నాగార్జున రీల్‌ కాదు.. రియల్‌ హీరో: సీఎం రేవంత్‌రెడ్డి | CM Revanth Reddy About Nagarjuna | Sakshi
Sakshi News home page

నాగార్జున రియల్‌ హీరో: సీఎం రేవంత్‌రెడ్డి

Nov 12 2026 9:58 AM | Updated on Nov 12 2026 9:58 AM

CM Revanth Reddy About Nagarjuna

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని శిల్పారామం ఎదురుగా హైడ్రా అభివృద్ధి చేసిన తమ్మిడికుంట చెరువును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ హీరో నాగార్జున కోసం ప్రస్తావించారు. ప్రస్తుతం నాగార్జునకి సంబంధించిన ఆ వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.

‘ఈ తమ్మిడికుంట అభివృద్ధి కార్యక్రమంలో 14 ఎకరాల స్థలాన్ని 30 ఎకరాలకు విస్తరించామంటే అక్కినేని నాగార్జునగారు పెద్దమనసు చేసుకుని ముందుకొచ్చారు. ఈ సమాజానికి మనవంతు సాయంచేయాలి అనే ఆలోచనతో ఆయన 2 ఎకరాలను ఉదారంగా ఇచ్చారు. ఆయన సినిమాలోనే కాదు.. నిజ జీవితంలోనూ రియల్‌ హీరోగా ఈ నిర్ణయం తీసుకున్నారు అని ఇంతకముందే చెప్పా’ అని సీఎం వ్యాఖ్యానించారు.

అప్పుడే కీలక నిర్ణయం తీసుకున్నా
నాగార్జున మాట్లాడుతూ.. ‘ఈ చెరువు విషయమై హైడ్రా కమిషనర్‌ను తొలిసారి కలిసినప్పుడు మనసులో ఏదో పెట్టుకుని కలిశా. అయితే ఆయన నన్ను కూర్చోబెట్టి పరిస్థితిని వివరించి ఒప్పించారు. అప్పుడు సిటీ కోసం ఇది కదా చేయాల్సింది అని నిర్ణయించుకున్నా. ఇక్కడ మనం శాశ్వతం కాదు. ఎప్పుడైనా పోవాల్సిందే అని కీలక నిర్ణయం తీసుకున్నా. రంగనాథ్‌ ఈ లేక్‌ను చాలా అందంగా చేశారు. సీఎంకు చెరువులు, నదులు అంటే చాలా ఇష్టం... వాటిని ఎలాగైనా పునరుజ్జీవింప చేయాలన్నదే ఆయన సంకల్పం’ అని అన్నారు. 

(ఇదీ చదవండి: అనిరుధ్ పెళ్లిలో రజనీకాంత్ డ్యాన్స్ (వీడియో))


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement