breaking news
Tamil Nadu Assembly Election 2026
-
తమిళనాడుకు ఏ డబ్బా ఇంజిన్లు అక్కర్లేదు: విజయ్
అగ్ర నటుడు, తమిళగ వెట్రి కగళం పార్టీ అధినేత విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికీ లొంగిపోయే రకం కాదని.. డబ్బుతో తనను ఎవరూ కొనలేరని అన్నారు. తమిళనాడులో టీవీకే మాత్రమే టాప్ ఇంజిన్ అని.. ఎలాంటి డబ్బా ఇంజిన్లను నమ్మొద్దంటూ తమిళనాడు ఓటర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సోమవారం టీవీకే మూడో వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న విజయ్ మాట్లాడుతూ.. తమిళ రాజకీయాల్లో విజిల్ సౌండ్ గట్టిగా ఉంటుందన్నారు. టీవీకే టాప్ ఇంజిన్ అని.. కాబట్టి ఎలాంటి డబ్బా ఇంజిన్లను నమ్మొద్దంటూ పరోక్షంగా బీజేపీ-అన్నాడీఎంకేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రసంగం ఆద్యంతంలో అన్నాడీఎంకే పేరును ప్రస్తావించకుండానే ఆయన విమర్శలు గుప్పించడం గమనార్హం. ఇక డీఎంకేపైనా ఆయన నేరుగా విమర్శలు చేయలేదు. ప్రముఖ కవి తిరువళ్లువర్ ఇవాళ జీవించి ఉంటే ఈ పాలన(డీఎంకే) చూసి.. తిరుక్కురల్‌ను తిరగరాసి ఉండేవారేమో అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. స్టాలిన్‌ను అడిగినా.. విజిల్ గుర్తుకే ఓటేస్తారని ఛలోక్తులు విసిరారు. విజయ్ వ్యాఖ్యలతో పొత్తులపై ఓ క్లారిటీ వచ్చినట్లేనని.. ఒంటరి పోరే ఉంటుందని టీవీకే శ్రేణులు చెబుతున్నాయి. అభిమానుల కోసం మూడు స్టెప్పులు..టీవీకే వార్షికోత్సవ కార్యక్రమంలో విజయ్ హుషారుగా కనిపించారు. జన నాయగన్ తన చివరి చిత్రం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వేదికగా ఆయన సినిమాకు నెలకొన్న సెన్సార్-రిలీజ్ కష్టాల గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలో.. సింగర్ వేలుమరుగన్ పాడిన పాటకు చిన్నారులతో కలిసి విజయ్ చిందులేసి అభిమానులను, కార్యకర్తలను ఉత్సాహపరిచారు.தவெக 3ஆம் ஆண்டு தொடக்க விழாவில் ”உங்கக் கூட கொஞ்சம் Dance ஆடிக் கொள்ளட்டுமா?” எனக் கேட்டுக்கொண்டு நடனமாடிய விஜய்#TVK | #Vijay| #TVKVijay | #Panaiyur pic.twitter.com/SVZIGZaE87— PttvOnlinenews (@PttvNewsX) February 2, 2026 -
టీవీకే అధినేత విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
అశేష సినీ అభిమానుల అండతో రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత అగ్రనటుడు విజయ్.. ఆ తర్వాత అనూహ్య పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. మరీ ముఖ్యంగా కరూర్ ఘటన తర్వాత ఆయన విపరీతమైన గందరగోళంలోకి కూరుకుపోయాడు. ఒక దశలో రజినీకాంత్లాగా వెనకడుగు వేస్తారని.. కమల్ హాసన్‌లాగా పొత్తువైపునకు వెళ్తారని చర్చా జరిగింది. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో ఆయన తొలిసారి తన మనోగతాన్ని పంచుకున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల రూపంలో తొలి పరీక్షకు సిద్ధమవుతున్న అగ్రనటుడు, తమిళగ వెట్రి కగళం అధినేత విజయ్ తన రాజకీయ ప్రయాణంపై ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ఉన్న ఫ్యాన్ఫాలోయింగ్నే పార్టీ వైపు మళ్లించుకుని.. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగనున్నట్లు సందేశం ఇచ్చారు. కరూర్ ఘటన.. సీబీఐ దర్యాప్తు ఇబ్బంది పెట్టాయా?