breaking news
Nivin Pauly
-
ఓటీటీకి మలయాళ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీల్లో మలయాళ చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఉంటోంది. ఇటీవలే ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ మూవీ సర్వం మాయ అభిమానుల ఆదరణ దక్కించుకుంటోంది. దీంతో మలయాళ చిత్రాల కోసం ఓటీటీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. ఇక క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నేపథ్యంలో మరో మలయాళ థ్రిల్లర్ మూవీ అభిమానులను అలరించేందుకు వచ్చేస్తోంది. ఇంతకీ ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.నివిన్ పౌలీ హీరోగా నటించిన చిత్రం బేబీ గర్ల్. ఈ సినిమా థియేటర్లలో రిలీజై మలయాళ ఫ్యాన్స్‌ను అలరించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ మూవీ ఫిబ్రవరి 12 నుంచి సోనీ లివ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ఈ మూవీ ట్రైలర్‌ను కూడా విడుదల చేసింది. ఈ చిత్రానికి అరుణ్ వర్మ దర్శకత్వం వహించారు. కాహా.. ఆస్పత్రి నుంచి ఓ చిన్నారి ఎలా అదృశ్యమైందన్న పాయింట్‌తో ఈ సినిమా రూపొందించారు. ఈ మూవీలో లిజోమోల్, సంగీత్ ప్రతాప్ ప్రధాన పాత్రలు పోషించారు. A missing baby girl. An attendant on the run. A truth darker than the crime.Nivin Pauly, Lijomol, and Sangeeth Pratap headline this high-tension thriller.Watch #BabyGirl, streaming from 12th February, only on Sony LIV.@NivinOfficial pic.twitter.com/WnyS2vnXHG— Sony LIV (@SonyLIV) February 5, 2026 -
ఈ దెయ్యంతో ఇట్టే ప్రేమలో పడతారు
జాగ్రత్త... ఈ సినిమాలో దెయ్యం ఉంది, ఇదో హారర్ సినిమా. అయినా కంగారుపడకుండా సరదాగా సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా సర్వం మాయ. హారర్ సినిమా అంటే దెయ్యం, అస్థిపంజరం, స్మశానం... ఇవే ఇప్పటి ప్రేక్షకులకు గుర్తుకు వచ్చే తరుణంలో దర్శకుడు అఖిల్ సత్యన్ ఓ మాయ చేసి ఈ సర్వం మాయ హారర్ సినిమాలోని దెయ్యాన్ని చూసే ప్రేక్షకులు కూడా ఇష్టపడేట్టు చేశాడు. నిజానికి ఇది ఓ గొప్ప ప్రయోగమనే చెప్పాలి. ఆ ప్రయోగంలో దర్శకుడు పూర్తిగా విజయం సాధించాడు. అంతలా ఏముందో ఈ సినిమాలో ఓ సారి చూద్దాం. సర్వం మాయ (Sarvam Maya movie) ఓ మళయాళ సినిమా. ఈ సినిమాలో కథానాయకుడైన ప్రబేందు స్వతహాగా నాస్తికడైనా కుల వృత్తి ప్రకారం అర్చకాలు, పూజా పునస్కారాలు చేస్తూ ఉంటాడు. అంతేకాదు ప్రబేందు మంచి గిటారిస్టు కూడా. ప్రబేందు తన బంధువైన రూపేష్ బలవంతం చేయడంతో అనుకోకుండా ఓ రోజు దెయ్యం వదిలించే పూజను ఒప్పుకుంటాడు. ఆ పూజలో తాను వదిలించిన దెయ్యం తననే పట్టుకుంటుంది. ఇక అక్కడ నుండి కథ రసరంజకంగా సాగుతుంది. దెయ్యం అంటే ఆషామాషి దెయ్యం కాదు. ఆ దెయ్యాన్ని చూస్తే ప్రేక్షకులు కూడా తమకూ అలాంటి దెయ్యం కనిపిస్తే బాగుండునని అనుకోక మానరు. అన్నట్టు ఆ దెయ్యానికి ఓ పేరు కూడా ఉంటుంది అదే డెలలూ. ఈ కథలో ప్రబేందును కలిసిన ఆ డెలలూ చేసే అల్లరి, చిలిపితనం ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ డెలలూ తాను ఎవరినో, ఎందుకు చనిపోయి దెయ్యం అయిందో అన్న సమాధానం కోసం వెతుకుతూ ప్రబేందుని పట్టుకుంటుంది. మరి ఆ డెలలూ ఆచూకీ కనిపెట్టడంలో ప్రబేందు డెలలూకి సాయపడతాడా, అలాగే ఆ డెలలూ వల్ల ప్రబేందుకి కలిగిన ఇబ్బందులు ఏంటి అనేవి మాత్రం హాట్ స్టార్ వేదికగా తెలుగులోనూ స్ట్రీమ్ అవుతున్న సర్వం మాయ చూడాల్సిందే. ఈ సినిమా కాస్త నెమ్మదిగా ప్రారంభమైనా దెయ్యం వచ్చినప్పటి నుండి మహా సరదాగా సాగిపోతుంది. కాకపోతే క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ప్రేక్షకులను కాస్త కన్ఫ్యూజన్లో పడేస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఈ సినిమా మొత్తం డెలలూ కోసం ఓసారి చూడాల్సిందే. ఇంకెందుకాలస్యం వీకెండ్ హాట్ స్టార్ ట్యూన్ చేసి డెలలూతో జత కట్టండి. -
మలయాళ హారర్ కామెడీ సినిమా.. 'సర్వం మాయ' రివ్యూ (ఓటీటీ)
రీసెంట్ టైంలో మలయాళంలో సెన్సేషన్ సృష్టించిన సినిమా 'సర్వం మాయ'. హీరో నివీన్ పౌలీ.. దాదాపు పదేళ్ల తర్వాత ఈ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చాడు. హిట్ కొట్టాడు. హారర్ కామెడీ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. రూ.30 కోట్ల బడ్జెట్ పెడితే రూ.150 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఇప్పుడీ చిత్రం హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో చూద్దాం.(ఇదీ చదవండి: ఓటీటీలోకి ప్రభాస్ 'రాజాసాబ్'.. అధికారిక ప్రకటన)కథేంటి?ప్రభేందు(నివీన్ పౌలీ) బ్రహ్మణ కుర్రాడే కానీ దేవుడిని నమ్మడు. తండ్రి, అన్నలా పౌరోహిత్యం చేయడు. మంచి గిటారిస్ట్ అవ్వాలనేది గోల్. ఆ ప్రయత్నాల్లో ఉంటూ స్టేజీ షోలు చేస్తుంటాడు. అనుకోని కారణాల వల్ల సొంతూరికి వస్తాడు. ఖాళీగా ఉండటం ఎందుకని డబ్బుల కోసం బావ రూపేష్(అజు వర్గీస్)తో కలిసి పూజలు, హోమాలు చేస్తుంటాడు. ఓసారి ఒకరి ఇంట్లో పిల్లాడికి పట్టిన దెయ్యాన్నివదిలిస్తాడు. తర్వాత నుంచి ఆ ఆడ దెయ్యం(రియా షిబు).. ప్రభేందు వెంటపడుతుంది. ఇతడికి మాత్రమే కనిపిస్తూ, ఇతడితోనే మాట్లాడుతూ ఉంటుంది. సదరు దెయ్యానికి.. తాను ఎవరు? ఎలా చనిపోయాననే విషయాలేం గుర్తుండవు. దీంతో ఆ దెయ్యానికి డెలులు అని పేరు పెడతాడు. మరి డెలులు వల్ల ప్రభేందు జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి? డెలులు గతమేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?మలయాళ సినిమాల్లో పెద్దగా కథేం ఉండదు. సింపుల్ ఎమోషన్స్, సున్నితమైన కామెడీతోనే అంతా నడిపించేస్తుంటారు. ఇది అలాంటి ఓ స్టోరీనే. సాధారణంగా దెయ్యాల్ని చూసి మనుషులు భయపడతారు కానీ ఇందులో దెయ్యమే.. మనుషుల్ని చూసి భయపడుతుంది. గతం మర్చిపోవడం వల్ల పేరు సహా ఏదీ గుర్తుండదు. ఎలాంటి పవర్స్ కూడా ఉండవు. హీరో కూడా అంతే. ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటాడు. అలాంటి వీళ్లిద్దరూ ఒకరికి ఒకరు ఎలా సాయం చేసుకున్నారు. ప్రభేందు తన భయాన్ని ఎలా అధిగమించాడు. డెలులు చివరకు ముక్తి పొందిందా లేదా అనేది మెయిన్ ప్లాట్.హారర్ కామెడీ సినిమానే అయినప్పటికీ ఎక్కడా భయపెట్టే సీన్స్ ఉండవు. బదులుగా ఆడ దెయ్యంతో ప్రేమలో పడతాం. ప్రేమ, బంధం, నమ్మకం లాంటి విషయాల గురించి పలు పాత్రలతో చెప్పించిన డైలాగ్స్, ఆయా సీన్స్ చాలామందికి కనెక్ట్ అవుతాయి. మూవీ చూస్తున్నంతసేపు చాలా హాయిగా ఉంటుంది. ఫస్టాప్ చకచకా సాగిపోతుంది. సెకండాఫ్ మాత్రం అక్కడక్కడే తిరిగినట్లు కాస్త సాగదీతగా అనిపిస్తుంది. కాకపోతే డెలులు దెయ్యం ఉన్న ప్రతి సీన్ క్యూట్ అండ్ స్వీట్‌గా భలే అనిపిస్తుంది. క్లైమాక్స్‌లో వచ్చే దెయ్యం ఫ్లాష్‌బ్యాక్ కూడా రొటీన్‌కి భిన్నంగానే ఉంటుంది. కాకపోతే ఇంత సింపుల్‌గా తేల్చేశారేంటా అనిపిస్తుంది.ప్రభేందుతో పాటు ట్రావెల్ అయ్యే డెలులు దెయ్యం.. చివరకు అతడితోనే ప్రేమలో పడటం, అదే టైంలో ప్రభేందు.. సాధ్య అనే అమ్మాయిని ప్రేమించడం. తద్వారా ప్రభేందు-డెలులు మధ్య గొడవ జరగడం.. ఈ క్రమంలో డెలులు గతం గుర్తొచ్చే సీన్స్ బాగుంటాయి. డెలులు నిజ జీవితంలోనూ ప్రభేందునే ప్రేమించిందా? అనే ప్రశ్నతో సినిమాని ముగించడం ఆసక్తికరంగా అనిపిస్తుంది.ప్రభేందుగా చేసిన నివీన్ పౌలీ సెటిల్డ్ ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడు. డెలులు దెయ్యంగా చేసిన రియా షిబు అయితే ప్రతిఒక్కరి ఫేవరెట్ అయిపోతుంది. అంత క్యూట్ యాక్టింగ్‌తో మెస్మరైజ్ చేసేసింది. మిగతా యాక్టర్స్ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఏ ఒక్క క్యారెక్టర్ అనవసరంగా ఉందే అని ఎక్కడా అనిపించదు. చివరకు కుక్కని కూడా కథలో భాగం చేసిన తీరు అలరిస్తుంది. టెక్నికల్ విషయాలకొస్తే.. తెలుగు డబ్బింగ్ బాగున్నప్పటికీ పాటలకు రాసిన తెలుగు లిరిక్స్ అస్సలు సూట్ కాలేదు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్లు ఉంది. సినిమాటోగ్రాఫీ కూడా చూడముచ్చటగా ఉంది. కేరళ అందాలని బాగా క్యాప్చర్ చేశారు. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి.దెయ్యం లేదా హారర్ సినిమాలు చూడాలంటే మీకు చచ్చేంత భయమా? అయినా పర్లేదు. ఎలాంటి భయం లేకుండా మీరు ఈ మూవీ చూసేయొచ్చు. చూస్తున్నంతసేపు దెయ్యమేంటి ఇంత అందంగా ఉంది? ఇలాంటిది మన జీవితంలోకి ఎందుకు ఎప్పుడూ రాలేదు? అని ఒక్కసారైనా అనిపిస్తుంది. ఈ వీకెండ్ ఏదైనా మంచి సినిమా చూద్దామనుకుంటే మాత్రం 'సర్వం మాయ' బెస్ట్ ఆప్షన్. కుటుంబంతోనూ కలిసి హాయిగా చూడొచ్చు.- చందు డొంకాన(ఇదీ చదవండి: 'ఓం శాంతి శాంతి శాంతిః' రివ్యూ.. మధ్యతరగతి ఆడపిల్ల జీవితం) -
ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్
'ప్రేమమ్' అనే మలయాళ సినిమాతో తెలుగులోనూ కాస్తంత ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరో నివీన్ పౌలీ. ఈ చిత్రం తర్వాత యాక్టింగ్ అయితే చేస్తున్నాడు గానీ సరైన హిట్ దొరకలేదు. దాదాపు పదేళ్ల తర్వాత 'సర్వం మాయ'తో అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ఈ హిట్ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.(ఇదీ చదవండి: శోభిత 'చీకటిలో' సినిమా రివ్యూ)నివీన్ పౌలీ, రియా షిబు, అజు వర్గీస్, ప్రీతి ముకుందన్ తదితరుల ప్రధాన పాత్రల్లో నటించిన 'సర్వం మాయ'.. గత నెల 25న థియేటర్లలో రిలీజైంది. పాజిటివ్ టాక్‌తో తెలుగు మూవీ లవర్స్ మధ్య చర్చకు కారణమైంది. దీంతో ఇదెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూశారు. ఇప్పుడు స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈనెల 30 నుంచి జియో హాట్‌స్టార్‌లో మూవీ అందుబాటులోకి రానుంది. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీలోనూ స్ట్రీమింగ్ కానుంది.'సర్వం మాయ' విషయానికొస్తే.. ఇదో అందమైన దెయ్యం కథ. ఇది మిమ్మల్ని భయపెట్టదు, నవ్విస్తుంది. చివరకు కంటతడి పెట్టిస్తుంది. ప్రభేందు (నివీన్ పౌలీ) ఓ గిటారిస్ట్. ఇతడి తండ్రి, అన్నయ్య పురోహితులు. కుటుంబం పౌరోహిత్యం చేస్తున్నప్పటికీ ప్రభేందుకి వీటిపై, దేవుడిపై పెద్దగా నమ్మకముండదు. అలాంటి ఇతడి జీవితంలోకి డెలులూ (రియా షిబు) అనే ఓ టీనేజ్ దెయ్యం వస్తుంది. ఈమె రాకతో ప్రభేందు జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి. గతం మర్చిపోయిన ఈ క్యూట్ దెయ్యం.. చివరకు ఎలా ముక్తి పొందింది అనేది స్టోరీ. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మాత్రం అస్సలు మిస్ కావొద్దు.(ఇదీ చదవండి: మమ్ముట్టి 'పాదయాత్ర'.. అధికారిక ప్రకటన)Malayalam film #SarvamMaya (2025) by #AkhilSathyan, premieres Jan 30th on @JioHotstar.@NivinOfficial #RiyaShibu @AjuVarghesee #PrietyMukundhan #Janardhanan #RaghunathPaleri #Vineeth #MadhuWariar @justin_tunes #FireflyFilms @APIfilms pic.twitter.com/lw5HDIBQp2— CinemaRare (@CinemaRareIN) January 23, 2026 -
ప్రేమమ్ హీరో సినిమా.. పది రోజుల్లోనే వంద కోట్లు..!
మలయాళ సినిమా 'ప్రేమమ్' హీరో నివిన్ పౌలీ నటించిన తాజా చిత్రం 'సర్వం మాయ'.. క్రిస్మస్ స్పెషల్‌గా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దర్శకుడు అఖిల్ సత్యన్ తెరకెక్కించిన ఈ మూవీలో నివిన్ పౌలీ, రియా శిబు, ప్రీతి ముకుందన్, అజు వర్గీస్, జనార్దనన్, అల్తాఫ్ సలీం నటించారు.తాజాగా ఈ చిత్రం వసూళ్ల పరంగా వందకోట్ల మార్క్ చేరుకుంది. రిలీజైన పది రోజుల్లోనే ఈ ఘనత సాధించింది. రొమాంటిక్ కామెడీగా వచ్చిన ఈ సినిమా మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. కాగా.. మలయాళంలో 2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కొత్త లోకా టాప్ ప్లేస్‌లో ఉంది. సర్వం మాయ మూవీ ఇదే జోరు కొనసాగిస్తే మరిన్ని రికార్డ్స్ బద్దలు కొట్టే అవకాశముంది. BIGGEST EVER COMEBACK IN MOLLYWOOD 🏆🏆🏆🏆#SarvamMaya 100 Crores + Worldwide Gross Done & Dusted in 10 Days 🔥🔥 First #NivinPauly Movie to Gross 100 Cr 👏👏 Just a Feel Good Family Movie 💥 When He is in his safe zone then no one can even touch him once again Proved 🔥🔥🔥🔥 pic.twitter.com/1T0i530cs3— Kerala Box Office (@KeralaBxOffce) January 3, 2026 100 CRORES CLUB :#SarvamMaya enters 100 Crores Club Worldwide in 10 days . Truly , A Dream Comeback For #NivinPauly 🔥 pic.twitter.com/BUsNtMwfJO— Friday Matinee (@VRFridayMatinee) January 3, 2026 -
పదేళ్ల తర్వాత స్టార్‌హీరోకు భారీ హిట్.. ఊహించని రేంజ్లో కలెక్షన్స్
మలయాళ సినిమా 'ప్రేమమ్' ఫేమ్ నివిన్ పౌలీ నటించిన తాజా చిత్రం 'సర్వం మాయ'.. క్రిస్మస్ స్పెషల్‌గా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. మలయాళం భారీ కలెక్షన్స్ వైపు దూసుకుపోతుంది. ఏకంగా పదేళ్ల తర్వాత నటుడు నివిన్ పౌలీకి భారీ హిట్ దక్కింది. దర్శకుడు అఖిల్ సత్యన్ తెరకెక్కించిన ఈ మూవీలో నివిన్ పౌలీ, రియా శిబు, ప్రీతి ముకుందన్, అజు వర్గీస్, జనార్దనన్, అల్తాఫ్ సలీం నటించారు. ఓటీటీ సమయంలో తెలుగులో కూడా ఈ చిత్రం విడుదలయ్యే ఛాన్స్ ఉంది.ఈ ఏడాదిలో కొత్త లోక చిత్రం మలయాళం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 300 కోట్ల గ్రాస్ దాటింది. 2025 సినిమా కలెక్షన్స్ లిస్ట్‌లో టాప్‌లో ఈ చిత్రం ఉంది. అయితే, ఏడాది ముగింపులో విడుదలైన సర్వం మాయ సినిమా కూడా ఇప్పడు జోరు చూపుతుంది. ప్రస్తుతం ఈ మూవీ రూ. 76 కోట్ల గ్రాస్ రాబట్టింది. అయితే, సులువుగా రూ. 150 కోట్ల వరకు రాబట్టవచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి.‘సర్వం మాయ’ కథ రొమాంటిక్ కామెడీ-డ్రామాకు కాస్త హారర్ జోడించడం ఆపై ఫాంటసీని కూడా కలపడంతో ప్రేక్షకులను మెప్పించింది. ఈ మూవీ విజయంలో నివిన్ పాలీ నటన కీలకమైతే.. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన రియా శిబూ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఆకర్షించింది. ఇందులో ఆమె నటనపై రివ్యూవర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రియా శిబూకి సినీ రంగంతో బలమైన అనుబంధం ఉంది. ఆమె నిర్మాతగా కూడా రాణిస్తుంది. గతంలో హీరోయిన్గా మెప్పించిన రియా ఇప్పుడు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌గా రాణిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వీర ధీర శూరన్ చిత్రాన్ని నిర్మించిన రియా కోలీవుడ్‌లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పంపిణీ చేసింది. -
