లోకేష్ యూనివర్స్‌లోకి కొత్త విలన్.. 'రోలెక్స్' అంత లేదు గానీ | Benz Movie Villain Nivin Pauly And LCU Link | Sakshi
Sakshi News home page

Benz Movie: LCU కొత్త విలన్ వచ్చేశాడు.. మొత్తం బంగారమే

Jun 4 2025 6:03 PM | Updated on Jun 4 2025 6:48 PM

Benz Movie Villain Nivin Pauly And LCU Link

ప్రస్తుత తరంలో సినిమాటిక్ యూనివర్స్ అనగానే ముందుగా డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ గుర్తొస్తాడు. ఖైదీ, విక్రమ్ సినిమాలతో ఈ తరహా యూనివర్స్ సృష్టించాడు. ఇందులో భాగంగా త్వరలో ఖైదీ 2, రోలెక్స్, విక్రమ్ 2 సినిమాలు రాబోతున్నాయని స్వయంగా లోకేశ్.. పలు ఇంటర్వ్యూల్లో చెబుతూనే ఉన్నాడు.  ఇప్పుడు లోకేష్ యూనివర్స్‌లోకి కొత్త విలన్ వచ్చిచేరాడు.

లోకేశ్ దర్శకుడిగా ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు పలు చిత్రాలకు కథలు అందిస్తూ నిర్మాతగానూ వ్యవహరిస్తున్నాడు. అలాంటి ఓ మూవీనే 'బెంజ్'. లారెన్స్ హీరోగా నటిస్తున్న ఈ వయలెంట్ యాక్షన్ మూవీలో ఇప్పుడు మలయాళ నటుడు నివిన్ పౌలీ విలన్‌గా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అతడి పాత్ర ప్రోమో వీడియోని రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: రామ్ చరణ్ అత్తకు ఇంత టాలెంట్ ఉందా?) 

'విక్రమ్' మూవీ చివర్లో వచ్చే రోలెక్స్ పాత్రని స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో గానీ.. 'బెంజ్' విలన్  చూస్తుంటే సూర్యనే గుర్తొచ్చాడు. ఒళ్లంతా బంగారు చైన్స్, వాచ్, చివరకు బంగారు పళ్లతో నివిన్ పౌలీ కనిపించిన విధానం.. చివర్లో తన పేరు వాల్టర్ అని చెప్పడం ఇదంతా కూడా రోలెక్స్ పాత్రనే ఫాలో అయిపోయినట్లు అనిపించింది. ఇందులో వాల్టర్ అనే విలన్‌గా నివిన్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ వీడియోలోనే.. ఈ సినిమా లోకేశ్ యూనివర్స్‌లో భాగమని క్లారిటీ ఇచ్చారు. మరి ఏ సినిమాలో ఈ పాత్రని లింక్ చేస్తారో చూడాలి?

బెంజ్ సినిమాకు భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు కాగా.. యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతమందిస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన వీడియోకు కూడా డిఫరెంట్ మ్యూజిక్ ఇచ్చి ఆకట్టుకున్నాడు. విలన్‌గా చేస్తున్న నివిన్ పౌలీ విషయానికొస్తే.. మలయాళంలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సాయిపల్లవికి ఎంతో పేరు తెచ్చిన 'ప్రేమమ్'లో హీరో ఇతడే. మరి ఇప్పుడు విలన్‌గా ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి?

(ఇదీ చదవండి: తెలుగు డైరెక్టర్.. నా థైస్ కొలతలు అడిగాడు: మౌనీషా చౌదరి) 

Advertisement
 
Advertisement
Advertisement