తెలుగు డైరెక్టర్.. నా థైస్ కొలతలు అడిగాడు: మౌనీషా చౌదరి | Mouneesha Chowdary Casting Couch With Telugu Directors | Sakshi
Sakshi News home page

Mouneesha Chowdary: అప్పుడు నాతో అసభ్యంగా.. ఇప్పుడు స్టార్ డైరెక్టర్‌గా చెలామణీ

Jun 4 2025 4:15 PM | Updated on Jun 4 2025 4:33 PM

Mouneesha Chowdary Casting Couch With Telugu Directors

తెలుగు సినిమా ఇండస్ట్రీ.. పైకి కనిపించేంత అందంగా అయితే ఉండదు. ఎప్పటికప్పుడు పలువురు యంగ్ హీరోయిన్లు, యువతులు.. తమకు ఎదురైన చేదు అనుభవాల్ని బయటపెడుతుంటారు. శారీరకంగా ఎంతలా ఇబ్బంది పడ్డామనే విషయాన్ని చెబుతుంటారు. ఇప్పుడు కూడా మోడల్ కమ్ నటి అయిన మౌనీషా చౌదరి.. ఓ తెలుగు దర్శకుడి వల్ల తాను ఇబ్బంది పడిన విషయాన్ని బయటపెట్టింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీని గురించి పంచుకుంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో చూడాల్సిన 'టూరిస్ట్ ఫ్యామిలీ' తెలుగు రివ్యూ)

'టాలీవుడ్‌కి చెందిన ఓ దర్శకుడు.. నాకు ఫోన్ చేసి ఆయన తీస్తున్న సినిమాలో నటించమని కోరాడు. అవకాశం ఇస్తానని కూడా చెప్పాడు. నాకు ఆ మూవీలో నటించడం ఇష్టం లేదు. ఇదే ఆయనకు చెప్పినా సరే వినకుండా నా తొడల సైజ్(కొలతల) గురించి అడిగి ఇబ్బంది పెట్టాడు. అసలు సినిమా అవకాశానికి, దానికి సంబంధం ఏంటి? ప్రస్తుతం ఆ దర్శకుడు స్టార్ అయిపోయాడు. పెద్ద పెద్ద యాక్టర్స్‌తో మూవీస్ చేస్తున్నాడు' అని మౌనీషా చౌదరి చెప్పుకొచ్చింది.

మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న మౌనీషా చౌదరి.. ప్రస్తుతం అమెరికాలోని ఉతాలో ఉంటుంది. 2016లో 'మిస్ ఆసియా ఉతా'గా కిరీటం గెలుచుకుంది. స్నో అక్కగా గుర్తింపు తెచ్చుకున్న ఈమెకు ఇన్ స్టాలో మంచి ఫాలోయింగ్ ఉంది. రీసెంట్‌గానే అమెరికా వెళ్లిన మంచు విష్ణుతో కలిసి 'కన్నప్ప' టూర్‌లో పాల్గొంది. సినిమాను ప్రమోట్ కూడా చేసింది. అలాంటి ఈమె.. తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది. కానీ సదరు దర్శకుడు పేరేంటి అనేది మాత్రం చెప్పలేదు.

(ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ థ్రిల్లర్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement