టీవీకేకు కాంగ్రెస్‌ మద్దతు.. స్టాలిన్ సంచలన నిర్ణయం | DMK announces no alliance with Congress | Sakshi
Sakshi News home page

టీవీకేకు కాంగ్రెస్‌ మద్దతు.. స్టాలిన్ సంచలన నిర్ణయం

May 6 2026 8:16 PM | Updated on May 6 2026 8:29 PM

DMK announces no alliance with Congress

చైన్నై: తమిళనాడులో రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. టీవీకేకు సరైన సంఖ్యాబలం లేదంటూ  ఆ రాష్ట్ర గవర్నర్‌  రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ ప్రకటించారు. కాగా ఇప్పుడు డీఎంకే సైతం కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్‌ పార్టీ నమ్మక ద్రోహం చేసిందని భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉండదని తేల్చిచెప్పింది. ఈ మేరకు డీఎంకే అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

డీఎంకే అధికారిక ప్రకటనలో... కాంగ్రెస్ తన అసలు రూపాన్ని బయటపెట్టిందని కాంగ్రెస్ కష్టాల్లో ఉంటే అండగా నిలిస్తే దానికి తాము భారీ మూల్యాన్ని చెల్లించామని పేర్కొంది. సోనియా, మన్మోహన్‌ సింగ్‌లతో స్నేహంగా ఉన్నాం రాహుల్ గాంధీని సోదరుడిగా గౌరవించాం ఐతే ఇప్పుడు DMKతో కాంగ్రెస్ సంబంధాలు తెంచుకోవడం మాకు పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదని తెలిపింది. కాంగ్రెస్‌ది నమ్మకద్రోహం, రాజకీయ అవకాశవాదం మా కూటమిలో ఐదుగురు ఎమ్మెల్యేలను గెలుచుకుని.. సిగ్గులేకుండా ప్రత్యర్థి శిబిరానికి మళ్లించింది  ఇది ప్రజలను మోసం చేయడమేనని పేర్కొంది. 

బీజేపీకి, కాంగ్రెస్‌కు పెద్ద తేడా లేదని రాహుల్‌ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడానికికాంగ్రెస్ హైకమాండ్ సంకోచిస్తున్న టైంలో మొట్ట మొదటగా డీఎంకే అధినేత స్టాలిన్‌ అధికారికంగా రాహుల్ పేరును ప్రకటించారు. ఇండియా కూటమి తరపున డీఎంకే అత్యధిక ఎంపీలను పంపింది. పార్లమెంట్‌ లోపల, బయట కాంగ్రెస్‌కు భుజం భుజం కలిసి నడిచాం, ఓటమి మాకు కొత్తేమి కాదు..వెన్నుపోటు కొత్త కాదు సమయం వచ్చినప్పుడు కచ్చితంగా సమాధానం చెబుతామంది. భవిష్యత్తులో కాంగ్రెస్‌తో పొత్తుఉండదు. ఆపద వేళ కాంగ్రెస్‌ను ఆదుకుంటే వెన్నుపోటు పొడిచారు. కాంగ్రెస్ నిజస్వరూపం ప్రజలకు తెలిసింది. అధికార దాహంతోనే టీవీకేతో కాంగ్రెస్‌ జతకట్టింది". అని డీఎంకే ‍ప్రకటన విడుదల చేసింది.

టీవీకే మెజార్టీ మార్కుకు 10 సీట్ల దూరంలో నిలిచిపోవడంతో కాంగ్రెస్‌తో పాటు ఇతర చిన్నపార్టీల మద్దతు కోరింది. దీంతో టీవీకేకు సపోర్టు చేస్తున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ నేపథ్యంలో డీఎంకే సంచలన ప్రకటన విడుదల చేసింది. కాగా ప్రస్తుతం ఇండియా కూటమిలో భాగస్వామ్యంగా డీఎంకే పార్టీ ఉంది. ఇండియా కూటమికి ఛైర్మన్‌గా ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున్ ఖర్గే వ్యవహరిస్తున్నారు. కాగా డీఎంకే ప్రకటన నేపథ్యంలో ఇప్పుడు డీఎంకే పార్టీ ఇండియా కూటమి నుంచి సైతం దాదాపుగా వైదోలిగినట్లేనని విశ్లేషకులు అంచనా..

Advertisement
 
Advertisement
Advertisement