బిగ్‌బాగ్ హౌస్‌లో నామినేషన్లు జరిగినా ప్రతిసారి రచ్చ రచ్చ అవుతోంది. ఈసారి అంతకు ఏం తక్కువ కాదన్నట్లు జరిగింది. చేపల మార్కెట్‌లా ఒకరిపై ఒకరు అరుచుకుని గోలగోల చేశారు. ఇంతకీ 10వ సీజన్‌లో 44 రోజైన మంగళవారం(అక్టోబర్ 20) ఎపిసోడ్‌లో అసలేం జరిగింది? ఈ వారం నామినేషన్లలో ఎవరెవరున్నారనేది చూద్దాం.
(ఇదీ చదవండి: ఏకంగా ముఖ్యమంత్రికి తెగ నచ్చేసిన మమిత బైజు ప్రేమకథా సినిమా)
మంగళవారం ఎపిసోడ్‌లో భాగంగా.. తొలుత షాలిని వెళ్లిపోడం గురించి వంశీ, త్రిగుణ్ మాట్లాడుకున్నారు. 'నిన్ను బయటకు పంపించేసి, షాలినిని ఇంట్లో ఉంచాలని ఒకడు (రోహిత్) అనుకున్నాడు. అది జరగలేదు. దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నువ్వు వెళ్లిపోతావ్. షాలిని ఉంటుందని చాలా కాన్పిడెన్స్‌గా ఉన్నారు. నువ్వు సేవ్ కాగానే వాళ్లకు ఫ్యూజ్‌లు ఔట్ అయ్యాయి' అని వంశీతో త్రిగుణ్ అన్నాడు. దీంతో వంశీ.. నాకంటే ముందు రోహిత్ వెళ్తాడు. ఈ హౌస్‌లో ఉండటానికి అతనికంటే నాకే ఎక్కువ అర్హత' అని అన్నాడు. త్రిగుణ్ దగ్గర కూర్చున్న వర్షిణి.. ‘నేను గేమ్ ఆడటం లేదని నీతూ అంటుంది. మరి ఈమె ఏం పొడిచింది’ అని రుసరుసలాడింది. రోహిత్ దగ్గరకు వెళ్లిన సుధీర్.. షాలిని వెళ్లిపోయింది కాబట్టి నీకు ఇదే రైట్ టైమ్. ఏదైనా చేయగలవు. నీకు వీక్‌నెస్ ఏం లేదు’ అని అన్నాడు. దీంతో రోహిత్.. నేనూ అదే చెప్తున్నా. నేను కోల్పోవడానికి ఇక్కడేం లేదు. ఫుల్ ఎటాకింగ్ మోడ్‌లోకి దిగుతా. నాకు షాలిని వెళ్లిపోవడం గుడ్ అని నేను అనుకోను. ఎందుకంటే.. తన నా రీచార్జ్ పాయింట్' అని అన్నాడు.
తర్వాత నామినేషన్ ప్రక్రియ తిరిగి మొదలైంది. తొలుత అమన్.. శివ్‌ని నామినేట్ చేశాడు. వైల్డ్ ఫైర్‌లా వచ్చి వైల్డ్ ఫూల్ అయ్యారు. గంట ఎపిసోడ్ చూసి వచ్చేశారు. 24 గంటలు చూసి వస్తే బాగుండేదని అన్నాడు. ఆ మాటతో శివ్ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. బయట జనం గంట ఎపిసోడ్ చూసే ఓట్లేస్తారు. 24 గంటలూ చూసి కాదు. ఫూల్ నేను కాదు. మీరూ’ అని మాటలతో ఫటాఫట్ ఇచ్చేశాడు. తర్వాత వచ్చిన శ్వేత.. ఊహించని విధంగా త్రిగుణ్‌ని నామినేట్ చేసింది. ఫ్రంట్ ఫుట్‌లో ఆడతారనే అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చాక అది నిజం కాదని తెలిసింది. కప్పు కొట్టాల్రా అని అన్నారు. విన్నరే కప్పు కొడతాడు. విన్నర్ అనేవాడు నమ్మక ద్రోహం చేయాలనుకోవడం కరెక్ట్ కాదు. గేమ్‌లో ఛీటింగ్ చేసి కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి తీసేశారు. అందుకే నామినేట్ చేస్తున్నా అని కారణాలు చెప్పింది. దీంతో త్రిగుణ్.. ఇక్కడికి వచ్చిన వాళ్లలో ఇమేజ్ లాస్ అవుతున్నది నేనే అని నాకు తెలుసు. నేను ఇక్కడికి విలన్ అవ్వడానికో.. హీరో అవ్వడానికో రాలేదు. హౌస్‌లో ఎన్నాళ్లు ఉంటే అన్నాళ్లు ఎంటర్‌టైన్ చేయడానికే వచ్చాను.. అదే నా గేమ్ స్ట్రాటజీ' అని చెప్పుకొచ్చాడు.
అనంతరం వర్షిణి.. నీతూని నామినేట్ చేసింది. ఈ కోచ్ నాపై చేసిన అలిగేషన్స్ చేసే ముందు.. వాటిని ఆమె ఫాలో అవుతున్నారా? బయట విషయాలు ఇక్కడ చెప్పొద్దని అన్నారు. కానీ మీరు చేసేది ఏంటి? రూల్స్ ఫాలో కాను అని నన్ను అన్నారు. కానీ బిగ్‌బాస్ నుంచి అనౌన్స్‌మెంట్స్ వచ్చింది మీకే కదా. రూల్స్ ఫాలో అవ్వని మీరు, రూల్స్ గురించి మాట్లాడటం బేస్‌లెస్. ముకేష్‌ని పక్కనపెట్టుకుని గేమ్ ఆడుతున్నా అని అన్నావ్. మరి నువ్వేం పీకావ్. నా గేమ్ గురించి నీకెందుకు చెప్పాలి? అసలు నువ్వెవరు? నువ్వు వైల్డ్ ఫైర్ కాదు పెద్ద ఫ్లవర్‌వి. నువ్వు రావడం రావడమే రోహిత్-షాలినిల మధ్య మంట పెట్టి.. ఆమెని విడదీసి బయటకు పంపావ్’ అని వర్షిణి.. నీతూ పరువంతా తీసేసింది.
తర్వాత సుధీర్, రామకృష్ణని నామినేట్ చేశాడు. త్రిగుణ్, సుధీర్‌ని నామినేట్ చేశాడు. అనంతరం రామకృష్ణ, ఝాన్సీని కౌంటర్ నామినేట్ చేశాడు. అగ్నిపరీక్షలో బాగానే ఆడావ్.. ఇక్కడికి వచ్చి ఆడింది ఏం లేదు. సింపతీ గేమ్ ఆడుతున్నావ్.. ఊ అంటే ఏడుస్తావ్ అంతే తప్ప.. నువ్వు చేసిందేం లేదు.. ఏడ్వడం నీకు ఎమోషన్ అయితే.. కాళ్లు మొక్కడం కూడా ఎమోషనే’ అని రామకృష్ణ అన్నాడు. ముకేశ్, వంశీని నామినేట్ చేశాడు. చివరలో కెప్టెన్ రాంప్రసాద్‌కి బిగ్‌బాస్ కెప్టెన్ పవర్ ఇచ్చాడు. నామినేట్ కాని నరేశ్, దేబ్జానీ, అమన్, ముకేశ్‌లలో నుంచి ఒకర్ని నేరుగా నామినేట్ చేయమని చెప్పడంతో అమన్ పేరు చెప్పాడు. అలా ఈ ఏడో వారంలో దక్షి, వర్షిణి, రోహిత్, సుధీర్, త్రిగుణ్, నీతూ, రామకృష్ణ, శివ్, ఝాన్సీ, శ్వేత, వంశీ, అమన్ నామినేట్ అయ్యారు. దేబ్జానీ, నరేశ్, ముకేష్, రాంప్రసాద్‌లు తప్ప మిగిలిన 12 మంది నామినేషన్లలో ఉన్నారు.
(ఇదీ చదవండి: సర్‌ప్రైజ్ చేసిన దీపిక.. రెండో కూతురికి దేవుడి పేరు)


