వెకేషన్‌ టు యాక్షన్‌ | Fauzi Movie Update: Prabhas Next Schedule Begins Soon | Sakshi
Sakshi News home page

వెకేషన్‌ టు యాక్షన్‌

Nov 2 2026 3:54 AM | Updated on Nov 2 2026 3:54 AM

Fauzi Movie Update: Prabhas Next Schedule Begins Soon

చిన్న బ్రేక్‌ తర్వాత ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌కు ప్రభాస్‌ రెడీ కానున్నారని తెలిసింది. ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘ఫౌజీ’. ఈ చిత్రంలో ఇమాన్వి ఇస్మాయిల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్, జయప్రద, భాను చందర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఓ గూఢచారి సైనికుడుగా ప్రభాస్‌ నటిస్తున్నారని ఇటీవల విడుదలైన ఈ సినిమా గ్లింప్స్‌ స్పష్టం చేస్తోంది. ఇక ప్రస్తుతం ప్రభాస్‌ యూరప్‌ వెకేషన్‌లో ఉన్నారు.

ఈ నెల తొలి వారంలోనే తిరిగి ఇండియాకు వస్తారని, వచ్చీ రాగానే ఆయన ‘ఫౌజీ’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారని సమాచారం. ప్రభాస్‌ పాల్గొనగా ఓ భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ చిత్రీకరణను ప్లాన్‌ చేశారట హను. గుల్షన్‌ కుమార్, భూషణ్‌ కుమార్, టీ–సిరీస్‌ల సమర్పణలో నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 18న విడుదల కానుంది. ఇక ‘ఫౌజీ’ సినిమాతో పాటు ‘కల్కి 2898 ఏడీ 2’, ‘స్పిరిట్‌’ చిత్రాల చిత్రీకరణలతోనూ ప్రభాస్‌ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలోని ‘సలార్‌ 2’ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement