వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన లేటెస్ట్ సినిమా 'ఆదర్శ కుటుంబం'. లెక్క ప్రకారం ఈ పాటికే థియేటర్లలోకి వచ్చేయాలి. అక్టోబర్ తొలి రెండు వారాల్లోనే రిలీజ్ చేయాల్సింది. కానీ ఈ నెల 30న వస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: శోభనం జరగనివ్వని 'తోకచుక్క'.. మలయాళ థ్రిల్లర్ 'ధూమకేతు' రివ్యూ(ఓటీటీ))
ట్రైలర్ బట్టి చూస్తే ఓ సాదాసీదా మధ్య తరగతి కుటుంబం. సరదాగా ఉండే వీళ్ల జీవితం అనుకోని మలుపులు తిరుగుతుంది. చిన్న ఇంట్లో ఉన్నోళ్లు గేటెడ్ కమ్యూనిటీలోని విల్లాకు మారతారు. తర్వాత ఏమైంది? సాఫ్ట్‌గా కనిపించే కుటుంబం.. వైలెంట్‌గా ఎందుకు మారింది? అనేది స్టోరీలా ఉంది.
(ఇదీ చదవండి: ఒక్కరోజే ఓటీటీల్లోకి వచ్చేసిన 22 సినిమాలు)