కరూర్‌లో జరిగిన తొక్కిసలాట తీవ్రంగా కలచివేసింది. అలాంటి సంఘటన ఒకటి జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. అందుకే ఆ ఘోరం ఇంకా నన్ను వెంటాడుతూనే ఉంది. మళ్లీ సినిమాలు చేస్తారా?.. దశాబ్దాలపాటు సినీ రంగంలో కొనసాగా. హఠాత్తుగా తీసుకున్న నిర్ణయమేమీ కాదు. ఒక స్పష్టమైన లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చా. ఇదే ఇక నా భవిష్యత్తుతాజాగా సినిమాకు ఎదురైన సెన్సార్ ఇబ్బందులు.. ‘జన నాయగన్’ చిత్రం విడుదలకు అనుమతి రాకపోవడం నిర్మాతకు తీవ్ర నష్టం కలిగించింది. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి అడ్డంకులు ఎదురవుతాయని ముందే ఊహించాఈ ఎన్నికల్లో ఫలితంపై రాజకీయ భవిష్యత్తు ఉండబోతుందా? నేను ఈ ఒక్క ఎన్నిక కోసం పార్టీ పెట్టలేదు. దీర్ఘకాలం రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నా అమితంగా ప్రేరణ కలిగించిన వ్యక్తులు.. షారుక్ ఖాన్ నాకు అభిమాన నటుడు. రాజకీయాల్లో ఎంజీఆర్, జయలలితను ఆదర్శంగా తీసుకున్నాతమిళనాడు రాజకీయాల్లో కింగ్‌మేకర్ అవుతారని అనుకుంటున్నారా?నా ర్యాలీలకు వచ్చే జనాలను చూస్తున్నారా?. నేను గెలుస్తాను. అంతేగానీ కింగ్‌మేకర్ అవ్వాల్సిన అవసరం ఏంటి?ఎన్నికల చిహ్నంపై రియాక్షన్ మొదటి విజయం.. దైవ సంకేతం. టీవీకే పార్టీకి ఎన్నికల కమిషన్ ‘విజిల్’ గుర్తు కేటాయించడం చాలా సంతోషాన్నిచ్చింది Source: NDTV -
విజయ్ టీవీకే పార్టీకి కొత్త కష్టాలు!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు పట్టుమని మూడు, నాలుగు నెలలు కూడా లేవు. అక్కడి రాజకీయాలు హాట్ హాట్‌గా నడుస్తున్నాయి. అధికార డీఎంకేకు దాని ఎత్తులు ఎలాగూ ఉండనే ఉంటాయి. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే ఓ అడుగు ముందుకేసి తొలి దఫా మేనిఫెస్టోను ప్రకటించేసింది. అధికార, ప్రతిపక్ష కూటముల్లో పొత్తులు, సీట్ల పంపకాలు.. వగైరా అంశాలపై చర్చలతో నిత్యం హడావిడి కనిపిస్తోంది. అయితే ఏ కూటమిలో లేకుండా.. ఈ ఎన్నికల్లో మూడో పోటీదారుగా ప్రచారంలో ఉన్న విజయ్ ‘తమిళగ వెట్రి కగళం’ పార్టీ మాత్రం భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటోంది.తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగా పోటీ చేస్తుందని విజయ్ పలుమార్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. డీఎంకేను రాజకీయ విరోధిగా.. బీజేపీని భావజాల శత్రువుగా ప్రకటించేశారాయన. ఈ క్రమంలో దాదాపుగా ఏడాది కిందటే ఎన్నికల ప్రచారం ప్రారంభించిన ఆయన.. రాష్ట్రవ్యాప్త బస్సు యాత్రతో దేశం దృష్టిని ఒక్కసారిగా ఆకర్షించారు. అయితే.. కరూర్ ఘటన తర్వాత ఒక్కసారిగా స్పీడ్ తగ్గించారు.నెల రోజులు(డిసెంబర్ 18 నుంచి) గడుస్తున్నా విజయ్ నుంచి ఎలాంటి రాజకీయ ప్రకటన వెలువడలేదు. డీఎంకే సర్కార్‌పై రెగ్యులర్ తరహా విమర్శలు సహా తిరుపరంకుండ్రం తీర్పులాంటి అంశంపై కూడా స్పందించలేదు. తన చివరి చిత్రంగా చెబుతున్న జన నాయగన్ రిలీజ్ ఆగిపోయిన కూడా ఆయనలో చలనం లేదు.(ఆ సంగతి నిర్మాతలే చూసుకుంటారని ఆయన అన్నట్లు వినికిడి). అటు బీజేపీ వ్యతిరేక పార్టీలు సెన్సార్‌బోర్డు తీరును ఎండగడుతున్నా.. టీవీకే మాత్రం ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. పైగా ఈ మధ్యలో విజయ్ రెండుసార్లు సీబీఐ విచారణకు హాజరయ్యారు. దీంతో ఈ సైలెన్స్ ఏంటి అన్నా? అంటూ అభిమానులే ఆయన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ సైలెన్స్‌లోనే..అయితే ఆయన తన పనిని తాను సైలెంట్‌గా పని చేసుకుపోతున్నారంటూ విశ్లేషణ నడుస్తోందక్కడ. ఇప్పటికే టీవీకే మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ వివిధ వర్గాల అభిప్రాయాలను సేకరించింది కూడా. అతిత్వరలో టీవీకే మేనిఫెస్టో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏదో ఒక ర్యాలీలో విజయ్ దీనిపై అధికారికంగా ప్రకటన చేయొచ్చని సమాచారం.మరోవైపు.. పొంగల్ తర్వాత మొన్నీమధ్యే 10 మంది సభ్యులతో కూడిన ఎన్నికల కమిటీని విజయ్ ప్రకటించారు. ఈ కమిటీ ఎన్నికల నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షించబోతోంది. అదనంగా.. 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీని బలపరచడం అనే బాధ్యతను కూడా తీసుకుంది. అలాగే.. విజయ్ కూడా ఈ నెల 25వ తేదీ నుంచి తిరిగి రాజకీయ ప్రచారం ప్రారంభిస్తారని టీవీకే వర్గాలు చెబుతున్నాయి.ఇక పొత్తులు ఉండబోవని విజయ్ ప్రకటించినప్పటికీ.. ఆ అంశం కూడా ఇప్పుడు పరిశీలనలో ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీట్ల పంపకంలో తేడాలు వస్తుండడంతో డీఎంకేకు కాంగ్రెస్ దూరం కావొచ్చని.. విజయ్‌తో చేతులు కలిపే అవకాశం ఉందని గత కొంతరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కరూర్ ఘటన, జన నాయగన్ సెన్సార్ విషయంలో రాహుల్ గాంధీ నేరుగా టీవీకేకు, విజయ్‌కు మద్దతు ప్రకటించడం ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. అయితే టీవీకే కీలక నేతలు మాత్రం పొత్తులపై ఎక్కడా నోరు జారడం లేదు. కొత్త కష్టం.. టీవీకేకు ఇవే తొలి అసెంబ్లీ ఎన్నికలు. ఫిబ్రవరి 2024లో ఈ పార్టీ ఎన్నికల సంఘంలో రిజిస్ట్రర్డ్ అయ్యింది. తమిళనాడులోని అన్ని నియోజకవర్గాలతో పాటు పుదుచ్చేరి ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తోంది. ఎన్నికల సంఘం (ECI) వద్ద ఒకే గుర్తు (common symbol) కోసం దరఖాస్తు చేసింది. అయితే కామన్ సింబల్ దక్కకపోవచ్చనే ఆందోళన ఆ పార్టీ శ్రేణుల్లో నెలకొంది.‘‘మాకు ఒకే గుర్తు తప్పనిసరి. లేకపోతే ఎన్నికల్లో చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మేం ఇప్పటికే ఒక గుర్తు కోసం దరఖాస్తు చేసుకున్నాం. త్వరలో దొరుకుతుందని ఆశిస్తున్నాం’’ అంటూ టీవీకే నేత ఒకరు చెబుతున్నారు.ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం.. ఆర్‌యూపీపీ పార్టీలు గత మూడు ఆర్థిక సంవత్సరాల అడిట్(Annual Audit Report), కాంట్రిబ్యూషన్ రిపోర్టు(Contribution Report)లను ఈసీకి సమర్పించాల్సి ఉంటుంది. అయితే టీవీకే మాత్రం ఒక్క 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నివేదికలను సమర్పించింది. అంటే.. రెండు సంవత్సరాల నివేదికలు అవసరం. అయితే..కొన్ని పరిమితుల ప్రకారం టీవీకేకు కామన్ సింబల్ దక్కవచ్చని చెబుతున్నారు. కొత్తగా ఏర్పడిన పార్టీలు తాజా ఆర్థిక సంవత్సరపు నివేదికలు సమర్పిస్తే కూడా ఈసీ పరిశీలనలోకి తీసుకుంటుంది. అలాంటి పార్టీలు సాధారణంగా లిస్ట్‌లో ఉన్న కామన్ సింబల్లలో ఒకటి పొందుతాయి. అయితే అది ఎప్పుడు, ఏది అనేది ఎన్నికల సంఘమే నిర్ణయిస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. టీవీకే దరఖాస్తును ఈసీ త్వరలో పరిశీలించనుంది. నిర్ణయం ఏదనేది ఈ పరిశీలనపైనే ఆధారపడి ఉంటుంది. -
ఇక పురుషులకూ ఉచిత ప్రయాణం
తమిళనాడులో ఎన్నికల వేడి మొదలైంది. ఇతర పార్టీలు ఎన్నికల కోసం కమిటీలు ఏర్పాటు చేస్తుంటే.. ప్రతిపక్ష అన్నాడీఎంకే మాత్రం దూకుడు ప్రదర్శించింది. మొదటి దశ మేనిఫెస్టోను శనివారం ప్రకటించింది. ఎంజీఆర్ జయంతి సందర్భంగా చేసిన ఈ ప్రకటనలో.. తాము అధికారంలోకి వస్తే ఏయే హామీలను నెరవేరుస్తామని వివరించింది. ఇందులో పురుషులకు ఉచిత బస్సు ప్రయాణంతో సహా ఐదు కీలక హామీలు ఉన్నాయి.అన్నాడీఎంకే(AIADMK) జనరల్ సెక్రటరీ పళని స్వామి శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తొలి దశ మేనిఫెస్టోను ప్రకటించారు. రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు ఆర్థిక సాయం, మగవాళ్లకు ఉచిత బస్సు ప్రయాణం, అమ్మ టూ వీలర్ స్కీమ్ తదితరాలు ఉన్నాయి. వీటి ప్రకారం..👉మహిళల సంక్షేమం కోసం.. కులవిలక్కు స్కీమ్ అమలు చేస్తామని అంటోంది. ఈ పథకం ప్రకారం రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకు రూ.2 వేల సాయం అందిస్తారు. ఇవి నేరుగా ఆ ఇంటి మహిళల ఖాతాలో జమ అవుతాయి.👉ఉచిత బస్సు ప్రయాణం.. నగరాల్లోని బస్సుల్లో ప్రస్తుతం మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం అమలవుతోంది. అధికారంలోకి వస్తే దానిని కొనసాగిస్తూ.. పురుషులకూ వర్తింపజేస్తామని తెలిపింది.👉అమ్మా ఇల్లమ్ స్కీమ్.. గ్రామీణ ప్రాంతాల్లో సొంత ఇల్లు లేని వారికి ప్రభుత్వమే జాగా కొని.. కాంక్రీట్ ఇల్లు కట్టి ఇస్తుంది. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే అపార్ట్మెంట్లు నిర్మించి ఉచిత నివాసం అందిస్తుంది. ఇందులోనే దీనామణి ఉప పథకం కింద.. ఎస్సీ కులంలో పిల్లలు పెళ్లిళ్లు చేసుకుని వేరుగా నివసించాలనుకుంటే.. ప్రభుత్వమే ఆ ఇళ్లను నిర్మించి ఇస్తుంది.👉కేంద్రం 100 రోజుల పని దినాలను 125 రోజులకు పెంచిన సంగతి తెలిసిందే. దీనిని 150 రోజులకు పొడిగిస్తామని అన్నాడీఎంకే ప్రకటించింది. 👉అమ్మా.. టూ వీలర్ స్కీమ్ కింద.. మహిళలకు రూ.5 లక్షల లోన్ అందిస్తారు. ఇందులో ప్రభుత్వ సబ్సీడీ రూ.25,000 ఉంటుంది.Chennai, Tamil Nadu: AIADMK General Secretary Edappadi K Palaniswami announces the first phase of the party's election promises1) Women’s Welfare (Kulavilakku Scheme) Under the Kulavilakku Scheme, a monthly financial assistance of Rs 2,000 will be provided to all ration… pic.twitter.com/gvwHa0126I— ANI (@ANI) January 17, 2026రామచంద్రన్ 109వ జయంతి సందర్భంగా ఈ ప్రకటన చేస్తున్నట్లు పళని స్వామి తెలిపారు. అంతకు ముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీఎంకే పాలనలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని.. ప్రజలు స్టాలిన్ సర్కార్‌పై ఆగ్రహంతో ఉన్నారని రాబోయేది ఎన్డీయే సర్కారేనని ధీమా వ్యక్తం చేశారు. 2023 నుంచి అన్నాడీఎంకే బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.అన్నాడీఎంకే మేనిఫెస్టో.. ప్రస్తుత డీఎంకే ప్రభుత్వంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలకు కొనసాగింపుగా ఉందని, మరీ ముఖ్యమగా అమ్మ ఇల్లమ్ స్కీమ్.. కళైంగర్ హౌజింగ్ స్కీమ్ మాదిరే ఉందని తమిళ మీడియా విశ్లేషిస్తోంది. తమిళనాడులో ఏప్రిల్ లేదంటే మే నెలలో జరిగే అవకాశం ఉంది. -
విజయ్‌కు డీఎంకే మాస్టర్ స్ట్రోక్!
తమిళనాడు ఎన్నికలకు పట్టుమని ఆరు నెలల సమయం లేదు. దీంతో ప్రధాన పార్టీల నడుమ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ నెలాఖరుకల్లా లేదంటే సంక్రాంతి లోపే ఏయే పార్టీలు, ఎవరెవరితో పొత్తులో కొనసాగుతాయో ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగానే..కరూర్ ఘటన తర్వాత టీవీకే అధినేత విజయ్.. అధికార డీఎంకేపైనే ఫుల్ ఫోకస్ పెడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మొన్న పుదుచ్చేరి.. నిన్న ఈరోడు బహిరంగ సభల్లో ఆయన చేసిన విమర్శలే అందుకు నిదర్శనం. ఈ క్రమంలో.. గురువారం ఈరోడులో జరిగిన టీవీకే ‘మక్కల్ సందిప్పు’బహిరంగ సభలో విజయ్ మాట్లాడుతూ.. డీఎంకే ఓ దుష్ట శక్తి అని, టీవీకే స్వచ్ఛమైన శక్తి అని వ్యాఖ్యానించారు. 2026 ఎన్నికల్లో ఈ రెండింటి మధ్యే పోటీ అన్నారు. అయితే.. ‘‘ఎంజీఆర్, జయలలిత డీకేంను తీవ్రంగా విమర్శించారని, వారు ఎందుకు అంతగా విమర్శించారో అప్పట్లో నాకు తెలియలేదు. వారు చెప్పిందే నేనిప్పుడు చెబుతున్నా. డీఎంకే దుష్టశక్తి, టీవీకే స్వచ్ఛమైన శక్తి. టీవీకే అంటే డీఎంకేకు భయం పట్టుకుంది. నా గురించి 24 గంటలూ ఆలోచిస్తోంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి. కానీ డీఎంకే ప్రభుత్వం దానిని మూసి పెడుతోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత నేనేంటో తెలుస్తుంది. సెంగోట్టైయ్యన్ మనతో కలిసిపోవడం గొప్ప బలం’’ అని విజయ్ ప్రసంగించారు. అయితే.. ఈ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా చెన్నై ఎయిర్‌పోర్టులో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. ‘‘విజయ్‌ని ఏనాడైనా ఇలా అడిగారా?.. ముందు అసలు ఆయన్ని మీ ముందు మాట్లాడించండి’’.. అని మీడియాకే చురక అంటించారాయన. ఈలోపు.. ఆయన మరో దారిలో విజయ్ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ జోరందుకుంది.ఖాకీ ఫేమ్ వినోద్ డైరెక్షన్లో విజయ్ ‘జన నాయగన్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఇది ఆయన చివరి చిత్రంగా ఓ ప్రచారం సాగుతోంది. దీంతో.. అభిమానులు ఈ సినిమాను గ్రాండ్ హిట్ చేసి విజయ్‌కు సెండాఫ్ ఇవ్వాలని భావిస్తున్నారు. పొంగల్ కానుకగా జనవరి 9వ తేదీన ఈ చిత్ర రిలీజ్‌కు ముహూర్తం ఖరారైంది కూడా. అయితే..ఎలాంటి క్లాష్ లేకుండా.. మిగతా చిత్రాలు రిలీజ్ అవుతాయనుకున్న టైంలో కోలీవుడ్‌లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. అప్పటికే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసుకున్న ‘పరాశక్తి’.. జనవరి 14వ తేదీ నుంచి 10వ తేదీకి ముందుకు జరిగింది. ఈ ప్రీపోన్ నిర్ణయం విజయ్ అభిమానులకు పెద్ద షాకే ఇచ్చింది. ఇది చాలదన్నట్లు.. మరో స్టార్ నటుడు అజిత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ మంకత్త (తెలుగు డబ్ మూవీ గ్యాంబ్లర్)ను దాదాపుగా ఆ టైంలోనే రిరీలీజ్ కాబోతోంది. అయితే.. ఈ రెండు నిర్ణయాల వెనుకా ఉదయ్‌నిధి హస్తం ఉందనే ప్రచారం ఇప్పుడు జోరుగా నడుస్తోంది అక్కడ..సుధా కొంగర డైరెక్షన్లో తెరకెక్కిన పరాశక్తిలో శివకార్తీకేయన్, జయం రవి, అధర్వ, శ్రీలీల, రానా దగ్గుబాటి లాంటి స్టార్‌కాస్టింగ్ ఉంది. ఈ చిత్ర నిర్మాత ఆకాశ్ భాస్కరన్ ఉదయ్‌నిధికి అత్యంత సన్నిహితుడు కూడా. ఈ కారణంగానే ఆకాశ్‌పై ఈడీ దాడులు జరిగాయని అప్పట్లో జోరుగా చర్చ నడిచింది. కాబట్టి.. ఉదయ్‌నిధి కోరిక మేరకే పరాశక్తి ప్రీపోన్ జరిగిందనే బలమైన ప్రచారం మొదలైంది. అలాగే.. అజిత్ మంగథాను నిర్మించింది సన్ పిక్చర్స్. అది స్టాలిన్ కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థ అని తెలిసిందే. అలా విజయ్ చివరి సినిమా కలెక్షన్లకు గండికొట్టేందుకు.. ఉధయ్నిధి ఆధ్వర్యంలో డీఎంకే ఇలాంటి మాస్టర్‌స్ట్రోక్ ఇచ్చారని చర్చించుకుంటున్నారు. అయితే ఈ ప్రచారంలో వాస్తవమెంత అనేది పక్కన పెడితే.. దానికి విజయ్ అభిమానులు ఇస్తున్న కౌంటర్లతో సోషల్ మీడియాలో రచ్చ నడుస్తోందక్కడ. -
విజయ్ మౌనం.. అయోమయంలో టీవీకే, అభిమానులు!
కరూర్ తొక్కిసలాట ఘటన.. తమిళగ వెట్రి కగళం(TVK) పార్టీ భవితవ్యాన్ని గందరగోళంలోకి నెట్టేసింది. అయితే తాము తొణకని కుండలా ఉంటామని టీవీకే చెబుతున్నప్పటికీ.. బీజేపీ తన మైండ్ గేమ్ ప్రారంభించిందనే విశ్లేషణ అక్కడి రాజకీయ నిపుణులు చేస్తున్నారు. అందుకు విజయ్ పాటిస్తున్న మౌనం ప్రధానమైన కారణంగా కనిపిస్తోంది.కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత.. బీజేపీ అధికార డీఎంకేనే టార్గెట్ చేసింది. భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అంటోంది. అయితే టీవీకే ఆరోపిస్తున్నట్లు కుట్ర కోణాన్ని మాత్రం సమర్థించడం లేదు. ఈ క్రమంలో.. ఆ పార్టీ అగ్రనేత ఒకరు విజయ్‌కు సంఘీభావం ప్రకటించారని, డీఎంకే గనుక లక్ష్యంగా చేసుకుంటే మద్దతు కూడా ఇస్తామని చెప్పారని తమిళ మీడియా చానెల్స్ మొన్నీమధ్య కథనాలు ఇచ్చాయి. ఆ వెంటనే.. అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ పళనిస్వామి ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. ఎన్డీయే కూటమి బలపడే ప్రయత్నాలు మొదలయ్యాయి అంటూ వ్యాఖ్యానించారాయన. ఆ సమయంలో అన్నాడీఎంకే ర్యాలీలో టీవీకే జెండాలు కనిపించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. అయితే.. ఆ ప్రచారాన్ని ఖండిస్తూ అక్టోబర్ 9వ తేదీన టీవీకే ఒక ప్రకటన విడుదల చేసింది. అన్నాడీఎంకే (AIADMK) ర్యాలీల్లో టీవీకే జెండాలు పట్టుకున్నవాళ్లు తమ పార్టీ వాళ్లు కాదని స్పష్టత ఇచ్చింది. కట్ చేస్తే.. తమిళనాడు బీజేపీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ తాజాగా ఓ ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో బలైమన చేరికలతో ఎన్డీయే కూటమి మరింత బలోపేతం కానుందని, అదెవరనేది మీరు ఊహించుకోవచ్చు’’ అంటూ చెబుతూ నవ్వులు చిందించారామె. దీంతో అది విజయ్ అని మళ్లీ చర్చ మొదలైందక్కడ. అయితే.. కరూర్ ఘటన తర్వాత తనకు సంఘీభావం తెలిపిన రాహుల్ గాంధీకి, సదరు బీజేపీ అగ్రనేతకు విజయ్ ధన్యవాదాలు తెలిపారు. గతంలో తాను ఏ కూటమిలో ఉండబోనని, డీఎంకే తమ రాజకీయ ప్రత్యర్థి అని, బీజేపీ సైద్ధాంతిక విరోధి అని విజయ్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరే ఉంటుందని, కలిసొచ్చే పార్టీలను చేర్చుకుని ముందుకు వెళ్తామని స్పష్టత ఇచ్చారాయన.కరూర్ ఘటనపై సుప్రీం కోర్టు తాజాగా సీబీఐ విచారణకు ఆదేశించింది. విచారణ పర్యవేక్షణకు రిటైర్డ్ జడ్జితో సిట్‌ను సైతం ఏర్పాటు చేసింది. తాము కోరుకున్నట్లే సీబీఐ దర్యాప్తు రావడంతో విజయ్ సంతోషం వ్యక్తం చేశారు. సత్యం గెలుస్తుంది అంటూ ఓ పోస్ట్ కూడా చేశారు. అయితే పొత్తులపై ఉధృతంగా జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం ఖండించడం లేదు. దీంతో ఇటు టీవీకే కేడర్, అటు అభిమానులు అయోమయంలో పడిపోయారు. ఎన్డీయే చేరాలనే ప్రచారంపై విజయ్ ఇప్పటిదాకా స్పందించకపోవడంపై టీవీకేలో ఇతర నేతలు అసంతృప్తిగా ఉన్నారనే కథనాలు వస్తున్నాయి. ఈ తరుణంలో.. ఆయన మౌనం తప్పుడు సంకేతాలు పంపే అవకాశం ఉందని.. పరిస్థితి మరింత ముదరక ముందే స్పందించాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
తమిళనాట ప్లాన్ ‘బీ’.. కొత్త పొ(ఎ)త్తులు ఫలించేనా?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందస్తు ప్రచారాల్లో.. అక్కడి పార్టీలు తలమునకలై పోయాయి. అయితే కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత ఆ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. అధికార డీఎంకేను కార్నర్ చేస్తూ.. కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు విమర్శలతో విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో ప్లాన్ బీపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.ఎన్డీయే కూటమిలో(TN NDA Alliance) భాగంగా.. ప్రతిపక్ష అన్నాడీఎంకే బీజేపీతో పొత్తులో ఉంది. అయితే గత కొంతకాలంగా ఆ పార్టీలో అసంతృప్త నేతల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. బహిష్కృత నేత పన్నీర్ సెల్వం ఎన్డీయే నుంచి నిష్క్రమించిన తర్వాత.. మరికొందరు కూడా ఆ బాటలోనే గుడ్‌బై చెప్పేస్తున్నారు.ఈ క్రమంలో బీజేపీ కొత్తు పొ(ఎ)త్తులకు తెర తీసింది. డీఎంకే వ్యతిరేక ఓట్లను ఏకీకృతం చేయడం లక్ష్యంతో.. ఎన్డీయేను బలపర్చాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో చిన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తులు కుదుర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించి.. తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ జయ్ పాండా, కో-ఇన్చార్జ్ మురళీధర్ మొహోల్ ఇటీవల రాష్ట్ర బీజేపీ నేతలు, అన్నాడీఎంకే నాయకులతో వ్యూహాత్మక చర్చలు జరిపారు.ఇందులో ప్రధానంగా.. విజయ్ టీవీకే పార్టీ(Vijay TVK Party) గురించే చర్చ నడిచినట్లు తెలుస్తోంది. ప్రస్తుత సర్వే సంస్థల అంచనాల ప్రకారం.. టీవీకే పార్టీకి 20% ఓటు షేర్ కలిగి ఉందట. ఇందులో.. 60 శాతం NDA వ్యతిరేక ఓట్లే ఉన్నాయని ఓ అంచనాకి వచ్చింది. ఈ క్రమంలో.. విజయ్ ప్రభావాన్ని ఎదుర్కొనే వ్యూహం అమలు చేస్తోంది. తాజాగా కరూర్ ఘటన తర్వాత టీవీకే అధినేత విజయ్‌కు బీజేపీ సంఘీభావం ప్రకటించింది. జరిగిన దానికి ప్రభుత్వ బాధ్యత కూడా ఉందని, ఏకపక్షంగా టీవీకేను లక్ష్యంగా చేసుకుంటే తమ మద్దతు ఉంటుందని బీజేపీ అగ్రనేత ఒకరు విజయ్‌కు హామీ ఇచ్చినట్లు జాతీయ మీడియా సంస్థలు మొన్నీమధ్యే కథనాలు ఇచ్చాయి. ఈ క్రమంలో.. విజయ్ అభిమాన గణాన్ని ఆకర్షించడంతో పాటు మరో ప్రణాళికను బీజేపీ అమలు చేస్తోందన్న విశ్లేషణ తమిళనాట జోరుగా సాగుతోంది. కరూర్ ఘటనకు ముందు దాకా.. ఏ కూటమిలో టీవీకే భాగంకాదని, అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, అయితే అధికారం కోసం కదిలొచ్చే పార్టీలను స్వాగతిస్తామని టీవీకే అధినేత విజయ్ ప్రకటించారు. దీంతో.. తమిళనాట చిన్నపార్టీలన్నీ టీవీకే వైపు ఒక్కసారిగా తిరిగాయి. ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. మాజీ సీఎం పన్నీర్ సెల్వం, శశికకళ వర్గం, టీవీకే దినకరన్ వర్గం సహా పలు పార్టీలు ఎన్డీయే కూటమి నుంచి బయటకు రావడం.. విజయ్‌కి మద్దతు ఇచ్చేందుకేనని చర్చా జరిగింది. అంతెందుకు.. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న పట్టాలి మక్కల్ కచ్చి(PMK)లోనూ అంతర్గత విభేదాలు తలెత్తి.. ఆ పార్టీ సీనియర్ నేత రామదాస్ తనయుడు ఏ రామదాస్.. టీవీకేలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. నవంబర్ లేదా డిసెంబర్‌లోపు ఆయా వర్గాలు విజయ్ కూటమికి మద్దతు ఇచ్చే ప్రకటనలు చేస్తాయని దాదాపు ఖరారైంది. అయితే.. ఈలోపు కరూర్ ఘటనతో టీవీకే పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ అనిశ్చితి నెలకొన్న సమయంలో విజయ్‌కు మద్దతు ప్రకటించడం మంచిది కాదనే పునరాలోచనలో ఉన్న ఆ వర్గాలకు బీజేపీ గాలం వేస్తోందని తెలుస్తోంది. తద్వారా ఓట్ల చీలికను నివారించడమే కాకుండా.. ఎన్డీయే కూటమిని బలపర్చుకునే యోచనలో బీజేపీ ఉంది. అయితే.. ఈ విషయంలో అన్నాడీఎంకే నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అయ్యే అవకాశం లేకపోలేదు. బహిష్కృత నేతలను ఎట్టి పరిస్థితుల్లో చేర్చుకునేది లేదని అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ ఈ పళనిస్వామి.. బీజేపీ అగ్రనేత అమిత్ షాతో జరిగిన భేటీలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీంతో.. వచ్చే నెల నుంచి ప్రారంభం కాబోయే డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ప్రచారంలోపు పళనిని ఒప్పించే బాధ్యతలను ఎన్నికల ఇంచార్జిలకు బీజేపీ అప్పగించినట్లు తమిళ వెబ్సైట్లు కథనాలు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: అమిత్ షాపై మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు


