అగ్ర నటుడు, తమిళగ వెట్రి కగళం పార్టీ అధినేత విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో టీవీకే మాత్రమే టాప్ ఇంజిన్ అని.. ఎలాంటి డబ్బా ఇంజిన్లను నమ్మొద్దంటూ తమిళనాడు ఓటర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
సోమవారం టీవీకే మూడో వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న విజయ్ మాట్లాడుతూ.. తమిళ రాజకీయాల్లో విజిల్ సౌండ్ గట్టిగా ఉంటుందన్నారు. టీవీకే టాప్ ఇంజిన్ అని.. కాబట్టి ఎలాంటి డబ్బా ఇంజిన్లను నమ్మొద్దంటూ పరోక్షంగా బీజేపీ-అన్నాడీఎంకేను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రసంగం ఆద్యంతంలో అన్నాడీఎంకే పేరును ప్రస్తావించకుండానే ఆయన విమర్శలు గుప్పించడం గమనార్హం.
ఇక డీఎంకేపైనా ఆయన నేరుగా విమర్శలు చేయలేదు. ప్రముఖ కవి తిరువళ్లువర్ ఇవాళ జీవించి ఉంటే ఈ పాలన(డీఎంకే) చూసి.. తిరుక్కురల్‌ను తిరగరాసి ఉండేవారేమో అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. విజయ్ వ్యాఖ్యలతో పొత్తులపై ఓ క్లారిటీ వచ్చినట్లేనని.. ఒంటరి పోరే ఉంటుందని టీవీకే శ్రేణులు చెబుతున్నాయి.
అభిమానుల కోసం మూడు స్టెప్పులు..
టీవీకే వార్షికోత్సవ కార్యక్రమంలో విజయ్ హుషారుగా కనిపించారు. జన నాయగన్ తన చివరి చిత్రం అని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ వేదికగా ఆయన సినిమాకు నెలకొన్న సెన్సార్-రిలీజ్ కష్టాల గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలో.. సింగర్ వేలుమరుగన్ పాడిన పాటకు చిన్నారులతో కలిసి విజయ్ చిందులేసి అభిమానులను, కార్యకర్తలను ఉత్సాహపరిచారు.
தவெக 3ஆம் ஆண்டு தொடக்க விழாவில் ”உங்கக் கூட கொஞ்சம் Dance ஆடிக் கொள்ளட்டுமா?” எனக் கேட்டுக்கொண்டு நடனமாடிய விஜய்#TVK | #Vijay| #TVKVijay | #Panaiyur pic.twitter.com/SVZIGZaE87
— PttvOnlinenews (@PttvNewsX) February 2, 2026


