సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా | Priyadarshi Suyodhana Movie OTT Streaming Now | Sakshi
Sakshi News home page

Suyodhana OTT: మూడు వారాలకే ఓటీటీలో కొత్త మూవీ స్ట్రీమింగ్

Apr 17 2026 12:04 PM | Updated on Apr 17 2026 12:29 PM

Priyadarshi Suyodhana Movie OTT Streaming Now

కమెడియన్‌గా కెరీర్ మొదలుపెట్టి బలగం, కోర్ట్ తదితర సినిమాలతో లీడ్ రోల్స్ చేస్తూ హిట్స్ కొడుతున్న ప్రియదర్శి లేటెస్ట్‌గా చేసిన మిస్టరీ థ్రిల్లర్ మూవీ ఎలాంటి ప్రచారం లేకుండానే థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు అదే రూట్ ఫాలో అవుతూ ఓటీటీల్లోకి కూడా సైలెంట్ గా స్ట్రీమింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ ఏంటా చిత్రం? ఎందులో చూడొచ్చు? దీని సంగతేంటి?

(ఇదీ చదవండి: ఓటీటీలో రాధిక సూపర్ హిట్ సినిమా.. తెలుగు రివ్యూ)

ప్రియదర్శి, సాయికుమార్, ద్రిషిక చందర్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'సుయోధన'. వైఎస్ మాధవరెడ్డి దర్శకుడు. గత నెల 27వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. కనీసం ప్రచారం చేయకుండానే రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్లే బాక్సాఫీస్ దగ్గర దారుణంగా ఫ్లాప్ అయింది. ఇప్పుడు మూడు వారాల్లోనే ఎలాంటి ప్రచారం లేకుండా హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీల్లో అందుబాటులోకి వచ్చేసింది.

'సుయోధన' విషయానికొస్తే.. వరుణ్ (ప్రియదర్శి) ఓ ఫోలే ఆర్టిస్ట్. అంటే సినిమాల్లో వినిపించే రకరకాల సౌండ్స్ సృష్టిస్తుంటాడు. ఇతడికి చిన్నప్పటి నుంచి సుయోధన అనే వింత శబ్దం వినిపిస్తూ ఉంటుంది. సరిగ్గా ఆ టైంలో ధుర్యోధనుడి రూపం ఇతడికి కనిపిస్తుంది. అలా జరిగినప్పుడల్లా వరుణ్ చాలా భయపడుతుంటాడు. మరోవైపు వరుణ్ తండ్రి ప్రకాశ్(సాయికుమార్) నాటకాల వేస్తుంటాడు. ఈయనకు ధుర్యోధనుడి పాత్రంటే చాలా ఇష్టం. అలా ఓ సారి ఈ పాత్ర వేసిన తర్వాత ఈయన హత్యకు గురవుతాడు. అసలు సుయోధన అనే శబ్దం వరుణ్‌కి వినిపించడానికి కారణమేంటి? ప్రకాశ్‌ని ఎవరు చంపారనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: OTT: ‘థ్రాష్’ రివ్యూ.. ముచ్చెమటలు పట్టించే థ్రిల్లర్ సినిమా)

Advertisement
 
Advertisement
Advertisement