లేడీ సూపర్‌స్టార్‌ మొదటి వేతనం ఎంతో తెలుసా? | Nayanthara Reveals Her First Salary | Sakshi
Sakshi News home page

లేడీ సూపర్‌స్టార్‌ మొదటి వేతనం ఎంతో తెలుసా?

Aug 23 2026 4:34 PM | Updated on Aug 23 2026 4:39 PM

Nayanthara Reveals Her First Salary

దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది నయనతార. అప్పుడెప్పుడో మొదలైన ఆమె సినీ ప్రయాణం ఇప్పటికీ యువ హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. వరుస అవకాశాలతో బిజీగా ఉన్న ఈ తార మొదటి సంపాదన ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ విషయాన్ని స్వయంగా ఆమె నోటితోనే చెప్పడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

మలయాళ నటి, యాంకర్‌ పెర్లే మానేతో జరిగిన ఓ సంభాషనలో నయనతార తన మొదటి ఉద్యోగం, మొదటి సంపాదన కోసం వెల్లడించారు.  ‘వనిత’ మ్యాగ్‌జైన్‌ కవర్‌ షూట్‌ కోసం ఓ ఫ్యాషన్‌ ప్రోగ్రామ్‌కు వెళ్లిన సందర్భంలో తనకు మొదటి అవకాశం వచ్చిందని నయనతార తెలిపారు. ఆ షూట్‌ కోసం సుమారు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు తీసుకున్నట్లు వెల్లడించారు. 

2003లో కథానాయికగా..
కాగా  2003లో వచ్చిన మలయాళ చిత్రం ‘మానస్సినక్కరే’ ద్వారా ఆమె కథానాయికగా వెండి తెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో వరస అవకాశాలు క్యూ కట్టాయి. కాగా చంద్రముఖి, లక్ష్మి వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన నాయనతార మంచి గుర్తింపు తెచ్చుకుని అవకాశాలను మూటకట్టుకుంది.   ప్రస్తుతం హాయ్‌, టాక్సిక్‌ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇదీ చదవండి:  హాస్యనటికి వింత అనుభవం.. బాత్‌రూమ్‌లోనే గంటపాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement