iPhone Duo క్రేజీ సేల్‌ : 5 నిమిషాల్లోనే ఆల్ స్టాక్ అవుట్ | Apple iPhone Duo Sold Out On Blinkit In 5 Minutes, Internet Reacts | Sakshi
Sakshi News home page

iPhone Duo క్రేజీ సేల్‌ : 5 నిమిషాల్లోనే ఆల్ స్టాక్ అవుట్

Oct 23 2026 6:03 PM | Updated on Oct 23 2026 6:11 PM

Apple iPhone Duo Sold Out On Blinkit In 5 Minutes, Internet Reacts

భారతీయ మొబైల్‌ మార్కెట్‌లో ఆపిల్‌ ఐఫోన్‌కు ఉండే క్రేజ్‌ అంతా ఇంతా కాదు. అందులోనూ ఇటీవల ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ 'iPhone Duo' భారతదేశంలో విడుదల కావడంతో ఈ క్రేజ్‌ మరింత పెరిగింది. ఊహించని స్పందనతో అమ్మకాల్లో ఐఫోన్‌  లవర్స్‌ను ఆశ్చర్య పరుస్తోంది.

ఆపిల్ తొలి ఫోల్డబుల్ ఫోన్ 'iPhone Duo' క్విక్ కామర్స్ ప్లాట్‌ఫారమ్ Blinkit లో సేల్ ప్రారంభమైన 5 నిమిషాల్లోనే ఆల్ స్టాక్ అవుట్ (Sold Out) అయి పోవడంతో ఐఫోన్‌ లవర్స్‌కు నిరాశ తప్పలేదు. ఢిల్లీ-NCR వినియోగదారుల కోసం శుక్రవారం ఉదయం 8:15 గంటలకు సేల్ ప్రారంభమైతే, క్షణాల్లో అన్నీ అమ్ముడు పోయాయట. ఈ సందర్భంగా ఢిల్లీలోని సాకేత్ లో ఉన్న ఆపిల్ స్టోర్ వద్ద ఈ ఫోన్ కొనడానికి ప్రజలుముందురోజు రాత్రి నుంచే భారీగా క్యూ లైన్లు కట్టారు.

 బ్లింకిట్ వ్యవస్థాపకుడు అల్బిందర్ ధిండ్సా (Albinder Dhindsa)  ఎక్స్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, రాబోయే వారాల్లో మరిన్ని యూనిట్లను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. అయితే ఎన్ని ఫోన్లు అమ్మకానికి పెట్టారనేది స్పష్టం చేయలేదు.

 

దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "ఇంత భారీ ధర ఉన్నప్పటికీ 5 నిమిషాల్లో అమ్ముడవడమేంటి?", "అసలు బ్లింకిట్‌లో అమ్మకానికి పెట్టింది 2 ఫోన్లా లేక 5 ఫోన్లా?" అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మీరు రిచ్‌బ్రో అంటూ ఫన్నీగా   వ్యాఖ్యానించారు.

 ఐఫోన్ డ్యుయో ధరల వివరాలు:

256  జీబీ స్టోరేజ్‌ ధర  రూ. 2,99,900

512 జీబీ స్టోరేజ్‌ ధర  రూ. 3,24,900

1 టీబీ జీబీ స్టోరేజ్‌ ధర  రూ. 3,74,900

2 టీబీ జీబీ స్టోరేజ్‌ ధర  రూ. 4,49,900 (టాప్ ఎండ్ మోడల్)

ఫీచర్లు & స్పెసిఫికేషన్లు ఇలా..

7.6 అంగుళాల ఫ్లెక్సిబుల్ ఇన్నర్ డిస్‌ప్లే, 5.4 అంగుళాల ఔటర్ కవర్ స్క్రీన్.

కొత్త A20 Pro చిప్‌సెట్, 48MP డ్యూయల్ ఫ్యూజన్ కెమెరా సిస్టమ్.

టైటానియం ఫ్రేమ్ (Titanium Frame) డిజైన్
12GB -256GB ,  2TB వరకు స్టోరేజ్‌ ఆప్షన్లు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement