రాజస్థాన్‌లో జరిగిన ఒక దారుణమైన ఘటన మానవత్వానికే మాయని మచ్చలా మారింది. రాజస్థాన్‌లోని దాసా (Dausa) జిల్లా కొల్వా పోలీస్ స్టేషన్ పరిధిలో 16 ఏళ్ల మైనర్ బాలికపై అమానుష సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపింది. ఈ సమయంలోనే ఆ బాలిక బిడ్డకు జన్మనివ్వడం, చనిపోవడం తీవ్ర దిగ్భ్రాంతి రేపింది.
బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, కొందరు యువకులు మైనర్ బాలికను అపహరించి, ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.గర్భవతి అన్నకనికరం కూడా లేకుండా నిర్దాక్షిణ్యానికి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ బాలిక అక్కడే మగ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే నవజాత శిశువు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆసుపత్రి యాజమాన్యం సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.వైద్య పరీక్షల అనంతరం ఆమె ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఇదీ చదవండి: 81 ఏళ్ల తల్లి.. ఐదేళ్ల తర్వాత తొలిసారి కుమారుడితో మాటలు
దౌసా ఎస్పీ కుందన్ కన్వారియా తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసి, ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP)కి దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. ఒక అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఇదీ చదవండి: బరువైన లెహంగా, నగలతో పెళ్లి కూతురి పరుగు : సీఎంకు విజ్ఞప్తి వైరల్


