తనం ఆయనను మరింత క్షోభకు గురిచేసిందని అన్నామలై సన్నిహితులు అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఎన్నికల్లో పోటీకి ఆయనకు దూరంగా ఉన్నారన్న గుసగుసలు విన్పిస్తున్నాయి. లోపల ఎలా ఉన్నా, పైకి మాత్రం అలాంటిదేమి లేదని అన్నామలై చెబుతున్నారు. -
Assam: అభ్యర్థుల భవితవ్యం వాళ్ల చేతుల్లోనే!
అస్సాంలో ఏప్రిల్ 9న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బంగ్లాదేశ్‌తో సరిహద్దు పంచుకుంటున్న కారణంగా అస్సాంలో ముస్లింల జనాభా అధికంగా ఉంటుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం అస్సాంలో 34 శాతం మంది ముస్లిం జనాభా ఉంది. ఇప్పుడు అది 40 శాతానికి చేరినట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో అత్యధిక జనాభా ముస్లింలదే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అస్సాంలో 126 స్థానాలకుగాను 23 మంది ముస్లిం ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 722 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో 188 మంది ముస్లిం అభ్యర్థులు (దాదాపు 26 శాతం) ఉన్నారు. అయితే జనాభాతో పోలిస్తే అస్సాంలో ముస్లిం ప్రాతినిధ్యం తక్కువే అని చెప్పొచ్చు. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. బీజేపీ ప్రకటించిన 90 మంది అభ్యర్థుల్లో ఒక్క ముస్లిం కూడా లేరు.అత్యధికం ఆ పార్టీ నుంచే..పార్టీల వారీగా చూస్తే, ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఏఐయూడీఎఫ్) అత్యధికంగా 87 శాతం ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపింది. ఏజీపీ 46 శాతం మందిని బరిలోకి దింపింది. తృణమూల్ కాంగ్రెస్ 32 శాతం, కాంగ్రెస్ 18 శాతం ముస్లిం అభ్యర్థులను బరిలోకి దింపాయి. పొత్తుల విషయానికొస్తే, కాంగ్రెస్ నేతృత్వంలోని అస్సాం మహాజోత్ (ఏఎస్ఎం) 128 మంది అభ్యర్థులను బరిలోకి దింపగా.. ఇందులో 22 మంది ముస్లింలు (17 శాతం) ఉన్నారు. మరోవైపు నార్త్ఈస్ట్ డెమోక్రటిక్ అలయన్స్ కూటమి 127 మంది అభ్యర్థులను బరిలోకి దింపితే.. ఇందులో కేవలం 13 మంది మాత్రమే ముస్లింలు (10 శాతం) ఉండడం గమనార్హం.అయితే జనాభాపరంగా దిగువ అస్సాంతో పాటు బరాక్ వ్యాలీలోని కొన్ని నియోజకవర్గాలలో ముస్లిం అభ్యర్థుల ప్రాతినిధ్యం ఎక్కువగా కనిపిస్తుంది. గౌరీపూర్, జలేశ్వర్, చమారియా, చెంగా నియోజకవర్గాల్లో మాత్రమే ముస్లిం అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరోవైపు, రాష్ట్రంలోని 126 నియోజకవర్గాల్లో 83 నియోజకవర్గాల్లో ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా పోటీలో లేరు. ఈ నియోజకవర్గాలు ప్రధానంగా ఉత్తర అస్సాం, బోడోలాండ్ ప్రాదేశిక ప్రాంతంలో ఉన్నాయి. దిబ్రూగఢ్‌లోని టిన్సుకియా నుంచి తముల్‌పూర్‌లోని కోక్రాఝర్ వరకు ముస్లిం అభ్యర్థులు లేకపోవడంతో ఇక్కడ అధికంగా ఉన్న ముస్లిం ఓట్లు ఎవరికి పడనున్నాయనేది ఆసక్తిగా మారింది.స్వతంత్రులతో తలనొప్పి!జనాభా పరంగా ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్నప్పటికీ పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ముస్లింలు తక్కువగా ఉండడం.. అదే సమయంలో స్వతంత్రంగా బరిలోకి దిగుతున్న 257 మంది అభ్యర్థుల్లో 88 మంది (34 శాతం) ముస్లిం అభ్యర్థులు ఉండడం ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారనుంది. వీరివల్ల ఓట్ల విషయంలో చీలిక వచ్చే అవకాశముంది.అస్సాం జనాభాలో మూడింట ఒక వంతు ముస్లింలు ఉన్నప్పటికీ, అధికార పార్టీ అభ్యర్థుల జాబితాలో వారి ప్రాతినిధ్యం మాత్రం తక్కువగానే కనిపిస్తుంది. దీంతో ఏప్రిల్ 9న జరగనున్న ఓటింగ్‌లో ముస్లింలు ఎవరికి ఓటు వేస్తారనేది ఆసక్తిగా మారింది. మొత్తంగా చూసుకుంటే అస్సాంలో అభ్యర్థుల భవితవ్యం ముస్లిం ఓటర్లపైనే ఆధారపడి ఉంది.చదవండి: ‘విజయ్’ దాడికి ‘రంగసామి’ కోట బద్దలు? -
దరఖాస్తు రుసుం వెనక్కి ఇవ్వరూ!
సాక్షి, చెన్నై: ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్న దృష్ట్యా, ఆశావహుల నుంచి దరఖాస్తుల సమయంలో స్వీకరించిన ఫీజును వెనక్కి ఇవ్వాలన్న నినాదం మక్కల్ నీది మయ్యంలో మొదలైంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నటుడు, రాజకీయ నాయకుడు కమలహాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. డీఎంకే నేతృత్వంలోని కూటమికి మద్దతు ఇస్తున్నామని, అయితే, తమ పార్టీ తరఫున ఎవ్వరూ పోటీ చేయడం లేదని ప్రకటించారు. అదేసమయంలో డీఎంకే తన పార్టీ ఉదయసూర్యుడి చిహ్నంలో పోటీచేయాలని ఒత్తిడి తీసుకు రావడంతోనే కమల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎన్నికల్లో పోటీ చేసే ఆశతో లక్ష మందికి పైగా మక్కల్ నీది మయ్యం నాయకులు దరఖాస్తు చేసుకున్నారు.వీరంతా రూ.30వేల నుంచి రూ.50వేల వరకు దరఖాస్తు రుసుము చెల్లించారు. అదేసమయంలో ఎన్నికలల్లో పోటీ చేయనప్పుడు పార్టీని నడపడంలో అర్థం ఏమిటి అన్న విమర్శలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో ఆశావహుల నుంచి దరఖాస్తుల రూపంలో సేకరించిన రుసుంను వెనక్కి అందించేందుకు కమల్ నిర్ణయించినట్టు తెలిసింది. మరో రెండు, మూడు రోజుల్లో ఈ మొత్తాన్ని దరఖాస్తు చేసుకున్న వారికి అందించే విధంగా చర్యలపై మక్కల్ నీది మయ్యం కసరత్తులు చేపట్టిందని ఆ పార్టీ నేత ఒకరు పేర్కొన్నారు. -
కేరళలో హైడ్రామా.. శశిథరూర్ కాన్వాయ్ అడ్డగింత, దాడి
తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికల వేళ కేరళలో షాకింగ్ ఘటన వెలుగు చేసింది. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కాన్వాయ్‌ను అడ్డుకున్న కొందరు దుండగులు ఆయన గన్‌మెన్‌పై దాడి చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎన్నికల వేళ ఈ ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది.వివరాల మేరకు.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నాడు కేరళలోని మలప్పురం జిల్లాలో పర్యటించారు. అక్కడ ప్రచారం ముగిసిన తర్వాత వాండూర్‌లో జరగనున్న ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వెళ్తుండగా, తిరువల్లి చెల్లితోడు వంతెన సమీపంలో ఎంపీ కాన్వాయ్‌ని కొందరు దుండగులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారితో వాగ్వాదానికి దిగారు. ఆయన భద్రతా సిబ్బందిలో ఒకరిపై దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. దీంతో, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టారు.భద్రతా సిబ్బంది ఫిర్యాదు ఆధారంగా వాండూర్ పోలీసులు.. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.కలికావుకు చెందిన ఉమ్మారా అనే నిందితుడిపై నాన్బెయిలాబుల్ కేసు నమోదైనట్టు పోలీసు అధికారులు చెబుతున్నారు. కాగా, కేరళలో ఏప్రిల్ 9న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపడతారు.Malappuram, Keralam: A complaint has been filed alleging that the convoy of Congress MP Shashi Tharoor was blocked near Thiruvalli Chellithodu bridge while he was travelling to an election campaign event in Wandoor. The complaint claims that Tharoor’s gunman was assaulted… pic.twitter.com/CVqZ25TzbP— IANS (@ians_india) April 3, 2026 -
‘విజయ్’ దాడికి ‘రంగసామి’ కోట బద్దలు?
రెండు దశాబ్దాల రాజకీయ సంప్రదాయం ఒకవైపు.. మార్పు కోరుకునే కొత్త తరం మరోవైపు.. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు- 2026 వేళ ఈ కేంద్రపాలిత ప్రాంతం ఒక రసవత్తర పోరాటానికి వేదికైంది. గత 20 ఏళ్లుగా ఏ అధికార పార్టీ కూడా వరుసగా రెండోసారి పీఠాన్ని దక్కించుకోని ‘రివాజు’ పుదుచ్చేరి సొంతం. ఈ సెంటిమెంట్‌ను బ్రేక్ చేసి, చరిత్ర తిరగరాయాలని ముఖ్యమంత్రి ఎన్. రంగసామి భావిస్తుంటే, తన ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీతో ఎంట్రీ ఇచ్చి, సమీకరణలను తలకిందులు చేసేందుకు ‘దళపతి’ విజయ్ సిద్ధమయ్యారు. దీంతో పుదుచ్చేరి రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి.వెంటాడుతున్న నకిలీ ఔషధాల కుంభకోణంప్రస్తుత ముఖ్యమంత్రి రంగసామికి తన వ్యక్తిగత ఇమేజ్, సంక్షేమ పథకాలు కొండంత అండగా నిలిచాయి. కేంద్రంలోని బీజేపీ దన్ను, నిధుల లభ్యత ఎన్డీఏ కూటమికి బలాన్నిస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయిలో బీజేపీకి బలమైన క్యాడర్ లేకపోవడం, నకిలీ ఔషధాల కుంభకోణం వంటి ఆరోపణలు ప్రభుత్వానికి మైనస్‌గా మారాయి. వీటన్నింటికీ మించి ఇరవై ఏళ్లుగా కొనసాగుతున్న అసంతృప్తిని తట్టుకుని రంగసామి గట్టెక్కుతారా అనేది ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. అధికారాన్ని నిలబెట్టుకోవడం ఆయనకు జీవన్మరణ సమస్యగా మారింది.సీనియర్ల అసంతృప్తితో..మరోవైపు కాంగ్రెస్-డీఎంకే కూటమి బలమైన పునాదులతో బరిలోకి దిగుతోంది. క్షేత్రస్థాయిలో నెట్వర్క్, ప్రత్యేక రాష్ట్ర హోదా సెంటిమెంట్ వీరికి కలిసొచ్చే అంశాలు. అయితే లోలోన రగులుతున్న విభేదాలు, సీట్ల పంపకంలో జాప్యం, సీనియర్ల అసంతృప్తి ఈ కూటమిని బలహీనపరుస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఈ కూటమి తన ఖాతాలో వేసుకుంటుందా? లేక అంతర్గత కుమ్ములాటలతో ప్రత్యర్థులకు అవకాశం ఇస్తుందా? అనేది వేచి చూడాలి. నాయకత్వ సమస్యలను అధిగమిస్తేనే కాంగ్రెస్‌కు పుదుచ్చేరిలో మనుగడ ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు.జయాపజయాలను శాసించే ‘కింగ్ మేకర్’ఇక ఈ ఎన్నికల్లో అసలైన ‘ఎక్స్-ఫ్యాక్టర్’ సినీ నటుడు విజయ్. దళపతికి ఉన్న తిరుగులేని క్రేజ్, యువతలో ఉన్న ఫాలోయింగ్ టీవీకే పార్టీకి ప్రధాన బలం. ఇప్పటికే ఇతర పార్టీల కీలక నేతలను ఆకర్షిస్తూ విజయ్ ప్రకంపనలు సృష్టిస్తున్నారు. అయితే బూత్ లెవల్ మేనేజ్మెంట్ లేకపోవడం, రెండో శ్రేణి నాయకత్వం లోపించడం వంటి సవాళ్లు ఆయన ముందున్నాయి. విజయ్ స్వయంగా గెలిచినా, గెలవకపోయినా.. ఆయన చీల్చే ఓట్లు ఇతర పార్టీల జయాపజయాలను శాసించే ‘కింగ్ మేకర్’ స్థాయికి ఆయన్ని తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.అసలు యుద్ధమంతా ఇక్కడే..భౌగోళికంగా చూస్తే మొత్తం 30 స్థానాల్లో 23 స్థానాలు పుదుచ్చేరి జిల్లాలోనే ఉండటంతో అసలు యుద్ధమంతా నగరం చుట్టూనే కేంద్రీకృతమైంది. కారైకాల్, మాహే, యానాం ప్రాంతాల ఓటర్లు కూడా కీలకం కానున్నారు. 2021 ఎన్నికల్లో గెలిచిన ఎన్డీఏ ఈసారి ఆ విజయపరంపరను కొనసాగిస్తుందా? లేక గత రెండు దశాబ్దాల చరిత్ర పునరావృతమై అధికారం మారుతుందా? అనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ప్రత్యేక రాష్ట్ర హోదా, నిరుద్యోగం వంటి అంశాలే ఇక్కడ ప్రధాన అజెండాగా మారాయి.అత్యంత ఆసక్తికర ఘట్టం2026 మే ఫలితాలు పుదుచ్చేరి రాజకీయాల్లో ఒక నవశకాన్ని ఆవిష్కరించబోతున్నాయి. రంగసామి తన అనుభవంతో ‘రివాజు’ మారుస్తారా? లేక విజయ్ తన ‘దళపతి’ మార్క్ చూపిస్తూ కొత్త రికార్డు సృష్టిస్తారా? అనేది తేలాల్సి ఉంది. ఓట్ల చీలిక ఎవరిని ముంచుతుందో, ఎవరిని తేలుస్తుందో కానీ పుదుచ్చేరి పీఠం కోసం జరుగుతున్న ఈ ‘ముక్కోణపు పోరు’ మాత్రం భారత రాజకీయాల్లోనే అత్యంత ఆసక్తికరమైన ఘట్టంగా నిలవబోతోంది.ఇది కూడా చదవండి: ‘నిజాలు కక్కించే’.. మైండ్ బ్లోయింగ్ ఏఐ డివైజ్! -
పార్టీలో చేరిన వారంలో సీటు
సాక్షి, చైన్నె: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. సుదీర్ఘ మంతనాలతో కాంగ్రెస్ జాబితా ఎట్టకేలకు శుక్రవారం సాయంత్రం విడుదలైంది. ఇందులో శ్రీపెరంబదూరు నుంచి టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై మళ్లీ పోటీ చేయనున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన వారిలో 11 మంది సిట్టింగ్‌లకు మళ్లీ అవకాశం కల్పిస్తూ ఏఐసీసీ చర్యలు తీసుకుంది. అలాగే, కొత్త వారికి అత్యధికంగా సీట్లు కేటాయంచారు.డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌కు 28 సీట్లు దక్కిన విషయం తెలిసిందే. ఆది నుంచి సీట్ల సర్దుబాటుతోపాటు నియోజకవర్గాల ఎంపిక, అభ్యర్థుల ఎంపిక కాంగ్రెస్‌లో వివాదాల నడుమ సాగుతూ వచ్చింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు సెల్వపెరుంతొగై సిద్ధం చేసిన జాబితాపై విమర్శలు, ఆరోపణలు బయలుదేరాయి. చివరకు ఏఐసీసీ పెద్దలు జోక్యం చేసుకుని గురువారం అర్ధరాత్రి వరకు చర్చలు జరిపారు. శుక్రవారం ఉదయం నుంచి కూడా చర్చలు జరిగాయి. ఎట్టకేలకు సాయంత్రం 27 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. మదురై మేలూరు నియోజకవర్గానికి గట్టి పోటీ ఉండడంతో అభ్యర్థి ఎవరు అన్నది పెండింగ్‌లో పెట్టారు. గత ఎ న్నికలలో 18 మంది గెలవగా ఒకరు బీజేపీలోకి వెళ్లారు. మరొకరు మరణించడంతో ఆ సీటు కాస్త ఉప ఎన్నికలలో డీఎంకే ఖాతాలో చేరింది. మిగిలిన 16 మంది ఎమ్మెల్యేలలో 11 మంది సిట్టింగ్‌లకు తాజాగా మళ్లీ అవకాశం కల్పించారు. వీరిలో సెల్వపెరుంతొగై, హసన్ మౌలానా, దురై చంద్రశేఖర్, గోపినాథ్, ఊర్వశి అమృతరాజ్, రూబీ మనోహరన్ ఉన్నారు. మిగిలిన స్థానాలలో కొత్త వారికి అవకాశం ఇచ్చారు.కాంగ్రెస్ అభ్యర్థులుపొన్నేరి(రి)–దురైచంద్రశేఖర్, వేళచ్చేరి – హసన్ మౌలానా, శ్రీపెరంబదూరు– సెల్వపెరుంతొగై, షోళింగర్ –ఏఎం మునిరత్నం, ఊత్తంగరై(రి)– కుప్పుస్వామి,కృష్ణగిరి – చెల్లకుమార్, పెన్నగరం – జీకే ఎం తమిళ్‌కుమరన్, ఆత్తూరు (రి)–ఎస్కే అర్ధనారి, ఈరోడ్ ఈస్ట్– గోపినాథ్ పళణియప్పన్, ఊటి– పి.రామచంద్రన్, గౌండం పాళయం– సూర్యప్రకాష్, సింగానల్లూరు–శ్రీనిధినాయుడు, తురయూర్(రి)– విచ్చు లెనిన్ ప్రసాద్, కడలూరు– చంద్రశేఖరన్, మైలాడుతురై– జమాల్ యూనస్ మహ్మద్, అరంతాంగి–టి.రామచంద్రన్, కారైక్కుడి– ఎస్ మాంగుడి, ఉసిలంపట్టి– టి.శరవణకుమార్, శివకాశి–గణేశన్ అశోకన్, తిరువాడనై– రామకరుమాణిక్యం, శ్రీ వైంకుఠం–ఊర్వశి అమృతరాజ్, శంకరన్ కోవిల్(రి)–సెంగైగణేషన్, అంబాసముద్రం– వీపీ దురై, నాంగునేరి–రూబీమనోహరన్, కులచల్–తారగై, విలవన్ కోడ్ – టీటీ ప్రవీణ్, కిళ్లియూరు–రాజేష్‌కుమార్ పోటీచేస్తున్నారు.పార్టీలో చేరిన వారంలో సీటుపీఎంకేలో జీకే మణి కీలక నేత అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం పీఎంకేలో వివాదాలు సాగుతున్నాయి. పార్టీ వ్యవస్థాపకుడు రాందాసుకు మద్దతుగా జీకే మణి వ్యవహరిస్తున్నారు. ఈ వివాదాల నేపథ్యంలో పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న జీకే మణి కుమారుడు తమిళ్‌కుమారన్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లారు. ఏఐసీసీ పెద్దల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరి వారం రోజులైన కాక ముందే ఆయనకు పెన్నగరం సీటు కేటాయించడం కాంగ్రెస్‌లో చర్చకు దారి తీసింది. -
సువేందుకు అనుకూలం.. ఆయనను తొలగించండి: టీఎంసీ
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లోని భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి(ఆర్వో)ను వెంటనే తొలగించాలని అధికార టీఎంసీ డిమాండ్ చేసింది. ఇదే నియోజకవర్గం నుంచి టీఎంసీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పోటీ చేస్తుండటం తెల్సిందే. ఇక్కడి బీజేపీ అభ్యర్థి సువేందు అధికారికి ఆర్వో సురాజిత్ రాయ్ సన్నిహితుడంటూ ఆరోపించింది. ఈ మేరకు చీఫ్ ఎలక్టోరల్ అధికారి(సీఈవో) మనోజ్ కుమార్ అగర్వాల్‌కు శుక్రవారం ఒక వినతిపత్రం సమర్పించింది.ప్రస్తుత ఆర్వో రాయ్ గతంలో నందిగ్రామ్ నియోజకవర్గంలో బ్లాక్ అభివృద్ధి అధికారిగా ఉన్నప్పుడే సువేందుకు అనుకూలంగా బహిరంగంగానే వ్యవహరించినట్లు పేర్కొంది. అలాంటి అధికారిని సరిగ్గా ఎన్నికల వేళ ఆర్వోగా నియమించడం అనుమానాలకు తావిస్తోందని టీఎంసీ పేర్కొంది. ఈ నియామకం తటస్థ వైఖరికి భంగకరంగా ఉంటుందని పేర్కొంది. ఎలాంటి పక్షపాతానికి తావివ్వకుండా నిష్పాక్షికంగా ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌కు ఉందని తెలిపింది. -
ఎన్నికల బరిలో లాటరీ కింగ్ ఫ్యామిలీ.. వారి ఆస్తులు ఎంతంటే?
చెన్నై/పుదుచ్చేరి: లాటరీ కింగ్‌గా గుర్తింపు పొందిన శాంటియాగో మార్టిన్ కుటుంబంలోని ముగ్గురు తమిళనాడు, పుదుచ్చేరిల్లో ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇందులో వింతేముంది అనుకుంటున్నారా...? వీరు వేర్వేరు పార్టీల తరఫున బరిలోకి దిగడమే అసలైన కిటుకు. మార్టిన్ భార్య లీమా రోజ్(59) ఇటీవలే అన్నాడీఎంకేలో చేరి లాల్గుడి నియోజకవర్గంలో పోటీకి దిగారు.మార్టిన్ కుమారుడు జోస్ చార్లెస్ మార్టిన్(38) సొంతంగా లక్ష్య జననాయక కట్చి(ఎల్జేకే)అనే పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. పుదుచ్చేరిలో బీజేపీ, ఏఐఎన్నార్సీల ఎన్డీయేలో ఈ పార్టీ కూడా ఉంది. చార్లెస్ మార్టిన్ కామరాజ్ నగర్ స్థానానికి పోటీ పడుతున్నారు.మార్టిన్ అల్లుడు ఆధవ్ అర్జున(43), విజయ్ సారథ్యంలోని టీవీకే తరఫున చెన్నైలోని విల్లివాక్కమ్లో పోటీకి దిగారు. ఈ ముగ్గురూ ఏప్రిల్ 9, 13వ తేదీల్లో జరిగే పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కాగా, మార్టిన్ గ్రూప్ కంపెనీ ఎండీగా ఉన్న జోస్ చార్లెస్ తనకు రూ.597 కోట్ల ఆస్తులు, అర్జున రూ.197 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించుకున్నారు. -
365 రోజులున్నా ఫలితం శూన్యం
గజోల్: అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో 15 రోజులుపాటు ఉంటానంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై సీఎం మమతా బెనర్జీ తనదైన శైలిలో స్పందించారు. ‘అమిత్ షా అన్నా, బీజేపీ అన్నా బెంగాల్ ప్రజలకు గిట్టదు. అందుకే అమిత్ షా ఇక్కడ 15 రోజులు కాదు..ఏకంగా 365 రోజులపాటు మకాం వేసినా ఎలాంటి ఫలితమూ ఉండదు’అంటూ వ్యాఖ్యానించారు. శుక్రవారం మాల్దా జిల్లా గజోల్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. మాల్దాలో సర్ దరఖాస్తుల పరిశీలనకు వెళ్లిన న్యాయాధికారులను 8 గంటలపాటు నిర్బంధంలో ఉంచిన ఘటనపై మమత స్పందిస్తూ.. బీజేపీ హైదరాబాద్ కోకిల ఈ కుట్రకు పథకం వేసిందంటూ పరోక్షంగా ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఇటీవల టీఎంసీ నుంచి వేరుపడి ఆమ్ జనతా ఉన్నయన్ పేరుతో పార్టీ పెట్టిన హుమాయూన్ కబీర్‌కు మద్దతు ప్రకటించిన ఎంఐఎం చీఫ్ ముస్లింల ఓట్లు చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ హైదరాబాద్ నుంచి తీసుకువచ్చిన ఎంఐఎం, ఐఎస్ఎఫ్ కార్యకర్తలకు మాల్దా ఘటనలో ప్రమేయం ఉందన్నారు. ఇందులో కాంగ్రెస్ హస్తం కూడా ఉందని చెప్పారు. ‘మాల్దా ఘటన బెంగాల్ పరువును మంటగలిపింది. ఈ ఘటనకు కారణం స్థానికులు కారు. వాళ్లకు ఇబ్బందులు ఉండే ఉండొచ్చు. బయటి వ్యక్తులే వారిని ఈ ఉచ్చులోకి లాగారు. హైదరాబాద్ నుంచి తమ మతానికి చెందిన కొందరిని వెంటేసుకు వచ్చిన ఒక బీజేపీ కోయిల దీని వెనుక ఉంది. పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న వారిని ఎయిర్‌పోర్టులో మా సీఐడీ బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది’అని మమత తెలిపారు. ‘బెంగాల్ అంటే ఢిల్లీ మాదిరిగా కాదు. వివిధ ప్రభుత్వ సంస్థలను వాడుకుంటూ, ఓటర్లకు డబ్బు ఎరవేసి ఏదైనా చేయొచ్చని అనుకుంటే కుదరదు’అని స్పష్టం చేశారు. బీజేపీ ఓటమి ఖాయమని తనకు తెలుసునన్నారు. రాష్ట్రంలోని పోలీస్ యంత్రాంగం ఇప్పటికీ తన నియంత్రణలోనే ఉందని, ఎన్నికల కమిషన్ అధీనంలోకి వెళ్లలేదని చెప్పారు. -
గిరిజనుల అభివృద్ధికి రోడ్ మ్యాప్
గువాహటి: అస్సాంలోని గిరిజనుల అభివృద్ధికి ప్రధాని మోదీ, సీఎం హిమంత బిశ్వ శర్మ ఒక సమగ్ర రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసి ఉంచారని, ముచ్చటగా మూడోసారి బీజేపీ గెలుపుతో అమలు చేయడం తథ్యమని హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. గోల్పారా, కామ్రూప్ జిల్లాల్లో శుక్రవారం జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార ర్యాలీల్లో మంత్రి ప్రసంగించారు. ఆదివాసీ మహిళను దేశ రాష్ట్రపతిగా అన్నేళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేయలేకపోయిందని విమర్శించారు. ద్రౌపదీ ముర్మును దేశ ప్రథమ పౌరురాలిగా చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. పలాశ్‌బరిలో ఐఐఎం ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును కాంగ్రెస్ అడ్డుకునేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు.‘మీరు ఎంతగా అడ్డుకున్నా, ఐఐఎం ఏర్పాటును ఏమాత్రం ఆపలేరు’ అంటూ లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మినీ అస్సాంగా పేరున్న గోల్పారా జిల్లాలోని పలు గిరిజన తెగల అభివృద్ధికి పాటుపడేది బీజేపీ మాత్రమేనని అమిత్ షా నొక్కి చెప్పారు. అదే సమయంలో, గిరిజనులు మెజారిటీగా ఉన్న జిల్లాలు ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అమలు పరిధిలోకి రావని వివరించారు. ప్రతి గిరిజన కుటుంబానికీ ఒక ఆవు, ఒక గేదెను పంపిణీ చేస్తామని సహకార శాఖ మంత్రిగా ఇది తన హామీ అంటూ ఆయన ప్రకటించారు. హెలికాప్టర్లో సాంకేతిక లోపం కారణంగా ధుబ్రి జిల్లా గోలక్గంజ్లో ఆయన పాల్గొనాల్సిన ఎన్నికల ర్యాలీ రద్దయింది. -
అస్సాంలో మూడు ముక్కలాట!
సాక్షి, న్యూఢిల్లీ: అస్సాం ఈసారి అసెంబ్లీ ఎన్నికలు ‘ప్రాంతీయ’పోరుగా మారాయి! ఎగువ, మధ్య, దిగువ అస్సాం ప్రాంతాల మధ్య సంక్లిష్టమైన రాజకీయ యుద్ధంగా రూపుదాల్చాయి. ప్రతి ప్రాంతానికీ భిన్నమైన సామాజిక నేపథ్యం, స్థానిక సమస్యలు, ఓటింగ్ సరళి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాల్లో ఎగువ అస్సాంలో 35, బోడోలాండ్‌తో కలిపి మధ్య అస్సాంలో 41, దిగువ అస్సాంలో 50 సీట్లు ఉన్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎగువ అస్సాం బీజేపీ వశం కాగా దిగువ అస్సాంలో ఆ పార్టీకి, కాంగ్రెస్‌కు హోరాహోరీ పోరు సాగింది. మధ్య అస్సాం రెండింటినీ ఆదరించింది. 2023లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ, సరిహద్దు జిల్లాల్లో ఊపందుకున్న అస్తిత్వ రాజకీయాలు, భారీగా కొత్త ఓటర్ల చేరికతో ఈసారి రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. దిగువ అస్సాం: సరిహద్దులో నువ్వా నేనా! బంగ్లాదేశ్ సరిహద్దును ఆనుకుని ఉండే దిగువ అస్సాం ప్రాంతంలో గుర్తింపు, అస్తిత్వ రాజకీయాలదే ప్రధాన పాత్ర. 50 అసెంబ్లీ స్థానాలున్న ఈ ప్రాంతంలో దుబ్రీ, బార్పేట, గోల్పారా వంటి ముస్లిం ప్రాబల్య జిల్లాలున్నాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఇరు కూటములు హోరాహోరీగా తలపడ్డాయి. ఎన్డీఏకు 23 సీట్లు రాగా కాంగ్రెస్ కూటమి 27 స్థానాలతో పైచేయి సాధించింది. ఈ ప్రాంతంలో కాంగ్రెస్, దాని భాగస్వామి ఏఐయూడీఎఫ్‌కు బలమైన పట్టుంది. అస్సాంలో ఏఐయూడీఎఫ్ గెలిచిన 16 సీట్లలో అత్యధికం ఇక్కడే కావడం విశేషం! ఈసారి మాత్రం దిగువ అస్సాంలో కాంగ్రెస్ కూటమికి బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. ఎగువ అస్సాం: బీజేపీ కంచుకోట అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ ఆశలకు ఎగువ ప్రాంతమే అత్యంత కీలకం! తిన్సుకియా, శివసాగర్, డిబ్రూగఢ్, జోర్హాట్ వంటి కీలక జిల్లాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇక్కడి 35 అసెంబ్లీ స్థానాల్లో 2021 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏకంగా 30 సీట్లు కైవసం చేసుకుని సత్తా చాటింది. కాంగ్రెస్ కూటమి 5 స్థానాలకు పరిమితమైంది. డీలిమిటేషన్ తర్వాత ఈ ప్రాంతంలో గిరిజన జనాభా శాతం పెరగడం బీజేపీకి మరింత కలిసొచ్చే అంశం. మధ్య అస్సాం: అధికారానికి వారధి! నగావ్, మోరిగావ్తో పాటు బోడోలాండ్ ప్రాంతంతో కూడిన మధ్య అస్సాం ఈసారి ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారింది. ఇక్కడ 41 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఈ ప్రాంతంలో కుల, ప్రాంతీయ రాజకీయాల ప్రభావం మరీ ఎక్కువ. పలు స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు కింగ్మేకర్లు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ ఎన్డీఏ కూటమి 22, కాంగ్రెస్ కూటమి 16, యూపీపీఎల్, బీపీఎఫ్ వంటి ప్రాంతీయ పార్టీలు 3 స్థానాలు నెగ్గాయి. డీలిమిటేషన్ ప్రక్రియతో ఈ ప్రాంతం రాజకీయంగా సరికొత్త రూపు సంతరించుకుంది. చాలా అసెంబ్లీ స్థానాల సరిహద్దులు మారిపోయాయి. ఎస్టీ రిజర్వుడ్ స్థానాల సంఖ్య పెరిగింది. ముస్లిం ప్రాబల్య ప్రాంతాలు ముక్కలయ్యాయి.ఈసారి కీలకాంశాలివే...→ అస్సాంలో ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బాగా ప్రభావం చూపనుంది. → కొత్త ఓటర్లతో పాటు భారీగా ఓట్ల గల్లంతు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. → బోడోలాండ్లో ప్రాంతీయ పార్టీల వైఖరి, ఎగువ అస్సాంలో బీజేపీ ఎదుర్కొంటున్న అగ్నిపరీక్ష, దిగువ అస్సాంలో అస్తిత్వ పోరాటం ఫలితాలను ప్రభావితం చేయనున్నాయి. స్వల్ప ఓట్లతోనే భారీ తేడా 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ 75 స్థానాలు గెలిస్తే విపక్ష కాంగ్రెస్ కూటమి 50కి పరిమితమైంది. స్థానాలపరంగా ఇంత తేడా ఉన్నా ఓటుబ్యాంకు విషయంలో మాత్రం పెద్దగా అంతరం లేకపోవడం విశేషం! బీజేపీకి 33 శాతం, కాంగ్రెస్‌కు 30 శాతం ఓట్లు పడ్డాయి. ఇతరులు ఒక స్థానానికి (0.8 శాతం) పరిమితం కాగా, ఏఐయూడీఎఫ్ పార్టీ 9 శాతం ఓటు బ్యాంకును సాధించింది. అంటే.. గెలిచిన సీట్లలో ఎన్డీయే స్పష్టమైన మెజారిటీ చూపించినా, ఓట్ల శాతంలో మాత్రం కాంగ్రెస్ కూటమి గట్టి పోటీనే ఇచ్చింది. -
తమిళనాడు ఎన్నికల బరిలో తెలంగాణ మాజీ గవర్నర్
చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను బీజేపీ శుక్రవారం విడుదల చేసింది. అన్నాడీఎంకేతో జట్టు కట్టిన బీజేపీ 27 స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల పేర్లను తాజాగా ప్రకటించింది. ఈ 27 మందిలో నలుగురు మహిళా అభ్యర్థులు ఉన్నారు. ఐదుగురు ఎస్సీలకు సీట్లు దక్కాయి. తెలంగాణ గవర్నర్‌గా పనిచేసిన తమిళసై సౌందరాజన్.. మైలాపూర్ నుంచి పోటీ చేస్తున్నారు.అసెంబ్లీ ఎన్నికల్లో తనకు పోటీ చేసే అవకాశం దక్కినందుకు తమిళసై సౌందరాజన్ సంతోషం వ్యక్తం చేశారు. తాను విజయం సాధిస్తానన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ''నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్డీఏ అభ్యర్థుల మధ్య ఎలాంటి తేడా లేదు. చెన్నై నాకు కొత్త ప్రదేశం కాదు. మేము మైలాపూర్‌లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాము. ప్రజల మధ్య ఉండాలనే ఉద్దేశంతోనే నేను గవర్నర్ పదవి నుంచి తిరిగి వచ్చాను. ప్రతి నాయకుడి కష్టానికి పార్టీ తగిన గౌరవం ఇస్తుంది. అన్నామలైకి తగిన బాధ్యతలు అప్పగిస్తారన్న నమ్మకం నాకుంది. డీఎంకే ప్రజా వ్యతిరేక, మహిళా వ్యతిరేక పార్టీ. డీఎంకే కుటుంబ రాజకీయాలను ప్రజలు తిప్పికొడతార''ని ఏఎన్ఐతో తమిళసై సౌందరాజన్ చెప్పారు. భుజం భుజం కలిపి ప్రచారం చేస్తా: అన్నామలైఅభ్యర్థుల ప్రకటనపై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. అన్నామలై 'ఎక్స్'లో స్పందించారు. గెలిచే వారినే అగ్రనాయకత్వం ఎంపిక చేసిందని పేర్కొంటూ, అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. డీఎంకే వంచనతో విసిగిపోయిన తమిళనాడు ప్రజల మద్దతు ఎన్డీఏ అభ్యర్థులకు ఉంటుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రగతి పథంలో పయనిస్తోందని, డీఎంకే ప్రభుత్వం కారణంగా అన్నిరంగాల్లో తమిళనాడు వెనుబడిపోయిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 210 సీట్లు గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తోందని, దీనికి కార్యకర్తగా తనవంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు. ఎన్డీఏ అభ్యర్థులందరితో భుజం భుజం కలిపి నిలబడి ప్రచారం చేస్తానని పేర్కొన్నారు.ఆ బాధ్యతను నెరవేరుస్తాఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా అగ్రనాయకత్వం తనకు ప్రచార బాధ్యతలు అప్పగించిందని అన్నామలై తెలిపారు. కేరళలోని కన్నూర్ శుక్రవారం ఆయన ఏఎన్ఐతో మాట్లాడుతూ.. పార్టీ ఆదేశానుసారం బీజేపీ, ఎన్డీఏ అభ్యర్థుల తరపున ప్రచారం సాగిస్తున్నట్టు చెప్పారు. "ఈ ఎన్నికలలో తమిళనాడు వ్యాప్తంగా అభ్యర్థుల కోసం ప్రచారం చేయడమే నా పాత్ర. ఈనెల 7వ తేదీ వరకు పుదుచ్చేరి, కేరళలో ప్రచారం చేసే బాధ్యతను పార్టీ నాకు అప్పగించింది. ప్రస్తుతం అదే పనిమీద ఉన్నాను. 7వ తేదీ నుండి 23వ తేదీ వరకు తమిళనాడులో ప్రచారానికి వెళతాను. ఇది పార్టీ నాకు అప్పగించిన బాధ్యత. నేను ఆ బాధ్యతను నిర్విస్తానని చెప్పారు. Press ReleaseThe Central Election Committee of the @BJP4India has decided the following names for the ensuing General Elections to the Legislative Assembly of TAMIL NADU:TAMIL NADU Legislative Assembly Election 2026..!#TNElection2026#TNElection2026 pic.twitter.com/nSe4tgaupm— BJP Tamilnadu (@BJP4TamilNadu) April 3, 2026చదవండి: 21 స్థానాల్లో కానరాని డీఎంకే, అన్నాడీఎంకే గుర్తులు -
’జననాయకన్’పై ఉమ్మడి కుట్ర: విజయ్
సాక్షి, చైన్నె: టీవీకే అధినేత విజయ్ చైన్నె పెరంబూరులో ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది. ఆయన తిరుచ్చి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సైతం పోటీకి నిర్ణయించారు. దీంతో ఇక్కడ నామినేషన్ దాఖలు నిమిత్తం తిరుచ్చికి చైన్నె నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. ఆయనకు టీవీకే నేతలు భుస్సీ ఆనంద్, ఆధవ్ అర్జున, నిర్మల్‌కుమార్ తదితరులు ఆహ్వానం పలికారు. విమానాశ్రయంలో అర్ధగంట పాటుగా విజయ్ తన ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఇక్కడి నుంచి తన ప్రచార వాహనంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి విజయ్ వెళ్లారు. మార్గం మధ్యలో విజయ్ను చూసేందుకు అభిమానులు, జనం ఎగబడ్డారు. తన వాహనం నుంచి వారికి అభివాదం తెలుపుతూ ముందుకు వెళ్లారు. అదే సమయంలో ఆయన వాహనాన్ని వెంబడిస్తూ యువకులు దూసుకొచ్చారు. కాన్వాయ్‌లోని ఓవాహనం ఢీ కొనడటంతో పోలీసు ఒకరు గాయపడ్డారు. అలాగే మేల పుదూర్ వద్ద ద్విచక్ర వాహనాలు ఢీకొట్టుకోవడంతో పలువురు అభిమానులు గాయపడ్డారు. ఓ చోట గాయపడి రోడ్డున పడ్డ మహిళా అభిమానితో పాటూ మరొకరి వద్దకు వెళ్లి విజయ్ పరామర్శించారు. కాగా, విజయ్ కాన్వాయ్‌లో ఓ యువతి మోటారు సైకిళ్పై దూసుకెళ్తుండటాన్ని ప్రశ్నించిన ఓ వ్యక్తిపై ఆమె చిందులు తొక్కడం గమనార్హం. నామినేషన్ దాఖలు అనంతరం మరక్కడై వద్ద జరిగిన ప్రచార సభలో విజయ్ ప్రసంగించారు. ముందుగా ఆయన దివంగత ఎంజీఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.ఉమ్మడి కుట్ర..కరూర్ సంఘటన ఎలాగైతే ఒక కుట్రలో భాగమో, తన ’జననాయకన్’ సినిమా విడుదలకు అడ్డంకులు సృష్టించడం వెనుక కూడా ఉమ్మడి కుట్ర ఉందని తన ప్రసంగంలో విజయ్ ఆరోపించారు. డీఎంకే వేరు, బీజేపీ వేరు కాదని, రాజకీయాల్లో ఈ రెండూ ఒక్కటే అని విజయ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నెలకొన్న ఇరాన్–అమెరికా యుద్ధ వాతావరణం వల్ల గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులు, చిన్న హోటల్ వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం తన సొంత పనుల కోసం ఢిల్లీకి వెళ్తున్నారని, గ్యాస్ కొరతను తీర్చడానికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. దుష్ట శక్తి డీఎంకేను తరిమి కొడుదామన్నారు.వారివి బూటకపు హామీలు2021 ఎన్నికల్లో డీఎంకే ఇచ్చిన నీట్ పరీక్ష రద్దు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వంటి వాగ్దానాలను అమలు చేయడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. తిరుచ్చికి చెందిన ఓ మంత్రి ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో రూ. 12 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజల కోసం సౌకర్యవంతమైన జీవితాన్ని వదిలిపెట్టి రాజకీయాల్లోకి తాను వచ్చానని పేర్కొన్నారు. తనను ఎదుర్కొనేందుకు పలు కూటములు రహస్య బంధంతో దూసుకొస్తున్నాయని, తనను ఎలా అడ్డుకుంటున్నారో ప్రజలకు తెలుసునని వివరించారు. ప్రజలు అందరి కోసం వచ్చిన తనకు న్యాయం చేకూరే విధంగా అండగా నిలబడాలని, తనకు ఒక అవకాశం ఇవ్వాలని కోరారు. ఇచ్చిన వాగ్దానాలను విస్మరించనని, ఇప్పుడు ఒక మాట అధికారంలోకి వచ్చినానంతరం మరో మాట మాట్లాడనని, నమ్మిన వారిని మోసం చేయడం తెలియదని, అబద్ధాలు వళ్లించడం అస్సలు తెలియదని, అందరికీ నిజాయితీ ఉంటానని వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 23న జరగబోయే ఎన్నికల్లో టీవీకే అభ్యర్థులకు విజిల్ చిహ్నంలో ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఆయా నియోజకవర్గాలలోని అభ్యర్థులు, విజయ్ వేర్వేరు కాదని, అన్ని చోట్ల ఈ విజయ్ పోటీలో ఉన్నట్టుగా భావించి ఆదరించాలని విన్నవించారు. వంద శాతం ఈ విజయ్ను నమ్మండి, తనకు ఒక్క చాన్స్ ఇవ్వాలని అడిగే అవకాశం తనకు ఉందని, తనకు ఒక్కటంటే ఒక్క ఛాన్స్ ఇవ్వాలని విన్నవించారు. కాగా విజయ్ తిరుచ్చిలో ఇక బస చేసేందుకు వీలుగా అరియామంగళం గ్రామంలో ప్రత్యేక బంగళా సిద్ధం చేశారు. -
మూలవాసులకు ఎస్టీ కేటగిరీ
గువాహటి: మూలవాసులుగా గుర్తించిన ఆరు తెగలకు ఎస్టీ హోదా, పాలన, ఆరోగ్యం, పారిశ్రామికీకరణ తదితర 11 రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత..కీలకాంశాలుగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురువారం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లా బోకాజాన్లో ‘రైజోర్ ఇష్టాహార్’పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో యాంటీ కరప్షన్ కమిషన్ ఏర్పాటు, కార్పొరేట్ సంస్థలకు భారీ భూకేటాయింపులపై సిట్‌తో దర్యాప్తు, పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవు తప్పనిసరి చేయడం వంటి హామీలు కూడా ఉన్నాయి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాష్ట్రంలో ఇటీవల ఎన్నికల ప్రచార సభల్లో ప్రకటించిన ఐదు గ్యారంటీలకు ఇవి అదనం. → అస్సాంలోని మొరాన్, మొటోక్, చుటియా, టై–అహోం, కొచ్–రాజ్»ొంగ్షిలతోపాటు తేయాకు తోటల్లో పనిచేసే గిరిజనులకు ఎస్టీ హోదా కల్పించడం. → టీ పరిశ్రమను ప్రధాన పరిశ్రమగా గుర్తించడం. టీ వర్కర్లకు పరిశ్రమల్లో మాదిరిగా కనీసం వేతనాలు, ఇతర ప్రయోజనాలను కల్పించడం. → బీటీసీ, కేఏఏసీ, దిమా హసావో కౌన్సిళ్లను ఆర్థికంగా మరింత చేయూతనివ్వడం, మరిన్ని అధికారాలను కల్పించడం, గిరిజన తెగలకు తిరిగి పునరావాసం కల్పించడం. → ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తెలిపే శ్వేతపత్రం విడుదల, ఆస్పత్రులు, స్కూళ్లలో ఖాళీల భర్తీ వంటి ఐదు కార్యక్రమాల అమలు. → పూర్తి అధికారాలతో స్వతంత్ర అవినీతి వ్యతిరేక కమిషన్ ఏర్పాటు. పంచాయతీ రాజ్ సంస్థలకు వార్షిక గ్రాంట్ల విడుదల, జవాబుదారీతనం పెంపు. పోలీసు యంత్రాంగంలో సంస్కరణలు. జిల్లా ఆస్పత్రుల హోదా పెంపు, డిజిటల్ క్లాస్‌రూంల ఏర్పాటు. → ఐదేళ్లలో మేనిఫెస్టోను పూర్తిగా అమలు చేయడం. అన్ని రకాల ప్రభుత్వ సేవలను డిజిటైజ్ చేయడం. అందరికీ ఆరోగ్యం, స్కూళ్లలో వంద శాతం హాజరీ, ఉద్యోగిత పెంపు, ఆదాయం రెట్టింపు వంటివి అమలు. -
మార్పునకు దగ్గరి దారి భవానీపూర్
కోల్‌కతా: పశ్చిమబెంగాల్లో మార్పునకు సొంత నియోజకవర్గం భవానీపూర్‌లో సీఎం మమతా బెనర్జీని ఓడించడమే దగ్గరిదారి అని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మమతకు పోటీగా బీజేపీ నేత సువేందు అధికారి భవానీపూర్‌లో గురువారం నామినేషన్ వేశారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావాలంటే 170 సీట్లను గెలుచుకోవడం ఒక ఎత్తయితే, భవానీపూర్‌లో సువేందు గెలవడం మరో ఎత్తుగా పేర్కొన్నారు. ఇక్కడ సువేందు విజయంతో రాష్ట్రంలో మార్పు దానంతటదే వస్తుందని పేర్కొన్నారు. కోల్‌కతాలోని హజ్రా నుంచి గురువారం మొదలైన సువేందు నామినేషన్ ర్యాలీలో మంత్రి ప్రసంగించారు. ‘బెంగాల్లో మార్పు సంభవిస్తుంది. అయితే, ముందుగా భవానీపూర్‌లో మార్పు రావాలా? వద్దా? అంటూ ప్రజలనుద్దేశించి ఆయన ప్రశ్నించారు. ‘రాష్ట్రాన్ని విముక్తం చేసేందుకు మన అభ్యర్థిని సువేందు అధికారిని భారీ మెజారిటీతో గెలిపించాలని భవానీపూర్ ప్రజలను చేతులెత్తి వేడుకుంటున్నా’అని పేర్కొన్నారు. నందిగ్రామ్ నుంచే కాదు భవానీపూర్‌లో కూడా పోటీ చేసి మమతను ఓడించాలని సువేందును ఒప్పించానన్నారు. 2021లో మరోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ సువేందు చేతిలో మమత ఓడారన్నారు. ఈసారి మాత్రం, రాష్ట్రంలో అధికారంతోపాటు భవానీపూర్‌లోనూ మమతా బెనర్జీ ఓటమి ఖాయమని అమిత్ షా ప్రకటించారు. ‘మోదీ జీ నాయకత్వంలో ఇక్కడ బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావాలి. చొరబాటుదార్లను రాష్ట్రం నుంచే కాదు దేశం నుంచి వెళ్లగొట్టాలి’అని మంత్రి పేర్కొన్నారు. బెంగాల్ అస్తిత్వానికే ముప్పు ఏర్పడిందన్నారు. కాళీఘాట్ వద్ద హైటెన్షన్. బీజేపీ ర్యాలీలో జై శ్రీరాం, బీజేపీ జిందాబాద్, మమతా హటావో, బంగ్లా బచావో నినాదాలు భవానీపూర్‌లో మారుమోగుతున్న వేళ ర్యాలీ సీఎం మమతా బెనర్జీ నివాసమున్న కాళీఘాట్ సమీపానికి చేరుకుంది. అక్కడ టీఎంసీ మద్దతుదారులు పార్టీ జెండాలు చేబూని జోయ్ బంగ్లా, మమతా బెనర్జీ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. రెండు పార్టీల మద్దతుదారుల నడుమ కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. -
రూ. 3 వేలకు పింఛను పెంపు
కోజికోడ్: కేరళ అసెంబ్లీ ఎన్నికలకుగాను అధికార ఎల్డీఎఫ్ మేనిఫెస్టోను సీఎం పినరయి విజయన్ గురువారం విడుదల చేశారు. సంపూర్ణ పేదరిక నిర్మూలన, పింఛను రూ.3 వేలకు పెంపు, ఉద్యోగావకాశాల పెంపు, పెట్టుబడులను ఆకర్షించడం..తదితర కీలక హామీలు ఇందులో ఉన్నాయి. సామాజిక న్యాయంతోకూడిన ఆర్థికాభివృద్ధి, రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే తమ మేనిఫెస్టో ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా సీఎం విజయన్ చెప్పారు. మేనిఫెస్టోలోని మొత్తం 950 ప్రతిపాదనలను ప్రజలందరికీ సులువుగా అర్థమయ్యేలా 60–సూత్రాల కార్యక్రమంగా సంక్షిప్తం చేశామన్నారు. ప్రజా సంక్షేమమే కేంద్రంగా అభివృద్ధి, పారిశ్రామిక విధానాలను రూపొందిస్తామ న్నారు. నెలవారీ సంక్షేమ పింఛను మొత్తాన్ని ప్రస్తుతమిస్తున్న రూ.1,600 నుంచి రూ.2 వేలకు పెంచనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
దేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి కాంగ్రెస్, వామపక్షాల కుట్రలు
న్యూఢిల్లీ: కాంగ్రెస్, వామపక్షాలు మత ఛాందసవాద శక్తులతో చేతులు కలుపుతున్నాయని, సమాజాన్ని విభజించి, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టను దెబ్బతీయడానికి కుట్రలు సాగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. గురువారం కేరళలో జరిగిన బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో మోదీ వర్చువల్‌గా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ గాంధేయ సిద్ధాంతాన్ని వదిలేసిందని, మావోయిస్టు ముస్లిం లీగ్ కాంగ్రెస్‌గా మారిపోయిందని ధ్వజమెత్తారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్‌లు సొంత ఎజెండా కోసం సమాజంలో మనుషుల మధ్య చిచ్చుపెడుతున్నాయని ఆరోపించారు. అదే సమయంలో మన విశ్వాసాలను దెబ్బతీస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అయ్యప్ప భక్తుల మనోభావాలను కించపర్చాయని విమర్శించారు. అయ్యప్ప ఆలయ బంగారం విషయంలో ఆ రెండు కూటములు నిజాయితీ లేకుండా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. సహకార బ్యాంకుల్లో ఉన్న ప్రజల కష్టార్జితాన్ని దురి్వనియోగం చేస్తున్నాయని ఆక్షేపించారు. దేశాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కాంగ్రెస్ మాత్రం దేశ ప్రతిష్టను దిగజార్చడమే పనిగా పెట్టుకుందన్నారు. విదేశాల్లోని పరిస్థితుల గురించి కాంగ్రెస్ నాయకులు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని, దానివల్ల అక్కడ నివసిస్తున్న భారతీయులు ఇబ్బంది పడాల్సి వస్తోందని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం ఇష్టానుసారంగా మాట్లాడడం ఏమిటని ప్రశ్నించారు. కేరళలో ఇప్పటిదాకా ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే, యువత బతుకులు బాగుపడాలంటే బీజేపీ అధికారంలోకి రావాలని తేల్చిచెప్పారు. పార్టీ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లాలని, బీజేపీకి ఓటు వేసేలా ప్రజలను ప్రోత్సహించాలని ప్రధానమంత్రి సూచించారు. -
తండ్రి బాటలో తనదైన ముద్రతో..
గౌరవ్ గొగోయ్.. దేశంలో గుర్తింపు పొందిన యువ నాయకుల్లో ఒకరు. వారసత్వంగానే రాజకీయాల్లోకి వచ్చినా సమస్యలపై గొంతెత్తడంలో తనదైన ముద్ర వేసిన వ్యక్తి. పార్లమెంటు ప్రసంగాల్లో తన వాగ్ధాటితో ఆకట్టుకున్న నేత. ఇప్పుడు అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడిగా పార్టీ పునరుజ్జీవానికి కృషి చేస్తున్నారు. మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన గౌరవ్, తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సీనియర్ బీజేపీ నాయకుడు హితేంద్రనాథ్ గోస్వామితో తలపడుతున్నారు. అస్సాం గణ పరిషత్‌ను ఓడించి అధికారాన్ని కాంగ్రెస్ చేతికిచ్చిన తన తండ్రి తరుణ్ గొగోయ్ తరహాలోనే.. బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలనే తపనతో ముందుకు సాగుతున్నారు. మోదీ ప్రభంజనాన్ని పక్కకు నెట్టి.. గౌరవ్ గొగోయ్ తండ్రి దివంగత తరుణ్ గొగోయ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు. రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. దీంతో డైనింగ్ టేబుల్ ముచ్చట్లలోనే కాదు.. ఇంట్లో పూర్తి రాజకీయ వాతావరణం ఉండేది. ఆ రాజకీయాల మధ్యే గౌరవ్ పెరిగారు. బాల్యం నుంచే ప్రభావం ఉన్నా.. ఆయన అధికారికంగా రాజకీయాల్లోకి వచ్చింది మాత్రం 2014లో. కలియాబోర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేశారు. దేశవ్యాప్తంగా మోదీ ప్రభంజనం కొనసాగినా.. కలియాబోర్‌లో మాత్రం బీజేపీ అభ్యర్థి మృణాల్ కుమార్ సైకియాపై గెలిచి గౌరవ్ పార్లమెంటులో అడుగుపెట్టారు. 2019లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు. పార్లమెంటులోని అత్యంత యువ గొంతుకల్లో ఒకరిగా నిలిచారు. స్థానిక సమస్యలపై గళమెత్తారు. ఆర్థిక విధానాలు, పర్యావరణ పరిరక్షణ, జాతీయ భద్రత, సమాఖ్య సంబంధాల వంటి అంశాలపై సూటి ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు. 2020లో కాంగ్రెస్ ఆయనను లోక్‌సభలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా నియమించడంతో ప్రభుత్వంపై దాడిలో దూకుడు పెంచారు. 2023లో ప్రధాని మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. నియోజకవర్గ మార్పులతో 2024 ఎన్నికల్లో జోర్హాట్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ‘చక్రవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడిలాంటివాడిని, కానీ నేనే చక్రవ్యూహాన్ని ఛేదించి బయటకు వస్తాను’అని చెప్పిన ఆయన.. చెప్పినట్లుగానే ఆ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుపొందారు. 2025 మేలో అస్సాం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన గౌరవ్.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కీలక ముఖంగా మారారు. కాంగ్రెస్ గెలుపు బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. కొత్త కాంగ్రెస్ వర్సెస్ పాత కాంగ్రెస్... 2024లో జోర్హాట్లో గౌరవ్ గొగోయ్ గెలుపు ఆయన విశ్వసనీయతను మరింత పెంచింది. అయితే బలమైన బీజేపీ ఎన్నికల యంత్రాంగం, గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీ ఆధిపత్యం, కాంగ్రెస్‌లోని అంతర్గత వర్గపోరాటాలు, విచ్చిన్నమైన ప్రతిపక్షం ఇప్పుడు గౌరవ్ ముందున్న సవాళ్లు. కాంగ్రెస్‌లోని అన్ని వర్గాలను ఏకం చేయగలిగితే, ఇటీవలి ఓటములతో నిరుత్సాహంలో ఉన్న కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపగలిగితే కొంతమేరకు విజయం సాధిస్తారు. అయితే, యువ ఓటర్లను ఇట్టే ఆకట్టుకునే శక్తి, ఎలాంటి అవినీతి కళంకం లేకపోవడం ఆయనకు కలిసొచ్చే అంశాలు. నిరుద్యోగాన్ని రూపుమాపి, ద్రవ్యోల్బణాన్ని తగ్గించి, రాష్ట్రంలో విచ్చలవిడి అవినీతిని అరికట్టడం, ప్రజల జీవితాలను మెరుగుపరచడమే లక్ష్యాలుగా ఆయన ఎన్నికల్లోకి వెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బీజేపీల మధ్య కాదు... కొత్త కాంగ్రెస్‌కు, పార్టీ మారి బీజేపీలో చేరిన పాత కాంగ్రెస్‌కు మధ్యే అంటున్నారు. కళలంటే ఆసక్తి.. గౌరవ్ గొగోయ్ 1982 సెపె్టంబర్ 4న ఢిల్లీలో జన్మించారు. ప్రాథమిక విద్యను ఢిల్లీలోని సెయింట్ కొలంబస్ పాఠశాలలో అభ్యసించారు. ఢిల్లీలోని గురు గోవింద్ సింగ్ ఇంద్రప్రస్థ విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఆ తరువాత కొంతకాలంపాటు ఎయిర్టెల్ మార్కెటింగ్‌లో పనిచేసిన ఆయన.. ఉద్యోగాన్ని వదిలి.. ఉన్నత విద్య కోసం యూకేకి వెళ్లారు. లండన్‌లోని న్యూయార్క్ యూనివర్సిటీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివారు. గౌరవ్‌కు డ్యాన్స్, కొరియోగ్రఫీ, సంగీతం అంటే చాలా ఇష్టం. గౌరవ్ తల్లి.. డాలీ గొగోయ్. యూకేకు చెందిన ఎలిజబెత్ క్లేర్‌ను వివాహం చేసుకున్నారు. బ్రిటిష్ పౌరురాలైన ఎలిజబెత్ ప్రస్తుతం వాతావరణ మార్పులపై పరిశోధనలు చేసే ఆక్స్ఫర్డ్ పాలసీ మేనేజ్మెంట్లో పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
విజయ్ ఇంపాక్ట్.. డీఎంకే, అన్నాడీఎంకే లేకుండానే పోటీ
చెన్నై: తమిళనాడు శాసనసభ ఎన్నికల పోలింగ్‌కు మరికొద్ది రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ముమ్మరంగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నాయి. ఆయ పార్టీల అగ్రనేతలు నామినేషన్లు దాఖలు చేసి ప్రచారంలో దూసుకుపోతున్నారు. డీఎంకే-కాంగ్రెస్, అన్నాడీఎంకే-బీజేపీ కూటముల మధ్య హోరాహోరీ తప్పదని ప్రిపోల్ సర్వేలు చెబుతున్నాయి. మరోవైపు హీరో విజయ్ నాయకత్వంలోని తమిళగ వెట్రి కళగం(టీవీకే) మొదటిసారి ఎన్నికల బరిలో నిలిచింది. సీమాన్ పార్టీ నామ్ తమిళర్ కచ్చి (ఎన్టీకే) కూడా ఒంటరిగా పోటీ చేస్తోంది. దీంతో ఈసారి గెలిచే అభ్యర్థులకు భారీగా ఆధిక్యాలు రాకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.పోటీ ఎక్కువ ఉండడంతో ప్రధాన పార్టీలు చిన్న పార్టీలను కూడా తమ కూటమిల్లో చేర్చుకున్నారు. దీంతో భాగస్వామ్య పార్టీలకు అధికంగా సీట్లు కేటాయించాల్సి వచ్చింది. ఫలితంగా 21 స్థానాల్లో డీఎంకే గానీ, అన్నాడీఎంకే గానీ పోటీలో లేవు. ఈ స్థానాల్లో రెండు కూటముల మిత్రపక్షాల అభ్యర్థులు పోటీలో ఉండడంతో డీఎంకే, అన్నాడీఎంకే పార్టీ గుర్తులు లేకుండా ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో 11 స్థానాల్లో మాత్రమే ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. కానీ ఈసారి మరో పది స్థానాలు జతయ్యాయి. చిన్న పార్టీల ప్రాతినిథ్యం పెరగడంతో వాటికి సీట్ల కేటాయింపులు కూడా పెంచాల్సి వచ్చిందని పరిశీలకులు అంటున్నారు. డీఏంకే కూటమిలో 20పైగా చిన్న పార్టీలు ఉండడం గమనార్హం.మిత్రపక్షాలు బలంగా ఉన్నందువల్లే ఈ 21 స్థానాలను డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు వదులుకోవాల్సి వచ్చిందని జాతీయ పార్టీలకు ఎనలిస్టుగా వ్యవహరిస్తున్న వి. భారతి అభిప్రాయపడ్డారు. కొత్తగా బరిలోకి దిగిన టీవీకే, ఎన్టీకే పార్టీలు కూడా స్థానికంగా బలమున్న నేతలకే టిక్కెట్లు ఇవాల్సి ఉంటుందన్నారు. విజయ్ ఎన్నికల బరిలోకి దిగడంతో డీఎంకే, అన్నాడీఎంకే కూటముల లెక్కలు మారిపోయాయని సెపాలజిస్ట్ ఆర్. చంద్రశేఖరన్ అన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి గెలిచే అభ్యర్థులకు పెద్దగా మెజార్టీలు రాకపోవచ్చని తెలిపారు. చదవండి: హీరో విజయ్ విద్యార్హతలు ఇవే -
2014 నుంచి వాళ్లంతా మార్పును చూశారు: అమిత్ షా
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కేంద్ర మంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నిర్వహించిన రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. “టీఎంసీని బంగాళాఖాతంలోకి విసిరేయండి. పశ్చిమ బెంగాల్ ప్రజలు భయపడకుండా ఓటు వేసి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ను గద్దె దించండి. ఈసారి ఎవరూ భయపడకూడదు. బెంగాల్ ఓటర్లను ఎవరూ అడ్డుకోలేరు. భవానీపురంలో సువేందు అధికారికి మద్దతు ఇవ్వండి. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలి. అధికార టీఎంసీ పార్టీపై అవినీతి ఆరోపణల మచ్చ ఉంది. పశ్చిమ బెంగాల్లో మార్పు వస్తుంది. కానీ భవానీపూర్‌లో మార్పు కావాలా.. లేదా? మా అభ్యర్థి సువేందు అధికారికి మీ ఓట్లు వేయాలని కోరడానికి ఇక్కడికి వచ్చాను. 2014 నుంచి మోదీ జీపై నమ్మకం ఉంచిన వారు మార్పు చూశారు. గతంలో మమత ఒక ఎన్నికలో ఓడిపోయారు, ఈ సారి బెంగాల్ అంతటా ఓడిపోతారు. ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వం మారాలనే స్వరం వినిపిస్తోంది. మమతకు బైబై చెప్పండి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారం చేయడానికి 15 రోజులు రాష్ట్రంలో ఉంటాను’’ అని చెప్పారు.భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి పోటీ చేస్తున్నారు. ఆయన ఇవాళ (ఏప్రిల్ 2న) నామినేషన్ దాఖలు చేశారు. 294 సభ్యులు ఉండే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఓటింగ్ ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో (రెండు దశల్లో) జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 4న ఉంటుంది. 2021లో ఎనిమిది దశల్లో జరిగిన ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ 213 స్థానాలతో ఘన విజయం సాధించింది. బీజేపీ 77 స్థానాలు దక్కించుకుంది. -
బీజేపీ గేమ్ ప్లాన్‌లో భాగమే: మమత ఫైర్
బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. ఎస్ఐఆర్ విధుల్లో భాగంగా బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఏడుగురు న్యాయాధికారులను నిర్బంధించిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో, ఈ అంశం కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ వ్యవహారంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. బీజేపీ ప్లాన్ అంటూ విమర్శలు చేశారు.తాజాగా మమత మాట్లాడుతూ..‘ఈ ఘటనతో మా ప్రభుత్వానికి సంబంధమే లేదు. ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)పై ప్రజాగ్రహమే దీనికి కారణం. న్యాయాధికారులను ముట్టడించిన ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలియదు. కానీ SIRపై ప్రజలు కోపంగా ఉన్నారని మాత్రం నేను చెప్పగలను. దీనిపై నాకు ఎలాంటి అధికారం లేదు. శాంతిభద్రతలు వంటి అన్ని అధికారాలను వారే నా నుండి లాగేసుకున్నారు అంటూ వ్యాఖ్యానించారు.అలాగే, మాల్దాలో జరిగిన ఘటన బీజేపీ ఎన్నికల వ్యూహంలో భాగమే. ఎన్నికల్లో ఓటమి తప్పదని భావిస్తున్న కాషాయ పార్టీ, ఈ నెల చివరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయించి, బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని చూస్తోంది. వారు శాంతిభద్రతలను నియంత్రించాలని కోరుకుంటున్నారు కానీ విఫలమయ్యారు’ అని ఘాటు విమర్శలు చేశారు. ఇదే సమయంలో పేర్ల తొలగింపుపై విస్తృతమైన అశాంతి నెలకొన్న నేపథ్యంలో శాంతిని కాపాడుకోవాలని ప్రలోభాలకు లొంగవద్దని బెంగాల్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న అంటూ కామెంట్స్ చేశారు.Sagardighi, West Bengal: On Malda issue, Chief Minister Mamata Banerjee says, "The BJP is playing a game...They have removed 1 crore 20 lakhs voter names, which is why we approached the Supreme Court. The Supreme Court ruled that this cannot happen..." pic.twitter.com/HVyEGIdzjs— IANS (@ians_india) April 2, 2026 ఏం జరిగింది?బెంగాల్లో ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడాన్ని నిరసిస్తూ మాల్డా జిల్లాలో ఆందోళనకారులు బుధవారం ఆందోళనకు దిగారు. మొదట న్యాయాధికారులతో సమావేశం కావాలని నిరసనకారులు కోరారు. అందుకు అనుమతి నిరాకరించడంతో నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో కార్యాలయం చుట్టూ చేరి అధికారులను నిర్బంధించారు. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ వీధుల్లో భాగంగా బెంగాల్‌లోని మాల్డా జిల్లాలో ఏడుగురు న్యాయాధికారులను నిర్బంధించిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి అని ధర్మాసనం అభివర్ణించింది. బెంగాల్లో శాంతిభద్రతల వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, ఈ ఘటనపై తగిన వివరణ ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేశారు.Seven judicial officers including THREE female officials were kept at siege for over 17 hours by Trinamool goons inside Kaliachak BDO office in Malda ! These judges have been appointed by the Hon'ble Court for completing the SIR process. But Mamata Banerjee and Trinamool does not… pic.twitter.com/a38LCVcPev— Keya Ghosh (@keyakahe) April 2, 2026ముగ్గురు మహిళలు సహా ఏడుగురు న్యాయాధికారులను కొన్ని అసాంఘిక శక్తులు నిర్బందించాయని, ఈ అర్థరాత్రి వరకు తాను స్వయంగా పరిస్థితిని పర్యవేక్షించాల్సి వచ్చిందని సీజేఐ తెలిపారు. ఇది న్యాయాధికారులను భయపెట్టడమే కాకుండా కోర్టు అధికారాన్ని నేరుగా సవాలు చేయడమేనని ధర్మాసనం పేర్కొంది. న్యాయాధికారులపై మానసిక దాడులకు పాల్పడేందుకు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. ఈ ఘటనపై సీబీఐ లేదా ఎన్ఐఏ విచారణ కోరేందుకు ఎన్నికల సంఘానికి సుప్రీం ధర్మాసనం అనుమతి ఇచ్చింది. -
డియర్ లీడర్స్.. ‘ఆమె’ కరుణిస్తేనే కుర్చీ!
ఒకప్పుడు ఓటు వేయడానికి ఇంటి నుంచి బయటకు రావడానికే సంకోచించిన మహిళలు, ఇప్పుడు భారత రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికలు జరగబోతున్న అస్సాం, కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో మహిళా ఓటర్లు అత్యంత కీలకమైన ‘నిర్ణయాత్మక శక్తి’గా అవతరించారు. ఇప్పుడు ఏ పార్టీ గెలవాలన్నా, ఏ నాయకుడు ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలన్నా మహిళల మద్దతు తప్పనిసరి అనే పరిస్థితి నెలకొంది.సైలెంట్ ఓటర్లు కాదు.. డిసైడింగ్ ఫ్యాక్టర్గత మూడు దశాబ్దాలుగా మహిళల రాజకీయ చైతన్యం ఊహించని రీతిలో పెరిగింది. మునుపటితో పోలిస్తే ఇప్పుడు మహిళలు పురుషులతో సమానంగా, కొన్ని రాష్ట్రాల్లో పురుషుల కంటే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. కేవలం ఓటు వేయడమే కాదు, తమ ఓటుతో గెలుపోటములను తలకిందులు చేస్తున్నారు. అందుకే, ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మహిళల కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ సబ్సిడీలు, నేరుగా నగదు బదిలీ వంటి పథకాలన్నీ ఈ ‘మహిళా ఓటు బ్యాంకు’ను ఆకట్టుకోవడానికేనని స్పష్టమవుతోంది.రాష్ట్రాల వారీగా మహిళల సత్తా ఇదే..అస్సాం: ఇక్కడ పెను మార్పు కనిపిస్తోంది. 2011లో కాంగ్రెస్ వైపు ఉన్న మహిళలు, 2021 నాటికి బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపారు. సంక్షేమ పథకాలు, స్థానిక అంశాలు మహిళల ఓటింగ్ సరళిని పూర్తిగా మార్చేశాయి.పశ్చిమ బెంగాల్: ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పట్టు బలంగా ఉంది. క్షేత్రస్థాయిలో ఉన్న అనుబంధం, మహిళా కేంద్రీకృత పథకాల వల్ల మహిళా ఓటర్లలో దాదాపు సగం మంది ఇప్పటికీ ‘దీదీ’ వెంటే నడుస్తున్నారు.కేరళ: మలయాళ గడ్డపై రాజకీయ విధేయతలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ మహిళా ఓట్లు ప్రధాన కూటముల మధ్య దాదాపు సమానంగా చీలిపోయినా, ఓటర్లు తమ అభిప్రాయాలను అంత సులభంగా మార్చుకోవడం లేదు.తమిళనాడు: ఇక్కడ మహిళల తీరు విభిన్నం. వీరు ఏ ఒక్క పార్టీకి కట్టుబడి ఉండరు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పనితీరును బట్టి తమ మద్దతును ఎప్పటికప్పుడు మార్చుకుంటూ అధికార మార్పిడికి కారకులవుతున్నారు. మొత్తానికి ఈ నాలుగు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల ఫలితాలను శాసించేది మహిళలే అనడంలో ఎటువంటి సందేహం లేదు. మెజారిటీ ఓట్లతో గెలుపు మార్జిన్‌ను నిర్ణయించేది కూడా వారే కావడం విశేషం. -
ఉదయనిధి స్టాలిన్, టీవీకే విజయ్ నామినేషన్ దాఖలు
చెన్నై: తమిళనాడు ఎన్నికల్లో చెపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీ చేయడానికి ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇవాళ (ఏప్రిల్ 2న) నామినేషన్ దాఖలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఉధయనిధి స్టాలిన్ ఇదే నియోజక వర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడే ఉదయనిధి స్టాలిన్ అన్న విషయం తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ 2024 సెప్టెంబరు 28న డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. 2022 డిసెంబరు 14 నుంచి క్యాబినెట్ మంత్రిగా కొనసాగుతున్నారు.మళ్లీ ర్యాలీ నిర్వహించిన టీవీకే విజయ్టీవీకే అధ్యక్షుడు, సినీనటుడు విజయ్ తిరుచిరాపల్లిలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్తూ రోడ్ షో నిర్వహించారు. త్రిచీ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేయడానికి నామినేషన్ దాఖలు చేశారు. విజయ్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారు. మార్చి 30న పెరంబూర్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలతో చెన్నై పెరంబూర్ పరిధిలోని పెరవల్లూర్ పోలీస్ స్టేషన్లో విజయ్‌పై కేసు నమోదైంది.మానిటరింగ్ అధికారి కుమార్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలు చేపట్టారు. విజయ్ 30 లౌడ్స్పీకర్లు వినియోగించడం, అంబులెన్స్‌కు దారి ఇవ్వకపోవడం, 5,000 కంటే ఎక్కువ మందిని సమీకరించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి ఘటనలకు పాల్పడ్డారు. ఇవాళ రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్తూ మళ్లీ విజయ్ రోడ్ షో నిర్వహించడం గమనార్హం. విజయ్ నేతృత్వంలోని టీవీకే మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తోంది. కాగా, విజయ్ తనకు రూ.405 కోట్ల చరాస్తులు, రూ.115 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు తన అఫిడవిట్లో ప్రకటించారు. -
కేరళలో ఎన్నికల సర్వే.. దిమ్మతిరిగే ఫలితాలు?
తిరువనంతపురం: కేరళలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం జోరుగా సాగుతోంది. అధికారమే లక్ష్యంగా ఎన్డీయే, ఎల్డీఎఫ్, యూడీఎఫ్ పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి. మేనిఫెస్టోలు విడుదల చేసి ఓటర్లను తమవైపునకు తిప్పుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో కేరళలో నిర్వహించిన ఒక సర్వే ఆసక్తికర వివరాలను వెల్లడించింది. ఎన్నికల్లో గెలుపు ఎవరిది? అనే విషయంలో భారీ ట్విస్ట్ ఇచ్చింది.కేరళలో Citizens Opinion Research and Evaluation (CORE) సంస్థ ప్రీపోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వే మార్చి 23 నుండి 30 మధ్య రాష్ట్రంలోని మొత్తం 140 నియోజకవర్గాల నుండి 31,706 మంది ఓటర్ల అభిప్రాయాలను సేకరించింది. తద్వారా వివిధ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను తీసుకుంది. ఈ సర్వేలో అధికార కూటమి అయిన LDFకు మిశ్రమ స్పందన లభించగా, UDF పనితీరుపై ప్రజలు కొంత మేరకు సానుకూలంగా స్పందించారు. ఇక NDA విషయానికి వస్తే తీవ్రమైన ప్రతికూల భావనను ఎదుర్కొంటోంది.👉ప్రస్తుత ప్రభుత్వం ఎల్డీఎఫ్ విషయానికి వస్తే.. సుమారు 43.1% మంది సర్వేలో పాల్గొన్నారు. వీరిలో ప్రభుత్వ పనితీరుకు సానుకూల రేటింగ్ ఇచ్చారు. అందులో 17.16% మంది 'చాలా బాగుంది' అని, 25.94% మంది 'బాగుంది' అని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రభుత్వం గణనీయమైన సంఖ్యలో విమర్శకులను కూడా ఎదుర్కొంటోంది. సుమారు 25.74% మంది ప్రభుత్వ పనితీరును 'బాగోలేదు' లేదా 'అస్సలు బాగోలేదు' అని అభివర్ణించారు. కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉన్నప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో విమర్శలు ఎదుర్కొంటోంది. సగటున 31% పాజిటివ్‌గా స్పందించారు.👉ఇక, యూడీఎఫ్ విషయానికి వస్తే.. 42.07% మంది ఓటర్లలో 28.72% మంది మాత్రమే దాని పనితీరును 'బాగుంది' లేదా 'చాలా బాగుంది' అని రేట్ చేశారు. 29.22% మంది బాగాలేదు లేదా అసలు బాగాలేదు అని అన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో లాభం ఉన్నప్పటికీ, పెద్ద ఎత్తున ఊపు లేదు.👉మరోవైపు.. ఎన్డీయే కూటమి విషయానికి వస్తే.. కూటమి పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. ప్రతిస్పందించిన వారిలో 60% కంటే ఎక్కువ మంది కూటమి పనితీరును బాగాలేదు లేదా అస్సలు బాగాలేదు అని రేటింగ్ ఇచ్చారు. కేవలం 11.66% మంది ఓటర్లు మాత్రమే దానికి సానుకూల రేటింగ్ ఇచ్చారు. ఎన్డీయే సానుకూల రేటింగ్ దక్షిణ కేరళలో కొంత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో సర్వేను విశ్లేషిస్తే యూడీఎఫ్, ఎల్డీఎఫ్ మధ్య పోటాపోటీ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రాంతాల వారీగా..ఉత్తర కేరళ: LDF బలంగా ఉంది.మధ్య కేరళ: UDF పోటీలో ఉంది.దక్షిణ కేరళ: విభిన్న అభిప్రాయాలు, స్పష్టమైన ఆధిక్యం లేదు.నియోజకవర్గాల వారీగా అంచనాలు (35 కీలక సీట్లు)ఉత్తర కేరళ (కాసరగోడ్, కన్నూర్, వయనాడ): LDF బలంగా ఉండగా, UDF కొంత పోటీ, NDA బలహీనంగామధ్య కేరళ (ఎర్నాకులం, త్రిస్సూర్, పాలక్కాడ్): LDF/UDF సమాన పోటీ, UDF కొంత ఆధిక్యం, NDA ప్రభావం తక్కువదక్షిణ కేరళ (తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట): LDF/UDF విభిన్న ఆధిక్యం, UDF కొన్ని సీట్లలో బలంగా, NDA ప్రతికూల అభిప్రాయం -
కేరళ ఎన్నికలు.. UDF మేనిఫెస్టో విడుదల చేసిన రేవంత్
కొచ్చి: కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం యూడీఎఫ్ తన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేనిఫెస్టోను ప్రతిపక్ష నాయకుడు వి.డి. సతీశన్‌కు అందజేశారు. రాహుల్ గాంధీ గతంలో ప్రకటించిన ఐదు హామీలతో పాటు, అనేక ఇతర వాగ్దానాలతో కూడిన ఈ మేనిఫెస్టోను యూడీఎఫ్ తాజాగా విడుదల చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ అందిస్తున్న పథకాలు, నిర్ణయాలను సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మేనిఫెస్టో ప్రకారం.. మహిళలకు KSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణం, కళాశాల విద్యార్థులకు నెలకు రూ. 1,000 ఆర్థిక సహాయం అందజేత. అలాగే, యువత వ్యాపారాలు ప్రారంభించడానికి రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు. రూ. 3,000 సంక్షేమ పింఛను, ఊమెన్ చాందీ పేరుతో అన్ని కుటుంబాలకు రూ. 25 లక్షల వరకు ఉచిత బీమా పథకం. వృద్ధుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు వంటి ఆరు 'ఇందిరా హామీలు' మేనిఫెస్టోలో పొందుపరిచారు. వీటితో పాటు, 'జాబ్ వాచ్ టవర్ల' ఏర్పాటు, వయనాడ్‌లో ఒక గిరిజన విశ్వవిద్యాలయం, అలాగే కోజికోడ్ మరియు తిరువనంతపురం నగరాల్లో మెట్రో/లైట్ మెట్రో ప్రాజెక్టులను అమలు చేస్తామని కూడా యూడీఎఫ్ హామీ ఇచ్చింది.మేనిఫెస్టోలోని వాగ్దానాలు-ఇందిరా హామీలు:మహిళలకు KSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణంకళాశాల విద్యార్థులకు నెలకు రూ. 1,000 ఆర్థిక సహాయంసంక్షేమ పింఛన్లు రూ. 3,000కు పెంచబడతాయిఅన్ని కుటుంబాలకు రూ. 25 లక్షల వరకు ఉచిత 'ఊమెన్ చాందీ ఆరోగ్య బీమా'యువత వ్యాపారాలు ప్రారంభించడానికి రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణంవృద్ధుల సంక్షేమం కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు ఆరోగ్య రంగం:'కారుణ్య బెనివలెంట్ ఫండ్' మరియు 'శృతి రంగం' వంటి పథకాలు తిరిగి ప్రారంభించబడతాయిBPL కుటుంబాలకు చెందిన రోగులకు డయాలసిస్ ఉచితం చేయబడుతుందిమహిళలు మరియు పిల్లల కోసం 'She Hospitals' (షీ హాస్పిటల్స్) ప్రారంభించబడతాయిJIPMER నమూనాలో 'బిల్లు లేని ఆసుపత్రులు' (No-bill hospitals) స్థాపించబడతాయిఆసుపత్రులకు వచ్చే రోగులకు పడక (బెడ్) పొందడం వారి హక్కుగా పరిగణించబడుతుందివ్యవసాయం మరియు మత్స్య రంగం:వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టబడుతుందిరబ్బరుకు రూ. 300 కనీస మద్దతు ధర (Floor Price) కల్పించబడుతుంది.అలాగే CIAL నమూనాలో ఒక రబ్బరు కంపెనీ ప్రారంభించబడుతుందివరి ధాన్యానికి రూ. 35, కొబ్బరికి అధిక కనీస ధర ఇవ్వబడుతుందిమత్స్యకారులకు మరియు కేఎస్ఆర్టీసీ, ఆటో, టాక్సీ యజమానులకు ఇంధన రాయితీ ఇవ్వబడుతుంది విద్య మరియు ఉపాధి:వయనాడ్‌లో ఆధునిక సౌకర్యాలతో 'గిరిజన విశ్వవిద్యాలయం' స్థాపించబడుతుందిక్యాంపస్లలో ర్యాగింగ్‌ను నివారించడానికి 'సిద్ధార్థన్ స్టూడెంట్ డిస్ట్రెస్ యాప్' ప్రవేశపెట్టబడుతుంది'సిద్ధార్థన్ యాంటీ-ర్యాగింగ్ చట్టం' అమలు చేయబడుతుందివిద్యా సంస్థలలో వివక్షను అంతం చేయడానికి 'రోహిత్ వేముల చట్టం' అమలు చేయబడుతుందిఅంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్లోని మార్పులను అధ్యయనం చేయడానికి 'జాబ్ వాచ్ టవర్' ఏర్పాటు చేయబడుతుంది10,000 కొత్త ఎంఎస్ఎంఈ సంస్థలను ప్రారంభించడానికి సహాయం అందించబడుతుంది సంక్షేమ ప్రాజెక్టులు:ఆకలి రహిత కేరళ కోసం ఇందిరా క్యాంటీన్లు ప్రారంభించబడతాయిఐదేళ్లలో 5 లక్షల మందికి ఇళ్లు అందించబడతాయిసామాజిక భద్రతా పింఛనులో దివ్యాంగులకు 25% అదనంగా ఇవ్వబడుతుందిఆశా కార్యకర్తల కనీస వేతనాన్ని రూ.700కి పెంచనున్నారుపేదల వివాహాలను తక్కువ ఖర్చుతో జరిపించడానికి 'స్నేహ సుమంగళి' వివాహ మందిరాలను నిర్మించనున్నారుపరిపాలన మరియు అభివృద్ధి:అవినీతిని అరికట్టడానికి రాష్ట్ర విజిలెన్స్ కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నారుమత సామరస్యాన్ని నిర్ధారించడానికి 'సహన మంత్రిత్వ శాఖ'శాంతి కోసం 'శాంతి మరియు సామరస్య' శాఖను ఏర్పాటు చేయనున్నారునదులను అనుసంధానించడం ద్వారా కేరళ తీరప్రాంతంలో 'మిషన్ సముద్ర' ప్రాజెక్టును అమలు చేయనున్నారుతిరువనంతపురం మరియు కోజికోడ్ నగరాల్లో మెట్రో/లైట్ మెట్రో ప్రాజెక్టులను అమలు చేయనున్నారుమాదకద్రవ్య రహిత కేరళ కోసం 'బ్రేక్ ది డ్రగ్ చైన్' ప్రాజెక్టును ప్రారంభించనున్నారు


