మారుతి ఇంటికి 'క్యాష్ ఆన్ డెలివరీ' ఆర్డర్స్‌ | Prabhas Fans Sent some food orders Maruthi home | Sakshi
Sakshi News home page

మారుతి ఇంటికి 'క్యాష్ ఆన్ డెలివరీ' ఆర్డర్స్‌

Jan 29 2026 11:14 AM | Updated on Jan 29 2026 11:45 AM

Prabhas Fans Sent some food orders Maruthi home

దర్శకుడు మారుతికి ప్రభాస్‌ ఫ్యాన్స్‌ నుంచి గట్టిగానే ఎదురుదెబ్బ తగులుతుంది.  ఇటీవలే ఆయన తెరకెక్కించిన ‘ది రాజాసాబ్‌’ ఫలితం మిశ్రమంగా రావడంతో ఫ్యాన్స్‌ భగ్గుమంటున్నారు. సోషల్‌మీడియాలో వారి ఎదురుదాడి ఎక్కవకావడంతో నిర్మాత ఎస​్‌కేఎన్‌ పోలీస్‌స్టేషన్‌ మెట్లు ఎక్కాడు. తమపై ట్రోలింగ్‌ పెద్ద త‌ల‌నొప్పిగా త‌యారైంద‌ని ఆయన వాపోయాడు. సినిమా విడుదల సమయంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. ‘ది రాజా సాబ్’ నచ్చకుంటే కొండాపూర్‌లోని కొల్ల లగ్జరీలో ఉన్న తన ఫ్లాట్‌కు వచ్చేయండి.. అక్కడే మాట్లాడుకుందామని సరదాగా మాట్లాడారు. ఇప్పుడు అదే పెద్ద తలనొప్పిగా మారింది.

దర్శకుడి మాటలను ప్రభాస్‌ ఫ్యాన్స్‌ చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు ఉన్నారు. సినిమా నచ్చకపోవడంతో మారుతిని కలిసేందుకు నేరుగా ఇంటికి వెళ్లినట్లు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కానీ, వారిని సెక్యూరిటీ సిబ్బంది అనుమతించకపోవడంతో వారందరూ తీవ్ర అసహనానికి లోనైనట్లు తెలుస్తోంది.  దీంతో మారుతి ఇంటి  అడ్రస్‌కు పార్శిల్‌ రూపంలో కొన్ని గిఫ్ట్‌లు పంపుతున్నారు. కాక‌పోతే ఇవి ప్రేమ‌తో పంపుతున్న పార్సిల్స్ కావు. జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్‌తో పాటు పలు ఈ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌ నుంచి వందలాది ఆర్డర్లు ఆయన ఇంటికి పంపారు. కానీ, వాటన్నింటినీ ‘క్యాష్ ఆన్ డెలివరీ’ (COD) ఆప్షన్‌తో బుక్ చేయడం విశేషం. దీంతో మారుతి ఫ్లాట్‌ వద్ద ఉన్న సిబ్బందికి పెద్ద సమస్యగా మారింది. అక్కడికి వచ్చిన డెలివరీ బాయ్స్‌ను వెనక్కి పంపడం సెక్యూరిటీ సిబ్బందికి పెద్ద తలనొప్పిగా మారింది. వింతగా ఉన్న ఈ నిరసన ఇప్పడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement