తమ్ముడి బర్త్‌ డే.. అన్న విజయ్ దేవరకొండ స్పెషల్ విషెస్ | Vijay Devarakonda special Wishes To anand Devarakonda | Sakshi
Sakshi News home page

Vijay Devarakonda: తమ్ముడి బర్త్‌ డే.. అన్న విజయ్ దేవరకొండ స్పెషల్ విషెస్

Mar 15 2026 6:20 PM | Updated on Mar 15 2026 6:20 PM

Vijay Devarakonda special Wishes To anand Devarakonda

ఆనంద్ దేవరకొండ, బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ఎపిక్. ఈ మూవీకి ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ ఆనంద్ బర్త్ డే కావడంతో చిత్ర బృందం ప్రత్యేకంగా విషెస్ తెలిపింది. ఈ మూవీలోని ఓ వీడియోను షేర్ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. 

అంతేకాకుండా అమృతం సీరియల్ టైటిల్ సాంగ్‌తో చేసిన వీడియో ఆనంద్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఈ ప్రత్యేక వీడియోను అన్న విజయ్ దేవరకొండ ట్విటర్‌లో షేర్ చేశారు. హ్యాపీ బర్త్‌ డే మై ఫేవరేట్ బాయ్ అంటూ తమ్ముడిపై బర్త్‌ డే విషెస్ చెప్పాడు. అంతకుముందే రష్మిక సైతం డ్యాన్స్ చేస్తూ ఆనంద్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement