నయనతార ప్రధాన పాత్ర చేసిన లేటెస్ట్ సినిమా 'మూకుతి అమ్మన్ 2'. సుందర్.సి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తెలుగులో 'మహాశక్తి' పేరుతే వచ్చే నెల 06న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ వదిలారు.
(ఇదీ చదవండి: ఏకంగా ముఖ్యమంత్రికి తెగ నచ్చేసిన ప్రేమకథా సినిమా)
ఆర్జే బాలాజీ దర్శకత్వంలో మూకుతి అమ్మన్ తొలి భాగం సింపుల్‌గా తీసినప్పటికీ.. ఈసారి మాత్రం భారీ గ్రాఫిక్స్, దద్దరిల్లే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెట్టారు. అయితే గ్రాఫిక్స్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు స్టార్ హీరోలు చేసే సేవియర్ టైప్ కథతో దీన్ని తెరకెక్కించారు. ఓ ఊరు, అందులోని ఓ కుటుంబానికి ఆపద వస్తే స్వయంగా అమ్మవారు వచ్చి, వాళ్లని ఎలా కాపాడింది అనేది స్టోరీలా అనిపిస్తుంది. మరి నయన్ ఈ మూవీతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి?
(ఇదీ చదవండి: ఇదేం పైత్యం.. కాయదు ఎంగిలి చేసిన బాటిల్ రూ.3 లక్షలా?)


