‘నా కొడుకు సీఎం అవుతున్నాడు.. కాంగ్రెస్‌తో కలిసి..’ | Vijay Father SA Chandrasekhar on tvk win | Sakshi
Sakshi News home page

‘నా కొడుకు సీఎం అవుతున్నాడు.. కాంగ్రెస్‌తో కలిసి..’

May 4 2026 4:34 PM | Updated on May 4 2026 8:19 PM

 Vijay Father SA Chandrasekhar on tvk win

చెన్నై: తమిళనాడులో టీవీకే గెలుపుపై విజయ్‌ తండ్రి చంద్రశేఖర్‌ హర్షం వ్యక్తం చేశారు. తమిళ ప్రజలకు మేలు చేయాలనేదే విజయ్‌ లక్ష్యమని చెప్పారు. గెలుపుపై విజయ్‌ మొదటి నుంచి ధీమాగా ఉన్నారని తెలిపారు. ఒక్కో మెట్టు ఎక్కి ఇప్పుడు సీఎం అవుతున్నారని చెప్పారు. తాను విజయ్ తండ్రిగా గర్విస్తున్నానని తెలిపారు. ఏ కూటమిలోనూ చేరకుండానే టీవీకే విజయం సాధించడం ఆయన ధైర్యాన్ని చూపుతోందని అన్నారు. కాంగ్రెస్‌తో టీవీకే చేతులు కలపాలని బహిరంగ పిలుపునిచ్చారు.

“కాంగ్రెస్‌కు చరిత్ర, సంప్రదాయం ఉన్నాయి. అలాంటి కాంగ్రెస్ ప్రభ ఎందుకు తగ్గిపోతుంది? అధికారం లేకపోవడం వల్లే తగ్గిపోతుంది. ఆ అధికారాన్ని మేమే ఇస్తాం. విజయ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ అధికారం వస్తే కాంగ్రెస్ తన చరిత్రను నిలబెట్టుకుంటుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. 

గత 30 సంవత్సరాలుగా సమాజం కోసం, తమిళ ప్రజల కోసం ఏదో చేయాలనే ఆలోచన విజయ్‌లో ఉంది. అది ఆయన మనసులో ఉండేది. తమిళ ప్రజలు విజయ్‌ను నాయకుడిగానే కాదు, ప్రతి మహిళ ఆయనను తన కుమారుడిగా భావిస్తుంది. యువత ఆయనను తమ అన్నగా చూస్తుంది. అందరూ ఆయనను అన్న అని పిలుస్తారు. వృద్ధ మహిళలు ఆయనను తమ కుమారుడిగా చూస్తారు. కొంతమంది 60 సంవత్సరాల మహిళలు ఆయనను తమ మనవడిగా భావిస్తారు. ప్రజలతో విజయ్‌ అలాంటి బంధాన్ని ఏర్పరచుకున్నాురు” అని తెలిపారు. 

విజయ్ గెలుపుపై తండ్రి ఫస్ట్ రియాక్షన్

రాష్ట్రంలో టీవీకే ముందంజలో ఉండడడంతో “నేను చాలా సంతోషంగా ఉన్నాను” అని టీవీకే అధినేత విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ అన్నారు. ఆ సమయంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ.. “ఆమె ఆయనను తల్లిగానే కాదు. ఆమె విజయ్ తొలి అభిమాని. ఆమె చాలా సంతోషంగా ఉంది” అని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement