‘ఇడుపు కాయితం’ టీజర్ వ‌చ్చేసింది.. | Idupu Kayitham Teaser Out | Sakshi
Sakshi News home page

Idupu Kayitham Teaser : ‘ఇడుపు కాయితం’ టీజర్ వ‌చ్చేసింది..

Nov 12 2026 11:01 AM | Updated on Nov 12 2026 11:06 AM

Idupu Kayitham Teaser Out

పల్లెటూరి సంప్రదాయాలు, కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో సినిమా తెరకెక్కుతున్న చిత్రం ‘ఇడుపు కాయితం’.  ఇందులో ప్రియదర్శి సరసన నాగదుర్గ కథానాయికగా నటిస్తూ ఈ చిత్రంతో వెండితెరకు పరిచయమవుతున్నారు. వంశీరెడ్డి దొండపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సుకుమార్, బన్నీ వాస్, తబితా సుకుమార్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా డిసెంబరు 11న విడుదల కానుంది. అయితే ఈ చిత్రం నుంచి ఈ రోజు( గురువారం) టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.  ఈ టీజర్ సినిమాపై మంచి హైప్‌ను క్రియేట్ చేస్తోంది.

ఇక ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి అందిస్తున్న సంగీతం అదనపు ఆకర్షణగా నిలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘శ్రీలత’, ‘గడప’, ‘బరాత్ బీట్’ పాటలు శ్రోతలను విపరీతంగా అలరించగా, తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. 

(ఇదీ చదవండి: నాగార్జున రీల్‌ కాదు.. రియల్‌ హీరో: సీఎం రేవంత్‌రెడ్డి)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement