'జన నాయగన్‌'ను ఇబ్బంది పెడుతున్న సీన్స్‌ ఏంటి..? | why jana nayagan not released and behind reason | Sakshi
Sakshi News home page

'జన నాయగన్‌'ను ఇబ్బంది పెడుతున్న సీన్లు ఏంటి.. కాశ్మీర్‌ ఫైల్స్‌కు సెన్సార్‌ ఎలా?

Jan 29 2026 1:40 PM | Updated on Jan 29 2026 1:46 PM

why jana nayagan not released and behind reason

జన నాయగన్‌ చిత్రం ఇప్పుడు మరింత వివాదాంశంగా మారుతోంది. నటుడు విజయ్‌ కథానాయకుడిగా నటించిన ఈ మూవీని హెచ్‌.వినోద్‌ దర్శకత్వలో కేవీఎన్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించింది. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే సెన్సార్‌ సమస్యలు తలెత్తడంతో సెన్సార్‌బోర్డు, కోర్టుల్లో ఈ చిత్రం నానుతోంది. చిత్రంలో పలు వివాదాస్పద సన్నివేశాలు చోటు చేసుకోవడంతో చిత్రాన్ని రివైజింగ్‌ కమిటీకి పంపినట్లు సెన్సార్‌బోర్డు అధికారులు పేర్కొన్నారు. దీంతో చిత్ర నిర్మాత మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ న్యాయమూర్తి ఆషా.. జననాయగన్‌ చిత్రానికి వెంటనే సర్టిఫికెట్‌  అందించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ ఉత్తర్వులను వ్యతికేకిస్తూ సెన్సార్‌బోర్డు అధికారులు మద్రాసు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ఉండగానే చిత్ర నిర్మాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా ఈ కేసును విచారించడంలో తమకు ఆసక్తిలేదని, మద్రాసు హైకోర్టులోనే తేల్చుకోవలసిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది.

జన నాయగన్‌లో ఉన్న అభ్యంతరాలు ఇవే
జన నాయగన్‌ చిత్ర వ్యవహారంలో  మద్రాసు హైకోర్టు  ఆసక్తికరమైన ఆదేశాలను జారీ చేసింది. జన నాయగన్‌ చిత్రంలో మత విభేదాలకు ఆస్కారం కలిగించే సన్నివేశాలు చోటు చేసుకున్నాయని, కొన్ని విదేశీ శక్తులు మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కుట్ర చేసినట్లు చిత్రీకరించిన సన్నివేశాలను అంగీకరించబోమని సెన్సార్‌ బోర్డు సభ్యులు తెలిపారు. అందుకే 9 మంది సభ్యుల రివైజింగ్‌ కమిటీకి పంపాలని నిర్ణయించారు. భద్రతా దళాలకు సంబంధించిన చాలా సీన్లు ఉండడం ఒక కారణమైతే.. మొదట ఈ సినిమాను చూసిన కమిటీలో నిపుణులు లేకపోవడం వల్ల మరో సమస్యకు దారి తీసింది. 

దీంతో మరోసారి రివైజింగ్‌కు పంపేందుకు సెన్సార్‌ నిర్ణయం తీసుకుంది. రివైజింగ్‌ కమిటీ తర్వాత సెన్సార్‌ వస్తుందని ప్రకటించారు. కానీ, ఇక్కడే ఆలస్యం జరుగుతుంది. చిత్ర నిర్మాతలకు సరైన తేదీ వారు చెప్పకపోవడంతో సినిమా ఎప్పుడు విడుదల కానుందో ఎవరికీ సరైన క్లారిటీ లేదు. సెన్సార్‌ బోర్డు అధికారులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ విచారణలో ఉండగానే చిత్ర నిర్మాతలు ఎలాంటి వివరణ ఇవ్వకుండా సెన్సార్‌ సర్టిఫికెట్‌ను కోరడం సముచితం కాదని మద్రాస్‌ కోర్టు సూచించింది.

సెన్సార్‌ బోర్డే అవసరం లేదు 
నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ సెన్సార్‌ బోర్డుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈయన  చెన్నైలో జరిగిన ఒక సినిమా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్‌ నటించిన జననాయగన్‌ చిత్రానికి సెన్సార్‌ బోర్డు సర్టిఫికెట్‌ ఇవ్వకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు. సెన్సార్‌ బోర్డు వివక్షత ధోరణికి పాల్పడుతోందని విమర్శించారు. కాశ్మీర్‌ ఫైల్స్, కేరళా స్టోరీ వంటి వివాదాస్పద చిత్రాలకు సర్టిఫికెట్‌ ఇచ్చిన సెన్సార్‌బోర్డు జననాయగన్‌ చిత్రానికి ఇవ్వడానికి ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నంచారు. ఈ విషయంలో సెన్సార్‌ బోర్డే అవసరం లేదని అన్నారు. సెన్సార్‌ బోర్డు కేంద్ర ప్రభుత్వం ఆదీనంలో కాకుండా,సినిమాకు చెందిన మధ్యవర్తులతో కూడిన కమిటీగా ఉండాలన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement