వైరల్‌ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన అన్నా లెజినోవా | Pawan Kalyan Wife Anna Lezhneva Clarifies Viral Photo | Sakshi
Sakshi News home page

వైరల్‌ ఫోటోపై క్లారిటీ ఇచ్చిన అన్నా లెజినోవా

Apr 16 2026 8:14 AM | Updated on Apr 16 2026 11:16 AM

Pawan Kalyan Wife Anna Lezhneva Clarifies Viral Photo

సినీ నటుడు, ఎపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌ సతీమణి అన్నా లెజినోవా ఇటీవల సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలో తరుచుగా తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు కూడా తన పేజీలోనే సమాధానం చెబుతున్నారు. ఆపై పవన్‌తో ప్రేమ విషయాలను కూడా ఆమె రివీల్‌ చేశారు. వారిద్దరిలో ముందుగా ఎవరు ప్రపోజ్‌ చేశారో కూడా పేర్కొన్నారు. అయితే, తాజాగా ఒక ఆసక్తికరమైన ఫోటో గురించి ఆమె రివీల్‌ చేశారు.

చాలా ఏళ్లుగా సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్న ఒక పాత ఫోటోపై పవన్ సతీమణి అన్నా లెజినోవా స్పందించారు. పవన్‌ నటించిన 'తీన్ మార్' సినిమా నాటి ఒక పాత చిత్రాన్ని ఆమె స్టోరీస్‌లో షేర్‌ చేశారు. అందులో పవన్ కల్యాణ్‌ పక్కన ఒక విదేశీ మహిళ కూర్చుని ఉన్నారు. అయితే, ఈ ఫోటో వారి పెళ్లికి ముందు తీసినదని, అందులోని మహిళ అన్నానే అని చాలామంది భావించారు. అయితే, ఫోటోలోని వ్యక్తి తాను కాదని, ఆమె పేరు డానా మార్క్స్ అని  స్పష్టం చేశారు. 

తాను ఎప్పుడూ మోడల్‌లాగా గానీ, నటిలాగా గానీ కనిపించలేదని ఆమె స్పష్టం చేశారు. దీంతో ఆ ఊహాగానాలకు తెరపడింది. చాలా ఏళ్లుగా ఈ ఫోటోలో ఉన్నది అన్నా లెజినోవానే అని కొందరు షేర్‌ చేస్తూ రావడంతో ఆమె క్లారిటీ ఇచ్చారు. వాస్తవంగా  'తీన్ మార్' సినిమాలో ఒక పాటలో అన్నా లెజినోవా కొన్ని సెకన్స్‌ మాత్రమే కనిపిస్తారు. 

సినీ నటి రేణు దేశాయ్‌తో విడాకుల తర్వాత పవన్‌ కల్యాణ్‌ ఆమెను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, తమ ప్రేమ విషయం గురించి కూడా అన్నా లెజినోవా క్లారిటీ ఇచ్చారు. మీ ఇద్దరిలో మొదటగా ఎవరు ప్రపోజ్ చేశారు..?  పవన్ కల్యాణ్‌ నుంచే ఫస్ట్ ప్రపోజ్ వచ్చిందా..? అని ఒక అభిమాని అడగ్గా.. దీనికి అన్నా లెజినోవా స్పందిస్తూ.. అవును, ఆయనే (పవన్) మొదటగా ప్రపోజ్ చేశారు” అని క్లారిటీ ఇచ్చారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement