మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న తరుణం రానే వచ్చింది. పెద్ది తర్వాత రామ్ చరణ్ క్రేజీ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభం కానుందని ఆసక్తిగా ఎదురు చూశారు. ఇవాళ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లాంఛనంగా ప్రారంభమైంది. రంగస్థలం లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత మరోసారి సుకుమార్‌తో జతకట్టారు మెగా హీరో. వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీలో హీరోయిన్ ఎవరనేదానిపై అప్పుడే చర్చ మొదలైంది.
తాజాగా ఆర్సీ17లో హీరోయిన్ ఎవరనే విషయంలో సోషల్ మీడియాలో తెగ టాక్ నడుస్తోంది. ఇటీవలే దురంధర్ ఫేమ్ సారా అర్జున్‌ను తీసుకుంటారని టాక్ వినిపించింది. అయితే తాజాగా మరో హీరోయిన్ పేరు వినిపిస్తోంది. ఈ మూవీలో ఆకాశంలో ఒక తార హీరోయిన్ సాత్విక వీరవల్లి.. రామ్ చరణ్ సరసన కనిపించనుందని లేటేస్ట్ టాక్. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.. ఆమెకే ఎంపిక చేసే ఛాన్స్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇవాళ మూవీ లాంఛ్ ఈవెంట్‌లో హీరోయిన్ గురించి ఏదైనా అప్‌డేట్ వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ అలాంటిదేం జరగలేదు. దీంతో అభిమానులకు హీరోయిన్ ఎవరనే విషయంలో సస్పెన్స్ నెలకొంది. కాగా.. ఈ మూవీ ఈ ఏడాది చివరి నాటికి షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారు.


