దాదాపు పదేళ్ల క్రితం 'ప్రేమమ్' సినిమాతో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకున్న మలయాళ హీరో నివిన్ పౌలీ.. తర్వాత ఆ స్థాయి సక్సెస్ అందుకోలేకపోయాడు. చాన్నాళ్ల తర్వాత గతేడాది చివరలో 'సర్వం మాయ' చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. దీని తర్వాత రెండు మూవీస్ చేశాడు. అందులో ఒకటి ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్దమైంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు.
(ఇదీ చదవండి: మలయాళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. ఓటీటీలో ఇప్పుడు తెలుగులో)
నివిన్ పౌలీ చేసిన లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీ 'ప్రతిఛాయ'. గత నెల 26న థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే రొటీన్ స్టోరీ ఉండేసరికి పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు దీన్ని నెలలోపే అంటే వచ్చే శుక్రవారం(ఏప్రిల్ 24) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తెలుగు డబ్బింగ్ కూడా ఉందా లేదా అనేది ప్రస్తుతానికి క్లారిటీ ఇవ్వలేదు. దాదాపుగా రావొచ్చనే తెలుస్తోంది.
'ప్రతిఛాయ' విషయానికొస్తే.. కేరళ ముఖ్యమంత్రిగా వర్గీస్, నిజాయితీపరుడైన నాయకుడిగా పేరు తెచ్చుకుంటాడు. ఈయన పెద్ద కొడుకు జాన్, రాజకీయాలకు దూరంగా ఉంటూ ఐటీ ఉద్యోగం చేస్తుంటాడు. మరో కొడుకు టోబిన్, తండ్రి అడుగుజాడల్లోనే యువ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. వర్గీస్ తనని లైంగికంగా వేధించాడని నిశా అనే మహిళ ఆరోపణలు చేస్తుంది. దీంతో సీఎం పదవికి వర్గీస్ రాజీనామా చేస్తాడు. ఈ ఆరోపణలు వెనకున్న నిజానిజాలు బయటపెట్టాలని జాన్ నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలోనే అతడికి తెలిసిన నిజాలేంటి? రాజకీయాల్లో అడుగుపెట్టిన జాన్‌కి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఓటీటీలో సెన్సేషనల్ థ్రిల్లర్ 'సంభవం అధ్యాయం ఒన్ను' తెలుగు రివ్యూ)


