బెంగాల్‌లో బీజేపీ ముందంజ! | West Bengal BJP Leaders Ahead in Counting | Sakshi
Sakshi News home page

బెంగాల్‌లో బీజేపీ ముందంజ!

May 4 2026 8:29 AM | Updated on May 4 2026 9:02 AM

West Bengal BJP Leaders Ahead in Counting

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ కొనసాగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్ల ఓట్ల కౌంటింగ్‌లో కాసేపు టీఎంసీ బీజేపీ మధ్య హోరాహోరీ కొనసాగింది. అయితే ఈ రేసులో టీఎంసీ వెనకబడిపోయింది. 

బీజేపీ అగ్రనేతలు కౌంటింగ్‌లో జోరు చూపిస్తున్నారు. ఆ పార్టీ అగ్రనేతలంతా ముందంజలో ఉన్నట్లు సమాచారం. సువేందు అధికారి, నిశిత్‌ ప్రామాణిక్‌ (మథాభంగా (SC)), రేఖా పత్రా (హింగల్గంజ్‌ (SC)), రత్నా దేవనాథ్‌(పనిహాటి), అనందమయ్‌ బర్మన్‌(మాటిగారా–నక్సల్బరి), శిఖా చటర్జీ(డాబ్‌గ్రామ్–ఫుల్బారి), శంకర్‌ ఘోష్ (సిలిగురి) అంతా ఆధిక్యం కనబరుస్తున్నారు. అయితే భవానీపూర్‌లో మాత్రం ఆసక్తికర పోరు నడుస్తోంది. 

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాసేపు ముందంజలో కొనసాగారు. ఆ వెంటనే బీజేపీ రాష్ట్ర చీఫ్‌ సువేందు అధికారి లీడ్‌లోకి వచ్చారు. నందిగ్రాంలోనూ ఆయన ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ లీడ్‌తో బీజేపీ శ్రేణుల్లో సంబురాలకు సిద్ధమయ్యాయి.  ఈ ఎన్నికలు మమతా వర్సెస్‌ జనతా అని.. ప్రజల్లో ఆమెపై ఉన్న కోపం విస్పష్టమని బీజేపీ అంటోంది. 

మొత్తం 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో అధికారం కైవసం చేసుకునేందుకు 148 స్థానాలు అవసరం. అయితే ఒక నియోజకవర్గంలో రీపోలింగ్‌ కారణంగా 293 స్థానాలకుగానూ 147 సీట్లు కైవసం చేసుకుంటే సరిపోతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement