ఇదేం పైత్యం.. కాయదు ఎంగిలి చేసిన బాటిల్ రూ.3 లక్షలా? | Actress Kayadu Lohar Used Water Bottle Listed For Sale On OLX For Rs 3 Lakh, Leaves Netizens Surprised | Sakshi
Sakshi News home page

Kayadu Lohar: హీరోయిన్ తాగిన వాటర్ బాటిల్ కూడా అమ్మేస్తున్నారా?

Oct 21 2026 12:19 PM | Updated on Oct 21 2026 12:42 PM

Kayadu Lohar Used Water Bottle For 3 Lakh Rupees

సోషల్ మీడియా రావడమేమో గానీ ఎక్కడ లేని విచిత్రాలన్నీ ఇక్కడే కనిపిస్తుంటాయి. అసలు ఏ మాత్రం ఊహించనవి కూడా ఇక్కడే దర్శనమిస్తూ నవ్వు తెప్పిస్తుంటాయి. ఇప్పుడు కూడా అలాంటి ఓ విషయం చర్చనీయాంశంగా మారిపోయింది. ట్రెండింగ్ హీరోయిన్ కాయదు లోహర్ ఇందులో ఉండటంతో ఇది కాస్త హాట్ టాపిక్‌గా మారింది.

(ఇదీ చదవండి: ‍బిగ్‌బాస్ హౌస్ కాదిది.. చేపల మార్కెట్!)

రీసెంట్ టైంలో తెలుగు, తమిళ, మలయాళంలో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ కాయదు లోహర్.. తాగిన వాటర్ బాటిల్‌ని ఓ వ్యక్తి ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టాడు. ఏకంగా రూ.3 లక్షల ధరగా నిర్ణయించాడు. మార్కెట్‌లో సదరు నీళ్ల సీసా ధర రూ.10-20 కంటే ఎక్కువ ఉండదు. కానీ ఓఎల్ఎక్స్‌లో బాటిల్‌లో ఆమె నీరు తాగుతున్న ఫొటో పెట్టి ఎవరో ఆకతాయి.. ఈ తుంటరి పనిచేశాడు. ఇదికాస్త ఇప్పుడు నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది. ఇలా కూడా చేస్తారా? అని చూసినోళ్లంతా నవ్వుకుంటున్నారు. కేరళకు చెందిన ఎవరో వ్యక్తి ఈ పనిచేసినట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ‘గరివిడి లక్ష్మి’తో టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా రాగ్ మయూర్!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement