మలయాళంలో తీసే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు ఎప్పటికప్పుడు ఓటీటీ డబ్బింగ్‌లు రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తూనే ఉంటాయి. రీసెంట్‌గా 'సంభవం అధ్యాయం ఒన్ను' అనే టైమ్ లూప్ థ్రిల్లర్ అలరిస్తుండగా.. ఇప్పుడు మరొకటి స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. 'దృశ్యం' తీసిన జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇంతకీ ఈ మూవీ సంగతేంటి? ఎందులో అందుబాటులో ఉంది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి 'కోర్ట్' జంట కొత్త సినిమా.. అధికారిక ప్రకటన)
ఎప్పుడూ థ్రిల్లర్ సినిమాలు తీసే జీతూ జోసెఫ్ నుంచి త్వరలోనే 'దృశ్యం 3' రాబోతుంది. లెక్క ప్రకారం ఈ పాటికే థియేటర్లలోకి రావాలి గానీ వచ్చే నెలకు వాయిదా వేశారు. ఈ దర్శకుడి తీసిన లేటెస్ట్ థ్రిల్లర్ 'వలతు వషత్తే కల్లన్'. దృశ్యం తరహాలో మర్డర్ మిస్టరీ కాన్సెప్ట్‌తో తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. గత నెల చివరలో మలయాళ వెర్షన్ ఓటీటీలోకి వచ్చింది. ఇప్పుడు తెలుగు, హిందీ కూడా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చాయి. వన్ టైమ్ వాచబుల్ అని చెప్పొచ్చు.
'వలతు వషత్తే కల్లన్' విషయానికొస్తే.. జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న ఎథికల్ హ్యాకర్ శ్యామ్యూల్ జోసెఫ్(జోజూ జార్జ్) గతాన్ని వదిలేసి భార్యకూతురితో కలిసి ప్రశాంతంగా బతుకుతుంటాడు. ఇతడి కూతురు లా స్టూడెంట్, యాక్టివిస్ట్. ఇకపోతే రాజకీయ నాయకుడు కొడుకు ఒకడు ఓ అమ్మాయి మరణానికి కారణమవుతాడు. స్థానిక పోలీసాఫీసర్ ఆంటోని(బిజూ మేనన్) చాలా అవినీతపరుడు. ఈ కుర్రాడిని కాపాడుతాడు. వీళ్లిద్దరిపై సదరు లా స్టూడెంట్ పోరాడుతుంది. ఇంతలోనే ఈమె దారుణ హత్యకు గురవుతుంది. మరి ఇద్దరిలో ఈమెని చంపింది ఎవరు? వారిపై జోసెఫ్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా)


