breaking news
HYDRA
-
గచ్చిబౌలి ఘటనలో అధికారి సస్పెండ్.. హైడ్రా ఫుల్ ఫోకస్
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలోని అంజయ్యనగర్‌లో 50 గజాల స్థలంలో నిర్మిస్తున్న ఏడంతస్తుల భవనం కుప్పకూలిన ఘటన తీవ్ర కలకలం రేపింది. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా కుప్పకూలిన ఈ భవనం శిథిలాలు పక్కనే ఉన్న నివాస భవనాలపై పడటంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులను మధ్యప్రదేశ్‌కు చెందిన కార్మికులుగా అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నారా అన్న అనుమానంతో రెస్క్యూ బృందాలు గాలింపు చేపట్టాయి. ప్రత్యేక పరికరాలతో శిథిలాలను తొలగిస్తూ మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు.మరోవైపు ఈ ఘటనపై మున్సిపల్ అధికారులు కీలక చర్యలు చేపట్టారు. మాదాపూర్ సర్కిల్-50లో TPBOగా పనిచేస్తున్న సంతోష్ కుమార్‌పై సస్పెన్షన్ వేటు వేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో విఫలమయ్యారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ప్రాణనష్టం జరిగినట్లు సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. విచారణ పూర్తయ్యే వరకు సంతోష్ కుమార్ సస్పెన్షన్‌లో కొనసాగనున్నారు. సస్పెన్షన్ కాలంలో స్థానిక హెడ్‌క్వార్టర్స్‌లోనే ఉండాలని, అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని ఆదేశించినట్లు సమాచారం.బిల్డర్ సాజిద్ ఖాన్ పరారీఈ భవనాన్ని నిర్మిస్తున్న బిల్డర్ సాజిద్ ఖాన్ పరారీలో ఉన్నట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. అంజయ్యనగర్‌లో సాజిద్ నిర్మిస్తున్న భవనాలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన తెలిపారు. చిన్న స్థలాల్లో అధిక అంతస్తులు నిర్మించి వాటిని హాస్టళ్లుగా వినియోగిస్తున్నారన్న ఆరోపణలపైనా అధికారులు దృష్టి సారించారు. సాజిద్ నిర్మించిన ఇతర భవనాల వివరాలను కూడా అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను తొలగిస్తామని రంగనాథ్ స్పష్టం చేశారు. అంజయ్యనగర్‌లో ఇలాంటి అక్రమ నిర్మాణాలు మరిన్ని ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.50 గజాల్లో 7+1 నిర్మాణంఈ ఘటనలో ప్రధానంగా వెలుగులోకి వస్తున్న అంశం భవనం నిర్మాణం. కేవలం 50 గజాల స్థలంలో ఏడంతస్తులతో పాటు పెంట్‌హౌస్ నిర్మాణం చేపట్టినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. భవనం నాలాను ఆనుకుని నిర్మించినట్లు, సరైన సెట్బ్యాక్లు కూడా లేవని అధికారులు చెబుతున్నారు. భవనానికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి అనుమతి లేదని అధికారుల నుంచి సమాచారం. ఇంత చిన్న స్థలంలో ఇంత భారీ నిర్మాణం ఎలా కొనసాగిందన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. నిర్మాణం దాదాపు పూర్తయ్యే దశకు చేరుకున్నప్పటికీ అధికారులు ఎందుకు అడ్డుకోలేకపోయారన్న అంశంపైనా విచారణ జరుగుతోంది.అధికారుల పాత్రపైనా అనుమానాలుఒకవైపు బిల్డర్ పరారీలో ఉండగా.. మరోవైపు ఇంత చిన్న స్థలంలో భారీ నిర్మాణం ఎలా కొనసాగిందన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. భవన నిర్మాణంపై గతంలో ఫిర్యాదులు వచ్చినా చర్యలు ఎందుకు తీసుకోలేదన్న కోణంలోనూ అధికారులు దృష్టి సారిస్తున్నారు. బిల్డర్‌కు ఎవరి అండ ఉంది? అక్రమ నిర్మాణం ఇంతవరకు ఎలా సాగింది? నిబంధనలను పర్యవేక్షించాల్సిన అధికారులు ఏం చేశారు? అనే ప్రశ్నలకు విచారణలో సమాధానాలు రానున్నాయి. -
కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి కూల్చివేతలా?
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరిలోని సర్వే నంబర్ 194/1లోని వాణి కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లోని ప్లాట్లకు సంబంధించి కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి కూల్చివేతలు చేపట్టిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. సుమోటోగా ధిక్కరణ కేసు నమోదు చేసిన న్యాయస్థానం నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. రెవెన్యూ అధికారులు.. తాము ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని చెబుతున్నప్పుడు కూల్చివేత ఎలా చేపట్టారని నిలదీసింది. ఎవరినీ సంప్రదించకుండానే కోర్టు పరిధిలోని అంశంలో ఇష్టానుసారం జోక్యం చేసుకోవడం అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేసింది.రంగనాథ్ చర్యల కారణంగా ఇతర అధికారులు వచ్చి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని మండిపడింది. సమగ్ర వివరాలతో నివేదిక అందజేయాలని కలెక్టర్ ను ఆదేశించింది. కూల్చివేతలపై కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రాకు స్పష్టం చేసింది. తదుపరి విచారణ వచ్చే నెల 9కి వాయిదా వేసింది. జూలై 18న తమ ప్రాపర్టీ చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్‌ను అధికారులు కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ సికింద్రాబాద్‌కు చెందిన లింగారావు తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ధిక్కరించారని, కూల్చివేసిన ప్రహరీని పునరుద్ధరించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. జిల్లా కలెక్టర్, మల్కాజిగిరి ఎమ్మార్వో, తిరుమలగిరి తహసీల్దార్లు హాజరు కావాలన్న గత ఆదేశాల మేరకు వారు కోర్టుకు హాజరయ్యారు. ఆ ఆస్తుల వివరాలివ్వండి.. రెవెన్యూ శాఖ తరఫున జీపీ కాట్రం మురళీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సర్వే నంబర్ 194లో 12 ఎకరాల పట్టా భూమి ఉందన్నారు. ఇందులో నాలుగెకరాలు యూఎల్సీ కింద సర్కార్‌కు హక్కులు దఖలుపడ్డాయన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. కూల్చివేత సమయంలో సర్వేయర్లు, తహసీల్దార్లు ఉన్నారా అని ప్రశ్నించగా, ఎవరూ లేరని రెవెన్యూ అధికారులు బదులిచ్చారు. కూల్చివేతపై తాము ఎలాంటి ఆదేశాలివ్వలేదన్నారు. మరి ఎలా కూల్చివేశారని హైడ్రాను ప్రశ్నించారు. ప్రభుత్వ సర్వేయర్లు రానప్పుడు ప్రైవేట్‌గా ఎవరినైనా పెట్టుకున్నారా అని ప్రశ్నించారు. ఎన్ని కూల్చివేతలు చేపట్టారని అడిగారు. 30 నుంచి 40 దాకా కూల్చివేతలు చేపట్టినట్లు చెప్పారు. రెవెన్యూ అధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు, సంబంధిత రికార్డులు లేకుండానే జీఎల్ఆర్ నంబర్లు 243, 255ను సర్వే నంబర్ 194/1తో అనుసంధానించి కూల్చివేతలు, ఫెన్సింగ్ చేపట్టినట్లు న్యాయమూర్తి ప్రాథమికంగా అభిప్రాయపడ్డారు. ఈ చర్యలతో గతంలో వివిధ రిట్ పిటిషన్లలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఉల్లంఘించినట్లు పేర్కొన్నారు. రెవెన్యూ అధికారుల నుంచి నిర్దిష్ట ఆదేశాలు లేకుండానే ప్రహరీలను కూల్చివేసి, ఫెన్సింగ్ ఏర్పాటు చేసినట్లు ప్రాథమికంగా తేలడంతో రంగనాథ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో హైడ్రాపై సుమోటోగా ధిక్కరణ కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించారు. అలాగే, హైడ్రా ఏర్పాటుకు ముందు వివిధ రిట్ పిటిషన్లలో కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు హైడ్రాకు తెలియజేయకపోవడంతో అవి ఉల్లంఘనకు గురయ్యే అవకాశం ఉందన్నారు. ఇకపై హైడ్రా పరిధిలోని అన్ని జిల్లాల కలెక్టర్లు తమ పరిధిలో అమల్లో ఉన్న కోర్టు ఉత్తర్వులను హైడ్రాకు తప్పనిసరిగా తెలియజేసేలా తగిన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. -
నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి
సాక్షి, హైదరాబాద్: హైడ్రా పరిధిలో 150 డ్రైవర్ పోస్టుల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌కు స్పందించి వచ్చిన వేలాది మంది నిరుద్యోగులను ప్రభుత్వం అవమానించిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఉద్యోగాల కోసం వచ్చిన వారిని దుర్భాషలాడుతూ వారికి కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారం కోసం ఎన్నికల సమయంలో ఉద్యోగాలు ఇస్తామంటూ యువత, నిరుద్యోగులకు హామీలు గుప్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వారి పట్ల కర్కశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇంజనీరింగ్ విద్యార్థులను ‘క్రిమినల్ వేస్ట్’అని దూషించిన సీఎం బాటలోనే అధికారులు కూడా నిరుద్యోగులను దూషిస్తున్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2లక్షల ఉద్యోగాలు ఇస్తామనే హామీ.. 32 నెలలు దాటినా అమలుకు నోచుకోవడం లేదని మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులకు బోగస్ హామీలు ఇచ్చిన ప్రభుత్వ తీరుపై యువతలో నిరాశ పెరుగుతోందని తెలిపారు. ఉన్నత విద్య చదివిన వారు కూడా చిరుద్యోగాల కోసం పోటీ పడాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. కాగా ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకుంటున్న పార్టీ నేతలను హరీశ్‌రావు శనివారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు. బ్రూవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీ ప్రసాద్, బీఆర్ఎస్ నాయకులు క్యామ మల్లేశ్‌ను పరామర్శించారు. ఆయన వెంట ఎమ్మెల్యే దేవిరెడ్డి సు«దీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి మహమూద్ అలీ తదితరులు ఉన్నారు. -
హైడ్రా రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలపై పోలీసు కేసులు
-
కోర్టు ధిక్కారంపై చట్టం ఏమంటోంది?
‘హైడ్రా’ కమిషనర్‌పై అరవైకి పైగా కోర్టు ధిక్కార వ్యాజ్యాలున్నాయనీ, ఆయన్ని ఈ బాధ్యత నుంచి తప్పించాలనీ ఇటీవల తెలంగాణ ఉన్నత న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ‘అధికార వికేంద్రీకరణ’ ముఖ్యం. శాసన, కార్యనిర్వాహక, న్యాయ అనే మూడు వ్యవస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. శాసన సభలు చట్టాలు చేస్తాయి, ‘కార్యనిర్వాహకవర్గం’ ఆ చట్టాలను అమలు చేస్తుంది. న్యాయ వ్యవస్థ చట్టాల అమలు జరగకపోతే జరిగేలా ఆదేశా లిస్తుంది.స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా న్యాయ స్థానాలు వ్యవహరించేందుకు రాజ్యాంగం ద్వారా తగు ఏర్పాటు జరిగింది. హైకోర్టు, సుప్రీం కోర్టు లకు కంటెంప్ట్ అధికారం కూడా రాజ్యాంగంలోని 215, 129 అధికరణాల ద్వారా దఖలుపడింది. దేశంలోని అన్ని న్యాయ స్థానాలు, అధికారులు సుప్రీం కోర్టుకు సహాయ సహకారాలు అందించాలని 144వ అధికరణం నిర్దేశించింది.కోర్టులు చట్టాలననుసరించి న్యాయ నిర్ణయం చేయాలి. కానీ, సంపూర్ణ న్యాయం చేయడానికి, చట్టాలను దాటి కూడా న్యాయ నిర్ణయం చేసే అధికారం ఆర్టికల్ 142 ద్వారా, సుప్రీంకోర్టుకు (విశేషాధికారాలను) కల్పించింది రాజ్యాంగం. న్యాయస్థానాల తీర్పులను గౌరవించి వాటిని అమలుపరచాలన్నది ప్రాథమిక సూత్రం. ఒక వేళ, న్యాయం జరగలేదని అనిపిస్తే, సుప్రీంకోర్టు వరకు అప్పీల్ చేసుకొనే అవకాశం ఉంది.చట్టం ఏం చెబుతోంది?న్యాయస్థానాల తీర్పులను గౌరవించకపోతే, న్యాయవ్యవస్థ ఉనికే ప్రశ్నార్థకమౌతుంది. అందుకే న్యాయస్థానాల తీర్పులను గౌరవించ డానికి, అమలుపరచడానికి కోర్టులకు ‘కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ చట్టం– 1971’ ద్వారా ‘కంటెంప్ట్’ అధికారం కలుగచేసింది పార్లమెంటు. ఈ చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం, న్యాయస్థానాల ఆదే శాలు ఉల్లంఘించినవారికి, ఆరు నెలల వరకు జైలు శిక్ష, రెండు వేల రూపాయల వరకు జరిమానా లేక ఈ రెండూ కూడా విధించవచ్చు. కక్షిదారులేకాక, మరెవరైనా న్యాయస్థానాల ఆదేశాల అమలులో అడ్డంకులు కలిగిస్తే, వారు కూడా శిక్షార్హులే. ‘కంటెంప్ట్’ అధికారం కేవలం హైకోర్టు, సుప్రీంకోర్టులకు మాత్రమే కలుగచేసింది ఈ చట్టం. కేవలం శిక్ష నుంచి తప్పించుకోవడానికి కాక నిజాయితీగా ‘క్షమార్పణ’ వేడితే శిక్ష వేయకుండా, లేదా తక్కువ కాలానికి శిక్ష విధించవచ్చని ఈ చట్టం స్పష్టం చేసింది. కిందిస్థాయి న్యాయ స్థానాల ఆదేశాలను పాటించనివారిపై ‘కంటెంప్ట్’ను విచారించి శిక్షించే అధికారాన్ని హైకోర్టులకే ఇచ్చింది ఈ చట్టం.కోర్టులు చాలా అరుదుగా ఈ అధికారాన్ని వినియోగించాలని సుప్రీంకోర్టు చెప్పింది. కోర్టు తీర్పులను నిజాయితీగా విమర్శించ డాన్ని ఈ చట్టం ‘కంటెంప్ట్’గా పరిగణించదు. కోర్టు తీర్పులను గుణాత్మకంగా విమర్శించవచ్చు. కానీ, తీర్పునిచ్చిన న్యాయ మూర్తిని వ్యక్తిగతంగా విమర్శిస్తే కోర్టు ధిక్కరణకు పాల్పడిన వారవుతారు. ఇంతవరకు, కోర్టు ధిక్కరణ నేరానికి ఎక్కువ కాలానికి శిక్ష అనుభవించింది జస్టిస్ కర్ణణ్. సుప్రీంకోర్టు ఆదేశాలను ఖాతర్ చేయకపోవడమే కాకుండా, ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకే సమన్లు పంపి, వారికి జైలు శిక్ష విధించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది సుప్రీంకోర్టు. మొత్తం మీద ప్రభుత్వ అధికారులే ఎక్కువగా కోర్టు ధిక్కరణ కేసులను ఎదుర్కోవడం గమనార్హం.– హరీష్ కుమార్ కొలిచాల, న్యాయవాది, అసిస్టెంట్ జనరల్ మానేజర్ (విశ్రాంత), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా -
‘ఫేక్ ఎన్వోసీలపై సీరియస్‌గా దృష్టి పెట్టాం’
హైదరాబాద్: ఇంటర్మీడియట్ కాలేజీలకు ఫైర్ ఎన్వోసీని తప్పనిసరి చేశామని, తమకు వచ్చిన ఎన్వోసీలను హైడ్రాతో కమ్యూనికేట్ చేయడం వల్ల బోగస్ అని తేలినట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి సెక్రటరీ అభిలాష అభినవ్ తెలిపారు. హైడ్రాకు వచ్చిన అప్లికేషన్లు తమకు ఇవ్వడం వల్ల ఫేక్ ఎన్వోసీల గుట్టు రట్టయ్యిందన్నారు. ఫేక్ ఎన్వోసీలపై విచారణ జరుగుతుంది. ఎన్ని ఫేక్ ఎన్వోసీలు ఇచ్చారనేది విచారణ తర్వాతే తేలుతుంది. ఫేక్ ఎన్వోసీలపై హైడ్రా, ఇంటర్మీడియట్ బోర్డు సీరియస్‌గా ఉంది. ఇంటర్మీడియట్ బోర్డు ఇంటర్నల్ ఎంక్వరీ కూడా చేస్తున్నాం. విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దు. విద్యార్థులు నష్టపోకుండా అన్ని చర్యలు చేపడతాం. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో అన్ని వివరాలు ఉన్నాయి. డౌట్ ఉంటే తల్లిదండ్రులు చెక్ చేసుకోవచ్చ. ఈసారి 3 ఏల పైచిలుకు కాలేజీలు పర్మిషన్ తీసుకున్నాయి’ అని తెలిపారు.కాగా, ఇంటర్మీడియట్ కాలేజీలకు ఫైర్ ఎన్వోసీల భాగంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్వోసీలు (NOCలు) సృష్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది ప్రైవేట్ కాలేజీలపై కేసు నమోదైంది. దీంతో, ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.అయితే, ఈ నకిలీ ఎన్వోసీలను ఇంటర్ బోర్డుకు సమర్పించి గుర్తింపు పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. హైడ్రా పేరుతో తయారు చేసిన నకిలీ పత్రాల వ్యవహారం వెలుగులోకి రావడంతో, సంబంధిత కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.హైడ్రా రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలపై కేసు -
హైడ్రా రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలపై కేసు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో నకిలీ పత్రాల వ్యవహారం కలకలం రేపుతోంది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ ఫైర్ ఎన్వోసీలు (NOCలు) సృష్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎనిమిది ప్రైవేట్ కాలేజీలపై కేసు నమోదైంది. దీంతో, ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.అయితే, ఈ నకిలీ ఎన్వోసీలను ఇంటర్ బోర్డుకు సమర్పించి గుర్తింపు పొందేందుకు ప్రయత్నించినట్లు అధికారులు గుర్తించారు. హైడ్రా పేరుతో తయారు చేసిన నకిలీ పత్రాల వ్యవహారం వెలుగులోకి రావడంతో, సంబంధిత కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై హైదరాబాద్‌లోని లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. నకిలీ పత్రాల తయారీ, ఫోర్జరీ, మోసం తదితర అభియోగాల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు నమోదు చేసిన కేసులో భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 337, 336(3), 340(2), 318(4), 3(5) కింద చర్యలు తీసుకుంటున్నారు.కాగా, పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెల్లాపూర్, చిక్కడపల్లి, ఎస్ఆర్ నగర్, మెహిదీపట్నం, బర్కత్‌పుర ప్రాంతాల్లో ఉన్న కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఈ ఫోర్జరీ వ్యవహారంలో భాగస్వాములుగా ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. ఇదే తరహాలో మరిన్ని అక్రమాలు జరిగాయా? అన్న కోణంలో అధికారులు విచారణను ముమ్మరం చేశారు. మరో 60 కాలేజీలకు సంబంధించిన ఎన్వోసీలను కూడా స్క్రూటినీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు.. హైడ్రా పేరును ఉపయోగించి, ప్రభుత్వ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేయడం తీవ్ర నేరమని అధికారులు చెబుతున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని కాలేజీలపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది.ఎనిమిది కాలేజీలు ఇవే..మెహిదిపట్నంలోని ప్రియాంకా జూనియర్ కాలేజ్విద్యానగర్లోని మదర్స్ గర్ల్స్ జూనియర్ కాలేజ్చాంద్రాయణ గుట్టలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్చిక్కడపల్లిలోని న్యూఎరా జూనియర్ కాలేజ్శివరాంపల్లిలోని షాహిర్ జూనియర్ కాలేజ్తెల్లాపూర్లోని వశిష్ట జూనియర్ కాలేజ్బర్కత్పురలోని హైందవి జూనియర్ కాలేజ్ఎస్ఆర్ నగర్‌లోని రెసిడెన్స్ జూనియర్ కాలేజ్ -
సీఎం రేవంత్ కు గట్టి ఎదురుదెబ్బ.. హైడ్రా ఉంటుందా..? ఊడుతుందా..?
-
హైడ్రా రంగనాథ్ దూకుడుకు బ్రేక్.. రేవంత్ సర్కార్‌కు ఎదురుదెబ్బ?
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరి పరిధి వారికి ఉంటుంది. సర్వాధికారాలు ఒకే వ్యవస్థకు ఉండవు. చెక్స్ అండ్ బేలెన్సెస్తో నడిచేదే ప్రజాస్వామ్యం. కాని దురదృష్టవశాత్తు కొన్నిసార్లు అధికారంలో ఉన్నవారు అందుకు విరుద్దంగా వ్యవహరిస్తుంటారు. కార్యనిర్వహణాధికారిగా ఉండవలసిన అధికారిక వ్యవస్థ కూడా ఇష్టారాజ్యంగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో చెప్పడానికి, హైదరాబాద్ లోని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై తెలంగాణ హైకోర్టు చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా కనిపిస్తాయి. రంగనాథ్‌కు సమర్దుడైన అధికారిగా పేరు ఉండవచ్చు. కాని తనకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉంటాయన్న విషయాన్ని ఆయన విస్మరిస్తున్నారన్న విమర్శ కొంతకాలంగా వినిపిస్తున్నదే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేరుగా సంబంధ, బాంధవ్యం ఉండడం కావచ్చు.. లేదా తన సహజ ప్రవృత్తి కావచ్చు.. ఏదైనా కానీ.. న్యాయ వ్యవస్థను సైతం పదే,పదే దిక్కరిస్తున్నారన్న అభిప్రాయం వల్ల ఆయనకు చిక్కులు వచ్చిపడ్డాయి. ఏకంగా ఆయనను హైడ్రా కమిషనర్ బాధ్యతల నుంచి తప్పించాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించడం తీవ్ర సంచలనం అయింది. రేవంత్ సర్కార్ కు పెద్ద ఎదురు దెబ్బే అన్నది అందరి అభిప్రాయం. రంగనాథ్‌ను ఈ సమస్య నుంచి గట్టెక్కించి,తన పరువు కాపాడుకోవడానికి రేవంత్ ప్రభుత్వం ఏ మార్గం అనుసరిస్తుందన్నది ఆసక్తికర అంశంగా ఉంది. రంగనాథ్‌ను బదిలీ చేయాలన్న కోర్టు ఆదేశం, కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకోవడమేనని ప్రభుత్వానికి చెందిన న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పదే,పదే కోర్టుధిక్కరణ కు పాల్పడుతున్నందున, ఇలాంటి అరుదైన ఆదేశం ఇవ్వవలసి వచ్చిందని కోర్టు తీర్పును సమర్ధించేవారు వ్యాఖ్యానిస్తున్నారు. న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వ వ్యవస్థకు మధ్య ఇది ఘర్షణకు దారి తీస్తుందా?లేక మద్యే మార్గంగా రాజీ కుదురుతుందా అన్న తర్జనభర్జనలు సాగుతున్నాయి. ప్రభుత్వం ఈ తీర్పుపై అప్పీల్ కు వెళ్లినప్పుడు ఎలాంటి వాదన చేస్తుందన్నదానిపై ఈ వ్యవహారం ఆధారపడి ఉండవచ్చు. హైదరాబాద్ లో ప్రభుత్వ భూమిని ,ఆక్రమణలకు గురైన చెరువులను పునరుద్దరించడానికి ఈ హైడ్రా ను రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసింది.ఈ క్రమంలో కమిషనర్ గా నియమితులైన రంగనాథ్ కొన్ని చెరువులను పరిరక్షించారన్న పేరు తెచ్చుకున్నారు. అంతవరకు మంచిదే. కాని ఆయా చోట్ల ప్రైవేటు వ్యక్తుల, నిరుపేదల ఇళ్లను కూల్చివేసిన తీరు వివాదాస్పదం అయింది. హైడ్రా ఏర్పడిన తొలినాళ్లలో ఒక ఇంటిని కూల్చిన సన్నివేశంలో ఒక చిన్నారి తన పుస్తకాలను కూడా అధికారులు తీసుకోనివ్వలేదని మీడియా ముందు చెప్పిన వీడియో వైరల్ అయింది. అది రేవంత్ సర్కార్ కు తీరని చేటు చేసింది. అలాగే కొన్నిచోట్ల అపార్టుమెంట్లు, విల్లాలను తొలగించిన వైనం మధ్య తరగతి వారిలో తీరని ఆక్రోశం మిగిల్చింది.రూపాయి,రూపాయి కూడగట్టుకుని, బ్యాంకు లోన్లు తీసుకుని తాము ఇంటిని కొనుగోలు చేస్తే, సడన్ గా హైడ్రా వచ్చి వాటిని కూల్చితే తమ పరిస్థితి ఏమిటని అనేక మంది వాపోయారు.లే అవుట్ లకు అనుమతి ఇచ్చినప్పుడు, ఇళ్ల నిర్మాణం జరుగుతున్నప్పుడు ,విద్యుత్ తదితర సదుపాయాలు కల్పిస్తున్నప్పుడు అధికారులు ఎందుకు నివారించలేదన్న ప్రశ్న వస్తుంది. విచిత్రం ఏమిటంటే ప్రభుత్వమే ఒకవైపు అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేస్తుంటుంది.మరో వైపు అక్రమ నిర్మాణాలు అంటూ అదే ప్రభుత్వం కూల్చివేతలకు దిగుతుంది. చెరువుల గర్భంలో ఆక్రమణలకు పాల్పడి ,అనధికారికంగా నిర్మాణాలు చేస్తే చర్య తీసుకోవడం తప్పుకాదు.కొన్ని చోట్ల ఆయా కాలనీలవారు స్వయంగా హైడ్రాకు ఫిర్యాదు చేసిన నేపధ్యంలో కూడా చర్యలు చేపట్టారు. పార్కులను పరిరక్షించారు. మొత్తం మీద లక్షన్నర కోట్ల విలువైన భూములను ప్రభుత్వానికి అప్పగించామని హైడ్రా కమిషనర్ చెబుతున్నారు. అది నిజమే కావచ్చు. అయినా ఎందుకు ఇప్పుడు ఇలాంటి క్రైసిస్ లో పడ్డారు?కొన్ని ప్రైవేటు స్థలాలను కూడా ప్రభుత్వ భూములుగా పరిగణించి చర్య తీసుకున్నారన్నది ఆరోపణ. ఆ సంస్థలు ,వ్యక్తులు కోర్టును ఆశ్రయించి రక్షణ పొందినా,వాటిని పట్టించుకోకుండా రంగనాథ్ వ్యవహరించారన్నది విమర్శ. లోతుకుంట భూ వివాదం కూడా అలాంటిదే. 65 కోర్టు ధిక్కరణ పిటిషన్ లు ఆయనపై పడ్డాయంటే, పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలాంటి పిటిషన్ లపై కోర్టు తీవ్రంగా స్పందించింది. కోర్టు ఆదేశాలను లెక్క చేయకపోవడంపై ఆగ్రహించింది. ఏకంగా హైడ్రాను గ్రీకు పురాణాలలోని పలు తలల రాక్షసుడిగా అభివర్ణించింది.కొద్ది రోజుల క్రితం కూడా హైకోర్టు ఒక వ్యాఖ్య చేస్తూ తాము సంయమనం పాటిస్తున్నామని, రంగనాధ్ కస్టడీకి ఆదేశించేవాళ్లమే అని హెచ్చరించింది.ఈ నేపధ్యంలో రంగనాధ్ క్షమాపణ కోరిన తీరును హైకోర్టు ఆక్షేపించింది. తాను పిటిషనర్ స్థలంలో జోక్యం చేసుకోలేదని,పిటిషనర్ ఆరోపణలన్నీ అవాస్తవమని, కోర్టు మరోలా అనుకుంటే క్షమించాలని అఫిడవిట్ లో పేర్కొన్నారు.ఇందులో నిజాయితీ లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. తీర్పు తర్వాత రంగనాద్ చేసిన వ్యాఖ్యలు కూడా గమనించదగినవే. నిజానికి ఒక అదికారిగా అంత సీరియస్ గా మాట్లాడి ఉండాల్సింది కాదేమో!భూకబ్జాదారులు ,లాండ్ మాఫియా వ్యక్తులు కోర్టులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఇది ఒకరకంగా కోర్టులతో మళ్లీ తగాదా పడినట్లే అవుతుందేమో తెలియదు. రాజకీయ వ్యవస్థలోని వారు ,రేవంత్ ప్రభుత్వంలోని బాధ్యులు ఆయన తరపున మాట్లాడి ఉంటే సమంజసంగా ఉండేదేమో!ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ నేతలు పెద్దగా ముందుకు వచ్చినట్లు కనిపించదు. అదేదో రేవంత్ చూసుకుంటారులే అన్నట్లుగా ఉన్నారేమో అనిపిస్తుంది.ఊహించినట్లే రేవంత్ సమర్ధించుకోవల్సి వచ్చింది. భూకబ్జాదారులే కోర్టులలో కేసులు వేస్తున్నారని ఆయన అన్నారు.అంతేకాక గతంలో బిఆర్ఎస్ హయాంలో సి.ఎస్.గా పనిచేసిన సోమేష్ కుమార్ పై400 కోర్టు ధిక్కరణ కేసులు పడ్డాయని ఆయన గుర్తు చేశారు. హైడ్రా ను కొనసాగించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. రంగనాద్ బదిలీపై ఆయన స్పష్టత ఇవ్వలేదు.కోర్టు తీర్పు ప్రతి చూశాక నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అంటే అప్పీల్ కు వెళ్లడానికే రంగం సిద్దం అవుతున్నదని అనుకోవచ్చు.న్యాయ వ్యవస్థ తన పరిధి దాటి ఆదేశాలు ఇచ్చిందన్నది ముఖ్యమంత్రి భావనగా కనిపిస్తుంది. అధికారి బదిలీ అన్నది ప్రభుత్వ అభీష్టం మేరకు జరుగుతుందన్నది ఆయన చెప్పకనే చెప్పారు.ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయో అప్పుడే చెప్పలేం. లోతుకుంటలోని 10వేల కోట్ల రూపాయల విలువైన భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసిందని రంగనాద్ అంటున్నారు. ఇందులో నిజానిజాలను న్యాయవ్యవస్థకు మరింత గట్టిగా వివరించే ప్రయత్నం జరిగి ఉండాల్సింది. ఆక్రమణలలో ఉన్నవాటిని కూల్చడంలో హైడ్రా వివక్ష చూపుతోందన్న విమర్శ కూడా వచ్చింది. ఉదాహరణకు దుర్గం చెరువు ఎఫ్ టి ఎల్ లో ఉన్న ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చి,వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేవరకు ఎందుకు ఆగారని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సమీప బంధువుల ఇళ్లు ఇందులో ఉండడమే కారణమని వారు ఆరోపిస్తుంటారు. దీనిపై హైడ్రా లేదా ప్రభుత్వం వివరణ ఇచ్చినట్లు కనిపించదు.రంగనాధ్ వ్యవహార శైలి చూస్తే తానేదో సర్వస్వతంత్రుడన్నట్లుగా అనిపిస్తుంటుందన్నది ఒక ఆరోపణ.ఆయన చిత్తశుద్దిని ఆక్షేపించడం లేదు కానీ.. దూకుడుగా ప్రవర్తించడాన్ని తప్పుపడుతున్నారు. కాగా రేవంత్ ఒక సందర్భంలో తాను హిట్లర్ మాదిరి ప్రవర్తిస్తానని, ఇరాన్ యుద్దంతో హైడ్రా కూల్చివేతలను పోల్చడం వివాదాస్పదం అయింది. హైదరాబాద్ లో వేల కోట్ల ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయన్నది నిజం. కాని ఆ నెపంతో పేద,మధ్య తరగతివారి ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చడం ఎంతవరకు సమర్ధనీయం అన్నది ఆలోచించుకోవాలి. ఇందులో హ్యూమన్ ఫేస్ ను కూడా జోడించి చర్యలు తీసుకుని ఉంటే బాగుండేదేమో. యుపిలో బుల్ డోజర్ రాజ్ నడుస్తోందని కాంగ్రెస్ పదే,పదే ఆరోపిస్తుంటుంది. అదే బుల్ డోజర్ రాజ్ ను తెలంగాణకు తెచ్చారని బిఆర్ఎస్ ఆరోపిస్తోంది.ఈ అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకుని రేవంత్ సర్కార్ జాగ్రత్తగా అడుగులు వేయకపోతే కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశం కూడా ఉండవచ్చు.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
హైకోర్టు తీర్పుపై రేవంత్ రియాక్షన్.. తగ్గేదే లే..
-
హైడ్రా ఒక వేట కుక్క
సాక్షి, న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హైడ్రా ఒక వేట కుక్కలా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు ధ్వజమెత్తారు. ఆ వేట కుక్కను పంపించి, దానిని అడ్డం పెట్టుకుని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని మండిపడ్డారు. హైడ్రా ద్వారా బడా బాబులను బెదిరించి డబ్బులు దండుకుంటున్నారని, ఆ డబ్బులో కొంత వాటా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాం«దీకి, మరికొంత వాటా బీజేపీకి ఇస్తున్నారని ఆరోపించారు. ‘హైడ్రా అనేది తొమ్మిది తలల విషసర్పం అని హైకోర్టే చెప్పింది.ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంతకంటే చెంపపెట్టు ఏముంటుంది? సీఎంకు సిగ్గుండాలి..’అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘హైడ్రా అనేది నువ్వు చెప్పినట్టు సంస్కరణ అయితే, మీ అన్న తిరుపతిరెడ్డి ఇల్లు, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వివేక్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావుల ఇళ్లు ఎందుకు కూల్చడం లేదు?..’అని నిలదీశారు. కేటీఆర్ మంగళవారం ఢిల్లీలో బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎంపీ దామోదరరావులతో కలసి రైల్వే, ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఎంపీ వద్దిరాజు నివాసంలో అందరితో కలిసి మీడియాతో మాట్లాడారు. నీ అన్నదమ్ములే అతిపెద్ద కబ్జాకోరులు ‘హైడ్రాపై 65 సార్లు హైకోర్టు చెప్పినా వినవా? ఇంకా ఎవరు చెప్తే వింటావ్? నేనే రాజు, నేనే మంత్రి, నేను హిట్లర్ అనుకొని, హిట్లర్‌కు ఇష్టమైన పదం ‘‘హైడ్రా’’ఐ డిమాలిíÙంగ్ ఎవ్రీథింగ్, ఇరాన్, ఇజ్రాయెల్ మాదిరిగానే ఉంటాను అంటావా? హైదరాబాద్‌ను శిథిలావస్థలోకి తీసుకునిపోతావా?ఇదేనా ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? మమ్మల్ని కబ్జాకోరులు అని అంటున్నావ్. మేం కాదు ..నీ అన్నదమ్ములే అతిపెద్ద కబ్జాకోరులు. అందరికంటే ఎక్కువ ఆస్తి దోచుకుంటున్నది, అందరికంటే ఎక్కువగా ఇవాళ విధ్వంసం చేస్తున్నది నీ మంత్రులే.హైకోర్టు చెప్పి 24 గంటలైనా ఇంకా రంగనాథ్‌ను కొనసాగించొచ్చా? మా హయాంలో ఉన్న ‘ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్’(ఈవీడీఎం) పేరు మార్చి, అన్నిటికీ రంగులేసినట్టు, సున్నాలేసినట్టు దీనికి కూడా వేసి పోజులు కొట్టడం తప్ప పీకిందేమీ లేదు. కేవలం దాన్ని అడ్డుపెట్టుకుని రేవంత్‌రెడ్డి అతిపెద్ద బ్లాక్ మెయిలర్‌గా మారారు. వాస్తవానికి అధికారంలోకి రాకముందే పెద్ద బ్లాక్ మెయిలర్. ఆర్టీఐని అడ్డం పెట్టుకొని బతికినోడు. ఇప్పుడు హైడ్రాని అడ్డం పెట్టుకొని బతుకుతున్నాడు..’అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీ రహస్య మిత్రులు బీజేపీ వాళ్లే.. రేవంత్ ఢిల్లీలో ఉన్నప్పుడే కేటీఆర్ కూడా ఉంటున్నారంటూ బీజేపీ ఎంపీ «ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రేవంత్‌రెడ్డి కేసులు పెట్టేది మా మీద. తెల్లారి లేస్తే దాడి చేసేది మా మీద. రేవంత్‌రెడ్డి రహస్య మిత్రులు బీజేపీ వాళ్లని రాష్ట్రంలో అందరికీ తెలుసు. కేంద్రమంత్రి బండి సంజయ్ కొడుకుని 9 రోజులు అరెస్టు చేయకుండా కాపాడింది రేవంత్‌రెడ్డే అనే విషయం అందరికీ తెలుసు. అమృత్ పథకంలో రేవంత్‌రెడ్డి బావమరిదికి కాంట్రాక్టులు ఇచ్చింది ఎవరో అందరికీ తెలుసు. సింగరేణిలో కుంభకోణం జరుగుతుంటే, అక్కడ సృజన్‌రెడ్డి నాయకత్వంలో, రేవంత్‌రెడ్డి బావమరిది నాయకత్వంలో భారీ కుంభకోణాలు జరుగుతుంటే, మేము వచ్చి ఇక్కడ ఫిర్యాదు చేస్తే కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదని అందరికీ తెలుసు..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. 2014లో కూడా బకాయిలున్నాయి.. ‘మేము అధికారంలోకి వచి్చనప్పుడు 2014లో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.4 వేల కోట్లు ఉన్నాయి. వాటిని మేం చెల్లించలేదా? బకాయిలు అనేది నిరంతర ప్రక్రియ..’అని కేటీఆర్ వివరణ ఇచ్చారు. ‘చెల్లని నాణేనికి గీతలు ఎక్కువ, చేతగానోడికి మాటలు ఎక్కువ..’అంటూ ఎద్దేవా చేశారు. జనాభా ప్రాతిపదికన లోక్‌సభ స్థానాల పునరి్వభజన చేపట్టి దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గిస్తే తీవ్రంగా వ్యతిరేకిస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రజలకు మరింత చేరువ కావాలంటే లోక్‌సభ స్థానాల కంటే దేశవ్యాప్తంగా ఎమ్మెల్యే స్థానాలను పెంచాలని సూచించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం తీసుకొచ్చే సంస్కరణలకు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని, అయితే కొత్త బిల్లులు తెచ్చేముందు గతంలో నియమించిన కమిటీల సిఫార్సుల అమలుపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాజీపేట రైల్వే డివిజన్, వరంగల్‌లో ఏఐ సెంటర్ కాజీపేటలో ప్రత్యేక రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కోరినట్లు కేటీఆర్ తెలిపారు. కొత్తగూడెం రైల్వే డివిజన్ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని, సిరిసిల్ల, వేములవాడ స్టేషన్లను అమృత్ భారత్ పథకంలో చేర్చాలని కోరామన్నారు. వరంగల్‌లో ఇండియా ఏఐ సెంటర్ లేదా ఏఐ డేటా ల్యాబ్ ఏర్పాటుచేయాలని, కరీంనగర్ లేదా ఖమ్మంలో సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, ఎస్టీపీఐ కేంద్రాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. -
బీఆర్ఎస్ వచ్చాక.. హైడ్రా బంగాళాఖాతంలోకే.. కేటీఆర్
సాక్షి, ఢిల్లీ: హైడ్రాపై హైకోర్టు ఇచ్చిన తీర్పు సీఎం రేవంత్‌కు చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైడ్రా ను అడ్డుపెట్టుకొని రేవంత్ రెడ్డి దందాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ రోజు (మంగళవారం) ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించారు.హైడ్రా పేరుతో పేదల ఇళ్లను అన్యాయంగా కూలగొట్టారని కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్‌ను కుప్పకూల్చారన్నారు. హైడ్రా అనేది బ్లాక్ మెయిల్ చేసి దోపిడి చేసే సంస్థని బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే హైడ్రా ను బంగాళాఖాతంలో వేస్తామని స్పష్టం చేశారు. హైడ్రా పేరుతో బిల్డర్లను భయపెట్టి ఒక్కో బిల్డర్ వద్ద ఫీట్ కు 200 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు.కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో రైల్వే పనులన్నీ స్తంభించిపోయాయని కేటీఆర్ ఆరోపించారు.హైడ్రా అనే సంస్థ తొమ్మిది తలల విషసర్పంలా మారిందని, కేవలం పేదల ఇళ్లపైనే హైడ్రా చర్యలు తీసుకుంటోందని, అధికార పార్టీ నేతలు, మంత్రులు, వారి కుటుంబాలకు చెందిన అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.రాష్ట్రంలోని నిషేధిత భూముల విస్తీర్ణం బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 16 లక్షల ఎకరాలు ఉండగా, కాంగ్రెస్ హయాంలో అది కోటి ఎకరాలకు చేరిందని తెలిపారు.భూ వ్యవహారాల్లో అవినీతి, కమిషన్ల కోసం నిషేధిత భూముల జాబితాను పెంచుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలుచేశారు.హైదరాబాద్‌లో వేలాది ఇళ్లను కూల్చివేసి, ఒక్క కొత్త ఇల్లు కూడా నిర్మించలేదని దీంతో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిందన్నారు. పెద్ద నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా, సామాన్య ప్రజల ఇళ్లనే లక్ష్యంగా చేసుకుంటున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డిసోదరుడు తిరుపతి రెడ్డి,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,పట్నం మహేంద్ర రెడ్డి,మంత్రి వివేక్ నివాసాలను ఎందుకు కూల్చడం లేదు.బిల్డర్స్ ను బెదిరించి డబ్బులు వసూల్ చేస్తున్నారని హైడ్రా సంస్థ సీఎం రేవంత్‌కు వేటకుక్కలా మారిందని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. -
హైడ్రా మేము తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణ: సీఎం రేవంత్
ఢిల్లీ: కబ్జా కోర్లే హైడ్రా వద్దంటున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కబ్జా చేస్తే బడా బాబులైనా, పేదలైనా ఊరుకోమన్నారు. హైడ్రా పనులు కొనసాగించి తీరుతామని రేవంత్ స్పష్టం చేశారు. నిన్న( సోమవారం, జూలై 27వ తేదీ) హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అసలు హైడ్రానే వద్దనే వాదన కూడా తెరపైకి వచ్చింది. దీనిపై సీఎం రేవంత్ ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడుతూ.. కబ్జా కోర్లే హైడ్రా వద్దంటున్నారని, గండిపేట బతుకమ్మ కుంటలను ఆక్రమించింది పేదల పెద్దలా? అని ప్రశ్నించారు. కబ్జా కోర్లకు మీడియా కూడా సహకరించకూడదన్నారు రేవంత్. ‘హైడ్రా పనులను కొనసాగించి తీరుతాం. కబ్జా కోర్లు హైడ్రావద్దంటున్నారు. కబ్జాలు చేస్తే బడా బాబులైనా, పేదలైనా ఊరుకోం. ఎన్ కన్వెన్షన్ పేదలదా పెద్దలదా?, హైడ్రా మేము తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణ. ఏ అధికారిని నియమించాలనే విచక్షణ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. బిఆర్ఎస్ నేతలు దురుద్దేశంతో కేసులు వేసి కోర్టును తప్పుదోవ పట్టించారు. కోర్టు తీర్పుని పరిశీలించి తదుపరి కార్యాచరణ రూపొందిస్తాం. హైడ్రా కార్యాచరణ పైన మాకు పూర్తి స్పష్టత ఉంది. డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో హైడ్రా పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని మండిపడ్డారు. -
హైడ్రా కమిషనర్ గా రంగనాథ్‌ను తప్పించాలని హైకోర్టు ఆదేశాలు
-
ల్యాండ్ మాఫియా తప్పుదోవ పట్టిస్తోంది
సాక్షి, హైదరాబాద్: లోతుకుంట భూముల కేసులో హైకోర్టు తీర్పు నేపథ్యంలో సోమవారం హైడ్రా కమిషనర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘హైడ్రా కమిషనర్‌గా రాజ్యాంగ స్ఫూర్తిననుసరించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48 (ఏ) ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షిస్తున్నా. మార్కెట్లో వీటి విలువ రూ.1.50 లక్షల కోట్లు (17 బిలియన్ డాలర్లు). ఆరు చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాం. మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. బడా బాబులు ఆక్రమించిన వందల చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూములను హైడ్రా ఈ రెండేళ్లల్లో వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించింది. నిజం వైపు నిజాయితీగా నిర్భయంగా, నిబద్ధతతో పని చేస్తాం కాబట్టే హైడ్రాకు ధైర్యం. ల్యాండ్ మాఫియా, భూ కబ్జాదారులు తప్పుడు సమాచారంతో కోర్టులను తప్పు దోవ పట్టిస్తున్నారు. అంతా బడా భూ కబ్జాదారులే..లోతుకుంట భూమి విషయంలో దాదాపు రూ.10 వేల కోట్ల విలువైన భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కాజేయాలని చూసింది. అనుమతులు లేకుండా 2,500 కోట్ల సంవత్సరాల హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ వందల చెట్లను నరికేసింది. సేవ్ ది రాక్స్ సొసైటీ, పర్యావరణవేత్తలతో పాటు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే హైడ్రా రంగంలోకి దిగింది. ఎక్కడో మూడు కిలోమీటర్ల అవతల ఉందని చెబుతూ లేని భూమిని చూపిస్తూ, ఈ బిల్డర్ 120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి వచ్చి ఆక్రమించి నా మీద ధిక్కరణ కేసు వేశారు. నా మీద 63 ధిక్కరణ కేసులు ఉన్నాయి.వాటిని వేసింది బడా భూ కబ్జా దారులే. బతుకమ్మ కుంట చెరువును మింగేయాలని చూసిన ఒకరు, లోతుకుంటలో రూ.వేల కోట్ల ప్రభుత్వ భూమిని కొట్టేయాలని చూసిన ఇంకొకరు, సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్‌లు కట్టాలని చూస్తున్న సంధ్యా శ్రీధర్‌రావు, వేల సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ప్లాట్లను కొట్టేయాలని చూసిన ఒక నల్ల మల్లారెడ్డి, క్రిమినల్ మాఫియాగా చలామణి అవుతూ రూ.వేల కోట్ల విలువైన సామాన్యుల ప్లాట్లు, ప్రభుత్వ భూములు ఆక్రమించిన ముఖీం.. వీరందరికీ అడ్డు పడటమే హైడ్రా కమిషనర్‌గా నేను చేసిన తప్పు.కోర్టుల పట్ల నమ్మకం, చట్టాల పట్ల గౌరవం ఉందినా మీద ఉన్న 63 కోర్టు ధిక్కార కేసులు వీళ్లంతా వేసినవే. వాటిని నేను చట్ట పరంగానే ఎదుర్కొంటా. నాకు న్యాయస్థానాలు అంటే పూర్తి నమ్మకం ఉంది. చట్టాల పట్ల గౌరవంతోనే పని చేస్తూ వస్తున్నా. గతంలో, ఇప్పుడు, మున్ముందు ప్రభుత్వాలు ఏ బాధ్యతలు అప్పగించినా నేను నా వైపు నుంచి 100 శాతం ఫలితాలు ఇవ్వటమే లక్ష్యంగా ఉంటా. అలాగే పని చేస్తున్నా. భవిష్యత్తులో కూడా అదే నిబద్ధతతో పని చేస్తా..’ అని రంగనాథ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. -
ప్రతి అడుగులోనూ అంతులేని ఆవేదన!
సాక్షి, హైదరాబాద్: చెరువుల ఫుల్ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్), ప్రభుత్వ భూములు, నాలా పరిరక్షణ పేరుతో హైడ్రా వేసిన ప్రతి అడుగుతోనూ నిరుపేదలే నష్టపోయారనే అభిప్రాయం సర్వత్రా ఉంది. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, సరైన సమాచారం లేకుండా, కొన్నిసార్లు కనీసం ఇంట్లోని వస్తువులు, పుస్తకాలూ కూడా తీసుకునే సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టి పేదల కన్నీటికి, తీరని వేదనకు కారణమయ్యిందనే విమర్శలు ఉన్నాయి. సున్నం చెరువుతో ప్రారంభిస్తే అనేక కూల్చివేతల్లో నిరుపేదలు గూడు కోల్పోయి కట్టబట్టలతో మిగిలారు.హైడ్రా కూల్చివేతల్లో అత్యంత వివాదాస్పదమైన అంశం సున్నం చెరువు కూల్చివేతలు. మాదాపూర్‌లో ఉన్న ఈ చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మాణాల పేరుతో హైడ్రా 2024 సెప్టెంబర్‌లో కూల్చివేతలు చేపట్టింది. ఈ సందర్భంలో స్థానికులు కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. తమకు ముందస్తు నోటీసులు ఇవ్వలేదని బాధితులు ఆరోపించారు. అప్పట్లో చిన్నారులు గూడుతో పాటు పుస్తకాలను సైతం కోల్పోయారు. ఈ ఘటన తర్వాత ‘నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చబోమని’ హైడ్రా ప్రత్యేక వివరణ ఇవ్వాల్సి వచ్చింది. రోడ్డున పడిన వందల కుటుంబాలుఅమీన్పూర్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్, ప్రభుత్వ భూముల్లో నిర్మించిన విల్లాలు, భవనాలతో పాటు షెడ్లను సైతం హైడ్రా కూల్చివేసింది. ఇక్కడా బాధితులు నోటీసులు లేకుండానే కూల్చివేతలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. అలాగే కూకట్పల్లి నల్లచెరువు ఎఫ్టీఎల్లో ఉన్న షెడ్లు, వాణిజ్య నిర్మాణాలు, ఇతరాలను హైడ్రా తొలగించింది. ఈ సందర్భంలోనూ బాధితులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. దుండిగల్ పరిధిలోని మల్లంపేట కత్వా చెరువు వద్దా ఇలాంటిదే జరిగింది.గాజుల రామారం సర్వే నం.307 లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు 350 ఎకరాలు కేటాయించింది. ఈ స్థలంలో పేదలు ఇల్లు కట్టుకోగా అక్టోబర్ 2025లో హైడ్రా 800కు పైగా నిర్మాణాలను తొలగించింది. దీంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇదిలా ఉంటే అదే సర్వే నంబర్లో ప్రగతినగర్ ఆనుకొని ఓ ఎమ్మెల్యే 30 ఎకరాల వరకు స్థలాన్ని కబ్జా చేయగా హైడ్రా అడ్డుకుంది. అయితే తెల్లారేసరికే అదే స్థలం చుట్టూ ఎమ్మెల్యే మనుషులు ఫెన్సింగ్ వేయగా హైడ్రా ఇంతవరకు వారి పైన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఫాతిమా కాలేజీ వ్యవహారంలో ద్వంద్వ వైఖరిఫాతిమా కాలేజీ (బారిస్టర్ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్) వివాదం హైడ్రా చేపట్టిన చెరువుల ఆక్రమణల తొలగింపు చర్యల్లో అత్యంత చర్చనీయాంశమైంది. చాంద్రాయణగుట్టలోని సల్కం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో కళాశాల ఉందనే ఆరోపణలు ఉన్నాయి. న్యాయవాది విజయ్ గోపాల్ తెలంగాణ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ఆ పిటిషన్లో బారిస్టర్ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ సల్కం చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతంలో ఉందని, అయినప్పటికీ హైడ్రా ఇతర ప్రాంతాల్లో కూల్చివేతలు చేపడుతున్నట్టుగా ఇక్కడ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.దీని విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు రెవెన్యూ, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, పాఠశాల విద్యాశాఖ అధికారులను పలుమార్లు ప్రశ్నించింది. కళాశాలకు ఎవరు అనుమతులు ఇచ్చారు? ఎఫ్టీఎల్ హద్దులు ఏమిటి? నిర్మాణం ఎలా అనుమతించబడింది? అనే అంశాలపై పూర్తి రికార్డులు సమర్పించాలని ఆదేశించింది. అధికారులు పలుమార్లు పూర్తి వివరాలు సమర్పించకపోవడంతో కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంతో హైడ్రాపై ‘ఎంపిక చేసిన వారిపైనే చర్యలు తీసుకుంటోంది‘ అనే విమర్శలు వచ్చాయి.చెరువుల ఎఫ్టీఎల్లో ఉన్న చిన్న ఇళ్లు, వాణిజ్య భవనాలను కూల్చుతున్న హైడ్రా, ఈ విద్యాసంస్థపై మాత్రం చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్ష పార్టీలు, కొందరు ప్రజాప్రతినిధులు, పిటిషనర్ వాదించారు. రాజకీయ ప్రభావం కారణంగానే చర్యలు ఆలస్యం అవుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపించాయి. అలాగే మూసీ పరివాహక ప్రాంతాలు, హుస్సేన్‌సాగర్ ఎఫ్టీఎల్ పేరుతో ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తాల్లో ఇళ్లు కూల్చివేస్తారనే ప్రచారంతో వందలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్వయంగా వెళ్లి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.ఎన్ని మొట్టికాయలో..!కూకట్‌పల్లిలోని ఎన్వీఎన్ కన్స్ట్రక్షన్స్కు సంబంధించిన కేసులోనూ హైడ్రా వివాదాస్పదమైంది. కోర్టు రక్షణలో ఉన్న భూమిలో కూల్చివేతలు, కాంపౌండ్ తొలగింపు, విద్యుత్ కనెక్షన్ నిలిపివేత జరిగాయని ఆరోపణలు రావడంతో భూమిని మునుపటి స్థితికి తీసుకురావాలని రెవెన్యూ, హైడ్రా అధికారులను హైకోర్టు ఆదేశించింది. గుడిమల్కాపూర్‌లోని ఓ భూమికి సంబంధించి పాత కోర్టు డిక్రీలు ఉన్నప్పటికీ హైడ్రా షెడ్ కూల్చి ఫెన్సింగ్ వేసిందనే ఆరోపణలు వచ్చాయి.ఈ వివాదంపై ఘాటుగా స్పందించిన కోర్టు ఫెన్సింగ్ తొలగించి స్టేటస్కో కొనసాగించాలని ఆదేశించింది. బహదూర్‌గూడలో రైతులు వ్యవసాయం చేస్తున్న భూములకు హైడ్రా ఫెన్సింగ్ వేసిందని పిటిషన్ దాఖలైంది. ఈ కేసులో విచారణ పూర్తయ్యే వరకు బలవంతపు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.ఐలాపూర్ (అమీన్పూర్) భూముల కేసులో స్టేటస్కో ఉల్లంఘించారని హైడ్రా కమిషనర్‌తో పాటు ఇతర అధికారులకు హైకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. ఇక లోతుకుంటలో శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ కేసులో హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ హైడ్రా జోక్యం చేసుకుందని సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. ఇదే కేసు విచారణ చివరకు కమిషనర్‌ను తొలగించాలనే ఆదేశాలకు దారితీసింది.మెడకు చుట్టుకున్న ‘లోతుకుంట’ వివాదంహైడ్రా తన రెండేళ్ల ప్రస్తానంలో ఎన్నో వివాదాల్లో చిక్కుకుంది. ముఖ్యంగా లోతుకుంట భూముల వివాదంతో హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సీఎం రేవంత్‌రెడ్డి 2024 జూలై 12న హైడ్రా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. అదే నెల 19 నుంచి అది అమలులోకి వచ్చింది. అంబర్‌పేటలోని బతుకమ్మకుంట విషయంలో హైకోర్టు ఇచ్చిన స్టేటస్కో ఆదేశాలను ఉల్లంఘిస్తూ హైడ్రా పనులు చేపట్టిందనే ఆరోపణలు వచ్చాయి. కమిషనర్ రంగనాథ్ ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని న్యాయస్థానం పేర్కొంది. అక్కడ ఏర్పాటు చేసిన బోర్డులు, నిర్మాణాలు తొలగించి, నాలుగు వారాల్లో అమలు నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో హైడ్రా చర్యలు తీసుకుంది. -
‘హైడ్రా’ రంగనాథ్ రియాక్షన్ ఇదే!
సాక్షి,హైదరాబాద్: కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని పేర్కొంటూ ఐపీఎస్ ఏవీ రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తొలగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రంగనాథ్ స్థానంలో ఐజీ స్థాయి అధికారికి హైడ్రా కమిషనర్ బాధ్యతలు అప్పగించాలని తెలంగాణ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది.ఈ క్రమంలో హైకోర్టు తీర్పుపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. రాజ్యాంగ స్ఫూర్తితోనే పని చేస్తున్నాను. చెరువులు.. ప్రభుత్వ ఆస్తులు కాపాడటమే హైడ్రా లక్ష్యం. రూ.1.50 లక్షల కోట్ల విలువ గల ప్రభుత్వ ఆస్తులు పరిరక్షించాం. నాపై ఉన్న కోర్టు ధిక్కార కేసులన్నీ భూకబ్జాదారులవే. చట్టపరంగా కేసులు ఎదుర్కొంటాం. న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది’అని వ్యాఖ్యానించారు. -
‘హైడ్రాను బ్యాన్ చేయాలి’
హైదరాబాద్: హైడ్రా కమిషనర్‌గా రంగనాథ్‌ను తొలగించాలనే హైకోర్టు తీర్పును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్వాగతించారు. హైకోర్టు తీర్పు సీఎం రేవంత్‌కు చెంపదెబ్బ అంటూ మండిపడ్డ రాంచందర్‌రావు.. హైడ్రాను సైతం బ్యాన్ చేయాలన్నారు. హైడ్రాను ఏర్పాటు చేసింది రేవంత్‌రెడ్డేనని, అధికారాన్ని పావులా వాడుకున్నారని ధ్వజమెత్తారు. దీనికి పూర్తి బాధ్యత రేవంత్‌రెడ్డినే వహించాలన్నారు. ‘హిట్లర్ స్పూర్తితో హైడ్రా తెచ్చాం అని రేవంత్ గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పటికీ 63 సార్లు కన్టెంప్ట్ ఎదుర్కున్నారు రంగనాథ్. హైడ్రా కేవలం పేదల ఇండ్లు కూల్చడానికి ఉంది.. పెద్దల జోలికి పోవట్లేదు. అసలు హైడ్రాను బ్యాన్ చేయాలి’ అని డిమాండ్ చేశారు రాంచందర్‌రావు. -
హైడ్రా ముసుగులో రియల్ ఎస్టేట్ దందా..
-
High Court: సీఎం రేవంత్‌కు చెంప దెబ్బ
-
రంగనాథ్‌పై TG హైకోర్టు కీలక ఆదేశాలు
-
రంగనాథ్ కస్టడీకి ఆదేశించేవాళ్లమే..
2016లో దాఖలైన రిట్ పిటిషన్ మొదలు రిట్ అప్పీల్, సివిల్ సూట్, సీసీసీఏ, మొదటి ధిక్కార కేసు వరకు హైడ్రా కమిషనర్ ఎక్కడా పార్టీ కాదు. రెండో ధిక్కార కేసు నుంచి అకస్మాత్తుగా ప్రత్యక్షమై కోర్టు ఉత్తర్వుల అమల్లో జోక్యం చేసుకున్నారు. ఏ కేసులోనూ పార్టీగా లేని ఒక అధికారి అకస్మాత్తుగా అన్ని అధికారాలూ తనవే అన్నట్లుగా వ్యవహరించారు. కోర్టు ఆదేశాల అమలుకు అడ్డుపడటం ఆక్షేపణీయం. ఇలాంటి తీరు ఎప్పుడూ చూడలేదు, వినలేదు. హైడ్రా అధికారులు చట్టానికి అతీతులు కాదు. వారి ధిక్కరణలను ఉపేక్షిస్తే ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం దెబ్బతింటుంది. అలాంటి పరిస్థితిని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించం. – హైకోర్టు సాక్షి, హైదరాబాద్: ధిక్కరణ కేసులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కస్టడీకి తీసుకొనేలా ఆదేశాలు జారీ చేయాలని భావించామని.. కానీ అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్‌రెడ్డి విజ్ఞప్తిని గౌర విస్తూ సంబంధిత అధికారిని మూడోసారి కూడా అదుపులోకి తీసుకోకుండా సంయమనం పాటిస్తున్నామని హైకోర్టు స్పష్టం చేసింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయడంతోపాటు ఇకపై వివాదాస్పద స్థలంలోకి ఆయన, హైడ్రా అధికారులు అడుగుపెట్టబోమని హామీ ఇవ్వాలని ఆదేశించింది. అలాగే జూలై 18న ఆ స్థలంలోకి ఎందుకు ప్రవేశించారో వివరించాలని పేర్కొంది.కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమే కాకుండా ధిక్కార కేసులో సరైన అఫిడవిట్ కూడా దాఖలు చేయలేదని అసహనం వ్యక్తం చేసింది. తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. శాంతా శ్రీరామ్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌పై జస్టిస్ అనిల్ కుమార్ జూకంటి ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ చర్యలను తీవ్రంగా తప్పుబట్టింది.అడ్వొకేట్ జనరల్ ఎ. సుదర్శన్‌రెడ్డి విచారణకు హాజరై వివరణ ఇవ్వడంతోపాటు హైడ్రా కమిషనర్‌ను అదుపులోకి తీసుకోవద్దని చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకొని సంయమనం పాటిస్తున్నట్లు న్యాయమూర్తి పేర్కొన్నారు. గురువారం వివాదాస్పద స్థలం రక్షణకు సైన్యాన్ని మోహరించాలని ఇచి్చన ఆదేశాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు, శుక్రవారం ఇచ్చిన తాజా ఆదేశాలే అమల్లో ఉంటాయని వెల్లడించారు. హైడ్రానే ప్రభుత్వం అయ్యిందా? హైడ్రాను ఆశ్రయిస్తున్న ఇతర ప్రభుత్వ శాఖల తీరుపైనా న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘రెవెన్యూ శాఖ, నీటిపారుదల శాఖ, జీహెచ్ఎంసీ తదితర శాఖలకు వేర్వేరు చట్టాలున్నా అందరూ హైడ్రానే ఎందుకు ఆశ్రయిస్తున్నారు? ఆ శాఖలన్నీ పనికిరాని సంస్థలుగా మారిపోయాయా?’అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఒకే ఒక్క ప్రభుత్వ ఉత్తర్వు ఆధారంగా అన్ని శాఖలను పక్కనపెట్టి ప్రతి అంశంలోనూ హైడ్రా జోక్యం చేసుకోవడం ఎలా సాధ్యమన్నారు. హైడ్రా కమిషనర్.. ఒక చట్టంలా వ్యవహరిస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇప్పటికే ఒకసారి ధిక్కారానికి గురైనప్పటికీ కోర్టు ఆదేశాలను రంగనాథ్ పాటించట్లేదని.. ఇలాంటి చర్యలను వదిలేస్తే న్యాయపాలన వ్యవస్థే దెబ్బతింటుందని వ్యాఖ్యానించారు. లోతుకుంటలోని 40 ఎకరాల భూమిలో ఎలాంటి జోక్యం చేసుకోలేదని అఫిడవిట్లో పేర్కొనడమే కాకుండా తర్వాత మరింత వివరణాత్మక కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామని పేర్కొనడం ఆశ్చర్యకరమన్నారు. ధిక్కార చర్యలు స్పష్టంగా కనిపిస్తుంటే ఇంకా వివరణాత్మక అదనపు కౌంటర్ అఫిడవిట్ అంటే ఏమిటో అర్థం కావట్లేదని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఇంత పోలీసు బలగం ఎందుకు? హైడ్రా ప్రతి చర్యకు భారీ పోలీసు బలగాన్ని వెంట తీసుకెళ్లడంపై కూడా న్యాయమూర్తి ప్రశ్నలు సంధించారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేలా ఎందుకు వ్యవహరిస్తున్నారు?. ప్రజా ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారా లేక వారిని భయబ్రాంతులకు గురిచేసేందుకా? అని ప్రశ్నల వర్షం కురిపించారు. నగరంలో వందల చెరువులున్నా.. హైడ్రా చర్యలు మాత్రం ఎంపిక చేసుకున్న కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతున్నాయని.. ఇది ఎందుకో కమిషనర్‌కే తెలియాలన్నారు. ఇది పూర్తి వివక్షకు తావిచ్చేలా ఉందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అఫిడవిట్ వేయాలంటూ విచారణ వాయిదా వేశారు. -
సర్కార్‌పై మాకు నమ్మకం లేదు
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంటలోని ప్రైవేటు ఆస్తిలో తమ ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘిస్తున్న ప్రభుత్వ యంత్రాంగం తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వంపై న్యాయవ్యవస్థకు నమ్మకం లేదంటూ వ్యాఖ్యానించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కోర్టు ఉత్తర్వుల అమలు కోసం సైన్యాన్ని రంగంలోకి దింపాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది. వివాదాస్పద స్థలానికి రక్షణగా 10 మంది ఆర్మీ సిబ్బందిని నియమించాలని, ఉత్తర్వులు ఉల్లంఘించి వచ్చే హైడ్రా, దాని కమిషనర్, ఇతర అధికారులను అదుపులోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.24వ తేదీకల్లా (నేడు) ఆర్మీ అధికారుల జాబితాను అందజేయాలని రిజిస్ట్రార్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదన్న స్పృహ కోర్టుకు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై విశ్వాసం లేకపోవడంతో ఇలా ఉత్తర్వులు జారీ చేయాల్సి వస్తోందని చెప్పింది. అలాగే, బయట ఏం జరుగుతుందో కోర్టులోని వారికి కూడా తెలియాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. గతంలో ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు, హైడ్రా తరఫున కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ అధికారులు ప్రైవేట్ భూమిలోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.నరసయ్య మరో పిటిషన్ దాఖలు చేసిన విషయం విదితమే. ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి హాజరై పిటిషనర్ భూమిలోకి హైడ్రా అధికారులు వెళ్లరని హామీ ఇచ్చారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. సంబంధిత అధికారి అఫిడవిట్ దాఖలు చేస్తే పరిశీలిస్తామని విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. ఎవరొచ్చినా బ్యారక్స్‌కు తరలించండి.. పిటిషనర్ తరఫు న్యాయవాది హరీశ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ స్థలంలోకి వెళ్లబోమని హైడ్రా కమిషనర్ హామీ ఇచ్చినా దానికి కట్టుబడి ఉండలేదన్నారు. ఈ నెల 20న కోర్టు ఆదేశాల మేరకు హాజరైన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పిటిషనర్ స్థలంలోకి జోక్యం చేసుకోలేదని హామీ ఇచ్చారన్నారు. ఆ తర్వాత కూడా 21న పిటిషనర్ పునరుద్ధరణ పనులు చేపట్టగా హైడ్రా అధికారులు, పోలీసులతో సహా వచ్చి పనుల్లో జోక్యం చేసుకుని బెదిరించారన్నారు. వాదనలను విన్న న్యాయమూర్తి..హైడ్రా కమిషనర్ చట్టం కంటే తానే గొప్పవాడినని భావిస్తూ, కోర్టు ఆదేశాలను మూడుసార్లు ఉల్లంఘించారన్నారు. కోర్టు ఎన్నిసార్లు చెప్పినా ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘిస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలను పదేపదే ఉల్లంఘించినందుకు, ఇకపై ఉల్లంఘిస్తే.. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను అవసరమైతే సైన్యం అదుపులోకి తీసుకుని, బ్యారక్స్‌లో ఉంచాలని ఆదేశించవచ్చన్నారు. సచివాలయంలో కూర్చున్న వారికి కూడా ఏమి జరుగుతుందో తెలియాలని పేర్కొన్నారు. ఈ వివాదాస్పద (ప్రైవేటు) స్థలం రక్షణ కోసం పది మంది అర్మీ సిబ్బందిని సిద్ధం చేయాలంటూ ఫైర్ డివిజన్లోని అత్యున్నత బ్రిగేడియర్‌ను సంప్రదించాలని రిజిస్ట్రార్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆరీ్మకి అడ్డు వస్తే హైడ్రాతో సహా ఎవరు వచ్చినా అదుపులోకి తీసుకుని బ్యారక్స్‌కు తరలించాలని, వాహనాలను కూడా సీజ్ చేయాలని చెప్పారు. ఈ ఉత్తర్వుల కాపీని కేంద్రానికి కూడా పంపాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఈ దశలో అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్.. ఒక్క అవకాశం ఇవ్వాలని, ఆ స్థలంలో జోక్యం చేసుకోరని చెప్పారు. ఏఏజీ హామీతో ఉత్తర్వులను న్యాయమూర్తి తాత్కాలికంగా నిలుపుదల చేశారు. -
హైడ్రా అధికారులకు సంకెళ్లు వేయండి.. హై కోర్టు కీలక వ్యాఖ్యలు
-
రంగనాథ్‌ను ఆర్మీ బ్యారక్స్‌లో పెట్టండి.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ లోతుకుంట భూవివాదంలో హైడ్రా అధికారుల తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు అనుమతి లేకుండా మళ్లీ ఆర్మీ భూముల జోలికి వస్తే హైడ్రా అధికారులకు సంకెళ్లు వేయాలని ఆర్మీని ఆదేశించింది. వివాదాస్పద భూముల్లోకి చట్టాన్ని ఉల్లంఘించి ఎవ్వరొచ్చినా సరే వెంటనే అదుపులోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇప్పటికే హైడ్రా పనితీరును పలుమార్లు తీవ్రంగా మందలించిన హైకోర్టు, మళ్లీ ఆర్మీ భూములను టచ్ చేస్తే తమకు చెప్పాలని పేర్కొంది. గురువారం లోతుకుంట భూములపై జరిగిన విచారణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేసింది.కమిషనర్ రంగనాథ్‌పై కోర్టు ధిక్కరణ హెచ్చరికలు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారశైలిపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ కోర్టు ధిక్కరణకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఒకవేళ కోర్టు ధిక్కరణ ఇలాగే కొనసాగితే అధికారులను ఆర్మీ కస్టడీకి అప్పగిస్తామని, అవసరమైతే హైడ్రా కమిషనర్‌ను ఆర్మీ బ్యారక్స్‌లో ఉంచడానికి కూడా వెనకాడబోమని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.శాంతిభద్రతల పరిరక్షణ, కోర్టు ఆదేశాల అమలు కోసం వివాదాస్పద భూమి దగ్గర ఆర్మీ బలగాలు మోహరించాలని హైకోర్టు సూచించింది. సదరు భూములకు రక్షణగా 10 మంది జవాన్లను కాపలా ఉంచాలని ఆదేశించింది. ఒకవేళ కోర్టు స్టే ఆర్డర్లను ఉల్లంఘించి హైడ్రా అధికారులు అక్కడకు వస్తే వారిని అదుపులోకి తీసుకోవడంతో పాటు, వారు వచ్చే హైడ్రా వాహనాలను కూడా వెంటనే సీజ్ చేయాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. -
హైకోర్టు ఆవరణలో హైడ్రా కమీషనర్ కి నీకి అవమానం!
-
హైడ్రా రంగనాథ్‌కు తీవ్ర అవమానం.. అక్కడేం జరిగిందంటే..!
సాక్షి, హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు తీవ్ర అవమానం జరిగింది. హైకోర్టు గేట్ నంబర్ 6 నుంచి ఎంట్రీకి పోలీసులు నిరాకరించారు. సాధారణ ప్రజలు వచ్చే గేట్ నంబర్ 4 నుంచి రావాలని సూచించారు. రిజిస్ట్రార్ ప్రొటోకాల్ అనుమతి అవసరమని వెల్లడించారు. గేట్ నంబర్ 4 వద్ద ప్రజలు పార్కింగ్ చేసే ప్రాంతంలో కారును ఆపి నడుచుకుంటూ వెళ్లమంటూ పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం(సోమవారం) ఆరు గంటల సమయంలో ఏవీ రంగనాథ్ కోర్టు ఎదుట హాజరైన సమయంలో ఇది జరిగింది.ఇదిలా ఉండగా.. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంటలోని ప్రైవేటు ఆస్తిలో జోక్యం చేసుకోరాదని ఆదేశాలున్నా.. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వుల ధిక్కరణ ఆయనకు అలవాటుగా మారిందని, ఇలాంటి ప్రవర్తనను సహించేది లేదని తేల్చిచెప్పింది. ఇంత అహంకారపూరిత ధోరణి సరికాదని, ఏ పనైనా చట్టానికి లోబడే చేయాలని స్పష్టం చేసింది. ఐపీఎస్‌కు కూడా చెప్పాల్సి రావడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఒక కేసులో మూడు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయంటే ఆయనకు కోర్టులపై ఉన్న గౌరవం ఏంటో తెలుస్తోందని వ్యాఖ్యానించింది. నిన్న సాయంత్రం ఏవీ రంగనాథ్ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద హడావుడి నెలకొంది. ఏజీ సుదర్శన్‌రెడ్డి, ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్, స్పెషల్ జీపీలు, జీపీలు అంతా విచారణకు హాజరయ్యారు. హైడ్రా తరఫున ఏజీ వాదనలు వినిపిస్తూ.. జీఎల్ఆర్(కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని భూమి) సర్వే నంబర్ 243లో 119 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, దాని పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిపై సర్వే చేయడానికి, విభజన చేపట్టడానికి కొంత గడువివ్వాలని కోరారు.న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ గతంలో కలెక్టర్ ఇదే హామీ ఇచ్చారని, ఇప్పటివరకు ఎందుకు విభజనకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జీఎల్ఆర్ భూమి అని చెబుతున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రతివాదిగా చేర్చలేదన్నారు. ఐపీఎస్ అధికారైన ఏవీ రంగనాథ్‌కు చట్టంపై నమ్మకం ఉన్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగా ధిక్కరణ తీరుతో వ్యవహరించారన్నారు. కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి అధికారం చెలాయిస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. -
హైడ్రా రంగనాథ్ పై హై కోర్టు ఆగ్రహం
-
కోర్టు ధిక్కరణ అలవాటైంది
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మల్కాజిగిరి మండలం లోతుకుంటలోని ప్రైవేటు ఆస్తిలో జోక్యం చేసుకోరాదని ఆదేశాలున్నా.. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌పై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వుల ధిక్కరణ ఆయనకు అలవాటుగా మారిందని, ఇలాంటి ప్రవర్తనను సహించేది లేదని తేల్చిచెప్పింది. ఇంత అహంకారపూరిత ధోరణి సరికాదని, ఏ పనైనా చట్టానికి లోబడే చేయాలని స్పష్టం చేసింది. ఐపీఎస్‌కు కూడా చెప్పాల్సి రావడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఒక కేసులో మూడు ధిక్కరణ పిటిషన్లు దాఖలయ్యాయంటే ఆయనకు కోర్టులపై ఉన్న గౌరవం ఏంటో తెలుస్తోందని వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం అధికారులు ఉత్సాహంగా పనిచేయవచ్చని.. అయితే ప్రతి చర్య చట్ట పరిధిలోనే ఉండాలని పేర్కొంది. చట్టాన్ని అతిక్రమించి ప్రైవేట్ ఆస్తిలో జోక్యం చేసుకోవడం సమర్థనీయం కాదంది. ఏవీ రంగనాథ్ చట్టానికి అతీతులు కారని.. తమను తాము ’సూపర్ కాప్స్’గా భావించుకోవద్దని సూచించింది. చట్టాన్ని మించి వ్యవహరించే అధికారం ఆయనకు లేదని తేల్చిచెప్పింది. ఈ కేసులో బాధితులు పిటిషనర్ కాదని, కోర్టేనని ఘాటు వ్యాఖ్య చేసింది. కోర్టు చెప్పిన తర్వాత కూడా నేను అనుకున్నదే చేస్తా అనే లెక్కలేనితనంగా వ్యవహరిస్తే.. న్యాయస్థానాలు చూస్తూ కూర్చోవని గుర్తుంచుకోవాలని హెచ్చరించింది. పిటిషనర్‌పై ఎఫ్ఐఆర్కు సంబంధించి పూర్తి వివరాలతో మంగళవారం అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. రంగనాథ్ హాజరుకు పోలీసులను ఆదేశిస్తాం..: గతంలో ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు, హైడ్రా తరఫున కోర్టుకు ఇచ్చిన హామీని ఉల్లంఘిస్తూ అధికారులు ప్రైవేట్ భూమిలోకి ప్రవేశించి విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.నరసయ్య మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది ఎం.హరీశ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ..లోతుకుంట గ్రామంలోని 40 ఎకరాల భూమిపై కోర్టు ఇప్పటికే తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. గతంలో దాఖలైన ధిక్కార కేసులకు సంబంధించి జూన్ 10న ఇకపై హైడ్రా అధికారులు పిటిషనర్ ప్రైవేట్ భూమిలోకి అడుగుపెట్టవద్దని హైకోర్టు ఆదేశించిందని గుర్తు చేశారు. కానీ జూలై 18న సుమారు 200 మంది సిబ్బంది, 50కి పైగా వాహనాలు, జేసీబీలు, బుల్డోజర్లతో హైడ్రా అధికారులు భూమిలోకి ప్రవేశించి ప్రహరీ, టిన్ షెడ్లు, సీసీ కెమెరాలు, గేట్లు, విద్యుత్ వ్యవస్థను ధ్వంసం చేశారని, స్థలాన్ని స్వా«దీనం చేసుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. పిటిషనర్‌ను, అతని న్యాయవాదిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి అక్రమంగా నిర్బంధించారని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. రంగనాథ్‌పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్‌ను కోర్టు ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశిస్తామని అన్నారు. సాయంత్రం 6:30 గంటలకు హాజరవుతానని హైడ్రా కమిషనర్ చెప్పడంతో విచారణను వాయిదా వేశారు. ఉద్దేశపూర్వకంగా ధిక్కరణ సాయంత్రం ఏవీ రంగనాథ్ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద హడావుడి నెలకొంది. ఏజీ సుదర్శన్‌రెడ్డి, ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్, స్పెషల్ జీపీలు, జీపీలు అంతా విచారణకు హాజరయ్యారు. హైడ్రా తరఫున ఏజీ వాదనలు వినిపిస్తూ.. జీఎల్ఆర్(కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని భూమి) సర్వే నంబర్ 243లో 119 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, దాని పరిరక్షణ కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనిపై సర్వే చేయడానికి, విభజన చేపట్టడానికి కొంత గడువివ్వాలని కోరారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ గతంలో కలెక్టర్ ఇదే హామీ ఇచ్చారని, ఇప్పటివరకు ఎందుకు విభజనకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జీఎల్ఆర్ భూమి అని చెబుతున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రతివాదిగా చేర్చలేదన్నారు. ఐపీఎస్ అధికారైన ఏవీ రంగనాథ్‌కు చట్టంపై నమ్మకం ఉన్నట్లు కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకంగా ధిక్కరణ తీరుతో వ్యవహరించారన్నారు. కోర్టు ఆదేశాలను పక్కన పెట్టి అధికారం చెలాయిస్తామంటే ఊరుకోబోమని హెచ్చరించారు. -
హైడ్రా, ఈగల్ తరహాలో ‘ఫుడ్ సేఫ్టీ స్పెషల్ వింగ్’
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్సేఫ్టీపై స్పెషల్ వింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. సీనియర్ ఐఏఎస్ నేతృత్వంలో ఫుడ్‌సేఫ్టీ వింగ్‌ను ఏర్పాటు చేస్తారు. డీపీఆర్ రెడీ చేయాలని అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. హైడ్రా, ఈగల్ తరహాలో ఫుడ్ సేఫ్టీ స్పెషల్ వింగ్ ఉండనుంది. ఆహార కల్తీ, తనిఖీలు, సేఫ్టీపై చర్యలు తీసుకోనుంది ఈ వింగ్. త్వరలోనే విధివిధానాలతో పూర్తి వివరాలు క్యాబినెట్ ముందుకు రానున్నాయి.కాగా, ఫుడ్ సేఫ్టీపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, రోడ్ సైడ్ ఆహారం తయారీ, నిల్వ, రవాణా, విక్రయం, వినియోగం సమయంలో పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను పాటించడం లేదు. దీనివల్ల ఆహారం కలుషితం, బ్యాక్టీరియా, వైరస్లు, రసాయనాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీనిని నివారించడంలో ఫుడ్ సేఫ్టీ స్పెషల్ వింగ్ కీలక పాత్ర పోషిస్తుంది.పరిశుభ్రమైన ఆహారం ప్రతి వ్యక్తి ఆరోగ్యానికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఆహార పదార్థాలను సరైన ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం, గడువు ముగిసిన ఉత్పత్తులను ఉపయోగించకపోవడం వంటి జాగ్రత్తలు ఫుడ్ సేఫ్టీలో భాగం. నాణ్యమైన ఆహారాన్ని అందించే బాధ్యతను వ్యాపార సంస్థలు మరుస్తున్నాయి. ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తే ఆహార కల్తీ బాధలు, అంటువ్యాధులు తగ్గి సమాజం మరింత ఆరోగ్యంగా ఉంటుంది. -
కౌంటర్లు దాఖలు చేయకుండా కాలయాపన
-
హైడ్రా రంగనాథ్‌కు బిగ్ షాక్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టులో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఒక వివాదాస్పద స్థలంపై కోర్టు ఉత్తర్వులున్నా హైడ్రా అధికారులు జోక్యం చేసుకున్నారు. ఈ క్రమంలో స్థలం విషయమై కౌంటర్ దాఖలు చేయాల్సి ఉండగా.. జాప్యం చేయడం, పలుమార్లు అవకాశం ఇచ్చినప్పటికీ స్పందించకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 50వేల జరిమానా విధించింది.వివరాల మేరకు.. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో సర్వే నెంబర్-45లో 2 ఎకరాల వివాదాస్పద భూమిపై ఉంది. సంబంధిత భూమిపై ఇప్పటికే కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ స్థలం విషయంలో హైడ్రా అధికారులు జోక్యం చేసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీంతో, విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం.. ఈ వ్యవహారంలో హైడ్రా తరఫున కౌంటర్ దాఖలు చేయాలని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. అయితే, పలుమార్లు గడువు ఇచ్చినప్పటికీ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయకపోవడంతో పాటు కమిషనర్ రంగనాథ్ కోర్టుకు హాజరు కాకపోవడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది.అలాగే, తర్వాత దాఖలైన కౌంటర్ పిటిషన్ కూడా సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైనట్లు కోర్టు పేర్కొంది. దీంతో, కోర్టుల ఆదేశాలను బేఖాతరు చేస్తూ, సమాధానం ఇవ్వడానికి పదే పదే గడువు తీసుకోవడం, కాలయాపన చేయడం సరికాదని న్యాయస్థానం ఈ సందర్భంగా మండిపడింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలా వ్యవహరించడం హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అనంతరం, కమిషనర్ రంగనాథ్‌పై రూ.50 వేల జరిమానా విధిస్తూ, ఆ మొత్తాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రిలీఫ్ ఫండ్‌కు జమ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది. అప్పటివరకు సంబంధిత అంశాలపై పూర్తి వివరాలతో కోర్టుకు సమాధానం ఇవ్వాలని సూచించింది. దీంతో, జరిమానా విషయం చర్చనీయాంశంగా మారింది. -
సీఎంకు ‘హిట్లర్’ సెగ!
సాక్షి, హైదరాబాద్: జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ నుంచి స్ఫూర్తి పొంది హైడ్రా పేరు పెట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలను రాష్ట్ర, జాతీయ స్థాయిలో బీజేపీ, బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా విమర్శించగా, జాతీయ మీడియా సైతం ‘ఎమర్జెన్సీ మైండ్‌సెట్’గా అభివర్ణించింది. హిందూ గ్రూప్ శనివారం బెంగళూరులో నిర్వహించిన సదస్సులో ఆ సంస్థ డైరెక్టర్ ఎన్.రామ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి ముఖాముఖి సంభాషిస్తూ పలు అంశాలపై నిర్మొహమాటంగా మాట్లాడారు.‘హైడ్రా పదం హిట్లర్‌కు ఫేవరేట్ పదం. అతడి కోర్ టీమ్ పేరు హైడ్రా. ఎవరినైనా హతమార్చగలిగేది. హిట్లర్ నుంచి స్ఫూర్తి పొంది హైడ్రా అని పేరు పెట్టి ఒక సంస్థను స్థాపించాను. ఇప్పుడు మా దగ్గర ఎవరైనా జలవనరులను ఆక్రమించే ధైర్యం చేస్తున్నారేమో అడగండి..’ అని హైడ్రాపై అడిగిన ఓ ప్రశ్నకు సీఎం రేవంత్‌రెడ్డి బదులిచ్చారు. హైదరాబాద్ మహానగరం, పరిసర ప్రాంతాల్లో చెరువులు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణల నిర్మూలనకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 2024లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పేరుతో సంస్థను స్థాపించడం తెలిసిందే. ఇప్పటివరకు కబ్జాదారుల చెర నుంచి రూ. 80,000 కోట్ల విలువైన 2,182 ఎకరాల భూమిని స్వా«దీనం చేసుకున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు హైడ్రా కార్యకలాపాలు ఆది నుంచి వివాదాలు, విమర్శలకు దారితీశాయి. రాష్ట్రంలో బుల్డోజర్ పాలన జరుగుతోందని ఇటీవల అసెంబ్లీలో బీజేపీ ఆరోపణలు చేసింది. నోటీసులు ఇవ్వకుండా పెద్ద సంఖ్యలో సిబ్బందిని మోహరించి వివాదాల్లో ఉన్న స్థలాల్లోని కట్టడాల కూల్చివేతలు చేపట్టడాన్ని యుద్ధ వాతావరణంతో రాష్ట్ర హైకోర్టు పోల్చింది. హైడ్రా చీఫ్ ఏవీ రంగనాథ్‌ను విచారణకు పిలిపించి మొట్టికాయలు సైతం వేసింది. హైడ్రా ఎడాపెడా కూల్చివేతలు జరుపుతుండటంతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని విపక్షాలు ఆరోపణలూ చేశాయి. ఇప్పటికే హైడ్రా పనితీరుపై విమర్శలు, లెక్కలేనన్ని కోర్టు కేసులుండగా హిట్లర్‌ను స్ఫూర్తిగా తీసుకొని ఈ సంస్థకు నామకరణం చేసినట్లు సీఎం రేవంత్ వ్యాఖ్యానించడం మరింత దూమారం రేపింది. హైడ్రా కూల్చివేతలను ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ విధ్వంసాలతో పోల్చడాన్ని విపక్షాలు విమర్శించాయి. బీజేపీ, బీఆర్ఎస్ విమర్శలు.. ‘హిట్లర్, ఎమర్జెన్సీ మనస్తత్వం మళ్లీ బహిర్గతమైంది. హిట్లర్ స్ఫూర్తి కలిగించాడని రేవంత్‌రెడ్డి బహిరంగంగా గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎమర్జెన్సీ నుంచి హిట్లర్ వరకు ఎల్లప్పుడూ కాంగ్రెస్ ప్రజలను అణచివేసింది. రేవంత్‌రెడ్డి సిగ్గుతో తలవంచి క్షమాపణ చెప్పాలి’ అని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ‘ఎక్స్’లో డిమాండ్ చేశారు. మరో కేంద్ర మంతికిరణ్ రిజిజు సైతం ‘ఎక్స్’లో ఘాటుగా స్పందించారు. ‘వాహ్.. కాంగ్రెస్ సీఎం హిట్లర్‌తో పూర్తిగా స్ఫూర్తి పొందారు. ఒకవేళ బీజేపీ సీఎం ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే మా వ్యతిరేకులందరూ నాజీయిజం, ఫాసిజం అంటూ విమర్శలు చేసేవారు’ అని ఆయన విమర్శించారు. ‘ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ మొదలు రేవంత్‌రెడ్డి జర్నలిస్టులు, విద్యార్థులను అరెస్టు చేయడం వరకు.. ఇది కాంగ్రెస్ తానాషాహీ మనస్తత్వం’ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తప్పుబట్టారు. ‘రాష్ట్ర ప్రజలకు ఇది ముందే తెలుసు. యావత్ దేశానికి స్పష్టత ఇచ్చినందుకు సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు’ అని కేటీఆర్ ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హైడ్రాను రద్దు చేస్తూ తొలి ఫైల్‌పై సంతకం చేస్తామని గతంలోనే మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు.హిట్లర్ కోర్ టీమ్‌కు హైడ్రా పేరు లేదు హిట్లర్ కోర్ టీమ్‌కు హైడ్రా అనే పేరు ఉన్నట్లు చరిత్రలో ఆధారాలు లేవని చరిత్రకారులు అభిప్రాయపడుతున్న ట్లు సౌత్ ఫస్ట్, మరికొన్ని వార్తాసంస్థలు పేర్కొన్నాయి. వాస్తవానికి 1943 ఆగస్టు 17–18 రాత్రి బ్రిటన్ ఆపరేషన్ హైడ్రా పేరుతో నాజీల వీ–ఆయుధ కార్యక్రమంపై బాంబు దాడి చేసిందని గుర్తుచేశాయి. మార్వెల్ కామిక్ పుస్తకం, సినిమాల్లోని ఊహాజనిత నియో–ఫాసిస్ట్ సంస్థ ‘హైడ్రా’తో సీఎం పొరబడినట్లు పేర్కొన్నాయి. -
మేం పన్నులు కట్టి.. ఢిల్లీకి సలాం కొట్టాలా?
సాక్షి, హైదరాబాద్: ‘ప్రధాని మోదీ మహిళా రిజర్వేషన్ల పేరుతో రాజకీయ జిమ్మిక్కులు చేస్తున్నారు. పార్లమెంట్ సీట్ల పెంపును మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపెట్టడాన్ని మేం వ్యతిరేకిస్తున్నాం. వాళ్లు చెప్పినట్లు పార్లమెంట్ సీట్లు పెంచితే కేరళలో లోక్‌సభ సీట్లు 20 నుంచి 30కి పెరిగితే ఉత్తరప్రదేశ్‌లో 80 నుంచి 120కి పెరుగుతాయి. మేం దీనినే వ్యతిరేకిస్తున్నాం. పని చేసే దక్షిణాది రాష్ట్రాలను శిక్షించవద్దని కోరుతున్నాం. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి ఇచ్చేది ఎక్కువ. తీసుకునేది తక్కువ. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కేంద్ర హోం మంత్రి అంతా ఉత్తరాది రాష్ట్రాలవారే. మేం పన్నులు కట్టి ఢిల్లీకి సలాం కొట్టాలా?..’అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే 2027లో జరిగే యూపీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని సవాలు విసిరారు. ‘వాళ్లు రాజకీయ క్రీడ ఆడుతున్నారు. ఉత్తరాది, దక్షిణాది అంతరాలు పెంచొద్దు’అని కేంద్రానికి హితవు పలికారు. ‘ప్రజల కోసం, ప్రజల ద్వారా, ప్రజల చేత: తెలంగాణకు సుపరిపాలన’అనే అంశంపై శనివారం బెంగళూరులో ‘ది హిందూ’గ్రూప్ డైరెక్టర్ ఎన్.రామ్ నిర్వహించిన ముఖాముఖిలో రేవంత్ పాల్గొని ఆయన అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. రేవంత్ ఏమన్నారంటే.. రాష్ట్ర పెట్టుబడులు గుజరాత్‌కు మళ్లింపు కేంద్రంపై ప్రతిపక్షంగా పోరాడతాం. కేంద్ర ప్రభుత్వ వివక్షపై పోరాడతాం. మా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులకు అనుమతులు ఇవ్వకుండా గుజరాత్ వెళ్లి పెట్టాలని వాళ్లు (మోదీ ప్రభుత్వం) ఒత్తిడి చేస్తున్నారు. బలవంతంగా గుజరాత్లో పెట్టుబడులు పెట్టేలా చేస్తున్నారు. 20 ఏళ్లుగా ఒకే ఒక బ్రాండ్ అంబాసిడర్ అక్కడ పని చేస్తున్నారు. 18 గంటలు పని.. ఫ్రెండ్స్ లేరు.. రోజుకు 16–18 గంటలు పనిచేస్తా. వేరే ఇతర వ్యాపకాలు లేవు. అదే నాకు పెద్ద సమస్య. సమయం గడపాలంటే రాజకీయ స్నేహితులు తప్ప వేరే ఎవరూ లేరు. రాత్రి 10 గంటల తరా>్వత ఫుట్‌బాల్ ఆడతా. ఇప్పుడు సమయం చిక్కడం లేదు. నేను మెస్సీకి అభిమానిని. అందుకే మెస్సీని ఆహ్వానించి కార్యక్రమం ఏర్పాటు చేశాం. తెలంగాణలో 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేసీఆర్ ఆ సమస్యను పరిష్కరించలేదు. గతంలో ఆర్ఎంపీ డాక్టర్ టీజీపీఎస్సీ సభ్యుడిగా ఉన్నారు. టీజీపీఎస్సీ పునరావాస కేంద్రం కాకూడదు. యూపీఎస్సీ చైర్మన్, ఇతర సభ్యులను కలిసి ఎలా పని చేస్తుందో తెలుసుకుని టీజీపీఎస్సీలో అమలు చేశా. 15 నెలల్లో 67,760 ఉద్యోగాలు ఇచ్చాం. త్వరలో 5 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తాం. కేసీఆర్ మీడియాకూ అనుమతిస్తా.. పది రోజులకో ప్రెస్‌మీట్ నిర్వహించి ప్రతి ప్రశ్నకూ జవాబిస్తా. కేసీఆర్ మీడియా సంస్థ ప్రతినిధినీ అనుమతిస్తా. ఎంత లేటైనా జర్నలిస్టులతో మాట్లాడతా. వ్యతిరేక వార్తలు రాస్తే దూషించను. వ్యంగ్యంగా మాట్లాడతా. చెరువులు, నాలాలను పేదలు ఆక్రమించుకుంటే అర్ధం చేసుకోగలం. పెద్దవాళ్లు జల వనరులను చెరబడుతుంటేనే హైడ్రాను ఏర్పాటు చేశా. ‘హైడ్రా’.. ఇది హిట్లర్‌కు ఫేవరేట్ పదం. అతడి కోర్ టీమ్ పేరు హైడ్రా... ఎవరినైనా హతమార్చగలిగేది. హిట్లర్ నుంచి స్ఫూర్తి పొంది హైడ్రా అని పేరు పెట్టాను. మా దగ్గర ఎవరైనా జల వనరులను ఆక్రమించే ధైర్యం చేస్తున్నారేమో అడగండి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు మహానగరాల్లో ఆక్రమణలు, పర్యావరణం, నీటి కొరతపై సొంత మోడళ్లను అనుసరించాలి. జీఎస్టీ ఆదాయం పెంచాం.. వడ్డీలను 11–11.50 శాతం నుంచి 7–8 శాతానికి తగ్గించుకోవడానికి రూ.2 లక్షల కోట్ల అప్పులను పునర్వ్యవస్థీకరించే పనిలో ఉన్నాం. గత 7–8 ఏళ్లలో నెలకు రూ.3,500 కోట్లకు మించి జీఎస్టీ రాబడి లేదు. గత ఆరు నెలలుగా రూ.4 వేల కోట్లను దాటుతున్నాం. ఆరు నెలల్లోనే రూ.5 వేల కోట్లు అదనంగా వచ్చింది. రైతు ఆత్మహత్యల్లేని రాష్ట్రం మహారాష్ట్ర తర్వాత తెలంగాణలోనే ఎక్కువ రైతు ఆత్మహత్యలు జరిగేవి. రూ.20,616 కోట్ల రైతు రుణాలను మాఫీ చేశా. 2024–25లో రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రం తెలంగాణ అని ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొంది. ఏఐ బ్లూ కాలర్ ఉద్యోగాలకు ప్రత్యామ్నా యం సృష్టించలేదు. ఏఐ అన్నీ సృష్టించ వచ్చు. రాజకీయ నాయకున్ని సృష్టించలేదు.నాకు ఏఐ భయం లేదు. యువతరం స్కిల్స్ పెంచుకోవాలి. అధికారులు ఏం అడిగినా ‘యెస్..’అంటారు. నేను ముందుగా ప్రతీ ఒక్కరి అభిప్రాయాలు తీసుకుని రాసుకుంటా. చివరకు నా అభిప్రాయం చెబుతా. ముందే నా అభిప్రాయం చెబితే దానికి అనుగుణంగా వారు చెబుతారు. 17 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి ఎంతో తెలుసుకున్నా. నన్ను తప్పుదోవ పట్టించలేరు. నేను ప్రతి బ్యూరోక్రాట్ మైండ్‌సెట్‌ను అర్ధం చేసుకోగలను. -
హిట్లర్ స్ఫూర్తితోనే హైడ్రా..షాకింగ్ కామెంట్స్ చేసిన సీఎం రేవంత్
-
హైడ్రాపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: నగరంలోని విపత్తు నిర్వహణ, ప్రజా ఆస్తుల రక్షణ, పట్టణ నియంత్రణ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవడానికి ఏర్పాటైన సంస్థే హైడ్రా (Hyderabad Disaster Response and Asset Protection Agency). అయితే ఇది గత కొంతకాలంగా బాగా ఫేమస్ అయ్యింది. అక్రమ నిర్మాణాల కూల్చివేత ఘటనలకు సంబంధించి హైడ్రా పేరు మార్మోగుతూనే ఉంది. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంస్థను ఏర్పాటు చేశారు. 2024, జూలైలో దీన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సంస్థను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకొచ్చారు. అయితే తాజాగా హైడ్రాపై రేవంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా అని పేరు పెట్టడానికి గల కారణాలను వెల్లడించారు. నియంతగా పేరుగాంచిన హిట్లరే ఇందుకు కారణమన్నారు సీఎం రేవంత్. హైడ్రా అనే పేరు హిట్లర్‌కు చాలా ఇష్టమని, హిట్లర్‌కు చాలా దగ్గరగా ఉన్న హంతక ముఠా పేరు హైడ్రా అని సీఎం రేవంత్ తెలిపారు. అందుచేత అక్రమ కట్టడాలు చేసే వారు భయపడాలనే ఉద్దేశంతోనే హైడ్రా అని పేరుపెట్టామన్నారు. హైదరాబాద్‌లో చెరువులను ఎవరు ఆక్రమించాలనుకున్నా భయపడాలని ఉద్దేశంతోనే ఈ పేరు పెట్టామన్నారు. -
హైడ్రాపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, నల్లగొండ జిల్లా: హైడ్రా రాష్ట్రవ్యాప్త విస్తరణకు ప్రభుత్వం నిర్ణయించిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. గురువారం ఆయన మిర్యాలగూడ ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా హైడ్రా కావాలని ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తుతున్నాయని.. అనేక ప్రాంతాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని పేర్కొన్నారు.‘‘కబ్జాలపై హైడ్రాకు వేలాదిగా ఫిర్యాదులు వచ్చాయి. వాటి పరిష్కార దిశగా దృష్టి పెట్టాం. ఇప్పుడున్న దరఖాస్తులను పరిష్కరించడమే ముందు ప్రాధాన్యత. హైడ్రాకు వ్యతిరేకంగా కొందరు కోర్టును ఆశ్రయిస్తున్నారు. మేము కూడా చట్టపరంగా ఎదుర్కొంటాం. కబ్జా విషయంలో హైడ్రా అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు.కబ్జా కోరల నుంచి 2100 భూములను హైడ్రా స్వాధీనం చేసుకుంది. వీటి విలువ సుమారు రూ.85 వేల కోట్ల రూపాయలు ఉంటుంది. మరో సంవత్సర కాలంలో లక్ష కోట్లు విలువ చేసే భూములను హైడ్రా కాపాడుతుంది. హైడ్రా పరిధిలోనే 10 లక్షల కోట్ల విలువ చేసే భూములు కబ్జాకు గురైనట్లు సమాచారం’’ అని రంగనాథ్ చెప్పారు. -
అక్రమ కంపెనీలపై హైడ్రా పంజా
-
హైడ్రాపై ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజం
హైదరాబాద్: హైడ్రా, మున్సిపల్ అధికారులపై ఎమ్మెల్యే రాజాసింగ్ ధ్వజమెత్తారు. గోషామహల్ నియోజకవర్గంలో ఫిష్ మార్కెట్ పక్కన ఉన్న డబ్బాలను తొలగించారని, తాను ఇక్కడ లేని సమయం చూసే వాటిని హైడ్రా తొలగించిందంటూ మండాపడ్డారు. కోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ అధికారులు దౌర్జన్యంగా తొలగించారన్నారు. హైడ్రాకు దమ్ముంటే దారుసలాం, ఛార్మినార్ ముందు ఉన్న అక్రమ కట్టడాలు కూల్చి చూపెట్టాలని డిమాండ్ చేశారు. పేద ప్రజల ఉపాధి అవకాశాలపై దౌర్జన్యం సరికాదని, త్వరలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతారుని విమర్శించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు రాదన్నారు. రాష్ట్ర సీఎం హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని రాజాసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
హైడ్రాకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: హైడ్రాకు ఉన్నత న్యాయస్థానం భారీ షాక్ ఇచ్చింది. తాము తదుపరి ఆదేశాలిచ్చే వరకు జలాశయాలు, నాలాలు, పార్కులు, ఆక్రమణల తొలగింపు, ప్రజా రహదారుల పునరుద్ధరణ మినహా అనధికార నిర్మాణాల కూల్చివేత లేదా తొలగింపునకు ఎలాంటి కార్యకలాపాలు చేపట్టవద్దని ఆదేశించింది. జీహెచ్ఎంసీ, పురపాలక సంఘాల చట్టం, ఇతర నిబంధనలకు అనుగుణంగా ప్రామాణిక కార్యాచరణ విధానాలు, మార్గదర్శకాలను సమర్పించాలని స్పష్టం చేసింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఐలాపూర్ గ్రామంలో హైడ్రా ఓ యుద్ధ వాతావరణాన్ని సృష్టించినట్లు అభిప్రాయపడింది. పెత్తందారీ విధానం, చట్టవిరుద్ధ చర్యల కారణంగా వందలాది పిటిషన్లు దాఖలయ్యాయని చెప్పింది. చాలా పిటిషన్లలో స్పష్టమైన కౌంటర్లు దాఖలు చేయలేదని, సంస్థ తీరు సమర్థనీయం కాదని వ్యాఖ్యానించింది. ఐలాపూర్ కూల్చివేతలపై స్టేటస్కో ఆదేశాలు పాటించాలని చెబుతూ విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. వెయ్యి ఎకరాల కబ్జాకు యత్నం: ఏఏజీ అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. ‘సంగారెడ్డిలోని కోర్టు ఇచ్చిన డిక్రీని అడ్డుపెట్టుకుని ఐలాపూర్‌లో పలు సర్వే నంబర్లలోని వెయ్యి ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి పిటిషనర్ ప్రయత్నిస్తున్నారు. హైడ్రా కూల్చివేసిన భవనం ప్రభుత్వ భూమిలో నిర్మించిందే. ఆ భవనానికి విద్యుత్, నిర్మాణ అనుమతులు లేవు’అని చెప్పారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. ‘కూల్చివేసిన భవనం కోర్టు విచారణలో ఉన్న ఆస్తిలోని ఓ భాగం. ఆ కేసులోనే వివాదాస్పద డిక్రీ జారీ అయ్యింది. 2006లో నాటి ఉమ్మడి ప్రభుత్వంపై పిటిషనర్ ఈ దావా వేశారు. అలాగే, 2024లో ప్రతివాద అధికారులు జోక్యం చేసుకున్నప్పుడు పిటిషనర్ రిట్ పిటిషన్ కూడా వేశారు. రిట్ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం సంబంధిత స్థలంలో ప్రస్తుతమున్న నిర్మాణాలను తొలగించడానికి, చట్టబద్ధమైన ప్రక్రియను పాటించకుండా ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అది పట్టించుకోకుండా హైడ్రా అధికారులు ఈ నెల 11న తెల్లవారుజామున 4 గంటలకు పిటిషనర్ స్థలానికి వచ్చి భవనాన్ని కూల్చివేశారు. 2005లో అధికారులు ఇచ్చిన అనుమతి మేరకే భవనాన్ని నిర్మించారు. (భవన కూల్చివేత వీడియో దృశ్యాలను కూడా న్యాయస్థానం ముందు ప్రదర్శించారు). వాదనలు విన్న న్యాయమూర్తి సుదీర్ఘ మధ్యంతర ఉత్తర్వులు వెలువరించారు. నోటీసులు జారీ చేయకుండా.. ‘పిటిషనర్ న్యాయవాది సమర్పించిన వీడియోను పరిశీలిస్తే.. హైడ్రాకు చెందిన వందలాది మంది సిబ్బంది ఆ స్థలంలో గుమిగూడినట్లు స్పష్టమవుతోంది. పిటిషనర్‌కు చెందిన భారీ భవనం కూల్చివేశారు. ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా ఇంత భారీ నిర్మాణాన్ని కూల్చివేయడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. అనుమతి లేకుండా భవనాన్ని నిర్మించారని భావించినా, ఇంత భారీ నిర్మాణం చేపట్టే వరకు అధికారులు ఏం చేస్తున్నారనేది ఆశ్చర్యం కలిగిస్తోంది. అనధికార నిర్మాణాన్ని గమనించి ప్రారంభంలోనే చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి చక్కబడి ఉండేది. దానికి బదులుగా.. అధికారులు కళ్లు మూసుకుని, ఓ భారీ నిర్మాణం జరగడానికి అనుమతించి.. ఇప్పుడు నిర్మాణం అక్రమమంటూ న్యాయస్థానం ముందు ఫిర్యాదు చేస్తున్నారు’అని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ప్రామాణిక విధానమేదీ... ‘ఏదేమైనా అనుమతి లేకున్నా ఓ భవనాన్ని కూల్చివేసే సమయంలో సహజ న్యాయ సూత్రాలు పాటించాల్సిందే. పిటిషనర్ తరఫు న్యాయవాది పేర్కొన్నట్లు.. యుద్ధ వాతావరణాన్ని తలపించేలా హైడ్రా సిబ్బందిని మోహరించింది. ఇది సహించరానిది. ఫొటోలు, వీడియో క్లిప్పింగ్‌లను పరిశీలించిన తర్వాత హైడ్రా ఎలాంటి ప్రామాణిక పద్ధతులను పాటించడం లేదని న్యాయస్థానం ప్రాథమికంగా అభిప్రాయపడుతోంది. యాజమాన్య హక్కుకు సంబంధించి వివాదమున్న సందర్భాల్లో అవతలి పక్షానికి నోటీసు జారీ చేసిన తర్వాతే చర్యలు చేపట్టాలి. ప్రజాప్రయోజనాల దృష్ట్యా కూల్చివేతలు చేపట్టామని హైడ్రా వాదిస్తూ తన చర్యలను సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తోంది. హైదరాబాద్, దాని పరిసర ప్రాంతాల్లో అనేక జలాశయాలను పునరుద్ధరించినట్లు హైడ్రా గర్వంగా ప్రచారం చేసుకుంటోంది. హైడ్రా.. పెత్తందారీ చర్యలకు వ్యతిరేకంగా వందలాది కేసులు దాఖలయ్యాయన్నది వాస్తవం. అలాంటి పిటిషన్లలో హైడ్రా ఎలాంటి ప్రామాణిక విధానాన్ని అనుసరించలేదు. హైడ్రా ఏర్పడి ఏడాదైనా జీహెచ్ఎంసీ లేదా పురపాలక సంఘాల చట్టంలోని నిబంధనలను అనుసరిస్తోందా? లేదా? అనేది తెలియడం లేదు. ఆ సంస్థ చర్యలు చట్టానికి, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. తదుపరి ఉత్తర్వులిచ్చేవరకు సదరు ఆస్తి విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలి. జీహెచ్ఎంసీ, పురపాలక సంఘాల చట్టం, ఇతర వర్తించే నిబంధనలు, నియమాలకు అనుగుణంగా ప్రామాణిక కార్యాచరణ విధానాలు, మార్గదర్శకాలను హైడ్రా ఈ కోర్టు ముందుంచాలి. అప్పటివరకు అనధికార నిర్మాణం, అంతర్గత రహదారులు, ప్రహరీల తొలగింపు లాంటి చర్యలను హైడ్రా చేపట్టవద్దు’అని న్యాయమూర్తి ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. నకిలీ నోటీసులపై ఫిర్యాదుతెలంగాణ హైకోర్టు పేరిట హైడ్రాకు నకిలీ నోటీసులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కమిషనర్ రంగనాథ్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు నమోదు కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. రిస్క్ చేయాల్సిందే!ఫాతిమా కాలేజీ విషయంలో దాఖలైన ఓ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సల్కం చెరువులో కాలేజీ నిర్మించారని.. ఇంతదాకా హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఓ పిటిషన్ దాఖలైంది. విచారణ జరిపిన న్యాయస్థానం.. ఫాతిమా కాలేజీలో జాయిన్ అయ్యేవాళ్లు రిస్క్ చేయాల్సిందేనని వ్యాఖ్యానించింది. ఈ మేరకు కాలేజీ నోటీసు బోర్డులో ఈ విషయాన్ని పేర్కొనాలంటూ కాలేజీ యాజమాన్యాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. -
హైడ్రా భారీ ఆపరేషన్.. 15వేల కోట్ల భూమి స్వాధీనం
సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో హైడ్రా కూల్చివేతల భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. జిల్లాలోని అమీన్పూర్, ఐలాపురంలో రెండో రోజు కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో 861 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. రూ. 15వేల కోట్లకు పైగా విలువైన భూమిని హైడ్రా కాపాడింది.ఆదివారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను కూల్చి వేసింది. ఆరు అంతస్తుల ముఖీం గెస్ట్ హౌస్‌తో పాటు ఫామ్ హౌస్‌ను అధికారులు కూల్చివేశారు. ఇక, ఇప్పటికే ఇల్లు కట్టుకున్న వారిని మినహాయించి మిగిలిన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి ఈ భారీ ఆపరేషన్‌ను నిర్వహించింది. కోర్టు స్టే ఆర్డర్ ఉన్నా.. నిర్మాణాలు జరిపిన భవనాలను హైడ్రా కూల్చివేసింది.వివరాల మేరకు, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం ఐలాపురం గ్రామంలో ఒకటి నుంచి 220 సర్వే నంబర్ల వరకూ మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే చాలా నివాసాలు వెలిశాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా మిగిలి ఉన్న 861 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించేందుకు చర్యలు చేపట్టింది. 863 ఎకరాల భూమి విలువ రూ.15 వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఇక్కడ యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. పట్టించుకోకుండా నిర్మించిన గెస్ట్ హౌస్‌ను హైడ్రా తొలగించింది. అలాగే ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన 6 అంతస్తుల భవనాన్ని కూల్చివేసింది.కాగా, హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా.. 2.20 ఎకరాల్లో ముఖీం సోదరుడు ఎంఏ అజీం ఆరు అంతస్తుల భవనం నిర్మించారు. స్విమ్మింగ్‌పూల్‌తో సహా విలాసవంతంగా ఇంటిని నిర్మించుకున్నారు. అలాగే, ఇంటి చుట్టూ 40 ఎకరాల మేర గడీలు పెట్టి ఫామ్ హౌస్ కట్టారు. గుర్రాల కోసం ప్రత్యేక నిర్మాణాలు చేపట్టడం విశేషం. -
Hyd: హయత్‌నగర్‌లో హైడ్రా కూల్చివేతలు
హైదరబాద్: తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హయత్‌నగర్ పరిధిలోని కుంట్లూరులో శుక్రవారం(ఏప్రిల్ 10వ తేదీ) హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అంజనాద్రి నగర్‌లోని 204 సర్వే నంబర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని స్థానికుల ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. కాగా, ఈనెల ఆరంభంలో మైలార్దేవుపల్లి సర్కిల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టి సుమారు 30 కోట్ల రూపాయల విలువచేసే స్థలాన్ని కాపాడింది. మైలార్దేవుపల్లిలో సర్వే నంబరు 134/20 శాస్త్రిపురానికి చెందిన 6500 గజాల పార్కు స్థలం కబ్జాకు గురైనట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో స్థానికుల ఫిర్యాదుతోరంగంలోకి దిగిన హైడ్రా.. నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లుగా చేసి అమ్మి సొమ్ముచేసుకున్నట్టు గుర్తించింది. దీంతో, భారీ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలను చేపట్టింది. పార్క్ స్థలంలో నిర్మాణాలను నేలమట్టం చేసింది. అలాగే, మూడు, నాలుగు అంతస్తులున్న భవనాలను సైతం హైడ్రా సిబ్బంది నేలమట్టం చేసింది. దీని విలువ సుమారు రూ. 30 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ప్రధానంగా హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా సీరియస్‌గా దృష్టి పెట్టింది. జీహెచ్ఎంసీతో కలిసి నగరంలో వందలాది అక్రమ నిర్మాణాలను హైడ్రా తొలగించింది. -
లచ్చమ్మ కుంట చెరువు.. హైడ్రాకు హరీష్ సవాల్
సాక్షి, హైదరాబాద్: భూముల విషయంలో పెద్దలే గద్దలుగా మారితే ఎలా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. నాదర్‌గూల్ భూముల ఆక్రమణ వెనుక మంత్రి పొంగులేటి సభ్యులే ఉన్నారని ఆరోపించారు. హైదరాబాద్ నడిబొడ్డున 7000 కోట్ల భూ కుంభకోణం జరుగుతోందని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘దళితుల భూములను కాంగ్రెస్ భక్షించే ప్రయత్నం జరుగుతోంది. నాదర్‌గూల్ భూముల కుంభకోణం జరిగింది. పేదల భూముల్లోకి వారిని పోకుండా అడ్డుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. నాదర్‌గూల్ భూముల కోసం చాలా ఏళ్లుగా పోరాటం జరుగుతుంది. ఈ భూమి తనదేనని రాజ్ బహుదూర్ కోర్టులో పోరాటం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చడం జరిగింది. ప్రస్తుతం ఈ భూముల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది.రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూ భారతి పోర్టల్‌లో ఈ ల్యాండ్ ప్రభుత్వ భూమిగా పేర్కొంది. ఈ భూములను కాపాడాల్సిన బాధ్యత ఆర్డీవోది. దీనిపై అక్కడి రైతులు రెవెన్యూ అధికారులకి, హైడ్రా కమిషనర్‌కి ఫిర్యాదు చేసినా ఎందుకు స్పందించడం లేదు. నాటి ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన భూమిని రేవంత్ రెడ్డి లాకుంటున్నారు. స్వయంగా రెవెన్యూ మంత్రే ఈ భూముల ఆక్రమణ వెనుక ఉంటే అధికారులు ఎలా చర్యలు తీసుకుంటారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో భూములను ఆక్రమిస్తే ఎవర్ని వదలను అన్న సీఎం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. ఈ భూములపై హైడ్రా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు.లచ్చమ్మ కుంట చెరువును అక్కడ పెద్దలు ఆక్రమిస్తుంటే హైడ్రా కమిషనర్ ఏం చేస్తున్నారు?. చెరువులను కాపాడుతా అనే హైడ్రాకు కళ్లు కనబడటం లేదా?. హైడ్రా కమిషనర్‌కి సవాల్ చేస్తున్నా. రేపు హైడ్రా కమిషనర్ రావాలి లేదా మా ఎమ్మెల్యేలతో నేనే వెళ్తాను. మరోవైపు 80 ఎకరాల గుట్టలు మాయం చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ నెల 7న ఈ భూములపై సుప్రీంకోర్టులో విచారణ ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వారంలోనే ఈ భూమి కోహినూర్‌కి చెందింది అని బోర్డు పెట్టారు. శిల్పా ఇన్ఫ్రా పొంగులేటి కుమారుడిది. ఈ భూముల వెనుక పొంగులేటి కుటుంబ సభ్యులే ఉన్నారు అంటూ’ వ్యాఖ్యలు చేశారు. -
HYD: భారీగా హైడ్రా కూల్చివేతలు
సాక్షి, రంగారెడ్డి: తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా బుధవారం తెల్లవారుజాము నుంచే మైలార్దేవుపల్లి సర్కిల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సుమారు 30 కోట్ల రూపాయల విలువచేసే స్థలాన్ని హైడ్రా కాపాడినట్టు తెలుస్తోంది.వివరాల మేరకు.. మైలార్దేవుపల్లిలో సర్వే నంబరు 134/20 శాస్త్రిపురానికి చెందిన 6500 గజాల పార్కు స్థలం కబ్జాకు గురైనట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో స్థానికుల ఫిర్యాదుతోరంగంలోకి దిగిన హైడ్రా.. నకిలీ పత్రాలు సృష్టించి ప్లాట్లుగా చేసి అమ్మి సొమ్ముచేసుకున్నట్టు గుర్తించింది. దీంతో, బుధవారం తెల్లవారుజాము నుంచే భారీ బందోబస్తు మధ్య హైడ్రా కూల్చివేతలను చేపట్టింది. పార్క్ స్థలంలో నిర్మాణాలను నేలమట్టం చేసింది. అలాగే, మూడు, నాలుగు అంతస్తులున్న భవనాలను సైతం హైడ్రా సిబ్బంది నేలమట్టం చేసింది. సుమారు 30 కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని హైడ్రా కాపాడినట్టు తెలిసింది.అంతకుముందు మంగళవారం కూడా హైడ్రా ఆక్రమణల కూల్చివేత చేపట్టింది. మంచిరేవుల గ్రామంలోని నాగిరెడ్డికుంటలో 7 ఎకరాల స్థలాన్ని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జాలో ఉంచుకున్నట్లు తేలింది. సర్వే చేయగా.. సదరు సంస్థ కబ్జాచేయగా మిగిలిన భూమిని, స్థానిక నేత విక్రయించినట్లు స్పష్టమైంది. ఆ మేరకు మొత్తం ఆక్రమణలను నేలమట్టం చేశామని హైడ్రా వెల్లడించింది. బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ.934 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అలాగే, బౌరంపేట్లోని గండిమైసమ్మ-మియాపూర్ రహదారికి ఇరువైపులా ఎకరా విస్తీర్ణంలో నిర్మించిన రేకుల షెడ్లను హైడ్రా నేలమట్టం చేసింది. ఘట్కేసర్ వద్దనున్న అవుషాపూర్‌లో.. ఇళ్ల స్థలాలుగా మారిన 1,440 గజాల పార్కు భూమికి, జూబ్లిహిల్స్‌లో ఆక్రమణకు గురైన 300గజాల వరద నాలాకు హైడ్రా విముక్తి కల్పించింది. -
మళ్లీ తెరపైకి బిల్డింగ్ ట్రిబ్యునల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఓ వైపు పట్టణీకరణ వేగవంతమవుతుంటే మరో వైపు అంతే వేగంతో అక్రమ నిర్మాణాలు కూడా పుట్టుకొస్తున్నాయి. అక్రమ నిర్మాణాలను నియంత్రించడం, కూల్చివేతలకు సంబంధించి ప్రభుత్వం వద్ద నిర్దిష్ట యంత్రాంగమేదీ లేకపోవడంతో సమస్య మరింత జఠిలం అవుతోంది. మహానగరంలో ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) చర్యలు తరచూ వివాదాస్పదం అవుతున్నాం. రాష్ట్రంలోని వివిధ కోర్టుల్లో పెండింగులో ఉన్న కేసుల్లో సుమారు 80 శాతం మేర అక్రమ నిర్మాణాలకు సంబంధించినవే ఉన్నట్లు సమాచారం. కాగా అక్రమ నిర్మాణాలను నియంత్రించాల్సిన టౌన్ ప్లానింగ్ విభాగం సిబ్బంది కొరత, కోర్టు స్టే ఆర్డర్ల మూలంగా కూల్చివేతలు చేపట్టలేకపోతోంది. కొన్ని సందర్భాల్లో అక్రమ నిర్మాణాలకు అనుమతులు నిరాకరించినా లేదా రద్దు చేసినా కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో మూలన పడిన ‘మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్’(ఎంబీటీ) ఏర్పాటు అంశాన్ని పురపాలక శాఖ తాజాగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. 2016లోనే తెరమీదకు ట్రిబ్యునల్2016లో ఎంబీటీ అంశం తెరమీదకు రాగా ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి సవరణలు చేశారు. 2017లోనే ఈ ట్రిబ్యునల్ ఏర్పాటుకు సంబంధించి నియమావళిని రూపొందించారు. ఈ నియమావళి ప్రకారం మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్‌లో చైర్మన్‌తో పాటు గరిష్టంగా 8 మంది సభ్యులు ఉండాలి. న్యాయ, సాంకేతిక అంశాలపై అవగాహన కలిగిన వారిని ట్రిబ్యునల్‌లో నియమించాలని ప్రతిపాదించారు. కేసుల సంఖ్యను బట్టి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బెంచ్‌లను కూడా ఏర్పాటు చేయవచ్చు. ప్రతీ బెంచ్‌లో కనీసం ఇద్దరు సభ్యులు (ఒకరు న్యాయ, మరొకరు సాంకేతిక అనుభవం) ఉండాలనే నిబంధన విధించారు. చైర్మన్‌గా నియమితులయ్యే వ్యక్తి జిల్లా జడ్జి లేదా మాజీ జిల్లా జడ్జి స్థాయి అధికారి అయి ఉండాలి. టెక్నికల్ సభ్యుడు తెలంగాణ టౌన్ ప్లానింగ్ సర్వీస్‌లో డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ స్థాయిలో పనిచేసిన వ్యక్తి అయి ఉండాలి అనే నిబంధనలు విధించారు. ఈ క్రమంలో ట్రిబ్యునల్ చైర్మన్ పదవికి అర్హులైన ఇద్దరు జిల్లా జడ్జీల పేర్లు తెరపైకి వచ్చాయి. పలు విభాగాలు కూడా సభ్యుల పేర్లను పురపాలక శాఖకు సూచించాయి. ప్రతిపాదించిన సభ్యుల్లో కొందరిపై ఆ తర్వాత అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు వేర్వేరు కారణాలతో ట్రిబ్యునల్ ఏర్పాటు ప్రక్రియ ముందుకు సాగలేదు. 2022లో హైకోర్టు ఆదేశాలు మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటులో ఆలస్యంపై దాఖలైన పిటిషన్ల నేపథ్యంలో హైకోర్టు స్పందించింది. కోర్టు ఆదేశాల మేరకు నాలుగు వారాల్లో ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని 2022 ఏప్రిల్‌లో రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ అంశాన్ని 2023లోనూ కోర్టు మరోసారి గుర్తుచేస్తూ ట్రిబ్యునల్ ఏర్పాటు అత్యవసరమని పేర్కొంది.మరోవైపు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో పారదర్శకత పెంచడం, గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2017 ఆగస్టులో తెలంగాణ స్టేట్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)ను ఏర్పాటు చేసింది. దీంతో కొత్తగా చేపడుతున్న రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుల్లో అక్రమాలకు కొంతమేర అడ్డుకట్ట పడినా, ఇతర అక్రమ నిర్మాణాల నియంత్రణకు మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ లాంటి ప్రత్యేక వ్యవస్థ అవసరమనే డిమాండ్ బలపడుతోంది. -
ప్లాట్ కొనేముందు ఇలా చేయండి: హైడ్రా హెచ్చరిక
రాజధానిలో ప్లాట్, ఇంటి స్థలం కొనేముందు పూర్తిగా విచారించి, అన్నీ సరిగా ఉంటేనే ముందుకెళ్లాలని హైడ్రా సూచించింది. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఏమైనా ఉందా? అనుమతి పొందిన లే అవుట్ అయినా.. ఇంటి నంబరు, బై నంబర్లతో అమ్ముతున్నప్పుడు మరింత అప్రమత్తంగా పరిశీలించి కొనుగోలు చేయాలని పేర్కొంది.ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా ఈ హెచ్చరికలు చేసింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ హైడ్రా ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 48 ఫిర్యాదులు వచ్చాయి.అమీన్పూర్ చెరువులో తమ లేఔట్ మునిగిపోయిందని సెక్రటేరియట్ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వాపోయారు.కాప్రా జీఆర్ రెడ్డి నగర్ హెచ్ఎండీఏ లే ఔట్లో మొత్తం నాలుగు పార్కులు ఉన్నాయి. ఒక పార్కులో ఒకదాని తర్వాత ఒకటిగా ప్రార్థన స్థలాలు వస్తున్నాయని నివాసితులు ఫిర్యాదు చేశారు. బాలానగర్ శోభనా కాలనీలోని అక్షయ ఎన్క్లేవ్ పేరిట 7.12 ఎకరాల్లో 69 ప్లాట్లతో 1983లో లేఔట్ వేశారు. ఇందులో రెండు స్థలాలను పార్కుల కోసం కేటాయించారు. 1700 గజాల పార్కును కబ్జా చేసేందుకు స్థానికులు కొంతమంది ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే 200 గజాలు ఆక్రమించి షెడ్డు వేసి వ్యాపారాలు చేస్తున్నారు. వెంటనే హైడ్రా స్పందించి చర్యలు తీసుకోవాలని, పార్కును కాపాడాలని స్థానికులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. -
ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ అనేది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. హైడ్రా పునరుజ్జీవం కల్పించిన శివరాంపల్లిలోని చారిత్రక బమ్రుఖనుద్దౌలా చెరువును ఆయన ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ఓల్డ్ సిటీ ప్రజలకు అద్భుత సంస్కృతిని అందించడానికి ఈ చెరువును అభివృద్ధి చేశాం. ఇది చెరువు అభివృద్ధి మాత్రమే కాదు.. ఈ ప్రాంత ప్రజలకు కాలుష్యరహిత వాతావరణం అందించడం. నిజాం సర్కారు గొలుసుకట్టు చెరువులను నిర్మించి హైదరాబాద్‌ను లేక్స్ అండ్ రాక్స్ సిటీగా మార్చింది. ప్రపంచంలోనే అద్భుతమైన ఈ నగరాన్ని పాడు చేస్తూ వచ్చాం. ఇప్పుడు ఎక్కడ చూసినా చెత్తే కనిపిస్తోంది. లండన్, దక్షిణ కొరియా, సింగపూర్ ఇలా అనేక నగరాల్లో నాగరికత, అభివృద్ధి నీటి సమీపంలోనే జరిగింది. నగరంలోనూ నిజాం సర్కార్ అనేకం నిర్మించింది. వరదల్లో అనేక మంది చనిపోతే వాటి నియంత్రణతో పాటు సాగునీరు, తాగునీరు అందించడానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య ద్వారా హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ నిర్మాణం చేపట్టింది. ఇవన్నీ రానురాను పాడవుతున్నాయి. నిజాం పురానాపూల్, ఉస్మానియా ఆస్పత్రి, ఉస్మానియా యూనివర్సిటీ, కౌన్సిల్ భవనం, ఫలక్‌నుమా ప్యాలెస్ సహా ఎన్నో భవనాలు నిర్మించి ఇచ్చారు. వాటిని రక్షించడం, నిర్వహించడం సాధ్యం కావవట్లేదు. ఈ నేపథ్యంలోనే కీలక నిర్ణయం తీసుకున్నాం. రానున్న మూడు నెలల్లో పురాతన భవనాల పునరుద్ధరణ చేపడతాం. పాతబస్తీలో మెట్రో రైల్‌ను వీలైనంత త్వరలో నిర్మిస్తాం’ అని చెప్పారు.పాతబస్తీలో అభివృద్ధి జరగాలి: ఒవైసీ‘పాతబస్తీ హైదరాబాద్‌కు గుండెకాయ వంటిది. పాతబస్తీలో తగిన స్థాయిలో అభివృద్ధి జరగాలి. అంతా కలిసి దీనిపై ఉన్న అపార్థాలను దూరం చేద్దాం, మళ్లీ అసెంబ్లీ ఎన్నికల్లోపు మెట్రో పనులు చేస్తామని సీఎం చెప్పారు. ఆ స్థాయిలో పనులు జరుగుతున్నాయి. మీరాలం ట్యాంక్‌పై మంజూరైన బ్రిడ్జ్ పనులకు సీఎం ఈ నెల 14న శంకుస్థాపన చేస్తారు’ అని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. హెచ్ఎండీఏ కేటాయించిన రూ.20 కోట్లతో ఈ చెరువును అభివృద్ధి చేశామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ మీర్జా రెహ్మత్ బేగ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు. ఎంఐఎం నుంచి మాకు మద్దతు‘పాతబస్తీ నుంచి అసదుద్దీన్ దేశ ప్రతినిధిగా గొంతు వినిపిస్తున్నారు. ఒవైసీ, ఎంఐఎం నుంచి మాకు మంచి మద్దతు వస్తోంది. ప్రపంచంతో పోటీపడే నగరంగా చేయాలనే ఆక్రమణలు తొలగించి చెరువులు, పార్కులను అభివృద్ధి చేస్తున్నాం. బమ్రుఖనుద్దౌలా చెరువు వద్ద లేక్ పోలీసింగ్ ఏర్పాటు చేయాలి. ఆడబిడ్డలు ధైర్యంగా ఇక్కడకు వచ్చేలా, వాకింగ్ చేసేలా చర్యలు తీసుకోండి. ప్రతి మహిళ స్వయం సహాయక బృందాల్లో సభ్యులుగా చేరాలి. మీరు ఉత్పత్తి చేసే వస్తువులను ఇక్కడ స్టాల్స్ పెట్టి విక్రయించుకునే అవకాశం ఇస్తాం. ఈ ప్రాంతంలో లేక్ ఎకానమీ ఏర్పాటు చేయాలని జీహెచ్ఎంసీ, హైడ్రా కమిషనర్లను ఆదేశిస్తున్నా. వాకింగ్ చేసిన వాళ్లు ఇక్కడే వారికి కావాల్సినవి కొనుక్కునే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయండి. పాతబస్తీలో రాత్రి ఒంటి గంట వరకు వ్యాపారాలకు అనుమతి ఇస్తున్నాం. మూసీ పరీవాహక ప్రాంతంలో నైట్ ఎకానమీకి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పాతబస్తీలో యువతలో నిరుద్యోగం ఉంది. వీరు నైట్ ఎకానమీ ద్వారా జీవనోపాధి పొందుతారు. గండిపేట నుంచి గౌరారం వరకు మూసీ వెంట లేక్ ఎకానమీ అభివృద్ధి చేస్తాం. మూసీలో పేదల ఇళ్లు ఉంటే వారిని వీధుల్లో వదిలేయం. వారికి కొత్త ఇళ్లు నిర్మించి ఇస్తాం. దీని అభివృద్ధితో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక ఉపాధి కలుగుతుంది. మీరు అందరూ వచ్చి కూర్చుని పనులు చేయించండి. ఒవైసీ ఎంఐఎం పార్టీ వర్కర్లను ఈ కోణంలో ఆదేశించాలి. మీరు ఆదేశిస్తే అన్నీ జరుగుతాయి. ఈ ప్రాంతం అభివృద్ధికి నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ పనులు చేయించుకోవాల్సిన బాధ్యత మీదే. గతంలో రంజాన్ వస్తే బిర్యానీ, కుబానీ ఇచ్చి వెళ్లే వాళ్లు. నేను వాటితోపాటు అభివృద్ధి కూడా చేస్తా’ అని అన్నారు. -
నిజాం రాణులు జలకాలాడిన తటాకం!
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదివారం పాతబస్తీలో ప్రారంభించిన బమ్రుఖనుద్దౌలా చెరువు కు వందల ఏళ్ల చరిత్ర ఉంది. 1770లో హైదరాబాద్ మూడో నిజాం సికందర్ జా ప్రధానమంత్రిగా ఉన్న నవాబ్ రుక్న్ ఉద్ దౌలా దీన్ని నిర్మించారు. చారిత్రక ఆనవాళ్ల ప్రకారం తొలినాళ్లలో ఈ చెరువు 100 ఎకరాలకుపైగా విస్తరించి ఉండేది. రాజేంద్రనగర్, ఆరాంఘర్, కాటేదాన్ ప్రాంతాల నుంచి వచ్చే వరద ఈ చెరువులోకి చేరేది. నిజాం కాలంలో మీరాలం ట్యాంక్‌ను రాజులు.. బమ్రుఖనుద్దౌలా చెరువును రాణులు స్నానాల కోసం ఉపయోగించేవారు. ఈ చెరువులో వనమూలికల మొక్కలు, కొమ్మలు వేసి దిగువున నిర్మించిన బావిలోకి వచి్చన ఊటని తాగునీరుగా వినియోగించేవారు. ఔషధగుణాలున్న ఆ నీటినే నిజాం వాడారు. ఈ చెరువు చుట్టూ సువాసనలు వెదజల్లే పూల మొక్కలు విరివిగా ఉండేవని.. అవి చెరువులో పడటంతో ఇక్కడి నీటిని సెంట్ల తయారీకి వినియోగించేవారని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ కారణంగానే బమ్రుఖనుద్దౌలా చెరువు నీరు అరబ్ దేశాలకు ఎగుమతి అయ్యేదని చెబుతున్నారు. కబ్జాల చెర విడిపించిన హైడ్రా..: హైదరాబాద్ నగరం కాలక్రమేణా విస్తరించడం, ఇతర ప్రాంతాల నుంచి వరద రాకపోవడంతో బమ్రుఖనుద్దౌలా చెరువు చివరకు 18 ఎకరాల్లో మిగిలింది. కానీ అక్రమార్కులు క్రమంగా చెరువును కబ్జా చేయడంతో 4.12 ఎకరాలకు కుంచించుకుపోయొంది. దీంతో 2024 ఆగస్టులో రంగంలోకి దిగిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఆయా ఆక్రమణలను తొలగించి దశలవారీగా చెరువును తిరిగి 18 ఎకరాలకు విస్తరించింది. దాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసింది. నాటి చారిత్రక ఆనవాళ్లను పరిరక్షిస్తూనే తాజా ఆకర్షణలతో తీర్చిదిద్దింది. అలాగే జల కాలుష్యానికి తావు లేకుండా మురుగునీటి కట్టడి, చెరువులోకి ఇన్లెట్, ఔట్‌లెట్స్‌ను పక్కాగా ఏర్పాటు చేసింది. నిజాం కాలంలో రాతితో నిర్మించిన బండ్‌ను చెక్కు చెదరకుండా కాపాడుతూ మరింత పటిష్టం చేసింది. చెరువు పూడికలో కలిసిపోయిన నాటి రాళ్లను బయటకు తీసి భద్రపరిచింది. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు, చిన్నారుల కోసం ప్లే ఏరియాలు, ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఆక్రమణలకు వీల్లేని రీతిలో చెరువు కట్ట చుట్టూ, చెరువు లోపలి వైపు కూడా ఫెన్సింగ్ వేసింది. -
‘బుల్డోజర్’ తీర్పు మీకు వర్తించదా?
సాక్షి, హైదరాబాద్: ఫిర్యాదు రావడమే అదునుగా ఎలాంటి చట్టబద్ధమైన ప్రక్రియ చేపట్టకుండా భూములను ప్రభుత్వానివిగా పేర్కొంటూ హైడ్రా కంచె వేయడంపై హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ‘బుల్డోజర్ న్యాయం’పై చెప్పిన తీర్పు మీ ఏజెన్సీకి వర్తించదా అని ప్రశ్నించింది. అత్యున్నత న్యాయస్థానం తీర్పునకు కట్టుబడి పనిచేస్తున్నారా? లేదా? అని అడిగింది. సహజ న్యాయ సూత్రాలను పాటించకుండా, ఇష్టారాజ్యంగా వ్యవహరించాలని హైడ్రా భావిస్తోందా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు వచ్చినప్పుడు, కంచె వేసేటప్పుడు హైడ్రా చట్ట ప్రక్రియను పాటించడంలేదని, ఇది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందని అభిప్రాయపడింది. ‘మీరు మీకు నచ్చిన భూములకు కంచె వేస్తూనే ఉంటారు. కానీ మీ చర్యలకు మద్దతిచ్చే ఆధారాలు మీ వద్ద ఉండవు’అని మండిపడింది. హైదరాబాద్ గోల్కొండ మండలం గుడిమల్కాపూర్ సర్వే నంబర్ 104లోని 1,351 చదరపు గజాల స్థలంలో తన షెడ్‌ను కూచ్చివేసి, దాని చుట్టూ హైడ్రా కంచె వేయడాన్ని సవాల్ చేస్తూ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త ప్రసాద్ ఎన్.తంజెర్ల హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. హైడ్రా చర్య గతంలో కోర్టు ఇచ్చిన తీర్పులకు విరుద్ధమన్నారు. హైడ్రా న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కోర్టు అడిగిన వాటిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల ప్రకారం హైడ్రా చర్యలు చేపడుతోందని వాదించారు. కంచె తొలగించండి... వాదనలు విన్న న్యాయమూర్తి.. సదరు భూమి నుంచి కంచె తొలగించాలని హైడ్రాను ఆదేశించారు. అలాగే అక్కడ ఎలాంటి మార్పులు చేయొద్దని పిటిషనర్‌కు స్పష్టం చేశారు. ఆ భూములు ప్రభుత్వ భూములా.. వివాదంలో ఉన్నాయా.. కోర్టు ఉత్తర్వులున్నాయా.. అనేది ఎలా నిర్ధారణ చేస్తున్నారని ప్రశ్నించారు. ఎలాంటి ఆధారాలు, నిర్ధారణ లేకుండా కంచె వేయడం సబబుకాదని హితవు పలికారు. జీవితకాలం సంపాదించిన డబ్బుతో ప్రజలు భూమి కొనుగోలు చేస్తారని, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా కంచెలు వేస్తూ పోవడం సమర్థనీయం కాదన్నారు. హైడ్రాపై ఆరోపణలు ఇదే తొలిసారి కాదని, వందల పిటిషన్లు న్యాయస్థానం వద్ద విచారణలో ఉన్నాయని చెప్పారు. కంచె వేయడానికి ఏజెన్సీకున్న అధికారం ఏంటో కూడా చెప్పాలన్నారు. పిటిషనర్ ఫోన్‌ను లాక్కునే అధికారం మీకు ఎవరిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన పత్రాలు, గణాంకాలు, భూములపై పూర్తి సమాచారం లేకుండా కంచె వేయవద్దని హైడ్రాను ఆదేశించారు. ఇప్పటివరకు అలా వేసి ఉంటే తొలగించాలన్నారు. తదుపరి విచారణ మార్చి 3కి వాయిదా వేశారు. -
హైడ్రా కూల్చివేతలు..మాదాపూర్‌లో ఉద్రిక్తత
హైదరాబాద్: హైడ్రా కూల్చివేతల ఎపిసోడ్ మరోసారి ఉద్రిక్తతకు దారితీశాయి. మాదాపూర్ ఖానామెట్‌లో ఆలయ స్థలంలో నిర్మించిన షాప్‌లను హైడ్రా అధికారులు కూల్చివేస్తుండగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆలయ స్థలంలో నిర్మించిన షాపులను కూల్చివేయడంపై ఆలయ పూజారులు, భక్తులు, గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. దాంతో అక్కడ అధికారులతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, అక్రమ నిర్మాణాలను హైడ్రా చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్నారు హైడ్రా అధికారులు. ఈ క్రమంలోనే పలు చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. అయితే పలు చోట్ల మాత్రం హైడ్రా చర్యలను స్థానికులు అడ్డుకుంటున్నారు. ఎప్పట్నుంచో ఇక్కడ ఉంటుంటే హఠాత్తుగా హైడ్రా పేరుతో ఈ తొలగింపులేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంచితే, హైదరాబాద్ నగర పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా తీసుకుంటున్న చర్యలతో బీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్పటికీ మధ్యతరగతి ప్రజల నుంచి స్పందన మాత్రం సానుకూలంగానే ఉంది. ఇప్పటికే ఎన్నో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా.. ఇంకా కూల్చివేయాల్సిన అక్రమ నిర్మాణాలు మాత్రం ఇంకా ఉన్నట్లే తెలుస్తోంది. ప్రధానంగా బడాబాబుల అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వస్తున్నాయి. -
ఏకపక్షం చెల్లదు.. హైడ్రాను ఆదేశించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయూడీ) పర్యవేక్షణ, మార్గదర్శకత్వంలోనే హైడ్రా పనిచేయాలని హైకోర్టు తేల్చి చెప్పింది. ఎలాంటి అనుమతి లేకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని కంచె వేసే అధికారం లేదని స్పష్టం చేసింది. ఆక్రమణ ఆరోపణ రాగానే కంచె వేసే అధికారం ఉందన్న వాదనపై పత్రాలను తమ ముందు ఉంచాలని హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్‌ను ఆదేశించింది.కాగా, గండిపేట మండలం నార్సింగిలోని 1608 గజాల భూమిపై వివాదం జిల్లా కోర్టు విచారణలో ఉంటే వెంటనే అందులో వేసిన కంచెను తొలగించాలని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల కాపీ అందిన 48 గంటల్లో ప్రక్రియ పూర్తి చేయాలంది. దీనిపై నివేదిక సమర్పించాలంటూ... తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా వేసింది. ఆ భూమిలో హైడ్రా బోర్డు తొలగించాల్సిన అవసరం లేదంది. వివాదాస్పద భూమిపై విచారణ కోర్టు పరిధిలో ఉంటే కంచె తొలగించాలంది.కోర్టు పరిధిలోని భూమి చుట్టూ ఉన్న ప్రహరీని హైడ్రా తొలగించిందని, ఆ సంస్థ జోక్యం చేసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరుతూ నార్సింగికి చెందిన జి.రాహుల్ యాదవ్ సహా ఏడుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్‌రెడ్డి వాదిస్తూ.. ‘వివాదాస్పద భూమి మా ప్రైవేట్ భూమి. హక్కులు మాకే చెందేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్లు రంగారెడ్డి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు.ఆ కేసులో వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అందులో ప్రతివాదిగా నార్సింగి మున్సిపల్ కమిషనర్ కూడా ఉన్నారు. ఇదే భూమికి సంబంధించి మరో పిటిషన్ దాఖలైంది. వివాదాస్పద భూమిలో హైడ్రా జోక్యం చేసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలి’ అని కోరారు. హైడ్రా కౌన్సిల్ వాదనలు వినిపిస్తూ.. ఎంఏయూడీ పర్యవేక్షణ, మార్గదర్శకత్వంలో పనిచేస్తున్నా.. ప్రతిసారి ఆదేశాలు పొందాల్సిన అవసరం లేదన్నారు. ఎంఏయూడీ అనుమతి లేకుండా ఏజెన్సీ సొంత నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. -
Ranganath: నెక్స్ట్ గవర్నమెంట్ మారితే హైడ్రా ఫ్యూచరేంటి?
-
నెక్స్ట్ గవర్నమెంట్ మారితే హైడ్రా ఫ్యూచరేంటి?
-
శామీర్‌పేటలో హైడ్రా కూల్చివేతలు
మేడ్చల్: జిల్లాలోని శామీర్‌పేటలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. 30 ఏళ్ల క్రితం 20 ఫీట్ల రోడ్డు కబ్జా చేసి ప్రహరీ గోడ నిర్మించారు. అయితే దీనిపై ఫ్రెండ్స్ కాలనీ వాసులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ప్రహరీ గోడ కూల్చివేసి రోడ్డు డైరెక్షన్ ఇవ్వడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. రూ. 3 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. 15 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా.. మియాపూర్ విలేజ్ ముక్తా మహబూబ్‌పేటలో ఆక్రమణలను తొలగించింది. ప్రభుత్వ ఆక్రమిత భూములపై హైడ్రా చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆక్రమిత భూమి చిన్నదా.. పెద్దదా అని కాకండా హైడ్రా కూల్చివేతలు చేపడతూ వస్తంది. గత కొంతకాలంగా తెలంగాణలోని హైదరాబాద్ నగర పరిధిలోని అనేక ఆక్రమిత భూములన హైడ్రా కాపాడింది. కాగా, గత ఏడాది నవంబర్‌లో నగరంలోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ సమీపంలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించింది. ఇక్కడి ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ హైడ్రాకు ఫిర్యాదు అందడంతో అధికారులు పరిశీలించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్ లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. అనుమతులు లేని షేడ్స్ కట్టడాలను హైడ్రా సిబ్బంది తొలగించారు. -
మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్
సాక్షి, హైదరాబాద్: మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. 3 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. 15 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా.. మియాపూర్ విలేజ్ మక్తా మహబూబ్‌పేటలో ఆక్రమణలను తొలగించింది.కాగా, గత ఏడాది నవంబర్‌లో నగరంలోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ సమీపంలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించిన సంగతి తెలిసిందే. ఇక్కడి ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారంటూ హైడ్రాకు ఫిర్యాదు అందడంతో అధికారులు పరిశీలించారు. అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్ లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. అనుమతులు లేని షేడ్స్ కట్టడాలను హైడ్రా సిబ్బంది తొలగించారు. -
దుర్గం చెరువు ఆక్రమణ.. హైడ్రా, సర్కార్‌కు ప్రభాకర్ రెడ్డి సవాల్
సాక్షి, హైదరాబాద్: దుర్గం చెరువులో తనకు భూమి లేదని క్లారిటీ ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. తాను ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం అంటూ ప్రభుత్వానికి, హైడ్రాకు సవాల్ విసిరారు. పోలీసులు నమోదు చేసిన కేసుపై లీగల్‌గా ముందుకు వెళ్లనున్నట్టు చెప్పుకొచ్చారు.దుర్గం చెరువులో ఐదు ఎకరాల భూమి ఆక్రమణపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘దుర్గం చెరువు కబ్జా అనేది పూర్తిగా నిరాధారం. నాపై కక్షతో కేసు పెట్టారు. హైకోర్టులో యాక్షన్ పెడితే రెండేకరాలు కొన్నాం. అయితే తర్వాత చెల్లదని TDR ఇచ్చారు. తరువాత దుర్గం చెరువు నిర్మాణం జరిగింది. బాలకృష్ణ, లహరి ఎస్టేట్ హరిబాబు భూములు పక్కనే ఉన్నాయి. ప్రైవేట్ పార్కింగ్ పెట్టినందుకు నాపై కేసు పెట్టారు. దుర్గం చెరువులో నాకు భూమి లేదు. ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. రోడ్డు మీద, చెట్ల కింద వెహికిల్ పార్కింగ్ చేసినందుకు కేసు పెట్టారు.అక్కడ ప్రభుత్వ భూమి కూడా లేదు. అక్కడ ప్రైవేట్ బస్సులు పార్కింగ్ చేస్తారు. ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూమి గజం కూడా లేదు. అక్కడ నటుడు బాలకృష్ణ, లహరి ఎస్టేట్ హరిబాబు భూములు ఉన్నాయి. ఎవ్వరూ పర్సనల్ ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదులో హైడ్రా పేరు మాత్రమే కనిపిస్తోంది. కేసు సమాచారం మా సిబ్బందికి పోలీసులు చెప్పారు. కేసుపై లీగల్ పోరాటం చేస్తాం. పోలీస్ స్టేషన్‌కు వెళ్తాను.. పోలీసులకు సహకరిస్తాను. అక్కడ వెహికిల్ పార్కింగ్ చేయడం సహజం. బేషరుతుగా కేసు విత్ డ్రా చేయకపోతే.. ఎఫ్టీఎల్లో ఇండ్లు కట్టారు. ఆ ఇళ్లు ముందు ధర్నా చేస్తాం’ అని హెచ్చరించారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌కు షాక్.. కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి(Kotha prabhakar reddy) బిగ్ షాక్ తగలింది. దుర్గం చెరువు అక్రమ ఆక్రమణపై హైడ్రా ఫిర్యాదుతో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్, ఆయన సోదరుడు వెంకట్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో భూ ఆక్రమణపై దర్యాప్తు చేపట్టినట్టు మాదాపూర్ పోలీసులు తెలిపారు.వివరాల మేరకు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డిలు.. దుర్గం చెరువులో సుమారు ఐదు ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించినట్లు ఆరోపణలు వచ్చాయి. చెరువు ప్రాంతాన్ని మట్టి, రాళ్లతో నింపేసినట్టు హైడ్రా(HYDRA) సూపర్వైజర్ కాంత్రి ఆనంద్, హైడ్రా అధికారులు గుర్తించారు. దీంతో, ఆక్రమణలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండగా.. అక్రమంగా ఆక్రమించిన ఐదు ఎకరాల భూమిని ఎస్టీఎస్ ప్రైవేటు ట్రాన్స్‌పోర్టు పార్కింగ్‌కు వినియోగిస్తున్నట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.అయితే, ఈ భూమి వ్యవహారంలో 2014లో హెచ్ఎండీఏ ఎఫ్టీఎల్ ప్రాథమిక నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నేతలు భూమి ఆక్రమించినట్టు ఫిర్యాదులో చెప్పుకొచ్చారు. ఇలా ఆక్రమించిన భూమి ద్వారా నిందితులు అక్రమ ఆదాయం(రెంటుకు ఇవ్వడం) పొందుతున్నారని ఆరోపించారు. దీంతో, మాదాపూర్ పోలీసులు.. ప్రభాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డిపై BNS 329(3), 3(5) సెక్షన్లు, PDPP యాక్ట్ సెక్షన్-3 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
అప్పులపాలై.. బెట్టింగ్ యాప్స్ కు బలైన హైడ్రా కమిషనర్ గన్ మెన్..
-
రెండేళ్ల పాలన ప్రజా రంజకమేనా?
తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఇందుకు అభినందనలు. అయితే, ఈ రెండేళ్ల పాలన ప్రజలను సంతృప్తి పరిచిందా? అనేది ఇది చర్చనీయాంశం. ప్రభుత్వం ఏవైనా కొన్ని హామీలను నెరవేర్చడం మరికొన్నింటిలో విఫలం కావడం సహజం. కాగా, మొత్తమ్మీద ప్రజలు ఏమనుకుంటున్నారు? అన్న విషయంపై ఎవరి అంచనాలు వారివి. రేవంత్ ప్రభుత్వ పాలన రెండు అడుగులు ముందుకు, మూడు అడుగులు వెనక్కు అనే చందంగా ఉందన్న అభిప్రాయం కలుగుతోంది. ఏదో చేయాలన్న తాపత్రయం, కొన్ని చేయలేక సతమతమవడం, ఆపైన బుకాయింపు, ప్రచారంతో జనాన్ని మాయ చేయాలన్న ప్రయత్నం కనిపిస్తాయి. కొన్ని విషయాలలో రేవంత్ గురువు చంద్రబాబు బాటలోనే అతిశయోక్తులు మాట్లాడుతున్నట్లు అనిపిస్తుంది.ఓటుకు నోటు కేసు తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ క్షీణించుకుపోయిన నేపథ్యంలో రేవంత్ వ్యూహాత్మకంగా కాంగ్రెస్‌లో చేరారు. తదుపరి పీసీసీ అధ్యక్ష స్థాయికి ఎదిగి అప్పటి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సవాల్ విసరడం ఆయన రాజకీయ జీవితంలో పెద్ద మలుపు. ఆ దూకుడే రేవంత్ కలిసివచ్చిందని చాలా మంది నమ్ముతారు. సీఎం అయిన తర్వాత కూడా అదే పంథా కొనసాగించాలని చూస్తున్నప్పటికీ అన్నిసార్లు కలిసి వస్తున్నట్లు అనిపించదు. ఎన్నికల సమయంలో రేవంత్ ఆరు గ్యారంటీల పేరుతో ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేస్తామని, చట్టబద్దత తెస్తామని ప్రచారం చేశారు. అయితే, వీటిల్లో ఒక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మినహా మిగిలిన వాటినేవీ పూర్తిగా నెరవేర్చినట్లు కనపడదు. రైతు రుణమాఫీ, కేసీఆర్ పథకం రైతుబంధు కొనసాగింపు, కౌలు రైతులకు వర్తింపు, ఎకరాకు రూ.15 వేలన్న హామీ, వ్యవసాయ కూలీలకు ప్రత్యేక పథకం, మహాలక్ష్మి కింద మహిళలకు నెలకు రూ.2500, రూ.500లకే గ్యాస్ సిలిండర్, వృద్ధాప్య ఫించన్ రూ.నాలుగు వేలకు పెంపు, విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో అంతర్జాతీయ పాఠశాలల హామీలేవీ అమలు కాలేదనే చెప్పాలి.తెలంగాణకు తలమానికమైన హైదరాబాద్ నగరాన్ని ఆక్రమణలు, కబ్జా వంటివాటికి దూరంగా ఉంచాలన్న ప్రయత్నం బాగానే ఉంది. హైడ్రా ద్వారా చెరువుల గర్భాలలో ఉన్న నిర్మాణాలను కూల్చారు. కానీ, ఈ సందర్భంలో పేద, మధ్యతరగతి వర్గాలకు తీరని నష్టం జరిగింది. వారు అప్పో, సప్పో చేసి కొనుగోలు చేసిన అపార్టుమెంట్లు, విల్లాలు తమ కళ్లెదుటే కూలిపోవడం చూసి తట్టుకోలేకపోయారు. అన్ని అనుమతులు ఉన్నాయన్న భావనతో వారు కొనుగోలు చేస్తే అవి చెరువు గర్భంలో ఉన్నాయంటూ హైడ్రా పలు చోట్ల కూల్చివేసింది. భారీ వర్షాలు పడినప్పుడు వరదలు రాకుండా చూడాలన్న ఉద్దేశం మంచిదైనా ఆచరణలో గందరగోళం వల్ల ప్రభుత్వానికి ప్రజలలో చెడ్డ పేరు రావడానికి ఆస్కారం కలిగింది. అదే సమయంలో పరపతి, సంపన్నుల ఆక్రమణల జోలికి పెద్దగా వెళ్లలేదన్న విమర్శలు వచ్చాయి. కొన్నిచోట్ల ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకే నిర్మాణాలు కూల్చారు. హైదరాబాద్‌లో కొన్ని వేల కోట్ల ప్రభుత్వ భూములను రక్షించినట్లు హైడ్రా అధికారి రంగనాథ్ చెబుతున్నారు.మూసీ సుందరీకరణ స్కీమ్ అమలుకు హడావుడి చేశారు కానీ, అక్కడ నివసించే పేద వర్గాల నిరసన, రాజకీయ పక్షాల ఆందోళనల నేపథ్యంలో అది ముందుకు సాగడం కష్టంగా మారింది. హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ లావాదేవీలు తగ్గడానికి హైడ్రా యాక్టివిటీ కూడా కొంత కారణం అన్న భావన ఏర్పడింది. అయినా ఓవరాల్ ఎకానమీ వల్ల రియల్ ఎస్టేట్ కొంత తగ్గి ఉండవచ్చని, కానీ తిరిగి బాగానే పుంజుకుంటోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దానికి తగినట్లే కోకాపేట వైపు ఎకరా రూ.150 కోట్ల నుంచి రూ.175 కోట్ల వరకు వేలంలో అమ్ముడుపోవడం సంచలనంగా ఉంది. అయినా మధ్య తరగతి నుంచి ఇళ్లు, స్థలాల కొనుగోళ్లు, అమ్మకాలు పెరగనంత వరకు ఈ రంగం స్తబ్ధతగా ఉంటుంది.ఫ్యూచర్ సిటీ ప్రమోషన్ కోసం రేవంత్ ప్రభుత్వం భారీ ఎత్తున గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలను ఆహ్వానించినా వారు రాలేదు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం పంపించారు. కానీ, ఎవరూ రాలేదు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ మాత్రం వచ్చి వెళ్లారు. పెట్టుబడుల ప్రతిపాదనలపై ఏపీలో మాదిరి అంకెల గారడీ మరీ ఎక్కువ చేసినట్లు అనిపించలేదు. పరిశ్రమల భూములను ఇతర అవసరాలకు వియోగించడానికి ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు వివాదాస్పదం అయ్యాయి. కేవలం రిజిస్టర్డ్ విలువలో 30 శాతానికే పరిశ్రమల వారికి ఆ భూములు ఇవ్వాలన్న ప్రతిపాదనతో లక్షల కోట్ల స్కామ్ జరుగుతుందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. నగరంలో కాలుష్యం సమస్య నివారించడానికి తమ ప్రయత్నమన్నది రేవంత్ వాదనగా ఉంది. ఈ స్కీమ్ అమలు వల్ల ప్రభుత్వానికి కొంత మేర నిధులు సమకూరవచ్చు.గతంలో కేసీఆర్ ప్రభుత్వ రుణాలపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసేది. కానీ, ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా అదే బాటలో ఉంది. గత ఆరు నెలల్లో నిర్దిష్ట రుణాలకన్నా 190 శాతం అధికంగా అప్పులు తీసుకున్నట్లు కొద్ది రోజుల క్రితం ఆంగ్ల పత్రికలలో కథనం వచ్చింది. ప్రభుత్వంలో అవినీతిపై కూడా పలు విమర్శలు ఉన్నాయి. కాళేశ్వరం, ఈ-ఫార్ములా రేస్ వ్యవహారాలలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌లను ఇరుకున పెట్టడానికి ప్రయత్నించారు కానీ, ఎందువల్లో కాస్త వెనక్కి తగ్గినట్లు కనిపిస్తుంది. ప్రగతి భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చినా, తొలుత చూపిన శ్రద్ద ఇప్పుడు కనిపించకపోవడంతో జనం కూడా పెద్దగా రావడం లేదని చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ స్థాయిలో వీక్‌గా ఉండడం రేవంత్‌కు ప్లస్ పాయింట్‌గా ఉంది. దానికి తోడు జూబ్లిహిల్స్ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకుని కాంగ్రెస్‌ను రేవంత్ గెలిపించారు. కాంగ్రెస్‌పై ప్రజలలో వ్యతిరేకత లేదని అనడానికి ఇది రుజువుగా తీసుకోరాదు. కాకపోతే తాత్కాలికంగా ఉపశమనంగా కనిపిస్తుంది. ఈ మూడేళ్లలో రేవంత్ జాగ్రత్తలు తీసుకుని ప్రజలలో ప్రభుత్వ ఇమేజీని పెంచుకోవడానికి గట్టి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇదే సమయంలో రేవంత్ ప్రకటనలు మరీ అతిగా ఉండకుండా ఉంటే మంచిది.ప్రపంచంలోనే ఆదర్శంగా తెలంగాణను తయారు చేస్తున్నామని, తెలంగాణ రైజింగ్ అన్ స్టాపబుల్ అని, అభివృద్ది కోసం ప్యూర్, క్యూర్, రేర్, దేశానికి తెలంగాణనే రోల్ మోడల్, ఢిల్లీకి నొయిడా-తెలంగాణకు కొడంగల్, అంతర్జాతీయ స్థాయికి లగచర్ల పారిశ్రామికవాడ, వచ్చే పదేళ్లలో తెలంగాణ ప్రపంచంలోనే టాప్.. ఇలాంటివి ఎన్నికల సమయంలో ఇచ్చే నినాదాలుగా కనిపిస్తాయి. కానీ, మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఇవే కాంగ్రెస్‌కు, రేవంత్‌కు ప్రశ్నలుగా ఎదురవుతాయి. రేవంత్ ఒక నిజం చెప్పారు. కాళ్లలో కట్టెలు పెట్టడం-రాజకీయాలలో గేమ్ రూల్ అని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రేవంత్ ఆ వ్యూహాన్నే అమలు చేసి ఉండవచ్చు. ఇప్పుడు తనకు కూడా అదే సమస్య అవుతుందన్న అనుమానం ఉండవచ్చు. కాళ్లలో కట్టెలు పెట్టే అవకాశం లేకుండా చేసుకుని రేవంత్ ముందుకు వెళ్లగలుగుతారా? అన్నది కాలమే చెప్పాలి.- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
హైకోర్టుకు క్షమాపణ చెప్పిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
సాక్షి, హైదరాబాద్: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఎదుట వ్యక్తిగతంగా హాజరై బేషరతుగా క్షమాపణ చెప్పారు. ఆయన క్షమాపణను అనుమతించిన ధర్మాసనం తదుపరి విచారణకు హాజరు నుంచి మినహాయింపు ఇచి్చంది. అయితే ధిక్కరణ కేసు కొనసాగుతుందని, వాదనలు విని తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది. తదుపరి విచారణ ఈ నెల 18కి వాయిదా వేసింది. బతుకమ్మకుంట భూ వివాదంపై జూన్ 12న హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు జారీచేసింది. ఈ ఉత్తర్వులను హైడ్రా ఉల్లంఘించినందున కమిషనర్ రంగనాథ్‌పై ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ భూ హక్కులు కోరుతున్న ఎడ్ల సుధాకర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ మౌషుమి భట్టాచార్య, జస్టిస్ బీఆర్ మధుసూదన్‌రావు ధర్మాసనం.. రంగనాథ్‌ను నేరుగా హాజరై వివరణివ్వాలని గతంలో ఆదేశించింది. అయినా గత నెల 27న ఆయన హాజరుకాలేదు. దీనిపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారిక అవసరాలు, అనివార్యమైన విపత్తు నిర్వహణ బాధ్యతల కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఆయన దాఖలు చేసిన మధ్యంతర అప్లికేషన్ (ఐఏ)ను కొట్టివేసింది. డిసెంబర్ 5న ఎలాంటి కారణాలు చెప్పకుండా హాజరుకావాలని మరోసారి ఆదేశించింది. దీంతో శుక్రవారం రంగనాథ్ ధర్మాసనం ముందు హాజరై క్షమాపణ కోరారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ.. భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటానని హామీఇచ్చారు. దీంతో ధర్మాసనం ధిక్కరణ పిటిషన్లో వాదనలు విన్నది. జూన్ 12 తర్వాత నిర్మాణాలు చేపట్టినట్లు తాజా ఫొటోల్లో కనిపిస్తోందని అభిప్రాయపడింది. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రస్తావన తీసుకురావొద్దని, ధిక్కరణపైనే వాదనలు వినిపించాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. సివిల్ కోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుధాకర్‌రెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్‌ను కూడా డిసెంబర్ 18కి వాయిదా వేసింది. -
బడాబాబుల ఆక్రమణలపై సామాన్యుల పోరాటం
హైదరాబాద్ నగర పరిధిలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా తీసుకుంటున్న చర్యలతో బీఆర్ఎస్, బీజేపీ వంటి పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్పటికీ మధ్యతరగతి ప్రజల నుంచి స్పందన మాత్రం సానుకూలంగానే ఉంది. ఇప్పటికే ఎన్నో అక్రమ నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా.. ఇంకా కూల్చివేయాల్సిన అక్రమ నిర్మాణాలు మాత్రం ఇంకా ఉన్నట్లే తెలుస్తోంది. బడాబాబుల అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువలావస్తున్నాయి. సమస్యల పరిష్కారానికి హైడ్రా ప్రజావాణిలో 64 ఫిర్యాదులు రావడమే ఇందుకు నిదర్శనం.బడాబాబుల ఆక్రమణలతో ఇబ్బందులు పడుతున్న సామాన్యులు హైడ్రా ప్రజావాణిని ఆశ్రయించారు. రహదారులు, పార్కులు, ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కబ్జా చేసుకుంటూ పోతుంటే గతంలో మాదిరి గమ్మున ఉండట్లేదు. దశాబ్దాల సమస్యలకు వెనువెంటనే హైడ్రా పరిష్కారం చూపడంతో.. ధైర్యాన్ని కూడగట్టుకొని వచ్చి ప్రజావానిలో ఫిర్యాదు చేస్తున్నారు. లే ఔట్లను చూపించి ఆక్రమణలు జరుగుతున్న తీరును వివరిస్తున్నారు. కాలనీలోంచి సాఫీగా సాగిపోయే వరద కాలువను.. బడా బిల్డర్స్ అడ్డుకుంటున్న వైనాన్ని హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఇదే పరిస్థితి రహదారుల విషయంలోనూ జరుగుతోంది. లే ఔట్లోకి జరిగి మరీ రహదారులను కాజేసేస్తున్నారు. మూసాపేట ఆంజనేయనగర్‌లో కబ్జాలకు గురైన 2 వేల గజాల పార్కును హైడ్రా కాపాడిందని.. దీనిని పార్కుగా అభివృద్ధి చేసే బాధ్యతను కూడా హైడ్రా తీసుకోవాలని అక్కడి నివాసితులు కోరారు. ఈ మేరకు హైడ్రా ప్రజావాణిలో దరఖాస్తు అందజేశారు. ఇలా సోమవారం హైడ్రా ప్రజావాణికి మొత్తం 64 ఫిర్యాదులందాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 వరకూ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్గారు పరిశీలించి సమస్య పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. ఫిర్యాదు దారుల ముందే గూగుల్ మ్యాప్స్, రెవెన్యూ, సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ఆధారంగా అక్కడ పరిస్థితులు గతంలో ఎలా ఉండేవి.. ఇప్పుడు ఎలా మారాయి వివరించి పరిష్కార మార్గాలు సూచించడంతో ఫిర్యాదుదారులు ఊరట చెందారు. ఫిర్యాదులు ఇలా...మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం, గాజుల రామారంలోని వోక్షిత్ హిల్ వ్యూ కాలనీ 7 ఎకరాల పరిధిలో ఉంది. దాదాపు 200ల కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి. పైన అటవీ ప్రాంతం నుంచి వచ్చిన వరద గతంలో సాఫీగా బంధం చెరువుకు వెళ్తుండేది. బంధం చెరువుకు.. వోక్షిత్ హిల్‌వ్యూ కాలనీకి మధ్య ఓ నిర్మాణ సంస్థ.. ఇప్పుడు అపార్టుమెంట్లు కట్టడంతో ఈ వరద కాలువ తమ భూమిలోంచి వెళ్లడానికి వీలు లేదని ఏకంగా మూసేశారని.. గతంలో మున్సిపాలిటీవాళ్లు వేసిన పైపులైన్లను ధ్వంసం చేశారంటూ వాపోయారు. దీంతో మురుగు, వరద నీరు నిలిచిపోయి తమ కాలనీవాళ్లం ఇబ్బంది పడుతున్నామని వోక్షిత్ హిల్ వ్యూ కాలనీ ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా , హయత్‌నగర్ మండలం బీఎన్‌రెడ్డి నగర్ డివిజన్లోని కాప్రాయి చెరువు అలుగులు మూసేయడంతో చెరువు నిండి ఎగువున ఉన్న తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని హరిహరపురం కాలనీ వాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఈ చెరువు నిండి కిందన ఉన్న బాతుల చెరువుకు నీరు వెళ్లేదని.. ఇక్కడ అలుగు ముసేయడం, తూములు బంద్‌చేయడంతో చెరువు కింద ఉన్న కాలనీల వారు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలా 20 కాలనీల వారు ఇబ్బందులు పడుతున్నారని.. వెంటనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ పశుమాముల విలేజ్ సర్వే నంబరు 454లో 9 ఎకరాల పరిధిలో దాదాపు 155 ప్లాట్లతో 1982లో లే ఔట్ వేశారు. దీనికి ఆనుకుని ఉన్న 455 సర్వే నంబరులో 1.06 ఎకరాల భూమి ఉన్న వ్యక్తి తమ లే ఔట్లోకి వచ్చి రహదారులు కబ్జాచేసేసి.. కొన్నిప్లాట్లను కూడా కలిపేసుకున్నారని ఆ లే ఔట్లోని ప్లాట్ ఓనర్ల సంఘం ప్రతినిధులు వచ్చి హైడ్రాకు ఫిర్యాదు చేశారు. మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలం వెంకటాపురం బ్యాంక్ కాలనీ లో 372 గజాల ఓపెన్ బావి ఉండేది. దీనిని మట్టితో నింపి ప్రజావసరాలకు కాలనీవాసులు వినియోగించుకునేవారు. అయితే ఇటీవల ఈ స్థలం మాది అంటూ తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించుకుని కొట్టేయాలని ఓ వ్యక్తి ప్రయత్నిస్తున్నారని స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఈ స్థలానికి జీహెచ్ ఎంసీ వాళ్లు వేసిన ఫెన్సింగ్‌ను కూడా తొలగించి ఆక్రమణలకు పాల్పడ్డారంటూ వాపోయారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్టుగేజ్‌లో ఉందంటూ బోర్డు పెట్టారని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం సర్వే నంబరు 124/1 లో 200ల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉందని.. పలు కంపెనీలకు గతంలో ఇచ్చిన ల్యాండ్‌ను వారు వినియోగించుకోకపోవడంతో వెనక్కి తీసుకున్నారు. కాని అక్కడి కంపెనీలు వేర్వేరుపేర్లతో ఆ భూమిని కొట్టేయాలని ప్రయత్నిస్తున్నారని.. అక్కడ గతంలో భూములు కోల్పోయిన వారు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మదీనాగూడ విలేజ్ సర్వే నంబరు 48లో 18 ఎకరాల పరిధిలో హృదయ కోఆపరేటివ్ సొసైటీ పేరిట హుడా లేఔట్ ఉండగా.. హెచ్ ఎండీఏకు తప్పుడు పత్రాలు సమర్పించి తమ లే ఔట్లోకి ఎకరాన్నర వరకూ జరిగి రహదారులను, ప్లాట్లను కబ్జా చేశారని.. ఇరు లే ఔట్లను పరిశీలించి న్యాయం చేయాలని హైడ్రాను ఆశ్రయించారు సొసైటీ ప్రతినిధులు. అలాగే కొండాపూర్‌లోని రాఘవేంద్ర కాలనీలో పాఠశాల భవనానికి, వాహనాల పార్కింగ్‌కు కేటాయించిన స్థలాలు కొంతమేర ఇప్పటికే కబ్జా కాగా.. మిగిలిన వెయ్యి గజాలను కాపాడాలని హైడ్రా ప్రజావాణిలో అక్కడి నివాసితులు ఫిర్యాదు చేశారు. -
‘సంధ్యా’ కూల్చివేతలకు కారణాలేమిటో చెప్పండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలోని సర్వే నంబర్ 124, 125లలో సంధ్యా కన్వెన్షన్‌కు చెందిన నిర్మాణాలకూల్చివేతకు కారణాలు తెలియజేయాలని హైడ్రా, జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్‌పై ఘాటు వ్యాఖ్యలు చేసింది. రంగానాథ్ ఈ కోర్టుకు హాజరైనప్పుడు కూల్చివేతలపై అనుసరించాల్సిన పద్ధతిని స్పష్టం చెప్పామని పేర్కొంది. చట్టపరమైన విధానాన్ని పాటించాలని పదే పదే చెబుతూ.. దాన్ని ఉల్లంఘించవద్దని హెచ్చరించామంది. అయినా.. నోటీసులు జారీ చేయకుండా.. అదే తీరుతో వ్యవహరిస్తే ఎలా అని ప్రశ్నించింది. మళ్లీ కోర్టుకు పిలిచే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పినా తీరు మార్చుకోకపోతే కఠిన వ్యవవహరించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. అసలు హైడ్రాకు ఉన్న అధికారాలేంటో ఒక్క పిటిషన్లో కూడా కౌంటర్ వేయలేదని ఏఏజీ ఇమ్రాన్‌ఖాన్‌ను అడిగింది. రహదారుల వివాదంలో జోక్యం చేసుకోవచ్చా అని ప్రశ్నించింది. సంధ్యా కన్వెన్షన్‌కు చెందిన నిర్మాణాల కూల్చివేత వివరాలు తమ ముందు ఉంచాలని చెబుతూ తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది. హైకోర్టును ఆశ్రయించిన ‘సంధ్యా కన్వెన్షన్’ నోటీసులు జారీ చేయకుండా తమ ప్రైవేట్ ప్లాట్లలోకి బలవంతంగా ప్రవేశించి నిర్మాణాలను అడ్డుకుంటున్నారని సంధ్యా హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ జూన్‌లో హైకోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన న్యాయమూర్తి.. భవన నిర్మాణ అనుమతులకు అనుగుణంగా పిటిషనర్లు చేసే నిర్మాణాల్లో జోక్యం చేసుకోవద్దని హైడ్రాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం హైడ్రా సంధ్యా కన్వెన్షన్‌కు సంబంధించిన నిర్మాణాలను కూలి్చవేసింది. దీన్ని సవాల్ చేస్తూ హైడ్రా కమిషనర్‌పై సంధ్యా హోటల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌తోపాటు ఇలాంటి మరికొన్ని పిటిషన్లపై జస్టిస్ బీ.విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం విచారణ చేపట్టారు. వందల సంఖ్యలో పిటిషన్లు.. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాదులు, ఎంఎస్ మయూర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘మున్సిపల్ అధికారులు అనుమతి మంజూరు చేశారు. హైడ్రా ఎన్వోసీ జారీ చేసింది. అయినా సోమవారం ఉదయం నాలుగు గంటలకే కూల్చివేతలు చేపట్టారు. నోటీసులు కూడా జారీ చేయలేదు. మధ్యంతర ఉత్తర్వులున్నా చట్టవిరుద్ధంగా హైడ్రా నిర్మాణాలను కూలి్చవేసింది. ఎక్కడైనా ఉల్లంఘనలుంటే వాటిని కూల్చవచ్చు. కానీ, భవనాన్నంతా నేలమట్టం చేశారు. పిటిషనర్‌కు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లింది. హైడ్రా నోటీసులు జారీ చేసి, ధిక్కరణ చర్యలు తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. హైడ్రా తరఫున ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. తనకు రెండు రోజులు అవకాశం ఇవ్వాలని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పారు. సంధ్యా కన్వెన్షన్‌పై ఫిర్యాదుదారు చేసిన వ్యక్తి తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపించారు. తమ కేవియట్‌ను పరిగణనలోకి తీసుకుని కాపీలు అందజేసేలా ఆదేశించాలన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. కూల్చివేతల పిటిషన్లే వందల సంఖ్యలో వస్తున్నాయని, దీనికి తార్కిక చట్టపరమైన ముగింపు అవసరమన్నారు. హైడ్రా ఇలానే వ్యవహరిస్తే.. ప్లాట్ల యజమానుల హక్కులు ఎలా కాపాడాలో కోర్టుకు తెలుసన్నారు. సంధ్యా అధీనంలో ఎన్ని ప్లాట్లు ఉన్నయ్.. సేల్‌డీడ్ కాపీలు, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ ఉంటే వివరాలు అందజేయాలని పిటిషనర్ న్యాయవాది ఆదేశిస్తూ.. విచారణ వాయిదా వేశారు. -
గచ్చిబౌలిలో మరోసారి హైడ్రా కూల్చివేతలు
-
గచ్చిబౌలిలో హైడ్రా కూల్చివేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా గచ్చిబౌలిలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. సోమవారం తెల్లవారుజాము నుంచే కూల్చివేతలు కొనసాగుతున్నాయి.కూల్చివేతలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ సమీపంలో అక్రమ కట్టడాలను హైడ్రా (Hydra) అధికారులు తొలగించారు. ఇక్కడి ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారు. దీనిపై హైడ్రాకు ఫిర్యాదు అందడంతో అధికారులు పరిశీలించిన అక్రమ నిర్మాణాలు చేపట్టినట్టు గుర్తించారు. పెట్రోల్ బంక్ సహా పలు నిర్మాణాల కూల్చివేతకు సిద్ధమయ్యారు. దీంతో, రంగంలోకి దిగిన అధికారులు సోమవారం ఉదయం చర్యలు చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఇదిలా ఉండగా.. గచ్చిబౌలిలోని ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లే ఔట్లో సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధరరావు ఆక్రమణలపై పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం గత మంగళవారం సంధ్యా శ్రీధర్ రావు పై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. రహదారులు ఆక్రమించి పలు నిర్మాణాలు చేపట్టడాన్ని సీరియస్ గా పరిగణించింది. మొత్తం 20 ఎకరాల పరిధిలో వేసిన లేఔట్లో 162 వరకు ప్లాట్లుండగా.. అందులోని మెజార్టీ ప్లాట్లు తనవే అనే ఉద్దేశ్యంతో రహదారులు, పార్కులు ఆక్రమిస్తే వ్యవస్థలు చూస్తూ ఊరుకోవని హెచ్చరించింది. హైడ్రా అందుకే ఆక్రమణలను తొలగించిందని పేర్కొంది. ఒకసారి లే ఔట్ వేస్తే.. అదే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ విషయమై సంధ్యా శ్రీధరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో భాగంగా జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి పై వ్యాఖ్యలు చేశారు.హైకోర్టుకు బాధితులు.. ఈ సందర్భంగా బాధిత ప్లాట్ యజమానులు కూడా వారి గోడును హైకోర్టుకు విన్నవించుకున్నారు. లే ఔట్లో సరిహద్దులన్నీ చెరిపేసి ఇష్టానుసారం నిర్మాణాలు చేపడుతున్నారని సంధ్యా శ్రీధర్‌రావుపై ఫిర్యాదు చేశారు. ఎక్కువ ప్లాట్లు కొని.. తమను భయపెట్టి మిగతావి కూడా సొంతం చేసుకోవాలని సంధ్యా శ్రీధరరావు ప్రయత్నించారని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. ఎక్కువ ప్లాట్లు తనవే ఉన్నాయని.. లే ఔట్లోని రహదారులు, ఆ పక్కనే ఉన్న తమ ప్లాట్లు, పార్కులు సరిహద్దులు పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టారని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇదేమని అడిగితే తమపై దాడి చేసేవారని బాధితులు తెలిపారు.ఓ ప్లాట్ యజమానురాలిపై దాడి చేయడమే కాకుండా తప్పుడు కేసులు కూడా పెట్టారని సంధ్యా శ్రీధర్ రావుపై బాధితులు ఫిర్యాదు చేశారు. ఇందుకు గాను సంధ్య శ్రీధర్‌రావుకు రూ. 10 లక్షలు సుప్రింకోర్టు ఫైను విధించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ ప్లాట్లు చూడడానికి కూడా వీలు లేకుండా చేశారని వాపోయారు. నేరుగా దాడులు చేసి భయబ్రాంతులకు గురి చేసిన సమయంలో తాము హైడ్రాను ఆశ్రయించామని బాధితులు తెలిపారు. హైడ్రా అధికారులు వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలించి రహదారుల ఆక్రమణలను నిర్ధారించాక చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. మాకు పెట్టిన ఇబ్బందులను కోర్టుకు విన్నవించుకోవడానికే తాము ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యామని చెప్పారు.బాధితుల ఫిర్యాదులన్నీ విన్నాక జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి ఇప్పటికే రహదారుల పునరుద్ధరణకు తాము హైడ్రాకు సూచించామని బాధితులకు తెలిపారు. అందులోని ప్లాట్ల యజమానులకు అండగా హైకోర్టు ఉంటుందని ధైర్యం చెప్పారు. లే ఔట్లోని రహదారులను, పార్కులను పునరుద్ధరించాలని హైడ్రాకు హైకోర్టు మరోసారి సూచించింది. ఫైనల్ హియరింగ్ కోసం ఈనెల 18వ తేదీకి కేసును వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే హైడ్రా సోమవారం ఉదయమే కూల్చివేతలు చేపట్టింది. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లేఔట్ లో అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది. అనుమతులు లేని షేడ్స్ కట్టడాలను తొలగించారు హైడ్రా సిబ్బంది. -
అరెకపూడి ఆక్రమణ హైడ్రాకు కనపడదా?
నిజాంపేట్/మణికొండ: పెద్దలను కాపాడేందుకు పేదల ఇళ్లను కూల్చేస్తున్నారని, హైడ్రాతో ప్రభుత్వం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీలు, మాజీ మంత్రులు ఆరోపించారు. ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, గాజులరామారంలోని సర్వే నంబర్ 307లోని భూమిని పరిశీలించారు. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కుటుంబ సభ్యులు ఈ సర్వే నంబర్లో 11 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారంటూ నిరసన తెలిపారు.సర్వే నంబర్ 307లో పేదలకు చెందిన సుమారు 270 ఇళ్లను కూల్చిన హైడ్రా అధికారులు.. అరెకపూడి గాంధీకి చెందిన 11 ఎకరాల స్థలానికి వేసిన బారికేడ్లను కూల్చిన వెంటనే తిరిగి నిర్మిస్తే మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గాం«దీ.. పార్టీ మారినందుకు రూ.1,100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని నజరానాగా కట్టబెట్టిందని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు కేపీ వివేకానంద్, మధుసూదనాచారి, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, సునీతా లక్ష్మారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, శంభీపూర్ రాజు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆదివారం మరోవైపు నార్సింగిలోని శ్రీ ఆదిత్య కేడియా రియల్టర్స్ సంస్థ మూసీ నదిలో నిర్మిస్తున్న భవనాన్ని ఎమ్మెల్యేలు సు«దీర్‌రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డిలతో కలిసి మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు.పేదలు కట్టుకున్న గృహాలను మూసీ సుందరీకరణ పేరుతో కూల్చివేశారని, అదే మూసీ నదిలో నిర్మిస్తున్న శ్రీఆదిత్య నిర్మాణానికి ఎందుకు మార్కింగ్ వేయలేదని ఆమె ప్రశ్నించారు. పేదల ఆస్తులు కూల్చటం, పెద్దల వద్ద డబ్బులు దండుకోవటమే హైడ్రా పనా? అని నిలదీశారు. నేను సిద్ధం.. మీరు సిద్ధమా: అరెకపూడిఆల్విన్ కాలనీ: తన భూములపై వస్తున్న ఆరోపణలపై అరి కెపూడి ఆదివారం వివరణ ఇచ్చారు. ‘సర్వే నంబర్ 307లో 11 ఎకరాలు కొన్న మాట వాస్తవమే. 9 మంది కుటుంబ సభ్యులు, మాజీ కార్పొరేటర్ శోభనాద్రి, నిజామాబాద్‌కు చెందిన కొందరు కలిసి 11 ఎకరాలను 1991లో కొనుగోలు చేశాం. 2014 నుంచి 2024 దాకా ఏ ఎమ్మెల్యే ఎంత అక్రమాస్తులు సంపాదించాడో తేల్చేందుకు సీబీఐ, ఈడీతో దర్యాప్తునకు మీరు సిద్ధమేనా?’ అని సవాల్ చేశారు. -
పేదలకో న్యాయం.. పెద్దలకు మరో న్యాయమా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: హైడ్రా అరాచకాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రేవంత్ సర్కార్ ఒక్క కొత్త నిర్మాణం చేపట్టలేదని కేటీఆర్ మండిపడ్డారు. ఎఫ్టీఎల్ పరిధిలో మంత్రి వివేక్, రేవంత్ సోదరుడి ఇల్లు ఉంది. పట్నం మహేందర్ గెస్ట్‌హౌస్ చెరువు మధ్యలో ఉంది. పేదలకు ఒక న్యాయం.. పెద్దలకు మరో న్యాయమా?’’ అంటూ కేటీఆర్ నిలదీశారు.‘‘కేసీఆర్ హయాంలో హైదరాబాద్‌లో ఫ్లై ఓవర్లు, అండర్ పాసులు నిర్మించాం. కొత్త జిల్లాలు ఏర్పాటు, ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమేశాం. రేవంత్ సర్కార్ కొత్తగా ఒక్క నిర్మాణం చేపట్టలేదు. 500 రోజుల్లో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తారు. హైడ్రా బాధితులను ఆదుకుంటాం. హైడ్రా పై భట్టి విక్రమార్క పీపీటీ పేరుతో 15 బిల్డర్ల పేర్లు చెప్పారు.. కానీ ఇప్పటి వరకూ ఒక్కరిపై యాక్షన్ ఎందుకు తీసుకోలేదు?. హైడ్రా చేసేది మంచే అయితే భట్టి చెప్పిన వారిపై చర్యలు ఎందుకు లేవు?. ఎఫ్టీఎల్ పరిధిలో కూల్చివేస్తామన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కి పొంగులేటి ఇంటిని కూల్చే ధైర్యం ఉందా?’’ అంటూ కేటీఆర్ ప్రశ్నించారు.‘‘మంత్రి వివేక్ ఇల్లు, రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి ఇల్లు ఎఫ్టీఎల్లో ఉంది. పట్నం మహేందర్ రెడ్డి గెస్ట్ హౌస్ చెరువు మధ్యలో ఉంది. శాసన మండల చైర్మన్ సుఖేందర్‌రెడ్డి ఇల్లు చెరువు పక్కనే ఉంది. వీరిపై చర్యలు ఉండవు కానీ సున్నం చెరువు వద్ద పేదల చెరువు మాత్రం వెంటనే కూల్చి వేస్తారు. గాజుల రామారం వద్ద బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ భూమిని అలానే ఉంచారు. పేదల ఇల్లు మాత్రం కూల్చారు. మా పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరారు కాబట్టి ఆయన భూమిపై ఎలాంటి చర్యలు లేవా?. సీఎం ఒత్తిడితో అధికారులు అక్కడ ఉండే ఆయన భూమికి ఫెన్సింగ్ వేశారు...మూసిలో అడ్డంగా కట్టిన ప్రాజెక్టును మంత్రులు అధికారులు ఎందుకు కూల్చలేదు. యూపీలో బుల్డోజర్ వస్తే అడ్డుకుంటా అన్న రాహుల్ గాంధీ తెలంగాణలో బుల్డోజర్ పేదల ఇల్లు కూలుస్తుంటే ఎందుకు మాట్లాడరు. పదేళ్లు కేసీఆర్ అధికారంలో ఉండగా పేదలకు న్యాయమే చేశాం తప్ప ఎవరికీ అన్యాయం చేయలేదు. హైడ్రా కూల్చివేతలపై బాధితులు మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. నోటీసులు లేకుండా తమ ఇళ్ళను కూల్చివేశారు. సామాన్లు సైతం తీసుకోకుండా కూల్చివేయడంతో బాధితులు రోడ్డున పడ్డారు’’ అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
దేవుడి మాన్యంలో ఆక్రమణల్ని ఈవోలే కూల్చేయొచ్చు
సాక్షి, హైదరాబాద్: దేవాదాయ భూములను ఆక్రమించి చేపట్టే నిర్మాణాలను ఇక నుంచి స్వయంగా ఆ దేవాలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) ఆధ్వర్యంలోనే కూల్చివేసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేయబోతోంది. అందుకోసం దేవాదాయ శాఖ చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ మేరకు కార్యాచరణ చేపట్టనుందని సమాచారం. ఈ మార్పు వల్ల దేవుడి మాన్యాన్ని కాజేసేందుకు ప్రయత్నించే వారి ఆగడాలకు కొంతవరకు కళ్లెం వేసే వీలుంటుందని భావిస్తోంది. దీంతోపాటు ఇప్పటికే అన్యాక్రాంతమైన దేవాలయ భూములను తిరిగి స్వాదీనం చేసుకోవటం కూడా కొంత సులువు కానుంది. వేల ఎకరాలు అన్యాక్రాంతం..: రాష్ట్రవ్యాప్తంగా 13,941 ఎకరాల దేవాదాయ భూములు ప్రస్తుతం కబ్జాదారుల అధీనంలో ఉన్నాయి. అత్యంత విలువైన ప్రాంతంగా ఉన్న మంచిరేవులలో వేణుగోపాల స్వామి దేవాలయ భూమిని కాజేసేందుకు రాజకీయ నేతలే పావులు కదుపుతున్నారు. ఇందులో ఓ కీలక నేత ముమ్మరంగా తెరవెనక పావులు కదుపుతున్నట్టు సమాచారం. దీంతోపాటు ఇంకా ఎన్నో భూములు కబ్జా చెరలోకి చేరుతున్నాయి. విషయం తెలిసినా ఆ దేవాలయ ఈఓ స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకునే వీలే లేకుండా పోయింది. దేవుడి మాన్యం కబ్జాలపై ఆ ప్రాంత దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి, అది దేవుడి భూమే అని రుజువులు చూపించాల్సి వస్తోంది. దేవాదాయ శాఖ చట్టంలో ఉన్న లోపాల వల్ల కళ్ల ముందే కబ్జా జరుగుతున్నా అధికారులు చేష్టలుడిగి చూడాల్సి వస్తోంది. ట్రిబ్యునల్‌లో కేసు తేలేలోపు ఆ భూముల్లో నిర్మాణాలు వెలుస్తున్నాయి. అధికారులకు సరైన ఆధారాలు చిక్కని పక్షంలో ఇక ఆ భూములు పరాధీనమైనట్టే. రాష్ట్రవ్యాప్తంగా 8,611.20 ఎకరాల భూమి కోర్టు కేసుల్లో చిక్కుకుంది. ఈ లొసుగులను తొలగిస్తే సమస్య చాలా వరకు పరిష్కారమవుతుందని దేవాదాయ శాఖలోని ఓ డిప్యూటేషన్ అధికారి గుర్తించి ఆ శాఖ మంత్రికి ప్రతిపాదించారు. దీంతో దేవాదాయ శాఖ చట్టంలోని సెక్షన్ 83, 84లను రద్దు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం చెరువు స్థలాలను కబ్జా చేస్తే హైడ్రా రంగంలోకి దిగి వాటిని స్వాధీనం చేసుకుంటోంది. ఇదే తరహాలో దేవుడి భూముల విషయంలోనూ యంత్రాంగానికి అధికారం ఉండేలా చట్ట సవరణలో పొందు పరచాలని ప్రభుత్వం భావిస్తోంది. -
మియాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మియాపూర్‌లో అక్రమ నిర్మాణాల కూల్చివేతకు హైడ్రా సిద్ధమైంది. స్థానికంగా సర్వే నెంబర్ మార్చి అక్రమ నిర్మాణం జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు హైడ్రా అధికారులు రంగంలోకి అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసులు మోహరించారు.దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. మియాపూర్‌లో సర్వే నెంబర్ 100లో భారీగా అక్రమ నిర్మాణాలు జరిగాయి. సర్వే నెంబర్ మార్చి.. హెచ్ఎండీఏ ఫెన్సింగ్ తొలగించిన నిర్మాణదారులు అక్కడ అక్రమంగా నిర్మాణాలను చేపట్టారు. ప్రభుత్వ భూమి సర్వే నంబరు 100లో అక్రమంగా 307, 308తో దొంగ రికార్డులు సృష్టించారు. ఈ క్రమంలో స్థానికులు.. హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. అక్రమ నిర్మాణాలను గుర్తించి కూల్చివేతలకు సిద్ధమయ్యారు. స్థానికంగా ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటుచేసుకుండా అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. -
హైదరాబాద్ మియాపూర్ లో హైడ్రా కూల్చివేతలు
-
మూసీ.. మూసేసి..
సాక్షి, హైదరాబాద్: మూసీనదిని మూసేసి అడ్డంగా నిర్మాణాలు చేపడుతున్న అక్రమార్కులపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) దృష్టి పెట్టింది. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) నార్సింగి ఎగ్జిట్ సమీపంలోని మంచిరేవులలో శ్రీ ఆదిత్య హోమ్స్ నిర్మించిన వాంటేజ్ వెంచర్‌పై సమగ్ర విచారణ జరుపుతోంది. ప్రాథమికంగా సేకరించిన వివరాల ప్రకారం ఈ సంస్థ మూసీ నదీ గర్భంలో దాదాపు మూడు ఎకరాలు కబ్జా చేసినట్లు గుర్తించింది. ఈ వ్యవహారంపై చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు కమిషనర్ ఏవీ రంగనాథ్ ‘సాక్షి’కి తెలిపారు. ఓఆర్ఆర్లో భూమి పోవడంతో.. శ్రీ ఆదిత్య హోమ్స్ సంస్థ మంచిరేవులలో వెంచర్ నిర్మించడానికి గతంలో దాదాపు పది ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. అయితే, అందులోని ఆరు ఎకరాలను ఓఆర్ఆర్, సర్వీసు రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం సేకరించింది. కానీ, రికార్డుల్లో మాత్రం రెండు ఎకరాలను మాత్రమే సేకరించినట్లు చూపారు. ఇక్కడే భూ యజమాని తెలివిగా ఆలోచించి పక్కనే ఉన్న మూసీపై కన్నేశాడు. భూసేకరణలో రెండు ఎకరాలు మాత్రమే పోయినట్లు చూపించి మూసీ నదీగర్భంలోకి చొరబడి ఏకంగా మూడు ఎకరాలను ఆక్రమించాడు. దీనిపై వివిధ విభాగాల నుంచి ఎన్ఓసీలు.. హెచ్ఎండీఏ నుంచి అనుమతి తీసుకున్న శ్రీ ఆదిత్య సంస్థ వాంటేజ్ నిర్మాణాన్ని చేపట్టింది. అంతకు ముందే మూసీ నదిలో ఓ రిటైనింగ్ వాల్ నిర్మించింది. అది వివాదాస్పదం కావడంతో హెచ్ఎండీఏ వాంటేజ్ నిర్మాణానికి అనుమతులను రద్దు చేసింది. దీంతో రిటైనింగ్ వాల్‌ను కూల్చేసిన శ్రీ ఆదిత్య సంస్థ.. అనుమతుల రద్దును సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లింది. న్యాయస్థానం నుంచి అనుకూలంగా ఆదేశాలు పొంది యధేచ్చగా నిర్మాణాలు కొనసాగిస్తోంది. ఈ కబ్జాపై కొన్నేళ్లుగా ఫిర్యాదులు అందుతున్నా.. ఏ అధికారి కూడా వాంటేజ్ జోలికి వెళ్లలేదు. కొన్ని నెలలుగా ఈ నిర్మాణంపై ప్రజాప్రతినిధులతో పాటు స్థానికుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. మ్యాప్స్‌తో కీలక ఆధారాలు హైడ్రా బృందాలు వాంటేజ్ వద్ద క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపాయి. డ్రోన్ ద్వారా చిత్రీకరించిన వీడియోలు, విలేజ్ క్రెడెస్టియల్ మ్యాప్స్‌తోపాటు గూగుల్ హిస్టారికల్ శాటిలైట్ ఇమేజెస్‌ను అధ్యయనం చేసి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్నారెస్సీ) రూపొందించిన డిజిటల్ ఎలివేషన్ మోడల్ (డీఈఎం) మ్యాప్స్‌తో మూసీ పరీవాహక ప్రాంతాన్ని సరిచూశారు. దీంతో శ్రీ ఆదిత్య హోమ్స్ సంస్థ వాంటేజ్ కోసం మూసీలో మూడు ఎకరాలు కబ్జా చేసినట్లు తేలింది. దీనిపై మరికొన్ని ఆ«ధారాలు సేకరించిన తర్వాత ఆ సంస్థకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించారు. ఈ విషయంపై రంగనాథ్ ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘ఉస్మాన్‌సాగర్ నుంచి ఇటీవల దిగువకు వదిలిన నీరు దాని సామర్థ్యంలో పావు వంతు మాత్రమే. ఆ వెంచర్ చేసిన కబ్జా కారణంగా ఆ నీరు కూడా దిగువకు వెళ్లలేక ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డును ముంచేసింది. ఉస్మాన్‌సాగర్ నుంచి పూర్తిస్థాయిలో నీరు విడుదలైతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఈ నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. నోటీసుల జారీచేసి చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం. చెరువులు, కుంటల కబ్జా కంటే మూసీ కబ్జా వల్ల నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది’అని పేర్కొన్నారు.వరదలతో బండారం బట్టబయలు ఇటీవల మూసీ పరీవాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలతో వాంటేజ్ టవర్స్‌లోకి భారీగా వరదనీరు వచి్చంది. ఉస్మాన్‌సాగర్ గేట్లు ఎత్తి దిగువకు నీరు వదలటంతో మూసీలో ప్రవహించాల్సిన నీరు.. ఎంఎఫ్‌ఎల్‌తోపాటు బఫర్ జోన్ ఆక్రమణకు గురి కావడంతో ఓఆర్ఆర్ సరీ్వస్ రోడ్డును సైతం ముంచేసింది. ఎగువన అనేక ప్రాంతాలకు పొంచి ఉన్న ముంపు ముప్పును ఎత్తి చూపింది. దీంతో ఆ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సమగ్ర విచారణకు ఆదేశించారు. -
రాజేంద్రనగర్‌లో కబ్జాలు..
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలను, భూ ఆక్రమణల నిరోధానికి ఏర్పాటైన హైడ్రా మరోసారి కొరడా ఝళిపించింది. నగరంలోని రాజేంద్రనగర్ (Rajendranagar) పరిధిలో బుధవారం దాడులు నిర్వహించిన హైడ్రా రూ.139 కోట్ల విలువైన భూములను అక్రమార్కుల బారి నుంచి కాపాడింది. హైడ్రా అధికారులు బుల్డోజర్లు, జేసీబీలతో అక్రమ నిర్మాణాలను, ఆక్రమణలను తొలగిస్తున్నారు. ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అధికారులు తదనుగుణంగా చర్యలు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి.. రాజేంద్రనగర్ పరిధిలోని బుద్వేల్, ఉప్పరపల్లి (upparpalli) గ్రామాల్లో ఉన్న ‘జన చైతన్య ఫేస్-1, ఫేస్-2’ నిర్మాణాల్లో నాలుగు పార్కుల భూమి ఆక్రమణలకు గురయ్యాయి. ఈ విషయమై స్థానికులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపిన హైడ్రా అధికారులు.. కబ్జాలను ధ్రువీకరించుకున్నారు. బుధవారం నాటి చర్యలతో ఆక్రమణలో ఉన్న సుమారు 19,878 గజాల పార్కు స్థలం మళ్లీ ప్రభుత్వం స్వాధీనమైంది. దీని విలువ దాదాపు రూ.139 కోట్లు ఉండవచ్చునని అంచనా. బుధవారం ఉదయం ఉప్పరపల్లికి చేరుకున్న అధికారులు వేర్వేరు చోట్ల ఉన్న ఆక్రమిత భూముల్లోకి బుల్డోజర్లు, జేసీబీలు నడిపించారు. ఒక్కో ఆక్రమిత ప్రాంతం విస్తీర్ణం 500 నుంచి 3000 గజాల వరకు ఉంది. వీటిల్లోని చెట్లను తొలగించిన అధికారులు స్థలం చుట్టూ ఫెన్సింగ్ పనులు చేపట్టారు. ప్రభుత్వ భూమి అన్న హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. -
హైదరాబాద్ బంజారాహిల్స్ లో హైడ్రా కూల్చివేతలు
-
బసవతారకం ఆసుపత్రి వద్ద హైడ్రా కూల్చివేతలు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్(Hyderabad City) సిటీలో హైడ్రా(HYDRA) కూల్చివేతలు కొనసాగుతున్నాయి. బంజారా హిల్స్‌లో(Banjara Hills) శుక్రవారం ఉదయం నుంచి హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సుమారు 750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు.వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో ఆక్రమణకు గురైన ఐదు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని హైడ్రా గుర్తించింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు.. స్థలాన్ని పరిశీలించి ఆక్రమణలను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో, శుక్రవారం ఉదయం హైడ్రా అధికారులు.. అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. కాగా, వీఆర్ ఇన్ఫ్రా పార్థసారథి, ఆయన కుమారుడు విజయ్ భార్గవా భూమిని కబ్జా చేసినట్టు తెలిసింది.షేక్‌పేట మండలం బంజారాహిల్స్ రోడ్డు నంబర్-10లో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. గతంలో ప్రభుత్వం ఐదు ఎకరాల్లో జలమండలికి 1.20 ఎకరాలను కేటాయించింది. 1.20 ఎకరాలతో పాటు మొత్తం ఐదు ఎకరాల భూమి తనదంటూ పార్థసార్థి కోర్టుకెక్కారు. అనంతరం, చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు వేటకుక్కలతో కాపాలా పెట్టారు. కాగా, కోర్టులో వివాదం ఉండగానే మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో షెడ్డులు నిర్మించుకున్నారు.వాస్తవానికి 403 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే 403/52 బై నంబర్ వేసి ఆక్రమణలకు పార్థసారథి పాల్పడినట్టు నిర్ధారణ అయ్యింది. ఆన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్‌తో 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనదంటూ పార్థసారథి క్లెయిమ్ చేస్తున్నట్టు హైడ్రా నిర్ధారించుకుంది. తరువాత 5 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది. -
హైదరాబాద్ లో మరోసారి హైడ్రా కూల్చివేతలు
-
ఉదయాన్నే హైడ్రా కూల్చివేతలు.. మీడియాకు అనుమతి నో..
హైదరాబాద్: నగరంలోని కొండాపూర్లోగల బిక్షపతి నగర్లో శనివారం ఉదయం నుంచే హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్లు హైడ్రా సిబ్బంది పేర్కొన్నారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కాగా కూల్చివేతల వద్దకు మీడియాను కూడా పోలీసులు అనుమతించడం లేదు. రెండు కిలోమీటర్ల దూరంలోనే మీడియాను, స్థానికులను పోలీసులు అడ్డుకుంటున్నారని సమాచారం.కాగా, హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా అక్రమ నిర్మాణాలు భారీస్థాయిలో చేపట్టారు యథేచ్ఛగా అక్రమార్కులు నిబంధనలని ఉల్లంఘిస్తున్నారు. అక్రమ నిర్మాణాలతో పలు ప్రాంతాలు వర్షాకాలంలో వరదలకు గురవుతున్నాయి. ఈ సమస్యపై హైడ్రా ఫిర్యాదులు వస్తోండటంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేసే చర్యలు చేపట్టింది.దీనిలో భాగంగా గత నెలలో గాజులరామారంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించారు. దాంతో చర్యలు చేపట్టింది హైడ్రా. గాజులరామారంలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించారు. 15వేల కోట్ల విలువైన భూమి ఆక్రమణకు గురికావడంతో దీనిపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదులు చేశారు. అనంతరం, హైడ్రా రంగంలోకి దిగింది. కబ్జాల చెర నుంచి 300 ఎకరాలకు పైగా భూమికి విముక్తి కల్పించారు. కబ్జాదారులు 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి రూ.10 లక్షల చొప్పున స్థానికులకు విక్రయించినట్టు అధికారులు గుర్తించారు. హైడ్రా కూల్చివేతల సందర్బంగా అక్రమార్కులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. -
విమలక్క పాట.. సీతక్క కోరస్
సాక్షి, హైదరాబాద్/అంబర్‌పేట: అంబర్‌పేటలోని బతుకమ్మకుంట ప్రారంభోత్సవానికి విమలక్క, కనకవ్వ సైతం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత వేదికపై సీఎంరేవంత్రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులకు మాత్రమే కూర్చునే అవకాశం కల్పించారు. తన స్థానంలో కూర్చున్న ముఖ్యమంత్రి.. స్టేజ్ సమీపంలో నిల్చుని ఉన్న స్థానిక మహిళలు, కనకవ్వను గమనించారు. దీంతో తన పక్కన, వెనుక ఉన్న సీట్లను ఖాళీ చేయించి వారిని పైకి పిలిచి కూర్చోబెట్టారు.‘బతుకమ్మ మన ఆడపడుచుల పండుగ, అమ్మ, అక్కల పండుగ. వారికే ప్రాధాన్యం ఇవ్వాలి’అని సీఎం వ్యాఖ్యానించారు. బతుకమ్మకుంట ప్రారంభోత్సవం విషయం తెలుసుకుని అక్కడకు చేరుకున్న విమలక్క.. ఈ చెరువుపై రాసిన ఓ పాటను పాడారు. దీనికి కొందరు కోరస్ కావాలని కోరగా.. వేదికపై ఉన్న మంత్రి సీతక్క వెళ్లి కోరస్ అందించారు. ఆమె ఈ పాటతో పాటు కనకవ్వ పాడిన సంప్రదాయ బతుకమ్మ పాటకూ కోరస్ ఇచ్చారు. ఈ సందర్భంగా విమలక్క మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం సెక్యులర్ పండుగగానూ ప్రకటించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. -
రిటర్నింగ్ వాల్ కూలడంతో MGBS వైపు వరద వచ్చింది : రంగనాథ్
-
బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా బతుకమ్మ కుంట(BatukammaKunta) ప్రారంభోత్సవం వాయిదా పడింది. భారీ వర్షాల నేపథ్యంలో బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం వాయిదా వేసినట్లు హైడ్రా(HYDRA) శుక్రవారం ఉదయం ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, సీఎం రేవంత్(Revanth Reddy) చేతుల మీదుగా వచ్చే ఆదివారం ప్రారంభోత్సవానికి హైడ్రా సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం.ఇదిలా ఉండగా.. అంతుకుముందు బతుకమ్మ కుంటపై హైడ్రా స్పందిస్తూ.. కబ్జాల కోరల్లో చిక్కుకున్న చెరువు నేడు జీవం పోసుకుంది. ముళ్ల పొదలు.. పిచ్చి మొక్కలతో అటువైపు చూడాలంటేనే భయపడే విధంగా ఉన్న బతుకమ్మ కుంట.. నేడు జలకళతో చూడముచ్చటగా తయారయ్యింది. కబ్జాల చెరను విడిపించుకుని కనువిందు చేస్తోంది. నగర భవిష్యత్తుకు బాటలు వేస్తున్న హైడ్రాకు బతుకమ్మ కుంట ప్రేరణగా నిలిచింది. వరద నివారణకు బతుకమ్మకుంట బాటలు వేసింది. నగరవ్యాప్తంగా చెరువులు అభివృద్ధి చెందితే వరదలు చాలావరకు నివారించవచ్చునని బతుకమ్మకుంట నిరూపించిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.-చెర వీడి చెరువైన బతుకమ్మ కుంటజాతీయ స్థాయిలో `బతుకమ్మకుంట` వైభవం-ఈ నెల 26న సీఎం చేతులమీదుగా ప్రారంభం-బతుకమ్మ ఉత్సవాలకు సర్వం సన్నద్ధం-సర్వాంగ సుందరంగా మారిన బతుకమ్మ కుంట🔸బతుకమ్మకుంట తన పేరును సార్థకం చేసుకుంది. కబ్జాల కోరల్లో చిక్కుకున్న చెరువు… pic.twitter.com/cEYRJw7sGs— HYDRAA (@Comm_HYDRAA) September 26, 2025మండు వేసవిలో దాదాపు 7.15 కోట్లతో బతుకమ్మ కుంట పనులను హైడ్రా చేపట్టింది. జేసీబీలతో మోకాలు లోతు తవ్వగానే గంగమ్మ తల్లి ఉబికి వచ్చింది. బతుకమ్మ కుంట బతికే ఉందని రుజువు చేసింది. అక్కడి స్థానికులలో ఆనందం పెల్లుబికింది. బతుకమ్మ కుంట కాదు.. ఇది మా స్థలమంటూ ఇప్పటివరకూ నమ్మబలికిన వారిని ఇప్పుడేమంటారు అని అక్కడి స్థానికులు ప్రశ్నించారు. ఈ మేరకు అక్కడి ముళ్ల పొదలను తొలగించి తవ్వకాలు చేపట్టిన హైడ్రాకు గంగమ్మ స్వాగతం పలికింది. అంబర్‌పేట మండలం, బాగ్అంబర్పేట్లోని సర్వే నంబరు 563లో 1962-63 లెక్కల ప్రకారం మొత్తం 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట. బఫర్ జోన్‌తో కలిపి మొత్తం వైశాల్యం 16.13 ఎకరాల విస్తీర్ణం అని తేల్చిన సర్వే అధికారులు. తాజా సర్వే ప్రకారం అక్కడ మిగిలిన భూమి కేవలం 5.15 ఎకరాల విస్తీర్ణం మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం మిగిలి ఉన్న 5.15 ఎకరాల విస్తీర్ణంలోనే బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది.ఇది కూడా చదవండి: వర్షాల ఎఫెక్ట్.. శంషాబాద్‌లో దిగని విమానం.. -
Hyderabad: మరికొన్ని ఏళ్ల పాటు నగరాల్లో ఇవే పరిస్థితులు
సాక్షి, సిటీబ్యూరో: వాతావరణ మార్పులు, గ్లోబల్ వారి్మంగ్ కారణంగా నగరాల్లో ఏర్పడుతున్న ‘హీట్ ఐలాండ్’ కారణంగానే క్లౌడ్ బరస్ట్, మినీ క్లౌడ్ బరస్ట్ ఏర్పడుతున్నాయని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. దీనికి కండెక్టివ్ కరెంట్ తోడు కావడంతో సాయంత్రం వేళల్లో ఒక్కసారిగా భారీ వర్షం కురుస్తుందని వివరించారు. మరికొన్ని ఏళ్ల పాటు నగరాలకు ఈ ఇబ్బంది తప్పదని, ఫలితంగానే ఫ్లడ్ మేనేజ్మెంట్కు ప్రాధాన్యం ఇస్తూ జలవనరులు, నాలాలు, పార్కుల్ని పునరుద్ధరిస్తున్నామని పేర్కొన్నారు. బుద్ధ భవన్‌లోని ప్రధాన కార్యాలయంలో ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... కోర్ ఏరియాలో అధిక ఉష్ణోగ్రత... సబ్ అర్బన్ ప్రాంతాలతో పోలిస్తే కోర్ సిటీలో మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటోంది. హీట్ ఐలాండ్‌గా పిలిచే దీంతో లోకల్ మాయిశ్చరైజర్ పెరుగుతోంది. దీనికి కాలుష్యం తోడు కావడంతో నీటి బిందువులుగా మారి క్లౌడ్ బరస్ట్‌లు జరుగుతున్నాయి. కాలంతో సంబంధం లేకుండా క్లౌడ్ బరస్ట్‌లు గడిచిన 25 ఏళ్లల్లో మూడు రెట్లు పెరిగాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని అర్బన్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇన్ఫ్రాస్టక్చర్ అభివృద్ధి చేస్తున్నాం. రాజధానిలో 70 శాతం చెరువులు మాయమయ్యాయి. చాలా వరకు నాలాలు కనెక్టివిటీ కోల్పోయాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే జెన్–జెడ్ కోసం జలవనరులు పరిరక్షిస్తున్నాం. పార్కుల పరిరక్షణతో వాతావరణంలో వేడిని తగ్గించే అవకాశం ఉంది.పక్కా పథకం ప్రకారం కబ్జా పర్వం... హైడ్రా ఏ ఒక్క నివాసం జోలికీ వెళ్లట్లేదు. ప్రజలు సోషల్‌మీడియా చూసి ఓ అభిప్రాయానికి రావద్దు. గాజుల రామారంలోనూ ప్రభుత్వ స్థలంలో 900 నిర్మాణాలు గుర్తించినా... ఇంకా పూర్తికాని 260 మాత్రమే కూల్చాం. భూ కబ్జాలకు పాల్పడే అసాంఘిక శక్తులు పక్కా పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. 300 గజాల స్థలంపై కన్నేసి దాని చుట్టూ ప్రహరీ కడుతున్నారు. 30 గజాల్లో ఓ షెడ్లు వేసి కుటుంబాన్ని తీసుకువచ్చి అందులో ఉంచి నివాసమని పేర్కొంటున్నారు. ఇలా ఉంటున్న వారికి కబ్జాదారులే నిరీ్ణత మొత్తం చెల్లిస్తూ దాన్ని అమ్మేసిన తర్వాత మరోచోటుకు మారుస్తున్నారు. గాజులరామారంలో కబ్జాలు చేసిన వారితో పాటు సహకరించిన అధికారులపైనా చర్యలు ఉంటాయి. అక్కడ ఇళ్లు కొని నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది. వాళ్లు తమకు అమ్మిన వారి పేర్లు చెప్పాలి.హైడ్రాను మేనేజ్ చేయడం అబద్ధం.. వివిధ ప్రాంతాల్లో ఆక్రమణలకు పాల్పడిన సంస్థలపై 11 కేసులు నమోదు చేయించాం. ఏ బిల్డర్, సంస్థా హైడ్రాను మేనేజ్ చేయలేదు. అలా ఎవరైనా చెప్తే అది అబద్ధమే అవుతుంది. మరో నెల రోజుల్లో హైడ్రా ఠాణా పని చేయడం ప్రారంభిస్తుంది. ప్రతి అంశంలోనూ కోర్టు ఆదేశాలను కచి్చతంగా పాటిస్తున్నాం. ఈ నెల 26న బతుకమ్మకుంటను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ నుంచి చెరువుల ఎఫ్టీఎల్, బఫర్‌జోన్లకు సంబంధించి ఫైనల్ నోటిఫికేషన్ల జారీ ఉంటుంది. ఆ తర్వాత వాటిలో ఉన్న నిర్మాణాలపై చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం హైడ్రా ఆరు చెరువులను పునరుద్ధరిస్తోంది. ఎవరైనా ముందుకు వచ్చిన సీఎస్సార్ నిధులతో చెరువులు అభివృద్ధి చేస్తామంటే అప్పగిస్తాం. ఇప్పటి వరకు 96 చోట్ల డ్రైవ్స్ నిర్వహించి రూ.50 వేల కోట్ల విలువైన 923.14 ఎకరాలను కబ్జా చెర నుంచి విడిపించాం. -
150 ఇళ్లను కూల్చేసిన హైడ్రా.. కరెంట్ తీగలతో మహిళల నిరసన
-
కబ్జాల చెర నుంచి 300 ఎకరాలకు పైగా భూమికి హైడ్రా విముక్తి
-
15000 కోట్ల విలువైన 300 ఎకరాలు కబ్జా.. హైడ్రా కూల్చివేతలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలు, కబ్జాలు చేసిన కట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్నారు. తాజాగా నగరంలోని గాజులరామారంలో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. దాదాపు 300 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించారు. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా.. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది.వివరాల ప్రకారం.. గాజులరామారంలో ప్రభుత్వ స్థలాన్ని కబ్జాదారులు ఆక్రమించారు. 15వేల కోట్ల విలువైన భూమి ఆక్రమణకు గురికావడంతో దీనిపై హైడ్రాకు స్థానికులు ఫిర్యాదులు చేశారు. అనంతరం, హైడ్రా రంగంలోకి దిగి.. అక్కడ అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. కబ్జాల చెర నుంచి 300 ఎకరాలకు పైగా భూమికి విముక్తి కల్పించారు. కబ్జాలు నిర్ధారించుకుని ఆదివారం ఉదయం నుంచి తొలగింపు పనులు చేపట్టారు. నివాసాల జోలికి వెళ్లకుండా ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. సర్వే నంబర్ 307లో 300 ఎకరాలకు పైగా ఉన్న భూమిలో ఆక్రమణలు తొలగించే పనిలో హైడ్రా అధికారులు ఉన్నారు. ప్రభుత్వ భూమికి కంచె వేస్తున్నారు. ఇక, కబ్జాదారులు 60 నుంచి 70 గజాల్లో ఇళ్లను నిర్మించి రూ.10 లక్షల చొప్పున స్థానికులకు విక్రయించినట్టు అధికారులు గుర్తించారు. హైడ్రా కూల్చివేతల సందర్బంగా అక్రమార్కులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు జరుగుతున్నాయి. హైడ్రా ఫుల్ ఫోర్స్ అక్కడే ఉండి కూల్చివేతల్లో నిమగ్నమైంది. మరోవైపు కూల్చివేతలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. తామంతా డబ్బులకు ఇళ్లను కొనుక్కున్నామని.. వాటిని అమ్మిన వాళ్లపై చర్యలు తీసుకోవాలంటూ చిన్న పిల్లలతో కలిసి జేసీబీ వాహనాలకు అడ్డుగా నిల్చొని నిరసన తెలిపారు. కూకట్‌పల్లిలో హైడ్రా భారీ దాడులు 🚨 ₹15,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని భూ దోపిడీదారులు మరియు రాజకీయ కబ్జాదారుల నుండి తిరిగి పొందేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అలా ఎలా నొక్కేశారు రా ప్రభుత్వ భూమిని 🙏🏻 pic.twitter.com/RjghXUlTeT— Vennela Kishore Reddy (@Kishoreddyk) September 21, 2025ఇక, గాజులరామారం కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందిస్తూ.. కుత్బుల్లాపూర్‌లోని గాజులరామారం సర్వే నంబర్ 307లో 317 ఎకరాల ప్రభుత్వ భూముల్లో కబ్జాలను తొలగిస్తున్నాం. రెవెన్యూ డిపార్ట్మెంట్, హైడ్రా, పోలీస్ విభాగం సంయుక్తంగా భారీ స్థాయిలో ఆపరేషన్ చేపట్టింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు ఆక్రమించిన వందల ఎకరాలు ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటున్నాం. సుమారు 40 ఎకరాల్లో పేదలు నివసిస్తున్నారు. స్థానిక రాజకీయ నాయకులు పేదలకు 50, 100 గజాలుగా విక్రయించినట్లు విచారణలో బయటపడింది. ఈ విషయంపై గత ఆరు నెలల్లో అన్ని శాఖల అధికారులతో ఐదు సార్లు సమావేశాలు నిర్వహించి, ప్రభుత్వ అనుమతులు పొందిన తరువాతే ఈరోజు ఆపరేషన్ ప్రారంభమైంది.పేదల ఇల్లు కూల్చవద్దని ఫీల్డ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. పొలిటీషియన్స్ , రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికారులు ఆక్రమించిన ల్యాండ్ మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నారు. కమర్షియల్ షెడ్లు, కాంపౌండ్ వాల్లు, గదులు కట్టుకొని ఆక్రమించిన భూములను కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. కొందరికి ఇచ్చిన పత్రాలు ఫోర్జరీ చేసిన నకిలీ పత్రాలుగా బయటపడడంతో సంబంధిత అధికారులు వాటిని రద్దు చేస్తున్నారు. మొత్తం 275 ఎకరాల కంటే ఎక్కువ భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్ చేస్తాం. ఈ భూముల అంచనా విలువ 12 నుంచి 15 వేల కోట్లు ఉంటుంది అని తెలిపారు.ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌కు 10 కి.మీ. దూరంలో ఉన్న గాజులరామారంలోని వందల ఎకరాల ప్రభుత్వ భూముల్లో పక్కా నిర్మాణాలు వెలిశాయి. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, టీజీఐఐసీ, హెచ్ఎండీఏ, హౌసింగ్‌బోర్డు విభాగాలకు దశాబ్దాల క్రితం అప్పటి ప్రభుత్వాలు భూములిచ్చాయి. ఆయా విభాగాలు తమ కార్యకలాపాలు ప్రారంభించకపోవడంతో కొందరు అక్రమార్కులు గత మూడు, నాలుగేళ్లుగా పథకం ప్రకారం భూములను కబ్జా చేస్తున్నారు. గాజులరామారంలోని ప్రభుత్వ స్థలాలను అక్కడున్న కొందరు చోటామోటా నేతలు క్రమంగా సొంతం చేసుకుంటున్నారు. మూడున్నరేళ్లలో ఏకంగా 103 ఎకరాల భూములు ఆక్రమించేశారు. ఈ ప్రాంతాల్లో ఎకరా మార్కెట్ విలువ రూ.40-50 కోట్ల వరకు ఉంటుంది. -
బుద్దా భవన్ వద్ద ఉద్రిక్తత.. హైడ్రా, డీఆర్ఎఫ్ సిబ్బంది నిరసన
సాక్షి, హైదరాబాద్: బుద్ధా భవన్ హైడ్రా కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైడ్రా, డీఆర్ఎఫ్ సిబ్బంది నిరసనలకు దిగారు. తమ జీతం కట్ చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీతం తగ్గించిన కారణంగా ఈరోజు నుండి విధులకు వెళ్లకుండా నిరసనలు వ్యక్తం చేస్తామని సిబ్బంది హెచ్చరించారు.వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని బుద్ధా భవన్ వద్ద డీఆర్ఎఫ్, హైడ్రా సిబ్బంది ఆందోళనలకు దిగారు. రాత్రి, పగలు తమతో పనులు చేయించుకుని.. జీతంలో ఐదు వేలు కట్ చేశారని నిరసన చేపట్టారు. అయితే, గతంలో జీహెచ్ఎంసీ అండర్‌లోని ఈవీడీఎంలో పనిచేసిన 1100 మంది ఔట్సోర్సింగ్ సిబ్బంది.. ప్రస్తుతం హైడ్రాలోని డీఆర్ఎఫ్లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అందరికీ ఒకేలా జీతాలు అందేలా జీవో తెచ్చింది.ప్రభుత్వం తెచ్చిన జీవో ప్రకారం.. అందరికీ ఒకేలా జీతాలు అందాల్సి ఉన్నప్పటికీ తమకు మాత్రం 5000 కట్ చేసినట్టు సిబ్బంది చెబుతున్నారు. మొత్తం సిబ్బందిలో దాదాపు సగం మందికి జీతం కట్ అయినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఎందుకు జీతంలో కోత విధించారో చెప్పాలని సిబ్బంది డిమాండ్ చేస్తున్నారు. తమకు రావాల్సిన జీతం ఇచ్చే వరకు ఈరోజు నుండి విధులకు వెళ్లకుండా నిరసనల్లో పాల్గొంటామన్నారు. -
రాష్ట్రానికి పాలనా పక్షవాతం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రాన్ని పరిపాలనా పక్షవాతం (అడ్మినిస్ట్రేటివ్ పెరాలిసిస్) పట్టి పీడిస్తోందని బీజేపీ అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. దాదాపు 22 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని మండిపడ్డారు. రూరల్..అర్బన్ సెక్టార్లలోనే కాదు.. అన్ని సెక్టార్లలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ధ్వజమెత్తారు. గురువారం తెలంగాణ జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు కప్పర ప్రసాదరావు సమన్వయకర్తగా నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో రాంచందర్‌రావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏ ఒక్క ప్రాజెక్టును కూడా సక్రమంగా ప్రారంభించలేదని, జీహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థ, భద్రతా చర్యల్లో విఫలమైందన్నారు. హైడ్రా చర్యల్లో భాగంగా ఎక్కడెక్కడ ఎవరెవరి ఆస్తులు కూల్చారు..సాధించిన ఫలితాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీగా ఈ ఎన్నికల్లో బీసీలకు 42 శాతానికి పైగానే టికెట్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు.ఫార్ములా ఈ–కార్ రేస్ అవకతవకలపై ఏసీబీ విచారణలో వెల్లడైన అంశాలను ప్రభుత్వం బయటపెట్టి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా రూ.1,000 కోట్లు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారన్నారు. అయితే అందుకు పూర్తి విరుద్ధంగా ఓయూ ఉద్యోగులకు ఈసారి నెల జీతమే ఆలస్యంగా వచి్చందన్నారు. జాబ్ కేలండర్ ప్రకటిస్తారు కానీ.. దానిని అమలు చేయడం లేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో పేపర్ లీకేజీలు జరిగితే కాంగ్రెస్ హయాంలో ‘హోప్ బ్రేకేజ్’జరుగుతోందన్నారు. కాళేశ్వరం మొత్తం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరిపించాలి కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌లపై కాకుండా నాణ్యత, అవినీతి, నిర్వహణ తదితర అంశాలు ముడిపడి ఉన్నందున మొత్తం ప్రాజెక్టుపైనే సీబీఐ విచారణ జరిపించాలని రాంచందర్‌రావు డిమాండ్ చేశారు. వందరోజుల్లో ఎన్నికల హామీలు అమలు చేస్తామని చెప్పి..రెండేళ్లు కావొస్తున్నా ఏమీ చేయకపోవడంతో ప్రజలు ఇకపై ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రెండునెలల్లో బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపాలంటున్న కాంగ్రెస్ నేతలు, మంత్రులు మరి స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్న పదిమంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల నోటీసులపై కాలపరిమితితో చర్యలెందుకు తీసుకోవడం లేదో చెప్పాలన్నారు.కాంగ్రెస్ సర్కార్ ‘మిస్ మేనేజ్మెంట్’కారణంగానే తెలంగాణలో యూరియా కొరత ఏర్పడిందని ఒక విలేకరి వేసిన ప్రశ్నకు ప్రతిస్పందించారు. పార్టీలో అన్నీ సర్దుకుంటాయని, రాష్ట్ర కమిటీలో పరిమితంగా పోస్టులున్నందున అందరిని సంతృప్తి పరచలేమన్నారు. ఈ కమిటీలో చోటుదక్కని వారు ఎవరూ బాధపడొద్దని పార్టీలో ఇంకా 650 పోస్టులు ఉన్నాయని ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు.ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవల పార్టీ ముఖ్యనేతలపై చేసిన వ్యాఖ్యలపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ‘ఎవరు పడితే వారు చేసే వ్యాఖ్యలకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు’అని అన్నారు. తన వెనుకాల ఎవరూ లేరని కేవలం ప్రధానమంత్రి మోదీ మాత్రం ఉన్నారని చెప్పారు. జర్నలిస్టులపై జరిగిన దాడులను ఖండిస్తున్నామని, జర్నలిస్టులు, న్యాయవాదుల రక్షణకు చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. -
హైడ్రా పేరు చెప్పి.. రూ. 50 లక్షలు వసూలు!
హైదరాబాద్: ఇటీవల నగరంలో తరుచు వినిపిస్తున్న పేరు హైడ్రా. అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి హైడ్రా పేరు బాగా హైలైట్ అయ్యింది. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు.. తమకు హైడ్రా అధికారులు బాగా తెలుసని ఓ మహిళన మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. హయత్‌నగర్‌లో కొంతమంది ముఠాగా ఏర్పడి హైడ్రా అధికారులతో పనిచేయిస్తామని చెప్పి స్థానిక మహిళను ప్రలోభాలకు గురి చేశారు. హయత్‌నగర్‌లోని ల్యాండ్ ఇష్యూకు సంబంధించి సదరు మహిళ రూ. 50 లక్షలను ఆ ముఠాకు అప్పగించింది. వివరాల్లోకి వెళితే.. హయత్‌నగర్‌లో ఉన్న ల్యాండ్ ఇష్యూపై హైడ్రాకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. ఇదే విషయాన్ని స్నేహితుల వద్ద కూడా చెప్పింది. అయితే తమకు హైడ్రా అధికారులు తెలుసని, ఈ విషయాన్ని తాము చూసుకుంటామని పలువురు వ్యక్తులు నమ్మబలికారు. దాంతో రూ. 50 లక్షలను ఆ మహిళను నుంచి తీసుకుంది ముఠా. ఇది హైడ్రా కమిషనర్ వరకూ వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. దీంతో విచారణ చేయగా వారిపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదు చేశారు. పరిధి విస్తరించి ఉన్న ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా. ఫిర్యాదు చేయాలన్నా నేరుగా తమనే సంప్రదించాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ కోరారు. ప్రతి సోమవారం హైడ్రా ప్రధాన కార్యాలయంలో నిర్వ హించే ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేయవచ్చని సూచిం చారు. హైడ్రా అధికారులు తమ బంధువులని, మిత్రులని, తమకు బాగా తెలుసంటూ ఎవరైనా చెబితే నమ్మి మోస పోవద్దని హెచ్చరించారు. హైడ్రాకు సంబంధించి ఫిర్యాదులు ఉన్నా తనను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు. -
మాదాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. 400 కోట్ల విలువైన భూమి..
సాక్షి, మాదాపూర్: హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. ఆక్రమణలను తొలగించి మొత్తం 16వేల గజాల స్థలాన్ని హైడ్రా అధికారులు రక్షించారు. దీని విలువు దాదాపు 400 కోట్ల వరకు ఉన్నట్టు తెలుస్తోంది. కబ్జాదారులపై పోలీసు కేసులు నమోదు చేస్తున్నట్లు సమాచారం.వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని జూబ్లీ ఎన్‌క్లేవ్‌లోని ఆక్రమణలకు హైడ్రా తొలగించింది. మాదాపూర్‌లో జైహింద్ రెడ్డి అనే వ్యక్తి పార్కులు, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేశాడని అక్కడి ప్రతినిధులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన లే అవుట్లో ఉన్న నాలుగు పార్కుల్లో రెండు పార్కులతో పాటు, ఐదువేల గంజాల రహదారి, 300 గజాల ప్రభుత్వ స్థలం కబ్జాకు గురైనట్లు హైడ్రా గుర్తించింది. ఈ క్రమంలో గురువారం ఉదయమే హైడ్రా అధికారులు అక్కడికి చేరుకుని దాదాపు 16వేల గజాల స్థలాన్ని హైడ్రా రక్షించింది.హైడ్రా గుర్తించిన భూమి విలువ దాదాపు రూ.400 కోట్ల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. 1995లో అనుమతి పొందిన లే అవుట్‌ను 2006లో అప్పటి ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. దీంతో, ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన హోటల్ షెడ్, హోర్డింగ్‌లను హైడ్రా తొలగించింది. హోటల్ అద్దె, ప్రకటనల ద్వారా జైహింద్ రెడ్డి నెలకు 4 లక్షల వరకు ఆదాయం పొందుతున్నాడని జూబ్లీ ఎన్క్లేవ్ ప్రతినిధులు తెలిపారు. అనంతరం.. పార్కులు, ప్రభుత్వ భూమిలో ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రొటెక్టెడ్ బై హైడ్రా అని బోర్డులు పెట్టింది. ఇక, కబ్జాదారులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిసింది. -
‘హైడ్రా’ అవసరాన్ని హైదరాబాద్ గుర్తిస్తోంది: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా.. హైదరాబాద్‌ను రక్షించే ఒక గొప్ప వ్యవస్థ అని ప్రశంసించారు. హైడ్రా అవసరాన్ని హైదరాబాద్ గుర్తిస్తోందన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు హైడ్రాను అస్త్రంగా వాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.గోల్కొండ కోటలో 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. గోల్కోండ కోటలో జాతీయ జెండాను రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ..‘హైదరాబాద్‌ను స్వచ్ఛమైన, శుభ్రమైన, సౌకర్యవంతమైన నగరంగా తీర్చిదిద్దాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఆ ఆలోచన నుండి ఏర్పాటైనదే హైడ్రా వ్యవస్థ. బెంగళూరు, ముంబై, చెన్నై లాంటి నగరాలు వరదలతో చిన్నాభిన్నం అవుతున్నాయి. అలాంటి దుస్థితి హైదరాబాద్‌కు రాకూడదు అంటే చెరువుల ఆక్రమణ, అక్రమ నిర్మాణాలను నిరోధించాలి. ఆ ఉద్దేశంతోనే హైడ్రాను తీసుకువచ్చాం.ఇటీవలే ప్రత్యేక పోలీస్ స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేశాం. ఇప్పటి వరకు హైడ్రా 13 పార్కులు, 20 సరస్సులను ఆక్రమణల నుంచి రక్షించింది. అంబర్పేట్ బతుకమ్మ కుంటను పునరుద్ధరించింది. 30వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడింది. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్షాలు హైడ్రాను అస్త్రంగా వాడుకుంటున్నాయి. అక్రమ నిర్మాణాల విషయంలో చర్యలు తీసుకోవడం, చెరువుల పునరుద్ధరణలో హైడ్రా సమర్ధంగా పని చేస్తోంది. హైడ్రా అవసరాన్ని హైదరాబాద్ గుర్తిస్తోంది. హైడ్రా.. హైదరాబాద్‌ను రక్షించే ఒక గొప్ప వ్యవస్థ. ఆ వ్యవస్థను కాపాడుకుందామని నేను మీ అందరికి పిలుపునిస్తున్నా. అలాగే, శాంతి భద్రతలు ఒక రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తాయి అని అన్నారు.ఇదే సమయంలో మాకు విల్ ఉంది.. విజన్ ఉంది.. తెలంగాణ రైజింగ్-2047 మా విజన్. ఆ విజన్ నిజం చేసే మిషన్ ఈ ప్రభుత్వం తీసుకుంది. ప్రపంచ వేదికపై తెలంగాణను నెంబర్ వన్‌గా నిలబెట్టడమే మా విజన్. ఇందుకు ప్రజలందరి సహకారం, ఆశీర్వాదం అవసరం అని వ్యాఖ్యలు చేశారు. -
మీరేమైనా యుద్ధానికి వెళ్తున్నారా?.. వాహనాలకు ఆ రంగులేంటి?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ సర్వే నంబర్ 37, 38/1లో 1.07 ఎకరాల భూమిపై ఎందుకంత దూకు డుగా వెళ్తున్నారని హైడ్రా (హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తి సంరక్షణ విభాగం) కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి ఆదేశాలిచ్చే వరకు స్టేటస్కో ఆదేశాలు పాటించాలని చెప్పినా వినకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని, కొందరు దీన్ని వాడుకుని ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని పేర్కొంది. చెరువులు, ప్రభుత్వ భూముల రక్షణ పేరుతో ప్రజలను అవస్థలకు గురిచేయడం, హడావుడి చేయడం ఎందుకని ప్రశ్నించింది. సరిహద్దుల్లో యుద్ధానికి వెళ్తున్నట్లు వాహనాలకు ఆ రంగులేంటని అడిగింది. ఇలానే చట్టవిరుద్ధంగా, కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ వ్యవహరిస్తే కోర్టుకు రప్పించి.. కఠిన శిక్షలు విధించడానికి వెనుకాడబోమని తేల్చిచెప్పింది. తన భూమిలో హైడ్రా చట్టవిరుద్ధంగా జోక్యం చేసుకుంటోందంటూ జూబ్లీహిల్స్‌కు చెందిన ఎస్.వెంకటేశ్వర్రావు ఏప్రిల్ 23న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై మరో ఇద్దరు పిటిషన్లు వేశారు. మొత్తంగా 6 ఎకరాల భూమి తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉందంటూ హైడ్రా ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఎఫ్టీఎల్ నిర్ధారించారా?హైకోర్టు ఏప్రిల్ 23న ఇచ్చిన స్టేటస్కో ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ హైడ్రా తమ భూమిలో జోక్యం చేసుకునేందుకు యత్నిస్తోందని జూన్ 11న వెంకటేశ్వర్రావుతోపాటు మరో ఇద్దరు ధిక్కరణ పిటిషన్లు వేశారు. వీటిపై బుధ వారం జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మా సనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది తరుణ్ జి.రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కోర్టు స్టేటస్కో ఆదేశాలు ఇచ్చినా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ లెక్కచేయలేదని, తమ్మిడికుంట ఎఫ్టీఎల్, బఫర్‌జోన్‌ను నిర్ధారించకుండానే దూకుడుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. వాదన లు విన్న న్యాయమూర్తి.. హైడ్రా కమిషనర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాల్సిన అధికారులు.. హడావుడి నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తు న్నారన్నారు. తాము నిలుపుదల ఆదేశాలు ఇవ్వని చెరువులున్న ప్రాంతాల్లో మునకపై ఏ చర్యలు తీసుకున్నారని, ఎఫ్‌టీఎల్‌పై ఇప్పటివరకు విధాన పరమైన నిర్ణయం తీసుకున్నారా అని నిలదీశారు. అనంతరం విచారణను సోమవారానికి వాయిదా వేశారు. -
హైడ్రాలో హైరానా.. జీతాలు తగ్గిస్తూ జీఓ!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఆ«దీనంలోని మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌కు (ఎంఈటీ) నేతృత్వం వహిస్తున్న మార్షల్స్ సోమవారం మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఔట్ సోర్సింగ్ సిబ్బందికి జీతాలు తగ్గిస్తూ ఇటీవల ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం తెలిసి రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అప్రమత్తం అయ్యారు. బుద్ధభవన్‌లోని ప్రధాన కార్యాలయంలో మార్షల్స్‌తో భేటీ కావడంతో వివాదం సద్దుమణిగింది. తమ జీతాలు పెంచుతామంటూ హైడ్రా కమిషనర్ హామీ ఇచి్చనట్లు మార్షల్స్ ప్రకటించారు. జీహెచ్ఎంసీ నుంచి హైడ్రాలోకి ఆ రెండూ... హైడ్రా ఏర్పాటు ముందు వరకు ఎంఈటీలు, మార్షల్స్ జీహెచ్ఎంసీ ఆ«దీనంలో ఉండేవి. ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీ అండ్ డీఎం) వి«భాగంలో అంతర్భాగంగా పని చేసే వాళ్లు. మాజీ సైనికోద్యోగులైన 93 మంది 2020 మే నుంచి మార్షల్స్గా పని చేస్తున్నారు. ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వీరికి అప్పట్లో నెలకు రూ.22,500 చొప్పున చెల్లించేవారు. 2022లో పీఆర్సీ ఆధారంగా ఈ మొత్తాన్ని రూ.29,250కి పెంచారు. గత ఏడాది ఈవీ అండ్ డీఎం జీహెచ్ఎంసీ నుంచి హైడ్రాలోకి వచి్చంది. దీంతో ఈ ఏడాది నుంచి ఎంఈటీలతో పాటు మార్షల్స్ బాధ్యతల్నీ హైడ్రాకు అప్పగించారు. మార్షల్స్‌లో ఆందోళన నింపిన ఆ ఉత్తర్వులు... తాము చేస్తున్న సేవల్ని పరిగణలోకి తీసుకుని జాతాలు పెంచాలంటూ మార్షల్స్ కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. మరోపక్క మాజీ సైనికోద్యోగులకు సంబంధించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ రీ సెటిల్మెంట్ సైతం వీరికి రూ.32 వేల నుంచి రూ.35 వేల వేతనాన్ని సిఫార్సు చేసింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇవి అమలవుతున్నాయి. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ జీతాల పెంపుపై గతంలో మార్షల్స్‌కు హామీ ఇచ్చారు. ఇది కార్యరూపంలోకి రాకముందే ఈ నెల 5న ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు వీరిలో ఆందోళన నింపాయి. ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతాలను రూ.22,750కు తగ్గిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో ఉంది. మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమై... ఈ ఉత్తర్వులను నిరసనగా మార్షల్స్ మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా తొలుత సోమవారం సమ్మె సైరన్ మోగించాలని నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అప్రమత్తం అయ్యారు. వర్షాలు కురుస్తున్న ఈ సమయంలో 30 డివిజన్లలోని 150 ఎంఈటీలకు నేతృత్వం వహిస్తున్న మార్షల్స్ ఆవశ్యకతను ఆయన గుర్తించారు. దీంతో అందరినీ బుద్ధ భవన్‌లోని హైడ్రా ప్రధాన కార్యాలయానికి పిలిపించారు. ఆ ఉత్తర్వులతో మీకు సంబంధం లేదని, జీతాలు ఏమాత్రం తగ్గవని హామీ ఇచ్చారు. మార్షల్స్ జీతాల పెంపుపై త్వరలోనే మరో జీవో వస్తుందని హామీ ఇచ్చారు. పని గంటల అమలు, అదనపు పనికి అదనపు వేతనం తదతర డిమాండ్లనూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని రంగనాథ్ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. -
హైదరాబాద్ లో హైడ్రా కంట్రోల్ రూమ్ సేవలు బంద్
-
‘రియల్’ డీలా!.. భారీగా తగ్గిన ఆస్తుల రిజిస్ట్రేషన్లు
సాక్షి, రంగారెడ్డి: రియల్ భూం రంగారెడ్డి జిల్లాలో పడిపోయింది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి తోడు పెరిగిన భూముల ధరలు.. హైడ్రా కూల్చి వేతలతో ఆస్తుల క్రయవిక్రయాలపై తీవ్ర ప్రభావం చూపాయి. రెండేళ్లతో పోలిస్తే ప్రస్తుతం ఆస్తుల రిజి్రస్టే షన్ల సంఖ్య భారీగా తగ్గింది. 2023 జనవరి నుంచి జూలై వరకు జిల్లావ్యాప్తంగా 1,47,091 ఆస్తులకు రిజిస్ట్రేషన్లు కాగా వీటి ద్వారా రూ.2,157.60 కోట్ల ఆదాయం సమకూరింది. 2024 జనవరి నుంచి జూలై ఆఖరి వరకు 1,50,247 రిజిస్ట్రేషన్లు కాగా, వీటి ద్వారా రూ. 2,481.58 కోట్ల రాగా.. తాజాగా ఏడు నెలల్లో 1,47,236 డాక్యుమెంట్ల ద్వారా రూ.2,518. 98 కోట్లు వచ్చాయి. గత ఏడాది తొలి ఏడు నెలలతో పోలిస్తే ఈసారి ఆస్తుల రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గినప్పటికీ ఆదాయం పెరగడం కొసమెరుపు. కోవిడ్ సంక్షోభం తర్వాత కోవిడ్ సంక్షోభం తర్వాత రియల్ భూం ఒక్కసారిగా ఆకాశాన్నంటింది. నగరానికి ఆనుకుని ఉన్న కోకాపేట, నార్సింగి, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, శంకర్పల్లి, మొయినాబాద్, రాజేంద్రనగర్, శంషాబాద్, సరూర్‌నగర్, ఎల్బీనగర్, పెద్ద అంబర్పేట్, బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మణికొండ, తుక్కుగూడ, ఆది బట్ల, కొత్తూరు, మహేశ్వరం (Maheswaram) తదితర ప్రాంతాల్లో ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. కోకాపేటలో ఎకరం ఏకంగా రూ.100 కోట్లకుపైగా పలికింది. ఓఆర్ఆర్కు అటు ఇటుగా కొత్తగా అనేక గేటెడ్ కమ్యూనిటీలు, విల్లా ప్రాజెక్టులు, హైరేంజ్ అపార్ట్మెంట్లు వెలిశాయి. వీటిలోని ప్లాట్లు, ఇళ్లు, ఖాళీ స్థలాలు కొనుగోలు చేసేందుకు నగర వాసులే కాకుండా దేశవిదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు, బహుళ జాతి కంపెనీలు ఆసక్తి చూపాయి. ఫలితంగా రోజుకు సగటున 750 నుంచి 1000 ఆస్తుల రిజి్రస్టేషన్లు జరిగేవి. రిజిస్ట్రేషన్ చార్జీల రూపంలో ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరేది. రోడ్డున పడ్డ కమీషన్ ఏజెంట్లు అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి తోడు ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో వెలసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో ఆస్తుల అమ్మకాలు మందగించాయి. రిజి్రస్టేషన్ల సంఖ్య గణనీయంగా తగ్గి ఆ శాఖ ద్వారా ప్రభుత్వానికి సమకూరాల్సిన ఆదాయం ఆశించిన స్థాయిలో రావడం లేదు. భవిష్యత్తుపై ఆశతో భూములపై భారీగా పెట్టుబడి పెట్టిన చిరు వ్యాపారులు తమ వెంచర్లలోని ఖాళీ స్థలాలు అమ్ముడుపోక ఆర్థికంగా చితికిపోతున్నారు. అప్పటి వరకు రియాల్టీపై ఆధారపడిన కమీషన్ ఏజెంట్లు ప్రస్తుతం విలవిల్లాడిపోతున్నారు. ఒకప్పుడు ఖరీదైన కార్లు, విలాసవంతమైన జీవితాన్ని గడిపిన వారు ప్రస్తుతం రోజువారీ ఖర్చుల కోసం తమ వద్ద ఉన్న ఆస్తులు, బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది. ఉపాధి లేకపోవడంతో కొంతమంది ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకోగా, మరికొంత మంది జీవితాలు రోడ్డునపడ్డాయి. -
Hyderabad Rains: ఒక్కసారిగా షోరూంలోకి వరద.. తప్పిన ప్రమాదం
సాక్షి, హైదరాబాద్: నగరంలో నిన్న కురిసిన భారీ వర్షానికి జన జీవనం అస్థవ్యస్థమైంది. పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షంతో రసూల్‌పురలోని పైగా కాలనీ విమాన నగర్లో వరద బీభత్సం సృష్టించింది.ఓ కార్ల షోరూమ్‌లోకి నాలుగు అడుగుల మేర వరద చేరింది. దీంతో అందులో పనిచేస్తున్న సుమారు 30 మంది సిబ్బంది చిక్కుకున్నారు. తమను రక్షించాలని పోలీసు, డీఆర్ఎఫ్, హైడ్రా అధికారులకు షోరూమ్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. హైడ్రా బృందం రంగంలోకి దిగి షోరూమ్ వెనుక వైపు నుంచి వారిని తరలించారు. బోట్ల ద్వారా వారిని బయటకు తీసుకొచ్చారు.Patny nala overflows, residents rescued #HyderabadRains | Heavy rains flood low-lying areas in Hyderabad; Patny nala overflows, submerging nearby colonies. HYDRAA Commissioner AV Ranganath monitors boat-led rescue operations as DRF teams evacuate residents. #Hyderabad pic.twitter.com/E01P54whcD— Deccan Chronicle (@DeccanChronicle) July 18, 2025మరోవైపు.. హైడ్రాపై ప్యాట్నీ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల హైడ్రా.. ప్యాట్నీ నాలా విస్తరణ పనులు చేపట్టారు. ఈ కారణంగా నాలా గోడ కూల్చడంతో.. తాజాగా కురిసిన వర్షానికి ప్యాట్నీ కాలనీలో వరద నీరు ముంచెత్తింది. నాలా విస్తరణ అసంపూర్తిగా చేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు మండిపడుతున్నారు. నీట మునిగిన ప్రాంతాల్లో హైడ్రా కమిషనర్ పర్యటనప్యాట్నీ నాలా వద్ద ముంచెత్తిన వరదప్రజలను బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న హైడ్రా.@HYDTP #HYDRAA #hyderabadrain #DRF pic.twitter.com/ilvFsWcijT— HYDRAA (@Comm_HYDRAA) July 18, 2025మరోవైపు.. భారీ వర్షం కారణంగా హుండాయ్ కార్ సర్వీసింగ్ సెంటర్‌కు చెందిన 15 కార్లు జల దిగ్బంధం అయ్యాయి. కస్టమర్ సర్వీసింగ్ కోసం కార్లను అని ఇస్తే వరదలో ముంచెత్తడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా చేసిన ఆవేశపూరిత పనులతో ఈ వర్షాకాలం గట్టెకేదేలా అంటూ ప్యాట్నీ కాలనీ వాసుల ఆందోళన చెందుతున్నారు. -
హైడ్రాపై ఆగ్రహం.. కోర్టు ఆదేశాలున్నా కూల్చివేస్తారా?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేట్ గ్రామంలోని 200 చదరపు గజాల్లోని 480 చదరపు అడుగుల నిర్మాణంపై కోర్టు ఆదేశాలున్నా ఎలా కూల్చివేశారంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగానాథ్‌ను హైకోర్టు ప్రశ్నించింది. వివరణ ఇవ్వాలని ఆయన్ను ఆదేశిస్తూ, విచారణ వచ్చే నెల 22కు వాయిదా వేసింది. రంగనాథ్‌తోపాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతిలకు నోటీసులు జారీ చేసింది.వివరాల ప్రకారం.. తన ఇంటి విషయంలో మున్సిపాలిటీ అధికారులు, హైడ్రా జోక్యం చేసుకొని కూల్చే ప్రయత్నం చేస్తున్నాంటూ వడ్దే తార హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చట్ట ప్రకారం పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. వివాదాస్పద నిర్మాణం సున్నం చెరువు ట్యాంక్‌లో ఉందని హైడ్రా వాదనలు వినిపించింది. రెవెన్యూ అధికారుల సాయంతో సర్వే నిర్వహిస్తున్నామని, అది పూర్తయిన తర్వాత చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పింది. వాదనలు విన్న న్యాయమూర్తి.. సర్వే పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, తర్వాత చట్టప్రకారం ముందుకు వెళ్లాలని ఈ ఏడాది మార్చిలో ఆదేశాలు జారీ చేశారు.అయినా, కోర్టు ఆదేశాలను పక్కకు పెట్టి తన ఇంటిని కూల్చివేశారంటూ తార ధిక్కరణ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ శుక్రవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సున్నం చెరువుపై సర్వే పూర్తి చేసి హద్దులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్ణయించాలని, ఆ తర్వాత చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని న్యాయస్థానం చెప్పినా అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్నారు. జూన్ 30న పిటిషనర్‌ను అరెస్టు చేసి, ఇంటిని కూలిచేశారని చెప్పారు. కోర్టు ఉత్తర్వులున్నాయని చెప్పినా అధికారులు పట్టించుకోలేదన్నారు. మాదాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ తిరుపతిరావు, ఎస్ఐ వెంకటేశ్.. 70 మందితో జూన్ 30న ఉదయం 4 గంటలకు వచ్చి పిటిషనర్‌తోపాటు కుటుంబసభ్యులను ఇంటిని నుంచి బయటకు వెళ్లగొట్టారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. దీనిపై వివరణ ఇవ్వాలని ఏవీ రంగానాథ్‌ను ఆదేశిస్తూ, విచారణ వాయిదా వేశారు. -
పేదలు కాదు.. పెద్దలు కూడా హైడ్రా టార్గెట్: రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల తొలగింపు, చెరువుల రక్షణ, ప్రభుత్వ స్థలాలను కాపాడటమే లక్ష్యంగా హైడ్రా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో నేడు హైడ్రా ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అంబర్ పేట బతుకమ్మ కుంట వద్ద స్కూల్ స్టూడెంట్స్ మానవహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ..‘చెరువులను కాపాడాలనే ఉద్దేశ్యంతో మొదట్లో మేము చాలా అగ్రసీవ్ గా వెళ్ళాం. అలా చేయడంతో చెరువుల ఆక్రమణలు తగ్గాయి. భావితరాలకు భవిష్యత్తు ఇవ్వడం కోసం హైడ్రా పని చేస్తుంది. సీఎం ఆదేశాలతో సామజిక కోణంలో చూసి పేదల ఇళ్లు కూల్చడం లేదు. కబ్జాలు చేసిన వారే హైడ్రాపై విమర్శలు చేస్తున్నారు. సెప్టెంబర్ 21న బతుకమ్మ కుంటను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. హైడ్రా అంటే డెమాలిషన్ కాదు డెవలప్మెంట్. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన బతుకమ్మ కుంట ఒక షాంపిల్ మాత్రమే. త్వరగా ఎన్నో బతుకమ్మ కుంటలు వెలుగు లోకి వస్తాయి.గత ఏడాది జూలై 19న హైడ్రా ఏర్పడింది. డిజాస్టర్ మేనేజ్మెంట్పై ప్రత్యేక దృష్టి పెట్టం. ప్రభుత్వ స్థలాలు కాపాడటంపై ప్రత్యేక దృష్టి సారించాం. చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు.. దాదాపు 500 ఎకరాల భూమి కాపాడాం. వాటి విలువ 30వేల కోట్లకు పైనే ఉంటుంది. బతుకమ్మ కుంటను వెలుగులోకి తెచ్చాము. ప్రజల సహకారంతో ప్రభుత్వ, ప్రజల ఆస్తులు కాపాడే ప్రయత్నం చేశాం. హైడ్రా అంటే కేవలం కూచివేతలు కాదు. రాబోయే రోజుల్లో మరింత పటిష్టంగా హైడ్రా పనిచేస్తుంది. పేద వారి మీద కాదు మా ప్రతాపం.. పెద్ద వారిపై కూడా హైడ్రా సమానంగా పని చేస్తుంది. హైడ్రాపై అనేక విమర్శలు చేశారు. సామాజిక కోణంలో హైడ్రా పని చేస్తుంది..సల్కాం చెరువుపై ఇంకా ఫైనల్ నోటిఫికేషన్ అవ్వలేదు. ఒవైసీ ఫాతిమా కాలేజీపై సామాజిక కోణంతో ముందుకు వెళ్తున్నాం. 140 చెరువుల ఫైనల్ నోటిఫికేషన్ ఉంది. మిగతా చెరువుల బౌండరీతో పాటు ఫైనల్ నోటిఫికేషన్ రాలేదు. ఫైనల్ నోటిఫికేషన్ వచ్చాక మిగతా FTL, బఫర్‌లో వచ్చిన అక్రమ నిర్మాణాలపై ఫోకస్ చేస్తాం. ఈ ఏడాది సెప్టెంబర్ 21న ముఖ్యమంత్రి చేతుల మీదగా బతుకమ్మ కుంట లో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతాయి. బతుకమ్మ కుంట పునరుద్దరణ చేయడం మా పనికి నిదర్శనం అని చెప్పుకొచ్చారు. -
కూకట్‌పల్లిలో హైడ్రా కూల్చివేతలు
సాక్షి, కూకట్పల్లి: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా కూకట్‌పల్లిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్నారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతోంది.వివరాల ప్రకారం.. కూకట్‌పల్లిలోని బాలాజీ నగర్ డివిజన్ హబీబ్ నగర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్నారు. అక్కడ నాళాను ఆక్రమించి నిర్మించిన నిర్మాణాలను తొలగిస్తున్నారు. ఈ నిర్మాణాలపై ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన హైడ్రా.. కూల్చివేతలను ప్రారంభించింది. శుక్రవారం ఉదయమే భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. -
ఫాతిమా కాలేజీ కూల్చివేతపై హైడ్రా చీఫ్ రంగనాథ్ క్లారిటీ
-
బతుకమ్మకుంటకు జీవజలం!
అంబర్‌పేటలోని బతుకమ్మకుంట జీవం పోసుకుంది. ఒకప్పటిలా నీటితో కళకళలాడుతోంది. కబ్జా చెర వీడటంతో రూ.8 కోట్ల వ్యయంతో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) చేపట్టిన అభివృద్ధి పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే సెపె్టంబర్ నాటికి బతుకమ్మకుంట పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని హైడ్రా ప్రకటించింది. ఈ చెరువుకు సంబంధించిన ‘నాడు–నేడు’ ఫొటోలను మంగళవారం విడుదల చేసింది. తొలుత చెత్త, మొక్కల్ని తొలగించిన అధికారులు చెరువులో పూడికతీత చేపట్టారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జేసీబీలు కేవలం అడుగున్నర తవ్వగా... లోపల నుంచి నీళ్లు ఉబికివచ్చాయి. బతుకమ్మ కుంటను పునరుద్ధరించి, పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించిన హైడ్రా అధికారులు దాని పూర్వాపరాలు అధ్యయనం చేశారు. 1962–63 నాటి రికార్డుల ప్రకారం సర్వే నం.563లో 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట విస్తరించి ఉండేది. ఫుల్ ట్యాంక్ లెవల్, బఫర్ జోన్లతో కలిపి దీని వైశాల్యం 16.13 ఎకరాలు ఉండేదని అధికారులు తేల్చారు. తాజా సర్వే ప్రకారం అక్కడ కేవలం 5.15 ఎకరాల భూమి మాత్రమే మిగిలినట్లు తేలింది. దీంతో కుంటను పునరుద్ధరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న వారిని ఖాళీ చేయించకుండా, ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చెరువు తవ్వకాలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానికులు హైడ్రాకు సహకరించారు. ఒకప్పటి ఎర్రకుంటనే బతుకమ్మకుంటగా మారిందని, రెవెన్యూ రికార్డులూ అదే చెబుతున్నాయని స్థానికులు హైడ్రా దృష్టికి తెచ్చారు. బతుకమ్మ కుంట చుట్టూ సుందరీకరణ పనులు చేపడుతూ అందులో స్వచ్ఛమైన నీళ్లు నిలిచేలా చేయడం ద్వారా పర్యావరణం పరిరక్షణ, భూగర్భ జలాల పెరుగుదలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. స్థానికులు ఈ ఏడాది బతుకమ్మకుంటలోనే బతుకమ్మ ఆడేలా చేయాలన్నదే తమ లక్ష్యమని హైడ్రా స్పష్టం చేసింది. -
అందుకే ఒవైసీ ఫాతిమా కాలేజీ కూల్చివేయడం లేదు.. హైడ్రా క్లారిటీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో సలకం చెరువులో నిర్మించిన ఒవైసీ ఫాతిమా కాలేజీని కూల్చివేయకపోవడంపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. పేదల కోసం పనిచేస్తున్న కాలేజీ అయినందునే దానిపై చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం చేసింది. అయితే, ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఎంఐఎం నాయకుల నుంచి దాదాపు 1,000 కోట్ల ఆస్తులను ఇప్పటికే రికవరీ చేసుకున్నట్టు పేర్కొంది.ఎంఐఎం ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీ కూల్చివేతపై తాజాగా హైడ్రా స్పందించింది. ఈ సందర్బంగా హైడ్రా..‘అక్బర్ కాలేజీని ఎందుకు కూల్చివేయడం లేదని ఇప్పుడు అందరు అడుగుతున్నారు. కాలేజీ ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించినందున గత సెప్టెంబర్‌లో తొలగించే ప్రయత్నం చేస్తామని చెప్పాం. పేద ముస్లిం మహిళల కోసం కేజీ నుంచి పీజీ వరకు ఈ సంస్థ నడుస్తోంది. ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు వసూలు చేయరు. ఈ కాలేజీలో 10,000 మందికి పైగా బాలికల నుంచి యువతుల వరకు విద్యను అభ్యసిస్తున్నారు. పేద ముస్లిం మహిళలకు వెనుకబాటు తనం నుంచి విముక్తి కల్పిస్తున్నారుపేదల కోసం పనిచేస్తున్న కాలేజీ అయినందునే దానిపై చర్యలు తీసుకోవడం లేదు. ఎంఐఎం నాయకుల ఆస్తుల వ్యవహారంలో కఠినంగానే వ్యవహరిస్తున్నాం. ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కబ్జా చేసిన భారీ నిర్మాణాలను కూల్చివేశాం. 25 ఎకరాల సరస్సును ఫ్లాట్ గా మార్చిన ఒవైసీ కుటుంబానికి సన్నిహితుడి కట్టడాలను కూడా కూల్చేశాం. ఎంఐఎం నాయకుల నుంచి దాదాపు 1,000 కోట్ల ఆస్తులను ఇప్పటికే రికవరీ చేసుకున్నాం. చాంద్రయాన్‌గుట్టలో ఎంఐఎం కార్పొరేటర్ స్థలాన్ని స్వాధీనపరుచుకున్నాం. సామాజిక కారణాల వల్లనే ఫాతిమా కాలేజీ కూల్చివేతను నిలిపివేశాం. సామాజిక స్పృహతో కాలేజీ నడుస్తుందని దాని పట్ల మెతకవైఖరి అవలంబిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు, ఫాతిమా కాలేజీ విషయమై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కళాశాల జోలికి వెళ్లబోమని హైడ్రా కమిషనర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ కళాశాల జోలికి పోతే ఏం అన్యాయం జరుగుతుందో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేయాలి. ఇది ప్రభుత్వ నిర్ణయమా? లేక ఆ అధికారి సొంత నిర్ణయమో చెప్పాలి. మూసీ పరీవాహక ప్రాంతంలో పేదల గుడిసెలను కూల్చిన హైడ్రా అధికారులు.. అక్బరుద్దీన్ ఒవైసీ కళాశాలకు మాత్రం గతేడాది నోటీసులిచ్చి ఊరుకున్నారని.. ఆ కళాశాలను ఈ ఏడాది మరోచోటుకు తరలించాలని ఎందుకు చెప్పలేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. -
మాదాపూర్ సున్నం చెరువులోని ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా
-
హైడ్రా కూల్చివేతలు.. మాదాపూర్ సున్నం చెరువు వద్ద ఉద్రిక్తత
సాక్షి, మాదాపూర్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మాదాపూర్‌లోని సున్నం చెరువు పరిధిలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాల తొలగింపు జరుగుతోంది.వివరాల ప్రకారం.. మాదాపూర్ సున్నం చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను, నివాసాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. చెవుల పునరుద్ధరణలో భాగంగా 10 కోట్ల రూపాయలతో సున్నం చెరువును హైడ్రా అభివృద్ధి చేస్తోంది. ఇక, 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు జరిగినట్టు అధికారులు గుర్తించారు. అలాగే, చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు మోటార్లను సైతం హైడ్రా తొలగిస్తోంది. సున్నం చెరువు సమీపంలో ఏళ్ల తరబడి జోరుగా అక్రమ నీటి వ్యాపారం జరగుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల సున్నం చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగించవద్దని హైడ్రా హెచ్చరించింది.కూల్చివేతల సందర్భంగా బాధితులు మాట్లాడుతూ..‘సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతల అక్రమం. మేము రిజిస్టర్ చేసుకున్న భూములు ఇవి. 1956 నుండి మాకు పత్రాలు ఉన్నాయి. రాష్ట్ర ఉద్యోగుల గృహ నిర్మాణ కో-ఆపరేటివ్ సోసైటీ విక్రయిస్తేనే కొనుగోలు చేశాం. ప్రతీ ఏడాది జీహెచ్ఎంసీకి పన్ను కడుతున్నాం. మరి హైడ్రా ఏ విధంగా మా భూములు లాక్కుంటుంది. మాకు ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదు. ఆల్రెడీ కబ్జా చేసి కట్టిన వారిని ఏమనడం లేదు. కోర్టులో పోరాడుతున్నవారిని మాత్రం ఇబ్బందులు పెడుతున్నారు. గ్రీన్ ట్రిబ్యునల్‌కి ప్రభుత్వమే ఇది 15 ఎకరాలు సున్నం చెరువు అని రిపోర్ట్ ఇచ్చారు. చెరువు అల్లాపూర్ బాలానగర్‌లో ఉండగా శేరిలింగంపల్లిలో ఉన్నట్లు చూపిస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. మాదాపూర్‌లో గల సున్నం చెరువు నీరు అత్యంత ప్రమాదకరంగా మారినట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ చెరువు నీటిలో పరిమితికి మించి ఏకంగా 12 రెట్లు అధికంగా సీసం ఉన్నట్లు తేలడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ ప్రాంతంలోని భూగర్భ జలాలు సైతం ప్రమాదకర స్థాయిలో కలుషితమైనట్లు తేలింది. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) సహకారంతో చెరువులోని నీటి నమూనాలను సేకరించి, శాస్త్రీయంగా పరీక్షించింది. ఈ పరీక్షల్లో విస్తుపోయే వాస్తవాలు బయటపడ్డాయి. సున్నం చెరువు నీరు తీవ్రంగా కలుషితమైంది. అత్యంత హానికరమైన సీసం (లెడ్) పరిమితికి మించి 12 రెట్లు అధికంగా ఉన్నట్లు స్పష్టమైంది. ఈ నీటిని తాగవద్దని, కనీసం రోజువారీ అవసరాలకు కూడా వినియోగించవద్దని హైడ్రా ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఇక, హైదరాబాద్ నగరంలోని ఆరు ప్రధాన చెరువుల పునరుద్ధరణకు హైడ్రా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మొదటి దశలో సున్నం చెరువుపై దృష్టి సారించింది. -
నాగార్జున రియల్ హీరో అంటూ సీఎం రేవంత్‌రెడ్డి కామెంట్స్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మరోసారి సినీ హీరో నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ గురించి మాట్లాడారు. తాజాగా ఆయన హైదరాబాద్‌లోని కొండాపూర్ నుంచి ఓఆర్ఆర్ వరకు నిర్మించిన పి.జనార్థన్‌రెడ్డి(పీజేఆర్) ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు గురించి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ నాగార్జున గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ గురించి సీఎం రేవంత్‌రెడ్డి ఇలా చెప్పుకొచ్చారు. 'ఆ మధ్య కాలంలో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను ప్రభుత్వం తొలగించింది. ఆ తర్వాత నాగార్జునే స్వయంగా వచ్చి రెండు ఎకరాల స్థలం ప్రభుత్వానికి అప్పజెప్పారు. నగర అభివృద్ధిలో హీరోగా ముందు ఉంటానని ఆయన అన్నారు. మంచి సంకల్పంతోనే ఆ చెరువును అభివృద్ధి చేస్తున్నారంటూ.. రెండు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వానికి ఇస్తున్నట్లు వాలంటీర్‌గా ఆయన ముందుకు వచ్చారు' అని సీఎం అన్నారు.గతేడాది ఆగష్టు నెలలో మాదాపూర్‌లో ఉన్న నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్‌హాలును హైడ్రా కూల్చి వేసిన విషయం తెలిసిందే. నగరంలోని తమ్మిడికుంట చెరువును ఆక్రమించి అనుమతి లేని నిర్మాణాలతో వ్యాపారం చేస్తున్నారంటూ హైడ్రా ఈ కూల్చివేతలకు చర్యలు చేపట్టింది. తమ్మిడికుంటను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్‌ను నిర్మించారని ప్రభుత్వం ప్రకటించింది. ఆపై ఆ చెరువు చుట్టూ ఉన్న పలు కట్టడాలను కూడా హైడ్రా కూల్చివేసింది. అప్పుడు ఈ సంఘటన తెలుగు రాష్ట్రాలలో పెను సంచలనంగా మారింది. -
మేడ్చల్‌లో హైడ్రా కూల్చివేతలు.. రియల్ ఎస్టేట్ వెంచర్లో..
సాక్షి, మేడ్చల్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా మేడ్చల్ జిల్లా పరిధిలో అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చి వేస్తున్నారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు ప్రారంభమయ్యాయి.వివరాల ప్రకారం.. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ఉదయం నుంచే హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కొర్రెముల రెవెన్యూ పరిధి ఏకశిలానగర్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి వెంచర్లో ప్లాట్లకు అడ్డుగా ప్రహరీ గోడ నిర్మించారు. దీనిపై స్థానికుల నుంచి హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రహరీ గోడ నిర్మాణాన్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. -
సీఎం రేవంత్ మరో కీలక నిర్ణయం.. హైడ్రాకు మరిన్ని బాధ్యతలు
హైదరాబాద్,సాక్షి: హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్తులు, చెరువుల పరిరక్షణ కోసం సర్కారు ఏర్పాటు చేసిన హైడ్రా చేతికి తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతల్ని అప్పగించింది. వర్షాకాలంలో నగరంలో వరద ముంపు సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించింది.ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడారు. వర్షాకాలంలో వరద ముంపు సమస్యలు ఇపుడు హైడ్రా చూస్తుంది.మన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ జీహెచ్ఎంసీ నుండి హైడ్రాకు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ ఒక గొడుగు కిందకు రావడం వల్ల పని ఈజీ అవుతుంది.వర్షాకాలంలో మాత్రమే హైడ్రా బాధ్యత. వర్షాకాలంలో చేయాల్సినవి హైడ్రా చేస్తుంది. వర్షాకాలం ముందు చేయాల్సినవి జీహెచ్ఎంసీ చేస్తుంది. నాలాల రక్షణ, నాలాల్లో పూడిక తీత లేకుండా చూస్తాం. మొత్తం నగరాన్ని మార్చేస్తాం అని చెప్పను కానీ బెటర్ చేస్తాం. ఇప్పటికే విరిగిపోయి చెట్లను గుర్తిస్తున్నాం. ప్రమాదకర మ్యాన్ హోల్స్‌ను గుర్తిస్తున్నాం. నాలాల్లో వరద నీరు సాఫీగా వెళ్లేలా చేస్తాం.మా దగ్గర 30 టీమ్స్,జీహెచ్ఎంసీ వద్ద దగ్గర 150 టీమ్స్, ట్రాఫిక్ 20 టీమ్స్ ఉన్నాయి. అన్ని టీములు పని చేస్తున్నాయా లేదా చెక్ చేస్తాం. వరద నీరు సరిగా వెళ్లేలా టీమ్స్ పని చేస్తున్నాయా లేదా అని చూస్తాం.ఎంత వర్షం పడుతుందో దాని మీద పరిస్థితి ఆధారపడి ఉంటుంది’ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అన్నారు. -
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో హైడ్రా కూల్చివేతలు
-
జూబ్లీహిల్స్‌లో హైడ్రా కూల్చివేతలు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్‌లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. నాలాను ఆక్రమించి కట్టిన నిర్మాణాలను అధికారులు నేల మట్టం చేశారు.వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ గుడి పక్కన నాలాపైన ఆక్రమణలను హైడ్రా అధికారులు గుర్తించారు. నాలాను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టినట్టు హైడ్రా అధికారులు తెలిపారు. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా.. నాలాపై నిర్మించిన నిర్మాణాలను, షెడ్లను కూల్చివేసింది. 500 గజాలకు పైగా స్థలంలో నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. -
హైడ్రా కూల్చివేతలు.. బోడుప్పల్లో కబ్జాలు..
సాక్షి, మేడ్చల్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి.వివరాల ప్రకారం.. పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్‌లో స్మశాన వాటికల్లోని కొంత భూమిని కొందరు ఆక్రమించారు. అక్కడ అక్రమ నిర్మాణాలను చేపట్టారు. సర్వే నంబర్లు 1, 12లోని స్మశాన వాటికల్లోని భూములను కబ్జా చేసి కబ్జాదారులు వాటని విక్రయిస్తున్నారు. గత రెండేళ్లుగా కబ్జాలు జరుగుతున్నాయి. దీంతో, స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అనంతరం, హైడ్రా కమిషనర్ రంగనాథ్ బుధవారం మధ్యాహ్నం బోడుప్పల్, పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పర్యటించారు. అక్రమ నిర్మాణాలు, కబ్జాలు జరిగినట్టు గుర్తించారు.ఈ నేపథ్యంలో అక్కడ అక్రమ నిర్మాణాలను తొలగస్తామని రంగనాథ్.. స్థానికులకు హామీ ఇచ్చారు. గురువారం ఉదయమే హైడ్రా అధికారులు అక్కడికి చేరుకుని అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై హైడ్రా స్పందించడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక, అంతకుముందు, బుధవారం ఉదయం మేడిపల్లిలోని సేజ్ స్కూల్లోని అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. -
కూకట్పల్లి లోని హైదర్ నగర్ వద్ద హైడ్రా కూల్చివేతలు
-
మియాపూర్‌లో హైడ్రా కూల్చివేతలు.. 70 ప్లాట్ల యజమానులు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మియాపూర్‌లో హైడ్రా (Hydra) కూల్చివేతలు చేపట్టింది. హెచ్ఎండీఏ లేఅవుట్లోని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. పోలీసులు బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగాయి.వివరాల ప్రకారం.. మియాపూర్‌లోని హైదర్‌నగర్‌లో సోమవారం ఉదయం నుంచి హైడ్రా (Hydra) కూల్చివేతలు చేపట్టింది. తప్పుడు పత్రాలతో తమ భూమి కబ్జా చేశారని ఇటీవల 70 మంది ప్లాట్ల యజమానులు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. హెచ్ఎండీఏ లేఅవుట్లోని అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించారు. హైకోర్టు ఆదేశాలతోనే అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నట్టు హైడ్రా అధికారులు తెలిపారు. ఇక, కబ్జాదారుల నుంచి భూములు విడిపించడంపై ప్లాట్ల యజమానులు హర్షం వ్యక్తం చేశారు. -
మోదీ చేస్తే గొప్ప... మేం చేస్తే తప్పా?
సాక్షి, హైదరాబాద్: గుజరాత్లో సబర్మతి, యూపీలో గంగా, ఢిల్లీలో యమునా నదుల పునరుద్ధరణ కొందరికి గొప్పగా వినిపిస్తోందని.. అలాంటప్పుడు తెలంగాణ ప్రజల కోసం మూసీ నదిని ప్రక్షాళన చేస్తే వచ్చే ఇబ్బంది ఏమిటని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. మనం గొప్పగా బతకవద్దా? అని నిలదీశారు. ప్రధాని మోదీ చేస్తే గొప్ప ఎలా అవుతుందో.. రాష్ట్ర ప్రభుత్వం చేస్తే తప్పు ఎలా అవుతుందో ప్రజలు ఆలోచించాలని కోరారు.హైదరాబాద్‌లోని బుద్ధభవన్ వద్ద ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) పోలీసుస్టేషన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన హైదరాబాద్‌లో అక్రమ నిర్మాణాల వల్ల తలెత్తుతున్న వరదలు, హైడ్రా ఆవశ్యకత సహా వివిధ అంశాలపై స్పందించారు. హైడ్రా కూల్చడానికే కాదు... రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది కేవలం కూల్చడానికి మాత్రమే కాదని.. నిర్మాణాలు చేపట్టేందుకు కూడానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఆక్రమణలకు పాల్ప డే వాళ్లు ఎంత గొప్ప వాళ్లయినా చట్టం ముందు సమానులే నని నిరూపించడానికే హైడ్రా తీసుకుకొచ్చినట్లు స్పష్టం చేశా రు. హైదరాబాద్‌లో 940 చెరువులకుగాను 491 చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. పెద్దపెద్ద నాలాలు మూసుకుపోయాయి. చిన్న వర్షానికే కాలనీలు మునిగిపోతున్నాయని.. రోడ్లపై వరదనీటితో గంటల తరబడి ట్రాఫిక్‌జామ్‌లు ఏర్పడుతున్నాయన్నారు. వాటి నుంచి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? అని ప్రశ్నించారు. అక్కడ అలా.. ఇక్కడ ఇలా అంటారేంటి? చెరువులను కాపాడినా, నాలాల ఆక్రమణలు తొలగించినా, అక్రమ నిర్మాణాలను పడగొట్టినా, మూసీని పునరుద్ధరించాలని చూసినా రియల్ ఎస్టేట్ పడిపోతోందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. ‘రియల్ ఎస్టేట్ పెంచుదామని ఐఎంజీ భారత్ అనే ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టిన 400 ఎకరాలను 20 ఏళ్ల తర్వాత వెనక్కు తెచ్చాం. రూ. 50 వేల కోట్ల పెట్టుబడితో లక్ష ఉద్యోగాలు వచ్చేలా అభివృద్ధి చేయాలనుకున్నాం. కానీ అక్కడ చెట్టు ఉంది, పుట్ట ఉంది, పాము ఉంది, పిట్ట ఉంది... అవి ఎలా బతుకుతాయి అంటూ ఆ 400 ఎకరాల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అసలు మీ బాధ ఏంటి? చెరువులను కాపాడి, మూసీని ప్రక్షాళించి నాలాలు, రోడ్లపై ఆక్రమణల్ని తొలగిస్తే ప్రకృతిని కాపాడినట్లు కాదా? ఆక్రమణలను తొలగిస్తుంటే రియల్ ఎస్టేట్ పడిపోతుంది అంటున్నారు. మరోవైపు రూ. వేల కోట్ల పెట్టుబడులతో ఐటీ, ఫార్మా కంపెనీలను తీసుకొచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇప్పించి ఒక ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ సెంటర్‌ను తయారు చేద్దామంటే ప్రకృతి నాశనం అయిపోతోందంటున్నారు. అలాంటి వాళ్ల ఆలోచనల్లో ప్రభుత్వాన్ని ముందుకు వెళ్లనీయద్దు, ప్రజలకు మేలు జరగనీయద్దనేది స్పష్టంగా కనిపిస్తోంది. కబ్జాల్లో ఉన్న చెరువులను కాపాడాల్సిన అవసరం ఉందా లేదా? అనేది ప్రజలే ఆలోచించాలి’అని సీఎం రేవంత్ సూచించారు. మూసీని పునరుద్ధరించి తీరుతాం... ప్రతిపక్ష నేతలు మాత్రం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ జన్వాడ, ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లలో విశాలమైన భవంతుల్లో బతుకుతున్నారని.. పేదలు మాత్రం మూసీలోనే, మురికిలోనే చావాలా? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం మూసీని పునరుద్ధరించి తీరుతుందని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే అధికారులు, ప్రజాప్రతినిధులు మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటించి అక్కడి ప్రజలతో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తారని వివరించారు. నిర్వాసితులకు వేరే ప్రాంతాల్లో ఇళ్ల పట్టాలు ఇస్తామని.. అవసరమైతే ప్రతి 5 కి.మీ. ప్రాంతాన్ని ఒక క్లస్టర్‌గా తీసుకొని అపార్ట్మెంట్లు కట్టిస్తామన్నారు. మానవీయ కోణంలో వ్యవహరించాలి.. హైడ్రా మానవీయ కోణంలో వ్యవహరించాలని సీఎం రేవంత్ సూచించారు. పేదలపట్ల సానుభూతితో, పెద్దలపట్ల కఠినంగా ఉండాలని స్పష్టం చేశారు. పేదలకు ప్రత్యామ్నాయం చూపించాలని అధికారులను ఆదేశించారు. -
వారికే హైడ్రా అంటే భయం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పేదోళ్ల ఇళ్ల కూల్చడానికి హైడ్రా తెచ్చామని కొందరు ఆరోపణలు చేస్తున్నారని.. హైడ్రా అనేది కేవలం కూలగొట్టడానికి కాదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన హైడ్రా పోలీస్‌స్టేషన్ ప్రారంభత్సోవ సభలో మాట్లాడుతూ.. చెరువులను ఆక్రమించిన వారు ఎంత పెద్దవారైనా వదలం అని స్పష్టం చేశారు. పేదలు తమ కాలనీల వైపు రాకుండా కొందరు బలవంతులు అడ్డుగా గోడలు కడుతున్నారు. ఆక్రమణదారులను అడ్డుకోవడానికే హైడ్రా’’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.‘‘960 చెరువులు ఉండాల్సి ఉండగా, 461 చెరువులు కబ్జాలో ఉన్నాయి. నాలాల ఆక్రమణవల్లే రోడ్లపై నీరు నిలిచిపోతోంది. లేక్‌వ్యూల పేరుతో చెరువుల్లోనే విల్లాలు కడుతున్నారు. ఎవరూ అడగకుండా ఉంటే భవిష్యత్తులో ఏమవుతుందో అర్థం చేసుకోండి. చెరువులు, నాలాలు ఆక్రమించుకున్న వారికే హైడ్రా అంటే భయం. ఈ నగరాన్ని ఇలాగే నిర్లక్ష్యానికి బలిచేద్దామా?. చిన్న వర్షానికే ఉస్మానియా ఆసుపత్రి మునిగిపోయింది. మమ్మల్ని వ్యతిరేకించినా, దూషించినా నేను పట్టించుకోను’’ అని రేవంత్ తేల్చి చెప్పారు.‘‘కడుపు నిండా విషం నింపుకుని వ్యవహరిస్తున్నారు. ప్రకృతిని కాపాడుకుందామంటే వీళ్లకు ఇబ్బంది వస్తోంది. రోడ్లపై ఉన్న నిర్మాణాలు కూలిస్తే నగరానికి మంచిది కాదా?. చెరువులను కాపాడి, మూసీని ప్రక్షాళన చేస్తే ప్రకృతిని కాపాడినట్టు కదా?’’ అంటూ రేవంత్ ప్రశ్నించారు. -
HYDRA: హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆక్రమణల తొలగింపు
-
లోగోను మార్చిన హైడ్రా.. కొత్తది ఇదే
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణే లక్ష్యంగా దూకుడుగా ముందుకెళ్తున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) తన లోగో మార్చుకుంది. జల వనరుల శాఖను పోలి ఉండేలా కొత్త లోగోను అధికారులు రూపొందించారు. హైడ్రా అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల్లో ఈ లోగోను ప్రొఫైల్ చిత్రంగా పెట్టి అప్డేట్ చేసింది. ఈ లోగోను తెలంగాణ సర్కార్ అధికారికంగా ఆమోదించింది. హైడ్రా కార్యాలయంతో పాటు సిబ్బంది యూనిఫాం, వాహనాలపై కొత్త లోగోను ముద్రించనున్నారు.కాగా, ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణలను అడ్డుకోవడమే లక్ష్యంగా జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం (ఎన్ఆర్ఎస్సీ)తో హైడ్రా చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్ఆర్ఎస్సీ వద్దనున్న ఉపగ్రహ చిత్రాలు, ఇతరత్రా భూ వివరాలను ఉపయోగించుకుని చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం(ఎఫ్టీఎల్), బఫర్ జోన్లను నిర్ధారించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. అందుకు సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై హైడ్రా కమిషనర్ ఏ.వి.రంగనాథ్, ఎన్ఆర్ఎస్సీ సంచాలకుడు డాక్టర్. ప్రకాశ్ చౌహాన్ బాలానగర్‌లోని ఎన్ఆర్ఎస్సీలో సంతకాలు చేశారు. -
టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఫామ్ హౌస్ కూల్చివేసిన హైడ్రా
-
‘పచ్చ’పార్టీ కబ్జాకాండ
గచ్చిబౌలి/హఫీజ్‌పేట్ (హైదరాబాద్): స్వరాష్ట్రమే కాదు..పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ ఆంధ్రప్రదేశ్‌లోని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు కబ్జాల పర్వం కొనసాగిస్తున్నారు. రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను చెరబడుతున్నారు. మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బహిరంగ మార్కెట్లో దాదాపు రూ.3 వేల కోట్లు పలికే ప్రభుత్వ స్థలానికి ఎసరు పెట్టారు. నకిలీ డాక్యుమెంట్లతో దొడ్డిదారిన యాజమాన్య హక్కులు పొందారు.దీనిపై ఒకవైపు సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరుగుతుండగానే.. ఫాంహౌస్, విల్లాలు నిర్మిస్తూ విలువైన భూమిలో పాగా వేశారు. షెడ్లు, కార్యాలయాలు నిర్మించారు. దీనిపై ఇప్పటికే అనేక ఫిర్యాదులుండగా, ఇటీవలి మరికొన్ని ఫిర్యాదులు సైతం రావడంతో హైడ్రా కదిలింది. ప్రభుత్వ భూముల్లోని నిర్మాణాలపై కొరడా ఝళిపించింది. హైదరాబాద్ శివారు శేరిలింగంపల్లి మండలం హఫీజ్‌పేట్ సర్వే నంబర్ 79లో ఎమ్మెల్యే, మరికొందరు కలిసి అక్రమంగా చేపట్టిన నిర్మాణాల్లో కొన్నిటిని కూల్చివేసింది. 39 ఎకరాలు దర్జాగా కబ్జా హఫీజ్‌పేట్ సర్వే నంబర్ 79కి సంబంధించిన రికార్డులలో 39.06 ఎకరాలు ప్రభుత్వ భూమిగా ఉంది. అయితే బై నంబర్‌తో రికార్డులు సృష్టించిన వసంత కృష్ణప్రసాద్, మరి కొంతమంది ఆ భూమిని ఆక్రమించారు. చుట్టూ ప్రహరీ నిర్మించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఈ భూమిపై ఎన్నో ఏళ్ల నుంచి సుప్రీంకోర్టులో పిటిషన్ (సీఎస్ 14/58) పెండింగ్‌లో ఉంది. స్టేటస్కో పాటించాలని గతంలోనే సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. అయినా పట్టించుకోకుండా ఏళ్ల క్రితమే నిర్మాణాలు ప్రారంభించి 19 ఎకరాలలో విల్లాలు, అపార్ట్మెంట్లు నిర్మించారు.మిగతా 20 ఎకరాలలో షెడ్లు నిర్మించి అద్దెకు ఇచ్చారు. పలు కార్యాలయాలు, గెస్ట్‌హౌస్‌ల నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వ భూమిపై కేసులు ఉన్నప్పుడు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదనే నిబంధనలున్నా పట్టించుకోకుండా నిర్మాణాలు చేపట్టడం గమనార్హం. కాగా అటు రెవెన్యూ అధికారులు కానీ, ఇటు జీహెచ్ఎంసీ అధికారులు కానీ ఈ అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మిన్నకుండి పోయారనే విమర్శలు ఉన్నాయి. ఫైనల్ డిక్రీ రాకుండానే ఈ భూముల్లో నిర్మాణాలు ఎలా చేపడుతున్నారని ఈ పిటిషన్ విచారణ క్రమంలో సుప్రీంకోర్టు ప్రశ్నించింది.ఈ నేపథ్యంలోనే భూముల కబ్జాపై గత మూడు నెలలుగా మరిన్ని ఫిర్యాదులు అందడంతో శనివారం పోలీస్ బందోబస్తుతో హైడ్రా అధికారులు రంగంలోకి దిగారు. ప్రభుత్వ భూమిలోని షెడ్లు, కార్యాలయాలతో కూడిన నిర్మాణాలను కూల్చివేశారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని, ఎవరైనా ఆక్రమణకు పాల్పడితే శిక్షార్హులని పేర్కొంటూ బోర్డు ఏర్పాటు చేశారు. ఆక్రమణదారులపై మియాపూర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. నిషేధిత జాబితా కింద ఉన్నప్పటికీ.. హఫీజ్‌పేట్ సర్వే నంబర్ 79లోని 39 ఎకరాలు రెవెన్యూ రికార్డులలో నిషేధిత జాబితా కింద ఉన్నప్పటికీ ప్రైవేట్ వ్యక్తులు ఆ స్థలానికి 79/1 బై నంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. వివాదాస్పద స్థలంలో విల్లాలకు అనుమతులు ఇవ్వడం, రిజిస్ట్రేషన్లు చేయడంలో అధికారుల పాత్ర కూడా ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ 39.08 ఎకరాలు రెవెన్యూ రికార్డులలో ఇప్పటికీ ప్రభుత్వభూమి (పోరంబోకు)గానే ఉండటం గమనార్హం. రాయదుర్గంలోనూ హైడ్రా కొరడా తాము రోజూ ఆడుకునే స్థలంలోకి రానివ్వడంలేదని, అక్కడ చెరువు కూడా మాయమైందని, రహదారుల నిర్మాణం చేపడుతున్నారని క్రికెట్ ఆడే కొందరు యువకులు ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు స్పందించారు. శనివారం శేరిలింగంపల్లి మండలం రాయదుర్గం సర్వే నంబర్ 5/2లోని ఆ భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అది ప్రభుత్వ భూమిగా గుర్తించారు. అందులో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఓ చోట ప్రహరీ గోడను కూల్చివేశారు. ఈ భూమిపై ఆక్రమణ కేసులు ఉన్నట్లుగా అక్కడ బోర్డులు ఉన్నప్పటికీ, ప్లాట్ల కొనుగోలుకు తమను సంప్రదించాలంటూ కొందరు (నార్నే ఎస్టేట్స్) ఫోన్ నంబర్లతో సహా ఏర్పాటు చేసిన బోర్డులు హైడ్రా అధికారులు గుర్తించారు. -
మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కు హైడ్రా షాక్
-
కొండాపూర్, వనస్థలిపురంలో హైడ్రా కూల్చివేతలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ నిర్మాణాలే టార్గెట్‌గా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు నిర్మాణాలను నేలమట్టం చేసిన హైడ్రా.. తాజాగా వనస్థలిపురంలో అక్రమ నిర్మాణాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలోనే పలు భవనాలను కూల్చివేస్తోంది.వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఇంజాపూర్‌లో అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. శనివారం తెల్లవారుజాము నుంచే హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కాగా, పలు కాలనీలకు వెళ్ళే ప్రధాన రోడ్డును స్కూప్స్ ఐస్ క్రీమ్ కంపెనీ ఆక్రమించింది. దీంతో, రోడ్డు ఆక్రమణపై కాలనీవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. అక్రమ నిర్మాణంపై దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న హైడ్రా అధికారులు.. రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ఫ్రీకాస్ట్ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. మరోవైపు.. కొండాపూర్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో హైడ్రా కూల్చివేతలను ప్రారంభించింది. హఫీజ్‌పేట్ సర్వే నెంబర్-79లోని 39 ఎకరాల భూమిపై స్థల వివాదం కొనసాగుతోంది. వసంత హౌస్ పేరుతో నూతన కార్యాలయం నిర్మాణంతో పాటు భారీ షెడ్లను ఏర్పాటు చేశారు. ఈ స్థల వివాదంపై హైడ్రాకు ఫిర్యాదు రావడంతో భారీగా పోలీసు బందోబస్తు మధ్య కార్యాలయం కూల్చివేశారు. స్థలం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌తో పాటు భారీ షెడ్లను జేసీబీలతో తొలగించారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, పార్కులు, నాలాల ఆక్రమణలను అడ్డుకోవడమే లక్ష్యంగా జాతీయ రిమోట్ సెన్సింగ్ కేంద్రం (ఎన్ఆర్ఎస్సీ)తో హైడ్రా (HYDRA) చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్ఆర్ఎస్సీ వద్దనున్న ఉపగ్రహ చిత్రాలు, ఇతరత్రా భూ వివరాలను ఉపయోగించుకుని చెరువుల పూర్తిస్థాయి నీటి మట్టం(ఎఫ్టీఎల్), బఫర్ జోన్లను నిర్ధారించడమే ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. అందుకు సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై హైడ్రా కమిషనర్ ఏ.వి.రంగనాథ్, ఎన్ఆర్ఎస్సీ సంచాలకుడు డాక్టర్. ప్రకాశ్ చౌహాన్ బాలానగర్‌లోని ఎన్ఆర్ఎస్సీలో సంతకాలు చేశారు. -
హైడ్రా అధికారిపై దాడి .. పలువురు అరెస్ట్!
-
బడంగ్‌పేటలో హైడ్రా కూల్చివేతలు.. పలువురు అరెస్ట్!
సాక్షి, రంగారెడ్డి: తెలంగాణలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలోని బడంగ్‌పేటలో రోడ్డును ఆక్రమించి కట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. ఈ క్రమంలో కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు.వివరాల ప్రకారం.. బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాస్‌గూడలో అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. కాలనీవాసుల ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. రోడ్డును ఆక్రమించి ఇండోర్ క్రికెట్ కోర్డును నిర్మాణం జరిగింది. ఈ క్రమంలో సదరు నిర్మాణాన్ని హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేశారు. ఈరోజు ఉదయం జేసీబీల సాయంతో క్రికెట్ కోర్టును కూల్చివేశారు హైడ్రా అధికారులు. ఫిర్యాదు చేయగానే స్పందించి అక్రమాలను కూల్చివేసినందుకు హైడ్రాకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు కాలనీ వాసులు. ఈ సందర్బంగా కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేసిన వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో, అక్కడ ఉద్రికత్తకర వాతావరణం చోటుచేసుకుంది. ఇదిలా ఉండగా.. ప్రతీ సోమవారం బుద్ధభవన్‌లో ప్రజావాణి కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తారు. 2025 జనవరి నుంచి ప్రారంభించిన ఈ ప్రజావాణికి హైదరాబాద్ ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది. తమ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలపై పలువురు ఫిర్యాదు చేస్తున్నారు. హైడ్రా అధికారులపై దాడికి యత్నం..కూల్చివేతల సందర్భంగా హైడ్రా అధికారులను బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ భర్త శేఖర్ రెడ్డి, ఇతర వ్యక్తులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే హైడ్రా సీఐ తిరుమలేష్‌పై దాడికి ప్రయత్నించారు. బోయపల్లి ఎన్క్లేవ్ కాలనీవాసులు బోయపల్లి వెంకటరెడ్డి, శేఖర్ రెడ్డిపై హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు.1982 జీపీ లేఔట్ చేసి ప్లాట్లను విక్రయించిన భూ యజమానులు. సర్వే నెంబర్ 39,40,41,42,44లో మొత్తం 5 ఎకరాలు ఏడు గుంటల భూమి. లేఅవుట్లో 236 గజాల పార్కు స్థలం కబ్జా చేసిన భూ యజమానులు. మూడు రోడ్లను కాలనీ వాసులకు చూపించిన భూ యజమానులు. రోడ్లు మూసి వేయడంతో కాలనీవాసులు ఇబ్బందులను హైడ్రాకు విన్నవించారు. దీంతో, కూల్చివేతల సందర్బంగా దాదాపు 40 మంది హైడ్రాధికారులు పాల్గొన్నారు. స్థానిక పోలీసులకు బందోబస్తు సమాచారం ఇచ్చినట్టు తిరుమలేష్ తెలిపారు. బడంగ్పేట్ మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నట్టు తిరుమలేష్ వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అధికారులను అడ్డుకున్న వ్యక్తులపై కేసులు నమోదు చేయనున్నట్లు తెలిపారు. -
హైడ్రాపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపణలు.. రంగనాథ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రాకు ఎవరు ఫిర్యాదు చేసినా అకనాల్జ్మెంట్ ఇస్తున్నట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో వంశీరాం బిల్డర్‌కు చెందిన ప్రపార్టీ విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.అసెంబ్లీ లాబీలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. హైడ్రాకు ఎవరు ఫిర్యాదు చేసినా అకనాల్జ్మెంట్ ఇస్తున్నాం. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి కూడా క్లారిటీ ఇచ్చాం. మ్యాన్ హట్టన్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాం. దీనిపై ఫిర్యాదు ఇస్తే.. తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. వంశీరాం బిల్డర్‌కు చెందిన ప్రపార్టీ విషయం మా దృష్టికి తెచ్చారు. మేము దాన్ని గూగుల్ మ్యాప్ ద్వారా చూస్తే.. అంత క్లారిటీ రావడం లేదు. సర్వే చేసి.. తేడా ఉంటే యాక్షన్ తీసుకుంటాం. ప్రస్తుతం అక్కడ మట్టిని డంప్ చేసినట్లు మా దృష్టికి వచ్చింది.. తీసేయాలని ఆదేశాలు ఇచ్చాం అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. అంతకుముందు.. హైడ్రాపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇటీవల హైడ్రా అక్రమాలను ఏకంగా అసెంబ్లీలోనే ప్రస్తావించారు. కబ్జాలకు పాల్పడుతున్నా పట్టించుకోవడంలేదని వాపోయారు. హైడ్రా నోటీసులు ఇచ్చి లావాదేవీలు నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫోన్ లిఫ్ట్ చేయడు.. ఆయన దగ్గర నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉండదని తెలిపారు. ఎమ్మెల్యేకే స్పందించకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? అని ప్రశ్నించారు. మ్యాన్ హట్టన్ ప్రాజెక్టుపై మరోసారి సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తా అని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. ఖాజాగూడలోని కొత్తకుంటలో వంశీరాం బిల్డర్లు నిర్మాణాల విషయంలో ఇటీవల హైడ్రా తీరుపై ఎమ్మెల్యే అనిరుధ్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. -
పెద్దల జోలికి వెళ్లి చెప్పండి!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో నీటి వనరులు, సర్కార్ భూముల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రా.. పేద, మధ్యతరగతి ప్రజలను మాత్రమే టార్గెట్ చేస్తున్నట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సంపన్నులు, రాజకీయ నేతలు, ఇతర ప్రముఖుల జోలికెళ్లడం లేదని, ఒకసారి వారి నిర్మాణాల్లో నిబంధనలు పాటించారో, లేదో పరిశీలించాలని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సంపన్నులకు హైడ్రా ప్రత్యేక చట్టాన్ని అమలు చేస్తోందా అని నిలదీసింది. పేద, మధ్యతరగతికి చెందిన ఇళ్లను కూల్చి మీడియాలో ఫొటోలు వేయించుకోవడం కాదని.. మియాపూర్, దుర్గం చెరువు సహా పలుచోట్ల సర్కార్ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ప్రముఖుల పరిస్థితి ఏంటని ప్రశ్నించింది. అందరికీ ఒకేలా న్యాయం దక్కినప్పుడే హైడ్రా ప్రజాప్రయోజనాలను పరిరక్షించినట్లు అవుతుందని తేల్చిచెప్పింది. ‘ఒకప్పుడు హైదరాబాద్ అంటే చెరువులు, సరస్సుల నగరంగా పేరు ఉండేది. 2000కుపైగా చెరువులు ఉండగా, ఇప్పుడు 200 కూడా లేవు. చెరువుల రక్షణకు నాడు ప్రత్యేక చట్టాలు అమల్లో ఉండేవి. హైడ్రా ఏర్పాటు బాగానే ఉన్నా.. పనితీరు మాత్రం ఆశాజనకంగా లేదు. పేదలతోపాటు పెద్దలకు చెందిన అక్రమ నిర్మాణాలను కూల్చివేసినప్పుడే నిజమైన సార్థకత చేకూరుతుంది. ఇప్పటి ప్రభుత్వాల కంటే నాడు నిజాం చేపట్టిన చెరువుల పరిరక్షణ చర్యలే పకడ్బందీగా ఉన్నాయి. మీరాలం చెరువు పరిధిలో నిర్మాణాలపై ఉమ్మడి సర్వే చేపట్టి.. ఆక్రమణలు ఉంటే తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలి’అని స్పష్టం చేసింది. ప్రభుత్వానిదా? వక్ఫ్‌దా?రాజేంద్రనగర్ మండలం అత్తాపూర్ సర్వే నంబర్ 329/1, 329/2, 329/3లోని ఆరు ఎకరాల భూమిపై తహసీల్దార్ జారీచేసిన నోటీసులను సవాల్ చేస్తూ ఫాతిమా, మరొకరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. ఈ పిటిషన్‌పై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి బుధవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాద నలు వినిపిస్తూ.. ‘సదరు భూమికి సంబంధించి వక్ఫ్ బోర్డు సీఈవో లేఖ మేరకు తహసీల్దార్ చర్యలు చేపట్టడం చెల్లదు. ఒకవేళ వక్ఫ్‌భూమి అయినా సీఈవో చర్యలు తీసుకోవచ్చు గానీ, నోటీసులు జారీ చేసే అధికారం తహసీల్దార్‌కు లేదు. ఆ నోటీసులను రద్దు చేయాలి’అని కోరారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ‘ఇదే హైకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్య ం మేరకు మీరాలం చెరువు పరిధిలోని ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టాం. అన్ని చర్యలు తీసుకుంటున్నాం’అన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. మీరా లం చెరువుకు సంబంధించి పిటిషనర్ అభ్యంతరాలపై ఉమ్మ డి సర్వే నిర్వహించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. ప్రభుత్వానిదే అని తేలితే చర్యలు చేపట్టాలని, వక్ఫ్ బోర్డుదని తేలితే చర్యలు తీసుకునే బాధ్యతను బోర్డుకు అప్పగించాలని చెప్పారు. నీటి వనరుల ఆక్రమణపై వాల్టా చట్టం కింద చర్యలు తీసుకోవచ్చంటూ విచారణ ముగించారు. -
ప్రణయ్ కేసు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ షాకింగ్ కామెంట్స్
నల్లగొండ, సాక్షి: సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) సంచలన తీర్పు వెలువడింది. ప్రణయ్(24)ను దారుణంగా చంపిన సుభాష్ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది.అయితే ప్రణయ్ హత్య కేసులో విచారణ అధికారిగా ఉన్న అప్పటి అప్పటి నల్గొండ ఎస్పీ, ఐపీఎస్ అధికారి రంగనాథ్ (ప్రస్తుతం హైడ్రా కమిషనర్) కీలక వ్యాఖ్యాలు చేశారు. ప్రణయ్- అమృతల ప్రేమ అంశం టీనేజీ యువతకు గుణ పాఠంలాంటిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. టీనేజీ వయస్సులో పిల్లలు జాగ్రత్తగా ఉండాలని, లేదంటే తీవ్ర పరిణామాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అదే సమయంలో ఈ కేసు దర్యాప్తులో ఎదురైన సవాళ్లు, మారుతీరావు ప్రవర్తన, కేసును ఛేదించిన విధానం గురించి ఆయన వివరించారు. కాంట్రాక్ట్ కిల్లర్లతో హత్య..ప్రణయ్ హత్య సమయంలో నేను నల్లగొండ జిల్లా ఎస్పీగా ఉన్న ఆ సమయంలో ప్రణయ్ హత్యకేసులో మొదటి నుంచి సాక్షలు బలంగా ఉన్నారు. సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయం గెలిచింది. ఈ కేసులో అన్ని కోణాలు ఉన్నాయని, కాంట్రాక్ట్ కిల్లర్లతో హత్య చేయించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నేరస్థులు చాలా తెలివిగా వ్యవహరించారు. కేసు మొదట్లో చాలా గందరగోళంగా ఉంది. మారుతీరావు కూడా తనకు ఏమీ తెలియదనే అన్నారు. చాకచక్యంగా ఛేదించాండీఎస్పీగా శ్రీనివాస్, ఎస్సై వెంకటేశ్వర్‌రెడ్డి, ధనుంజయ్,టాస్క్ ఫోర్స్,కానిస్టేబుల్స్, ఎస్సైలు,రైటర్స్‌తో పబ్లిక్ ప్రాసిక్యూటర్ నరసింహ, సీనియర్ అధికారురు ఐజీ స్టీఫెన్ రవీంద్ర,అప్పటి డీజీ మహేందర్‌రెడ్డిల సూచనలు,సలహాలతో ఈ కేసును చాకచక్యంగా ఛేదించాం. ప్రణయ్ హత్య తర్వాత నిందితులు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తలదాచుకున్నారు. అయినప్పటికీ టెక్నాలజీ, విచారణ సాయంతో నిందితుల్ని కేవలం వారం రోజుల వ్యవధిలో అదుపులోకి తీసుకున్నాం.ముందు లైఫ్‌లో సెటిల్ అవ్వండిప్రణయ్ -అమృత కేసు నేటి తరం బాల్యం నుంచి యవవ్వనంలోకి అడుగు పెట్టే పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఒక గుణపాఠం లాంటింది. టీనేజీ నుంచి యవ్వనంలోకి అడుగుపెట్టే సమయంలో పిల్లలు, వారి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. టీనేజీలోకి అడుగు పెట్టాం కదా అని ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవద్దని, జీవితంలో కొంత పరిణితి సాధించిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ముందు పిల్లలు లైఫ్‌లో స్థిరపడిన తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది.నేటి యువతకు ఓ గుణపాఠం లాంటిందిలేదంటే ప్రణయ్ హత్య కేసుతో ఏం జరిగిందో మనం అందరం చూశాం. బాలస్వామి తన కుమారుణ్ని(ప్రణయ్),అమృత తన తండ్రిని కోల్పోయింది. వాళ్లు తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరూ సంతృప్తిగా లేరు. ఈ కేసు ద్వారా సమాజం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి.అమృతమీద అమితమైన ప్రేమేప్రణయ్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఏ1 గా ఉన్న మారుతిరావు చనిపోవడం బాధాకరం. మారుతి రావుకి కుమార్తె అమృత అంటే అమితమైన ప్రేమ. లేక లేక పుట్టిన సంతానం. అమృత ఫొటోల్ని 15 నుంచి 20 అడుగల మేర ఫ్లెక్సీ కట్టించుకునేంత ప్రేముంది. ఆ ప్రేమే ఇన్ని అనార్ధాలకు దారి తీసింది. మారుతిరావు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ఎవరైతే ప్రణయ్ హత్యకేసులో ఉన్న ఏ4 బారీ సాయంతో రియల్ ఎస్టేట్‌లో సమస్యల నుంచి బయటపడేవారు.అలాగే అమృత విషయంలో అలాగే ఆలోచించారు. డబ్బు, పరపతి ఉండొచ్చేమో.. కానీ పిల్లల టీనేజీ పెంపకం ఎలా ఉండాలనే అంశంలో అవగాహన లేకుండా పోయింది. మన పెంపకంలో ఏదైనా తప్పుంటే దానికి వేరే వాళ్లని బాధ్యుల్ని చేయడం ఎంతవరకు కరెక్ట్ అనే అంశంపై మారుతి రావుతో మాట్లాడాను’ అని అన్నారు.పైకోర్టుకు వెళ్లినా లాభం ఉండదుఇదే కేసులో పైకోర్టులకు వెళ్లినా న్యాయం పరంగా ఎలాంటి మార్పులు ఉండదు. అంత పకడ్బందీగా ఈ కేసులో 1600 పేజీల ఛార్జ్ షీట్ వేశామని, కేసు విచారణ సమయంలో పోలీసులు మేనేజ్ చేశారంటూ కొందరు నిరాధార ఆరోపణలు చేశారని, వాటిని పట్టించుకోకుండా నిజం నిలకడ మీద తెలుస్తుందనే నమ్మకంతో ముందుకు సాగామని రంగనాథ్ ముగించారు. -
చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు!
-
నిజాంపేట రూట్ క్లియర్!
అసలే రద్దీ రహదారులు.. ఆపై ఆక్రమణలు.. వాహనచోదకుల అవస్థలు అన్నీ ఇన్నీకావు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అంతే సంగతులు. అయితే హైడ్రాకు ఫిర్యాదు చేయగా ఏళ్లనాటి ఆక్రమణలు మాయమయ్యాయి. వాహనచోదకుల కష్టాలు తీరాయి. మొత్తానికి నిజాంపేట (Nizampet)రూట్ క్లియర్ అయింది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) మంగళవారం నిజాంపేటలోని బాలాజీ హిల్స్, ఇందిరమ్మ కాలనీ (Indiramma Colony) ప్రధాన రహదారుల ఆక్రమణలను తొలగించింది. రోడ్లను ఆక్రమిస్తూ నిర్మించిన అపార్ట్మెంట్ ర్యాంపులు, మొక్కల కోసం నిర్మాణాలు, ఫెన్సింగ్లతోపాటు పైఅంతస్తులకు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న ఇనుప మెట్లతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని వాహనదారులు, ఆయా కాలనీవాసులు చేసిన ఫిర్యాదులకు హైడ్రా స్పందించింది.ఇందిరమ్మ కాలనీలో రహదారిని పలువురు ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేయడంతోపాటు అదనపు గదులు నిర్మించుకున్నారని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఈ కారణంగా వెంకటరాయనగర్, బాలాజీ కాలనీ, కేఎన్ఆర్ కాలనీ, కొలను తులసిరెడ్డి (కేటీఆర్) కాలనీసహా ఎనిమిది కాలనీలకు రాకపోకలు సాగించే వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. దీనిపై విచారణ చేసిన హైడ్రా అధికారులు ఆయా ఆక్రమణలను తొలగించాలని యజమానులకు రెండు నెలలు గడువు ఇచ్చారు. అయినప్పటికీ పరిస్థితి మారకపోవడంతో మంగళవారం నిజాంపేట మున్సిపల్ అధికారులతో కలిసి కూల్చివేతలు చేపట్టారు. పలుచోట్ల రహదారి ఆక్రమణల్ని తొలగించారు. దాదాపు కిలోమీటరుకుపైగా ఉన్న ఆక్రమణలు కూల్చేశారు. కూల్చివేతలతో ఉద్రిక్తత నిజాంపేట్ ఇందిరమ్మ ఫేజ్ –2 కాలనీలో మంగళవారం హైడ్రా చేపట్టిన కూల్చివేతలు ఉద్రిక్తంగా మారాయి. పలువురు స్థానికులు అధికారులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తమ ఇళ్ల ముందున్న నిర్మాణాలను ఎందుకు కూలుస్తున్నారని ప్రశ్నించారు. చిన్న, చిన్న నివాసాలతోపాటు, వ్యాపారాలు చేసుకునే తమ నిర్మాణాల్లో ఉన్న సామాన్లు సైతం తరలించేందుకు సమయం ఇవ్వలేదని ఆరోపించారు. లక్షలాది రూపాయల సామాన్లు పాడయ్యాయని కన్నీరుమున్నీరయ్యారు. ప్రభుత్వం తమపై ఎందుకు కక్ష కట్టిందని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంచి చేస్తుందని కాంగ్రెస్‌కు ఓటు వేస్తే తమ కుటుంబాలనే ఛిన్నాభిన్నం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.రెండున్నరేళ్లుగా పోరాడుతున్నాంఈ రహదారుల ఆక్రమణలపై దాదాపు రెండున్నర ఏళ్లుగా పోరాడుతున్నాం. ఆక్రమణలను తొలగించాలని కోర్టు తీర్పు కూడా ఉంది. మున్సిపాలిటీ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాం. అయినా ప్రయోజనం లేకపోయింది. హైడ్రాను ఆశ్రయించిన వెంటనే విచారణ చేపట్టి రెండు నెలల క్రితం సంబంధీకులకు నోటీసులు ఇచ్చారు. ఎవరూ స్పందించకపోవడంతో హైడ్రా కూల్చేసింది. – చిరంజీవి, బాలాజీ హిల్స్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఏళ్లుగా అవస్థలు పడుతున్నాం ఈ ఆక్రమణల కారణంగా చాలా ఏళ్లుగా అవస్థలు పడుతున్నాం. వాటర్ ట్యాంకర్లు కూడా ఈ మార్గంలో వచ్చే పరిస్థితి లేదు. స్కూల్ వ్యాన్లు వచ్చే అవకాశం కూడా లేకపోవడంతో పిల్లలు నడుచుకుంటూ పాఠశాలలకు వెళ్తున్నారు. హైడ్రా అధికారులు స్పందించి ఆక్రమణలు తొలగించారు. – విజయ్, బాలాజీ హిల్స్ కాలనీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి చదవండి: ఇక RRR వరకు హైదరాబాద్ నగరమే! -
అమీన్పూర్లో దందాలు.. హైడ్రా కమిషనర్ ఆగ్రహం
హైదరాబాద్: నగరంలో ఆక్రమణలపై ఇప్పటికే హైడ్రా కొరడా ఝుళిపిస్తూ వస్తోంది. ఆక్రమణలకు పాల్పడిన కట్టడాలని కూల్చివేసే ప్రక్రియను గత కొన్ని నెలల క్రితమే హైడ్రా ఆరంభించింది. అయితే హైడ్రా జేఏసీ పేరుతో పలువురు దందాలు చేస్తున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. పలువురు జేఏసీ ఏర్పాటు పేరుతో దందాలు చేస్తూ బిల్డింగ్ నిర్మాణదారుల నుంచి డబ్బులు పిండుకునే వ్యవహారానికి శ్రీకారం చుట్టారు. ప్రధానంగా అమీన్ పూర్ పెద్ద చెరువులో దందాలు నిర్వహిస్తున్నట్లు హైడ్రా దృష్టికి వచ్చింది. దీనిపై హైడ్రాకు ఫిర్యాదులు రావడంతో కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా దందాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. -
చట్టాన్ని ధిక్కరిస్తే హైడ్రాను రద్దు చేస్తాం: హైకోర్టు
-
చట్టాన్ని ధిక్కరిస్తే.. హైడ్రాను రద్దు చేస్తాం
సాక్షి, హైదరాబాద్: ఎన్నిసార్లు చెప్పినా.. చట్టాన్ని ధిక్కరించి మీ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)ని రద్దు చేస్తూ ఆదేశాలు ఇవ్వాల్సివస్తుందని హైకోర్టు తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ‘ఎందుకంత తొందర.. రాత్రికి రాత్రే హైదరాబాద్ నగరాన్ని మార్చలేరు. ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలి తప్ప ఇష్టం వచ్చినట్లు కాదు’అని హైడ్రా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు పాటించకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని పేర్కొంది. హైడ్రా ఏకపక్ష చర్యలను తప్పుబట్టింది. ‘సరైన విచారణ నిర్వహించకుండా వారాంతాల్లో కూల్చివేతలకు పాల్పడుతున్నారు. ఓసారి తెల్లవారుజామున 4 గంటలకు ప్రహరీ కూల్చివేశారు. దోపిడీ దొంగలు మాత్రమే అలా వ్యవహరిస్తారు.. అధికారులు అలా చేయరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆక్రమణల స్వాధీనానికి, అనుమతి లేని భవనాల కూల్చివేతకు మేం ఏ మాత్రం వ్యతిరేకం కాదు. కానీ, ప్రతి దానికీ ఓ చట్టం అంటూ ఉంటుంది. దాన్ని ప్రతీ వ్యక్తి పాటించి తీరాల్సిందే’అని తేల్చిచెప్పింది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి సర్వే నంబర్ 296/ఇ/2 మూడు గుంటల భూమిలోని షెడ్‌ను ఎలాంటి సమాచారం లేకుండా (ఆదివారం) కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ ప్రవీణ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ గురువారం మరోసారి విచారణ చేపట్టారు. హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ కోర్టు ఎదుట హాజరుకావాలన్న ఆదేశాల మేరకు ఆయన న్యాయస్థానం ముందు హాజరయ్యారు.ఇకపై జరగదంటూనే.. మళ్లీ అదే తప్పుపిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... ‘పార్కు స్థలంలో నిర్మాణాలు చేపడుతున్నారని గాయత్రి మెంబర్స్ అసోసియేషన్ ఇచ్చిన వినతిపత్రంపై హైడ్రా నోటీసులు జారీ చేసింది. నాలా, సేల్ డీడ్, పంచాయతీ అనుమతులు ఇలా అన్ని డ్యాక్యుమెంట్లను ప్రవీణ్ సమర్పించారు. అయినా పట్టించుకోకుండా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సెలవు రోజున కూల్చివేశారు’అని చెప్పారు. హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ రవీందర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘పంచాయతీ కార్యదర్శి బలవంతంగా అనుమతులు మంజూరు చేశారు. ఆ తర్వాత వాటిని రద్దు చేశారు. సెలవు రోజు కూల్చివేతలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం’అని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ‘ప్రతీసారి ఇలా జరగకుండా చూసుకుంటామంటూనే మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. గతంలో హైకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలనూ లెక్కచేయకుండా, చట్టాన్ని పాటించకుండా వ్యవహరిస్తే హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 99ను రద్దు చేస్తాం. హైడ్రా తప్పులకు ఓ రిజిస్ట్రర్ నిర్వహించాల్సిన పరిస్థితి కూడా రావొచ్చు. నిర్మాణ అనుమతి రద్దు ఉత్తర్వులను కోర్టు ముందు ఎందుకు ఉంచలేదు? సదరు పంచాయతీ అధికారిపై చర్యలు తీసుకున్నారా? హైడ్రా తీరు ఆక్షేపణీయం. నీటి వనరులు, రహదారులు, ప్రభుత్వ భూముల రక్షణకు మేం వ్యతిరేకం కాదు. కానీ, చర్యలు చట్టబద్ధమై ఉండాలన్నదే మా ఉద్దేశం’అని వ్యాఖ్యానించారు. గతంలో ఇచ్చిన స్టేటస్కో ఆదేశాలను పొడిగిస్తూ, తదుపరి విచారణ వరకు ఎటువంటి నిర్మాణ కార్యకలాపాలు కొనసాగించకూడదని ఆదేశించారు. ప్రతివాదులకు వ్యక్తిగత నోటీసులతో సహా నోటీసులు జారీ చేయాలంటూ తదుపరి విచారణను మార్చి 5కు వాయిదా వేశారు. -
Hydra: జగద్గిరిగుట్టలో హైడ్రా కూల్చివేతలు
-
హైడ్రా దూకుడు.. జగద్గిరిగుట్టలో కూల్చివేతలు
సాక్షి, హైదరాబాద్: నగరంలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జగద్గిరిగుట్టలోని భూదేవిహిల్స్ సమీపంలోని పరికి చెరువు వద్ద ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. గాజులరామారంలోని మహదేవపురం ప్రాంతంలోని కొన్ని బేస్మెంట్లను కూడా కూల్చివేశారు. గత వారం చెరువు పరిరక్షణ సమితి సభ్యులు హైడ్రాకు ఫిర్యాదు చేసిన క్రమంలో టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీగా మోహరించారు.కాగా, నగర శివార్లలో ఫాం ల్యాండ్ ప్లాట్ల పేరిట అక్రమ లేఔట్ల అమ్మకాలు జరుగుతున్నాయని, అనుమతి లేని వాటిలో ప్లాట్లు ఖరీదు చేసి ఇబ్బందులు పడొద్దని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) సోమవారం హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఫార్మ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని తమకు ఫిర్యాదులు వచ్చాయని స్పష్టం చేసింది.రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం లక్ష్మీగూడ గ్రామంలోని సర్వే నం.50లోని 1.02 ఎకరాల్లో ఫాం ప్లాట్ల పేరిట లే ఔట్ వేసి అమ్మేస్తున్నారని ప్రజావాణి ద్వారా హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నగర ప్రజలను అప్రమత్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ మున్సిపల్ యాక్ట్–2019, తెలంగాణ పంచాయత్ రాజ్ యాక్ట్–2018 ప్రకారం ఎక్కడా ఫాం ల్యాండ్ ప్లాట్లుగా అమ్మడానికి వీలులేదని ఆయన పేర్కొన్నారు.ఫాం ల్యాండ్ అంటే కనీసం 2 వేల చదరపు మీటర్లు, లేదా 20 గుంటల స్థలం ఉండాలని ప్రభుత్వం గతంలోనే నిర్దేశించిందని వివరించారు. ఈ మేరకు ఫాం ప్లాట్లురిజిస్ట్రేషన్లు చేయరాదని స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖకు ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు కూడా ఇచి్చందని రంగనాథ్ తెలిపారు. జీవో నం.131 ప్రకారం 2020 ఆగస్టు 31 తర్వాత వెలసిన అక్రమ లేఔట్లలోని ప్లాట్లలో ఇల్లు నిరి్మంచడానికి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం గుర్తించాలని కోరారు. -
బతుకమ్మ కుంట.. బతికెనంట!
సాక్షి, హైదరాబాద్: అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట బతుకుతోంది. కబ్జా చెర వీడటంతో దీని అభివృద్ధిపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) దృష్టి పెట్టింది. ఇళ్లను కూల్చకుండా, ఉన్న కుంటపైనే దృష్టి పెట్టింది. తొలుత చెత్త, మొక్కల్ని తొలగించిన అధికారులు.. తాజాగా చెరువులో పూడికతీత మొదలెట్టారు. మంగళవారం జేసీబీలు కేవలం అడుగున్నర తవ్వగా.. లోపల నుంచి నీళ్లు ఉబికివచ్చాయి. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు హర్షం వ్యక్తం చేస్తూ కుంట అభివృద్ధిలో తమ వంతు సహకారాన్ని అందించడానికి ముందుకు వచ్చారు. ఇది బతుకమ్మ కుంట కాదు ప్రైవేట్ స్థలం అంటూ వాదించిన వాళ్లు ఇప్పుడేమంటారంటూ ప్రశి్నస్తున్నారు. కబ్జాల చెరలో చిక్కిపోయి, ఆనవాళ్లను కోల్పోయిన బతుకమ్మ కుంటకు ప్రాణం పోయాలని కోరుతూ గతంలో అంబర్‌పేటకు చెందిన స్థానికులు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా రంగంలోకి దిగిన ఆయన క్షేత్రస్థాయిలో పర్యటన జరిపి వాస్తవాలు నిర్ధారించారు. బతుకమ్మకుంట స్థలం తనదంటూ స్థానిక నాయకుడు ఎడ్ల సుధాకర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఎలాంటి ఆదేశాలు జారీ చేయ ని న్యాయస్థానం కింది కోర్టుకు వెళ్లాలని సూ చించింది. దీంతో హైడ్రా తన అభివృద్ధి పనులు కొనసాగిస్తోంది. బతుకమ్మ కుంటలో ఉన్న పైపులైన్ పగిలి నీళ్లు వచ్చాయంటూ సోషల్ మీడియాలో వదంతులు వెల్లువెత్తాయి. ఆ ప్రాంతంలో ఎలాంటి పైపులైన్లు లేవని జలమండలి అధికారులు స్పష్టం చేసినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. పదహారు నుంచి ఐదెకరాలకు తగ్గిన కుంట.. అంబర్‌పేటలోని బతుకమ్మ కుంటను పునరుద్ధరించి, పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించిన హైడ్రా అధికారులు దాని పూర్వాపరాలు అధ్యయనం చేశారు. 1962–63 నాటి రికార్డుల ప్రకారం సర్వే నం.563లో 14.06 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట విస్తరించి ఉండేది. ఫుల్ట్యాంక్ లెవల్, బఫర్ జోన్లతో కలిపి దీని వైశాల్యం 16.13 ఎకరాలు ఉండేదని అధికారులు తేల్చారు. తాజా సర్వే ప్రకారం అక్కడ కేవలం 5.15 ఎకరాల భూమి మాత్రమే మిగిలినట్లు తేలింది. దీంతో ఈ మేరకు మాత్రమే కుంటను పునరుద్ధరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయించారు. ⇒ ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న వారిని ఖాళీ చేయించకుండా, ఎలాంటి ఇబ్బందులూ రాకుండా చెరువు తవ్వకాలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకుని హైడ్రాకు సహకరించారు. ఒకప్పటి ఎర్రకుంటనే బతుకమ్మకుంటగా మారిందని, రెవెన్యూ రికార్డులూ అదే చెబుతున్నాయని స్థానికులు హైడ్రా దృష్టికి తెచ్చారు. ఏళ్లుగా నిర్మాణ వ్యర్థాలు, చెత్తతో నిండిపోయిన బతుకమ్మ కుంటను పునరుద్ధరించే చర్యల్ని హైడ్రా చేపట్టింది. బతుకమ్మ కుంట చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టాలని, అందులో స్వచ్ఛమైన నీళ్లు నిలిచేలా చేయడం ద్వారా పర్యావరణం పరిరక్షణ, భూగర్భ జలా ల పెరుగుదలతో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.మరో ఐదు చెరువుల్లోనూ.. హైడ్రా అధికారులు బతుకమ్మ కుంటతో పాటు మరో ఐదు చెరువుల పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టారు. కూకట్పల్లి, ఉప్పల్ నల్ల చెరువులు, పాతబస్తీలోని బుమ్రక్ దౌలా చెరువు, మాదాపూర్‌లోని తమ్మిడికుంట, సున్నం చెరువుల్లోనూ అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. తొలి దశలో వీటిలోని నీళ్లు తొలగిస్తామని, ఆపై కాలుష్యాన్ని శుద్ధి చేసి, చెరువుకు పునరుజ్జీవం కలి్పస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులకు అవసరమైన నిధుల్ని హెచ్ఏండీఏ అందిస్తున్నట్లు ఆయన వివరించారు. ఆయా చెరువుల అభివృద్ధిని వచ్చే జూన్ మాసం కల్లా పూర్తి చేయనున్నారు. -
ఫాం ల్యాండ్ ప్లాట్ల పేరుతో అక్రమ లేఔట్లు
సాక్షి, హైదరాబాద్: నగర శివార్లలో ఫాం ల్యాండ్ ప్లాట్ల పేరిట అక్రమ లేఔట్ల అమ్మకాలు జరుగుతున్నాయని, అనుమతి లేని వాటిలో ప్లాట్లు ఖరీదు చేసి ఇబ్బందులు పడొద్దని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) సోమవారం హెచ్చరించింది. ఫార్మ్ ప్లాట్ల రిజి్రస్టేషన్లపై నిషేధం ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు జరుగుతున్నాయని తమకు ఫిర్యాదులు వచ్చాయని స్పష్టం చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం లక్ష్మీగూడ గ్రామంలోని సర్వే నం.50లోని 1.02 ఎకరాల్లో ఫాం ప్లాట్ల పేరిట లే ఔట్ వేసి అమ్మేస్తున్నారని సోమవారం నాటి ప్రజావాణి ద్వారా హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నగర ప్రజలను అప్రమత్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ మున్సిపల్ యాక్ట్–2019, తెలంగాణ పంచాయత్ రాజ్ యాక్ట్–2018 ప్రకారం ఎక్కడా ఫాం ల్యాండ్ ప్లాట్లుగా అమ్మడానికి వీలులేదని ఆయన పేర్కొన్నారు. ఫాం ల్యాండ్ అంటే కనీసం 2 వేల చదరపు మీటర్లు, లేదా 20 గుంటల స్థలం ఉండాలని ప్రభుత్వం గతంలోనే నిర్దేశించిందని వివరించారు. ఈ మేరకు ఫాం ప్లాట్లు రిజిస్ట్రేషన్లు చేయరాదని స్టాంపులు, రిజి్రస్టేషన్ల శాఖకు ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు కూడా ఇచి్చందని రంగనాథ్ తెలిపారు. జీవో నం.131 ప్రకారం 2020 ఆగస్టు 31 తర్వాత వెలసిన అక్రమ లేఔట్లలోని ప్లాట్లలో ఇల్లు నిరి్మంచడానికి ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం గుర్తించాలని కోరారు. ప్రజావాణిలో 64 ఫిర్యాదులు... సోమవారం హైడ్రా ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో మొత్తం 64 ఫిర్యాదులు అందాయి. తమ కాలనీలకు వెళ్లేందుకు వీలు లేకుండా కొందరు చుట్టూ ప్రహరీలు నిర్మించుకుంటున్నారని, నాలాలు కబ్జా చేసి వరదనీరు వెళ్లడానికి వీలు లేకుండా చేస్తున్నారనే అంశాల పైనే ఎక్కువ ఫిర్యాదులు ఉన్నాయి. రహదారులకు అడ్డంగా నిర్మాణాలు, ప్రహరీలు నిర్మించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన వాటిని తొలగించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ అధికారులకు సూచించారు. మేడ్చల్ జిల్లా కాచవాని సింగారం గ్రామంలోని సర్వే నం.54లో ఉన్న లేఔట్‌లోని భాగ్యనగర్ నందనవనం పార్కును కబ్జా చేశారంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. దేవరయాంజల్లో సర్వే నం.452, 453లో 3.39 ఎకరాలలో లే ఔట్ వేసి ప్రహరీ నిర్మించడంతో తమకు దారి లేకుండా పోయిందని ఆ ప్రాంత నివాసితులు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లోని రాక్‌గార్డెన్స్ అంటూ లే ఔట్లో పేర్కొన్న ప్రాంతంలో ప్రస్తుతం ఫిల్మ్‌నగర్ కల్చరల్ క్లబ్ పేరిట వ్యాపారం చేస్తున్నారని స్థానికుడు హైడ్రా దృష్టికి తీసుకువెళ్లారు. కాప్రా మున్సిపాలిటీలోని కుషాయిగూడ విలేజ్‌లో సర్వే నం. 177లో ఉన్న పార్కు స్థలాన్ని కబ్జా చేసి ప్లాట్లుగా అమ్మేశారని, ఆ పార్కు స్థలాన్ని పక్కనే ఉన్న తమ లేఔట్లో చూపిస్తున్నారని çపలువురు ఫిర్యాదు చేశారు. కబ్జా చేయడమే కాకుండా అక్కడ కల్లు కాంపౌండ్ ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. -
కోహెడలో హైడ్రా పంజా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఆదివారం పంజా విసిరింది. అక్కడి అనేక ప్రాంతాల్లో వెలసిన అక్రమ కట్టడాలను అధికారులు కూల్చేశారు. సర్వే నంబర్ 951, 952ల్లోని గ్రామపంచాయతీ లేఔట్లో తమ ప్లాట్లను సమ్మిరెడ్డి బాల్‌రెడ్డి అనే వ్యక్తి ఆక్రమించారని, రహదారులు లేకుండా అడ్డుగోడలుగా కట్టారని రాధే ధామం లే ఔట్ ప్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో పాటు పలువురు ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా అధికారులు పలు పత్రాలను పరిశీలించారు. 1986లో భూ యజమానులు కె.రాములు, పెద్దయ్య, ఈసయ్య గ్రామ పంచాయతీ లేఔట్ వేసినట్టు నిర్ధారించారు. సమ్మిరెడ్డి బాల్‌రెడ్డి ఆ భూమిని స్వా«దీనం చేసుకుని, ఫాం హౌస్ నిర్మించడంతో పాటు లే ఔట్లోని పలు ప్లాట్లను సొంతం చేసుకుంటూ అంతర్గత రహదారులను బ్లాక్ చేసినట్టు వెల్లడైంది. దీంతో అన్ని పత్రాలతో తమ కార్యాలయంలో హాజరు కావాలని ఇరుపక్షాలకు హైడ్రా నోటీసులు జారీ చేసింది. శనివారం వారు హాజరు కాగా రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో క్షుణ్ణంగా పరిశీలించింది. ఫామ్‌హౌస్, షెడ్, కాంపౌండ్ వాల్, ఫెన్సింగ్ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవంటూ తుర్కయాంజాల్ మున్సిపల్ అధికారుల స్పష్టం చేశారు. ప్లాట్లను తమకు అమ్మిన తర్వాత సమ్మిరెడ్డి ఈ భూమిని తాను కొన్నట్టు రికార్డులు సృష్టించారని ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధుల ఆరోపించారు. హైడ్రా ఇరుపక్షాలతో పాటు రెవెన్యూ, మున్సిపల్ అధికారులను విచారించి సమ్మిరెడ్డి బాల్‌రెడ్డి నిరి్మంచిన ఫాంహౌస్‌తో పాటు ప్రహరీ, ఫెన్సింగ్ కూల్చివేతకు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు ఆదివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య అక్రమ కట్టడాలను కూల్చేశారు. ఈ సందర్భంగా సుమారు 170 ప్లాట్లకు కబ్జాదారుల నుంచి అధికారులు విముక్తి కల్పించారు. వీటిలో పార్కులు, క్రీడా స్థలాలు ఉన్నాయి. -
హైడ్రాపై తెలంగాణ హైకోర్టు సీరియస్
-
ఎన్నిసార్లు చెప్పినా మారరా?
సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? అక్రమ నిర్మాణమని శుక్రవారం నోటీసులిచ్చి.. శనివారం హాజరుకు ఆదేశాలిచ్చి.. ఆదివారం కూల్చివేస్తారా? అంత తొందరేముంది? కూల్చి వేతలు చేపట్టే ముందు సహేతుక సమయం ఇవ్వాలి కదా?’ అని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ గ్రామంలోని తన ఆస్తుల కూల్చివేతను సవాల్ చేస్తూ సామ్రెడ్డి బాల్‌రెడ్డి హైకోర్టులో ఆదివారం హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా నోటీసులు చట్టవిరుద్ధమని, వాటిని రద్దు చేస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్‌కు న్యాయమైన అవకాశం ఇవ్వకుండా తదుపరి చర్యలు తీసుకోవద్దని హైడ్రాను ఆదేశించారు. అవసరమైన పత్రాలు సమర్పించడానికి పిటిషనర్‌కు ఒక వారం సమయం ఇచ్చారు. ముఖ్యంగా సెలవు దినాల్లో కూల్చివేతలు చేపట్టవద్దని, కాదని చేపడితే కఠిన చర్యలు ఉంటాయని హైడ్రాను హెచ్చరించారు. ఒక్కరోజులో పత్రాలు సమర్పించటం ఎలా సాధ్యం?..: తన ఆస్తులకు సంబంధించిన పత్రాలు సమర్పించేందుకు హైడ్రా ఒక్క రోజే సమయం ఇచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ‘అక్రమ నిర్మాణమని శుక్రవారం అధికారులు నోటీసులు జారీ చేశారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని శనివారం సమయం ఇచ్చారు. ఆ వెంటనే ఆదివారం కూల్చివేత ప్రక్రియ చేపట్టారు. టైటిల్ లింక్ పత్రాలు, పట్టాదార్ పాస్‌బుక్, ఇతర అన్ని డాక్యుమెంట్లతో రావాలని ఆదేశించిన అధికారులు.. ఒక్క రోజే సమయం ఇచ్చారు. అధికారుల తీరు చట్టవిరుద్ధం. నోటీసులను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వండి’ అని కోరారు. దీంతో హైడ్రా తీరుపై అసహనం వ్యక్తంచేసిన ధర్మాసనం.. వారంలోగా అధికారులకు డాక్యుమెంట్లు అందజేయాలని ఆదేశించింది. వాటిని పరిశీలించి చట్టప్రకారం చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిస్తూ విచారణను వాయిదా వేసింది. -
హైదరాబాద్‌లో మరోసారి హైడ్రా భారీ కూల్చివేతలు.. ఈసారి ఎక్కడంటే?
సాక్షి,హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది.తమ ప్లాట్లలో ఫామ్‌హౌస్ కట్టారని, తమకు న్యాయం చేయాలని కోరుతూ వందల మంది బాధితులు హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను ఆశ్రయించారు. దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ బాధితుల సమస్యల్ని విన్నారు. బుల్డోజర్లతో రంగంలోకి దిగారు. అక్రమ నిర్మాణాల్ని తొలగించేస్తున్నారు.తాజాగా, రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ కోహెడలో హైడ్రా భారీ కూల్చివేతలకు శ్రీకారం చుట్టింది. కోహెడ సర్వే నెంబర్ 951, 952లో 7.28 గుంటల భూమిని రియల్టర్ సంరెడ్డి బాల్‌రెడ్డి కబ్జా చేశాడు. కబ్జా చేసిన ప్లాట్లలో ఫాం హౌస్ నిర్మించాడు. దీంతో 170 మంది ప్లాట్ల యజమానులు హైడ్రాను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చి వేతలకు ఉపక్రమించింది.రంగనాథ్ వార్నింగ్మొన్నటికి మొన్న శంషాబాద్ మున్సిపాలిటీలో శుక్రవారం(ఫిబ్రవరి7) హైడ్రా కొరడా ఝలిపించింది. రోడ్డుపై అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన 39 హోర్డింగ్‌లను తొలగించింది. హోర్డింగ్‌లు ఏర్పాటు చేసిన యజమానులపై చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవలే హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సంపత్ నగర్, ఊట్పల్లిలో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను, అలాగే రోడ్లపై అడ్డుగా కట్టిన నిర్మాణాలను తొలగించింది.సంపత్ నగర్లో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి కొందరు అక్రమ కట్టడాలను నిర్మించారు. అలాగే ఊట్పల్లిలో రోడ్డుకు అడ్డంగా ఓ గేటును ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరికొన్ని నిర్మాణాలను తొలగించే చర్యలు చేపట్టింది. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్క్ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది.ఈ క్రమంలో శంషాబాద్ మున్సిపాలిటీని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. శంషాబాద్ మున్సిపాలిటీలో చెరువులు కుంటలు కూడా కబ్జా అయినట్లు తన దృష్టికి వచ్చిందని వాటి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
శంషాబాద్‌లో మళ్లీ ‘హైడ్రా’ కొరడా.. కమిషనర్ వార్నింగ్
సాక్షి,శంషాబాద్:శంషాబాద్ మున్సిపాలిటీలో శుక్రవారం(ఫిబ్రవరి7) హైడ్రా కొరడా ఝలిపించింది. రోడ్డుపై అనుమతులు లేకుండా ఏర్పాటుచేసిన 39 హోర్డింగ్‌లను తొలగించింది. హోర్డింగ్‌లు ఏర్పాటు చేసిన యజమానులపై చర్యలు తీసుకుంటామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.ఈ క్రమంలో శంషాబాద్ మున్సిపాలిటీని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సందర్శించారు. శంషాబాద్ మున్సిపాలిటీలో చెరువులు కుంటలు కూడా కబ్జా అయినట్లు తన దృష్టికి వచ్చిందని వాటి పైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఇటీవలే హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సంపత్ నగర్, ఊట్పల్లిలో అక్రమ కట్టడాలను కూల్చేస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి కట్టిన నిర్మాణాలను, అలాగే రోడ్లపై అడ్డుగా కట్టిన నిర్మాణాలను తొలగించింది.సంపత్ నగర్లో ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసి కొందరు అక్రమ కట్టడాలను నిర్మించారు. అలాగే ఊట్పల్లిలో రోడ్డుకు అడ్డంగా ఓ గేటును ఏర్పాటు చేశారు. వీటితో పాటు మరికొన్ని నిర్మాణాలను తొలగించే చర్యలు చేపట్టింది. ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులు, పార్క్ స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని ఈ సందర్భంగా హైడ్రా హెచ్చరికలు జారీ చేసింది. -
హైడ్రా కమిషనర్ రంగనాథ్ సుప్రీంకోర్టు లాయర్ ముఖీం వాగ్వాదం
-
శంషాబాద్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
-
పటాన్చెరులో హైడ్రా కూల్చివేతలు.. బోర్డులు ఏర్పాటు!
సాక్షి, సంగారెడ్డి: తెలంగాణలో హైడ్రా(HYDRA) కూల్చివేతల పర్వం కొనసాగుతోంది. అక్రమ నిర్మాణాలపై హైడ్రా మరోసారి కొరడా ఝలిపించింది. తాజాగా ముత్తంగిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. పార్క్ స్థలంలో ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. శుక్రవారం ఉదయమే అక్కడికి చేరుకున్న హైడ్రా అధికారులు, పోలీసులు.. అక్రమ నిర్మాణాలను తొలగించారు. పోలీసుల బందోబస్తు మధ్య అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు.తెలంగాణలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే శుక్రవారం ఉదయం సంగారెడ్డి(Sanga Reddy) జిల్లా పటాన్చెరు(Patancheru) మండలం ముత్తంగి గ్రామంలో 296 సర్వే నంబర్లలో ఉన్న గాయత్రి వెంచర్ పార్క్ స్థలంలో నిర్మించిన షెడ్డును హైడ్రా అధికారులు కూల్చివేశారు. ముందుస్తు సమాచారం మేరకు రంగంలోకి దిగిన అధికారులు పూర్తి ఆధారాలతో కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. అక్కడ అధికారులు, పోలీసుల పర్యవేక్షణలో కూల్చివేతలు జరుగుతున్నాయి.ఇదిలా ఉండగా.. తెలంగాణలో చెరువు భూములు, ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తీసుకొచ్చిన హైడ్రా ఇప్పటికే కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూములను రక్షించింది. ఈ క్రమంలో పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. మూడు రోజుల క్రితమే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా మరోసారి పంజా విసిరింది. అమీన్పూర్ చెరువులో ఏపీకి చెందిన నేత అక్రమ నిర్మాణాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేసినట్లు హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీనిపై విచారణ జరిపిన హైడ్రా అక్రమాలు జరిగింది నిజమేనని నిర్ధారించుకుని కూల్చివేతలకు దిగింది. గతంలోనూ అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అయితే ఇక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో కూల్చివేతలు కొనసాగించాలని నిర్ణయించింది.స్వాధీన స్థలాల్లో హైడ్రా బోర్డులుప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, పార్కుల స్థలాల ఆక్రమణలను తేల్చి కూల్చేసిన స్థలాల్లో ‘ప్రొటెక్టెడ్ బై హైడ్రా’ అని బోర్డులు పెట్టాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న స్థలాల్లో ప్రభుత్వ స్థలం అని ఏర్పాటుచేసిన బోర్డులను తొలగించి ఆక్రమిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, దీంతో హైడ్రా ప్రొటెక్షన్‌లో ఉన్నట్టుగా బోర్డులు పెట్టాలని సూచించారు. -
మళ్లీ అమీన్పూర్లో ‘హైడ్రా’ కూల్చివేతలు
సాక్షి,హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో హైడ్రా మరోసారి పంజా విసిరింది. ఇక్కడ హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. అమీన్పూర్ చెరువులో ఏపీకి చెందిన నేత అక్రమ నిర్మాణాన్ని హైడ్రా సిబ్బంది కూల్చివేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చెరువును కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేసినట్లు హైడ్రాకు ఫిర్యాదులందాయి. దీనిపై విచారణ జరిపిన హైడ్రా అక్రమాలు జరిగింది నిజమేనని నిర్ధారించుకుని కూల్చివేతలకు దిగింది. గతంలోనూ అమీన్పూర్ మునిసిపాలిటీ పరిధిలో హైడ్రా పలు అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. అయితే ఇక్కడ ఉన్న అక్రమ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వెల్లువెత్తుతుండడంతో కూల్చివేతలు కొనసాగించాలని నిర్ణయించింది. అక్రమ నిర్మాణాలను తొలగించాల్సిందేనని హైడ్రాకు ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. -
పోచారంలో కూల్చివేతలపై స్పందించిన హైడ్రా కమిషనర్
సాక్షి, హైదరాబాద్: పోచారంలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ (Hydra Commissioner) స్పందించారు. భద్రత పేరిట 200 ఎకరాల చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టారని.. అన్ని విషయాల్లో నిబంధనలు ఉల్లంఘించారని రంగనాథ్ తెలిపారు. పదుల ఎకరాల్లో ప్రభుత్వ భూమిని లాక్కొని.. ఎన్ఎంఆర్ సంస్థ కాంపౌండ్ వాల్ కట్టింది. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగుతోందన్నారు.కాగా, ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలో కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పలు కాలనీలకు, నివాస ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా నిర్మించిన దివ్యనగర్ లే అవుట్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడను అధికారులు తొలగిస్తున్నారు. పోచారం మున్సిపాలిటీలో ఉన్న దివ్య లే అవుట్ మొత్తం విస్తీర్ణం 200 ఎకరాల వరకూ ఉంటుంది. ఇందులో మొత్తం 2218 ప్లాట్లు వేశారు. ఈ ప్లాట్లలో 30 శాతం నల్ల మల్లారెడ్డివేనంటూ ఆరోపణలు ఉన్నాయి.ఇక, దివ్యనగర్ లే అవుట్ చుట్టూ ఉన్న ప్రహరీ కూల్చివేతతో మార్గం సుగమం అయిన కాలనీలు.. ఏకశిలా లే ఔట్, వెంకటాద్రి టౌన్షిప్, సుప్రభాత్ వెంచర్ -1 , మహేశ్వరి కాలనీ, కచ్చవాణి సింగారం, ఏకశిలా - పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీనగర్, సుప్రభాత్ వెంచర్ -4 , వీజీహెచ్ కాలనీ, ప్రతాప్ సింగారం రోడ్డు, సుప్రభాత్ వెంచర్ -2, 3, సాయిప్రియ, మేడిపల్లి, పర్వతపురం, చెన్నారెడ్డి కాలనీ, హిల్స్ వ్యూ కాలనీ, ముత్తెల్లిగూడగా ఉన్నాయి.ఇదీ చదవండి: తెలంగాణలో మరో సంచలనం.. ఇంద్రసేనా రెడ్డి ఫోన్ ట్యాప్! -
మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలో హైడ్రా కూల్చివేతలు
-
HYDRA: ఘట్కేసర్లో హైడ్రా కూల్చివేతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరోసారి అక్రమ నిర్మాణాలను హైడ్రా(Hydra) కూల్చివేస్తోంది. తాజాగా ఘట్కేసర్లో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి నిర్మించిన నాలుగు కిలోమీటర్ల గోడను అధికారులు కూల్చివేశారు. అలాగే, మేడిపల్లిలోని దివ్యనగర్‌లో కూడా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామునే పోలీసులు అక్కడికి చేరుకున్నారు.వివరాల ప్రకారం.. ఘట్కేసర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝళిపిస్తోంది. ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నిర్మించిన నాలుగు కిలోమీటర్ల కాంపౌండ్ వాల్‌ను అధికారులు కూల్చివేశారు. అయితే, నల్లమల్లారెడ్డి విద్యా సంస్థలు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు అనేకమైన ఫిర్యాదులు అందాయి. దీంతో, రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు.. అక్కడ సర్వే చేసి అది ప్రభుత్వ స్థలం అని నిర్ధారించారు. ఈ క్రమంలోనే గోడ కూల్చివేతలను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజామునే అక్కడికి భారీగా పోలీసులు చేరుకున్నారు.అలాగే, రంగారెడ్డి జిల్లా పోచారం మున్సిపాలిటీలో కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. పలు కాలనీలకు, నివాస ప్రాంతాలకు వెళ్లేందుకు అవకాశం లేకుండా నిర్మించిన దివ్యనగర్ లే అవుట్ చుట్టూ ఉన్న ప్రహరీ గోడను అధికారులు తొలగిస్తున్నారు. పోచారం మున్సిపాలిటీలో ఉన్న దివ్య లే అవుట్ మొత్తం విస్తీర్ణం 200 ఎకరాల వరకూ ఉంటుంది. ఇందులో మొత్తం 2218 ప్లాట్లు వేశారు. ఈ ప్లాట్లలో 30 శాతం నల్ల మల్లారెడ్డివేనంటూ ఆరోపణలు ఉన్నాయి.ఇక, దివ్యనగర్ లే అవుట్ చుట్టూ ఉన్న ప్రహరీ కూల్చివేతతో మార్గం సుగమం అయిన కాలనీలు.. ఏకశిలా లే ఔట్, వెంకటాద్రి టౌన్షిప్, సుప్రభాత్ వెంచర్ -1 , మహేశ్వరి కాలనీ, కచ్చవాణి సింగారం, ఏకశిలా - పీర్జాదిగూడ రోడ్డు, బాలాజీనగర్, సుప్రభాత్ వెంచర్ -4 , వీజీహెచ్ కాలనీ, ప్రతాప్ సింగారం రోడ్డు, సుప్రభాత్ వెంచర్ -2, 3, సాయిప్రియ, మేడిపల్లి, పర్వతపురం, చెన్నారెడ్డి కాలనీ, హిల్స్ వ్యూ కాలనీ, ముత్తెల్లిగూడగా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. హైడ్రా ఇప్పటికే పలు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసింది. ఈ సందర్బంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో భవిష్యత్తు తరాలకు మంచి నగరాన్ని అందించాలన్న సమున్నత లక్ష్యంతో హైడ్రా ఏర్పాటు అయ్యిందన్నారు. ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామని చెప్పారు. నిర్మాణ అనుమతితో సంబంధం లేకుండా.. గతేడాది జూలైకి ముందు కట్టిన ఏ ఒక్క ఇంటిని హైడ్రా కూల్చివేయలేదని.. చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూములు, పార్కు స్థలాల్లోని వ్యాపార కేంద్రాలను, నిర్మాణంలో ఉన్న నివాస సముదాయాలను మాత్రమే నేలమట్టం చేసినట్లు తెలిపారు. వీరిలో ప్రముఖులకు సంబంధించిన నిర్మాణాలు కూడా ఉన్నాయి. -
మీరు చేసే పనులు వల్ల ప్రజల్లో తిరగలేకపోతున్నాం: దానం
ఆదర్శ్ నగర్( హైదరాబాద్): నగరంలో ఫుట్‌పాత్ కూల్చివేతలపై(Demolished FootpathDemolish Footpaths) అధికారులు ఏకఫక్షంగా వవ్యహరిస్తున్నారని ఎమ్మెల్యే దానం నాగేదందర్(Danam Nagender) మండిపడ్డారు. పేద ప్రజల జీవనాధారాన్ని అధికారులు ధ్వంసం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఎలాంటి పబ్లిక్ నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.ఆదర్శనగర్ లో ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడిన దానం నాగేందర్.. ‘ అధికారులు(GHMC Officials) చేసే పనుల వల్ల ప్రజల మధ్య మేము తిరగలేకపోతున్నాం. పేదల ఇండ్లను అధికారులు తొలిగించడం సరైంది కాదు.ఓల్డ్ సిటీ లో అక్రమ నిర్మాణాలు వారికి కనిపించడం లేదా?, మొదలు పెడితే అక్కడి నుండే తొలగింపులు చేయాలి. అధికారుల వైఖరి వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోంది.హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వాడిని... హైదరాబాద్ ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఉండలేను. అధికారులు తామే సుప్రీం అనుకుంటున్నారు... అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఆ ప్రభుత్వాలు మనుగడ ఉండదు.ప్రభుత్వ ఆధీనంలో అధికారులు పని చేయాలి. హైడ్రా చెరువులను కాపాడటానికి పని చేస్తుంది , దానిని స్వాగతిస్తున్నాను.మూసి ప్రక్షాళన చేయాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్షతనకు రాజకీయం ఇచ్చింది హైదరాబాద్ కాబట్టి.. తాను ఖైరతాబాద్ నియోజకవర్గానికె పరిమితం కాదు..హైద్రాబాద్ లో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది వచ్చినా దానం అన్నా ముందుంటాడు.గతంలో నేను హైడ్రా విషయంలో మాట్లాడిన ఇప్పుడు ఫుట్‌పాత్ ల విషయంలో మాట్లాడుతున్న అంటే అది ప్రభుత్వానికి చెడ్డపేరు రావొద్దనేదే నా అభిప్రాయంఇటీవల మాదాపూర్ లో ఫుట్పాథ్ పై కుమారి అంటి ని వేదిస్తున్నప్పుడు..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ఆమె జోలికి పోవొద్దని అధికారులకు ఏవిధంగా ఆదేశాలు ఇచ్చారో..ఇప్పుడు ఫుట్పాథ్ ఆక్రమణల కూల్చివేతల్లో కూడా ముఖ్యమంత్రి అదేవిధంగా ఆదేశాలు ఇవ్వాలి’ అని దానం పేర్కొన్నారు.హైడ్రాపై మరోసారి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు -
చెరువుల కబ్జాపై కన్నెర్ర!
సాక్షి, హైదరాబాద్: ఆక్రమణదారుల చెర పడకుండా చెరువులను కాపాడేందుకు కంకణం కట్టుకున్న హైడ్రా (Hydraa) వాటి పరిరక్షణే లక్ష్యంగా దృష్టి సారిస్తోంది. ఇటీవల హైడ్రా బృందం శివారుల్లో పలు ప్రాంతాల్లో పర్యటించి చెరువుల పరిస్థితితోపాటు ప్రభుత్వ భూముల కబ్జాల సంగతి తేల్చేందుకు పర్యవేక్షణలు చేపట్టింది. ఈ సందర్భంగా స్థానికులు, బస్తీవాసులు, ప్రజలు తమ చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయని, భవనాలు, బహుళ అంతస్తులు వెలుస్తున్నాయని వినతులు సమర్పించారు. హైడ్రా కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి (Prajavani) కార్యక్రమంలో కూడా చాలామంది చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై రాత పూర్వక ఫిర్యాదులను అందజేశారు. ఈ మేరకు హైడ్రా రాజధానికి సమీపంలోని చాలా చెరువులు ఆక్రమణకు గురైనట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.ఆక్రమణదారులు మేడ్చల్–మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో సుమారు 200 చెరువులను, చెరువు శిఖం భూములను, బఫర్జోన్లలో పెద్ద ఎత్తున వెంచర్లు వేసి, రూ.వందల కోట్లు ఆర్జించారు. అసలు విషయం తెలియక స్థలాలు కొనుగోలు చేసి ఇళ్లు కట్టుకొన్న సామాన్య, మధ్యతరగతి (Middle Class) ప్రజలు మాత్రం ఆర్థికంగా నష్టపోతున్నారు. వర్షాకాలంలో ఈ కాలనీలు, అపార్ట్మెంట్లు జలాశయాలుగా మారుతున్నాయి. హబ్సిగూడ, రామంతాపూర్ చెరువును ఆనుకొని ఏర్పడిన మూడు కాలనీలు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో మునకేస్తున్నాయి. కూకట్పల్లి, (Kukatpally) కుత్బుల్లాపూర్, ప్రగతినగర్, నిజాంపేట్, గాజుల రామారం, సరూర్‌నగర్, మేడ్చల్, దమ్మాయిగూడ, వెంకటాపూర్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, టోలిచౌకి, గుండ్లపోచంపల్లి, జల్పల్లి, బడంగ్పేట్, నాచారం, ఉప్పల్, చెంగిచర్ల, మల్కాజిగిరి, ఘట్కేసర్, పోచారం తదితర ప్రాంతాల్లో చెరువులు అదృశ్యమై కాలనీలు పుట్టుకొచ్చాయి. ఆక్రమణలో.. మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ‘రా’చెరువు, చింతల చెరువులోని బఫర్ జోన్లను దర్జాగా కబ్జా చేసి, బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు. చెంగిచర్ల బస్సు డిపో సమీపంలో ఉన్న చెరువు కట్టను ధ్వంసం చేసి.. బహుళ అంతస్తుల భవనాలను నిర్మించటం వల్ల సమీపంలోని కాలనీలు జలమ యం కాగా, రోడ్లన్నీ అధ్వాన్నంగా మారాయి. పోచారం పురపాలక సంఘం పరిధిలోని వెంకటాపూర్ నాడెం చెరువు ఆక్రమణకు గురికావటంతో బహుళ అంతస్తులు వెలిశాయి. దమ్మాయిగూడ, నాగారం, (Nagaram) బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్కేసర్ పురపాలక సంఘాల పరిధిలోని చెరువు భూముల్లో కూడా అక్రమంగా భవనాలు వెలిశాయి. రెవెన్యూ, నీటి పారుదల, పురపాలక శాఖల మధ్య సమన్వయం లేకపోవటం వల్లే ఈ కబ్జాల పర్వం మూడు పూవ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుత్బుల్లాపూర్, గాజుల రామారం, కూకట్పల్లి, ఉప్పల్ సర్కిళ్లలో వరదలతో కాలనీలన్నీ జలమయంగా మారినప్పుడల్లా.. చెరువులు, కుంటల ఎఫ్టీఎల్ పరిధితో ఉన్న పలు అక్రమ కట్టడాలను మొక్కబడిగా కూల్చివేస్తున్నారు. వీరి అలసత్వాన్ని అవకాశంగా తీసుకుంటున్న కబ్జారులు కోర్టు కెళ్లుతుండటంతో వాటి జోలికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది.అంతంతే.. శివారుల్లో చెరువులు, కుంటల ఆక్రమణలు ,ప్రభుత్వ భూముల కబ్జాలపై ఫిర్యాదులు చేసినప్పుడు , కథనాలు వచ్చినపుడు లేదా ఉన్నతస్థాయి ఒత్తిళ్లు వచ్చినప్పుడు మాత్రమే ఇరిగేషన్, రెవెన్యూ యంత్రాంగం కదలి తూతూ మాత్రంగా కూల్చివేతలకు శ్రీకారం చుట్టి .. రాజకీయ పెద్దల జోక్యంతో చేతులు దులుపేసుకుంటున్నారు. కొన్ని చోట్ల కూల్చివేతలకు చేపట్టినా కొంత కాలం తర్వాత తిరిగి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. శాఖల మధ్య సమన్వయ లోపం కబ్జాదారులకు అనువుగా మారుతోంది. హైడ్రా ఏర్పడిన తర్వాత కబ్జాదారులు, భూఅక్రమణ దారుల్లో వణుకు మొదలైంది. ఎప్పుడు తమ బండారం బయట పడి అక్రమ కట్టడాలు నేలమట్టమవుతాయోనని బిక్కుబిక్కుమంటున్నారు. చదవండి: చెట్టు చెట్టుకో కథ.. తెలంగాణలోని 9 చారిత్రక వృక్షాలివీ.. -
హైడ్రాపై మరోసారి దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ఈ-కార్ రేస్‌లో కేటీఆర్‌కు తాను క్లీన్చిట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైదరాబాద్‌కు ఇమేజ్ పెరిగిందని మాత్రమే చెప్పానని.. విచారణ జరిగేటప్పుడు కామెంట్ చేయడం సరికాదన్నారు. క్విడ్‌ప్రోకో జరిగిందా లేదా తేల్చాలి. హైడ్రా వల్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అయిందని మళ్లీ చెబుతున్నాను. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలి. తాను ఫైటర్‌ను.. ఉప ఎన్నికకు భయపడేది లేదని దానం అన్నారు.‘‘నేను ఏది మాట్లాడినా కూడా సంచలనమే అవుతుంది. మూసీపై కంటి తుడుపు చర్యల్లాగా ఒక్కరోజు మూసీ నిద్ర చేశారని.. వారు నిద్ర చేయడానికి వెళ్లే ముందే ఏసీలు పెట్టించుకుని పడుకున్నారు. వారి ఇళ్లల్లోనే చేసిన జొన్న రొట్టెలు తినకుండా.. కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకుని తిన్నారు. హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉందని ఇక్కడికి కొన్ని సంస్థలు వచ్చి స్థిరపడ్డాయి. హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ కాబట్టి ముంబయికి వెళ్ళే ఇన్వెస్టర్లు ఇక్కడికి వస్తున్నారు.’’ అని దానం నాగేందర్ చెప్పారు.‘‘పదేళ్ల అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర బడ్జెట్ చూస్తే ఖాళీగా ఉంది. అయినా ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందుకెళ్తుంది. రుణమాఫీ, రైతు భరోసా అమలు జరుగుతున్నందున సీఎంకి పాలాభిషేకం చేయాలి’’ అంటూ దానం నాగేందర్ వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: హైదరాబాద్‌లో లక్ష ఇళ్లు @సేల్! -
రంగారెడ్డి జిల్లా మణికొండలో హైడ్రా కూల్చివేతలు
-
మణికొండలో హైడ్రా కూల్చివేతలు
సాక్షి,హైదరాబాద్: మణికొండలో హైడ్రా(hydera) కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. నెక్నాంపూర్లో కూల్చివేతలు చేపట్టనుంది. హైడ్రా కమీషనర్ రంగనాథ్ అదేశాల మేరకు నెక్నాంపూర్ (Neknampur Lake)చెరువులో అక్రమంగా వెలసిన నిర్మాణాలను కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ కూల్చివేతలు కొనసాగనున్నాయి. హైదరాబాద్‌లో ప్రభుత్వ ఆస్తులు, చెరువల పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా అక్రమార్క్ల గుండెల్లో దడ పుట్టిస్తోంది. చెరువులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన కబ్జారాయుళ్ల నుంచి గడిచిన కొన్ని నెలల వ్యవధిలో వందల ఎకరాల్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్రమణ నిర్మాణాల్ని కూల్చివేసింది. తాజాగా, కబ్జా కోరల్లో చిక్కుకున్న నెక్నాంపురా చెరువులో అక్రమ నిర్మాణాల్ని తొలగించనుంది. హైడ్రా పోలీసు స్టేషన్..ఇదిలా ఉండగా.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కోసం ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటైంది. నగరంలోని బుద్ధ భవన్లో బీ–బ్లాక్ కేంద్రంగా కార్యకలాపాలు హైడ్రా ఠాణా కార్యకలాపాలు సాగించనుంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఠాణాకు ఏసీపీ స్థాయి అధికారి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్హెచ్ఓ) ఉండనున్నారు. ఓఆర్ఆర్ లోపలి భాగం, దానికి ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ ఠాణాలో పని చేయడానికి సిబ్బంది, అధికారులను డిప్యూటేషన్ ప్రాతిపదికన తీసుకోనున్నారు. గణతంత్ర వేడుకల్లోగా హైడ్రా ఠాణా కార్యకలాపాలు ప్రారంభించేలా రంగనాథ్ కసరత్తు చేస్తున్నారు. దర్యాప్తులో జాప్యాన్ని నివారించేందుకు.. జలవనరుల్లో కట్టడాలకు అడ్డగోలు అనుమతులను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై ఆయా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయిస్తోంది. సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ)తోపాటు అనేక చోట్ల ఇప్పటికే కేసుల దర్యాప్తు సాగుతోంది. అయితే రోజువారీ కార్యకలాపాల్లో తలమునకలై ఉండే స్థానిక పోలీసులు ఈ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేకపోతుండటంతో దర్యాప్తు ఆలస్యమవుతోంది. ఇది కబ్జాకోరులు, అక్రమార్కులకు వరంగా మారుతుండటంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ (hydra commissioner ranganath) ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందుకు సానుకూలంగా స్పందించిన సర్కారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.పీడీపీపీ కింద కేసులు! జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల్లో అనేకం ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వాటితోపాటు ప్రభుత్వ భూములు, పార్కులు సైతం అన్యాక్రాంతమయ్యాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం (పీడీపీపీ) కింద కేసులు నమోదు చేసే అవకాశాన్ని హైడ్రా పరిశీలిస్తోంది. -
HYD: అయ్యప్ప సొసైటీపై ‘హైడ్రా’ ఫుల్ ఫోకస్.. మరిన్ని కూల్చివేతలు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అక్రమ కట్టడాల కూల్చివేతలే లక్ష్యంగా హైడ్రా దూసుకెళ్తోంది. తాజాగా మాదాపూర్‌లోని ఏడు అంతస్తుల అక్రమ నిర్మాణాన్ని హైడ్రా కూల్చివేసింది. ఇదే సమయంలో అయ్యప్ప సొసైటీలో అక్రమ కట్టడాలపై హైడ్రా దృష్టి సారించింది. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్కడ పర్యటించారు.మాదాపూర్‌లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. అయ్యప్ప సొసైటీలోని అక్రమ కట్టడాల్లో హాస్టల్స్ పుట్టగొడుగుల్లా వెలిశాయి. తాజా పరిస్థితులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యవేక్షించారు. అక్రమ నిర్మాణాల కారణంగా రోడ్లపైనే డ్రైనేజీలు పారుతుండటాన్ని గుర్తించారు. దీంతో, అక్రమ కట్టడాలకు అనుమతిచ్చిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. అధికారులపై చర్యలు తీసుకునేందుకు అనుమతి కోసం ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్టు రంగనాథ్ తెలిపారు.హైడ్రా పోలీసు స్టేషన్..ఇదిలా ఉండగా.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కోసం ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటైంది. నగరంలోని బుద్ధ భవన్లో బీ–బ్లాక్ కేంద్రంగా కార్యకలాపాలు హైడ్రా ఠాణా కార్యకలాపాలు సాగించనుంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఠాణాకు ఏసీపీ స్థాయి అధికారి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్హెచ్ఓ) ఉండనున్నారు. ఓఆర్ఆర్ లోపలి భాగం, దానికి ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ ఠాణాలో పని చేయడానికి సిబ్బంది, అధికారులను డిప్యూటేషన్ ప్రాతిపదికన తీసుకోనున్నారు. గణతంత్ర వేడుకల్లోగా హైడ్రా ఠాణా కార్యకలాపాలు ప్రారంభించేలా రంగనాథ్ కసరత్తు చేస్తున్నారు. దర్యాప్తులో జాప్యాన్ని నివారించేందుకు.. జలవనరుల్లో కట్టడాలకు అడ్డగోలు అనుమతులను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై ఆయా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయిస్తోంది. సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ)తోపాటు అనేక చోట్ల ఇప్పటికే కేసుల దర్యాప్తు సాగుతోంది. అయితే రోజువారీ కార్యకలాపాల్లో తలమునకలై ఉండే స్థానిక పోలీసులు ఈ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేకపోతుండటంతో దర్యాప్తు ఆలస్యమవుతోంది. ఇది కబ్జాకోరులు, అక్రమార్కులకు వరంగా మారుతుండటంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందుకు సానుకూలంగా స్పందించిన సర్కారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.పీడీపీపీ కింద కేసులు! జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల్లో అనేకం ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వాటితోపాటు ప్రభుత్వ భూములు, పార్కులు సైతం అన్యాక్రాంతమయ్యాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం (పీడీపీపీ) కింద కేసులు నమోదు చేసే అవకాశాన్ని హైడ్రా పరిశీలిస్తోంది. -
ఎట్ల బతుకుతున్నరయ్యా ఈ బస్తీలో..
హైదరాబాద్: ‘ఎట్ల బతుకుతున్నరయ్యా ఈ బస్తీలో.. సరిగా నడవడానికి సైతం బాటల్లేవు.. నిలబడే జాగా లేదు.. ఇరుకు సందులు.. మురికి కూపాలు’ అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. మంగళవారం ఆయన జూబ్లీహిల్స్‌లోని గురుబ్రహ్మనగర్ బస్తీలో పర్యటించారు. ఈ సందర్భంగా గుడిసెల మధ్య ఉన్న మురికి కాల్వల మీదుగా.. ఇరుకు సందుల నుంచి బయటకి వస్తూ.. ‘ఇదేం సందయ్యా.. నేనంటే సన్నగా ఉన్నాను కాబట్టి ఇందులో నుంచి రాగలిగాను. అదే కొంచెం దొడ్డుగా ఉన్నోడి పరిస్థితి ఏంది? అసలు ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నారయ్యా’ అంటూ బస్తీవాసుల పరిస్థితిని చూసి ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ‘గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది.. అనే పాట విన్నదే కానీ ఇప్పుడు నాకు ప్రత్యక్షంగా కనిపించింది’ అంటూ ముందుకు సాగారు. -
హైడ్రా ఠాణా ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువుల కబ్జాల నిరోధం, విపత్తుల వేళ సత్వర స్పందన తదితర లక్ష్యాలతో ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) కోసం ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటైంది. నగరంలోని బుద్ధ భవన్లో బీ–బ్లాక్ కేంద్రంగా కార్యకలాపాలు హైడ్రా ఠాణా కార్యకలాపాలు సాగించనుంది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఠాణాకు ఏసీపీ స్థాయి అధికారి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా (ఎస్హెచ్ఓ) ఉండనున్నారు. ఓఆర్ఆర్ లోపలి భాగం, దానికి ఆనుకొని ఉన్న మున్సిపాలిటీలు దీని పరిధిలోకి వస్తాయి. ఈ ఠాణాలో పని చేయడానికి సిబ్బంది, అధికారులను డిççప్యూటేషన్ ప్రాతిపదికన తీసుకోనున్నారు. గణతంత్ర వేడుకల్లోగా హైడ్రా ఠాణా కార్యకలాపాలు ప్రారంభించేలా రంగనాథ్ కసరత్తు చేస్తున్నారు. దర్యాప్తులో జాప్యాన్ని నివారించేందుకు.. జలవనరుల్లో కట్టడాలకు అడ్డగోలు అనుమతులను హైడ్రా తీవ్రంగా పరిగణిస్తోంది. దీనిపై ఆయా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయిస్తోంది. సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ)తోపాటు అనేక చోట్ల ఇప్పటికే కేసుల దర్యాప్తు సాగుతోంది. అయితే రోజువారీ కార్యకలాపాల్లో తలమునకలై ఉండే స్థానిక పోలీసులు ఈ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వలేకపోతుండటంతో దర్యాప్తు ఆలస్యమవుతోంది. ఇది కబ్జాకోరులు, అక్రమార్కులకు వరంగా మారుతుండటంతో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రత్యేక పోలీసు స్టేషన్ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అందుకు సానుకూలంగా స్పందించిన సర్కారు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పీడీపీపీ కింద కేసులు! జీహెచ్ఎంసీ పరిధిలోని చెరువుల్లో అనేకం ప్రస్తుతం కబ్జా కోరల్లో చిక్కుకున్నాయి. వాటితోపాటు ప్రభుత్వ భూములు, పార్కులు సైతం అన్యాక్రాంతమయ్యాయి. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై ప్రజా ఆస్తుల విధ్వంసాల నిరోధక చట్టం (పీడీపీపీ) కింద కేసులు నమోదు చేసే అవకాశాన్ని హైడ్రా పరిశీలిస్తోంది.చెరువులను పూడ్చడమంటే ధ్వంసం చేసినట్లేననే ఉద్దేశంతో ఈ దిశగా యోచిస్తోంది. ఈ చట్టం కింద కేసు నమోదు వల్ల బాధ్యుల నుంచి జరిగిన నష్టాన్ని రికవరీ చేయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. హైడ్రా ఠాణా పరిధి ఇలా... హైడ్రా విస్తరించి ఉన్న 2,053.44 చదరపు కిలోమీటర్లలో ఉండే కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీలు, ప్రత్యేక పాలనా సంస్థలు ప్రత్యేక పరిపాలనా వ్యవస్థలుసికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఐలాలతో సహా 61 పారిశ్రామిక ప్రాంతాలుకార్పొరేషన్లు జీహెచ్ఎంసీ, బడంగ్పేట్, బండ్లగూడ జాగీర్, మీర్పేట్–జిల్లెలగూడ, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్మున్సిపాలిటీలు పెద్ద అంబర్పేట్, ఇబ్రహీంపట్నం, జల్పల్లి, శంషాబాద్, తుర్కయాంజాల్, మణికొండ, నార్సింగి, ఆదిబట్ల, తుక్కుగూడ, బొల్లారం, తెల్లాపూర్, అమీన్పూర్, దమ్మాయిగూడ, నాగారం, ఘట్కేసర్, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్, పోచారం.గ్రామ పంచాయతీలు రామచంద్రాపురం, ఐలాపూర్, కర్ధనూర్, కిష్టారెడ్డిపేట్, ముత్తంగి, పోచారం, సుల్తాన్పూర్, కాచివానిశింగారం, కొర్రెముల్, పీర్జాదిగూడ, ప్రతాపసింగారం, బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్, తారామతిపేట్, చేర్యాల్, గుడుమకుంట, కీసర, రాంపల్లి, తిమ్మాయిపల్లి, యాద్గిర్పల్లి, మన్ఖల్, గౌడవెల్లి, పుద్దూర్, మంచిరేవుల, బొమ్మరాస్పేట్, గోల్కొండ కలాన్, గోల్కొండ కుర్థ్, హమీదుల్లానగర్, జన్వాడ.


