ఏకంగా ముఖ్యమంత్రికి తెగ నచ్చేసిన ప్రేమకథా సినిమా | Kerala Cm Vd satheesan about Bethlehem kudumba unit Movie | Sakshi
Sakshi News home page

Bethlehem Kudumba Unit-Kerala CM: మమిత సినిమా.. ముఖ్యమంత్రికి తెగ నచ్చేసింది

Oct 21 2026 8:26 AM | Updated on Oct 21 2026 8:35 AM

Kerala Cm Vd satheesan about Bethlehem kudumba unit Movie

మమిత బైజు రీసెంట్ టైంలో చేసిన మలయాళ సినిమా 'బెత్లెహెం కుడుంబ యూనిట్'. ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీగా దీన్ని తీశారు. నివిన్ పౌలీ హీరో కాగా 'ప్రేమలు' తీసిన గిరీష్ దర్శకుడు. అటు థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయి రూ.300 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి ఇండస్ట్రీ రికార్డ్ కొట్టింది. ఆపై ఓటీటీలోనూ ట్రెండింగ్ అయిపోయింది. ఇప్పుడీ చిత్రాన్ని చూసిన కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్.. తనకు ఇది తెగ నచ్చేసిందని చెబుతూ సోషల్ మీడియాలో పెద్ద పోస్ట్ పెట్టారు.

(ఇదీ చదవండి: దుర్గాదేవి ఈవెంట్‌కి మందేసి వచ్చారా? దలేర్ మెహందీపై మంత్రి ఆరోపణ)

'ఒకప్పుడు ప్రతి నెలా కనీసం ఓ సినిమా అయినా చూసేవాడిని. కానీ ఈ పనుల వల్ల అలవాటు కొన్నాళ్లుగా తప్పింది. నిన్న చాలా రోజుల తర్వాత ఓ మూవీ ఒకేసారి చూశాను. నా కూతురు, ఆమె స్నేహితురాలితో కలిసి 'బెత్లెహెం కుడుంబ యూనిట్' చూడటం ఎంతో సరదాగా అనిపించింది. ఎక్కడా కొంచెం కూడా అసభ్యత కనిపించలేదు. నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి. మొత్తం అయిపోయిన తర్వాత ఇన్నాళ్లు ఈ చిత్రం ఎందుకు చూడలేదా అనిపించింది'

'కేవలం హీరో, హీరోయిన్ అని చెప్పుకునే ప్రధాన పాత్రలే కాదు, ఒకట్రెండు సన్నివేశాల్లో కనిపించే పాత్రలు కూడా తమదైన ముద్ర వేశాయి. సినిమా చూసి మనసారా నవ్వుకున్నాను. కొన్ని సందర్భాల్లో బాధగానూ అనిపించింది. చివరకు ఎంతో అద్భుతమైన అనుభూతి పొందాను. మూవీ చూసిన తర్వాత ప్రత్యేకంగా ప్రశంసిస్తూ నోట్ రాయడం నాకు అలవాటు లేదు కానీ ఇది చూసిన తర్వాత ఎంతో ఆనందంగా అనిపించింది. అందుకే నా అనుభూతి పంచుకోవాలని నిర్ణయించుకున్నాను. దర్శకుడు ఏ.డి.గిరీష్‌, నటుడు సంగీత్ ప్రతాప్‌కు ఫోన్ చేసి అభినందనించాను. నివిన్ పౌలీ, మమితా బైజూలని ఫోన్‌లో సంప్రదించలేకపోయా. వీరితో పాటు గ్లిక్సన్ కూడా నా మనసులో నిలిచిపోయాడు. పాపం గ్లిక్సన్'

'బెత్లెహెం కుటుంబ యూనిట్ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు. ఈ సినిమాను ఇంత ఆహ్లాదకరంగా, గుర్తుండిపోయే అనుభూతిగా మలిచిన తెర ముందు, తెర వెనుక ఉన్న ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు' అని ముఖ్యమంత్రి వీడీ సతీశన్ రాసుకొచ్చారు.

(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోల పెళ్లి వార్తలు.. ఇద్దరూ నవంబరులోనే!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement