దశాబ్దం తరువాత మళ్లీ సంచలన జంట | Simbu and Nayanthara back on screen again | Sakshi
Sakshi News home page

దశాబ్దం తరువాత మళ్లీ సంచలన జంట

Nov 2 2026 12:03 PM | Updated on Nov 2 2026 12:30 PM

Simbu and Nayanthara back on screen again

ఒక సంచలన జంట నటిస్తే ఆ చిత్రానికి వచ్చే క్రేజే వేరు. కోలీవుడ్‌లో సంచలన జంట అంటే ముందుగా గుర్తుకు వచ్చేది శింబు, నయనతార అనే. వీరి గురించి ఇంతకు ముందు పుంఖానుపుంఖాలుగాా వార్తలు దొర్లాయి. ప్రేమికులుగా వార్తల్లోకి ఎక్కిన శింబు, నయనతార తొలిసారిగా వల్లవన్‌ అనే చిత్రంలో జత కట్టారు. అంత సన్నిహితంగా ఉన్న వీరు అనూహ్యంగా విడిపోయారు. ఇక కలిసి నటించరు అనుకున్న సమయంలో పాండిరాజ్‌ దర్శకత్వం వహించిన ఇదునమ్మ ఆళు అనే చిత్రంలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

ఆ తరువాత ఈ జంట మరే చిత్రంలోనూ కనిపించలేదు. కాగా సుమారు 10 ఏళ్ల తరువాత ఇప్పుడు మరోసారి శింబు, నయనతార కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం గుప్పుమంటోంది. అవును ప్రస్తుతం వెట్రిమారన్‌ దర్శకత్వంలో అరసన్‌ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్న శింబు తదుపరి డ్యూడ్‌ చిత్రం ఫేమ్‌ కీర్తీశ్వరన్‌ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రంలో ఆయనకు జంటగా నటి నయనతారను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇందులో వీరిద్దరిది పోలీస్‌ అధికారుల పాత్రలని సమాచారం. 

కాగా, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఈ కాంబో షురూ అయితే మాత్రం కచ్చితంగా ఆ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడడం ఖాయం. కాగా నటి నయనతార నటించిన తాజా చిత్రాలలో ఒకటైన మూక్కుత్తి అమ్మన్‌ –2 చిత్రం దీపావళికి సందర్భంగా సందడి చేయడానికి సిద్ధం అవుతోంది. ఇందులో నయనతార ఓ సాధారణ యువతిగా, అమ్మవారిగా ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి.

ఇదీ చదవండి: అనుకున్నట్లే ఎలిమినేట్.. ఎంత సంపాదించాడు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement