బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ తన అందం, అభినయంతోనే కాకుండా ఫ్యాషన్ ఎంపికలతోనూ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా దీపావళి వేడుకల సందర్భంగా ఆమె ధరించిన ప్రత్యేకమైన దుస్తులు అందరి దృష్టిని ఆకర్షించాయి. బంగారు రంగులో మెరిసిపోతున్న బనారసీ జాకెట్ సూట్‌లో అలియా ఎంతో అందంగా కనిపించింది. సంప్రదాయ భారతీయ నేత పనితనానికి ఆధునిక హంగులు జోడించిన ఈ ప్రత్యేకమైన దుస్తులు ఇప్పుడు ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మయూర్ గిరోత్రా అలియా కోసం ప్రత్యేకంగా ఈ దుస్తులను రూపొందించారు. బంగారు రంగు బనారసీ వస్త్రంతో పొడవైన కలీదార్ జాకెట్‌ను తయారు చేశారు. జాకెట్‌కు వజ్రాలు, ఎనామెల్‌తో రూపొందించిన బటన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఆధునిక శైలిలో..
ఈ దుస్తుల గురించి డిజైనర్ మయూర్ గిరోత్రా సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వివరించారు. భారతీయ చేనేత సంపదను ఆధునిక శైలిలో పరిచయం చేయడమే ఈ దుస్తుల ఉద్దేశమని పేర్కొన్నారు. పాతకాలపు కళలు, సంప్రదాయాలను కాపాడుకుంటూనే వాటిని నేటి తరానికి నచ్చేలా రూపొందించినట్లు తెలిపారు.
(ఇదీ చదవండి: కొద్ది రోజుల్లో రిలీజ్.. ‘రామాయణ’పై యశ్ కొడుకు రివ్యూ)


