బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10తో బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు యువ హీరో త్రిగుణ్. ప్రస్తుతం హౌస్‌లో తన ఆటతీరుతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆయన గేమ్ ప్లాన్‌పై కొందరు విమర్శలు చేస్తుండగా.. మరికొందరు మాత్రం మద్దతుగా నిలుస్తున్నారు. ఇదిలా ఉంటే, బిగ్‌బాస్ హౌస్‌లో కొనసాగుతున్న త్రిగుణ్‌కు సంబంధించిన ఓ సినిమా అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఆయన హీరోగా నటిస్తున్న 'జంగా' సినిమా ఫస్ట్ లుక్ తాజాగా విడుదలైంది.
శ్రీమతి వనిత కిలారి సమర్పణలో ఆర్‌కే ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రమ్య కిలారి, జయ చంద్ర నాయుడు కిలారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో త్రిగుణ్ సరసన నేహా పఠాన్ కథానాయికగా నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రావణ్, మధునందన్, గగన్ విహారి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కెవిన్ గడ్డం (శ్రీహరి) దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది.
( ఇదీ చదవండి: వజ్రాల బటన్లు.. అలియా డ్రెస్ ప్రత్యేకతలివే..!)


