బ్యాంకాక్: మయన్మార్ మాజీ నాయకురాలు ఆంగ్ సాన్ సూకీ (Aung San Suu Kyi)కి ఐదేళ్ల తర్వాత మొదటిసారిగా తన కుమారుడు కిమ్ అరిస్‌తో ఫోన్‌లో మాట్లాడే అవకాశం లభించింది. ఈ విషయాన్ని కిమ్ అరిస్ గురువారం సోషల్ మీడియాలో పోస్టుచేశారు.ఐదేళ్ల తర్వాత ఈ రోజు తన తల్లి ఆంగ్‌సాన్ సూకీతో మాట్లాడగలిగానని పేర్కొన్నారు. ఆమె గొంతును మళ్లీ వినడం మాటల్లో చెప్పలేని అనుభూతినిచ్చిందని ఆనందం వ్యక్తంచేశారు.
మయన్మార్ అధ్యక్షుడు మిన్ ఆంగ్ హ్లాయింగ్ ప్రతినిధి ఖైంగ్ ఖైంగ్ సో కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మయన్మార్ రాజధాని నేపిటాలోని ఒక రహస్య ప్రదేశంలో గృహ నిర్బంధంలో ఉన్న తన తల్లితో అరిస్ 20 నిమిషాల పాటు మాట్లాడినట్లు తెలిపారు. అరిస్ లండన్‌లోని మయన్మార్ రాయబార కార్యాలయం నుంచి మాట్లాడారు. ఆంగ్‌సాన్ సూకీ సూకీ చిన్న కుమారుడైన అరిస్ చాలా ఏళ్లుగా లండన్‌లో ఉంటున్నారు. 2021 ఫిబ్రవరిలో మయన్మార్ సైన్యం ప్రజాప్రభుత్వాన్ని కూలదోసి, అధికారాన్ని చేజిక్కించుకుంది. అప్పటినుంచి ఆంగ్‌సాన్ సూకీ సైనిక నిర్బంధంలో ఉన్నా రు. సైనిక పాలకులు ఆమెపై పలు అభియోగాలు మోపారు. న్యాయస్థానం 18 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2021 తర్వాత ఆంగ్‌సాన్ సూకీ బహిరంగంగా ప్రజలకు కనిపించలేరు. సైనిక పాలకులు ఆమె ఆరోగ్య పరిస్థితిని కూడా ప్రజలకు తెలియనివ్వడం లేదు. సూకీ వయసు ప్రస్తుతం 81 ఏళ్లు.
ఇదీ చదవండి: బరువైన లెహంగా, నగలతో పెళ్లి కూతురి పరుగు : సీఎంకు విజ్ఞప్తి వైరల్
ఇదీ చదవండి: రూ.800కి సేల్స్‌మేన్ : క్లీనర్‌కి లంబోర్ఘిని ఇచ్చి, హైదరాబాదీ గొప్ప మనసు