బాక్సాఫీస్ రిపోర్టు బయటపెట్టడం అవసరమా?: హీరో
కేరళ చిత్ర నిర్మాతల మండలి ఇటీవలే మలయాళ సినిమా 2025 బాక్సాఫీస్ రిపోర్టును విడుదల చేసింది. ఈ ఏడాది ఇప్పటివరకు 184 చిత్రాలు రిలీజైతే వాటిలో కేవలం 15 మాత్రమే హిట్టయ్యాయని తెలిపింది. లోక, ఎల్2: ఎంపురాన్, తుడరుమ్, కలంకావల్, డియస్ ఈరే, హృదయపూర్వం, అలప్పుజ జింఖానా, రేఖాచిత్రం, ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమాలను సూపర్‌హిట్‌గా అభివర్ణించారు. అవి మాత్రమే హిట్ఎకో, పెట్ డిటెక్టివ్, ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ, పోన్మాన్, పడక్కాలం, బ్రొమాన్స్ సినిమాలను హిట్లుగా పేర్కొన్నారు. 2024లో 10.633% సక్సెస్ రేషియో ఉంటే ఈసారి అది 8.15%కే పరిమితమైందని వెల్లడించారు. అయితే ఈ నివేదికపై పలువురు దర్శకనిర్మాతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సుమతి వలవు, నరివెట్ట వంటి సినిమాలు ఈ జాబితాలో ఎందుకు లేవని నిలదీస్తున్నారు. అవెందుకు లేవు?నరివెట్ట దర్శకుడు అనురాజ్ మనోహర్ మాట్లాడుతూ.. మా సినిమా విజయం సాధించింది.. కానీ దాన్ని ఎందుకు లిస్టులో చేర్చలేదు? ఏ ప్రాతిపదికన ఈ జాబితా తయారు చేశారు? అని మండిపడ్డాడు. తాజాగా హీరో నివీన్ పౌలీ సైతం ఈ రిపోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈయన హీరోగా నటించిన సర్వం మాయ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తోంది. అవసరమా?ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ భేటీకి హాజరయ్యాడు నివిన్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి బిజినెస్‌లో ఒడిదుడుకులు సహజం. లాభనష్టాలు వస్తుంటాయి. అంతమాత్రానికి (Kerala Film Producer Association) ఇలా బాక్సాఫీస్ రిపోర్టును బయటపెట్టాల్సిన అవసరం ఏముంది? దీనివల్ల సినిమాను నమ్ముకునేవాళ్లను నిరాశపర్చినట్లు అవుతుంది. గతంలో ఈ ధోరణి లేదు అని అసహనం వ్యక్తం చేశాడు. -
మెడికో థ్రిల్లర్ సిరీస్.. 'ఫార్మా' రివ్యూ
ప్రతి రంగంలోనూ లోటుపాట్లు ఉంటాయి. వైద్యరంగంలోనూ బయటకు కనిపించనవి చాలానే జరుగుతుంటాయి. అప్పుడప్పుడు ఇలాంటి అంశాల్ని పలు సినిమాల్లో చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మెడికల్ రంగంలో జరిగే మాఫియాపై ఓ థ్రిల్లర్ డ్రామా సిరీస్ తీశారు. అదే 'ఫార్మా'. మలయాళ హీరో నివిన్ పౌలీ లీడ్ రోల్ చేశాడు. ఇప్పుడిది హాట్స్టార్లోకి వచ్చేసింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలా ఉందనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?కేపీ వినోద్(నివిన్ పౌలీ).. ఓ ఫార్మా కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్. ప్రారంభంలో ఇబ్బందిపడినా తర్వాత కుదురుకుంటాడు. పనితనం చూపిస్తాడు. ఈ ఫార్మా కంపెనీ.. గర్బిణిల కోసం కైడాక్సిన్ అనే మందు కనిపెడుతుంది. దీని సేల్స్ పెంచడంలో వినోద్ కీలక పాత్ర పోషిస్తాడు. కానీ ఈ మందు వల్ల పుట్టిన పిల్లలందరూ మధుమేహం (షుగర్) బారిన పడ్డారని డాక్టర్ శైలజ(శ్రుతి రామచంద్రన్)కి తెలుస్తుంది. ఇదే విషయం వినోద్‌కి చెబుతుంది. దీంతో ఉద్యోగం చేసిన కంపెనీపైనే న్యాయపోరాటానికి దిగుతాడు. ఈ ప్రయాణంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? డాక్టర్ రాజీవ్ రావు(రజత్ కపూర్).. వినోద్‌కి ఎలాంటి సాయం చేశారనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?ఇదో కల్పిత కథతో తీసిన సిరీస్. చూస్తున్నంతసేపు బయట హాస్పిటల్స్‌లోనూ ఇలానే జరుగుతుందా అనే సందేహం, మరోవైపు చిన్నపాటి భయం వేస్తుంది. మెడికల్ ఫీల్డ్ గురించి తెలుసుకోవాలనే కుతూహలం ఉంటే ఈ సిరీస్ అస్సలు మిస్ కావొద్దు. ఎందుకంటే అలా ఉంది మరి. స్టోరీ కోసం ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. దాన్ని డీల్ చేయడంలో అక్కడక్కడ తడబాటు కనిపిస్తుంది. అయితేనేం ఇలాంటి స్టోరీలు అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.కొందరు వ్యక్తులు టక్, షూ వేసుకుని భుజానికి బ్యాగ్ తగిలించుకుని హాస్పిటల్స్‌లో అప్పుడప్పుడు కనిపించడం మీరు చూసే ఉంటారు. వీళ్లని మెడికల్ రిప్రజెంటేటివ్స్ అంటారు. వీళ్ల చేసే పని ఏంటంటే.. ఫార్మా కంపెనీ తయారు చేసిన మందులు, మెడికల్ పరికరాలని ప్రతి ఊరిలో ఉండే డాక్టర్లు, ఆసుపత్రులు, ఫార్మాసిస్ట్‌లకు పరిచయం చేసి అమ్మడం. అసలు వీళ్లు ఎలా పనిచేస్తారు? ఎంతలా కష్టపడతారు? టార్గెట్స్ పేరు చెప్పి వీళ్లతో కంపెనీ ఎలాంటి పనులు చేయిస్తాయి? లాంటి విషయాల్ని ఈ సిరీస్‌లోని కేపీ వినోద్ పాత్రతో చాలా చక్కగా చూపించారు.కొన్ని ఫార్మా కంపెనీలు.. బిజినెస్సే ముఖ్యమనుకుని ప్రజల ప్రాణాలతో ఎలా చెలాగాటం ఆడుతున్నాయి? ఆయా సంస్థల నుంచి వచ్చే మెడిసన్ వల్ల భవిష్యత్తు తరాలపై ఎలాంటి ప్రభావం పడుతోంది. ఎంతో ప్రమాదకరమైన మందులు.. ప్రజల్లోకి ఎంత తేలికగా వచ్చేస్తున్నాయనే అంశాలని ఈ సిరీస్‌లో పూసగుచ్చినట్లు చూపించే ప్రయత్నం చేశారు. అదే టైంలో డబ్బు ముఖ్యమని అనుకుని ప్రజల జీవితాలతో ఆడుకుంటే ఎవరికైనా సరే దేవుడు కచ్చితంగా శిక్ష విధిస్తాడు అనే విషయాల్ని కూడా ఈ సిరీస్‌లో చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.కేపీ వినోద్ పాత్రలో నివిన్ పౌలీ సెటిల్డ్‌గా చేశాడు. మలయాళంలో ప్రముఖ హీరో అయినప్పటికీ.. ఈ సిరీస్‌లో చాలా సాధారణంగా కనిపిస్తాడు. కథకి తగ్గట్లే ఎలాంటి హంగులు ఆర్భాటాలు ఈ పాత్రకు ఉండవు. లేడీ డాక్టర్ శైలజగా చేసిన శ్రుతి రామచంద్రన్, సీనియర్ డాక్టర్ రాజీవ్ రావు పాత్రలో రజత్ కపూర్ కూడా అదరగొట్టేశారు. మిగిలిన పాత్రధారులు కూడా స్టోరీకి తగ్గట్లు జీవించేశారు. సిరీస్ చూస్తున్నంతసేపు మనం కూడా కథతో పాటే వెళ్తాం. అలా చూపించారు. టెక్నికల్ అంశాలు కూడా అన్ని సెట్ అయ్యాయి.దర్శకుడు పీఆర్ అరుణ్.. ఈ సిరీస్ కోసం చాలానే రీసెర్చ్ చేశాడని అనిపిస్తుంది. కాకపోతే రెగ్యులర్ డ్రామాని చూపించినప్పుడు బోర్ కొట్టినట్లు అనిపిస్తుంది. ఒకటిరెండు సీన్స్ తప్పితే ఓవరాల్‌గా సిరీస్ బాగుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. 8 ఎపిసోడ్లుగా దీన్ని తీశారు. కానీ మొత్తం రన్ టైమ్ 3 గంటల 16 నిమిషాలే. ఈ వీకెండ్ ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ చూద్దామనుకుంటే మాత్రం దీన్ని ట్రై చేయండి.- చందు డొంకాన -
మెడికల్ మాఫియాపై ఓటీటీ సిరీస్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
వైద్య రంగంలో చాలా అవకతవకలు జరుగుతుంటాయి. వాటిపై ఇప్పటికే పలు సినిమాలు వచ్చాయి. అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌పై ఓ వెబ్ సిరీస్ తీశారు. అదే 'ఫార్మా'. మలయాళ స్టార్ హీరో నివిన్ పౌలీ.. లీడ్ రోల్ చేశాడు. ఇతడు 'ప్రేమమ్' హీరోగా దక్షిణాది ప్రేక్షకులకు పరిచయమే. ఈ సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్కి సిద్ధమైంది. ఈ మేరకు ట్రైలర్ రిలీజ్ చేయగా అది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: నేరుగా ఓటీటీలోకి తెలుగు థ్రిల్లర్ సినిమా)నివిన్ పౌలీ, శ్రుతి రామచంద్రన్, రజిత్ కపూర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన 'ఫార్మా' వెబ్ సిరీస్.. వచ్చే శుక్రవారం (డిసెంబరు 19) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి రానుంది. పీఏ అరుణ్ ఈ సిరీస్‌కి దర్శకత్వం వహించారు.ట్రైలర్ బట్టి చూస్తే.. ఓ ఫార్మా కంపెనీలో కేపీ వినోద్(నివిన్ పౌలీ), మెడికల్ రిప్రెజెంటివ్‌గా చేరతాడు. ప్రారంభంలో సేల్స్ చేయలేకపోతాడు. టార్గెట్స్ అస్సలు సాధించలేకపోతాడు. దీంతో విమర్శలు, అవమానాలు ఎదుర్కొంటాడు. తర్వాత ఈ ఉద్యోగంలో నిలదొక్కుకుంటాడు. 'కైడోక్సిన్' అనే మెడిసన్ సేల్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటాడు. అయితే ఈ మందు ఎంత ప్రమాదం అనే విషయాన్ని తెలుసుకుంటాడు. దీంతో వినోద్.. అతడి సంస్థపై తిరగబడతాడు? తర్వతా ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. ఎలానూ తెలుగులోనూ స్ట్రీమింగ్కి రాబోతుంది కాబట్టి ఈ జానర్ ఆసక్తి ఉంటే ఓ లుక్కేయండి.(ఇదీ చదవండి: హోటల్ గదిలో నాకు దెయ్యం కనిపించింది: కృతి శెట్టి) -
లోకేష్ యూనివర్స్‌లోకి కొత్త విలన్.. 'రోలెక్స్' అంత లేదు గానీ
ప్రస్తుత తరంలో సినిమాటిక్ యూనివర్స్ అనగానే ముందుగా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గుర్తొస్తాడు. ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఈ తరహా యూనివర్స్ సృష్టించాడు. ఇందులో భాగంగా త్వరలో ఖైదీ 2, రోలెక్స్, విక్రమ్ 2 సినిమాలు రాబోతున్నాయని స్వయంగా లోకేశ్.. పలు ఇంటర్వ్యూల్లో చెబుతూనే ఉన్నాడు. ఇప్పుడు లోకేష్ యూనివర్స్‌లోకి కొత్త విలన్ వచ్చిచేరాడు.లోకేశ్ దర్శకుడిగా ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు పలు చిత్రాలకు కథలు అందిస్తూ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. అలాంటి ఓ మూవీనే 'బెంజ్'. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ వయలెంట్ యాక్షన్ మూవీలో ఇప్పుడు మలయాళ నటుడు నివిన్ పౌలీ విలన్‌గా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అతడి పాత్ర ప్రోమో వీడియోని రిలీజ్ చేశారు.(ఇదీ చదవండి: రామ్ చరణ్ అత్తకు ఇంత టాలెంట్ ఉందా?) 'విక్రమ్' మూవీ చివర్లో వచ్చే రోలెక్స్ పాత్రని స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో గానీ.. 'బెంజ్' విలన్ చూస్తుంటే సూర్యనే గుర్తొచ్చాడు. ఒళ్లంతా బంగారు చైన్స్, వాచ్, చివరకు బంగారు పళ్లతో నివిన్ పౌలీ కనిపించిన విధానం.. చివర్లో తన పేరు వాల్టర్ అని చెప్పడం ఇదంతా కూడా రోలెక్స్ పాత్రనే ఫాలో అయిపోయినట్లు అనిపించింది. ఇందులో వాల్టర్ అనే విలన్‌గా నివిన్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ వీడియోలోనే.. ఈ సినిమా లోకేశ్ యూనివర్స్‌లో భాగమని క్లారిటీ ఇచ్చారు. మరి ఏ సినిమాలో ఈ పాత్రని లింక్ చేస్తారో చూడాలి?బెంజ్ సినిమాకు భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు కాగా.. యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన వీడియోకు కూడా డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చి ఆకట్టుకున్నాడు. విలన్‌గా చేస్తున్న నివిన్ పౌలీ విషయానికొస్తే.. మలయాళంలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సాయిపల్లవికి ఎంతో పేరు తెచ్చిన 'ప్రేమమ్'లో హీరో ఇతడే. మరి ఇప్పుడు విలన్‌గా ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి?(ఇదీ చదవండి: తెలుగు డైరెక్టర్.. నా థైస్ కొలతలు అడిగాడు: మౌనీషా చౌదరి) -
ప్రేమమ్ నటుడిపై లైంగిక వేధింపుల కేసు.. పోలీసులు ఏం తేల్చారంటే?
ప్రముఖ మలయాళ నటుడు నివిన్ పౌలీపై గతంలోనే లైంగిక వేధింపుల కేసు నమోదైన సంగతి తెలిసిందే. సినిమాల్లో అవకాశం పేరుతో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ యువ నటి ఫిర్యాదు చేసింది. దుబాయ్‌లో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని పలువురిపై యువతి ఆరోపణలు చేసింది. దీంతో అప్పట్లోనే నివిన్ పౌలీతో సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. జస్టిస్ హేమ కమిటీ నివేదిక బహిర్గతమయ్యాక పలువురు నటులపై పెద్దఎత్తున ఫిర్యాదులు వచ్చాయి.అయితే ఆ తర్వాత జరిగిన విచారణలో నటుడు నివిన్ పౌలీకి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. తాజాగా ఈ కేసులో నివిన్ పౌలీకి పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. యువతి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సంఘటన జరిగిన సమయంలో నివిన్ పౌలీ అక్కడ లేరని గుర్తించినట్లు తెలిపారు. అతను లైంగికంగా వేధించినట్లు స్పష్టమైన ఆధారాలు తమకు లభించలేదని కొత్తమంగళం కోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించారు. దీంతో ఆరో నిందితుడిగా ఉన్న ఆయన పేరును తొలగించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. అయితే మిగిలిన నిందితుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతుందని పేర్కొన్నారు. కాగా.. నివిన్ పౌలీ మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన ప్రేమమ్ చిత్రంలో నటించారు. -
నివిన్‌పై ఆరోపణలు అవాస్తవం
సినిమా అవకాశం ఇప్పిస్తానంటూ దుబాయ్‌లో తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఓ ఆరుగురి గురించి ఇటీవల ఒక మహిళ ఫిర్యాదు చేశారు. ఆ ఆరుగురిలో మలయాళ నటుడు నివిన్ పౌలీ ఒకరు. అయితే ఏ తేదీల్లో (గత డిసెంబరు 14 నుంచి 16) అయితే తనతో నివిన్ అభ్యంతరకరంగా ప్రవర్తించారని ఆ మహిళ పేర్కొన్నారో అదే తేదీల్లో ఆయన ‘వర్షంగళుక్కు శేషమ్’ అనే మలయాళ సినిమా షూట్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ చిత్రంలో నటించినపార్వతీ ఆర్. కృష్ణ తెలిపారు. అలాగే ఈ చిత్రదర్శకుడు వినీత్ శ్రీనివాసన్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. నివిన్‌పై ఆరోపణలు అవాస్తవం అంటున్నారు ఈ ఇద్దరూ. ‘‘ఆ మహిళ చెప్పిన తేదీలో కేరళలోని కొచ్చిలో ‘వర్షంగళుక్కు శేషమ్’ షూటింగ్లో ఉన్నారు నివిన్. అక్కడి న్యూక్లియస్ మాల్ లోపల, బయట కూడా చిత్రీకరణ జరిపాం. అలాగే మా సినిమా షూటింగ్ ముగించుకుని ‘ఫార్మా’ అనే వెబ్ సిరీస్ షూట్‌కి వెళ్లారు. ఇక నివిన్ మా టీమ్‌తోనే ఉన్నారనడానికి సీసీటీవీ ఫుటేజ్, మా యూనిట్లోనిపార్వతీ ఆర్. కృష్ణ, ఆర్ట్ డైరెక్టర్ సాబూ రామ్, మా నిర్మాత విశాఖ్ సుబ్రమణియం తదితరులు సాక్ష్యం’’ అని పేర్కొన్నారు వినీత్ శ్రీనివాసన్. ‘‘వర్షంగళుక్కు శేషమ్’లో నేనో చిన్నపాత్ర చేశాను. డిసెంబర్ 14న మా షూటింగ్‌కి సంబంధించిన వీడియో చూపిస్తాను. ఆ రోజు నివిన్ కాంబినేషన్లో నేను కొన్ని సీన్స్‌లో నటించాను’’ అంటూ ఇన్‌స్టాలో వీడియోను షేర్ చేశారుపార్వతీ ఆర్. కృష్ణ. -
ప్రేమమ్ హీరో పై రేప్ కేసు నమోదు..
-
మరో స్టార్ హీరోపై లైంగిక ఆరోపణలు.. ఏమని స్పందించాడంటే?
హేమ కమిటీ.. మలయాళ ఇండస్ట్రీని గత కొన్నిరోజులుగా ఇరుకున పడేసింది. పలువురు ప్రముఖ నటులుపై లైంగిక ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై యాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మోహన్ లాల్‌తో పాటు మిగతా సభ్యులు రాజీనామా చేయడం తదితర విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పుడు 'ప్రేమమ్' సినిమాతో తెలుగోళ్లకు కూడా తెలిసిన హీరో నివీన్ పౌలీపై ఓ నటి పోలీస్ కేసు పెట్టింది.(ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఆర్ భారీ సాయం)సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి గతేడాది నవంబరులో దుబాయి తీసుకెళ్లారట. అక్కడే లైంగికంగా వేధించారని సదరు నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రాథమిక విచారణ జరిపిన పోలీసులు.. హీరో నివిన్ పౌలీ సహా ఆరుగురిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. నిందితుల్లో ఓ నిర్మాత కూడా ఉన్నారు. ఈ జాబితాలో నివిన్ ఆరో వ్యక్తి. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్వయంగా నివిన్ స్పందించాడు. ఇవన్నీ నిరాధార ఆరోపణలని చెప్పుకొచ్చాడు.'ఓ అమ్మాయిని లైంగికంగా ఇబ్బంది పెట్టాననే వార్తలు విన్నాను. వాటిలో ఏ మాత్రం నిజం లేదు. నాపై వచ్చిన నిరాధార ఆరోపణల్ని ఖండిస్తున్నాను. అవన్నీ నిజం కాదు. ఈ విషయమై నేను న్యాయంగా పోరాడుతా' అని ఇన్ స్టాలో నివిన్ పౌలీ పోస్ట్ పెట్టారు. 'ప్రేమమ్' మూవీతో దక్షిణాదిలో గుర్తింపు తెచ్చుకున్న ఇతడు.. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు.(ఇదీ చదవండి: Bigg Boss 8: మొదటి వారం నామినేషన్లో ఉన్నది వీళ్లే!) View this post on Instagram A post shared by Nivin Pauly (@nivinpaulyactor) -
గ్రీన్‌సిగ్నల్
మలయాళ చిత్రం ‘డియర్ స్టూడెంట్స్’ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు నయనతార. మలయాళ నటుడు నివిన్ ΄పౌలి నటించనున్న చిత్రం ‘డియర్ స్టూడెంట్స్’. ఈ చిత్రంలో హీరోయిన్గా నటించనున్నారామె. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించి, ‘డియర్ స్టూడెంట్స్’ చిత్రంలో నయనతార నటిస్తున్నట్లు ఓ మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. సందీప్ కుమార్ అండ్ జార్జ్ ఫిలిప్ రాయ్ ద్వయం ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. నివిన్ ΄పౌలికి చెందిన ΄పౌలి జూనియర్ పిక్చర్స్, కర్మ మీడియా నెట్వర్క్ ఎల్ఎల్పీ, రౌడీ పిక్చర్స్ అండ్ అల్ట్రా కలిసి ‘డియర్ స్టూడెంట్స్’ చిత్రాన్ని నిర్మించనున్నాయి. -
అత్యాచార ఆరోపణలు, పోలీసుల అదుపులో దర్శకుడు
కేరళ: అత్యాచార ఆరోపణలతో మలయాళ డైరెక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నివిన్ పాలీ హీరోగా నటిస్తున్న 'పడవెట్టు' సినిమాకు లిజు కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలో చిత్రయూనిట్‌లోని ఓ యువతి డైరెక్టర్ తనను అత్యాచారం చేశాడంటూ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు లిజు కృష్ణను కస్టడీలోకి తీసుకున్నారు. ప్రస్తుతం కేరళలోని కన్నూర్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడి అరెస్ట్‌తో షూటింగ్ వాయిదా వేశారు. పడవెట్టు సినిమాకు లిజు కృష్ణనే స్వయంగా కథ రాశాడు. ఇందులో నవీన్ పాలీతో పాటు మంజు వారియర్, అదితి బాలన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షమ్మీ తిలకన్, షైన్ టామ్ చికో, ఇంద్రన్స్, సుదీష్, విజయరాఘవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పడవెట్టు గతంలో తీసిన మూమెంట్ జస్ట్ బిఫోర్ డెత్‌కు పని చేసిన సన్నీ వేన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. -
మలయాళం స్టార్‌తో దళపతి విజయ్ కుమారుడు.. ఫోటో వైరల్
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు దళపతి విజయ్. అందుకే ఆ నటించిన ప్రతి చిత్రం తెలుగులోను విడుదలవుతోంది. అయితే తాజాగా ఆయన కుమారుడు జాసన్ సంజయ్, మలయాళం స్టార్ నివిన్ పౌలితో తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మలయాళం ‘ప్రేమమ్’ స్టార్ నివిన్ అక్టోబర్ 11న బర్త్ డే జరుపుకున్నాడు. ఈ సందర్భంగా జాసన్ ఆయనతో తీసుకున్న ఫోటోని ట్విట్టర్లో పోస్ట్ చేసి విషెస్ చెప్పాడు. దీంతో ఆ పిక్ వైరల్‌గా మారింది. అయితే ఇంతకుముందు సైతం ఈ స్టార్కిడ్ స్నేహితులతో కలిసి కారులో పార్టీ చేసుకున్న వీడియో చర్చనీయాంశంగా మారింది. అయితే జాసన్ ఇప్పటికే తన తండ్రి చిత్రం వెట్టైకారన్ (2009)లో అతిధి పాత్రలో నటించి మెప్పించాడు. చదవండి: దళపతికి ఊరట.. ‘ విజయ్’ మక్కల్ ఇయక్కం రద్దు Happy birthday @NivinOfficial brother!! Wishing you a great day and a memorable year ahead!#HBDNivinPauly #HappyBirthdayNivinPauly pic.twitter.com/sx5vIsTM2p — Sanjay Vijay (@IamJasonSanjay) October 11, 2021 -
Club House Scam: టాప్ హీరోహీరోయిన్ల ఫేక్ ఫ్రొఫైల్స్
ఆడియోకు మాత్రమే అవకాశం ఉండే నెట్వర్కింగ్ యాప్ ‘క్లబ్ హౌస్’.. ఇప్పుడు సెలబ్రిటీలకు తలనొప్పిగా మారింది. ఎలాంటి ఇన్విటేషన్ లేకుండా ఆ యాప్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఈమధ్యే కల్పించారు. దీంతో సెలబ్రిటీల పేర్లతో ఫేక్ ఫ్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ఈ వ్యవహారంపై తమకేం సంబంధం లేదని హీరోహీరోయిన్లు వరుసగా స్టేట్మెంట్లు రిలీజ్ చేస్తున్నారు. ఈమధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ఆడియో యాప్ ‘క్లబ్‌హౌజ్’ సెలబ్రిటీలకు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఫేక్ ఫ్రొఫైల్స్‌తో నటీనటులు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యంగా మలయాళీ నటులు ఈ యాప్‌తో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. ఇదివరకే దుల్కర్ సల్మాన్, సీనియర్ హీరో సురేష్ గోపీ ఈ యాప్‌లో తమకు ప్రొఫైల్స్ లేవని స్పష్టం చేయగా, తాజాగా మరో యంగ్ స్టార్ నివీన్ పౌలీ స్పందించాడు. ‘‘హలో ఫ్రెండ్స్. నాకు క్లబ్‌హౌజ్‌లో ఎలాంటి అకౌంట్ లేదు. ఫేక్ ఫ్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి అకౌంట్ ఓపెన్ చేసినా.. ముందు మీకు చెప్తాను’’ అని క్లారిటీ ఇచ్చాడు. కాగా, సీనియర్ హీరో సురేష్ గోపీ, దుల్కర్ కూడా ఇది వరకు ఇదే విషయాన్ని ట్వీట్ల ద్వారా తెలియజేశారు. ఇక యంగ్ హీరోయిన్ రాధికా వేణుగోపాల్ సాధిక కూడా ఈ ఫేక్ స్కామ్‌పై రియాక్ట్ అయ్యింది. టోవినో థామస్, జోజు జార్జ్‌లతో పాటు తన పేరుతో ఉన్న ఫ్రొఫైల్స్ ‘ఫేక్’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఉంచింది. So, I am not on on Clubhouse. These accounts are not mine. Please don’t impersonate me on social media. Not Cool ! pic.twitter.com/kiKBAfWlCf — dulquer salmaan (@dulQuer) May 31, 2021 క్లబ్‌హౌజ్ ఏంటంటే.. ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం క్లబ్‌హౌజ్‌ను మనదేశంలో ఈ ఏప్రిల్‌లోనే లాంఛ్ చేశారు. ఇది రెగ్యులర్ ఫొటో, వీడియో షేర్ యాప్స్ల్లాగా కాదు. ఇందులో ఆడియో కన్వర్జేషన్ల ద్వారా అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చు. ఇందులో చేరాలనుకున్న వ్యక్తులకు ఇదివరకే సభ్యులైన వారినుంచి ఇన్విటేషన్ ఉండాలనే నిబంధన ఇంతకు ముందు ఉండేది. అయితే ఈ మధ్యే ఆ రూల్‌ను సవరించడంతో అడ్డగోలుగా జాయిన్ అవుతున్నారు. పలువురు సెలిబ్రిటీలు, ఇన్వెస్టర్లు, పొలిటీషియన్లు, ఎంట్రాప్రెన్యూర్లు దీన్ని ఉపయోగించడం వల్ల క్లబ్హౌజ్కి క్రేజ్ పెరుగుతోంది. ఇక ప్రముఖ నగరాల్లో ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న క్లబ్‌హౌజ్ ఆడియో కన్వర్జేషన్ యాప్.. కేరళలో మాత్రం ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారింది. ప్రత్యేకంగా ఆన్లైన్ రూమ్స్‌తో సినిమాలు, రాజకీయాలు.. ఇలా ప్రతీ టాపిక్‌పై మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఛాయ కడా(టీ కొట్టు) కి మంచి క్రేజ్ ఉంటోంది. ఈ తరుణంలోనే ఇలా హీరోహీరోయిన్ల పేర్లతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Sadhika Venugopal official (@radhika_venugopal_sadhika) -
సినీ పరిశ్రమలో విషాదం : క్రిస్మస్ స్టార్ కడుతూ
సాక్షి,కొచ్చి: ప్రముఖ మేకప్ మ్యాన్, మలయాళ హీరో నివిన్ పాలీ వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్ దుర్మరణం ఇండస్ట్రీలో విషాదాన్ని నింపింది. నివిన్ పర్సనల్ మేకప్‌మేన్ షాబు పుల్పల్లి (37) ప్రమాదవశాత్తూ ఆదివారం కన్నుముశారు. క్రిస్మస్ స్టార్‌ను వేలాడదీసేందుకు చెట్టు ఎక్కిన షాబు అకస్మాత్తుగా అదుపు తప్పి కిందపడిపోయారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించి నప్పటికీ షాబూని రక్షించలేకపోయామని ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఫెఫ్కా) డైరెక్టర్స్ యూనియన్ ఫేస్బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. షాబు అకాల మరణం తీరని లోటంటూ హీరో దుల్కర్ సల్మాన్ సంతాపం తెలిపారు. బెంగుళూరు డేస్ , విక్రమాదిత్యన్ మూవీల్లో ఆయనతో కలిసి పనిచేశానంటూ ఆయన జ్ఞాపకాలనుగుర్తుచేసుకున్నారు. ఇంకా నటుడు ఉన్ని ముకుందన్, దర్శకుడు బోబన్ శామ్యూల్ మలయాళ మూవీ అండ్ మ్యూజిక్ డేటాబేస్ (ఎం 3 డిబి) కూడా షాబూకి సంతాపాన్ని ప్రకటించాయి. వీరితోపాటు మలయాళ నటీ నటులు, ఇతర పరిశ్రమ పెద్దలు ఆయన మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కాగా 2012 లో ‘పుతియా తీరంగల్’ చిత్రంతో నివిన్పాలీతో షాబు జర్నీ ప్రారంభమైంది. పరిశ్రమలో తనదైన ముద్రతో మంచి పేరు సంపాదించుకున్నారు. షాబు ప్రసిద్ధ మేకప్ ఆర్టిస్ట్ షాజీ పుల్పల్లి సోదరుడు. షాబుకి భార్య,ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
ఇక సినీ వెల్లువ
వరద విలయం సృష్టించింది.చేయీ చేయీ కలిపిన జనం దానిని ఎదిరించి నిలబడ్డారు.కొన్ని చోట్ల కరెంటు లేదు.కొన్ని చోట్ల నీళ్లు లేవు.కొన్ని చోట్ల నీడ.కాసింత నిరాశ ఉంటుంది.కాని ఈ నిరాశకు రిలీఫ్‌గా అక్కడ కొత్త సినిమాలు రానున్నాయి.మా సినిమాలు చూసి రీచార్జ్ అవ్వండి అంటున్నారు అక్కడి పెద్ద హీరోలు. నిజమే. ఆ వరదకు జవాబు ఈ వెల్లువే కదా అభిమానులకు. మనకు సంక్రాంతి, దసరాలానే కేరళకు ఓనమ్. ఇది ఓనమ్ సీజన్.ఈ సీజన్లో సినిమాలు ఎక్కువ రిలీజ్ చేసి జోరుగా బిజినెస్ చేసుకోవాలని భావిస్తుంటారు నిర్మాతలు. కాని అనూహ్యంగా ఈ ఏడాది ఈ సీజన్లోనే కేరళకు వరద వచ్చింది. రాష్ట్రం చాలా దెబ్బ తినింది. సినిమా ఇండస్ట్రీ కూడా. ఆగస్ట్‌లో ఓనమ్ సీజన్లో రిలీజ్ కావల్సిన 5–6 సినిమాలు ఇప్పుడు డేట్ చూసుకొని షోకు సిద్ధం అవుతున్నాయి. ముందు వసతి తర్వాతే వినోదం కేరళ ప్రజలకు ఉండటానికి చోటు, తినడానికి సరైన తిండి కూడా లేనప్పుడు సినిమాల రిలీజు సరిౖయెన పని కాదని అనుకుంది అక్కడి ఇండస్ట్రీ. కనీస వసతుల మీద దృష్టి పెట్టవలసిన అవసరాన్ని గుర్తించి తానూ చేయ దగ్గ సాయం చేసింది. మరోవైపు ఈ వరదల ద్వారా ఎంతో మంది బాధకు గురవుతుంటే మిగతా వాళ్లు పండగ సంబరాల్లో మునిగి తేలడం కూడా కరెక్ట్ కాదని స్టేట్ గవర్నమెంట్ కూడా పేర్కొంది. అందుకనే కేవలం సినిమా రిలీజ్‌లనే కాదు కేరళలోని ఇతర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న చాలా సినిమాల షూటింగ్‌లు ఆపేశారు. ఫాహద్ ఫాజల్ లేటెస్ట్ సినిమా కోసం వేసిన సెట్ వరదల్లో కొట్టుకుపోయిందని చిత్రబృందం పేర్కొంది. ఈ పండక్కు రిలీజ్ కావల్సిన కొన్ని సినిమాల విడుదలను వాయిదా వేశారు చిత్రబృందాలు. ఈ సినిమాలను వచ్చే నెలలో రిలీజ్ చేయడానికి రీ షెడ్యూల్ చేశారు. మలయాళ సినీ చరిత్రలో ఓనమ్‌కు సింగిల్ సినిమా కూడా రిలీజ్ లేకపోవడం ఇదే తొలిసారి అని ట్రేడ్ విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఓనమ్‌కు కేరళ మార్కెట్ వద్ద చెప్పుకోదగ్గ సినిమాల్లో ముందుగా... మలయాళం క్రేజీ ప్రాజెక్ట్.. ‘ప్రేమమ్’ ఫేమ్ నివీల్ పౌలీ హీరోగా, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ అతిథి పాత్రలో నటించిన చిత్రం ‘కాయమ్‌కులమ్ కొచ్చున్ని’. పీరియాడికల్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రానికి రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించారు. 19వ శతాబ్దంలో నివసించిన కాయమ్‌కులమ్ కొచ్చున్ని అనే దొంగ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఉన్న వాళ్ల దగ్గర దోచుకొని పేదవాళ్లకు పంచే రాబిన్‌హుడ్ క్యారెక్టర్. ఈ పాత్రను నివీన్ పౌలీ పోషించగా అతని గురువుగా మోహన్‌లాల్ కనిపిస్తారు. 45 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ పీరియాడికల్ డ్రామా మలయాళ ఇండస్ట్రీలోనే ఎక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రంగా రికార్డ్ సృష్టించింది. వరదల కారణంగా పోస్ట్ పోన్ చేసిన ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ఇంకా అధికారికంగా అనౌన్స్ చేయలేదు. అల్లరి చేసే మమ్ముట్టి.. పండక్కి స్టార్ హీరో సినిమా లేకపోతే కచ్చితంగా ఆ వెలితి కనిపిస్తుంది. అయితే ఈసారి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ‘ఒరు కుట్టనుడన్ బ్లాగ్’ సినిమాతో వస్తున్నారు. ఊరిలో అల్లరి చిల్లరిగా తిరిగే పోకిరి గ్యాంగ్‌కి లీడర్‌గా కనిపిస్తారు మమ్ముట్టి. చేసిన పనికి, చేయని పనికి కచ్చితంగా బ్యాడ్ నేమ్ మాత్రం మన హీరోకే వస్తుందట. ఇలాంటి లైట్ హార్ట్ కామెడీతో రూపొందిన చిత్రం ‘ఒరు కుట్టనుడన్ బ్లాగ్’. ‘అవును’ ఫేమ్ పూర్ణ, రాయ్ లక్ష్మీ హీరోయిన్స్‌గా యాక్ట్ చేశారు. శేతు దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఆగస్ట్ 24న విడుదల కావల్సింది. ఇప్పుడు సెప్టెంబర్ 14న రిలీజ్ కానుంది. హార్రర్ థ్రిల్లర్‌గా.. ఫాహద్ ఫాజిల్ ‘వరతాన్’ చిత్రం కుడా ఓనమ్‌కు వస్తుందని చాలా రోజుల నుంచి ఊరిస్తూ వస్తున్నారు చిత్రబృందం. కెమెరామేన్, డైరెక్టర్ అమల్ నీరాద్ తెరకెక్కించిన ఈ సినిమాను అమల్ నీరద్‌తో కలసి ఫాహద్ ఫాజిల్ భార్య నజ్రియా నజీమ్ నిర్మించారు. హార్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పుడు సెప్టెంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని నిర్మించడమే కాకుండా సినిమాలో ఓ రొమాంటిక్ పాటను కూడాపాడారు నజ్రియా. చైన్ స్మోకర్ సెటైర్ 2017లో మలయాళం సూపర్ హిట్ ‘మాయనది’తో మంచి పేరు సంపాదించుకున్న టోవినో థామస్ ఈ ఓనమ్‌కు ‘తీవండి’తో వస్తున్నారు. తీవండి అంటే చైన్ స్మోకర్ అని అర్థం. పొలిటికల్ సెటైర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఓనమ్ ఫెస్టివల్‌కి చాన్స్ లేకపోవడంతో సెప్టెంబర్ 7న రిలీజ్ చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకా ఓనమ్‌కి రావాలనుకున్న కొన్ని సినిమాలు ‘కామెడీ పడయోట్టమ్’, ‘జానీ జానీ యస్ పాప్ప’, ‘మాంగళ్యం తంతూనానేనా’ సినిమాలను కూడా వచ్చే నెలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ కొత్త సినిమాల కోసం థియేటర్లు పూర్తిగా రెడీ కావాల్సి ఉంది. వరదల కారణంగా పలు థియేటర్లు నీట మునిగిపోయాయి. కేవలం థియేటర్స్ ఏరియా నష్టమే సుమారు 30 కోట్లు వరకూ ఉండొచ్చని కేరళ ఫిల్మ్ చాంబర్ ప్రతినిధి పేర్కొన్నారు. ఇటు షూటింగ్ నిలిపివేత, అటు కొత్త చిత్రాల విడుదల ఆపివేత.. మొత్తంగా కేరళ ఎంటర్టైన్మెంట్ ఇండ్రస్టీకి తీరిన నష్టమే అని చెప్పాలి. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. మళ్లీ కేరళ కళకళలాడాలని, కొత్త రిలీజులతో థియేటర్లు సందడి చేయాలని, ఎప్పటిలా షూటింగ్స్ జోరుగా జరగాలని కోరుకుందాం. కాలం మన నేస్తం కేరళ ‘ముస్తఫా ముస్తఫా డోంట్ వర్రీ ముస్తఫా కాలం మన నేస్తం ముస్తఫా’ అంటూ ‘ప్రేమదేశం’ కోసం ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఎంత ఫేమసో మనందరికీ తెలిసిందే. కేరళ కోసం ఈ క్రేజీ సాంగ్ లిరిక్‌ని మార్చి తన కాలిఫోర్నియాలో షోలో పాడారు ఏఆర్ రెహమాన్. ఈ ఈవెంట్ చేస్తున్నప్పుడు రెహమాన్‌కి వరదల కారణంగా దుస్థితిలో ఉన్న కేరళ గుర్తొచ్చింది. అంతే.. ‘కేరళా.. కేరళా.. డోంట్ వర్రీ కేరళా. కాలం మన నేస్తం కేరళా’ అని పాడారు. అందరూ తమ ప్రేయర్స్‌ను ఒక్కోలా పంపుతుంటే రెహమాన్ పాట ద్వారా తన సందేశం పంపారు. మేమున్నామని... కేరళకు మేమున్నాం అంటూ మోహన్‌లాల్, మమ్ముట్టి చేరో 25 లక్షలు సీయం రిలీఫ్ ఫండ్‌కి అందజేశారు. కొంత మంది హీరోలు డబ్బు రూపంలో సహాయం చేస్తే మరికొందరు డైరెక్ట్‌గా ఫీల్డ్‌లోకి వెళ్ళి రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. కేరళకు సహాయంగా తెలుగు పరిశ్రమ నుంచి చిరంజీవి, నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్, విజయ్ దేవరకొండ ఇలా పలువురు కళాకారులు ఆర్థిక సహాయం చేశారు. తమిళనాడు నుంచి రజనీకాంత్, విక్రమ్, సూర్య, విజయ్ తదితరులు విరాళం అందజేసినవారిలో ఉన్నారు. పలువురు కథానాయికలు సైతం కేరళకు మేమున్నామని సహాయానికి ముందుకొచ్చారు. హిందీ నుంచి అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్ వంటి వారు కూడా చేయూతనిచ్చారు. కేరళ వరదలపై డాక్యుమెంటరీ 2018లో వచ్చిన వరదలు గత వందేళ్లలో కేరళ ఎప్పుడూ చూడలేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఈ విధ్వంసాన్ని విజువల్‌గా చూపించదలిచారు దర్శకుడు మధుసూదనన్. వరద సమయాల్లో ఫోన్ లేదా కెమెరాతో షూట్ చేసిన వీడియోస్ అన్నింటినీ కలిపి ఓ డాక్యుమెంటరీ రూపొందించనున్నారు. కెమెరామేన్, దర్శకుడు రాజీవ్ రవి ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన టెక్నికల్ విషయాలను చూసుకుంటారట. ‘ఈ డాక్యుమెంటరీ స్క్రీనింగ్‌తో వచ్చే డబ్బులను కేరళను మళ్లీ రీ–బిల్డ్ చేసే పనులకు వినియోగిస్తాం’ అని దర్శకుడు మధుసూదనన్ పేర్కొన్నారు. రానా 2 సినిమాలకు బ్రేక్ రానా నటిస్తున్న బహు బాషా చిత్రాలు ‘హాథీ మేరీ సాథీ’, ‘1945’ కూడా కేరళలోని వరదల కారణంగానే ఎఫెక్ట్ అయ్యాయి. ‘హాథీ మేరీ సాథీ’ సినిమా ఎక్కువ శాతం ఏనుగులు, అడవికి సంబంధించిన కథ. ఈ సినిమాకు సంబంధించిన చాలా పోర్షన్ కేరళ దట్టమైన అడవుల్లో షూట్ చేయాలి, కానీ ప్రస్తుతం కేరళలోని వాతావరణ పరిస్థితులు సినిమా షూటింగ్‌కు అంతరాయం కలిగించాయి అని రానా పేర్కొన్నారు. అలాగే 1945 కోసం వేసిన సెట్ వరదల కారణంగా ధ్వంసం అవడంతో యూనిట్ డైలమాలో పడింది. అయితే ఈ బ్రేక్ తాత్కాలికమే అని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అల్లుడు ఆలస్యం అయ్యాడు కేరళలోని వరదల ప్రభావం కొన్ని తెలుగు సినిమాలపైన కూడా పడింది. హీరో నాగచైతన్య దర్శకుడు మారుతి కాంబినేషన్లో రూపొందిన ‘శైలజా రెడ్డి అల్లుడు’ సినిమా రీ రికార్డింగ్ పూర్తి కాకపోవడంతో సినిమాను వాయిదా వేసుకోవల్సి వచ్చింది. కేరళ సంగీత దర్శకుడు గోపీ సుందర్, దర్శకుడు మారుతి లాస్ట్ మినిట్ వరకూ కేరళ వాతావరణంతో ఫైట్ చేసి రీ–రికార్డింగ్ చేయటానికి ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. దాంతో ఈ సినిమాను వచ్చే నెల 13న రిలీజ్ చేయాలనుకుంటుంది చిత్రబృందం. ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది -
రాబిన్‌హుడ్ టైప్
చేతిలో ఆయుధం ఉంది. గుండెల్లో తెగువ ఉంది. ఒంట్లో సత్తా ఉంది. ఇన్ని ఉంచుకుని కూడా ఒక హీరో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడంటే అందుకో కారణం ఉంటుంది. ఇక్కడ నివీన్ పౌలీకి కూడా ఓ కారణం ఉంది. ఎందుకంటే అతను దొంగ. మాములు దొంగ కాదు. రాబిన్ హుడ్ టైప్. అంటే ధనవంతులను దోచి పేదలకు పంచుతాడన్నమాట. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో నివీన్ పౌలీ హీరోగా మలయాళంలో తెరకెక్కిన సినిమా ‘కాయమ్‌కులమ్ కొచ్చిన్’. గోకులమ్ గోపాలన్ నిర్మించారు. ప్రియా ఆనంద్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో మోహన్‌లాల్ ఓ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ ఏడాది ఓనమ్ ఫెస్టివల్‌కు సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. అప్పటి ట్రవాంకూర్ ఏరియాలో దారిదోపిడి దొంగగా హడలెత్తించిన కాయమ్‌కులమ్ జీవితం ఆధారంగా ఈ సినిమా రూపొందిందని మాలీవుడ్ టాక్. ప్రియాంకా త్రిమ్మేష్, సున్నీ వాణ్నే, బాబు ఆంటోనీ తదితరులు నటించిన ఈ సినిమాకు గోపీ సుందర్ స్వరకర్త. -
‘ఆనందం’ మూవీ రివ్యూ
టైటిల్ : ఆనందం జానర్ : యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ తారాగణం : అరుణ్, థామస్ మాథ్యూ, రోషన్, విశాఖ్ నాయర్, అను ఆంటోని, సిద్ధి మహాజన్‌కట్టి సంగీతం : సచిన్ వారియర్ దర్శకత్వం : గణేష్ రాజ్ నిర్మాత : ఎ.గురురాజ్ యూత్ ఫుల్ఎంటర్టైనర్లను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. యువతరానికి నచ్చే అంశాలకు కాస్త ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తుంటాయి. ఆ నమ్మకంతోనే 2016లో మలయాళంలో ఘన విజయం సాధించిన ఆనందం సినిమాను ఇప్పుడు అదే పేరుతో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ప్రేమమ్ ఫేం నివీన్ పౌలీ అతిథి పాత్రలో నటించటంతో తెలుగులో కూడా ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఏడుగురు ఇంజనీరింగ్ విద్యార్థుల కథతో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది..? కథ : కంప్యూటర్ సైన్స్ ఇంజీనిరింగ్ చదివే విద్యార్థులు కాలేజ్ తరుపున ఇండస్ట్రియల్ విజిట్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. ఈ టూర్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని చాలా ప్లాన్స్ వేస్తారు. కాలేజ్ మేనేజ్మెంట్ సౌత్ ఇండియా వరకు మాత్రమే పర్మిషన్ ఇవ్వటంతో ముందు హంపీ వెళ్లి తరువాత గోవాలో న్యూ ఇయర్ పార్టీ సెలబ్రేట్ చేసుకోవాలని ప్లాన్ చేస్తారు. (సాక్షి రివ్యూస్) ప్రధానంగా ఏడుగురు విద్యార్థుల చుట్టూనే కథ నడుస్తుంది. విభిన్న వ్యక్తిత్వాలున్న ఆ విద్యార్థులకు ఈ టూర్ ఎలాంటి జ్ఞాపకాలను మిగిల్చింది..? వారిలో వ్యక్తిత్వాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి..? అన్నదే మిగతా కథ. విశ్లేషణ : నటీనటులంతా కొత్తవారే.. ఎవరి పాత్రకు తగ్గట్టుగా వారు తమ పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. తెలుగులో ఇలాంటి కాలేజ్ కథలు చాలానే వచ్చాయి. హ్యాపీడేస్ లాంటి సినిమాలు దాదాపుగా ఇలాంటి కాన్పెప్ట్ తో తెరకెక్కినవే. అందుకే తెలుగు ప్రేక్షకులకు ఈ కథలో పెద్దగా కొత్తదనమేమి కనిపించదు. బలమైన కథ లేకపోవటంతో దర్శకుడు.. స్టూడెంట్స్ చేసే అల్లరితోనే సినిమాను నడిపించాడు. (సాక్షి రివ్యూస్)బలమైన సన్నివేశాలు, ఆయడిన్స్‌ను కథలో ఇన్వాల్స్చేసే ట్విస్ట్‌లు ఒక్కటి కూడా సినిమాలో కనిపించవు. బలమైన ఎమోషన్స్ పండించే అవకాశం ఉన్న సన్నివేశాలను కూడా దర్శకుడు సింపుల్ గా తేల్చేయటం నిరాశకలిగిస్తుంది. సంగీతం కూడా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేదు. ఆనంద్ సీ చంద్రన్ సినిమాటోగ్రఫి బాగుంది. హంపీలోని లోకేషన్స్‌ను, గోవాలో పార్టీ వాతావరణాన్ని చాలా బాగా చూపించారు. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ : సినిమాటోగ్రఫి కొన్ని సరదా సన్నివేశాలు మైనస్ పాయింట్స్ : కథా కథనం - సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్ -
అప్పుడే అయిపోయిందా అంటారు
మలయాళ ‘ప్రేమమ్’ ఫేమ్ నివిన్ పౌలీ అతిథిగా, కొత్త నటీనటులు నటించిన చిత్రం ‘ఆనందం’. గణేష్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మలయాళంలో ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని అదే పేరుతో నిర్మాత ఎత్తరి గురురాజ్ తెలుగులో ఈరోజు విడుదల చేస్తున్నారు. గురురాజ్ మాట్లాడుతూ– ‘‘కాలేజ్‌లో పికి ్నక్కి వెళ్లొచ్చే విద్యార్థుల కథే ఈ చిత్రం. నేటి యువతరంతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. సినిమా చూస్తున్నంత సేపు కాలేజీ రోజులు గుర్తుకొస్తాయి. వేసవిలో ప్రేక్షకులకు నవ్వుల జల్లులు పంచే చిత్రమిది. సినిమా చూశాక అప్పుడే అయిపోయిందా! అంటారు. మలయాళంలో 4కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 20కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా రీమేక్ హక్కుల కోసం చాలామంది నిర్మాతలు సంప్రదించారు. అయితే.. యూనివర్శల్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు నేటివిటీకి సరిపోయేలా ఉండటంతో రీమేక్ చేయకుండా డబ్ చేశాం. ‘చిన్న సినిమాలను ప్రోత్సహించాలి’ అంటూ స్టార్ హీరోలు, డైరెక్టర్లు, పెద్ద నిర్మాతలంతా మైకుల్లో ఉపన్యాసాలు ఇస్తుంటారే కానీ, ఆచరణలో పెట్టరు. చిన్న సినిమాలను ప్రోత్సహించినప్పుడే చాలామందికి పని దొరుకుతుంది. నటుడవ్వాలని హైదరాబాద్‌కొచ్చిన నేను బ్రహ్మానందంగారు, రాజేంద్రప్రసాద్‌గారు వంటి వారితోపాటు చాలా సినిమాల్లో నటించా. కానీ, బ్రేక్ రాకపోవడంతో రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్లా. మళ్లీ నిర్మాతగా మారా. త్వరలోనే మా సుఖీభవ మూవీస్ బ్యానర్లో ఓ స్ట్రెయిట్ ఫిల్మ్ నిర్మించనున్నాం’’ అన్నారు. -
అమల ఒకటి.. ప్రియ మూడు వదులుకున్నారు
మ్యాచ్ రిజల్ట్‌ని రెయిన్ చేంజ్ చేస్తుంది. ఆ మాటకొస్తే చాలా విషయాల్లో రెయిన్ ఇబ్బందులపాలు చేస్తుంది. ఇప్పుడు మాత్రం వరుణుడు హీరోయిన్ అమలా పాల్‌ను ఇరుకుల్లో పడేశాడు. ఎలాగంటే.. హెవీ రెయిన్స్ వల్ల అమలా పాల్ ఓ సినిమా చాన్స్‌ను వదులుకోవాల్సి వచ్చిందట. నివీన్ పౌలీ హీరోగా రోషన్ ఆండ్రూస్ దర్శకత్వంలో మలయాళంలో రూపొందుతున్న పీరియాడికల్ మూవీ ‘కాయమ్‌కులమ్ కోచున్ని’. ఇందులో హీరోయిన్ జానకి పాత్రకు ముందుగా అమలా పాల్‌ను సెలక్ట్ చేశారు. ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కానీ, సడన్‌గా అమలా పాల్ తప్పుకోవాల్సి వచ్చింది. ఆ ప్లేస్‌లో ప్రియా ఆనంద్‌ను కథానాయికగా తీసుకున్నారు. తెలుగులో లీడర్, 180, కో అంటే కోటి వంటి చిత్రాల్లో ప్రియా ఆనంద్ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘‘రీసెంట్గా పడిన వర్షాల వల్ల మా సినిమా షెడ్యూల్స్‌లో మార్పులు వచ్చాయి. ఆ చేంజేస్ ఏఫెక్ట్ అమలా పాల్ డేట్స్‌పై పడింది. ఆమె బిజీ హీరోయిన్. మార్చిన తేదీలకు తగ్గట్టుగా అమలా పాల్ డేట్స్ ఇవ్వలేకపోయారు. అందుకే ప్రియా ఆనంద్‌ను హీరోయిన్గా తీసుకున్నాం’’ అన్నారు రోషన్. ‘‘ఈ సినిమాలో హీరోయిన్గా చేయబోతున్నందుకు ఆనందంగా ఉంది. ఈ గ్రేట్ ప్రాజెక్ట్‌లో యాక్ట్ చేసేందుకు నేను మూడు సినిమాలను వదులుకున్నాను’’ అన్నారు ప్రియ. అయితే మరోవైపు ఈ ‘కాయమ్‌కులమ్ కోచున్ని’ చిత్రంలో అమలా పాల్‌ను కావాలనే తప్పించారని ఓ నెటిజన్ పేర్కొన్నారు. ‘ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఇది రీ–ప్లేస్మెంట్ కాదు. డేట్స్ కుదరక నేనే తప్పుకున్నా. అండ్.. నేను మీకులా ఖాళీగా లేను ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయడానికి’’ అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు అమలాపాల్. -
హే జూడ్... రెడీ ఫర్ రైడ్!
ఆకాశం ఏ కలర్లో ఉంటుంది? బ్లూ కలర్లో! త్రిష రైడ్ చేస్తున్న బండి కలర్ కూడా బ్లూనే! ఆమె వెనుక సీట్లో కూర్చున్నది ఎవరో తెలుసా? మలయాళ హీరో నివిన్ పాలీ. త్రిష మాటలతో ఏం మంత్రం వేశారో మరి... నీలాకాశంలో విహరిస్తున్నట్టుంది నివిన్ ఎక్స్ప్రెషన్. అసలు, ఈ హీరో త్రిష బండి ఎందుకు ఎక్కారనే డౌటొచ్చిందా? ప్రస్తుతం వీళ్లిద్దరూ ‘హే జూడ్’ అనే మలయాళ సినిమాలో జంటగా నటిస్తున్నారు. ఆ సినిమా ఫస్ట్ లుక్‌నే మీరు చూస్తున్నారు. శ్యామప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో క్రిష్టల్ అనే అమ్మాయిగా త్రిష, జూడ్ అనే అబ్బాయిగా నివిన్ నటిస్తున్నారు. ఈ ఫొటో చూస్తుంటే... నివిన్ని ‘హే జూడ్... ఆర్ యు రెడీ ఫర్ రైడ్?!’ అని త్రిష అడుగుతున్నట్టు లేదూ! ఈ ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా ‘‘సినిమా రెడీ అవుతుంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అని చిత్రదర్శకుడు శ్యామప్రసాద్ పేర్కొన్నారు. మలయాళంలో త్రిషకు తొలి చిత్రమిది. హీరోయిన్ అయిన 15 ఏళ్ల తర్వాత... పలు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లో నటించిన తర్వాత... ఇన్నేళ్లకు మలయాళంలో ఎంట్రీ ఇస్తుండడం విశేషం!! -
ప్రేమమ్ హీరోతో 'పెళ్లిచూపులు'
ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై ఘనవిజయం నమోదు చేసిన చిత్రం పెళ్లిచూపులు. తరుణ్ భాసర్క్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయం సాదించటంతో ఇతర భాషల నుంచి భారీగా రీమేక్ ఆఫర్స్ వచ్చాయి. ఇప్పటికే హిందీతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో పెళ్లి చూపులు రీమేక్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. అన్ని భాషల్లో స్టార్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారు. దక్షిణాదిలో ఈ సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్, ప్రేమమ్ ఫేం నివీన్ పౌలీ హీరోగా రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు. నివీన్ మలయాళ స్టార్ కావటంతో తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి తెరకెక్కించనున్నాడు. ప్రేమమ్ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న నివీన్, పెళ్లి చూపులు రీమేక్‌తో మరోసారి మ్యాజిక్ రిపీట్ చేస్తాడని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
నటుడితో ఫొటో దిగి...
తిరువనంతపురం: కేరళకు చెందిన ఓ మహిళా పోలీస్ అధికారి.. ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, వివాదంలో ఇరుక్కున్నారు. అసిస్టెంట్ కమిషనర్ మెరిన్ జోసెఫ్.. దక్షిణాది నటుడు నివిన్ పాలీతో కలిసి దిగిన ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతో వేలకొద్దీ లైక్‌లు, కామెంట్లు వచ్చాయి. అయితే ఆ ఆనందం ఆమెకు ఎంతోసేపు నిలవలేదు. మెరిన్ జోసెఫ్ ప్రొటోకాల్ పాటించలేదంటూ విమర్శలు చెలరేగాయి. పోలీస్ ఉన్నతాధికారి అయిన ఆమె యూనిఫాంలో ఉండి, సినీ నటుడితో ఫొటో దిగడం, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై విమర్శలు గుప్పించాయి. అక్కడి ఛానల్స్ వరుస కథనాలు ప్రసారం చేశాయి. ఈ వివాదంపై మెరిన్ జోసెఫ్ మీడియాపై విరుచుకుపడ్డారు. అనవసరంగా విషయాన్ని సంచలనం చేశారని మండిపడ్డారు. వాళ్ల (ఛానల్స్) రేటింగ్ కోసం ఛీప్ ట్రిక్స్ ప్లే చేయడం మీడియాకు అలవాటేనని ఆమె ఆరోపించారు. వారిపట్ల జాలిపడటం తప్ప ఏమీ చేయలేనని మెరిన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఓ కాలేజీ ఫంక్షన్‌కు వెళ్లిన తాను కార్యక్రమం పూర్తయి, తన విధులు ముగిసిన తర్వాతే నటుడుతో ఫొటో తీసుకున్నట్లు మెరిన్ జోసెఫ్ వివరణ ఇచ్చారు. కేరళ హోం మంత్రి, తదితర ముఖ్య అతిథులు వెళ్ళిపోయిన తర్వాత మాత్రమే ఆ నటుడ్ని కలిసినట్లు చెప్పారు. నటుడు నివిన్, తన కోరికపై కాంగ్రెస్ ఎమ్మెల్యే హిబి ఇడెన్ ఈ ఫొటో తీశారని తెలిపారు. కాగా జోసెఫ్ గతంలో కూడా ఒక వివాదంలో ఇరుక్కున్నారు. ఐపీఎస్ శిక్షణలో ఉండగా ఆమె డ్రెస్సింగ్ స్టయిల్ పై విమర్శలు చెలరేగాయి.


