ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలొచ్చాయి. 25కి పైగా మూవీస్, వెబ్ సిరీస్‌లు ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటిలో ప్యారడైజ్, డోరతి, ధూమకేతు, వరం, నా వైఫ్ మిస్సింగ్ లాంటి తెలుగు స్ట్రెయిట్-డబ్బింగ్ చిత్రాలు, సిరీస్‌లు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. ఇప్పుడు వీటికి తోడుగా మరో తెలుగు సినిమా సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది.
(ఇదీ చదవండి: ‘నా వైఫ్ మిస్సింగ్’ ఓటీటీ సిరీస్ రివ్యూ)
దుర్గాదేవ్ నాయుడు హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా 'ఐ యామ్ హ్యాండ్సమ్'. ఈ ఏడాది జూన్ 12న థియేటర్లలో రిలీజైంది. కొత్త నటీనటులు కావడంతో ఇదొకటి ఉందనే సంగతి కూడా జనాలకు తెలీదు. ఇప్పుడిది నాలుగు నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగులోనూ అందుబాటులో ఉంది.
'ఐ యామ్ హ్యాండ్సమ్' విషయానికొస్తే.. ఒక మారుమూల గ్రామంలో నివసించే సాధారణ యువకుడు.. అదే ఊరికి మెడికల్ క్యాంప్ నిర్వహించడానికి వచ్చిన ఓ మహిళా డాక్టర్‌తో (అన్విష)తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అయితే ఒక పల్లెటూరి కురరాడు.. చదువుకున్న సిటీ డాక్టర్ మనసు గెలుచుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? ఈ క్రమంలో చేసిన వినూత్న ప్రయత్నాలేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: హారర్ మూవీ ‘418’ రివ్యూ)


