కోలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రాల్లో ‘మూకుత్తి అమ్మన్ 2’ ( తెలుగులో మహాశక్తి) ఒకటి. సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు వేల్స్ ఇంటర్నేషనల్‌తో పాటు సుందర్ సి, నయనతార నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నయనతార ద్విపాత్రాభినయం చేస్తుండగా.. రెజీనా కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. నవంబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే ఇటీవ విడుదలైన ఈ మహాశక్తి ట్రైలర్ పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ సరిగ్గా లేవని, బడ్జెట్ లేకపోవడంతో ఏఐ (AI) వాడేశారంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ వివాదంపై దర్శకుడు సుందర్ సి తీవ్రంగా స్పందించారు. చెన్నైలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తనదైన శైలిలో స్పందించారు.
నిజం ఎంటో తెలుసుకోకుండా మాట్లాడితే..
‘నిజం ఎంటో తెలుసుకోకుండా మాట్లాడితే బాధగా అనిపిస్తుంది. దాదాపు 400 మంది సీజీఐ కళాకారులు రాత్రింబవళ్లు కష్టపడి ఏడాదిన్నర పాటు ఈ సినిమా కోసం పనిచేశారు. ఆ కష్టాన్ని ఏఐ పేరుతో కొట్టిపారేయడం సరైంది కాదు. ఈ సినిమాలో దాదాపు 3,000 సీజీఐ (CGI) షాట్లు ఉన్నాయి. అందులో కేవలం 15 షాట్లకు మాత్రమే ఏఐ ఉపయోగించాం. మిగిలిన ప్రతి ఫ్రేమ్‌ను సాంకేతిక నిపుణులే స్వయంగా తీర్చిదిద్దారు. విజువల్స్ బాగుంటే మెచ్చుకోండి, కానీ లేనిపోని ప్రచారాలు చేయకండి’ అని విజ్ఞప్తి చేశారు.
(ఇదీ చదవండి: మరో వివాదంలో ఆదర్శ కుటుంబం.. ఇలా చూపించారేంటి త్రివిక్రమ్ సార్?)


