Hyderabad Rains: ఒక్కసారిగా షోరూంలోకి వరద.. తప్పిన ప్రమాదం | Heavy Rain Fall In Hyderabad | Sakshi
Sakshi News home page

Hyderabad Rains: ఒక్కసారిగా షోరూంలోకి వరద.. తప్పిన ప్రమాదం

Jul 19 2025 8:46 AM | Updated on Jul 19 2025 9:10 AM

Heavy Rain Fall In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో నిన్న కురిసిన భారీ వర్షానికి జన జీవనం అస్థవ్యస్థమైంది. పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షంతో రసూల్‌పురలోని పైగా కాలనీ విమాన నగర్‌లో వరద బీభత్సం సృష్టించింది.

ఓ కార్ల షోరూమ్‌లోకి నాలుగు అడుగుల మేర వరద చేరింది. దీంతో అందులో పనిచేస్తున్న సుమారు 30 మంది సిబ్బంది చిక్కుకున్నారు. తమను రక్షించాలని పోలీసు, డీఆర్‌ఎఫ్‌, హైడ్రా అధికారులకు షోరూమ్‌ సిబ్బంది సమాచారం ఇచ్చారు. హైడ్రా బృందం రంగంలోకి దిగి షోరూమ్‌ వెనుక వైపు నుంచి వారిని తరలించారు. బోట్ల ద్వారా వారిని బయటకు తీసుకొచ్చారు.

మరోవైపు.. హైడ్రాపై ప్యాట్నీ కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల హైడ్రా.. ప్యాట్నీ నాలా విస్తరణ పనులు చేపట్టారు. ఈ కారణంగా నాలా గోడ కూల్చడంతో.. తాజాగా కురిసిన వర్షానికి ప్యాట్నీ కాలనీలో వరద నీరు ముంచెత్తింది. నాలా విస్తరణ అసంపూర్తిగా చేయడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు మండిపడుతున్నారు.  

మరోవైపు.. భారీ వర్షం కారణంగా హుండాయ్ కార్ సర్వీసింగ్ సెంటర్‌కు చెందిన 15 కార్లు జల దిగ్బంధం అయ్యాయి. కస్టమర్ సర్వీసింగ్‌ కోసం కార్లను అని ఇస్తే వరదలో ముంచెత్తడం ఏంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైడ్రా చేసిన ఆవేశపూరిత పనులతో ఈ వర్షాకాలం గట్టెకేదేలా అంటూ ప్యాట్నీ కాలనీ వాసుల ఆందోళన చెందుతున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement