స్టార్‌ హీరోలకు ధీటుగా లేడీ సూపర్‌స్టార్‌ క్రేజ్‌ | Nayanthara 60 foot cutout for Mookuthi Amman 2 movie | Sakshi
Sakshi News home page

Nayanthara: లేడీ సూపర్‌స్టార్‌ క్రేజ్‌.. థియేటర్‌ దగ్గర భారీ కటౌట్‌

Oct 24 2026 3:55 PM | Updated on Oct 24 2026 4:04 PM

Nayanthara 60 foot cutout for Mookuthi Amman 2 movie

లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మూకుత్తి అమ్మన్ 2’ (తెలుగులో మహా శక్తి). సుందర్ సి దర్శకత్వంలో వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై రూ. 100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.  ఈ చిత్రంలో నయనతార ద్విపాత్రాభినయం చేశారు. ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా  విడుదల కానుంది.

అయితే చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నయనతార. అంతటి క్రేజ్‌ ఉన్న ఈ తారకు తమిళనాడులోని వేల్స్ థియేటర్స్ వద్ద  ఏకంగా 60 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. తమిళ సినీ చరిత్రలోనే ఒక హీరోయిన్‌కు ఇంతటి భారీ కటౌట్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇప్పుడీ కటౌట్‌ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

(ఇదీ చదవండి: హాలీవుడ్‌ ఎంట్రీపై మనసు విప్పిన రాజమౌళి..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement