ఓటీటీలోకి 'కోర్ట్' జంట కొత్త సినిమా.. అధికారిక ప్రకటన | Band Melam Movie OTT Release Date Latest Update | Sakshi
Sakshi News home page

Band Melam OTT: టీనేజ్ ప్రేమకథా సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Apr 17 2026 12:39 PM | Updated on Apr 18 2026 9:55 AM

Band Melam Movie OTT Release Date Latest Update

'కోర్ట్' సినిమాతో గతేడాది అద్భుతమైన హిట్ కొట్టిన రోషన్-శ్రీదేవి జంట మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరిని పెట్టి తీసిన మరో మూవీ 'బ్యాండు మేళం'. ఇప్పుడిది నెలలోనే ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. ఈ మేరకు అధికారిక ప్రకటించారు. ఇంతకీ ఈ చిత్రం సంగతేంటి? ఏ ఓటీటీలోకి రానుందనేది చూద్దాం.

(ఇదీ చదవండి: వైరల్‌ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన అన్నా లెజినోవా)

రోషన్-శ్రీదేవి నటించిన టీనేజీ ప్రేమకథా సినిమా 'బ్యాండుమేళం'. తెలంగాణలోని పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో బావామరదళ్ల మధ్య జరిగే స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. విడుదలకు ముందు ప్రమోషన్లతో చాలా హడావుడి చేశారు గానీ థియేటర్లలో తేలిపోయింది. ఫ్లాప్ అయింది. ఇప్పుడీ చిత్రాన్ని వచ్చే శుక్రవారం(ఏప్రిల్ 24) నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు.

'బ్యాండు మేళం' విషయానికొస్తే.. గిరి(హర్ష్ రోషన్) స్కూల్‌లో పెద్దగా చదవడు. దీంతో ఫెయిల్ అవుతాడు. ఇతడి మరదలు రాజి(శ్రీదేవి) మాత్రం టాప్ ర్యాంకర్. గిరికి ఈమెంటే ప్రాణం. అలానే పాటలు కంపోజ్ చేయడం, పాడటం అన్నాసరే ఇష్టం. ఓ సొంత బ్యాండ్ ట్రూప్‌తో ఊరిలో జరిగే పెళ్లిళ్లల్లో పాటలు అవీ పాడుతుంటాడు. ఎప్పటికైనా రహమాన్ అంత పెద్ద సంగీత దర్శకుడు కావాలనేది ఇతడి కల. ఇదలా ఉంటే ఇతడి మరదలు రాజి.. ఇంజనీరింగ్ కాలేజీమేట్‌తో లేచిపోతుంది. అతడు మోసం చేశాడని తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. అప్పుడు ఆమెని గిరి ఒప్పుకొన్నాడా లేదా అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement